ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 1

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

స్వామి రామానుజులు మరియు దివ్య ఫ్రబంధము

  ఆళ్వార్లచే అనుగ్రహింపబడిన దివ్య ఫ్రబంధమును ముఖ్య ప్రమాణమంగా తీసుకొని స్వామి రామానుజులు శ్రీభాష్య గ్రంధ  రచన చేసారు. అందు వలన స్వామి రామానుజులకు దివ్య ఫ్రబంధంతో ఉన్న అనుబంధాన్ని ఇక్కడ చూద్దాం. జ్ఞానాదికులు నేర్చుకోదలచిన సిద్ధాంతమును  ఒక ఆచార్యులుగానోపండితులుగానోశిష్యులుగానో ఉండి అధ్యయనం చేయవచ్చు. అలా అధ్యయనం చేసేవారు ఇతరులకు నేర్పించే అర్హత గల వారవుతారు అనటంలో సందేహం లేదని పెద్దల భావన. ఈ విషయాన్ని మనసులొఎ నిలుపుకొని ముందుకు సాగుదాం.

  దివ్య ఫ్రబంధం శిష్యులుగా స్వామి రామానుజులు

                స్వామి రామానుజులు శిష్యులుగా  దివ్య ఫ్రబంధంతో సహా అనేక విషయాలను అధ్యయనం చేశారన్న విషయం గురుపరంపరా ప్రభావంలో పలు సందర్భాలలో కనపదుతుంది. 

ఎంబెరుమానార్ తిరుమలైయాండాన్ శ్రీ పాదత్తిలే తిరువాయిమొళి అర్థం కేట్టరుళినార్ “

 (ఎంబెరుమానార్లు తిరుమలైయాండాన్ల దగ్గర దివ్య ఫ్రబంధం అధ్యయనం చేశారు.)

            స్వామి రామానుజులు ఆళ్వార్ల  ఫ్రబంధాలను గురుముఖత నేర్చుకున్నారని రామానుజ నూత్తందాదిలో చెప్పబడింది. పూర్వాచారుల స్తూత్రాలనుగురుపరంపరా సారం మొదలైన శ్రీవైష్ణవ సంప్రదాయ గ్రందాలను స్వామి రామానుజులు శిష్యులుగా ఉండి అధ్యయనం చేశారని తెలుస్తున్నది. దివ్య ప్రబంధ తాత్పర్యాన్ని, అంతరార్థాలను ఆసాంతం ” అంజుకుడిక్కొరు సంతతియాయ్ ” (ఐదు వంశాలకు ఒక్క సంతానంగా) అన్నట్లు నాధమునుల నుండి శిష్యాచార్య పరంపరగా సాగి ,ఆళవందార్ల శిష్యులైన ఐదుగురు ఆచార్యుల దగ్గర అధ్యయనం చేసారు.ఈ నాటికి ఆచార్య పరంపర కొనసాగుతున్నందుకు గురుపరంపరా ప్రభావము, దివ్యప్రబంధమే కారణం. వీటిని మనం అధ్యయనం చేయటమే కాక, అధ్యాపనం చేసి మన సత్సాంప్రదాయాన్ని కొనసాగించా వలసిన అవసరం ఉంది. మన సంప్రదాయంలో దివ్యప్రబంధ అధ్యయనం తప్పనిసరి అయిన భాగం. అందువలననే స్వామి రామానుజులు కూడా ఈ ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని ఎంతో ఆదరంతోఆశక్తితో అధీకరించారు.

” దివ్య ప్రబంధ ఆచార్యులుగా శ్రీరామానుజులు “

       ప్రతి ప్రబంధాన్ని సేవించే ముందు ఆ ప్రబంధానికి సంబంధించిన  తనియన్లను సేవించటం ఆచారంగా ఉన్నది. ఒక్కొక్క ప్రబంధానికి ఒకటికంటే ఎక్కువ తనియన్లు ఉండవచ్చు. ఈ తనియన్లు ఎందుకు ఉన్నాయి అన్న విషయం చూద్దాం.

