శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఆచార్య – శిష్య సంబంధం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  పంచసంస్కారములు

కిందటి సంచికలో మనం పంచసంస్కారముల ప్రాధాన్యతను తెలుసుకున్నాము. దీనిలో  మనం ఆచార్యశిష్యసంబంధ ప్రాముఖ్యతను పరిశీలిద్దాం.ఈ సంబంధమునకు మన సంప్రదాయంలో చాలా వైశిష్ఠత ఉన్నది.  దీని విశేషతను మనం పూర్వాచార్యుల శ్రీసూక్తులలో పరిశీలిద్దాంం.

ఈ శబ్ధమునకు వ్యుత్పత్తి – శాస్త్రములను అభ్యసించి , వాటిని అనుష్ఠానమున ఉంచి, శిష్యులకు ఉపదేశించువాడు, శాస్త్రవచనానుసారం ‘సన్యాసాశ్రమములో ఉన్నను విష్ణు పరతత్త్వమును  అంగీరించకపోయినచో  వాడు చండాలుడే’.

కావున శ్రీమన్నారాయణుని సర్వదా  స్మరించు శ్రీవైష్ణవునికి ఆచార్యుడు అత్యావశ్యకం అని తెలుస్తుంది. పంచసంస్కార సమయాన తిరుమంత్రమును ఉపదేశించు(ద్వయం మరియు చరమశ్లోకం తో కలుపుకొని) ఆచార్యుడు ప్రత్యక్ష(ఉపకారకాచార్యుడు) ఆచార్యుడు అని పూర్వాచార్యులు నిర్ధేశించారు. శిష్యుడనగా శిక్షను పొందువాడని అర్థం. అనగా ఆచార్యుని సమక్షమున ఉద్ధరింపబడువాడు శిష్యుడు.

శ్రీరామానుజులు మరియు కూరత్తాళ్వాన్ (ఆచార్య శిష్యసంబంధమునకు ప్రతీక) – శ్రీకూరం

మన పూర్వాచార్యులు  ఈ ఆచార్య శిష్యసంబంధం గురించి చాలా లోతుగా విశదీకరించారు. ఈ ఆచార్య శిష్య సంబంధం తండ్రితనయునికి ఉన్న సంబంధమువలె విశేషమైనది శాస్త్రపరంగా నిరూపించారు. ఎలాగైతే తనయుడు తండ్రికి దాస్యమును చేస్తాడో ఆమాదిరి శిష్యుడు కూడ ఆచార్యునికి దాస్యము చేయవలెను.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు “తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ్య, ఉపదీక్షన్తి తే ఙ్ఞానం ఙ్ఞానినా తత్త్వదర్శినః” – ఇది ఆచార్యశిష్య లక్షణాలను తెలుపుతుంది. మొదటివాక్యంలో- ‘ఆచార్యున్ని వినయపూర్వకంగా దరిచేరి, సేవలుచేసి మర్యాదపూర్వకంగా ప్రశ్నించాలి’, రెండవ వాక్యములో -‘ఆచార్యుడు నిజమైన పరతత్త్వమును(భగవానుడు) ఉపదేశిస్తాడు’.

 ఆచార్యునికి ఉండవలసిన లక్షణాలు:

