Monthly Archives: March 2019

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 19

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 18

దివ్య ప్రబంధ(అరుళిచ్చెయల్) అనుసంధానం

దివ్య ప్రబంధము (అరుళిచ్చెయల్) మీద మన ఆళ్వార్లకు ఆచార్యులకు అసమాన్యమైన అభిమానం ఉన్నదన్న విషయం విదితమే. పండితులు, పామరులు అన్న భేదం లేకుండా కోవెలలో స్వామి సన్నిధిలో, వీధిలో జరిగే శోభాయాత్రలో పెరుమాళ్లకు ముందు నడిచే గోష్టి దివ్య ప్రబంధాన్ని సేవించడం మనకు తెలిసిన విషయమే . దివ్య ప్రబంధాన్ని నేర్చుకున్న పెద్దలు అలా వీధిలో పరమాత్మా ముందు సేవిస్తూ గోష్టిగా నడుస్తుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు, చూసిన కళ్ళదే భాగ్యం కదా! దివ్యప్రబంధ పారాయణమే ఆ స్వామి వీనులకు విందైనదని మన పూర్వాచార్యులు తెలుసుకొని ఈ ఏర్పాటును చేశారు. ఈ ఏర్పాటుకు ఎప్పుడైనా విధి వశాత్తు భంగం వాటిల్లినా అతి త్వరలో మళ్ళీ జరిపించెందుకు తగిన ఎర్పాట్లు చేశారు. శ్రీవైష్ణవులైన వారందరు  ఈ కైంకర్యాన్ని కోరుకుంటారు.

                కోవెలలలో నిర్వహించే అన్ని కైంకర్యాలలో ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాల ప్రాముఖ్యతను గురించి మన ఆచార్యులు ఎంతగానో కీర్తించారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో ఈ పద్దతుల గురించి చక్కగా వివరించారు. శ్రీ వేదాంత దేశికులు కూడా ఇలాంటి ప్రబంధ గోష్టులను ఆదరించి తాము  కూడా అందులో పాల్గొన్నట్లు తెలుసున్నది. మన ఆచార్యులు దివ్య ప్రబంధానికి చేసిన విపులమైన వ్యాఖ్యానాల ద్వారా వారికి  ఆళ్వార్ల మీద, వారు పాడిన పాశురాల మీద ఎంత భక్తి, ఆదరాలు ఉన్నాయో,  అలాగే ఆళ్వార్ల, వారి పాశురాల ప్రభావం ఆచార్యుల మీద ఎంత ఉందో తెలుస్తుంది. దివ్య  ప్రబంధానికి శ్రీవైష్ణవం, విశిష్టాద్వైతం అంటే అతిశయోక్తి కాదు. ఆచార్యుల గ్రంధాలను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది.

          దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు, గురుపరంపరా ప్రభావం మొదలైన గ్రంధాలలో చూపిన ఐతిహ్యాల నుండి భగవద్రమానుజుల వంటి ఆచార్యులు, సంస్కృతంలో వేదాంత గ్రందాల రచనలు చేసిన ఆచార్యులకు వీటి మీద ఎంత గొప్ప ఆసక్తి ఉందో తెలుసుకోవచ్చు. భగవద్రమానుజుల సమకాలీనులు, కూరత్తాళ్వాన్ల శిష్యుడు అయిన శ్రీ తిరువరంగత్తముదనార్లు భగవద్రమానుజుల గురించి రాసిన ‘రామానుజ నూత్తందాది’ భగవద్రమానుజులకు దివ్య ప్రబంధం మీద వున్న అపారమైన పట్టును, ప్రేమను తెలియజేస్తుంది.  ఈ పాశురాలను తప్పక నేర్చుకోవాలా! అన్న ప్రశ్నకు తావే లేదు. వాటిని అర్థంతో నేర్చి, ఇతరులకు  చెప్పి అనుభవించినప్పుడే జీవితానికి అర్థం పరమార్థం దక్కుతుంది అనడంలో సందేహం లేదు.

ప్రతి పనిని విమర్శించేవారు కూడా ఉంటారు కదా! కొందరు వ్యక్తులు, కొన్ని సమూహాలు, అసత్య వాదాలు, అర్థ రహిత వాదాలు చేయటం లోకంలో కనపడుతుంది. సాంప్రదాయ పద్ధతులను వివరించేటప్పుడు వీటికి వేద ప్రమాణాలు లేవని వాదిస్తారు. ఇలాంటి శుష్క వాదాలు చేసేవారు వేదంలోని అంతరార్థాలను ఎరుగరు. కానీ వారి వాదనలను వాక్చాతుర్యంతోను, తప్పుడు వాదాలతోనూ నోరు మూయించాలని ప్రయత్నిస్తారు. వేదాలపై  అధిపత్యం లేను వారిని బెదిరించి అదలించి గందరగోళ పరచి నోరుమూయిస్తారు.

ఆగమాలు, వేదాలు నేర్వకుండానే కొందరు కోవేలలో విగ్రహా ప్రతిష్టకు ఆదారాలే లేవంటారు. ఎంతో కొంత నేర్చినవారు తాము ఏది మాట్లాడిన చెల్లుతుందని తమకు ఆ అధికారం ఉందని భ్రమ పడతారు. మన ఆచార్యులు ఎందుకు చెపారు? ఏమి చేశారు, అని లోతుగా తెలుసుకోకుండా నోటికి వచ్చింది చెప్పటం, చేతికి వచ్చింది రాయటం మంచిది కాదు, అది వినాశ హేతువవుతుంది.

ఒక వైపు దివ్యప్రబంధము మీద మన ఆచార్యుల వ్యాఖ్యానాలు మేరుసమానంగా ఉండగా ‘దివ్యప్రబందానికి ఏ మహిమ లేదు’ అని చెప్పేవారి గోష్టి కూడా ఉంది. కోవెలలో దివ్య ప్రబంధము సేవించటం అనూచానంగా వస్తున్నఆచారమని తెలిసినా, దానికి చారిత్రక ఆధారాలు ఉన్నా, వాటికి సంబంధించిన వివరాలు రామానుజుల వారి గ్రంధాలలో ఉన్నా, అలాగా ఎక్కడ ఎవరు చెప్పలేదని వితండ వాదం చేసేవారున్నారు.

ఇది ఒక గుడ్డి వాదన. రామానుజులు రాసిన తొమ్మిది గ్రంధాలలో ఏది వారు ప్రత్యక్షంగా శిష్యులకు బోధించ లేదు, కానీ అందులో చెప్పిన విషయాలు వారి శిష్యప్రశిష్యులు ఆచరించారు, ఇప్పటికి అవి కొనసాగుతూ వస్తున్నాయి. నిత్య గ్రంధం ఒక్కదానిలోనే స్వామి ఆజ్ఞాలను మనం చూడగలుగుతున్నాము. ఇది వారి చివరి గ్రంధము. ఇందులో కోవెలలో నిర్వహించవలసిన కైంకర్య విధానాలను వివరించారు.

స్వామికి దివ్యప్రబంధం మీద అపారమైన భక్తి , ప్రేమ ఉండటం వలన వారు తమ గ్రంధాలలో దివ్య ప్రబందానికి సముచిత స్థానాన్ని ఇచ్చారు. దివ్యప్రబంధం వీనుల విందైనది (సేవిక్కినియ సెంజొల్) అని ప్రసిద్ది గాంచినది. నమ్మాళ్వార్ల తిరువాయిమోళి 10 -6-11 లో ‘కేట్పార్ వానవర్ గళ్ సేవిక్కినియ సెంజొలే’ అని అన్నారు.

నమ్మాళ్వార్ల తిరువాయిమోళి తోనే నిరంతరం మునిగి వుండే స్వామి, ‘శ్రీ సూక్తైః స్తోత్రైః అభిస్తూయ’ అని అన్నారు. అది ఒక శబ్ద ప్రవాహము  అది స్తోత్రం, ఎదో ఒక స్తోత్రం కాదు  శ్రీ సూక్తి స్తోత్రం …….చేవులకింపైనది.

భగవద్రామానుజులు తమకు ఆళ్వార్ల శ్రీసూక్తులపై ఉన్న అధికారం, మమకారం ప్రకటితమయ్యేట్టుగా వీటిని ఆళ్వార్ల పాశురాలు అనకుండా ఆళ్వార్లె  పేర్కోన్నట్టుగా ‘చెవికింపైన మంచి మాటలు’ అనేవారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/17/dramidopanishat-prabhava-sarvasvam-19/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

విరోధి పరిహారాలు – 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

<< విరోధి పరిహారాలు – 3

 1. ముఖ్యప్రమాణ విరోధి  – ప్రాధమిక ఆధారమును అర్ధం చేసుకోవడంలో అవరోధాలు. ప్రమా అంటే  ధ్రువీకరించబడిన జ్ఞానం. ప్రమాణం అంటే ఒక ప్రత్యేక విషయం గురించి ధ్రువీకరనించబడిన జ్ఞానాన్ని అందిస్తుంన్నది. సాధారణంగా మూడు రకాల ప్రమాణాలు వైధికులు స్వీకరించారు.
 • ప్రత్యక్షం (అవగాహన) – కళ్ళు, ముక్కు, చెవులు మొదలైన మన జ్ఞానేంద్రియాలు పరిశీలించదగినవి. ఇది సాధారణంగా సత్యమును బహిర్గతం చేస్తుందని భావించినప్పటికీ, దీనిలో పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు, ఆ వ్యక్తి దృష్టిలో లోపమున్నట్లయితే , అతనికి కనిపించేది సత్యము మరియు విశ్వసనీయమైనదిగ ఉండకపోవచ్చు. మరో ఉదాహరణ ఏమిటంటే, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు, కంగార్లో స్థంభాన్ని మనిషిగా, పామును తాడుగా భావించడం సులభం. ఎండమావి కూడా ఒక కల్పన (నీరు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వాస్తవానికి నీళ్లుండవు).

 •  అనుమానము  – ముందు అవగాహన ఆధారంగా ఏర్పడినదానిని అనుమితి అంటారు. ఎక్కడ పొగ ఉంటే, అక్కడ మంట ఉంటుంది – ఇది అనుమానానికి ఒక మంచి ఉదాహరణ. కానీ ఇది కూడా పరిమితులతో నిండి ఉంది. ప్రత్యక్షం మరియు అనుమానము రెండు ప్రాధమిక ఆధారాలుగా పరిగణించబడలేదు.

శబ్దం (ప్రామాణిక గ్రంథాలు) – వేదం ధ్రువీకరించబడిన జ్ఞానం, అత్యంత విశ్వసనీయమైన మరియు నమ్మదగిన సాక్ష్యంగా పరిగణించబడుతుంది. ఆస్థికులు (వేదాన్ని ప్రమాణంగా అంగీకరించిన వారు) వేదం అపౌరుషేయంగా (ఏ స్త్రీ లేదా పురుషునిచే  సృష్టించనది కాదు), నిత్యం, నిర్దోషం అని అంగీకరించారు.


ఇప్పుడు ముఖ్య ప్రమాణాలను అర్థం చేసుకోవడంలో ఉన్న అవరోధాలను చూద్దాము.

