సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అర్థపంచకం – ఐదు ముఖ్యమైన అంశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు

భగవానుడు 6 రూపములలో (తన ఉనికిని)వేంచేసి ఉంటాడు- పరత్వం(పరమపదమున), వ్యూహ(పాలసముద్రమున), విభవ(రామకృష్ణాది అవతారములు), అంతర్యామి(యోగుల హృదయములలో నివసించు), అర్చావతారం (దేవాలయాలు,మఠం,గృహములలో ఉన్న విగ్రహరూపం) మరియు ఆచార్యుని  రూపమున.

మిక్క ఇఱైనిలైయుం మెయ్యాం ఉయిర్ నిలైయుం*                                                                                                     తక్క నెఱియుం తడైయాగిత్తొక్కియలుం*                                                                                                                     ఊళ్ వినైయుం వాళ్ వినైయుం  ఓదుం కురుగైయర్ కోన్ *                                                                                  యాళిన్ ఇశై వేదత్తియల్

– తిరువాయ్ మొళికి  పరాశరభట్టర్ అనుగ్రహించిన తనియ

                   ఆళ్వార్ తిరునగరి నివాసి మరియు అధికారియైన నమ్మాళ్వార్ అనుగ్రహించిన  తిరువాయ్ మొళి అను వీణానాదం అతి ముఖ్యమైన ఐదుఅంశములను చాలా శ్రావ్యంగా పలుకుతుందట. ‌అవి – పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని (పరస్వరూపం)- జీవాత్మ స్వభావం(జీవాత్మ స్వరూపం)- ఉపాయస్వరూపం(జీవాత్మ పొందవలసినది) – విరోధి స్వరూపం (పరమాత్మను పొందుటకు అడ్డంకులు)- ఉపేయస్వరూపం (పరమాత్మను పొందుటకు పరికరం)  .

           అర్థపంచకం అనగా “ఐదు అంశములు” (అత్యంతావశ్యకంగా తెలుకోవలసినవి). పిళ్ళైలోకాచార్యులు తమ రహస్యగ్రంథములలో ఈ ఐదుఅంశములను  “అర్థపంచకం” అను పేరుతో  కృపచేశారు. ఈ గ్రంథమంతా ఈ ఐదుఅంశముల సంకలమే.

ఈ గ్రంథములోని ఈ విషయాలను పరిశీలిద్దాం:

I – జీవాత్మ – ఇది తిరిగి 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.

1) నిత్యసూరులు: పరమపదమున అనాదిగా నివసిస్తున్నవారు. (శ్రీవైకుంఠం-నిత్యం భగవదానందానుభవం చేయు స్థలం)

2) ముక్త్మాత్ములు:  ఆత్మవిమోచనం పొంది పరమపదమును చేరుకున్నవారు( అంటే ఒకానొక జన్మలో సంసారబంధ వాసన కలిగిఉన్నవారు).

3) బద్ధాత్ములు: సంసారబంధముననే అతి అభిలాష కలవారు.

4) కైవల్యులు: మోక్షమును పొందిన ఆత్మలు(సంసారం నుండి విముక్తి పొందిన వారు). కాని ఆత్మాను భవమును కోరుకొనేవారు( అనగా భగవత్ కైంకర్యమునకు అతి దూరులు) భగవదనుభవమున ఆశలేనివారు.

5) ముముక్షువులు: సంసారంలో ఉండి విముక్తినిపొంది భగవానునికి నిత్యకైంకర్యము చేయాలనుకొనేవారు.

II- బ్రహ్మా-  (పరమాత్మ- భగవానుడు) ఐదు రూపములలో భగవానుడు వేంచేసి ఉంటాడు.

1) పరత్వం:  పరమపదమున వేంచేసి ఉండు దివ్యమైనరూపం.

2) వ్యూహం: క్షీరాబ్ధిలో ఉండు అనంతశయనుని రూపాలు. ఇవి సంకర్షణ(సృష్ఠి), ప్రద్యుమ్న(స్థితి) , అనిరుద్ధ(లయ) రూపాలు.

3) విభవ:  శ్రీరామ, శ్రీకృష్ణ వంటి అవతారములు.

4) అంతర్యామి: ఆత్మలోపల నివాసముండువాడు. ఇతను రెండు రూపములచే వేంచేసిఉంటాడు- ఒకటి ఆత్మలోనుండు రూపం, మరొకటి హృదయంలో శ్రీమహాలక్ష్మితో కూడుకొని ఉన్న ప్రకాశించు రూపం.

5) అర్చావతారం: ఆరాధనకు వీలుగా కంటికి కనిపించు రూపం. దేవాలయములు, మఠములు, గృహములలో వేంచేసిఉన్న రూపం.

III – పురుషార్థం: పురుషుని(జీవుని)చేత సాధించ దగినది. ఇది ఐదు విభాగములు

1) ధర్మం:  లోకకళ్యాణార్థం చేయు కార్యములు.