 • ఆచార్యుడు సాధారణంగా పిరాట్టి /అమ్మవారు(శ్రీమహాలక్ష్మి) తో పోల్చబడతారు- వీరి ప్రధానపాత్ర భగవానునికి  పురుషాకారం(సిఫారిస్) చేయడం.
 • పిరాట్టి మాదిరి, భగవానునికి పూర్తిగా పరతంత్రుడై ఉండును. కేవలం భగవానున్ని మాత్రమే ఉపాయంగా స్వీకరించును. తన సమస్త వ్యాపారములు అతని ఆనందానుభవమునకే.
 • కృపాపరిపూర్ణులు- శిష్యున్ని ప్రేమగా స్వీకరించి, ఆత్మఙ్ఞానమును  మరియు వైరాగ్యమునందించి భగవత్భాగవత్కైంకర్యమునందు నిమగ్నపరచును.
 • మామునుల శ్రీసూక్తానుసారం, ఆచార్యుడు పూర్తిగా శిష్యుని ఆత్మరక్షణకై పాటుపడాలి.
 • పిళ్ళైలోకాచార్యులు, ‘ఆచార్యుడు తనయందు, శిష్యుని యందు మరియు ఉపేయం యందు అవగాహన కలిగి ఉండాలి’ అని వివరించారు.
  • తాను తనశిష్యునకు ఆచార్యుడనుకాను అని  తన స్వాచార్యులే తన శిష్యునకు ఆచార్యుడని భావించాలి.
  • తన శిష్యుడు కూడ తన శిష్యుడు కాడని ఈ శిష్యుడు తన ఆచార్యునకు శిష్యుడని భావించాలి.
  • తాను తన శిష్యున్ని అన్యదా కాక కేవలం  భగవానునికి మంగళాశాసనము చేయువానిగా తయారు చేశానని భావించాలి.
 • వార్తామాలై  అను గ్రంథము మరియు శిష్ఠాచారం(పెద్దల ఆచరణ)   అను గ్రంథముల అనుసారం – ఆచార్యుడు శిష్యున్ని మర్యాదానుసారంగా ఆదరించాలి- శిష్యుడు శాస్త్రఙ్ఞానుసారం ఆచార్యున్ని తన ఆత్మ సంరక్షణార్థం ఆశ్రయించుచున్నాను అని భావించాలి.
 • పూర్వాచార్యుల అభిప్రాయానుసారం – భగవానుడు కూడా ఆచార్యున్ని అపేక్షిస్తాడు. కావుననే మన ఓరాణ్ వళి గురుపరంపరలో ప్రథమాచార్యునిగా ఉన్నాడు భగవానుడు. తనకు కూడా ఒక ఆచార్యుడు ఉండాలని అభిలషించాడు, కావుననే అళిగియ మణవాళ మామునులను తమ ఆచార్యునిగా స్వీకరించాడు.

శిష్యునికి ఉండవలసిన లక్షణాలు:

 •  పిళ్ళైలోకాచార్యుల వచనానుసారం:
  • శిష్యుడు భగవానుని నుండి  మరియు ఆచార్యుని నుండి తప్ప మిగితా విషయాల యందు (ఐశ్వర్యం  మరియు ఆత్మానుభవం ) వైరాగ్యం కలిగి ఉండాలి.
  •  సర్వకాల సర్వావస్థలయందు శిష్యుడు ఆచార్యకైంకర్యమునకు సిద్ధంగా ఉండాలి.
  •  శిష్యుడు   ప్రాపంచిక విషయాల యందు సదా ఏవగింపు కలిగి ఉండాలి.
  • శిష్యుడు  భగవద్విషయము నందు మరియు ఆచార్యకైంకర్య మందు ఆసక్తి కలిగి ఉండాలి.
  •  భగవద్భాగవత వైభవం అభ్యసించునప్పుడు శిష్యుడు  అసూయ రహితుడై ఉండాలి.
 •  శిష్యుడు తన సంపదంతా ఆచార్యుని కృపగా భావించాలి. తన దేహయాత్రకు కావలసినంత మాత్రమే  అనుభవించాలి.
 • ఆళవందార్  “మాతాపితా యువతయః” అను శ్లోకములో  చెప్పినటుల  ఆచార్యుడే తన సర్వస్వమని భావించాలి శిష్యుడు.
 •  ఆచార్యుని పోషణ అంతా శిష్యునిదే.
 • ఉపదేశరత్నమాల లో మామునులు, “ఈ లోకములో ఆచార్యుడు వేంచేసి ఉన్నంత వరకు క్షణకాలమును కూడ అతనిని వీడకుండా ఉండాలి” అని అనుగ్రహించిరి.
 •  ఆచార్యుడు తనకు ఇచ్చిన ఙ్ఞానమునకు ఉపకారముగా శిష్యుడు సదా ఆచార్యుని వైభవమును కీర్తించాలి.