 • వేదాంతం మచ్చ లేని జ్ఞానాన్ని ఇస్తుంది. వేదాంతం అనగా వేదం యొక్క చివరి భాగమని అర్థం – ప్రధానంగా ఉపనిషత్తులు. వేదాంతాన్ని అత్యున్నత అధికారిగా పరిగణించకపోవడం ఒక అడ్డంకి.
 • వేదాంతాన్ని ప్రత్యక్షానికి మరియు అనుమానానికి  సమానంగా పరిగణనలోకి తీసుకొనుట ఒక అడ్డంకి. ఖచ్చితంగా వేదాంతం ఇతర ప్రమాణాల కన్నా గొప్పది. అనువాదకుని గమనిక: మహాభారతం నుండి ప్రముఖ ప్రమాణాన్ని గుర్తు చేసుకుందాము “సత్యం సత్యం పునః సత్యం వేదాత్ శాస్త్రం పరం నాస్థి న దైవం కేశవాత్పరమ్”.
 •  భగవత్గీత  చివరలో శ్రీకృష్ణుడు  “మా సుచః” (చింతించ కండి) అని ఆదేశించారు. భగవత్గీత లోని చరమ శ్లోకం అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం. భగవానుడు గీతాచార్యునిగా దివ్య రథంపై ఆసీనులై గీతోపదేశం చేస్తూ అన్నారు “అన్ని ఉపాయాలను విడిచిపెట్టి, నాకు సంపూర్ణ శరణాగతి చేయి. నేను అన్ని పాపాల నుండి ఉపశమనాన్ని ప్రసాదిస్తాను. నేను హామీ ఇస్తున్నాను, విచారించకు, సందేహించకు, శోకించకు”. దీనినే “మా సుచః” అని అంటారు. ఆండాళ్ నాచియార్ దీనిని కీర్తిస్తూ నాచియార్ తిరుమోళి 11.10 వ పాసురంలో “మేయ్మై పెరు వార్తై” అని కీర్తించారు. ఈ పదాలపై మనం పూర్తి నమ్మకం ఉంచాలి. అలాంటి విశ్వాసం ఉండకపోవడం అనేది ఒక అడ్డంకి.

 •  భగవంతుడుని నిరహేతుకమైన కృపతో ఆళ్వారులు నిష్కలంకమైన  జ్ఞానాన్ని అనుగ్రహంగా పొందారు. వారు స్వచ్ఛమైన జ్ఞాన ఫలితం కాబట్టి, వారు సంపూర్ణమైన సత్యం. వారిని వేదానికి సమానంగా,  ప్రాధమిక సాధనా జ్ఞానంగా భావించవచ్చు. అలా పరిగణించక పోవుట (అనగా,  ఆళ్వారుల పాసురాలను తక్కువగా పరిగణించుట) ఒక అడ్డంకి.
 • గురుపరంపర క్రమంలో నమ్మాల్వార్ నుండి మణవాళ మామునుల వరకు –  పుర్వాచార్యులని పిలుస్తారు. మన సాంప్రదాయంలో జ్ఞానప్రసరణ గురువుల నుండి శిష్యులకు చేయబడింది.  నమ్మాల్వార్ యొక్క ఆశీస్సులు ఆచార్యులు మరియు వారి శిష్యులందరికి  ఉన్నాయి. వారి సూచనలు, ఆదేశాలు ప్రాధమిక జ్ఞానసాధనంగా పరిగణించబడుతున్నాయి. ఈ ఆదేశాలపై బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఆలవందారులు స్తోత్రరత్నం 20 “త్వదీయ గంబీర మనోనుసారిణః” – వేదం భగవానుడి భక్తుల యొక్క దివ్య హృదయాన్ని అనుసరిస్తుంది. సామాన్యంగా తెలిసిన ప్రమాణం “ధమగ్య సమయం ప్రమాణం వేదాస్చ” కూడా అదే నొక్కి చెబుతుంది – ధర్మం తెలిసిన వ్యక్తుల యొక్క క్రియలే  ప్రధాన ప్రమాణం మరియు వేదం కూడా ప్రమాణం – పై వాక్యాలు ధర్మంలో నిత్యం స్థిరపడి ఉన్న ఆళ్వారులకు మరియు పుర్వాచార్యులకు మరింత ప్రాధాన్యతను ఇస్తుంది.
 1. యావధాత్మాభావి విరోధి – ఆత్మకు అవరోధాలు (ఉన్నంత కాలం – ఎప్పటికీ). యావధాత్మాభావి  అంటే ఆత్మ ఉన్నంత కాలం అని అర్థం.  ఆత్మా అనేది నిత్య (శాశ్వతమైనది) – ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేది. కానీ విరోధి కాదు – నిజమైన జ్ఞానం ఆత్మలో పూర్తిగా విస్తరించినప్పుడు విరోధం తీసివేయబడుతుంది. కాబట్టి, ఇది చాలాకాలం ఉనికిలో ఉన్న వాటిగా పరిగణించబడుతుంది.

భగవాన్ మరియు భాగవతుల యొక్క శాశ్వత సేవకుడుగా ఉండటమే జీవాత్మ యొక్క నిజమైన స్వభావం.

 • ఆలవందారులు ఉదాహరించి నట్లుగా “దేహేంద్రియ మనః ప్రాణ దీప్యో అన్యః”. ఆత్మ – శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనవాటికి భిన్నమైనది అని సూచిస్తుంది. సామాన్యంగా మానవులు ఆత్మ, శరీరం ఒకటేనని భావించి ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంటారు. కానీ అది నిజం కాదు – అది ఒక భ్రమ మాత్రమే. శరీరం పుట్టి, పెరిగి, క్షీణించి (వ్రుధాప్యంతో), వ్యాధి తో భాదపడి మరణిస్తాడు. కానీ అత్మ నిర్వికార (మార్పులేనిది). ఆత్మ, శరీరం ఒకటేనని బ్రమించడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: తత్వ త్రయంలో పిళ్ళై లోకాచార్యులు ఆత్మను శరీరానికి,  ఇంద్రియం, మనస్సు, బుద్ధి, ప్రాణ (ప్రాణ వాయువు) మొదలైన వాటికి విభిన్నమని వివరించారు,
 • ఆత్మ స్వతంత్రమని పరిగణించడం తప్పు. ఆత్మ సర్వేశ్వరుని ఆధీనము, ఎల్లప్పుడూ వారు నియంత్రిస్తుంటారు. భగవదాధీనుడై ఉండుట జీవాత్మ యొక్క నిజమైన వ్యక్తిత్వము. ఆత్మ తన సొంతమని పరిగణించుట భగవాన్ ఆస్తి దొంగిలించినట్లవును. ఇది ఒక పెద్ద అడ్డంకి.
 • ఈశ్వరుడు అన్ని విధాలుగా సంపూర్ణుడు. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, అవాప్త సమస్త కాముడు (అన్ని కోరికలు నెరవేరిన వాడు) మరియు అపహత పాప్మా (ఏ లోపాలతోనూ ప్రభావితం కానివాడు). అటువంటి ఈశ్వరుడుని అపూర్ణుడు గా (అసంపూర్ణుడు) పరిగణించటం ఒక అడ్డంకి.
 • బ్రహ్మా, రుద్రుల వంటి వారిని నియంత్రకులుగా భావించుట  – బ్రహ్మా,రుద్రుడు మొదలైన దేవతాంతరులతో సహా అందరిని నియంత్రించువాడు శ్రీమన్నారాయణుడు. ఈ కారణంగా ఆది శంకర భగవత్ పాదులు వారి సహస్రనామ భాష్యంలో “ఈశానశీలః నారాయణ ఏవ” (నారాయణుడు మాత్రమే నియంత్రించువాడు) అని కీర్తించారు. ఉపనిషత్తులు కూడా “నారాయణ: పరభ్రమ” అని ఘోషిస్తున్నాయి. అందుచేత నారాయణుడు  కాకుండా ఇంకే ఇతరులను ఈశ్వరునిగా   పరిగణనలోకి తీసుకొనుట ఒక అడ్డంకి.
 •  చక్రవర్తి (రక్షకుడు) గా ఎమ్బెరుమాన్ కాకుండా మరొకరిని రక్షకునిగా పరిగణలోకి తీసుకొనుట ఒక అడ్డంకి – ఎమ్బెరుమానుడే ప్రతి ఒక్కరికి రక్షకుడు. ఇది ప్రణవం యొక్క భావం, వేదం యొక్క సారాంశం. బ్రహ్మా, రుద్రులు తదితరులు జీవాత్మలు, కావున వారు నారాయణుడి వలె నియంత్రికులు కాదు. వారిని ఆ విధంగా పరిగణనలోకి తీసుకోవడం ఒక అడ్డంకి అవుతుంది. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్యులు “ప్రపన్న పరిత్రాణం”  అనే ఒక గ్రంథంలో  శ్రీమన్నారాయణుడు మాత్రమే నిజమైన రక్షకుడు అని స్పష్టంగా తెలిపారు. వారు తన ముమ్ముక్షుప్పడి సుత్రంలో 39లో  “‘ఈశ్వరనై ఒళింతవర్గళ్  రగళ రక్షకరల్లర్, ఎన్నుమిదం ప్రపన్న పరిత్రాణత్తిలే చోన్నోం” అని ఉల్లేఖించారు.
 • భాగవత అపచారం, ఆచార్య అపచారం మరియు ఆచార్య భక్తులకు అపచారాలు (ఆచార్యునికి శరణాగతి చేసినవారు)  పెద్ద అడ్డంకులు. భాగవత అపచారం చేసిన వారిని భగవాన్ క్షమించడు. ఎమ్పెరుమాన్ భూమి పిరాట్టితో ” క్షిపామి, నక్షమామి వసుంధరే” అని అన్నారు – “భూదేవి! వారిని నేను క్రిందకి తోసేస్తాను, ఎన్నటికీ క్షమించను” అని అన్నారు. పురుణాలలో పలు సంఘటనల నుండి ఈ విషయాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. ఎమ్పెరుమాన్ భగవత్ అపచారం (భగవానుని పట్ల అపరాధం) చేసిన వారిని క్షమిస్తారు. కానీ భాగవత అపచారం, ఆచార్య అపచారం  చేసినవారిని క్షమించడు. తిరువరంగత్తముదనార్ ఏమ్బెరుమానార్ని ప్రార్థిస్తూ రామానుజ  నూఱ్ఱ౦దాది 107 “ఇరామానుజ! ఉన్ తొండర్ కట్కే అన్బుఱ్ఱ ఇరుక్కుం పడి ఎన్నైయాక్కి అంగాట్పడుత్తే”  శ్రీ రామానుజ!  నేను ఎల్లప్పుడూ మీ సేవకులను ఆదరించేటట్లుగా సంస్కరించమని కోరుతున్నాను. అదే మనందరం కోరుకోవలసినది.
 1. నిత్య విరోధి – నిరంతర అవరోధాలు (మనతో ఎల్లప్పుడూ ఉండే ఇంద్రియాలకు సంబంధించినది) ఆత్మతో ఇంద్రియాలు ఎల్లప్పుడూ ఉంటాయి. 10 ఇంద్రియాలు ఉన్నాయి:
 • పంచ జ్ఞానేంద్రియాలు – జ్ఞానం యొక్క 5 ఇంద్రియాలు – స్రోత్ర (చెవులు), త్వక్ (చర్మం), చక్షుర్ (కళ్ళు), జిహ్వా (నాలుక), గ్రాహ్ణ (ముక్కు)
 •  పంచ కర్మేంద్రియాలు – క్రియల యొక్క 5 ఇంద్రియాలు – వాక్ (నోరు), పాణి (చేతులు), పాద (కాళ్ళు), పాయు (విసర్జక అవయవాలు), ఉపస్థ (పునరుత్పత్తి అవయవాలు)

భగవానుడు జీవాత్మకు ఇంద్రియాలను ప్రసాదించాడు, తద్వారా వాటి సహాయంతో వారిని సేవించవచ్చు. ఇంద్రియాలు చాలా బలమైనవి మరియు శక్తివంతమైనవి. తిరువాయ్మొళి 7.1.6 లో నమ్మాల్వారు వివరిస్తూ, “విణ్ణుళార్ పెరుమాఱ్కు ఆడిమై చెయివారైయుం చెఱుం  ఐంపులనివై” – ఈ ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవి అంటే నిత్యసూరుల (భగవానుని నిత్య సహచరులు) నిష్ఠను కూడా కదిలించగలవు.  ఈ అంశంలో అడ్డంకులను చూద్దాము.

