శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక- పంచసంస్కారములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఉపోద్ఘాతం

శ్రీరామానుజుల వారికి పెరియనంబిగారు పంచసంస్కారములను అనుగ్రహించుట

 శ్రీవైష్ణవుడిగా ఎలా అవ్వాలి? 

పూర్వాచార్యులననుసరించి శ్రీవైష్ణవుడవ్వాలంటే ఒక విధానం ఉన్నది. ఆ విధానమునే “పంచసంస్కారము” అని అంటారు. (సంప్రదాయమున ఒక దీక్ష).సంస్కారమనగా శుద్ధిక్రియ. అనర్హతయోగ్యున్ని అర్హతాయోగ్యునిగా చేయు ఒక విధానం. ఇది శ్రీవైష్ణవుడగుటకు ప్రథమ సోపానం. బ్రాహ్మణజాతిలో జన్మించిన వారు ఎలాగైతే బ్రహ్మయాగ్య అనే విధానంద్వారా బ్రాహ్మణత్వం పొందుతారో అలాగే శ్రీవైష్ణవకుటుంబములో జన్మించినవారు పంచసంస్కారము ద్వారా శ్రీవైష్ణవత్వమును పొందుతారు. కాని ఇక్కడ వాడు బ్రాహ్మణుడైతే బ్రాహ్మణత్వం పొందుటకు అర్హుడవతాడు కారణం అది శరీరానికి సంబంధించినది,  కాని శ్రీవైష్ణవుడు అవడానికి వాడు బ్రాహ్మణుడు కానవసరం లేదు. ఇది ఆత్మకు సంబంధించిన ఒక వైష్ణవత్వ విధానం. ఈ క్రియ జాతి,మత,కుల,లింగ, ఉన్నవాడు, లేనివాడు అనే భేధములేకుండా అందరికి చెందిన విధానం. ఎవరికి మోక్షం పై అభిలాష ఉందో వారందరు అనుసరించవలసిన విధానం.

శ్రీవైష్ణవత్వం పొందిన పిదప దేవతాంతరములను(భగవానుని ఆఙ్ఞను అనుసరిస్తు ఈ జగత్తులో కొన్ని కార్యములను చేయువారు ఉదా- బ్రహ్మ,శివ,దుర్గ, సుబ్రమణ్య,ఇంద్ర, వరుణాది పాక్షికదేవతలు- వీరందరికి కూడ భగవానుడే అంతర్యామిగా ఉండి ఈ జగత్తులో కొన్ని కార్యములు చేయుస్తాడు)    ఆరాధించుట పూర్తిగా నిషిద్ధం.

 పంచసంస్కారం

శాస్త్రము విధించినటుల పంచసంస్కారములు లేదా సమాశ్రయణములు  పొందినవారు  శ్రీవైష్ణవునిగా పరిగణింపబడతారు.ఈ క్రింది శ్లోకం పంచసంస్కారము గురించి వివరిస్తుంది , “తాపః పుండ్రః తధా నామః మంత్రో యాగశ్చ పంచమః” . ఈ ఐదు క్రియలు పంచసంస్కారసమయమున జరుపబడతాయి.

 • తాప(అగ్నిసంస్కారం) శంఖచక్రలాంఛనం- వేడిగావించబడిన  శంఖచక్రలాంఛనములను భుజములపై ముద్రించుట. దీనివలన మనం భగవానుని సొత్తుగా పరిగణింపబడతాము. ఎలాగైతే ఒకపాత్రపై యజమానికి సంబంధించిన చిహ్నమును గుర్తుగా వేస్తామో అలా  భగవానునికి చెందిన ఈ శంఖచక్రలాంఛనములు మనం ధరించి అతని వస్తువుగా మారుతాము
 • పుండ్ర(స్వరూపం)– ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారణ- దేహములో పన్నెండు స్థలములయందు తిరుమణ్ శ్రీచూర్ణములతో ఊర్ధ్వపుండ్రములను ధరించుట.
 • నామ(పేరు)-దాస్యనామం– ఒక దాస్యనామం ఆచార్యునిచే అనుగ్రహింపబడును (రామానుజదాస, మధురకవిదాస, శ్రీవైష్ణవదాస మొదలైనవి)
 • మంత్ర- మంత్రోపదేశం– ఆచార్యుని నుండి రహస్యముగా మంత్రములను ఉపదేశం పొందుట. మంత్రం అనగా మననం చేయువాడిని రక్షించేది అని అర్థం- తిరుమంత్రం,ద్వయమంత్రం,చరమశ్లోకములు ఈ సంసారవిముక్తిని గావించునవి.
 • యాగ-దేవపూజ గృహమున భగవానుని ఆరాధించు విధానమును నేర్చుకొనుట.

పూర్వ అర్హతలు

భగవానుని ఆధీనంలోకి రావడానికి ఆకించన్యం (తనకు తాను అనర్హునిగా/అయోగ్యునిగా భావించుట)మరియు అనన్యగతిత్వం-(వేరే దారి లేదిక)అనే రెండు అర్హతలు ఉండాలి. ఉజ్జీవించుటకు కేవలం భగవానుడే గతి అని నమ్మి,అతడు తప్ప  వేరొక మార్గం లేదని నిశ్చయంగా భావించడం.