ఆచార్యుని ఆత్మసంరక్షణ చేయుట శిష్యునికి అనుచితం/తగదు(అనగా శిష్యుడు తన ఆచార్యుని విషయమందు స్వరూప విరుద్ధ కార్యమును చేయరాదు) మరియు ఆచార్యుడు  తన శిష్యుని దేహరక్షణమును చేయరాదు. (అనగా శిష్యుడు తన ఆచార్యుడు తన దేహపోషణ చేస్తాడని భావించడం దోషం)

పిళ్ళైలోకాచార్యుల  వచనానుసారం: శిష్యుడవడం కూడ చాలా దుర్లభమే(శిష్యుని కి ఉండవలసిన లక్షణాలుండుట అతి దుర్లభం).కావుననే భగవానుడు తానే నరునిగా అవతరించి తన ఆచార్యునిగా నారాయణునిగా తానే అవతరించి తిరుమంత్రమును ఉపదేశంపొంది , ఉత్తమ శిష్యుడు ఎలా ఉండాలో అనుష్ఠించి చూపాడు. .

ఈ ఆధారాలను అనుసరించి భిన్నభిన్న ఆచార్యుల వర్గీకరణను తెలుసుకొందాం.

 అనువృత్తి ప్రసన్నాచార్య మరియు కృపామాత్ర ప్రసన్నాచార్యులు 

అనువృత్తి ప్రసన్నాచార్య

భగవద్రామానుజుల కు పూర్వం ఉన్న ఆచార్యులు తాము శిష్యులను ఎన్నుకొనేటప్పుడు వారి సామర్ధ్యమును మరియు అంకితభావమును పరిశీలించి తీసుకొనేవారు.ఆచార్యుని గృహములో నివసించడం ఒక సాంప్రదాయంగా ఉండేది. ఆచార్యునితో సహవాసం చేస్తు అతనికి సపర్యలు చేస్తు ఒక సంవత్సరం కాలం గడపవలసి వచ్చేది.

కృపామాత్ర ప్రసన్నాచార్యులు

ఈ కలియుగమున ఆచార్యులు ఇలా పరీక్షించి  శిష్యులను తీసుకోవడం అను సంప్రదాయం వలన  శిష్యులు ఆచార్యుల  షరతులను అంగీరించలేకపోయేవారు. కృపాసముద్రులగు  భగవద్రామానుజులు దీనిని  గ్రహించి సంప్రదాయ నిబంధనలను కొద్దిగా సడలించి ఎవరికైతే భగవద్విషయమందు ఆర్తి ఉన్నదో వారికి ఙ్ఞానమును అందించాలని నిర్ణయించారు.కావున శిష్యుల  అర్హతలను  ” వీరు అర్హమైన వారు” నుండి “వీరు ఆర్తికలవారు” అనేదానికి  మార్పుచేశారు. అలాగే తమ కరుణాస్వభావం వలన స్వామి కొన్ని నిబంధనలను ఏర్పరచి తమ శిష్యులకు అనుకరింపచేసి కొన్ని వేలమంది శిష్యులను శ్రీవైష్ణవ సిద్ధాంతమునకు తీసుకవచ్చారు. కావున భగవద్రామానుజుల ఆరంభించి వచ్చిన ఆచార్య పరంపరను కృపామాత్ర ప్రసన్నాచార్యులని వ్యవహరిస్తాము మన సంప్రదాయంలో.

దీనిని మామునులు తమ ఉపదేశరత్నమాలై (పాశురం 37) లో ఇలా కీర్తిస్తారు –                                                                ఓరాణ్ వళియాయ్ ఉపదేశిత్తార్ మున్నోర్|                                                                                                                ఏరార్ ఎతిరాశర్ ఇన్నరుళాల్ | పారులగిల్                                                                                                                ఆశైయుడై యోర్కెల్లామ్ ఆరియర్గాళ్ కూఱుమెన్ఱు|                                                                                                      పేశి వరంబఱుత్తార్ పిన్| 

 ఉత్తారకాచార్య మరియు ఉపకారకాచార్య
నాయనారాచ్చాన్ పిళ్ళై తమ “చరమోపాయనిర్ణయం”  అను గ్రంథములో  ఈ ఆచార్యులను ఉదహరిస్తారు. ఈ గ్రంథం భగవద్రామానుజుల వైభవమును అతివైభవముగా కీర్తిస్తుంది.