 • తిరువాయ్మొళి 3.2.1 లో నమ్మాల్వారు వివరిస్తూ “అన్నాళ్ తంత ఆక్కైయిన్ వాళి ఉళల్వేన్” నీవిచ్చిన ఈ శరీరం, ఇంద్రియాలు నన్ను వేధిస్తున్నాయి. కాబట్టి, మనం అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే ఇంద్రియాలు, వాటి సుఖానుభవములు ప్రధాన అడ్డంకులు అని అర్థం.
 • ఇంద్రియాలకు దాసులై  మరియు వాటికి సంబంధించిన కోరికలను నెరవేర్చుకొనుట ఒక అడ్డంకి.
 • కొంతమంది “నాకు అన్నీ తెలుసు, నా ఇంద్రియాలు నా నియంత్రణలో ఉన్నాయి” అని చాటుకుంటారు. ఇది ఒక పెద్ద అడ్డంకి. విశ్వామిత్రుల వంటి గొప్ప ఋషులు కూడా ఇంద్రియ లోలుడై  వారి మహిమను కోల్పోయారు. అనువాదకుని గమనిక: ఆళ్వారులు మరియు ఆచార్యులు వారి పాసురాలలో క్రూరమైన ఇంద్రియ సుఖాల పట్ల వారి  భయాన్ని వ్యక్తం చేశారు.  అటువంటిది ఇంద్రియాల ఆనందం యొక్క శక్తి. కాబట్టి ఇలాంటి ఉహించని ఆపదల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
 • మన భావాలను పూర్తిగా భగవత్ సౌందర్యం (భగవనుని అందం) పైన పెట్టి భాగవత కైంకర్యాన్ని విస్మరించుట ఒక అవరోధం. ఇంద్రియాల సుఖం ఒక రకమైన ఆపద అయితే, పూర్తిగా భగవత్ సౌందర్యంలో మునిగి తేలుట ఇంకొక  రకాలైన ఆపద అని నమ్మాళ్వారు గుర్తించినట్లుగా పెరియ తిరువంతాధి 34 లో “కాలాళు౦, నెంజళియుం, కణ్సుళలుం” ఎమ్బెరుమానుని సౌందర్యాన్ని చూసి, తక్షణం తడబడి పోయి నిలబడలేక, గుండె కరిగి తీవ్రమైన అనుభవం కారణంగా మూర్ఛ ప్రారంభమవుతుంది. అట్లాంటి స్థితిలో భగవత్ కైంకర్యం  మరియు భాగవతా కైంకర్యం విస్మరించే అవకాశం ఉంది.  శ్రీ రామాయణం అయోధ్య కాండం 1.1లో చెప్పినట్లుగా “సత్రుగ్నో నిత్య సత్రుగ్నః”  – శత్రుగ్నుడు శాశ్వత శత్రువును జయించాడు. పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ వాఖ్యాన్ని వివరిస్తూ ” శత్రుగ్నుడు శ్రీ రాముడు యొక్క సౌందర్యాన్ని జయించి (మరియు నిర్లక్ష్యం) నిరంతరం భరతుని సేవచేశాడు” అందుచేత భాగవతా కైంకర్యమార్గంలో వచ్చిన ఏదైనా అడ్డంకిగా పరిగణించబడుతుంది.
 1. అనిత్య విరోధి – తాత్కాలిక  అడ్డంకులు (శారీరక సుఖాలు మరియు అసుఖాలకు సంబంధించినది). అనిత్యం అంటే తాత్కాలికమైనది అని అర్థం – శరీర సుఖ దుఃఖాలు.  ఇది ఈ శరీరాన్ని తానుగా భావించి  సుఖాలు / దుఃఖాలను అనుభవించే వాటి చుట్టూ తిరుగుతుంది. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.
 • గంధం (సువాసనలు), పుష్పాలు మొదలైన వాటి నుండి ఆనందాన్ని పొంది, అదే నిజమైన సుఖంగా భావించుట ఒక అడ్డంకి.
 • ఆయుధాల దాడి  లేదా విషం దాడి మొదలైన వాటి ద్వారా కలిగే  బాధను, నిజమైన దుఃఖంగా భావించుట ఒక అడ్డంకి.
 • లౌకిక లాభాలను పొందినపుడు సంతోషించి, అలాంటి లాభాలను పొందనపుడు దుఃఖించుట కూడా ఒక అడ్డంకి.

అందువల్ల శారీరక సుఖ దుఃఖముతో కలవరపడకుండా  ఎప్పుడూ సమతుల్యంగా ఉండాలి.  అనువాదకుని గమనిక: భగవత్ గీత యొక్క రెండవ అధ్యాయం లో, శ్రీకృష్ణుడు ఆత్మ మరియు శరీరానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి  వివరించారు. మనం ఎప్పుడూ ఆ అవగాహన కలిగి ఉండి  శరీర సౌకర్యాలు / అసౌకర్యాలను ఒక సమిష్టి పద్ధతిలో ప్రవర్తించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-4.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ – లో చూడవచ్చు.

<< విరోధి పరిహారాలు – 2

 

17. ఉపాయ విరోధి  – ఉపాయంలో అడ్డంకులు (మాధ్యమాలు / ప్రక్రియలు). సరిగ్గా అర్ధం చేసుకోవటానికి ఈ క్రింది అవరోధాలు వివరించబడ్డాయి.

 • “సిద్దోపాయుడైన భగవాన్ మోక్షానికి  అత్యుత్తమమైన ఉపాయంగా పరిగణించాలి. కాబట్టి, సిద్దోపాయ నిష్టుడు (ప్రపన్నుడు) భగవంతుడు కాకుండా కర్మ యోగము వంటి ఇతర వాటిని ఉపాయంగా పరిగణించరాదు.  అటువంటి ప్రక్రియలను పరిగణనలోకి తీసుకుంటే దానికదే అడ్డంకి.
 • కర్మ యోగమును సిద్దోపాయానికి సమానంగా భావించడం ఒక పెద్ద అడ్డంకి. (అనువాదకుని గమనిక: మనం గత సూత్రాల వ్యాక్యానాలలో చూసినట్టుగా ఇతర ఉపాయాలు  అచేతనమయినవి. భగవాన్ గొప్ప చేతనుడు – అందువల్ల వాటికి సమవంతం చేసే ప్రశ్నే లేదు – భగవానుడు ఉపాయం అనేదే అత్యంత మహిమాన్వితమైనది).
 • భగవానుడు ఉపాయం” గా స్వీకరించుట, ఎమ్బెరుమాన్ కృప యొక్క ఫలితం కూడా. ఇది మన కర్మ ఫలితంగా పరిగణించుట ఒక అడ్డంకి.
 • సాధారణంగా  “భగవాన్ ని ఉపాయంగా”  మన అంగీకారాన్ని ఒక విధంగా వివరించాలంటే “సర్వ ముక్తి ప్రసంగ పరిహార్థం” గ చెప్పవచ్చు – అంటే “భగవాన్ అంగీకారాన్ని ఆశించకుండానే ముక్తిని ఇస్తే, ఇప్పటికె అందరికీ మోక్షాన్నిప్రసాదించి ఉండేవారు, అందుచే భగవాన్  వారిని ఉపాయంగా  స్వీకరించిన వారికే ముక్తిని ఇవ్వాలని ఎంచుకుంటారు”. ఇది మన పూర్వాచార్యుల వ్యఖానాలలో మరియు రహస్య గ్రంథాలలో వివరించబడింది. నమ్మాళ్వారు ఈ సూత్రాన్ని తిరువాయ్మోళి 4.10.6 వ  పాశురంలో “ఎల్లీరుం వీడు పెఱ్ఱాళ్ ఉలగిల్లై” – (ఈ సంసారంలో ప్రతి ఒక్కరూ మోక్షం  పొందినట్లయితే శాస్త్రాలకి ప్రయోజనం ఉండదు). నంపిళ్ళై వివరించినట్లుగా మోక్షాన్ని అందరికి ప్రసాదించకుండా భగవానుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ఆదుకున్నారు. పిళ్ళైలోకాచార్యులు కూడా ముముక్షుపడిలో ఇదే సూత్రాన్నివివరించారు.  కాని దానికే ప్రాధాన్యత ఇవ్వడం (సర్వ ముక్తి ప్రసంగాన్ని తప్పుకోవటానికి మాత్రమే భగవానుడు వారిని ఉపాయంగా అంగీకరించిన మొక్షాన్ని ప్రసాదిస్తున్నారు అని కారణంగా భావించడం) ఒక అడ్డంకి. (అనువాదకుని గమనిక: భగవాన్ సర్వస్వతంత్రుడు, అతను ఏ ప్రత్యేకమైన తార్కికంతో ముడివేయ లేము – అందువల్ల సర్వ ముక్తి ప్రసంగాన్ని తప్పుకోవటానికి మాత్రమే భగవానుడు వారిని ఉపాయంగా అంగీకరించినవారికే మోక్షాన్ని ప్రసాదిస్తున్నారని అనుకోలేము).
 • ఎమ్బెరుమాన్ని ఉపాయంగా స్వీకరించినా లేకపోయినా దానికి సంబంధం లేకుండా చిత్ మరియు అచిత్తులందరిని సంరక్షించువారు భగవానుడు. “భగవానుడే ఉపాయం” అను ఈ అంగీకార స్వీకారం, జీవాత్మను అచిత్ నుండి వేరు చేస్తుంది. జీవాత్మ చిత్తుడు – జ్ఞానం / తెలివి కలిగినవాడు. అచిత్ జ్ఞానం లేనిది – ఎటువంటి మేధస్సు లేనిది (అందుచే భగవానుని ఉపాయంగా అంగీకరించ లేనిది). కనుక జీవాత్మ తన జ్ఞానంతో సహజంగా ఎమ్బెరుమాన్ని ఉపాయంగా స్వీకరిస్తారు. ఈ సహజమైన ప్రవర్తనను ఒక ఉపాయంగా పరిగణించడం ఒక అడ్డంకి. (అనువాదకుని గమనిక: “నా స్వీకారం”  ఉపాయం, అని మనం అనుకోకూడదు,  భగవాన్ ఉపాయం, అనే మన అంగీకారం కేవలం మన జ్ఞానం యొక్క సహజ ఫలితం).
 • అచిత్ లాగానే జీవాత్మలు కూడా పూర్తిగా ఎమ్బెరుమాన్ అధీనంలో ఉంటారు. భగవానుని జీవాత్మ స్వతంత్రంగా స్వీకరించి లేదా తిరస్కరించ వచ్చని అనుకోలేము (అనువాదకుని గమనిక:   ఎమ్బెరుమాన్ తలచుకుంటే  ఏ ఆత్మనైనా ప్రభావితం చేయగలడు – కాని అలా చేయడు).

