శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – పాఠక మార్గనిర్దేశిక

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

 శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శినిpramanam-sastram

పాఠకుల నిర్ధేశిని/పదకోశం

శ్రీవైష్ణవ ప్రాథమిక పరిభాష

 • ఆచార్యుడు,గురువు- ఆధ్యాత్మికతను అదించువాడు- సాధారణంగా తిరుమంత్రమును ఉపదేశించువారు.
 • శిష్య- శిష్యుడు /అంతేవాసి
 • భగవంతుడు- శ్రీమన్నారాయణుడు
 • అర్చామూర్తి- దేవాలయందు, మఠములయందు, గృహములయందు ఆరాధించబడు దయారూపిఅయిన భగనవానుని విగ్రహములు.
 • ఎంపెరుమాన్,పెరుమాళ్,ఈశ్వరుడు- భగవానుడు
 • ఎంపెరుమానార్ – భగవానుని కన్నా అతి కరుణామయులు –శ్రీరామానుజులు
 • పిరాన్- ఉపకారకుడు
 • పిరాట్టి,తాయార్- శ్రీమహాలక్ష్మి
 • మూలవర్లు- ఆలయం లోపల పవిత్రంగా ప్రతిష్ఠించబడిన భగవానుని అచల(కదలని) రూపం.
 • ఉత్సవర్లు-  తిరువీథులలో ఊరేగించుటకు ప్రతిష్ఠ చేయబడిన చలరూపి భవగానుడు.
 • ఆళ్వార్లు- – – భాగవానుని సంపూర్ణ కృపకు పాత్రులై ద్వాపరయుగాంతము నుండి కలియుగారంభము వరకు  దక్షిణభారతమున నివసించిన వైష్ణవ సన్యాసులు. మరియు భగవద్భక్తిలో మునిగి తేలినవారు.
 • పూర్వాచార్యులు- శ్రీవైష్ణవ సాంప్రదాయమున శ్రీమన్నారాయణుని నుండి పరంపరగా వస్తున్న ఆధ్యాత్మిక చక్రవర్తులు.
 • భాగవతులి,శ్రీవైష్ణవులు- భగవానునకు దాస్యము చేయువారు.
 • అరైయర్లు- భగవానుని ముందు దివ్యప్రభందములను రాగతాళ యుక్తముగా గానముచేయు శ్రీవైష్ణవులు.
 • ఓరాణ్ వళి ఆచార్యులు- పెరియపెరుమాళ్   నుండి  మణవాళమామునుల వరకు వేంచేసి ఉన్న ఆచార్య సమూహం.
 • దివ్యప్రబంధం – అరుళిచ్చెయళ్ గా వ్యవహరింపబడు ఆళ్వారులు అనుగ్రహించిన పాశురములు.
 • దివ్యదంపతులు- శ్రీమన్నారాయణుడు మరియు శ్రీమహాలక్ష్మి
 • దివ్యదేశములు- ఆళ్వారులచే కీర్తిపబడిన భగవానుడు వేంచేసి ఉన్న క్షేత్రములు/స్థలములు.
 • దివ్యసూక్తులు,శ్రీసూక్తులు- భాగవానుని /ఆళ్వారాచార్యుల వచనములు.
 • అభిమాన స్థలములు- పూర్వాచార్యులకు అభీష్ఠమైన భగవానుడు వెలసిన క్షేత్రములు.
 • పాశురము- పద్యము/శ్లోకం
 • పదిగం- దశకం(పది పాశురముల కూర్పు)
 • పత్తు- శతకం(వంద పాశురముల కూర్పు)
 • నిర్ధిష్ఠ / ప్రత్యేక అర్థములు(శ్రీవైష్ణవ పారిభాషిక పదాలు)