ఉత్తారకాచార్య

ఉత్తారకాచార్యులనగా సమాశ్రయనములను పొందిన వారికి పరమపదమును లభించేలా చేయు ఆచార్యులు. శ్రీమన్నారాయణుడు, నమ్మాళ్వార్ మరియు భగవద్రామానుజులు ఈ ముగ్గురు మాత్రమే ఉత్తారకాచార్యులు (వాస్తమున యతీంద్రప్రవణులగు మణవాళ మామునులు కూడ  ఉత్తారకాచార్యులుగా “వరవరముని శతకం” లో ఎరుంబిఅప్పాచే నిర్ణయించబడిరి).

 • శ్రీమన్నారాయణుడు ప్రథమాచార్యులు, సర్వఙ్ఞుడు మరియు సర్వశక్తిమంతుడు కావున మోక్షమును సులభంగా అనుగ్రహించగలడు ఎవరికైనను.
పెరియపెరుమాళ్ – శ్రీరంగం
 • నమ్మాళ్వార్ ,  శ్రీమన్నారాయణు నిచే ఎన్నుకోబడి సంసారులను సరిదిద్ది వారికి ఙ్ఞానమును ప్రసాదించి మోక్షమును ప్రసాదించు సామర్థ్యమును కలిగినవారు. దీనిని వారిచే కృపచేయబడ్డ తిరువాయ్ మొళి లో         “పొన్నులగు ఆళీరో, భువని ముళుత్తు ఆళీరో” నుంచి గ్రహించవచ్చు- శ్రీమన్నారాయణు నికి దూతగా పక్షులను పంపుతు, ‘ ఎప్పుడైతే నా మాటలను స్వామికి అందచేస్తారో మీకు లీలావిభూతిని మరియు నిత్యవిభూతిని సంభావనగా అనుగ్రహిస్తాను’.
 • భగవద్రామానుజులు నిత్యవిభూతికి మరియు లీలావిభూతికి నాయకుడిగా   “ఉడయవర్” అను నామధేయంతో  శ్రీరంగనాథునిచే మరియు తిరువేంగడముడయాన్(తిరుమల శ్రీనివాసుడు) చే నిర్ణయించబడ్డారు. కేవలం భగవత్ అనుభవమందే మునగక, లీలావిభూతిలో 120 సంవత్సరములు వేంచేసిఉండి భగవత్కైంకర్యమును చేశారు. ఆలయాలవ్యవస్థను సరిదిద్ది, వేలమంది శిష్యులను కలిగి, 74మంది సింహసనాథిపతులను సంప్రదాయ విస్తరణకై ఏర్పాటుచేశారు.

శ్రీమన్నారాయణుడు శాస్త్రానుసారం ప్రవర్తిస్తు  జీవుల కర్మానుసారం  జీవాత్మలకు మోక్షమును ఇవ్వగలడు లేదా ఈ సంసారమున ఉంచగలడు. నాయనారాచ్చాన్ పిళ్ళై  ఉత్తారకత్వమును భగవద్రామానుజుల యందే ఉన్నదని సిద్ధాంతరీకరిస్తారు.

నమ్మాళ్వార్  ఙ్ఞానమును పొంది పరోపదేశమును చేస్తు పూర్తిగా భగవదనుభవం నందు మునిగి భగవంతుని యందున్న ఆర్తిచే పిన్నవయసులో ఈ సాంసారికలోకమును వీడుతారు.

పరమకృపాళువులైన భగవద్రామానుజుల భగవదనుభం ఉన్న వారందరికి తమ ఆశ్వీరచనమును అనుగ్రహించారు.

