శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దివ్యప్రబంధం మరియు దివ్యదేశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  ఆచార్య – గురుపరంపర

paramapadhanathanపరమపదమున శ్రీదేవి (శ్రీమహాలక్ష్మి)భూదేవి , నీళాదేవి  సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో

కిందటి సంచికలో మనం గురుపరంపరప్రభావం గురించి తెలుసుకున్నాము. ఈ సంచికలో దివ్యదేశములు మరియు దివ్యప్రబంధ వైభవమును తెలుసుకుందాము.

శ్రీమన్నారాయణుడు అపరిమితమైన అనంత  కళ్యాణగుణములతో  కూడుకొని ఉన్న సర్వోన్నత  పరతత్త్వం.  తన విశేష నిర్హేతుక కృపాకటాక్షములచే  కొంత మంది జీవాత్మలపై కృపచూపడం వల్ల ఆ జీవాత్మలు ఆళ్వార్లు(శ్రీమన్నారాయణుని గురించి ప్రభోధించిన  వైభవం కలిగిన యోగులు ) అయ్యారు. తాను నిత్యసూరుల(నిత్యాత్మలు)కు , ముక్తుల(ముక్తి చెందిన జీవాత్మలు)కు  కూడా  సర్వతంత్రస్వతంత్రనియామకుడు అయినా, ఎల్లవేళలా ఒక వేదనలో ఉండేవారు.

ఆ ఆవేదన అంతా లౌకిక సంసారమున బంధింప బడిన జీవాత్మలకొరకై, ఎందువలెననగా, పరమాత్మ సమస్త జీవులకు తండ్రిలాంటి వాడు, తన సంతానం ఈ సంసారమున  జరామరణచక్రంలో పరిభ్రమిస్తుంటే చూసి భరించనివాడు. సరే ఇక్కడ ఒక ప్రశ్న  ఉత్పన్నమవుతుంది- సర్వశక్తిమంతుడైన  భగవానునకు వేదన / బాధ ఉంటుందా?  అనుకుంటే, మరి భగవానుడు సత్యకాముడు(అన్నీ కోరికలు తీరినవాడు) మరియు సత్యసంకల్పుడు (తన సంకల్ప మాత్రముచే అన్నింటిని నెరవేర్చుకొను వాడు)  కదా – దీనికి మన పూర్వాచార్యులు ఇలా తెలిపారు- ఈ జీవాత్మల ఉజ్జీవనముకొరకై ఉండు ఆవేదన కూడ అతని కళ్యాణ గుణమే. ఎలాగనగా  సర్వతంత్రస్వాతంత్ర్యము కలిగిన తండ్రి తన సమీపాన ఉన్న  సంతానంతో సంతోషంగా ఉన్నను తన బాధ అంతా తన నుండి దూరంగా ఉండి కష్టపడుతున్న సంతానం పైనే  ఉండును కదా. భగవానుడు కూడ సర్వతంత్రస్వాతంత్ర్యము కలిగినప్పటికి  తన బాధ అంతా  ఈ సంసారంలో అనాదిగా అఙ్ఞానం  మరియు అవిద్య చే ఆవరించబడిన జీవాత్మల దురవస్థ గురించియే.

ఈ జీవాత్మలు ఉజ్జీవించడానికి భగవానుడు ఈ జీవాత్మలకు సృష్ఠి సమయాన దేహాన్ని మరియు ఇంద్రియాలను, శాస్త్రములను అనుగ్రహిస్తాడు.శ్రీరామ శ్రీకృష్ణుడిగా తానే అవతరిస్తాడు.ఇనన్నీఅనుగ్రహించినప్పటికి ఈ జీవుడు భగవానుని యొక్క పరత్వమునంగీకరించక అఙ్ఞానముతో ఉంటాడు. ఒక వేటగాడు ఒక జింక పట్టుకొనుటకు ఇంకొక జింకను ఎలాగైతే ఎరవేస్తాడో ఆమాదిరి ఈ జీవాత్మలనుద్ధరించుటకు వేరొక జీవాత్మలను ఉద్భవింపచేస్తాడు. వారే ఆళ్వార్లుగా పరిగణిస్తాము. ఆళ్వార్లు అనగా భగవంతుని విషయమందు మాత్రమే మునిగినవారని అర్థం. భారతావనిలో దక్షిణ దేశమున  పవిత్రస్థలములయందు ఈ ఆళ్వార్లు అవతరిస్తారని  శ్రీవేదవ్యాసులు శ్రీమద్భాగవతమున  తెలిపినారు.