అందువల్ల ఉపాయాన్ని  సరిగా అర్థం చేసుకోవటానికి పైన చెప్పినవి అడ్డంకులుగా వివరించబడ్డాయి.18. ఉపేయం విరోధి – ఉపేయంలో అడ్డంకులు (లక్ష్యం).ఉపేయం అనగా ఉపాయాన్ని అనుసరించడం ద్వారా సాధించేది అని అర్థం. ఈ క్రింద వివరించినవి ఉపాయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవటంలో అవరోధాలుగా వివరించబడ్డాయి.

దివ్య దంపతులకి శాశ్వతమైన కైంకర్యం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపేయం (లక్ష్యం)
 1. భగవతుపాయనుడు – ప్రపన్నుడు కేవలం భగవానుడే ఉపాయంగా భావించేవాడు. అతను కేవలం భగవానుడి కైంకర్య సాధన మాత్రమే లక్ష్యంగా ఉంచుకోవాలి. లౌకిక ప్రయోజాలను మొదలైనవి కోరుటను, “ఏ కోరికనైనా తీర్చగలిగే కల్ప వృక్షాన్నిఒక చిన్న కోరిక కోరినట్లు” తగనిదిగా వివరించబడింది. ఎమ్బెరుమాన్ నుండి ఇతర ప్రయోజనాలు కోరడం ఒక అడ్డంకి.
 2. కర్మ, జ్ఞాన, భక్తి యోగం వంటి ఇతర ఉపాయాల ద్వారా భగవానుని ఉపాసించడం ఒక అడ్డంకి (అనువాదకుని గమనిక: భగవతాధీనుడైన జీవాత్మకి భగవానుని ఉపాయంగా  స్వీకరించడం సహజమైనది. స్వప్రయత్నాలు జీవాత్మ యొక్క స్వభావానికి వ్యతిరేకమైనవి) .
 3. భగవత్ కైంకర్యం చేస్తున్నప్పుడు “ఈ కైంకర్యం నేను స్వతంత్రంగా చేస్తున్నానని” భావించరాదు. భగవానుడు భగవద్గీతలో 3.27 లో “అహంకార విమూడాత్మా కర్తా అహం ఇతి మన్యతే) –  అహంకార (అహం) అయోమయంలో, జీవాత్మ మొర్ఖత్వంతో తానే చేస్తున్నాడని భావిస్తున్నాడు. ఇటువంటి అహంకరం ఒక అడ్డంకి.
 4. అకర్తగా భావించుట, కైంకర్యం పట్ల నిరాసక్తి చూపించరాదు. (అనువాదకుని గమనిక: శ్రీవాచన భుషణ దివ్య శాస్త్రంలో వివరించినట్లుగా, కైంకర్యాలు శాస్త్రాలు మరియు ఆచార్యుల మార్గదర్శకత్వంలో గొప్ప కోరిక మరియు అంకితభావంతో చేయాలి).
 5. భగవంతునికి / ఆచార్యులకు చేసిన కైంకర్యం నుండి తానూ ఆనందాన్ని పొందుట. నమ్మాల్వార్ తిరువాయ్మోలి 2.9.4 లో వివరించారు ” తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీతే” – భోగించేవాడు (ఆనందించేవాడు) భగవానుడు మాత్రమే. “భోక్తా” అనగా ఒక చర్య యొక్క ఫలాలను అనుభవిస్తున్న వాడు అని అర్థం. భగవనుడే నిజమైన భోక్తా. కాబట్టి, జీవాత్మ స్వతంత్రంగా ఆస్వాదించే ఆస్కారమే లేదు. జీవాత్మ స్వతంత్రముగా ఆనందించాలానే కోరిక కలిగి ఉండటం ఒక అడ్డంకి.
 6. భోగ్యం అంటే ఆస్వాదించబడినది అని అర్థం. భగవంతుని సంపూర్ణ ఆనందం కోసం జీవాత్మ వారి పరాధీనుడై  తనను తాను పూర్తిగా అంకితం చేయాలి. భగవనుడు ఆనందించి, వారి ముఖంలో ఆనందం కనబరిచినప్పుడు, జీవాత్మ ఆనందంతో ప్రతిస్పందించాలి. కుళశేఖర ఆళ్వార్ దీనిని పెరుమాళ్ తిరుమ్మోహి 4.9 లో “పడియాయ్క్  కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బెనే” అని వివరించారు – నీ సన్నిధి ద్వారం దగ్గర ఒక చెప్పులా పడిఉంటాను (చేతనం లేని అచిత్ మాదిరిగా) మరియు  ఆనందంతో చిరునవ్వును చిందించిన మీ ఆధారాలను చూచి ప్రతిస్పందిస్తాను (జ్ఞానం ఉన్న చిత్ మాదిరిగా). (అనువాదకుని గమనిక: పవిత్రమైన మన సత్ సాంప్రదాయం యొక్క అత్యోన్నతమైన సూత్రంగా పిలవబదిన ఈ  “అచిత్వత్  పారతంత్రియం” సూత్రం  – అచిత్ వలె భగవదాధీనులుగా, కాని మళ్ళీ భగవంతుడు ఆనందాన్ని వెల్లడిచేసినప్పుడు ఒక జీవాత్మ వలె ఆనందంతో ప్రతిస్పందించుట వంటిది). ఈ సూత్రం (స్వతంత్రముగా ఆనందించాలానే కోరికను నిర్మూలించడానికి) “నమః” అను ద్వయ మహామంత్రం యొక్క రెండవ భాగంలో వివరించబడింది. ఆలవందారులు వారి స్తోత్ర రత్నం 46 లో “కదా…..ప్రహర్శయిశ్యామి” –  భగవదానందంకై పరితపించుట. భగవదానందాన్ని జీవాత్మ ప్రతిస్పందించినపుడు, భగవానుడు సంపూర్ణ ఆనందాన్ని పొందుతాడు. భగవదానందమే మన కైంకర్య ఏకైక లక్ష్యం. ఏ ఇతర మార్గాలని కోరుకొనుట ఆశించుట ఒక అడ్డంకి.

19. ఉపేయత్రి విరోధి  – ఉపేయం లో మరిన్ని అడ్డంకులు (లక్ష్యం)మునుపటి వివరణను పొడిగించి ఇక్కడ కొన్ని అడ్డంకులు చూపబడ్డాయి. ఉపాయ సాధన ఫలితంగా ఉపేయం లభించును. ఒక శ్రీవైష్ణవ ప్రపన్నునికి, భగవంతుడే ఉపాయం(మాధ్యమం) మరియు ఉపేయం(లక్ష్యం) కూడా.  భగవంతుడే ఉపేయం అనగా పరమపదంలో భగవంతుడిని చేరుట, తన అత్యంత పవిత్రమైన కళ్యాణ గుణాలను పరమానందించుట, అతనిపట్ల పూర్తి ప్రేమపూర్వక అనుబంధాన్ని అభివృద్ధి చేస్తూ చివరకు అతనికి నిరంతర కైంకర్యం చేయుట.  దీనిని “భగవత్ అనుభవ జనిత ప్రీతి కారిత కైంకర్యం” అని పిలుస్తారు. ఇది అంతిమ లక్ష్యం. ఇప్పుడు ఈ ఫలితానికి మధ్యలో వచ్చే అడ్డంకులను చూద్దాము.

  1. ఒక ప్రత్యేక లక్ష్యాన్ని (గతంలో వివరించిన కైంకర్యం కంటే ఇతర) కోరుకోవడం. ఈ వైఖరి శ్రీ వైష్ణవ ప్రపన్నులకు తగినది కాదు మరియు అది ఒక అడ్డంకి.
  2. సంపద, ఆహార వస్త్రాలు, ఇల్లు, భార్య, పిల్లలు, కీర్తి, మొదలైనవి వంటి ద్రుష్ట ఫలాలు (ప్రాపంచిక ప్రయోజనాలు – ఈ జీవితంలో ఆశించి చూడాలనుకున్నవి మరియు ఆనందించాలనుకున్నవి). భగవంతుడిని సేవించి పొందిన పరమానందానికి పోలిస్తే ఈ ప్రాపంచిక ఫలితాలు చాలా అల్పమైనవి. కాబట్టి అటువంటి అనురాగాలు, ఆశలు కలిగి ఉండుట అడ్డంకి.
  3. అదృష్ట ఫలాలను ఆశించుట (ఉన్నత లోకాల ప్రయోజనాలు – ఈ జీవితంలో చూడలేనివి మరియు అనుభవించలేనివి). ఇవి రెండు అంశాలుగా వర్గీకరించవచ్చు:
   • స్వర్గలోక ప్రపంచాలలోని ఆనందాలను ఆశించుట (బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైనవారి నివాసాలు). ఇది ఒక అడ్డంకి.
   • అపరిమిత ఆనందంతో నిండి ఉన్న పరమపదంలోని (అత్యున్నతమైన నివాసం) భగవంతుడిని సేవించుటయే అమితమైన ఆనందం.  అలాంటి స్థితిని కోరుకోకపోవడం అనేది ఒక అడ్డంకి – అనగా, శాశ్వతమైన కైంకర్యాన్ని ఆశించాలి కోరుకోవాలి.
  4. భగవత్ కైంకర్యం ఆపడం ఒక అడ్డంకి. భాగవత కైంకర్యం అని పిలువబడే తదీయారాధనం ( తదీయులను ఆరాధించడం – భగవాన్ భక్తులు), భగవత్ ఆరాధనం (భగవానునికి కైంకర్యం) కంటే ఉన్నతమైనది. తదీయారాధనం అంటే ప్రసాదంతో భక్తులకు తినిపించడమే కాదు – వారికి సేవ చేయటం మరియు సరైన శ్రద్ధ వహించడం వంటివి అని అర్ధం.
ఎమ్బెరుమానార్ యాత్రా సమయంలో  కొంగు పిరాట్టి అందంగా చేస్తున్న భాగవత కైంకర్యం 

5.  భాగవత కైంకర్యాన్నితక్కువగా (భగవత్ కైంకర్యంతో పోల్చి) పరిగణించుట ఒక పెద్ద అడ్డంకి.6. ఏదో కొంత ఆచార్య కైంకర్యంతో సంతృప్తి పొందుట ఒక అడ్డంకి. భాగవతులందరిలో ఆచార్యులు ప్రథములు.   పూర్తి సంతృప్తి ఎవరూ పొందలేరు – ఆచార్యుల కైంకర్యం ఇంకా ఇంకా కావాలనే నిరంతర తపన, కోరిక ఉండాలి. ఆకలితో ఉన్న వ్యక్తి తనకు ఏది వడ్డించినా తింటాడు మరియు ఏది వండినా తినడానికి ఉత్సాహంగా ఉంటాడు. అలాగే, తన ఆచార్యుల కోసం అన్ని రకాల కైంకర్యాలకు శిష్యుడు కోరుకోవాలి, సిద్ధంగా ఉండాలి. “ఆచార్యునికి నేను చాలా చేసాను” అని అనుకోవడం ఒక అడ్డంకి.