నాయనారాచ్చాన్ పిళ్ళై మాత్రం  భగవద్రామానుజు లే  ఉత్తారక సంపూర్ణత్వం కలవారిని ధృడంగా నిర్ణయించారు.

ఉపకారకాచార్య 

వీరు ఉత్తారకాచార్యులను చేర్చు ఆచార్యులు. మన సంప్రదాయములో   భగవద్రామానుజులను అనుసరించుచు  వచ్చు ఆచార్యపరంపరలన్నియు ఉపకారకాచార్యులుగా నిర్ణయించబడ్దారు. మనకు పంచసంస్కారములను అనుగ్రహించు ఆచార్యులు,   తమ గురుపరంపరాధారంగా ఈ జీవాత్మను భగవంతునికి  ఆధీనపరచి ఈ సంసార బాధలనుండి విముక్తిని కలిగించి మోక్షమునిమ్మని భగవద్రామానుజులను  ప్రార్థిస్తారు.

ఉత్తారక మరియు ఉపకారకాచార్యులు ఇరువురు సమాన ఆదరణీయులే కాని భగవద్రామానుజులకు ఒక ప్రత్యేక స్థానమున్నది మన సంప్రదాయమున. మామునులు తమ ఉపదేశరత్నమాలై లో తమ గురుపరంపరను తమస్వాచార్యులైన తిరువాయ్ మొళిపిళ్ళైతో ఆరంభించి భగవద్రామానుజు లతో ముగించి మనకు సరైన పద్ధతిని తెలుపుతారు.

 సమాశ్రయణ ఆచార్య మరియు ఙ్ఞాన ఆచార్య

 •  సమాశ్రయణ ఆచార్య-  మనకు పంచసంస్కారములను అనుగ్రహించు ఆచార్యులు.
 •  ఙ్ఞాన ఆచార్య-   మన అత్మఙ్ఞానమునకు పెంపొందించుటకు గ్రంథకాలక్షేపములను మొదలైన వి అనుగ్రహించువారు. 

సాధారణంగా మనం సమాశ్రయణం అనుగ్రహించిన ఆచార్యునికే కైంకర్యం చేస్తాము, అలాగే ఙ్ఞానాన్ని అనుగ్రహించిన ఆచార్యుడు కూడా వీరితో సమాన ఆదరణీయులే.ఇద్దరు సములే. ప్రతి శ్రీవైష్ణవుడు తమ స్వాచార్యులను విధిగా గౌరవించాలని శ్రీవచనభూషణం పేర్కొంటుంది.

సంగ్రహముగా చెప్పాలంటే  శిష్యుని  సర్వస్వం అంతా ఆచార్యుదే. ఆచార్యుని జీవన యాత్ర కొనసాగించుటకు అతని పోషణ అంతా శిష్యునిదే.శిష్యుడు తన జీవితమంతా ఆచార్యునితో ఎల్లప్పుడు సంబంధబాంధవ్యాలను కొనసాగించాలి.

 ఆచార్య శిష్యుల మధ్య సంభవించిన విశేషమైన సంఘటలను పరిశీలిద్దాం:

