చరమోపాయ నిర్ణయం- పరిచయము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

మన సంప్రదాయములో ఆచార్యుని శ్రీచరణములే చరమోపాయముగా చెప్పబడుచున్నది. “చరమ” అనగా అంత్యము లేదా చిట్టచివర అని అర్థం. ఏ “సాధనము” లేక “దారి” చేత మనము పొందవలసినదాన్ని పొందుతామో దానికి “ఉపాయము” అని పేరు. పొందబడే వస్తువుకి “ఉపేయము” అని పేరు. అంటే మన పూర్వాచార్యుల శ్రీసూక్తుల ప్రకారం, “ఉపేయమైన భగవద్సాన్నిధ్యమును పొందుటకు ఆచార్యుడే చరమోపాయము”. అయితే మన సంప్రదాయములో ఉపాయము, ఉపేయము రెండూ ఒకటే. అది ఆచార్యుడే. అంటే, ఆచార్యుని సాన్నిధ్యమే భగవద్సాన్నిధ్యము. భగవంతుని వద్దకు జీవులను చేర్చే ఉపాయమూ ఆచార్యుడే. అందుకనే ఆచార్య కైంకర్యమే ముక్తికి చరమోపాయము అని చెప్పుట అతిశయోక్తి కాదు.భగవద్రామానుజులు-శ్రీపెరుమ్బూదూర్

పెరియవాచ్చాన్ పిళ్ళై “మాణిక్క మాలై” లో ఈ విధంగా చెప్తారు, “వడుగ నంబి శ్రీసూక్తి ప్రకారం,”ఆచార్యపదము చాల ప్రత్యేకమైన స్థానము. కేవలము భగవద్రామానుజులవారికే ఆ ఆచార్యస్థానమును అలంకరించే అధికారము కలదు!”. పెరియవాచ్చాన్ పిళ్ళై తిరుక్కుమారులైన ( దత్తతగొన్న పుత్రులు) నాయనారాచ్చాన్ పిళ్ళై గొప్ప సమ్ప్రదాయస్థులు. ఉభయవేదాంత పండితులు. వీరు “చతుశ్శ్లోకి “కి అద్భుతమైన వ్యాఖ్యానం అనుగ్రహించినారు. వీరు రచించిన “చరమోపాయ నిర్ణయం ” అనెడి ఈ గ్రంథం ద్వారా భగవద్రామానుజుల యొక్క ఆచార్యఅధికారకత్వమును, శ్రియఃపతి మరియు పూర్వాచార్యుల శ్రీసూక్తుల ఆధారంగా నిరూపించినారు. పెరియవాచ్చాన్ పిళ్ళై -తిరుచేంగనూర్

పిళ్ళైలోకాచార్యుల “శ్రీవచనభూషనము” గ్రంథము యొక్క ప్రారంభసూత్రము, “వేదార్థం అఱుదియిడువదు స్మృతి ఇతిహాస పురాణంగళాలే”. అంటే, “వేదార్థముల యొక్క సారము స్మృతి ఇతిహాస పురాణముల ద్వారా మాత్రమే అవగతమవుతుంది.” అదే గ్రంథములో 447వ సూత్రము,”ఆచార్య అభిమానమే ఉత్తారకము”. అంటే,”ఆచార్యుని పట్ల ఉండెడి అభిమానమే శిష్యునికి ఉత్తారకము.” ఈ సూత్రములను సమన్వయిస్తే మనకు తెలిసే విషయం,”ఆచార్యాభిమానమే శిష్యునికి చరమోపాయము. ఈ నిజమును నిరూపించుటే వేదార్థముల యొక్క ఉద్దేశ్యము”.శ్రీ పిళ్ళైలోకాచార్యులు,శ్రీ మణవాళ మహామునులు- శ్రీపెరుమ్బూదూర్ 

నమ్బెరుమాళ్ ప్రతిపాదించినట్టుగా శ్రీవైష్ణవ సంప్రదాయమును “ఎమ్బెరుమానార్ దరిశనమ్” (భగవద్రామానుజ దర్శనం) అని మణవాళ మహామునులు గుర్తించారు.
” ఎమ్బెరుమానార్ దరిశనమ్ ఎన్ఱె ఇదర్కు
నమ్బెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్
అమ్బువియోర్ ఇంద దరిశనత్తై  ఎమ్బెరుమానార్ వళర్త
అన్ద చ్చెయల్ అఱిగైక్కా ”