 • కోయిళ్- శ్రీరంగం
 • తిరుమల- తిరువేంగడం, తిరుమాళింరుశోలై
 • పెరియ కోయిల్- కాంచీపురం
 • పెరుమాళ్- శ్రీరాముడు
 • ఇళయ పెరుమాళ్- లక్ష్మణుడు
 • పెరియపెరుమాళ్- శ్రీరంగనాథుడు(మూలవర్లు)
 • నంపెరుమాళ్- శ్రీరంగనాథుడు(ఉత్సవర్లు)
 • ఆళ్వార్-నమ్మాళ్వార్ స్వామి- భగవద్రామానుజులు
 • జీయర్, పెరియజీయర్- అళిగియ మణవాళ మామునులు(వరవరమునులు)
 • స్వరూపం- నిజ స్వభావం/ఆకారం(శాస్త్రం నిర్ధేశించిన లక్షణములు కలిగి ఉండుట)
 • రూపం – రూపం/ఆకృతి
 • గుణం- కళ్యాణగుణములు
 • పరత్వం – ఆధిపత్యం
 • సౌలభ్యం- సులువుగా లభించుట/అందుబాటులో ఉండుట
 • సౌశీల్యం – ఔదార్యం / అరమరికలు లేని ఉదారస్వభావం
 • సౌందర్యం- శరీర సుందరత
 • వాత్సల్యం- అమ్మలాంటి సహనం/ఓర్పు/క్షమా
 • మాధుర్యం- మధురమైన రుచి(ఒక గుణం)
 • కృప,కరుణ,దయా,అనుకంపా- అనుగ్రహం,కనికరం.
 • శాస్త్రం- మనను నిర్ధేశించు/మార్గనిర్దేశనం  చేయు ప్రామాణిక గ్రంథములు-   వేదం, వేదాంతం, పాంచారాత్రాగమం, ఇతిహాసములు (శ్రీరామాయణభారతాదులు), పురాణములు (విష్ణుభాగవతగరుడాది) , ఆళ్వారులదివ్యప్రబంధములు, పూర్వాచార్యుల కృతులు- స్తోత్రములు(స్తోత్రరత్నాది) వ్యాఖ్యానములు.
 • కర్మ- చర్య,-పాప(దుర్గుణములు)పుణ్యపు(సద్గుణములు) క్రియలు.
 • మోక్షం- భవబంధ విమోచనం/విముక్తి
 • భగవత్కైంకర్యమోక్షం- ఈ భవబంధ విముక్తి జరిగిన పిమ్మట పరమపదమున ఉండు నిత్యకైంకర్యం.
 • కైవల్యం- ఈ భవబంధ విముక్తి జరిగిన పిమ్మట ఉండు ఆనందమయ నిత్యకైంకర్యము.
 • కర్మయోగ,ఙ్ఞానయోగ, భక్తియోగములు- భగవంతున్ని పొందు మార్గములు.
 •  ప్రపత్తి,శరణాగతి- తన భారాన్నంతటిని భగవంతుని పై వేయుట. భవంతున్ని చేరుటకు అతనే మార్గమని నమ్మి ఉండుట.
 • ఆచార్యనిష్ఠులు-  ఆచార్య శ్రీపాదములను మాత్రమే ఆశ్రయించువారు.  వీరినే ప్రపన్నులు అని అందురు.
 • ఆచార్య అభిమానం- ఆచార్యుల కృపకు పాత్రులు అవ్వడం
 • పంచసంస్కారములు(సమాశ్రయణములు)-  శుద్ధీకరణ ప్రక్రియల ద్వారా ఒక వ్యక్తిని భగవానుని కైంకర్యమునందు(ఈ సంసారమునందు మరియు పరమపదమునందు)  నిమగ్నపరచుట. ఆ ప్రక్రియలు..