నమ్మాల్వారి కైంకర్యంలో మధురకవి ఆళ్వార్

ఎమ్బెరుమానార్ కైంకర్యంలో నిమగ్నమై ఉన్న వడుగ నంబి

సారాంశంగా,  భగవత్ కైంకర్యం తో ఆగకుండా – క్రమేణా భాగవత కైంకర్య పరివర్తనం ఉండాలి. మరియు, భాగవతోత్తములైన ఆచార్యులను  గొప్ప ఆసక్తితో ఉత్సాహంగా సేవించాలి. ఇది మధురకవి ఆళ్వారుల కణ్ణినున్ చిఱుతాంబు 9 వ పాసురంలో “శటగోపన్ ఎన్ నంబిక్కు ఆట్పుక్క  కాతల్ అడిమై ప్పయనన్ఱె ” లో వివరించారు – నిండా పవిత్రమైన కళ్యాణ గుణాలున్న నమ్మాల్వార్  కు ప్రేమపూర్వకమైన సేవ చేయాలనేది నాకు తగిన కర్తవ్యము.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-3.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 18

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 17

దరిలేని ఆనందములో వివిధ అనుభవాలు

భగవద్గీత 10 వ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో “మచ్చిత్తా మత్ గత ప్రాణా బోధయంతః  పరస్పరం – కతయం తస్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ”

ఎవరైతే నన్ను ఎప్పుడూ చింతిస్తారో నన్ను ఆత్మార్థంగా భక్తి చేస్తారో వాళ్ళు పరస్పరం నాగురించి బోధించుకుంటూ,  నాగురించి మాట్లాడుతూ ఆనందాన్ని, తృప్తిని పొందుతుంటారు అని అర్థం.

               ఈ శ్లోకం భక్తుల మధ్య జరిగే సంభాషణ, దానివలన వాళ్ళు పొందే అనందం, పరస్పరం బోధించు కోవటం గురించి చెప్తున్నది. మనవాళ మాముణులు తమ ఉపదేశ రత్నమాల చివరలో ఒక్కోక్కరు వారి వారి స్వభావానికి తగినట్లుగా గుణాతిశయాన్ని పాడుతారని అన్నారు.

ఇలాంటి శ్లోకాల అర్థం వివరించడంలో భగవద్రామానుజుల వైఖరి ప్రత్యేకమైనది. ఈ భగవద్గీతా  శ్లోకం చివరలో  ‘తుష్యంతి చ  రమంతి చ’ అన్న ప్రయోగం రసవత్తరమైనది. తృప్తి చెందడం, సంతోషించటం అని రెండు పదాలలో చెప్పటం ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది.

శంకర భగవత్పాదులు, ‘తుష్యంతి – పరితోషం ఉపయంతి, రమంతి రతిం చ ప్రాప్నువంతి ప్రియ సంగత్యా ఇవ” అన్నారు. అర్థాత్  ‘తుష్యంతి – అన్న ప్రయోగం  సంతోషం పొందటాన్ని , రమంతి – అన్నప్రయోగం  కోరుకున్న వస్తువును పొందటాన్ని తెలియజేస్తుంది అని అన్నారు కానీ, ఆ సంతోషంమో, కోరుకున్న వస్తువో ఎలా పొందాలో వివరించలేదు.

శ్రీమద్వాచార్యులు కూడా ఈ శ్లోకానికి అర్థాన్ని వివరించలేదు.

దీనికి భగవద్రామానుజులు   ‘వక్తారః  తత్వచనేన అనన్య ప్రయోజనేన తుష్యంతి!

శ్రోతారచ్చ తశ్రవణేన  అనవధికాతిశయ ప్రియేణ రమంతే!”=======

రామానుజులవారు  చేసిన అన్వయం  అసామాన్యమైనది. ఈ అన్వయం, పై శ్లోకార్థాన్ని చక్కగా వివరిస్తున్నది. పరమాత్మను గురించి చర్చించుకునేవాళ్ళు ఆ చర్చ వలననే ఆనందాన్నిపొందుతారు. వారికి  వేరే లక్ష్యాలు లేవు. వేరే ఆనందమే లేదు అన్నారు.

ఈ వివరణ చాలా గొప్పది ఎందుకంటే, ‘ తుష్యంతి చ  రమంతి చ ‘ అన్న రెండు పదాలకు అర్థాన్ని చెపుతుంది.

కృష్ణుడు “బోధయంతః పరస్పరం” అన్నాడు.

వాళ్ళు పరస్పరం నా గురించే రాస్తున్నారు చెపుతున్నారు, మాట్లాడుతున్నారు,అని చెప్పి,

ఇంకా, “మాం నిత్యం కథయంతి” అన్నారు.

వాళ్ళు నాగురించే మాట్లాడుతున్నారు. అందులో ఒకరు వక్త, మరొకరు శ్రోత. ఇద్దరు వాళ్ళ స్టితిని మార్చుకుంటూ వుంటారు. మరొకసారి వీరు వక్త, వారు శ్రోత అవుతారు. అందువల్ల ఇద్దరు విని ఆనందిస్తారు, మాట్లాడి ఆనందిస్తారు అన్నారు. వేదాంత దేశికులు తమ తాత్పర్యచంద్రికలో

“కతాయా శ్రవణయో ఎకస్మిన్నేవ కాల భేదేన సంభావితవత్”

(ఇద్దరు వినటం, మాట్లాడటం వేరు వేరు కాలలో జరుగుతుంది) అన్నారు .

                   గీతా శ్లోకాన్ని బాగా పరిశీలించి రామానుజులవారు ఈ అర్థాన్ని చెప్పారు. తిరుమంగై ఆళ్వార్ల అనుభవమే  ఈ అర్థం చెప్పడానికి వీరికి మూల ప్రమాణంగా అమరింది.  ఆళ్వార్లు  తమ నాన్ ముగన్ తిరువందాదిలో

“తెరిందెళుది వాసిత్తుం కేట్టుం ….పోక్కినేన్ పోదు”

(తెలుసుకొని, చదివి, విని పొద్దుపుచ్చాను.) అని అన్నారు. బోధయంతం పరస్పరం –తెలుసుకొని అంటే తెలియబరచి లేక మాట్లాడి, కతయంతస్చ మాం  నిత్యం తుష్యంతి చ – విని, అంటే చెవులతో విని, రమంతి చ — పొద్దు పుచ్చటం. పరమాత్మతో అనవతరం ఉన్నట్లు చెప్పటము- మాం నిత్యం కతయంతా. అదే పాశురంలో ఆళ్వార్లు “తరిత్తిరున్దేనాగవే ‘ (ప్రాణాలు తరించి ఉన్నాను ) అనవతరం పరమాత్మతో పొద్దు పుచ్చటం వలన ప్రాణాలు తరించి ఉన్నాను‘ అన్నారు. “మచ్చిత్తా మత్ గత ప్రాణా” అన్న దానిని రామానుజులవారు  ‘మయా వినా ఆత్మ తారణం అలాభమానాః’ నేను లేకపోతె తరించి ప్రాణాలు నిలుపుకోలేని వారు. అని వివరించారు.

రామానుజులవారు ఈ విధంగా పై గీతా శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పటానికి తిరుమళిశై  ఆళ్వార్ల ఈ పాశురమే మూలప్రమాణమైనది. ఈ శ్లోకానికి అర్థం, ‘తిరుమళిశై పిరాన్ వంటి దాసులు నేను లేకుండా తరించ లేరు, అందువలన నేను నిరంతరం వారి చింతనలో ఉంటాను. దీనికి నా భక్తులు నిరంతరం బోధయంతం పరస్పరం అని చెప్పుకుంటూ, వింటూ, ఆనందిస్తూ, ఆనందింప చేస్తూ, ఉజ్జీవిస్తారు’ అని కృష్ణుడి భావన అని రామానుజులవారు వివరించారు .

ఆళ్వార్ల శ్రీసూక్తులు విలంభనం లేకుండా అనుభవించడం వలననే  రామానుజులవారు  మనకు ఇంత చక్కని  అర్థాన్ని అందించగలిగారు .

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/16/dramidopanishat-prabhava-sarvasvam-18/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 17

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 16

అంతులేని వాత్సల్యం

              భగవద్రామానుజులు తమ శరణాగతి గద్యంలో ‘ అఖిలహేయ ప్రత్యనీక ‘ అని మొదలుపెట్టి పరమాత్మ దివ్యనామాలనేకం అని చెప్పారు. ఇందులో వీరు నామాలన్నింటిని సంబోధనాత్మకంగానే ప్రయోగించారు.

భగవద్రామానుజులు, ‘మహావిభూతే! శ్రీమన్నారాయణా!  శ్రీవైకుంఠనాథా! అని సంభోదించిన తరవాత స్వామి దివ్యగుముణములను పేర్కొంటూ ‘అపారకారుణ్య సౌశీల్య వాత్సలౌధార్య సౌందర్య మహోధదే! ‘అని వర్ణించారు. పరమాత్మా లోతైన, అందమైన, కళ్యాణగుణ మహాసముద్రుడు. వీరి కళ్యాణ గుణాలు అంతులేనివి, అనుభవానికి అంతులేనివి, అపార మైనవి. ఈ లోకంలోని జీవాత్మలను తరింప చేసే ఆయన స్వరూపము దయ, సౌలభ్యము,  స్వామిత్వం, సౌదర్యం, వాత్చల్యం అంతులేనివి. వీటిలో వాత్సల్యం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము .

వాత్సల్యం :

                      చేతనుల దోషాలకు దండించకుండా ఆ దోషాలను కూడా అనుభవించే స్వభావము. కొందరు జ్ఞానులు ఆయన దోషాలను భిన్నం అంటారు. ఇక్కడ ఆ వివాదం మనకు అప్రస్తుతం . ఈ గుణము తల్లిప్రేమలో చూడవచ్చు. తల్లి తన బిడ్డలో దోషాలున్నా వాటితో సహా ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో నిబంధనలు ఏవి ఉండవు.               ‘ ‘వత్చ’ అంటే ఆవు దూడ. అప్పుడే పుట్టిన దూడ శరీరానికి అంటుకొని వున్న మాలిన్యాన్ని ప్రేమతో తన నాలుకతో నోటిలోకి తీసుకుంటుంది, ఆ ప్రేమయే వాత్సల్యం. అలాగే జీవాత్మ విషయంలో పరమాత్మా చూపేది ఎల్లలు లేని వాత్సల్యం.

                      భగవద్రామానుజులు శరణాగతి గద్యంలో ‘ ఆశ్రిత వాత్సల్య జలధే ‘ అంటారు. అంటే పరమాత్మా ఒక్క వాత్సల్యం గుణంలోనే సముద్రమంతటి వాడు! భగవద్రామానుజులు ఈ వాత్సల్య గుణాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెపుతున్నారు? అని చూస్తే  పరమాత్మ గుణాలన్నింటిలో ఈ గుణమే చేతనుల మనసును కరిగించే శక్తి గలది అమితాశ్చర్యకరమైనది. రామానుజుల వంటి పరమ భక్తి గలవారికి ఈ గుణానికి కరిగి పోతారు. తమ దైవీకమైన అనుభవంలో దానినే మళ్ళీ మళ్ళీ చెపుతుంటారు.

           ఆళ్వార్లు తమ ప్రబంధాలలో కూడా పరమాత్మ వాశ్చల్య గుణాన్ని ఎంతగానో కీర్తించడం కనపడుతుంది.

           శ్రీనివాసుడిని  నమ్మాళ్వార్లు ‘అగల కిల్లెన్ ఇఱైయుం ఎన్రు అలర్మేల్ మంగై ఉరై మార్బా‘ అని కీర్తించారు.  పరమాత్మ శ్రీహృదయాన్ని అమ్మవారు క్షణ కాలమైనా విడవకుండా ఉంటుంది. దాసులు ఆయనను ఆశ్రయించేసమయంలో ఆమె ఆయనలోని గుణాలను ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపింపబడిన గుణాలలో ఈ వాత్సశ్చల్య గుణమే ముందు నిలుస్తుంది. ఇందులో ఆశ్చర్య పడవలసిన విషయం ఏది లేదు ఆమె సహజంగానే వాత్సల్య గుణోజ్వల, అందువలన అయనలోను ఆ గుణాన్నే ప్రేరేపిస్తుంది .