 • మణక్కాల్ నంబి సర్వవిధ సేవలను వారి ఆచార్యులకు(ఉయ్యక్కొండార్)  చేసేవారు.
 • శ్రీవైష్ణవసంప్రదాయంలోనికి  ఆళవందార్ ను తీసుకరావడానికి మణక్కాల్ నంబి   ఎంతో శ్రమించారు.
 • భగవద్రామానుజులు  తాము కూరత్తాళ్వానుకు ఆచార్యులైనప్పటికి వారికి అత్యంత గౌరవమును ఇచ్చేవారు.
 • భగవద్రామానుజులు, కూరత్తాళ్వాను విషయమున కలతచెందినప్పుడు, ఆళ్వాన్ ,’స్వామి దాసుడు దేవరవారి వస్తువు,  తాము తమకు ఇష్ఠం వచ్చినట్లుగా వినియోగించుకొనవచ్చును ‘ అని విన్నవించారు.
 • ఎంబార్ వారి ఆచార్యశయ్యపై ముందుగా శయనించేవారు, ఆచార్యతల్పం ఎక్కడం పాపం కదా! అయినప్పటికి ఆచార్యులు సుఖంగా శయనించాలి కదా దానికై  ఎంబార్ తాము ఒకసారి శయనించి ఏదైన కుచ్చుకొనే పదార్థాలు  ఉన్నాయా అని పరిక్షించేవారు. తనకు పాపం అంటినాసరే  ఆచార్యులు సుఖంగా శయనించాలని వారి సదుద్దేశం.
 • భగవద్రామానుజులు  తమను ఆదరించిన మాదిరే  పరాశరభట్టర్ ను ఆదరించమని అనం తాళ్వాన్ కు చెప్పేవారు.
 • పరాశరభట్టర్ మరియు నంజీయర్ మధ్యన విశేషమైన సంప్రదాయ సంభాషణలు జరిగేవి. పిమ్మట నంజీయర్ సర్వం వదిలివేసి సన్యాసాశ్రమమును స్వీకరించారు. అయినను తమ ఆచార్యుల సేవకు ఈ ఆశ్రమం అడ్డువస్తే తమ త్రిదండమును వదిలివేస్తాననేవారు.
 •  నంపిళ్ళై కొన్ని పాశురాలకు భిన్న అభిప్రాయం చెప్పినప్పటికి నంజీయర్ వారిని  ప్రోత్సహించేవారు.
 • పిన్బళిగియ పెరుమాళ్ జీయర్  తమ ఆచార్యులగు  నంపిళ్ళై కావేరిస్నానం చేసి తిరిగివస్తున్నపుడు వారి వీపును దర్శించాలనే  కోరికతో ఈ లీలావిభూతిలో ఉండాలని కోరుకొనేవారు.
 • తిరువాయ్ మొళిపిళ్ళై ని  శ్రీవైష్ణవసంప్రదాయమునకు తీసుకరావాలని కూరుకులోత్తమదాసులు చాలాశ్రమించారు.
 • మణవాళమామునులు, తమ ఆచార్యులైన  తిరువాయ్ మొళిపిళ్ళై  ఆఙ్ఞను తమ లక్ష్యంగా శిరసావహించారు. తమ ఆచార్యుల నుండి శ్రీభాష్యమును విన్నప్పటికి తమ జీవితకాలమంతా అరుళిచ్చెయళ్(ఆళ్వారులు అనుగ్రహించిన ద్రావిడప్రబంధములు) మరియు రహస్య గ్రంథములపైననే దృష్ఠిని కేంద్రీకరించిరి.
 •  శ్రీరంగనాథుడు తమ దేవేరులైన శ్రీదేవి భూదేవితో కలసి ఒక సంవత్సరమంతా  తమ ఉత్సవాలన్నింటిని ఆపివేసుకొని తమ సన్నిధిన శ్రీ మణవాళమామునుల చే ‘ఈడు’ కాలక్షేపమును శ్రవణంచేసి  మామునుల యందు ఆచార్యభావనతో ఆచార్య సంభావనగా తమ శేషపర్యంకమును   మరియు  ప్రతిపారాయణకు  ముందు అనుసంధానం చేయు  “శ్రీశైలేశ దయాపాత్రం” అనే శ్లోకాన్ని విన్నవించారు.
 •   మామునులు తమ ఆసనాన్ని మరియు  పంచసంస్కారములు చేయు తమ శంఖచక్రముద్రలను పొన్నడిక్కాళ్ జీయరు కు ఇచ్చి అప్పాచ్చిఅణ్ణన్ కు పంచసంస్కారములు చేయమని చెప్పారు.

.ఇలా చాలా సంఘటనలు మన సంప్రదాయమున ఉన్నవి. కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తుతించబడ్డాయి. మనసంప్రదాయమంతా ఆచార్యశిష్య సంబంధముతో ముడిపడి ఉన్నది.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-acharya-sishya.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s