 • తాప- శంఖచక్రలాంఛనములు-తాపం(వేడి) గావించబడిన శంఖచక్రముద్రలను  మన భుజములయందు ధరింపచేయుట. దీనివలన మనం ఇకపై భగవంతుని సొత్తుగా పరిగణింపబడతాము. ఎలాగైతే ఒక పాత్రపై యజమాని  చిహ్నముచే ముద్రించిన అది వానికి ఎలాచెందునో మనం కూడ ఈ శంఖచక్రముద్రల స్థాపనం వల్ల భగవానునకే చెందిన వారమవుతాము.
 • పుండ్రం(చిహ్నం) – ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారణం- శరీరమున పన్నెండు స్థలములలో ఊర్ధ్వపుండ్ర(తిరుమణి మరియు శ్రీచూర్ణం) ధారణం చేయుట.
 • నామ- దాస్య నామం- ఒక నూతన పేరు ఆచార్యునిచే పొందుట.(రామానుజదాస, మధురకవిదాస, శ్రీవైష్ణవదాస ఇత్యాదులు)
 • మంత్రం- మంత్రోపదేశం- రహస్యమంత్రములను ఆచార్యుని ద్వారా పొందుట. ఇది మననం చేయువారిని దుఃఖముల నుండి రక్షించును.- తిరుమంత్రంద్వయమంత్రం మరియు చరమశ్లోకములనెడి ఈ మంత్రములు సంసార  విముక్తిని కలిగించును. లోతైన విశ్లేషణకై దీనిని చూడండి: http://ponnadi.blogspot.in/2015/12/rahasya-thrayam.html                                                                                                                                     
 • యాగ-దేవపూజ-తిరువారాధన క్రమమును అభ్యసించుట.
 • కైంకర్యం- భగవానునికి, ఆళ్వారులకు, ఆచార్యులకు, భాగవతులకు సేవ చేయుట.
 • తిరువారాధన- భగవంతున్ని ఆరాధించుట(పూజ)
 • తిరువుళ్ళం- ఇష్ఠప్రకారం
 • శేషి- యజమాని
 • శేష- దాసుడు/సేవకుడు
 • శేషత్వం- భగవానునికై దాస్యమునకు  సర్వదా సిద్ధమై ఉండుట. (శ్రీరామునికి సేవచేయు లక్ష్మణుని వలె)
 • పారత్రంత్యం – భగవానునికి పూర్తిగా ఆధీనపడుట. (భరతాళ్వాన్ వలె శ్రీరాముని ఆఙ్ఞకు సర్వదా లోబడి ప్రవర్తించుట  మరియు ఎడబాటును కూడా సమ్మతించుట )
 • స్వాతంత్ర్యం- తన ఇష్ఠానుసారం నడుచుకొనుట.
 • పురుషాకారం-సిఫార్సు, మధ్యవర్తిత్వం/ఉపశమింపచేయడం- ఈ జీవులు తాము చేసిన పాపకర్మ  ఫలితంగా క్షింపబడడానికి అర్హులు కానున్నను పరమదయాస్వరూపిణి అయిన  శ్రీమహాలక్ష్మి తాను భవగవానుని ఒప్పించి ఈ జీవున్ని అతని కృపకు పాత్రున్ని చేయును కావున తాను పురుషాకారిణి.  ఆచార్యులు కూడా ఈ పురుషాకార స్వభావులే. ఈ పురుషాకారం చేయువారికి ముఖ్యంగా మూడు గుణాలు ఉండాలి.
 • కృప- ఈ కర్మానుభవ జీవునిపై దయ.
 • పారత్రంత్యం – సర్వం భాగవానునిపై ఆధారపడి ఉండుట.
 • అనన్యర్హత్వం- భగవానునికే తప్ప ఇతరులకు చెందకుండుట.