                వాత్సల్య గుణము లాగా మరొక గుణము లేదు అని తెలిసే భగవద్రామానుజులు ఇతర గుణాలకన్నా ఈవాత్సల్య  గుణాన్నే ప్రత్యేకంగా చెప్పారు. మన పూర్వాచార్యులు అనవసరముగా ఒక్క మాటను వాడటం గాని, చెప్పటం గాని జరగదు. రామానుజులు, ‘అపార కారుణ్య సౌశీల్య  వాత్సలౌధార్య సౌందర్య మహోధదే!’  అని ముందు పరమాత్మ అపూర్వ గుణాలను  చూపి, తరువాత వాటితో కూడి వున్న వాటికన్నా ప్రత్యేకమైన గుణమైన వాత్సల్యమనే గుణాన్ని ప్రయోగించారు. ‘ఆశ్రిత వాశ్చల్య జలధే!’ అని అన్నారు. ఈ వాత్సల్య గుణం పరమాత్మా గుణ సముద్రంలోనిదే అయినా ఇది ప్రత్యేకమైనది గొప్పది అసామాన్యమైనది అనితెలుస్తున్నది.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/15/dramidopanishat-prabhava-sarvasvam-17/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

గీతాచార్యులు అర్జునునికి ప్రపత్తి సూత్రాన్ని స్పష్టంగా వివరించారు

ఎమ్పెరుమానారు ప్రపత్తి సూత్రాలను శరాణగతి  గద్యం  మరియు గీతా భాష్యం ద్వారా నమ్మాల్వారి పాసురాలను ఉపయోగించి విస్తృతంగా వివరించారు.

10. ప్రపత్తి నిష్ఠానుక్కు కర్మాధ్యుపాయంగళ్ విరోధి – ప్రపత్తిపై దృష్టి కేంద్రీకరించినవారికి కర్మ, జ్ఞాన, భక్తి మొదలైన ఉపాయాలు అడ్డంకులు.

11. ప్రపత్తి ఉపాయ నిష్ఠానుక్కు ఇతరోపాయంగళ్ విరోధి – ప్రపత్తిని నిర్వహిస్తున్నవారికి, ఇతర ఉపాయాలు (కర్మ, జ్ఞాన, భక్తి వంటివి) అడ్డంకులు.

ఈ సంసారంలో పునరావృతమయ్యే జన్మ / మరణం నుండి ఉపశమనం పొంది, పరంపదం చేరుకున్న తరువాత, భగవన్ కు నిత్య ఆనందకరమైన సేవలో పాల్గొనడాన్ని మోక్షం అంటారు. అటువంటి మోక్షాన్ని సాధించడానికి అనేక ఉపాయాలు (మాధ్యమాలు / విధానములు) ఉన్నాయి. మన శాస్త్రాలలో, ప్రధానంగా 4 ఉపాయాలు చెప్పబడ్డాయి – కర్మ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము మరియు ప్రపత్తి.

 • కర్మ యోగము –  శాస్త్రాదేశాలను అనుసరించుకుంటూ మూడు త్యాగాలు, ప్రత్యేకంగా కర్తృత్వ త్యాగం (నేనే కర్తను), మమతా త్యాగం (ఇది నా బాధ్యత) మరియు ఫల త్యాగం (ఫలితం నాది) వంటి కార్యాలు భగవంతునికి  సేవగా బావించి చేయుడమే కర్మ యోగము.
 •  జ్ఞాన యోగము – కర్మ యోగాన్ని అనుసరించుట ద్వారా మనస్సు శుద్ధి పడి ఆత్మ యొక్క నిజమైన స్వభావం అర్థం చేసుకోవచ్చు (తమను తాము). అటువంటి  స్థితిలో  స్థిరంగా ధ్యానించుటయే జ్ఞాన యోగము అంటారు.
 • భక్తి యోగము – నిరంతరం జీవాత్మలో పరమాత్మ ఉంటారన్న నిజాన్ని అర్థం చేసుకొని, నిరంతరం భగవానునికి ప్రేమ పూర్వకమైన భక్తిని చూపించడమే భక్తి యోగము అంటారు.
 • ఇంకా, దివ్య దేశాలలో నివసిస్తూ, అర్చావతార రూపంలో ఉన్న ఎమ్పెరుమాన్ ని  సేవిస్తూ, సన్నిధిలో దీపాలు వెలిగించి, పూల దండలు తయారు చేసి, వాటిని ప్రేమతో అర్పించడం, దేవాలయాలు శుద్ధి చేయడం మొదలగునవి మోక్ష సాధనాలు.
 • తిరునామ సంకీర్తనం (భగవన్ యొక్క అనేక నామాలను కీర్తించడం) మోక్ష సాధనానికి అద్భుతమైన మార్గంగా చెప్పబడింది. ఇది కురుక్షేత్రంలో భీష్మ పితామహులచే యుధిష్ఠిరునికి వివరించబడింది.

కానీ ఇవన్నీ జీవాత్మ యొక్క స్వతంత్ర ప్రయత్నాలపై ఆధార పడి ఉంటాయి. ఈ మార్గాలను జీవాత్మ నిష్ఠగా ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. జీవాత్మ ఇటువంటి ప్రయత్నాలను అనుసరించి తద్వారా భగవనుని మెప్పించి చివరికి వారిచే మోక్షాన్ని పొందుతాడు. ఈ ప్రక్రియలన్నింటిలోను సుదీర్ఘమైన పరిశీలన ఉంటుంది అంటే మోక్షాన్ని పొందే ముందు అనేక జన్మలు పొందాల్సి వస్తుంది.

ప్రపత్తి – ఎమ్పెరుమాన్ ని ఆశ్రయించి వారినే ప్రార్థిస్తూ “ఓ భగవాన్! నాకు మోక్షాన్ని ప్రసాదించమని నిర్దేశిస్తూ,  నాది ఏమీ లేదు, నేను ఏ ఇతరులను ఆశ్రయించను. నేను నిన్నే పూర్తి శరణు వేడుకుంటున్నాను. దయచేసి ఈ ఆత్మను స్వీకరించు”. నమ్మాల్వార్ తిరువాయ్మొళి 5.7.1 పాసురంలో “నోఱ్ఱ నోన్బిలేన్, నుణ్ణఱివిలేన్, ఆగిలుం ఇని ఉన్నై విట్టు ఒన్రుం ఆఱ్ఱగిన్రిలేన్ అరవినణై అమ్మాణే” మరియు తిరువాయ్మొళి 6.10.10 లో ” తిరువేంగటత్తానే! ఉన్నడిక్కీళమర్తు పుగుంతేనే“. స్తోత్రరత్నంలో ఆలవందార్ వివరిస్తూ ” త్వత్పాద మూలం చరణం ప్రపద్యే” అన్నారు.

“చరణం ప్రపద్యే” అంటే, “ఆశ్రయం తీసుకునే చర్య” అంటే మార్గమని అనుకోవచ్చు. కానీ ఇది నిజం కాదు. ప్రపత్తి స్థానంలో, స్వయంగా భగవనుడే ఉపాయము. శాస్త్రంలో శరణాగతిని ఇలా వివరించారు.  “త్వమేవ ఉపాయ భూతోమే భవా’ ఇతి ప్రార్థనా మతి:” శరణాగతి అంటే –  నీవు మాత్రమే నాకు ఉపాయం అను గాఢమైన విశ్వాసం ఉంచి ప్రార్థించడం”). భగవత్గీతలో,  భగవాన్  ఇలా ఆదేశించారు, ” సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ” – పూర్తిగా అన్ని ఇతర ఉపాయాలను విడిచిపెట్టు నన్నే ఉపాయంగా స్వీకరించు. 10 వ సూత్ర వ్యాఖ్యానంలో, వాంగి పురత్తు నంబి వివరిస్తూ అన్నారు, “ప్రపత్తి అనే పదాన్ని సూచిస్తూ  సూచించిన సర్వేశ్వరుడు మాత్రమే ఉపాయము” అని వ్యాఖ్యానించారు. సిద్ధం అంటే నిరూపించబడినది అని అర్థం – ఆహారం తయారుచేసి సమర్పించబడిన వంటిది. సాధ్యం అంటే “స్థాపించబడినది” – దాన్యం, కాయకూరలు మొదలైనవి.  విడిగా వండి తినేవి.  భగవానుని ఉపాయంగా  అంగీకరించడం అనేది సిద్ధోపాయ వరణంగా పిలువబడుతుంది. దీనినే  శరణాగతి, ప్రపత్తి అని పిలువబడుతుంది. అందువల్లనే భగవాన్ తనను తానూ ప్రపత్తి మరియు సిద్ధోపాయంగా  10 వ సూత్రానికి సంబంధించిన వ్యాఖ్యానంలో వివరించారు.

 

కర్మ, జ్ఞాన, భక్తి మొదలైన (స్వయంగా భగవనుడే ఉపాయంగా స్వీకరించే బదులుగా)  ఇతర ఉపాయాలను ఉపాసించేవారిని ఉపాయాంతర నిష్టులు అని పిలువబాడతారు. భగవనుడే ఉపాయంగా గాఢ విశ్వాసం ఉన్నవారికి, ఇటువంటి అన్య ఉపాయాలలో పాల్గొనడం ఒక అడ్డంకిగా ఉంటుంది. సాధ్యం – స్వప్రయత్నం ద్వారా ఏదో సాధించడం.

ఇక్కడ మనము ఖచ్చితంగా ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. శాస్త్రప్రకారం నిర్దేశించిన కర్మానుష్టానాలను అనుసరించాలి. వాటిని అనుసరించక పోవడం పెద్ద తప్పుగా భావించబడుతుంది. అవి భగవానుని యొక్క సొంత ఆదేశాలను ఉల్లంఘన చేసినట్లు అవుతుంది. “భగవాన్ యొక్క ఆదేశాల ప్రకారం ఈ కర్మను కైంకర్యంగా భావించి చేయాలి. పిళ్ళై లోకాచార్య ముమ్ముక్షుపడి సుత్రం 271లో “కర్మం కైంకర్యత్తిల్ పుగుమ్” (ప్రపన్నులకు, శాస్త్ర ప్రకారం జరుపుతున్న అన్ని కార్యాలు భగవానునికి సేవగా పరిగణించబడతాయి).

అనువాదకుని గమనిక: ఇక్కడ మనము సిద్ధ సాధనం మరియు సాధ్యం (సాధ్య సాధనం ) మధ్య భేదం అర్థం చేసుకోవాలి.
 • సిద్ధ సాధనం (సిద్దోపాయం) – సిద్దం అనగా ఇప్పటికే స్థాపించబడినది – అందుబాటుకి సిద్ధంగా ఉన్నది. ఉదాహరణకి ఆహారం వండి ఆరగించడానికి  తయారుగా ఉన్నట్లుగా. ఆహారాన్ని కేవలం సునాయాసంగా ఆరగించడమే తడువు. భగవాన్ ఎల్లప్పుడూ జీవాత్మపై తన కరుణా వర్షాన్ని కురిపించేందుకు సిద్ధంగా ఉంటాడు (మనము సునాయాసంగా స్వీకరించడమే అవసరం). భగవాన్ యొక్క కరుణను స్వీకరించడం సిద్దోపాయ వరణం అని పిలుస్తారు. అందువల్ల భగవానుడిని ప్రపత్తి శబ్ద వాచ్యుడు (ప్రపత్తి అను పదమును సూచించేవాడు) మరియు సిద్ధ సాధన భూతుడు (ఇప్పటికే స్థాపించబడిన ఉపాయము) గా వివరించారు.
 • సాధ్య సాధనం (సాద్యోపాయం) – సాధ్యం సాధించవలసినది అని అర్థం. ఉదాహరణకి బియ్యం, కాయకూరలు మొదలైనవి – తినదగినట్లుగా ఆహారాన్ని వండే అవసరం ఉంది . కర్మ, జ్ఞాన, భక్తి వంటి అన్ని ఉపాయాలు జీవాత్మ  అనుసరించాల్సిన సూత్రాలు. జీవాత్మ సాధిస్తేనే  ఈ ఉపాయాలు స్థాపించబడతాయి.