Azhwars

ఆళ్వార్లు శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తు పాశురాలను(పద్యాలను) కృపచేశారు. ఇవన్నీ కలసి సుమారు 4వేల పాశురాలు, కావున వీటిని నాలాయిర దివ్యప్రబంధముగా పేర్కొంటారు. దివ్య మనగా విశేషమైనది అని ప్రబంధమనగా పద్యముల కృతి (కేవలం భగవానున్ని కీర్తించునవి) అని అర్థవివరణ.  ఆళ్వార్లు  అర్చారూపమున భగవానుడు వేంచేసిఉన్న స్థలములను కీర్తించారు వాటినే దివ్యదేశములుగా పిలుస్తారు. మొత్తం 108 దివ్యదేశములున్నవి.106 దివ్యద్యదేశములు భారతావనిలో వివిధ ప్రదేశములయందు ఉన్నవి(నేపాల్ తో కూడుకొని). క్షీరాబ్ధి(పాలసముద్రం) ఈ లీలావిభూతికి దూరంగా ఎవరు చేరుకోలేని ప్రదేశం.  మోక్షం పొందిన జీవులు చేరుకొను పరమపవిత్రస్థలం పరమపదం. ఈ 106 దివ్యదేశముల యందు శ్రీరంగం ప్రథానమైనది, ఆ తరువాత తిరుమల, కాంచీపురం, ఆళ్వార్ తిరునగరి ,తిరువల్లిక్కేణి మొదలైనవి కొన్ని ముఖ్యదివ్యదేశములు. భగవానుడు ఐదు రూపములందు ఉంటాడు. అవి పరత్వముగా పరమపదమున, వ్యూహరూపమున క్షీరాబ్ధిలో, అంతర్యామిగా జీవుల హృదయములందు, రామకృష్ణాదిగా విభవరూపమున, చివరిదైన రూపముగా అర్చావతారం (విగ్రహరూపం) దివ్యస్థలములందు వేంచేసి ఉంటాడు. ఈ అర్చావతారం సర్వసులభుడిగా అందరికి సదా చేరువలో ఉండే భగవానుని రూపముగా చెప్పబడుతుంది. మన పూర్వాచార్యులందరు దివ్యదేశమున నిత్యనివాసం చేస్తు భగవానునికి, భాగవతులకు కైంకర్యం చేస్తు తమ జీవనాన్ని గడిపారు. పూర్తి వివరణకై   http://koyil.org దర్శించండి.

వేదం/వేదాంతము యొక్క సారం సరళంగా తమిళ దివ్యప్రబంధములో కూర్చబడింది. ఈ దివ్యప్రబంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యం  ఙ్ఞానప్రసారం వలన జీవాత్మలను ఉజ్జీవింప చేయడం.  ఆళ్వారుల  ఈ దివ్యప్రబంధం వేల సంవత్సరముల నుండి ఆచార్యుల ద్వారా నాథమునుల నుండి ప్రారంభించబడి శ్రీరామానుజలు మధ్యముగా కొనసాగుతూ శ్రీమణవాళ మామునుల వరకు  పరంంపరగా వస్తున్నది.    అఙ్ఞానులు ఈ  ఆళ్వారుల పాశురములను సాధారణ తమిళ పద్యములుగా భావిస్తున్నారు కాని ఙ్ఞానాధికులైన ఆచార్యులు ఈ పాశురాలు శ్రీమన్నారాయణుని దివ్యతత్త్వమును (భవబంధ విమోచాకాలు) ప్రభోధిస్తున్నాయని, శ్రీమన్నారాయణునికి మనం చేయవలసిన కైంకర్యం ఈ దివ్యప్రబంధం ద్వారా అవగతమగుచున్నదని విశదపరిచారు. మన పూర్వాచార్యులు  తమ జీవితాన్నంతటిని ఈ ప్రబంధ అభ్యాసమునకై మరియు ఉపదేశించుటకే వెచ్చించారు.

azhwar-madhurakavi-nathamuni

ఆళ్వారుల అనంతరం దివ్యప్రబంధమునకు కొంత కాలం గడ్డుపరిస్థితి ఏర్పడింది.  క్రమంగా నమ్మాళ్వారుల అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరి యందు నాథమునులు బహుశ్రమకోర్చి నాలాయిరదివ్యప్రబంధమును అర్థానుసంధానముగా నమ్మాళ్వార్ కృపతో వారి వద్ద నుండి పొందారు.  ఈ  దివ్యప్రబంధమును నాథమునులు నాలుగు విభాగాలుగా చేశారు. ఇది అందరికి సుపరిచితమే. నాథమునులు ఈ ప్రబంధమును తమ శిష్యులకు నేర్పించి ప్రచారం గావించారు. అలాగే నమ్మాళ్వార్ విషయమున మధురకవిఆళ్వార్ పరమభక్తితో అనుగ్రహించిన కణ్ణినుణ్ శిరుత్తాంబును నాథమునులు వారి గౌరవార్థం నాలాయిరదివ్యప్రబంధమున చేర్చారు.