 • అనన్య శేషత్వం – భగవానునికి మరియు భాగవతులకు తప్ప ఇతరులకు కైంకర్యం చేయకుండుట.
 • విషయాంతరం – ప్రాపంచిక/ ఐహిక సుఖములు- కైంకర్యము కంటే వేరైనవి/ఇతరములు.
 • దేవతాంతరము- శ్రీమన్నారాయణుడే పరత్వం. ఇతర జీవాత్మలు దేవతాంతరములు( అనగా ఈ జీవాత్మలు భగవానుని ఆఙ్ఞచే ఈ లౌకిక జగత్తులో కొన్ని కార్యములు నెరవేర్చుటకు నియమింపబడతారు. వీరుకూడా కర్మ బద్ధులే).
 • స్వగత స్వీకారం- తమను తాము భాగవానుని/ఆచార్యునిలా భావించడం (నేను అను అహంకారం).
 • పరగతస్వీకారం- భగవానుడు/ఆచార్యుడు తమ ప్రతయ్నం/ప్రార్థన లేకుండానే , అప్రయత్నంముగా మనలను స్వీకరించడం.
 • నిర్హేతుక కృప- ఏ కారణం లేకుండానే చూపే దయ- జీవాత్మ ప్రోద్భలంచేయబడని/పురికొల్పబడని     భగవానుని యొక్క ధృడమైన కృప.
 • సహేతుక కృప- జీవాత్మ స్వప్రయత్నము చేసి పురికొల్పబడిన భగవానుని కృప.
 • నిత్యులు- నిత్యసూరులు- పరమపదమున భగవానునికి కైంకర్యము చేయు వారు(ఎక్కడైనా ఉన్నను). నిత్యులనగా   ఈభౌతిక సంసారబంధం లేశ మాత్రములేని  పవిత్రులు.
 • ముక్తులు- ఒక నాడు ఈ భౌతిక సంసారబద్దులై చివరకు పరమపదమును చేరుకొని పవిత్రులుగా మారి భగవానుని కైంకర్యం చేయువారు.
 • బద్ధులు- ప్రస్తుతం ఈ భౌతిక సంసారమున జీవించువారు. వీరినే సంసారులు అందురు.
 • ముముక్షువులు- మోక్షంకై ప్రయత్నం చేయువారు.
 • ప్రపన్నులు- భగవానుని కైంకర్యమే సర్వమని భావించేవారు. వీరుకూడా ముముక్షువుల వంటివారే.
 • ఆర్తప్రపన్నులు- ఒకసారి కష్ఠభూయిష్ఠమైన ఈ భౌతిక సంసారము నుండి విముక్తిని కోరువారు.
 • దృప్తప్రపన్నులు- భగవానుని కైంకర్యమే సర్వమని భావించినను ఒకానొకసారి ఈలౌకిక ప్రపంచమున భగవానునికి మరియు భాగవతులకు కైంకర్యము చేయజాలక పరమపదములో ఈ కైంకర్యమును అభిలషించువారు.
 • తీర్థం – పవిత్ర జలం
 • శ్రీపాదతీర్థం-  చరణామృతం- ఆచార్యుల పాదప్రక్షాళన జలం.
 • భోగం- భగవానునికి సమర్పించుటకు సిద్ధమైన  పక్వాపక్వములు.
 • ప్రసాదం- శ్రీవైష్ణవులు స్వీకరించు భగవన్నివేదిత పదార్థములు(పక్వాపక్వములు).
 • ఉచ్చిష్టం- ప్రసాదానికి మరోపేరు.(శేషప్రసాదం) కొన్ని సార్లు ఇతరులచే సృశింపబడినది(ఇతరుల అథరములచే తాకబడినది)-సందర్భమును బట్టి అర్థం మారును.
 • పడి-భోగములకు ఉపయోగించు నామాంతరం(తమిళ పదం)