1. ఆయా  ప్రబంధాల ప్రాముఖ్యతను తెలియ చేయటానికోసం.

2. ఆయా  ప్రబంధాలను అనుగ్రహించిన ఆళ్వార్ల గొప్పదనాన్ని తెలియచేయటం కోసం.

3.ఆళ్వార్లను వారి అవతార స్థలాలను కీర్తించడం కోసం.

4.ఆయా  ప్రబంధాల సారాన్ని తెలియచేయటం కోసం.

          పైన చూసిన విషయాల వలన తనియన్లు ఆళ్వార్ల ప్రబంధాలలోని తాత్పర్యాలను సంక్షిప్తంగా తెలియచేస్తా యని బోధపడుతుంది. కాని, తిరువాయిమొళిలోనుపెరియ తిరుమొళిలోను అలా లేకపోవటం చూడవచ్చు. తిరువాయిమొళికి పూర్వాచార్యులు ఆరు తనియలను అనుగ్రహించారు. వాటిలో ఒకటి సంస్కృతములోను ,మిగిలినవి తమిళంలోను ఉన్నాయి. అందులో రెండు స్వామి రామానుజుల కాలము తరవాత వారి శిష్యులైన అనంతాళ్వాన్లు చేసిన తనియన్ ఒకటి కాగా, స్వామి పరాశర భట్టర్లు చేసిన తనియన్ ఒకటి .

అనంతాళ్వారు

” ఏయ్ న్ద పెరుం కీర్తి ఇరామానుసమునితన్

వాయ్ న్ద మలర్పాదం వణంగుగిన్ఱేన్

ఆయ్ న్ద పెరుం శీరార్ శఠకోపన్ సెంతమిళ్ వేదం తరిక్కుం పేరాద ఉళ్ళం పెర “

 

          ఈ తనియన్లో స్వామి నామ్మాళ్వార్లు అనుగ్రహించిన ద్రావిడ వేదం పరిపూర్ణంగా మనసుకు పట్టడానికి స్వామి రామానుజులే కృప   అని ప్రార్థిస్తున్నారు.

” వాన్ తిగళుం శోలై మదిరళంగర్ వణ్పుగళ్ మేల్

ఆన్ఱ తమిళ్ల్ మఱైగళ్  ఆయిరముం

ఈన్ఱ ముదల్ తాయ్ శఠగోపన్

మొయింబాల్ వళర్త ఇదత్తయ్ ఇరామానుసన్ “

పరాశర భట్టర్

       

 

  వేయి పాశురాల తిరువాయిమొళి అనే బిడ్డను కన్న తల్లి నమ్మాళ్వార్లు కాగా(వ్యాఖ్యానాలు చేసిన)

పెంచిన తల్లి రామానుజులు అని ఈ తనియన్ అర్థము.

 

 

 

 

 

 

 

 

ఎంబార్ స్వామి

        అదే విధంగా పెరియ తిరుమొళికి సంస్కృతములో ఒకటి ,తమిళములో మూడు తనియన్లు అమరి ఉన్నాయి. అందులో స్వామి ఎంబార్లు అనుగ్రహించినది ఒకటి ఉన్నది.

ఎంగళ్ గతియె ఇరామానుస మునియే!

శంగై కెడుత్తండ తవరాసా!

పొంగు పుగళ్ మంగైర్ కోనీంద మఱై ఆయిరమనైత్తుం ,

తంగు మనం నీ ఎనక్కు తా! “

    ఈ తనియన్లో తిరుమంగై ఆళ్వార్లు  అనుగ్రహించిన పెరియ తిరుమొళి అంతరార్దాలతో మనసులో స్థిరముగా ఉండేవిధంగా అనుగ్రహించమని స్వామి రామానుజులను ప్రార్థిస్తున్నారు.