Ramanuja_Sriperumbudur

ఆదిశేషుల అవతారమైన శ్రీరామానుజులు గురుపరంపర ద్వారా వస్తున్న ఈ విశేషమును యామునాచార్యుల కృపచే  వివిధ ఆచార్యుల ద్వారా అభ్యసించారు. ఆళ్వారుల వైభవమును మరియు వారి కృతులను శ్రీరామానుజులు సమాజంలోని వివిధ స్థాయిలలో ఉన్న ప్రజలందరికి   ప్రచారం గావించి శ్రీవైష్ణవ సంప్రదాయమును ప్రబలపరిచారు. శ్రీరామానుజుల విశేష కృషి ఫలితంగా ఈ సంప్రదాయమునకు ‘శ్రీరామానుజదర్శనం’ అని స్వయంగా శ్రీరంగనాథునిచే స్థాపించబడింది. అలాగే శ్రీరామానుజుల విషయంగా శ్రీతిరువరంగత్తముదనారు అనుగ్రహించిన రామానుజనూత్తందాదిని నాలాయిరదివ్యప్రబంధమున మన పూర్వాచార్యులచే చేర్చబడింది.   ఈ శ్రీరామానుజనూట్ఱ్రందాది ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి చెందినది – ఎలాగైతే బ్రాహ్మణులు గాయత్రిని ప్రతిరోజు పఠిస్తారో అలాగే ప్రతి  ప్రపన్నులు (పంచసంస్కారము పొందినవారు ) ప్రతిరోజు విధిగా దీనిని పఠించాలి.

nampillai-goshti1
 నంపిళ్ళై కాలక్షేపగోష్ఠి

నంపిళ్ళైగారు ఆ కాలమున(శ్రీరామానుజులు,ఎంబార్, భట్టర్ మరియు నంజీయర్ పరంపర తరువాత) గొప్ప ఆచార్యులుగా విరాజిల్లుతుండేవారు. వీరు శ్రీరంగమున నిత్యవాసం చేయుచు  ఆకాలమున శ్రీవైష్ణవసంప్రదాయమునకు అధికారిగా వెలుగొందేవారు. వీరికాలమున శ్రీరంగమున  నాలాయిరదివ్యప్రబంధమునకు అతిప్రాధాన్యం ఇవ్వబడేది.  పెరియపెరుమాళ్-శ్రీరంగనాథుని సన్నిధిన  వీరు  కాలక్షేపమున సదా నిమగ్నమై ఉండేవారు. పెరియపెరుమాళ్ నిలబడి గవాక్షం/కిటికి గుండా వీరి ప్రవచనమును శ్రవణం చేసేవారట. అలాగే నంపిళ్ళై శిష్యులు కూడా దివ్యప్రబంధ అర్థమును ప్రచారం గావించారు. నంపిళ్ళై  ప్రధానశిష్యులు వ్యాఖ్యానచక్రవర్తి (వ్యాఖ్యాతలలో  శ్రేష్ఠులు)అను బిరుదాంకితులైన  పెరియవాచ్చాన్ పిళ్ళై  నాలాయిర దివ్యప్రబంధమునకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి పూర్వాచార్యులచే బహు ప్రశంసించబడ్డారు.   నంపిళ్ళై  మరొక ప్రధానశిష్యులు   వడక్కుతిరువీథిపిళ్ళై, నంపిళ్ళై యొక్క   నాలాయిర దివ్యప్రబంధ ప్రవచనములను గ్రంథస్థపరిచారు. తిరువాయ్ మొళి కి ఉన్నవీరి  వ్యాఖ్యానము ‘ఈడు’ (ఈడు ముపత్తు ఆరాయిరప్పడి) గా ప్రసిద్ధిచెందినది.