 • సాత్తుప్పడి- చందనం
 • శఠారి, శ్రీ శఠకోపమ్ – శ్రీమన్నారాయణుని పాదపద్మములు. నమ్మాళ్వార్,  శ్రీ శఠకోపముగా పరిగణింపబడతారు. దీనికి కారణం  వీరు భగవానుని శ్రీపాదపద్మముల స్థానీయులు.
 • మథురకవులు- నమ్మాళ్వార్ (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము.
 • శ్రీరామానుజం-ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము.
 • శ్రీరామానుజం- అందరి ఆళ్వారుల (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము
 • ముదలిఆండాన్- శ్రీరామానుజుల (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము
 • పొన్నడియామ్ శఙ్కమలం – మామునుల శ్రీపాదములకు వ్యవహారనామము.
 • సాధారణంగా ప్రధానశిష్యులు శ్రీపాదములుగా వ్యవహరింపబడతారు. ఉదాహరణకు- ఎంబార్ కు – శ్రీపరాశరభట్టర్ శ్రీపాదములు(పాదస్థానీయులు), – శ్రీపరాశరభట్టర్ కు నఙ్జీయర్ శ్రీపాదములు, నఙ్జీయర్ కు నంపిళ్ళై శ్రీపాదములు మొ.
 • విభూతి – సంపద/ఐశ్వర్యము
 • నిత్యవిభూతి – ఆధ్యాత్మిక జగత్తు( పరమపదం/శ్రీవైకుంఠము)
 • లీలావిభూతి- లౌకిక జగత్తు(జీవులు నివాసమగు ఈ సంసారం)
 • అడియేన్ ,దాసుడు – తమను తాము సంభోధించుకొనే సాంప్రదాయక గౌరవవాచకము(నేను కు బదులు)   వినయపూర్వక తాను.
 • దేవరవారు, శ్రీమాన్- ఇతర శ్రీవైష్ణవులను సంభోధించు సాంప్రదాయక గౌరవవాచకము- మీ దయ
 • ఎళుందరళుతల్- వేంచేయడం(సాంప్రదాయక  వచనములు)
 • కణ్ వళరుతళ్ – శయనించడం.
 • నీరాట్టం- స్నానమాడుట.
 • శయనం – నిద్రించడం.
 • శ్రీపాదం- భగవానుని/ఆళ్వారులను/ఆచార్యులను పల్లకిలో మోయుట/మోయువారు.
 •  తిరువడి- శ్రీపాదపద్మములు(హనుమాన్ కు సాంప్రాదాయక సంభోధన)
 • వ్యాఖ్యానం- స్పష్ఠ వివరణ.
 • ఉపన్యాసం – ప్రసంగం
 • కాలక్షేపం- మూలమును చూచి దానిలోని వరుస వాక్యములకు చదివి దానికి  విస్తృత వ్యాఖ్యానమును అనుగ్రహించుట.
 • అష్ఠదిగ్గజములు- శ్రీమణవాళమాహామునులు  శ్రీవైష్ణవ సత్సాంప్రదాయమును నలుదిశలా భావితరాలకు ప్రచారం చేయుటకు ఏర్పరచిన/స్థాపనచేసిన ఎనిమిదిమంది ఆచార్యులు.
 • 74 సింహాసనాధిపతులు –  శ్రీ రామానుజాచార్యులు శ్రీవైష్ణవ సత్సాంప్రదాయమును నలుదిశలా భావితరాలకు ప్రచారం చేయుటకు ఏర్పరచిన/స్థాపనచేసిన డెబ్బైనాలుగు మంది ఆచార్యులు.

