ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 4

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 <<ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 3

            ఆళ్వార్లు ,ఆళవందార్లు – సన్యాసుల నాయకులు

       మనకు నాలాయిర దివ్య ప్రబంధమును సాధించి పెట్టినవారైన స్వామి నాధమునుల మనుమడు , స్వామి రామనుజులకు పరమాచార్యులు అయిన ఆళవందార్లకు యామునచార్యులు, యమునైతురైవన్, యామునముని అని అనేక పేర్లున్నాయి. వారు అనుగ్రహించిన అర్థాలనే వారి తరువాత అవతరించిన ఆచార్యులు ఆదరించి తమ గ్రంధ రచనలో అనుసరించారనడం అతిశయోక్తి కాదు. ఆళవందార్లు అనుగ్రహించని అర్థాలు మన సంప్రదాయంలో లేవు.

స్వామి ఆలవందర్

            ‘ శ్రీయమునార్య సమోవిద్వాన్ నభూతో నభవిష్యతి ‘ श्रीयामुनार्यसमो विद्वान् न भूतो न भविष्यति| అని కీర్తించబడిన వారు ఆళవందార్లు. తిరువరంగత్తముదనార్లు వీరిని ‘ యతికట్ క్కిరైవన్ యమునై త్తురైవన్ ‘  ( యతులకు దైవ సమానుడు ) అని కీర్తించారు .

             ఆళవందార్ల అద్భుతమైన మేధాశక్తిని అర్థం చేసుకోవటానికి వారు అనుగ్రహించిన స్తోత్రరత్నం , సిద్దిత్రయం, ఆగమ ప్రామాణ్యం వంటి గ్రంధాలు ఉపకరిస్తాయి. వీటి ద్వారా వారి కవితా శక్తి ,తాత్విక జ్ఞానం  , రచనాపఠిమ , పంచరాత్రాగమముపై ఉన్న అధికారం తెలుసుకోవచ్చు. ఈ క్రింద వారి మాటలలోనే వారి అభిప్రాయం చూద్దా        न वयं कवयस्तु केवलंन वयं केवल-तन्त्र-पारकाः,

अपितु प्रतिवादिवारण-प्रकटाटोप-विपाटन-क्षमाः |

“ న వయం కవయస్తు కేవలం , న వయం కేవల-తత్ర –పారకాః ,అపితు

  ప్రతివాదివారణ –ప్రకటాటోప –విపాటన –క్ష్మమాః “

      “ మనం కేవలం కవి మాత్రం కాదు,కేవల ఆగమ తంత్రములు తెలిసినవాడిని కాదు. దానికి మించి ఏనుగు లాంటి ప్రతివాదులను గర్వ భంగము చేయగల సమర్దులం “ అని దైర్యంగా ప్రకటించారు. ఈ మాటలు స్వామి అహంకారంతో చెప్పినవి కావు, కేవలం తమ సమర్థతను ప్రతివాదులకు తెలియచేయటం కోసం చెప్పినవి.

మన సంప్రదాయంలో ఆచార్యులు ,సంస్కృత  భాషలో వేదవాక్యాల ఉదాహరిస్తూ అనేక సిద్దాంత గ్రంధాలను రచించారు.  వీటిలో ఆళ్వార్ల  రచనల నుండి ఉదాహరణలు కనపడవు. వాటిని చదివే వారిని సులభ గ్రాహ్యలు కావాలని భావించటమే దానికి కారణము . మన సిద్దాంతానికి సంభందించిన శ్రీవైష్ణవ సంప్రదాయ గ్రంధాలలో ఆళ్వార్ల  రచనల నుండి  అనేక ఉదాహరణలు కనపడతాయి .