సామాన్య అనువాదము – సనాతనమైన శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రతిష్ట చేసిన భగవద్రామానుజుల (ఎమ్బెరుమానార్) ప్రాశస్త్యమును బయలుపరుచుటకు శ్రియఃపతి అయిన నమ్బెరుమాళే స్వయంగా, “ఈ సంప్రదాయం ఎమ్బెరుమానార్ దర్శనం అని విఖ్యాతినొందు గాక !” అని ప్రతిపాదించారు.
సంసారసాగరంలో పడి అలమటిస్తున్న జీవుల పట్ల నిర్హేతుక కృప కలిగి భగవద్రామానుజులు రహస్యత్రయములోని నిగూఢ రహస్యములను తెలుసుకోవలెనని ఆశ కలిగిన వారికందరికీ ఉపదేశించినారు.

శ్రీశైలేశుల (తిరువాయ్ మొళిప్పిళ్ళై) శిష్యులైన మణవాళ మహామునులు తన “ఉపదేశ రత్నమాల” ప్రబంధములోని మొదటి పాశురములో చెప్తారు, “శిష్యుడు భగవద్విషయమును ఆచార్యముఖతః తెలుసుకొనవలెను “. అదే ప్రబంధం చివరి పాశురంలో చెప్తారు, “ఆచార్యుని వద్ద పొందిన శ్రీసూక్తులని ధ్యానమందుంచి ఆచారణలో (అనుష్టానం) పెట్టిన శిష్యుణ్ణి భగవద్రామానుజులు తమ అనుగ్రహదృష్టి చేత కరుణించి పరమపదములో శ్రియఃపతి శ్రీచరణాల వద్దకు చేరవేస్తారు”.
అటువంటి పరమకృపాకటాక్షపూర్ణులైన భగవద్రామానుజుల యొక్క వైభవమును నాయనారాచ్చాన్ పిళ్ళై ఈ “చరమోపాయ నిర్ణయం” అనే గ్రంధంలో అద్భుతంగా విశదపరచినారు.

ఇటువంటి మహోత్కృష్ట గ్రంథమును అస్మదాచార్య కృప చేత, శ్రీమత్ పరమహంస పరివ్రాజకేత్యాది పట్టర్పిరాన్ రామానుజ జీయర్ (29వ పట్టము, వానాచాలము(వానమామలై)) వారి పాదారవిందముల వద్ద సభాక్తిపూర్వకముగా సమర్పిస్తూ ఈ అనువాదము ప్రారమ్భించడమయినది.

ఈ గ్రంధము మూలము “మణిప్రవాళ ” (తమిళము, సంస్కృతము కలిసి) లో రచించబడినది. దీనిని ఉ.వే. శ్రీమాన్ తోటాద్రి సారథి స్వామి ఆంగ్లములోకి అనువదించినారు. వీరు ఇదివరకు ఈ గ్రంధమును ఉ.వే. శ్రీమాన్ ఇళయవిల్లి భూవరాహాచార్య స్వామివారి వద్ద కాలక్షేపము సేవించి ఉన్నారు. భగవద్రామానుజ ఆచార్యఅధికారకత్వమును నిరూపించుటకు ఇంతకన్నా గొప్ప గ్రంథము మన సంప్రదాయవాఙ్మయములో లేదంటారు పెద్దలు.  నాయనారాచ్చాన్ పిళ్ళై ఈ గ్రంథము ద్వారా “భగవద్రామానుజులే జగద్గురువులు ” అని మెట్టు మెట్టుగా నిరూపిస్తూ సిద్దాన్తీకరించినారు. ఆ దివ్యపథములో మనమూ పయనించి ఆచార్యతిరువడిని చేరదాం రండి!

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-introduction.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు)– http://srivaishnavagranthams.wordpress.com
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

2 thoughts on “చరమోపాయ నిర్ణయం- పరిచయము

  1. Pingback: 2015 – July – Week 4 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc

  2. Pingback: చరమోపాయ నిర్ణయం – వేడుకోలు (ప్రార్థన) | srIvaishNava granthams – Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s