వేదాంత/తత్త్వ సంబంధిత పదాలు

 • విశిష్ఠాద్వైతం-   చిత్తు అచిత్తుతో కూడుకొని ఉన్న పరతత్త్వమును(భగవంతున్ని)  తెలుపు సిద్ధాంతం/తత్త్వశాస్త్రం.
 • సిద్ధాంతం – ఒక నియమమును స్థిరీకరించునది.
 • మిథునం-  శ్రీలక్ష్మీనారాయణులు(పెరుమాళ్ మరియు పిరాట్టి)
 • ఏకాయనం- శ్రియః పతిత్వమునునకు.(మహాలక్ష్మికి పతియైన వాడు)  ప్రాథాన్యత ఇవ్వకుండా శ్రీమన్నారాయణుని ఆధిక్యాన్ని అంగీకరించుట.
 • మాయావాదం- ఏక రూపం గల బ్రహ్మమును అంగీకరిస్తు మిగితాదంతా  మిథ్యా(భ్రాంతి- లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భావించడం) అని భావించు ఒక సిద్ధాంతం.
 • ఆస్థికుడు- శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించువాడు.
 • నాస్థికుడు- శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించనివాడు.
 • బాహ్యులు- శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించనివారు
 • కుదృష్ఠులు- శాస్త్రమును తమకు అనుకూలంగా మారుస్తు ప్రమాణముగా అంగీకరించువారు.
 • ఆప్తులు – మన ఉన్నతిని కోరువారు.
 • ప్రమా – ప్రామాణిక ఙ్ఞానం
 • ప్రమేయం – ప్రామాణిక ఙ్ఞానం  లక్ష్యము.
 • ప్రమాత – ప్రామాణిక ఙ్ఞానమును రక్షించువాడు.
 • ప్రమాణం – ప్రామాణిక ఙ్ఞానమును ఆర్జించువాడు.
 • ప్రత్యక్షం- ఇంద్రియ(కన్ను,చెవులు మొ||) గోచరమైనది.
 • అనుమానం- పూర్వపు పరిశీలన ఆధారముగా ఉత్పన్నమైన ఙ్ఞానం.
 • శబ్దం-శాస్త్ర వచనములు/ప్రామాణిక ఆధారం
 • తత్త్వత్రయం- ప్రపన్నులు స్పష్ఠంగా తెలుసుకోదగ్గ  మూడు అస్థిత్వముల. లోతైన విశ్లేషణకు  చూడండి: http://ponnadi.blogspot.in/p/thathva-thrayam.html
 •  చిత్తు అచిత్తు,జీవాత్మ- ఆత్మఙ్ఞానం
 • అచిత్తు,అచేతనం, ప్రకృతి- పదార్థం, జడమైనది.
 • ఈశ్వరుడు భగవాన్ శ్రీమన్నారాయణుడు
 • రహస్యత్రయం- పంచసంస్కార సమయమున ఆచార్యునిచే అనుగ్రహింపబడు మూడు గోప్యమంత్రములు. లోతైన విశ్లేషణకు  చూడండి:  http://ponnadi.blogspot.com/2015/12/rahasya-thrayam.html .
 • తిరుమంత్రం- అష్ఠాక్షరీమహామంత్రం
 • ద్వయమంత్రం- రెండుగా  ఉన్న మహామంత్రములు.
 • చరమశ్లోకం- సర్వథర్మాన్ పరిత్యజ్య– అను గీతాశ్లోకం: సకృదేవ ప్రపన్నాయ – అను రామ చరమశ్లోకం: స్థితే మనసి– అను వరాహ చరమశ్లోకములు. సాధారణంగా  – సర్వథర్మాన్ పరిత్యజ్య– అను గీతాశ్లోకమే చరమశ్లోకముగా రూఢి అయినది.
 • అర్థపంచకం- ఐదు ప్రధాన నియమాలు- పంచసంస్కారములు అనుగ్రహించేటప్పుడు ఆచార్యులు ఉపదేశిస్తారు. లోతైన వివరణ కోసం http://ponnadi.blogspot.com/2015/12/artha-panchakam.html  దర్శించండి
  • జీవాత్మ- లౌకిక(సంసారిక) జీవులు(మానవులు)
  • పరమాత్మ – భగవానుడు
  • ఉపేయం , ప్రాప్యం- పొందవలసిన లక్ష్యం  -చేయవలసిన  కైంకర్యం
  • ఉపాయం- ఆ లక్ష్యాన్ని పొందడానికి మార్గం.
  • విరోధి – ఆ లక్ష్యాన్ని పొందడానికి అడ్డంకులు
 • ఆకారత్రయం – ప్రతి జీవాత్మకు ఉండవలసిన మూడు ముఖ్యమైన స్థితులు/లక్షణములు.
 • అనన్యశేషత్వం- భగవంతుడే రక్షకుడని(పరత్వం) నమ్ముట.
 • అనన్య శరణత్వం- భగవంతుడే ఆశ్రయించతగ్గవాడని నమ్ముట.
 •  అనన్య భోగ్యత్వం- సాధారణ కేవలం భగవంతున్ని మాత్రమే అనుభవించుట” , భగవానుడు మాత్రమే                         అనుభవించ యోగ్యుడు” అని నమ్మిఉండుటయే ప్రథానఉద్దేశ్యం.
 • సామానాధికరణ్యం-ఒకే ఆథారముతో ఒకటి కన్న ఎక్కువ సంఖ్యలో ఉన్న కారకం/గుణం.  ఒకే పరిధిని వివరించు  రెండు అంతకన్నా ఎక్కువ పదాలు.    దీనికి ఉదాహరణగా – మృద్గటం (మట్టి కుండ) . కుండ తయారుకావడానికి – ఆధారం(మూలం) ఆధేయం(రూపం) కావాలి. అవే మట్టి మరియు ఘటత్వం. వేరొక ఉదాహరణ- “శుక్లపటము”(తెల్లని వస్త్రం)దీనికి రెండు విశేషణములు- ఒకటి తెలుపుదనం రెండవది పటత్వం(వస్త్రం అగుట). వీటి మాదిరిగా – బ్రహ్మా/భగవానుడు  సామానాధికరణ్యముగా అన్నిఅస్థిత్వములకు ఆధారం.  సంస్కృతం మరియు వేదాంత ఙ్ఞానమున్న పండితులవద్ద తెలుసుకొనవలసిన లోతైన విశ్లేషణ.
 • వైయాధికరణ్యం-  రెండు అంతకన్నా ఎక్కువ అంశాలతో కూడికొని ఉన్న మూలం. ఉదాహరణకు-  ఒక కుర్చికి భూమి ఆధారం కావచ్చు మరియు పూలకుండికి ఒక బల్ల ఆధారం కావచ్చు. వేరువేరువాటికి (అస్థిత్వాలకు )వేరువేరు ఆథారాలు ఉంటాయి.