నమ్మాళ్వార్

ప్రపన్న కులమునకు అధిపతిగా శ్రీశఠకోపులు

స్వామి నమ్మాళ్వార్లపై అళవందార్లకున్న అభిమానం ఎంతో తెలుసుకోవటానికి స్తోత్రరత్నంలోని 5వ శ్లోకం నుండి చూడవచ్చు. ‘ మతాపితా ‘  అని ప్రారంభమయ్యే ఈ శ్లోకంలో  స్వామి నమ్మాళ్వార్ల పేరు ప్రత్యక్షంగా ఉదాహరించ కుండా ‘ ఆద్యస్తనః కులపతేః వకుళాభిరామం ‘ అని ప్రయోగించారు. వకుళ మాలను ధరించిన వారు  నమ్మాళ్వార్లుఅని ఎలా భావించాలి ఎవరైనా వకుళ మాలను ధరించవచ్చు కదా అన్న సందేహం కలగవచ్చు. నమ్మాళ్వార్ల తమ పాశురాలలో ‘ నట్కమళ్ మగిళ్ మాలై మార్బినన్ మాఱన్ శఠకోపన్ ‘. అని చెప్పుకున్నారు. అందుకనే నమ్మాళ్వార్లకు వకుళాభరణ భూషణుడు అన్న పేరు స్థిరపడింది . తరవాత వచ్చిన ఆచార్యులు वकुलाभरणं वन्दे जगदाभरणं मुनिम्. ‘వకుళాభరణం వందే  జగదాభరణం మునిం ‘ అని కీర్తించారు.

నాథముని

స్తోత్రరత్నంలో ఆచార్య వరుస క్రమము

                  స్తోత్రరత్నంలో స్వామి ఆళవందార్లు మొదటి మూడు శ్లోకాలలో నాధమునులను కీర్తించి , తరువాత శ్రీవిష్ణుపురాణ కర్త అయిన పరాశర మహర్షిని గురించి ఒక  శ్లోకమును చెప్పారు . కాని మన గురుపరంపరా క్రమంలో ముందు నమ్మాళ్వార్లు , నాధమునులు , ఆళవందార్లు అనే క్రమంలో సేవిస్తాము.

పరాశర ముని

ఆళవందార్లు స్తోత్రరత్నంలో ముందు సంస్కృత వేదానికి ఆచార్యులైన పరాశర మహర్షిని, తమ కులపతులైన నాధమునుల గురించి  ప్రస్తుతించి  , తరువాత మన సంప్రదాయ కులపతులైన నమ్మాళ్వార్లను ప్రస్తుతించి వచ్చు కదా! లేక ముందు తమ ఆచార్యులను , కులపతులైన నమ్మాళ్వార్లను ప్రస్తుతించి సంస్కృత వేదానికి ఆచార్యులైన పరాశర మహర్షిని ప్రస్తుతించి వచ్చు కదా! ఎందుకని ఈ వరుస కరమాన్ని పాటించలేదు. అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్నకు స్వామి దేశికులు చక్కటి వివరణను ఇచ్చారు.

స్వామి దేశికుల వ్యాఖ్యానం

          ఈ ప్రశ్న యొక్క జవాబులోనే ద్రమిడోపనిషత్ ప్రభావం యొక్క గొప్పదనం దాగి వుంది. దానిని స్వామి వేదాంత దేశికులు ఎంత చక్కగా వివరించారో చూద్దాం .

స్వామి నాధమునుల తరవాత నమ్మాళ్వార్లను  స్తుతించినందుకు కారణము ఆళ్వార్లే  స్వామి నాధమునులకు ద్రమిడోపనిషత్ ను అనుగ్రహించినవారు అని మన సంప్రదాయంలో ప్రసిద్దము కదా అనుకోవచ్చు .  కాని ఆళ్వార్లను పరాశర మహర్షి తరవాత ఎందుకు స్తుతించారు? అంటే  “వేదవేదాంతము యొక్క  అర్థాలను పరాశర మహర్షి కంటే ఆళ్వార్లు చక్కగా వివరించారు. ఇంకా ఆళ్వార్ల పాశురాలు పరమాత్మకు ఇంపుగాను ,ఇష్టం గాను ఉన్నవి . పరమ కృపతో భగవద్విషయం మనకు అనుగ్రహించి వుండటం చేత ఆళవందార్లు- ఆళ్వార్లను,కోటాను కోట్ల జీవాత్మలకు స్వామి అయిన పరమాత్మను సమానంగా చూశారు . వేదాంతంలో ఎలాగైతే శ్రీమన్నారాయనుడే మాతా పితా సర్వం అని చెప్పబడిందో అలాగే ఆళవందార్లు వకుళా భరణ భూషణుడినే తమకు సర్వస్వముగా భావించారు.’ వకుళాభిరామం శ్రీమత్ తదంగ్రియుగళం మూర్తనా ప్రణమామి ‘

वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं मूर्ध्ना प्रणमामि |

మన పూర్వాచార్యులు కూడా , ఆళ్వార్లను పరమాత్మ శ్రీపాదాలుగానే భావించారు.అందువలననే ఆళవందార్లు పరమాత్మ కీర్తించే స్తోత్రమును చేసేముందు ఆయన  శ్రీపాదాలైన నమ్మాళ్వార్లను స్తుతించారు పెద్దల అభిప్రాయము . స్తోత్రరత్నంలోని పలు శ్లోకాలు ఆళ్వార్ల పాశురాలకు పోలిక కలిగి వుండటమో ,కొన్ని చోట్ల ప్రత్యక్షంగా అదే అర్థాన్ని తెలియజేసేవిగానో  అమరివున్నాయి. ( వీటి అర్థాలను వారి వారి ఆచార్యుల దగ్గర గ్రంధ కాలక్షెపము ద్వారా తెలుసుకోగలరు )

  1. कः श्रीः श्रियः (12) ,श्रियः श्रियम् (45) కః శ్రీః శ్రీయః (12)  శ్రీయః శ్రీయమ్ (45)అన్న ప్రయోగము ‘ తిరుమంగై ఆళ్వార్ల తిరువుక్కుతిరువాగియ సెల్వా ‘ అనే  పాశురభాగాన్ని పోలి ఉంది.
  2. ‘ నిరాసకస్యాపి న తవాదుత్సహే ‘ (26) అన్న శ్లోక పాదము

         ‘ తరుతుయరంతడాయేల్ ఉన్ శరణ అల్లాల్  శరణ్ ఇల్లై

         విరై కుళువు మలర్ పొళి సూళ్ విట్టువకొట్టమ్మానే ‘

         అనే  కులశేఖర ఆళ్వార్ల పాశుర భాగాన్ని పోలి ఉన్నాయి.

     3.గుణేన రూపేణ విలాస చేమష్టితౌ: సదా తవైవోచితయా తవ శ్రియా ‘(38 ) ‘ ఉనకేర్ కుం                       కోలమలర్ ప్పావై కణ్ పా  ‘ అన్న నమ్మళ్వార్ల  పాశుర భాగాన్ని పోలి ఉంది.

  1. ‘ నివాస శయ్యాసన ‘ అన్న (40) శ్లోక పాదము ‘ సేన్ద్రాల్ కుడైయాం ‘ అన్న నమ్మళ్వార్లపాశుర భాగాన్ని పోలి ఉంది.
  2. నమ్మళ్వార్ల ‘ వళవేళులగు ‘ దశక సారంగా 47శ్లోక పాదము ‘ ధిగశుచిమవినీతం ‘ అమరింది.

     6 . నమ్మళ్వార్ల ‘ఎనదావితందొళిందెన్ ……

          ఎనదావియార్ ఆనార్ తంద నీ కొండు ఆక్కినయే ‘ అనే    పాశుర భాగం’ వపుషాదిషు ‘ (52) , ‘              మమనాథ ‘ (53)  శ్లోక పాదములకు సరిపోతుంది .

  1. ‘ మహత్మభి: మాం‘(56) అన్న ప్రయోగానికి , ‘ ఒరునాళ్  కాణ వారాయే , నమ్మై  యోరుకాల్ కాట్టి నడన్దాల్ నాంగలుయ్యోమే , ఎమ్మావీట్టుతిరముం సెప్పం ‘అన్న నమ్మాళ్వార్ల  పాశుర భాగానికి సరిపోతుంది .
  2. నమ్మాళ్వార్ల ‘ ఏరాళుమిరైయోన్ ‘ దశకం యొక్క సారం 57 వ శ్లోకంలో ‘న దేహం న ప్రాణాన్ ‘ అన్నశ్లోక పాదములో వివరించ బడింది.

పై ఉదాహరణల వలన ఆళ వందార్లు నమ్మాళ్వార్ల ప్రబంధాన్ని తమ రచనలకు ప్రమాణంగా స్వీకరించారని చెప్పడానికి ఉపకరిస్తాయని .

స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యన్ తార్తం సుదుర్గ్రహం !

స్తోత్ర యామాస యోగీంద్ర  తమ్ వందే యామునాహ్వాయం !!

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/02/dramidopanishat-prabhava-sarvasvam-4/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s