          ఈ తనియన్లను చేసిన వారు పరమపద నాధుడినోశ్రీమహాలక్ష్మినోశ్రీమన్నాధమునులనోఆళ్వార్లనో కాక స్వామి రామానుజులను ప్రార్థించటం కనపడుతుంది.  దీనికి కారణం భట్టర్లు అనుగ్రహించిన తనియన్ వలన గ్రహించ వచ్చు. ఆళ్వార్లు దివ్య ప్రబంధాలను అనుగ్రహించినప్పటికీవాటి ఔన్నత్యాన్ని అందరికి తెలియజేసివాటిని రక్షించి స్వామి రామానుజులు. తన శిష్యుల మూలంగా ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రాయించి వాటిని అంగీకరించి వాటిని కోరిక గలవాళ్ళందరు చదివి ప్రయోజనాన్ని పొందేట్లుగా చేసిన వారు స్వామి రామానుజులు.  రామానుజులను గురించిన ఐతిహ్యాలువారే ఉత్తాకాచార్యులని పూర్వాచార్యులు చేసిన నిర్వాహాలు తెలియచేస్తున్నాయి.

 

“ మాఱనురై సెయిద తమిల్ మఱైవళర్తోన్ వాళియే  “

             స్వామి మామునులు కూడా తమ ఆర్తి ప్రబంధంలో ద్రావిడ వేదాన్ని రక్షించి పొషించినది స్వామి రామానుజులనే కీర్తించారు.

పై విషయాల వలన స్వామి రామానుజుల ఆచార్య స్థానము యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది.

స్వామి రామానుజులు నడిచి చూపిన ఉన్నతమైన మార్గము

                స్వామి రామానుజుల జీవన విధానాన్ని చూసినపుడు వారు విద్వానాలేక వేదాంతియాఅన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు తిరువరంగత్తముదనార్ల పాశురాలలో చూడవచ్చు. ఎందుకంటే అముదనార్లు రామానుజుల జీవన విధానాన్ని దగ్గర ఉండి చూసినవారు.    

” ఉరు పెరుంసెల్వముం తందైయుం తాయుం

ఉయర్ గురువుం వెరి తరు పూమగళ్ నాధనుం

మాఱన్ విళంగియ సీర్నెరితరుం  సెంతమిళారనమే యెన్ఱి

నీణిలత్తోర్ అఱితర నిన్ఱ ఇరామానుసనెన క్కారముతే!”

         స్వామి రామానుజులు నమ్మాళ్వార్లచే అనుగ్రహించబడిన ప్రబంధాలను తమ తల్లిగాతండ్రిగాఆచార్యులుగాసంపదగాదైవముగా,  భావించటమే కాక ఆ మర్గములోనే నడచి చూపిన వారు . మనోవాక్కాయకర్మల దివ్య ప్రబంధాలను ఆదరించిఆచరించివాటిపై తమకు ఉన్న భక్తిని ప్రపంచానికి చాటి చూపించారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/01/30/dramidopanishat-prabhava-sarvasvam-1/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

3 thoughts on “ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 1

 1. Srinivas Stp

  Thank you very much

  On Mon 1 Oct, 2018, 8:19 PM SrIvaishNava granthams – Telugu, wrote:

  > Sridevi posted: ” శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః
  > శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం స్వామి రామానుజులు మరియు
  > దివ్య ఫ్రబంధము ఆళ్వార్లచే అనుగ్రహింపబడిన దివ్య ఫ్రబంధమును ముఖ్య
  > ప్రమాణమంగా తీసుకొని స్వామి రామానుజులు శ్రీభాష్య గ్రంధ ”
  >

  Reply
 2. రంగమన్నార్

  అడియేన్: మీరు పంపించిన వ్యాసాలన్నీ అమృతసర ప్రవాహాలే —— : జైశ్రీమన్నారాయణ :

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s