 

 • సమిష్ఠి సృష్ఠి-  భగవానుడు ఈ సృష్ఠిని పంచభూతము వరకు నిర్వహించి  జీవాత్మను బ్రహ్మలాగా నియమిస్తాడు. ఈ స్థితిని సమిష్ఠి సృష్ఠి అంటారు.
 • వ్యష్ఠి  సృష్ఠి- భగవానుడు బ్రహ్మను మరియు ఋషులను మొదలైన వారిని  నియమించి (తాను అంతర్యామిగా ఉంటూ) అస్థిత్వాలకు వేరువేరు రూపాలను సృష్ఠిస్తాడు.
 • వ్యష్ఠి సంహారం- భగవానుడు , రుద్రుడు, అగ్నికి  అధికారమిచ్చి(తాను అంతర్యామిగా ఉంటూ) ఈ అస్థిత్వాలను నశింపచేస్తాడు.
 • సమిష్ఠి సంహారం- భగవానుడు తనంతటతానే స్వయంగా పంచభూతములను తనలో కలుపుకొంటాడు

మిగితా వివరాలకు : http://kaarimaaran.com/downloads.html

తెలుగుసేత

అడియేన్ నల్లా శశిధర్  రామానుజదాస

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/readers-guide/

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

1 thought on “శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – పాఠక మార్గనిర్దేశిక

 1. Pingback: శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఉపోద్ఘాతం | SrIvaishNava granthams – Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s