2) అర్థ:  శాస్త్రానుసారం సంపదను ఆర్జించుట.

3) కామ:  ప్రాపంచిక సుఖములు.

4) ఆత్మానుభవం: స్వీయానుభవం

5)భగవత్కైంకర్యం(పరమపురుషార్థం): పరమపదమున భగవానునికి సర్వవిధసేవలు చేయడం. భౌతికశరీరమును వదలి పరమపదమునకు చేరి, దివ్యశరీరమును పొంది, నిత్యసూరులకు ముక్త్మాత్మలకు అర్పింపబడుట.

IV- ఉపాయం: ఇది ఐదు విభాగములు

1) కర్మయోగం: శాస్త్రవిహితమైన  యఙ్ఞం, దానం, తపం మరియు ధ్యానం మొదలైన వాటిని ఆచరించుటచే ఇంద్రియనిగ్రహం పొంది దీనిద్వారా  అష్ఠాంగయోగాదులను అనుష్ఠించి ఆత్మతత్త్వం తెలుసుకొనుట. ఇది ఙ్ఞాన యోగమునకు సహకారిగా ఉండును. ఐహికమైన సంపదలపై నియంత్రణను చేయును.

2) ఙ్ఞానయోగం: కర్మయోగముద్వారా ఆర్జించిన ఙ్ఞానముతో హృదయాంతర్గతుడై మనపైననే తదేక దృష్ఠిసారించిన  భగవానుడైన శ్రీమన్నారాయణున్ని ధ్యానంచేయుట. ఇది భక్తి యోగమునకు దోహదపడి కైవల్యమోక్షమును అందించును.

3) భక్తియోగం: ఙ్ఞానయోగ సహకారంతో స్థిరమైన ధ్యానము ఏర్పడుతుంది, ఇది పరమానందమునకు దారి తీసి పేరుకుపోయిన పాపాలను మరియు దుర్గుణములను తొలగించివేసి  చేరుకోవలసిన లక్ష్యము వైపు  పయణంసాగేలా చేస్తుంది.

4)ప్రపత్తి: భగవానున్ని శరణుజొచ్చుట/ఆధీనమవుట. అత్యంతసులభమైనది మరియు ఆనందానుభవమును కలిగించునది. శీఘ్రముగా ఫలితములనిచ్చునది. ఒకసారి శరణాగతి చేశామా చాలు ఇక ఇతర వ్యాపారములన్నీ దీనికి   అనుగుణంగా భగవత్ సేవలో భాగంగా మారిపోతాయి.

               ఇది కర్మ,ఙ్ఞాన,భక్తి యోగములు అనుసరించలేని వారికి మరియు ఇవి అనుచితంగాలేని వారికి  అత్యంత సులభమైన మార్గం. (తాను భగవానునికి మాత్రమే చెందినవాడిని అనే స్వరూపఙ్ఞానం కలిగినప్పుడు స్వీయరక్షణ , స్వప్రయత్నములు సరైనవికావని తెలుసుకొంటాడు)దీనిలో రెండు విభాగములు   – ఆర్తప్రపత్తి- (ఈ భౌతికజగత్తులో క్షణకాలం కూడ ఉండడం సహించలేక పరమపదంచేరాలని త్వర ఉన్నవారు)మరియు ద్రుపద ప్రపత్తి(పరమపదమునకు చేరుకొనేవరకు ఈ భౌతికజగత్తులో ఉంటు సర్వం భగవానునిపై భారమునుంచి  భగవత్భాగవతఆచార్య కైంకర్యమునుచేస్తుండేవారు).

5) ఆచార్య అభిమానం:  పైన చెప్పబడిన మార్గములన్నీ అనుష్ఠించడం క్లిష్ఠతరమైనప్పుడు ఆచార్యుడే (భగవదాఙ్ఞతో)పరమకృపతో , ప్రేమతో అతనిని స్వీకరించి అతని రక్షణాభారాన్ని తాను స్వీకరించి ఙ్ఞానమునందించి మార్గదర్శం చూపుట. శిష్యుడు తన సర్వస్వం ఆచార్యుడే అని భావించి అతనిని వినమ్రతో సదా అనుకరించాలి.

విశేషసూచన: ఇక్కడ మనం ఉత్తారక ఆచార్యులైన(ఈ సంసారం నుండి ఉజ్జీవింపచేశేవారు)  భగవద్రామానుజులను స్మరించాలి. అలాగే మనకు ఈ ఉత్తారకాచార్యులను చూపినవారిని(స్వాచార్యులను) ఉపకారకాచార్యులుగా భావించాలి. మన పూర్వాచార్యులందరు దీనిని అనుష్ఠానమున ఉంచి భగద్రామానుజుల శ్రీపాదములనే శరణువేడారు.

విశేషంగా తెలుసుకోవాలన్న దీనిని పరిశీలించవచ్చుhttp://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html .