పంచసంస్కార లక్ష్యం 

తత్త్వ ఙ్ఞానాన్ మోక్షలాభః ” అని  శాస్త్రవచనం – బ్రహ్మఙ్ఞానం పొందుట వలన మొక్షము లభించును. ఆచార్యుని ద్వారా మంత్రోపదేశం పొందు  ప్రక్రియలో భాగంగా  పొందిన అర్థపంచకఙ్ఞానం వలన నిత్యవిభూతి యందు శ్రియపతిః కి  కైంకర్యం చేయుట  అను లక్ష్యమును సాధించుటకు అర్హులవమతాము. భగవానునికి అన్నివిధాలా లొంగిఉండడమే నిజమైన ఙ్ఞానం.  గృహతిరువారాధన మరియు దివ్యదేశ సందర్శనం చేయాలి. అర్చావతార భగవానునికి  కైంకర్యం, ఆచార్య మరియు శ్రీవైష్ణవ కైంకర్యములు నిరంతరం చేయుచుండాలి. 

 • ఈ సంస్కారములను అందరికి తెలియపరచి వారందరిని ఆధ్యాత్మికమార్గమున నడిపించాలి. శ్రీరామానుజులు అనుగ్రహించిన నిబంధనలలో మొదటిది-  శ్రీభాష్యంం మరియు తిరువాయ్ మొళిని అభ్యసించి దానిని ఆర్తికలవారందరికి ఉపదేశించాలి. ప్రధానంగా ఆచార్యుడు జీవాత్మ పరమాత్మల మేలన నిర్వాహకుడు. శ్రీరామానుజులు మరియు పూర్వులందరు కూడ ఆచార్యనిష్ఠులుగా గోచరిస్తారు. వీరినే ప్రపన్నులందురు, అనగా అన్నివిధములుగా ఆచార్యుని యందు భారముంచుట.

జీవాత్మకు ఈ పంచసంస్కారములు  అవడం  నిజమైన జన్మలభించడం వంటిది. దీనివల్ల జీవాత్మ తన స్వరూపమును గుర్తించి భగవదాధీనుడవడతాడు.ఈ విశిష్ఠసంభంధము భార్య(జీవాత్మ) భర్తలకున్న(పరమాత్మ) పవిత్రబంధమువంటింది.  ఇది దేవతాంతరములను ఆశ్రయించుటను నిరోధించును.

ఇలా ఈ విశేషశ్రీవైష్ణవత్వం వలన జీవుడు  ఈ సాంసారిక బంధములను ఛేదించుకొని పరమపదమును చేరుకొని శ్రియఃపతికి అవిచ్ఛిన్నమైన కైంకర్యమును చేస్తాడు.

పంచసంస్కారములకు అర్హులెవరు? 

శ్రీవైష్ణవసిద్ధాతం ఆళ్వారాచార్యులచే స్థాపనచేయబడింది. శ్రీరామానుజులు శాస్త్రాధ్యయనం చేసి నాథమునులు, ఆళవందార్లు అనుగ్రహించిన ఆదేశాలను  సిద్ధాంతముగా స్థాపన చేశారు.  స్వామి రామానుజులు తమతదనంతరం సంప్రదాయ విస్తరణకై 74సింహాసినాథిపతులను ఏర్పరిచారు. మోక్షేచ్ఛ ఉన్నవారందరికి పంచసంస్కారములను అనుగ్రహించమని వీరిని నియమనం చేశారు. ఇలా వంశపారపర్యంగా వస్తున్న ఆచార్యపురుషులు సమాశ్రయణాన్ని అనుగ్రహిస్తారు. అలాగే మఠములను(మణవాళ మామునులు కూడా ఇలాంటి ఏర్పాటును చేశారు) ఏర్పరిచి వాటిలో జీయర్లను(శ్రీవైష్ణవ సన్యాసి) నియమించి  వారిచే పంచసంస్కారములు అయ్యేలా చేసిరి. వీరి పరంపరకూడా పైవారివలె విధిని నిర్వహించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 పంచసంస్కారం అయ్యే రోజున చేయవలసినవి