pillailokacharya-goshtiపిళ్ళైలోకాచార్యుల కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళై అనంతరం ఈ సత్సాంప్రదాయమున పిళ్ళైలోకాచార్యులు   ఉత్తరాధికారిగా ఉండి  దివ్యప్రబంధ రహస్యార్థములను తమ రహస్యత్రయగ్రంథములో పొందుపరచారు. ఈ రహస్యార్థములు వివిధ ఆచార్యులచే వివిధ గ్రంథములలో వివరింపబడ్డాయి.   పిళ్ళైలోకాచార్యులు ఈ రహస్యార్థాలను తమ అష్ఠాదశ రహస్యగ్రంథములలో పొందుపరిచారు. కాని వారి చరమ దశలో శ్రీరంగం మొఘల్  ఆక్రమణదారులచే బంధింపబడి అన్ని నాశానం చేయబడ్డాయి.  .పిళ్ళైలోకాచార్యులు  ఆక్రమణదారులనుండి తాము  నంపెరుమాళ్ (శ్రీరంగనాథుని ఉత్సవమూర్తి) తో  తప్పించుకున్నారు. కాని ప్రమాదవశాత్తు వారు అటవీ ప్రయాణ క్లిష్ఠములనుండి తప్పించుకోలేక పరమపదమును చేరుకున్నారు. చాలాకాలం ఈ విపత్తును శ్రీరంగప్రజలు అనుభవించారు. కొన్ని దశాబ్ధముల తర్వాత  ఆక్రమణదారులు నిష్క్రమించి ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత నంపెరుమాళ్ శ్రీరంగం తిరిగి చేరుకొన్నారు.

 

srisailesa-thanian-small

ఆ శ్రీరామానుజుల పునరవతారమైన మణవాళ మామునులు  ఆళ్వార్ తిరునగరి లో అవతరించారు. మామునులు ,తిరువాయ్ మొళిపిళ్ళై గారి శిష్యులయి వారి  వద్ద మరియు తమ తండ్రిగారి వద్ద వేద వేదాంతములను మరియు దివ్యప్రబంధములను అధికరించారు. వారి ఆచార్యులైన తిరువాయ్ మొళిపిళ్ళై గారి ఆఙ్ఞ మేరకు శ్రీరంగం చేరి తమ జీవితాన్నంతటిని సత్సాంప్రదాయ అభివృద్ధికి అంకితమిచ్చారు. మామునులు తాము స్వయముగా  లుప్తమైన సాంప్రదాయ సాహిత్యాన్ని వెదకి  దానిని పఠనం చేసి  ముందు తరాలవారికి అందేలా వాటిని తాటాకులపై లిఖింపచేసి భద్రపరిచారు.  సాంప్రదాయ వైభవము కాపాడుటకు మరియు  దానిని విస్తరింపజేయుటకు వీరు చేసిన అవిరళకృషి మరియు అకుంఠితదీక్షను లోకానికి తెలియపరచుటకు,  స్వయంగా శ్రీరంగనాథుడు మామునులను వద్ద తిరువాయ్ మొళి కాలక్షేపాన్ని శ్రవణం చేసి,  కాలక్షేపం చివరి రోజున ఓ చిన్ని బాలుని వలె వచ్చి,   వీరిని ఆచార్యులుగా భావించి అత్యంత  వైభవము గల ‘శ్రీశైలేశ దయాపాత్రం’ అను తనియను శిష్యభావనతో  వారికి  సమర్పించారు. కాలక్రమేణ వివిధ ఆచార్యపురుషవంశముల నుండి పరంపరగా వచ్చిన ఆచార్యులు  దివ్యప్రబంధమును తరువాతి వారికి బోధించసాగారు.

భగవానునుని  ఆవేదనను తీర్చి మరియు జీవాత్మ ఉజ్జీవించడము మాత్రమే అవతారప్రయోజనముగా కల ఆళ్వారుల దివ్యప్రబంధములను మన పూర్వాచార్యులు భద్రపరిచారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. శ్రీవైష్ణవులందరు ఈ నాలాయిరదివ్య ప్రబంధమును అర్థయుక్తంగా నేర్చుకొని దీనితోనే  మన జీవితకాలాన్ని వెళ్ళదీయాలి అని పూర్వాచార్యుల అభిమతం.

ఈ క్రింది వాటిని పరిశీలించిన ఆళ్వారుల మరియు దివ్యప్రబంధము యొక్క వైభవం తెలుసుకొనవచ్చు.

దివ్యప్రబంధము యొక్క అనువాదమును  వివిధ భాషలలో  చదవాలన్నదీనిని దర్శించండి  http://divyaprabandham.koyil.org

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-dhivya-prabandham-dhesam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s