మరొక శ్రెష్టమైన వ్యత్యాసం – భగవానుడు పరమ చేతనుడు ( మహోన్నతమైన పరిజ్ఞానవంతుడు) – కనుక అంతిమ ఫలితం వారి తప్ప ఇంకెవ్వరు ప్రసాదించలేరు.  ఇతర ఉపాయాలన్నీ అచిత్ (అచేతనమైనవి ఎటువంటి అవగాహన లేని జ్ఞానం వంటివి) – ఒక ప్రత్యేక ఉపాయాన్ని ఉపాసించడం ద్వారా – భగవానుడు ప్రసన్నుడై అంతిమ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

12. భగవత్కర్మనిష్ఠనుక్కు దేవతాంతర కర్మనిష్థై విరోధి – భగవాన్ కైంకర్యంపై నిష్ఠ ఉన్నవారికి, దేవతాంతర సేవ చేపట్టడం ఒక అడ్డంకి.

సర్వేశ్వరుడైన శ్రీవన్నారాయణుడు అందరికి సర్వోపరుడు, “దేవుడు” గా  గుర్తించవచ్చు. బ్రహ్మా, శివ, ఇంద్రుడు మొదలైన వారిని దేవతలు గా భావిస్తారు. కానీ ఈ దేవతలు కూడా జీవత్మలే. సామాన్య ప్రజలు ఎలాగైతే సంపన్నమైన వ్యక్తులను  సంప్రదించి వారిని ప్రశంసించి వారికి కావలసిన సంపదను పొందుతారు, అలాగే ఈ దేవతలు సామాన్య మానవులకన్నా ఉన్నత స్థానులు,  మానవులు వారిని కోరి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ దేవతలు శ్రీవన్నారాయణుని చేత నియమించబడ్డారు, తొందరడిప్పొడి ఆళ్వార్ చేత రచించబడిన తిరుమాలైలో  10 వ పాసురం లో “ణాట్టినాన్ దైయ్వంగళాగ … అత్ దైవనాయగన్ తానే”  – అన్ని దేవతల దేవుడు అయిన ఎమ్బెరుమాన్  ఈ దేవతలను ఇతరుల సంక్షేమం కోసం నియమించబడ్డారు. వారిని దేవతాంతరులు (ఇతర దేవతలు) అని పిలుస్తారు.

దైయ్వనాయగన్ ఉభయ నాచియార్లతో – దేవతలకు దేవుడు

మనం మన నిత్య కార్యాలను భగవానుని కైంకర్యంగా భావించి నిర్వర్తించినప్పుడు, భగవానుని ముఖారవిందంలో  సంతోషాన్ని గమనించ వచ్చు. మనకు ఇది సాధించదగిన ఆదర్శము. వారి ముఖంలో ఆనందం మన ఉనికికి ఏకైక ఉద్దేశ్యం. వీటి నుండి మనం సులభంగా అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే  దేవతాంతర (భగవానుడు మరియు వారి భక్తులకు మినహాయించి) కార్యాలు భగవత్ కైంకర్యానికి అడ్డంకి.

 

అనువాదకుని గమనిక: ఈ సూత్రంలో, శాస్త్ర విహిత కర్మలు (శాస్త్రం ఏర్పరచిన కర్మలు) మరియు ఇతర కర్మల మధ్య వ్యత్యాసం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీనిని ఒక ఉదాహరణతో చూద్దాము.

మన (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) ప్రతి రోజు మూడుసార్లు సంధ్యావందనం చేస్తారు. అగ్ని, సూర్య, ఇంద్ర, వరుణ మొదలైన వారికి ప్రత్యేకమైన అర్పణలు ఉన్నాయి. అయితే ఈ దేవతల్లో అంతర్యామిగా శ్రీమన్నారాయణ ఉంటారని మనము గమనించాలి. మన పూర్వాచార్యులు ఈ పవిత్ర ఆచారాలను భగవానుడి కైంకర్యంగా భావించి ఈ తప్పనిసరి నిత్య కర్మలను వారి వర్ణం ప్రకారం ఆచరించేవారు. కాబట్టి, నిత్య కర్మ (సంధ్యావందనం మొదలైనవి) మరియు నైమిత్తిక కర్మలు (తర్పణం మొదలైనవి) ఆచరించాలి. కానీ దేవతాంతర దేవాలయాలలో ఏ కార్యాలలోనూ పాల్గొనకూడదు. ఇటువంటి సందర్భానికి నంపిళ్ళై ఒక శాస్త్రీయ వివరణ ఇస్తున్నారు. ఇది 6000 పడి గురుపరంపర ప్రభావంలో ప్రస్తావించబడింది. ఒకానొక సమయంలో, నంపిళ్ళై వద్దకు వెళ్లి కొందరు, “మీరు ఎమ్బెరుమార్ను మాత్రమే నిష్థగా ఆరాధిస్తారు.  నిత్య / నైమిత్తిక కర్మలలో అగ్ని, సూర్య, ఇంద్ర, వరుణ తదితరులను పూజించేటప్పుడు, వారిని వారి దేవాలయాలలో ఎందుకు పూజించరు?” అని అడిగారు.

 • నంపిళ్ళై వివరిస్తూ అన్నారు “వినండి! వ్యత్యాసం ఏమిటంటే అగ్ని హోత్రం నుండి అగ్నిని స్వీకరించటం మరియు ఒక స్మశానంలో దహనాగ్నిని తిరస్కరించడం వంటిది. రెండూ అగ్ని హోత్రలు ఉన్నప్పటికీ – యజ్ఞం నుండి వచ్చిన అగ్ని పవిత్రమైనదిగా భావించబడుతుంది, అయితే శవాన్ని దహించే అగ్నిను అపవిత్రమైనదిగా భావిస్తారు.
 • వారు ఇంకా వివరిస్తూ అన్నారు “మన నిత్య కర్మలలో ఏది అనుసరిస్తామో, శాస్త్రంలో అవన్నీ ఎమ్బెరుమాన్ యొక్క ఆరాధనలో భాగంగా వివరించారు.   కానీ దేవతాంతర  దేవాలయాలలో ఈ లోపాలు కలిగి ఉన్నాయి – 1) ఈ ఆలయాలను స్థాపించినవారు తామస (అజ్ఞానులు) స్వభావం కలిగి ఉంటారు మరియు భగవానునికి మరియు ఇతర దేవతల మధ్య భేదం తెలియనివారు  2) వారు భగవత్ తత్వానికి విరుద్ధంగా ఆగమాలను  ఉపయోగించి మరియు దేవతాంతరులను  స్వతంత్ర శక్తులుగా ఏర్పరచారు “.
 • ఇంకా వివరిస్తూ , “ఇతర దేవతలను (నిత్య / నైమిత్తిక కర్మలకు మినహా) పూజించుటకు శాస్త్రంలో ప్రత్యేకమైన నియమం లేదు – అందువల్ల పపన్నలకు అది సరియైనది కాదు, అంతేగాక, దేవతల అందరిలో రుద్రని యొక్క పూజ  పూర్తిగా నిషేధించబడింది, ఎందుకనగా, అతను సత్వ గుణానికి పూర్తి వ్యతిరేకముగా ఉన్న తమోగుణంతో నిండి ఉన్నాడు – అందువలన, ఎమ్బెరుమాన్ చేత వారు కూడా సర్వవ్యాపి (అంతర్యామిగా) అని వారిని దేవాలయములలో సేవించలేము.
 • చివరగా, వారు ఇలా చెప్పారు: “మన సత్వ గుణాన్ని అభివృద్ధి చేయడంలో సానుకూలంగా ఉన్న నిత్య / నైమిత్తిక కర్మలను ఎందుకు విడిచిపెట్టాలి మరియు భగవత్ కైంకర్యానికి ప్రతికూలమైన దేవతాంతర ఆరాధన ఎందుకు చేపట్టాలి?” దీనిని బట్టి దేవాలయాలలో దేవతాంతర ఆరాధన వేద ఆగమము ప్రకారం  స్థాపించి నప్పటికీ కూడా పపన్నలకు అది సరికాదు.

ఈ రోజుల్లో ఈ కాలంలో, ప్రతి మూలలో ప్రతిరోజు  కొత్త దేవతలు సృష్టించబడుతున్నారు. వేదాన్ని అంగీకరించకుండా ధిక్కరించి వారి వారి సొంత శైలితో గురువులు వారికి అనుకూలమైన తత్వాలను  అనుకూలమైన రీతిలో బోధిస్తున్నారు. అజ్ఞానాంధకారంలో చిక్కుకోకుండా పెద్దలతో (పండితులతో) పరామర్శించి మన పూర్వాచార్యుల మార్గాన్ని అనుసరించుటయే పపన్నలకు ఉత్తమం.

13. భగవత్ కైంకర్య నిష్ఠనుక్కు దేవతాంతర భజనం విరోధి – భగవత్ కైంకర్యంపై దృష్టి పెట్టేవారికి, ఇతర దేవతల ఆరాధన అడ్డంకి.

వేదాంత సారమైన ప్రణవం, జీవాత్మ(అధీనుడు)ను సర్వరక్షకుడైన మరియు సర్వవ్యాపి అయిన   కేవలం శ్రీమన్నారాయణుని కొరకే ఉణికితో ఉన్నాడని ఘోషిస్తుంది. అందువలన, భగవత్ కైంకర్యంలో నిమగ్నమై ఉండుట  జీవాత్మకు  సహజమైన గుణం. భగవత్ కైంకర్యంలో నిమగ్నమైన వ్యక్తులకు, దేవతాంతరముతో  సంబంధం కలిగి ఉండుట ప్రధాన విరోధి.

అనువాదకుని గమనిక: వ్యఖానంలో, “పతిం విస్వస్య”  ప్రమాణం తెలియజేస్తున్నారు. పతి అనగా సాధారణంగా “భర్త / యజమాని” అని అర్థం. ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న అనంతరం, ఆమె తన భర్తకు పూర్తిగా లొంగిఉండి ఇంకెవరిపై దృష్టి పెట్టదు. అదే విధంగా, జీవాత్మ  భగావాన్ సేవకునిగా తన స్వరూపాన్ని తెలుసుకొని,  అతను పూర్తిగా భగవానుడికి లొంగిఉండాలి. అందువలన, జీవాత్మ అటువంటి పరిపూర్ణత తర్వాత ఇతర దేవతాంతర సంభంధం అనవసరం. అంతేకాదు, తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళి 8.10.3 లో “మఱ్ఱుమోర్ దెయ్వం ఉళదెన్ఱు ఇరుప్పారోడు ఉఱ్ఱిలేన్” – శ్రీమన్నారాయణుడు కాక మరొక దేవుడు ఉన్నాడని నమ్ముతున్న ఎవరితోనూ అనుబంధించను – ప్రపన్నులు జాగ్రత్తగా దేవతాంతర నిష్టులకు దూరంగా ఉండాలి.