 • ప్రాతః కాలముననే మేల్కొనాలి.
 • శ్రీమన్నారాయణున్ని , ఆళ్వార్లను, ఆచార్యులను స్మరించాలి. ఇది మనకు ఙ్ఞానజన్మను ఇచ్చిన రోజు.
 • నిత్యకర్మలను యధావిధిగా చేయాలి(స్నానం, ఊర్ధ్వపుండ్రధారణ,సంధ్యావందనం మొదలైనవి)
 • ఆచార్యుని మఠమును/గృహమును దర్శించాలి. దర్శనానికి వెళ్ళేసమయాన అవకాశాన్నిమరియు వీలును బట్టి పూలను , పండ్లను వస్త్రములను(భవానునికి/ఆచార్యునికి)మరియు సంభావనను తీసుకెళ్ళాలి.
 • సమాశ్రయణమును జరిపించుకోవాలి.
 • ఆచార్యుని శ్రీపాదతీర్థాన్ని గ్రహించాలి.
 • ఆచార్యుడు అనుగ్రహించే సూచనలను శ్రద్ధగా శ్రవణం చేయాలి.
 • వారి గృహమున /మఠమున  అనుగ్రహించే ప్రసాదాన్ని స్వీకరించాలి.
 • ఆచార్యుని సన్నిధానమున ఉండి అవకాశాననుసరించి సంప్రదాయవిషయాలను శ్రద్ధగా నేర్చుకోవాలి.
 • సమాశ్రయణం పొందిన తర్వాత ప్రతిరోజు అనుష్ఠానమునకై ఒక సమయాన్ని కేటాయించుకొని విధిగా నిర్వర్తించాలి. గురుపరంపరకు కృతఙ్ఞత నివేదన చేయాలి. ఇలా ప్రతిదినమును దైవ, ఆచార్య చింతనతో ప్రారంభించాలి.

పంచసంస్కారములు ఆరంభమా లేదా అంత్యమా?

సమాశ్రయణం సాధారణమైనకర్మయని ఇక్కడితో ఇక చాలని చాలామంది అపోహపడుతుంటారు. కాని అది సరైనది కాదు. శ్రీవైష్ణవత్వమునకు ఇదే ఆరంభప్రయాణం. పూర్వాచార్యులు అనుగ్రహించిన విశేషలక్ష్యమగు(శ్రీమహాలక్ష్మితో కూడిన శ్రీమన్నారాయణునికి నిత్యకైంకర్యము చేయుట) -ఆచార్యుని ద్వారా తెలుపబడిన భగవానుని అంగీకరించి అతను తెలిపిన నియమాలను పాటించాలి. ఇదే జీవాత్మ ఉజ్జీవించుటకు సహజ స్వరూపం, దీనిని దైనందిత జీవనంలో ఆచరణలో  పెట్టాలి.

పిళ్ళైలోకాచార్యులు తమ ముముక్షుపడి సూత్రం116లో శ్రీవైష్ణవుని ప్రవర్తనను ఇలా వివరించారు.

 1. .పూర్తిగా ప్రాపంచిక విషయాంతరములను త్యజించాలి.
 2. .శ్రీమన్నారాయణ్ణున్ని మాత్రమే ఆశ్రయించాలి.
 3. శాశ్వత లక్ష్యమును సాఫల్యం చేయుట యందు పూర్తివిశ్వాసముంచాలి.
 4.  ఆ లక్ష్యసాధనకై ధృడమైన కోరికను కలిగి ఉండాలి.
 5.  దివ్యదేశములను సందర్శిస్తు భగవానుని కళ్యాణగుణములను అనుభవిస్తు కైంకర్య అభిలాష కలిగి ఉండాలి.
 6. భాగవతుల వైభవం,గుణములును తెలుసుకొని వారిననుసరించాలి.
 7. నిత్యం తిరుమంత్రం మరియు ద్వయమంత్రములందు స్థిరమైన అభినివేశం కలిగి ఉండాలి.
 8. స్వాచార్యుల యందు విపరీతాభిమానం కలిగి ఉండాలి.
 9.  భగవానుని యందు ఆచార్యుని యందు సదా ఉపకారబుద్ధిని కలిగి ఉండాలి.
 10.  ఙ్ఞానులైన సాత్విక శ్రీవైష్ణవులతో సదా సత్సంగముచేస్తుండాలి.

అధిక వివరాలకు //ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-5.html ను వీక్షించండి.

ఈ విషయమునందు మనమందరం భగవద్రామానుజులకు చాలా ఋణపడి ఉన్నాము. ఈ పంచసంస్కారములను ఒక క్రమంగా  వ్యవస్థీకరించి తర్వాతి తరములకు అందేలా 74సింహాసనాధిపతులను ఏర్పరచి వారిని  దీనిలో నిమగ్నపరిచారు.

ఈ ప్రాపంచిక సుఖములలో నిమగ్నమై నిజమైన కర్తవ్యమును మరచి భగవానునికి మంగాళశాసనం చేయడం కూడ మరచి అఙ్ఞానముతో అల్లాడుచున్న జీవులకు సరైన మార్గమును ఉపదేశించిన వారు భగవద్రామానుజులే. క్రమంగా ఈ విషయములను తెలుకుందాం….

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-pancha-samskaram.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Advertisements

3 thoughts on “శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక- పంచసంస్కారములు

 1. suresh ramanuja dasa

  jai sreemannarayana
  swamy parthi roju udayam snanam chesinataruvata tirumantranni chaduvukovala leka syanatram aena chaduvukovachha ?
  dayachesi vevarenchagalaru

  Reply
  1. sarathyt

   Usually we recite thirumanthram after bath and applying thirumaN/SrIchUrNam. Subsequently, we recite both guru paramparai manthram (asmath gurubhyO nama: …) and dhvaya mahAmanthram whenever possible.
   adiyen sarathy ramanuja dasan

   Reply
 2. Pingback: శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఆచార్య – శిష్య సంబంధం | SrIvaishNava granthams – Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s