సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిని – తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< రహస్యత్రయం

తత్త్వములు  ప్రథానంగా మూడుగా విభజించబడ్డాయి అవి చిత్తు , అచిత్తు మరియు ఈశ్వరుడు.

నిత్యవిభూతి(పరమపదం) మరియు లీలావిభూతి(సంసారికలోకం) లో అసంఖ్యాకమైన జీవాత్మల సమూహములే  చిత్తు. సహజముగానే జీవాత్మలు ఙ్ఞానముతో నిర్మితమై ఙ్ఞానపరిపూర్ణతను కలిగి ఉంటాయి.

ఈ సహజఙ్ఞానం నిత్యానందమైనది. ఎప్పుడైతే జీవాత్మ సహజఙ్ఞానమును పొందునో అప్పుడు అది నిత్యానందమును పొందును. ఈ జీవాత్మ 3గా విభజించబడింది- నిత్యసూరులు(పరమపదమున అనాదిగా ఉండేవారు), ముక్తాత్మ(ఒకానొకప్పుడు సంసారబంధమును ఉండి ముక్తిని పొందినవారు) మరియు బద్ధాత్మలు(ఈ సంసారిక లోకమున సంసారబంధం కలిగినవారు). మరలా ఈ బద్ధాత్మలు రెండుగా విభజించబడ్డారు- మొదటివారు భుభుక్షువులు(సంసారానుభవమును కోరుకొనేవారు) రెండవవారు ముముక్షువులు(ఈ సంసారబాధలనుండి ముక్తిని కోరుకొనేవారు). తిరిగి ఈ ముముక్షువులు రెండు రకములు- కైవల్యార్థులు (స్వీయఆత్మసాక్షాత్కారం/స్వీయానందమును కోరుకొనేవారు) మరియు  భగవత్కైంకర్యార్థులు  (పరమపదమున భగవానునికి కైంకర్యముచేయాలని కోరుకొనేవారు ).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-chith-who-am-i5631.html . దర్శించండి.

అచిత్తు అనగా  ఈ స్థూలఇంద్రియాలకు గోచరించు వైవిధ్యములు కలిగిన జడవస్తువులు. ప్రళయకాలమున అవ్యక్తముగా(అదృశ్యముగా)ఉండి సృష్ఠిసమయమున వ్యక్తమవుతాయి(దృశ్యముగా). అచిత్తు లీలా మరియు నిత్య విభూతులలో ఉండును. సాధారణముగా ఈ భౌతికజగత్తులో  అచిత్తు స్వరూపఙ్ఞానమును కప్పివేస్తుంది అదే అలౌకికజగత్తులో స్వరూపఙ్ఞానమును ఉత్తేజపరుస్తుంది. మరలా ఈ అచిత్తు మూడు విధములు ఒకటి శుద్ధసత్వం(పరమ సాత్వికమైనది- కేవలం పరమపదముననే అగుపించును)రెండవది మిశ్రసత్వం (తమోరజోగుణమేళనం- ఈ సంసారమున అగుపించును)  మరియు సత్త్వశూన్యం (గుణవిహీనమైనది- అదే కాలం(సమయం)).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-achith-what-is-matter.html . దర్శించండి.

ఈశ్వరుడు: శ్రీమహాలక్ష్మితో కూడి  సర్వశక్తిమంతుడు, పరమపురుషుడైన  శ్రీమన్నారాయణుడు. భగవానుడు అనగా ఆరు కళ్యాణగుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు. అవి ఙ్ఞాన,బల,ఐశ్వర్య,వీర్య,శక్తి మరియు తేజస్సు. ఈ ఆరు కళ్యాణగుణములు తిరిగి అనేక కళ్యాణగుణములుగా విస్తరిస్తాయి. భగవానుడు అన్ని కళ్యాణగుణములకు ఆశ్రయణీయుడు మరియు హేయగుణములకు వ్యతిరిక్తుడు. చిత్తు మరియు అచిత్తులు భగవానునియందు లీనమై ఉంటాయి మరియు వాటికి అతనే ఆధారం- కావున అన్నింటికి ఆధారం మరియు  భరించేవాడు అతనే. అన్నింటికి సర్వాధికారి. చిత్తు అచిత్తులన్ని అతని దివ్యానందమునకై ఉద్భవిస్తున్నాయి.

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-iswara-who-is-god.html . దర్శించండి.

తత్త్వముల మధ్య      సారూప్యతలు:

  • ఈశ్వరుడు మరియు చిత్తు(జీవాత్మ) ఇద్దరు ఙ్ఞానం కలిగిన వారే.
  • చిదచిత్తులు ఈశ్వరుని సొత్తు.
  • ఈశ్వరుడు మరియు అచిత్తులు తమ లక్షణాలను బట్టి చిత్తును పరివర్తనం చెందించే సామర్థ్యం కలవారు. ఉదాహరణకు జీవాత్మ అతిగా  భౌతికకార్యకలాపాలయందే నిమగ్నమైనప్పుడు అతను పదార్థముగా రూపాంతరం చెందుతాడు. ఒకవేళ జీవాత్మ భగవద్విషయములందు నిమగ్నుడైతే అతను ఈ సంసారమునుండి విముక్తిని పొంది భగవానుని వలె  ఆనందరూపాన్ని పొందుతాడు.

తత్త్వముల మధ్య భేధములు:

  • అన్నింటికన్న ఈశ్వరునికి భేధము/ఏకైక లక్షణం సర్వేశ్వరత్వం. అనగా సర్వఙ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు.
  • ఈశ్వరుని యందు దాసత్వం అనే విశిష్ఠ లక్షణం చిత్తు కలిగిఉండును.
  • అచిత్తు ఙ్ఞాన శూన్యమైనది. ఇతరులకై మాత్రమే దీని ఉనికి.

పిళ్ళైలోకాచార్యుల తత్త్వత్రయం అను రహస్య గ్రంథమును ఇక్కడ పరిశీలించవచ్చు. http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html .

ఆళ్వార్ తిరువడిగళే శరణం                                                                                                                     ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం                                                                                                             పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం                                                                                                                     జీయర్ తిరువడిగళే శరణం                                                                                                                               జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/thathva-thrayam-in-short.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

1 thought on “సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిని – తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు

  1. Pingback: Artha Panchakam – acharyadevo

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s