14. భగవతుపాయ నిష్ఠనుక్కు ప్రపత్తి విరోధి – భగవాన్ ఒక్కటే ఉపాయంగా అనుసరించే వారికి, శరణాగతి ఉపాయంగా భావించడం అడ్డంకి.

10 మరియు 11వ వ్యాఖ్యానములో చర్చించాము. ధృఢమైన విశ్వాసంతో ఎమ్బెరుమానుని ఉపేయం (లక్ష్యము) గా మరియు ఉపాయం (మాధ్యమం) గా భావించే వ్యక్తిని ఉత్తమ అధికారి (అత్యుత్తమ భక్తుడు)గా పిలుస్తారు. భగవాన్ స్వయంగా “తమేవ శరణం వ్రజేత్” – భగవానునికి మాత్రమే శరణాగతి చేయుట). అలాంటి వ్యక్తులకు, వారి శరణాగతి చర్య  “ప్రపద్యే” లో చూపించబడినట్టుగా మాధ్యమం కాదు ( వారి సహజ స్వీకరణ స్థితి ). కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను అనుసరించే వ్యక్తులను మధ్యమ అధికారి అని పిలుస్తారు. (మధ్యస్థమైన భక్తుడు – నిరంతరం స్వయం కృషి ప్రాధాన్యత ఉన్న కారణంగా). వారి స్వయం ప్రపత్తిని ఉపాయంగా భావించేవారు  మధ్యమ అధికారి వర్గంలోకి  వస్తారు. ఇటువంటి చర్య ప్రపన్నులకు ఒక అడ్డంకి – కర్మ, జ్ఞాన, భక్తి యోగము మొదలైన వాటికి సమానమైనవి.

15.  సాధ్యోపాయ నిష్ఠనుక్కు నివృత్తి విరోధి – కర్మ, జ్ఞాన, భక్తి యోగము మొదలైన వాటి పై దృష్టి పెట్టేవారికి సొంత ప్రయత్నాలు త్యజించుట ఒక అడ్డంకి.

16. సిద్ధోపాయ నిష్ఠనుక్కు ప్రవృత్తి విరోధి – భగవానుడిపై దృష్టి పెట్టేవారికి సొంత ప్రయత్నాలలో పాల్గొనడం ఒక అడ్డంకి.

10 మరియు 11వ వ్యాఖ్యానములో  సిద్ధోపాయం మరియు సాధ్యపాయం గురించి వివరించి ఉంది.

 • సొంత ప్రయత్నాలలో పాల్గొనుటను ప్రవృత్తి అంటారు.
 • సొంత ప్రయత్నాల నుండి ఉపసంహరించుట నివృత్తి అంటారు.
 • సాధ్యోపాయ నిష్ఠుడు – సొంత ప్రయత్నం ఆధారంగా తన లక్ష్యాన్ని సాధించాలని కోరుకునే వాడు.
 • సిద్ధోపాయ నిష్ఠుడు – భగవానుని (ఉపాయంగా రుజువుచేయబడిన) మాధ్యమంగ స్వీకరించి మరియు అతనిని దుఃఖం (సంసారం) నుండి ఉపశమనం చేస్తాడని ఆశించేవాడు.  నమ్మాల్వార్ తిరువాయ్మొళి 5.8.8 లో “కళైవాయ్ తున్బం కళైయా తొళివాయ్ కళైకణ్ మఱ్ఱిలేన్”. ఈ ప్రపన్నులు వారిని ఉపాయంగా పరిగణించే ఏ రకమైన కర్మలను చేయరు. నమ్మాల్వారి తిరువాయ్మొళి 5.7.5 లో   “చైత వేళ్వియర్” అని పిలవబడింది. ఇది సంస్కృతంలో  “కృత కృత్యన్”  – ఇప్పటికే అన్ని అవసరమైన చర్యలను చేసిన వాడు అని సంస్కృతంలో వివరించబడింది. ప్రపత్తి అనగా, ప్రధాన నిర్వచనం “తమ సొంత ప్రయత్నాలను త్యజించుట”.

సాధ్యోపాయుడు (కర్మ యోగంలో మొదలగు వాటిపై నిమగ్నమై ఉన్న వ్యక్తి) సొంత – ప్రయత్నాలను త్యజించలేరు – వారు ఫలితాన్ని పొందే లక్ష్యంతో ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి . అతనికి, సొంత ప్రయత్నాలు త్యజించుట  ఒక అడ్డంకి.

కానీ సిద్ధోపాయునికి – ఇది పూర్తి వ్యతిరేకం. అతను లక్ష్యాన్ని సాధించడానికి సొంత ప్రయత్నాలలో పాల్గొనలేడు. అలాంటి సొంత ప్రయత్నం అతనికి విరోధి.

ఈ ప్రపత్తి మరియు నివృత్తి  సూత్రాలను పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 80 – 82 సూత్రంలో (తదుపరి సూత్రాలలో)  “అధికారి కృత్యం – అధికారి నిష్ఠా క్రమం”  వివరించారు. దయచేసి దాని గురించి స్పష్టముగా అవగాహన కలిగి ఉండండి.

అనువాదకుని గమనిక: శ్రీవాచన భూషణ దివ్య శాస్త్రంలో, ఇక్కడ పేర్కొన్న ప్రత్యేక విభాగంలో, కొన్ని మంచి ఉదాహరణలు పిళ్ళై లోకాచార్యుల ద్వారా ఉపాయం మరియు ఉపేయం గురించి అందించబడ్డాయి. మణవాళ మామునుల వారి వ్యాఖ్యానము ఈ సూత్రాలకు చాలా విలువైన వివరణ అందిస్తుంది. వాటిని క్లుప్తంగా చూద్దాము.

 • ఉపాయానికి (అంటే భగవనుని మాధ్యమంగా స్వీకరించుట), సీతా పిరాట్టి, ద్రౌపది మరియు తిరుక్కణ్ణమంగై ఆండాన్ మంచి ఉదాహరణలు.
  • సీతా పిరాట్టి తన సొంత శక్తిని త్యజించారు – ఆమె తనకు తాను శక్తివంతమైనది మరియు అతిసులభంగా లంకను మరియు రావణుడిని పతనం చేసి ఉండేది. కాని శ్రీరాముడు వచ్చి తనను కాపాడతాడని ఎదురు చూసింది.
  • ద్రౌపది ఎమ్బెరుమాన్ చే రక్షించబడుతుందని పూర్తి విశ్వాసంతో జంకు సిగ్గును వదిలి తన రెండు చేతులు ఎత్తి  శ్రీ కృష్ణుడిని ఆర్తితో పిలిచింది –  ఖచ్చితంగా ఆమె రక్షించబడింది.
  • తిరుక్కణ్ణమంగై  ఆండాన్ సొంత ప్రయత్నాలు వదిలి పూర్తిగా తిరుక్కణ్ణమంగై భక్తవత్సలుడు ఎమ్బెరుమాన్ సేవ చేసాడు. అతను బయట రెండు కుక్కలు  పోట్లాడటం గమనించాడు, అది చూచి ఆ కుక్కల యజమానులు కూడా పోట్లాడటం మొదలుపెట్టారు. ఇది గమనించి , “ఆ యజమాని తన కుక్కను రక్షించటానికి వచ్చాడంటే, నా యజమాని (భగవాన్) నన్ను రక్షించటానికి పోషించడానికి ఎందుకు రాడు? నేను బాహ్య కార్యకలాపాలలో ఎందుకు భాగస్వామిని కావాలి?” అని ఒక్కసారి అన్నీ విడిచిపెట్టాడు.
ఆండాన్ –  వారి తిరువరసు,  తిరుక్కణ్ణమంగై
 • ఉపేయానికి (భగవత్ కైంకర్యం లో పాల్గొనడం), ఇళైయ పెరుమాళ్ (లక్ష్మనుడు), పెరియ ఉడైయార్ (జటాయు), పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ మరియు చింతయంతి వంటి వారు మంచి ఉదాహరణలు.
  • ఇళైయ పెరుమాళ్  శ్రీరామునికి నిరంతరం తోడుగా ఉండి కైంకర్యం చేశాడు, ఎందుకంటే ఎమ్బెరుమాన్ లేకుండా నిరంతరం వారి సేవ లేకుండా అతను ఉండలేడు కాబట్టి.
  • పెరియ ఉడైయార్ (జటాయు  మహరాజు) మరియు పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్  సీతా పిరాట్టి మరియు అర్చావతార ఎమ్బెరుమాన్ను రక్షించేందుకు వారి బాహ్య శరీరాలను త్యాగం చేశారు.
  • చింతయంతి ఒక గోపిక, కృష్ణుడిని చూడటానికి ఆమె తన నివాసాన్ని వదిలి వెళ్ళ లేకపోయింది. ఎమ్బెరుమాన్ వేణువాదం విని  గొప్ప ఆనందాన్ని పొంది – కృష్ణుడిని చూసే ఆస్కారం లేక తీవ్రమైన బాధతో ఆమె శరీరం విడిచిపెట్టింది.

మరిన్ని వివరాలకోసం, దయచేసి ఒక అర్హత గల ఆచార్యులను సంప్రదించి ఈ క్లిష్టమైన సూత్రాలను నేర్చుకోండి.

తదుపరి విభాగాన్ని మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

 

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో :  http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-2.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 16

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 15

ప్రధాన సంకేతం

                           ఆత్మ స్వరూపం గురించి పలువురు అనేక విధాలుగా పరిశోధనలు చేశారు. పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఇదియే అనేక తత్వాలకు, తత్వ పరిశోధనలకు ఆధారమైంది. వివిధ సిధ్దాంతాలలో ఆత్మ స్వరూపము గురించి భేద భావాలు, వాటి మీద జరిగిన చర్చలే భిన్నాభిప్రాయాలకు కారణమైనది. ఈ విషయంగా భగవద్రామానుజుల అభిప్రాయమేమిటో ఇక్కడ చూద్దాము.

                     మన పూర్వాచార్యులైన నమ్బిళ్ళై , పెరియవాచ్చాన్ పిళ్ళై వంటి మహాచార్యుల రచనలలో భగవద్రామానుజుల వారి జీవిత కాలంలో జరిగిన ఒక సంఘటన పేర్కొనబడింది. ఆత్మ ఆనందమయ, జ్ఞానమయమైనది అని చెప్పబడింది. ఈ ఆత్మ ఈశ్వరునకు శేషభూతమైనది అని చెప్పబడింది. ఈ రెండు సంకేతాలలో ప్రధానమైనది ఏది? అన్న ప్రశ్న భగవద్రామానుజుల వారి గోష్టిలో ఉదయించిందట.

నంపిళ్ళై

రామానుజులవారు ఈ ప్రశ్నకు తాము జవాబు చెప్పగలిగినా తమ ఆచార్యులైన తిరుకోష్టియూర్ నంబిగారి అభిమతమును వారి శ్రీసూక్తిగా వినాలని భావించారు. అందుకోసం తమ ప్రియ శిష్యులు, జ్ఞాన పరిపూర్ణులు అయిన శ్రీకూరత్తాళ్వాన్ ను పిలిచి, అనువైన సమయం చూసి తిరుకోష్టియూర్ నంబిగారిని ