శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
శ్రీమన్నారాయణుడు తన నిర్హేతుక కృపాకటాక్షములచే ఈ సంసారులను ఉజ్జీవింపచేయడానికి సృష్ఠి సమయాన బ్రహ్మకు శాస్త్రములను (వేదాలు) ఉపదేశిస్తాడు. వైదికులకు వేదం అత్యంత ప్రామాణీకరణమైనది. ప్రమాత(ఆచార్యుడు) ప్రమేయమును (భగవానుడు) ప్రమాణం(శాస్త్రం) చేత మాత్రమే నిర్ణయిస్తాడు. ఎలాగైతే తన అఖిల హేయ ప్రత్యనికత్వం ( అన్నిచెడు గుణాలకు వ్యతిరేఖత్వం) మరియు కళ్యాణైకతానత్వం (సమస్త కాళ్యాణ గుణాలకు నిలయం)వంటి గుణాలను వేదం ఈ కళ్యాణ గుణాలను ఇతరమైన వాటి నుండి భేధపరచి కళ్యాణగుణాలను అనుకరిస్తుంది. (ఇతర ప్రమాణముల నుండి భేధపరుస్తుంది)
- అపౌరుషేయత్వం – ఎవరిచేత కూడా సృష్ఠించబడింది కాదు. (ప్రతి సృష్ఠి యొక్క ఆరంభములో భగవానుడు వేదాన్ని బ్రహ్మకు ఉపదేశించును, అది క్రమంగా అలాగే ప్రచారం గావించబడును) కావున ఇంద్రియఙ్ఞానికి సంబంధించిన లోపాలకు తావు లేదు.
- నిత్యం- శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. ఇది కాలాన్ని మరియు భగవానుని సర్వవేదఙ్ఞత్వం గురించి వెల్లడించును.
- స్వత ప్రామాణ్యత్వం- అన్ని వేదాలు స్వయం ప్రపత్తి కలవి అనగా అన్నియు ఒకే విశ్వాసమును తెలుపును.
అపారమైన వేదసంపత్తును, వేదవ్యాసుడు భవిష్యమానవుల పరిమితమైన ఙ్ఞానాన్ని దృష్ఠిలో పెట్టుకొని ఆ వేదములను ఋక్,యజుర్,సామ మరియు అధర్వవేదములుగా విభజించాడు.
వేదం యొక్క సారమే వేదాంతం. భగవానుని క్లిష్ఠతరమైన విషయాలను విశదీకరించు ఉపనిషత్తుల సమ్మేళనమే వేదాంతం. వేదం ఆరాధన ప్రక్రియను తెలుపును. వేదాంతం ఆ ఆరాధనకు యోగ్యుడైన వానిని తెలుపును. అలా చాలా ఉపనిషత్తులున్నప్పటికి కొన్ని మాత్రమే ప్రసిద్ధిగాంచినవి. అవి
- ఐతరేయ
- బృహదారణ్యక
- చాంధోగ్య
- ఈశ
- కేన
- కఠ
- కౌశీతకి
- మహానారాయణ
- మాండూక్య
- ముండక
- ప్రశ్న
- సుభాల
- శ్వేతాశ్వేతర
- తైత్తరీయ
వేదవ్యాసుడు రచించిన ఉపనిషత్తుల సారమును తెలుపు బ్రహ్మసూత్రములు కూడా వేదాంతముగానే పరిగణింపబడును.
వేదం అనంతం. వేదాంతం చాలా సంక్లిష్ఠమైనది, కాని మానవుని ఙ్ఞానం మాత్రము పరమితమైనది(ఇది విపరీతార్థములను మరియు దోషములు చేయుటకు ఆస్కారభూతమైనది) ,కాని మనం ఈ వేద/వేదాంతములను స్మృతి, ఇతిహాసం (రామాయణభారతాదులు) మరియు పురాణాల వల్ల తెలుసుకోవచ్చు.
- స్మృతి అనగా ధర్మశాస్త్రముల సంకలనం/కూర్పు. మను, విష్ణు హారిత, యాఙ్ఞవల్క్యాది మహాఋషులచేత రచించబడినవి.
- ఇతిహాసములనగా శ్రీరామాయణభారతాదులు. శ్రీరామాయణం ‘శరణాగతి’ శాస్త్రంగా మరియు మహాభారతం ‘ పంచమవేదం’ గా పరిగణింపబడుతున్నాయి(నాలుగు వేదాలు-ఋక్,యజుర్,సామ మరియు అధర్వవేదములు).
- 18 పురాణాలున్నవి (బ్రహ్మపురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం మొదలైనవి) మరియు బ్రహ్మచే చెప్పబడిన 18 ఉపపురాణాలు కూడ ఉన్నవి. బ్రహ్మ తనకు సత్త్వగుణం ఉద్భవించినప్పుడు విష్ణుభగవానున్ని , రజోగుణం ఉద్భవించినప్పుడు తనను, తమోగుణం ఉద్భవించినప్పుడు శివుణ్ణి , అగ్నిని కీర్తించాడు.
ఇవన్ని ఉన్నప్పటికి మానవుడు శాస్త్రంద్వారా ఙ్ఞానాన్వేషణ చేసి లక్ష్యసాధన చేయకుండా ప్రాపంచిక విషయాంతరములయందు ఆసక్తిని ప్రదర్శిస్తాడు. వీరిని ఉద్ధరించుటకై భగవానుడు తానే స్వయంగా అవతరించాడు. అయినను ఈ మానవులు అతనిని నిందిస్తు చివరకు అతనితోనే యుద్ధంకూడా చేశారు. భగవానుడు ఒక జీవాత్మచే ఈ జీవులను ఉద్ధరించుటకై నిర్ణయించుకొని (వేటగాడు ఒక జింకను ఎరవేసి ఇంకొక జింకను పట్టుకున్నట్లు) దోషరహిత ఙ్ఞానాన్ని అనుగ్రహించిన కొన్ని జీవాత్మలను అవతరింపచేసినాడు. వారే ఆళ్వార్లుగా( భగవద్భక్తిలో సదా నిమగ్నమై ఉండువారు) కీర్తింపబడుతున్నారు. వారిలో ప్రసిద్ధిగా ప్రపన్నజనకూటస్థులుగా నమ్మాళ్వార్ పరిగణింపబడుతున్నారు. మిగితావారు – పొయ్ ఘైఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశైఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిపొడిఆళ్వార్, తిరుప్పాణాళ్వార్ మరియు తిరుమంగైఆళ్వార్. అలాగే నమ్మాళ్వార్ శిష్యులగు మధురకవిఆళ్వార్ మరియు పెరియాళ్వార్ కూతురగు శ్రీఆండాళ్ కూడ ఆళ్వారులుగానే పరిగణింపబడతారు. ఈ ఆళ్వార్లు భగవానునిచే కృపచేయబడ్డ దివ్యఙ్ఞానముచే అనుభవించిన ఆ ఙ్ఞానమును లోపల ఇమడ్చుకోలేక మంగళాశాసన రూపమున కీర్తిస్తారు భగవానున్ని.
ఈ సంసారబంధముల నుండి జీవాత్మలను భగవానుడు ఉజ్జీవింపగోరి, నాథమునుల నుండి మణవాళ మామునుల వరకు ఆచార్య పరంపరను ఏర్పరిచారు. ఆదిశేషుని అవతారముగా శ్రీభగవద్రామానుజులు ఈ ఆచార్యపరంపరలో మధ్యలో విరాజిల్లుతూ శ్రీవైష్ణవసంప్రదాయాన్ని మరియు విశిష్ఠాద్వైతాన్ని శ్రీపరాశర, వ్యాస, ద్రమిడ, టంక మొదలైన వారిననుసరించి ఏర్పరిచారు. అలాగే వారు 74సింహాసనాథిపతులను శ్రీవైష్ణవసిద్ధాంతాన్ని నిరాంటకంగా ప్రచారంగావించాలని ఏర్పరిచారు. సంప్రదాయానికి వీరుచేసిన విశిష్ఠమైన కృషి మరియు సేవలను పురస్కరించుకొని ఈ సంప్రదాయం ‘శ్రీరామానుజ దర్శనం’ అని ప్రసిద్ధికెక్కినది. మరళా వీరే మణవాళ మామునులుగా పునరవతారంచెంది దివ్యప్రబంధములను వ్యాఖ్యానించి ప్రచారం చేశారు. పెరియకోయిళ్ శ్రీరంగమున పెరియపెరుమాళ్ స్వయంగా శ్రీమణవాళమామునులను తమ ఆచార్యులుగా స్వీకరించి, తనతో ఆచార్యరత్నహారం ప్రారంభమగునట్లుగా చేసిరి. మణవాళ మామునుల తదుపరి ఈ సిద్ధాంతం వారి శిష్యులలో ప్రథానులగు పొన్నడిక్కాళ్ జీయర్ తో ఆరంభమగు అష్ఠదిగ్గజములుగా ప్రసిద్ధిచెందిన ఆచార్యపురుషులచే ప్రచారం చేయబడింది. ఇలా ఎందరో ఆచార్యపురుషులు పూర్వాచార్య కృత ఈ రామానుజదర్శనం ను పరంపరగా ప్రచారం చేశారు.
తెలుగు అనువాదం అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము: http://ponnadi.blogspot.com/2015/12/simple-guide-to-srivaishnavam-introduction.html
పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
chala bagundi a very important way of propagating vaishnavism