మణవాళ మామునులు తమ ఆర్తిప్రబంధమున  భగవద్రామానుజులకు పూర్తిగా వశుడై కైంకర్యంచేసిన వడుగనంబి వలె  తాముకూడ ఉండాలని ఆర్తిచెందారు.

విరోధి  – ఈ అంశం మనను మన లక్ష్యమును చేరుకోకుండ అడ్డగించును. ఇది ఐదు విభాగములు

1)స్వరూపవిరోధి: శరీరమునే ఆత్మగా భ్రమింపచేయును. భగవతేతర అంశములపై ప్రీతిని కలిగించి స్వతంత్రునిగా భ్రమింపచేయును.

2) పరత్వవిరోధి: ఇతర దేవతలను పరత్వముగా భావింపచేయును. దేవతాంతరములను భగవంతునితో సమానమనే భ్రమను కలిగించును.  అల్పదేవతలు సర్వశక్తిమంతులని, భగవానుని అవతారములను సామాన్య మానవునిగా, భగవానుని అర్చామూర్తిని కేవలం బొమ్మ అని భావింపచేస్తుంది.

3) పురుషార్థవిరోధి: భగవానుని కైంకర్యము కన్న ఇతరములపై వ్యామోహమును కలిగించును. భగవానుని సేవలో వ్యక్తిగతతత్త్వమునకు ప్రాధాన్యతను కలిగించును.(భగవానుని నియమమునకు వ్యతిరిక్తముగా)

4) ఉపాయ విరోధి: ఇతరోపాయములకు అధికప్రాధాన్యత నిచ్చుట. ఫలాపేక్షతో ఆశ్రయించడం. పరమపద  కైంకర్యముకన్న వీటిని అధికంగా భావించడం. (సర్వార్థ ఫలముననుగ్రహించు ఆచార్య/భగవానుని కంటే వీటిని అధికంగా నమ్ముట).అన్ని సమస్యలకు భీతి చెందుట.(ఆచార్య/భగవానుని పై నమ్మకలేమి)

5) ప్రాప్తివిరోధి: పొందవలసిన దానిని పొందనీయకుండచేయును. ప్రస్తుతశరీరముతో దుశ్చర్యలను, భగవతాపచార, భాగవతాపచారములను చేయించును.

స్వామి పిళ్ళైలోకాచార్యులు అర్థపంచకమును ఇలా వివరించి(సారం) ముగిస్తున్నారు.

      ఈ అర్థపంచకఙ్ఞానమును పొందిన తర్వాత ముముక్షువు(మోక్షము నందు ఇచ్ఛకలిగినవాడు)వర్ణాశ్రమ ధర్మాలకనుగుణంగా ఆర్జిస్తు, వైష్ణవనియమాలను పాటిస్తు, ఆర్జించిన దానిని తన శరీరపోషణ సరిపడమాత్రమే స్వీకరించి మిగిలినది భగవానునికి/భాగవతులకు  సమర్పించి, ఆచార్యుని కృపతో ఙ్ఞానోదయం పొంది అతనికి సేవచేస్తు జీవించాలి.

         భగవానుని ముందు వినమ్రతతో(భగవానుడే సర్వశ్రేష్ఠుడని భావిస్తు), ఆచార్యుని ముందు అఙ్ఞానిలా (ఆచార్యుడే ఙ్ఞానాధికుడని భావిస్తు) శ్రీవైష్ణవుల యందు ఆదరణ భావనతో(వారి వైభవమును తెలుసు కనుక) , సంసారులయందు హేయభావమును ప్రదర్శిస్తు( భౌతిక సంసారులను దూరపరచుటకు)  ఉండవలెను.

             లక్ష్యసాధనకై త్వర/తృష్ణ కలిగి ఉండాలి, ఈ విధానముపై ప్రగాఢవిశ్వాసం కలిగిఉండాలి, అడ్డంకులను (విరోధములను) అధిగమించాలి, శరీరం పై వ్యామోహమును వదలాలి, ఆత్మపరిపూర్ణత కలిగి ఉండాలి, తనకు తాను రక్షకుడనే విషయంలో అశక్తుడవ్వాలి, భగవానుని యందు కృతఙ్ఞతాభావం కలిగి ఉండాలి, ఆచార్యుని యందు కృతఙ్ఞతా మరియు విశ్వాసమును కలిగి ఉండాలి.

              ఎవరైతే ఆచార్యుల ద్వార ఙ్ఞానము పొంది ఆ ఙ్ఞానమును అనుష్ఠానమున పెడతారో వారు భగవానునికి తన దేవేరల కన్నా, నిత్యసూరుల కన్నా మరియు ముక్తాత్మలకన్నా అధికంగా  ప్రీతిపాత్రుడవతారు.

 ఆళ్వార్ తిరువడిగళే శరణం                                                                                                                        ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం                                                                                                                  పిళ్ళైలోచార్యర్ తిరువడిగళే శరణం                                                                                                                    జీయర్ తిరువడిగళే శరణం                                                                                                                               జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలం:  http://ponnadi.blogspot.in/2015/12/artha-panchakam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s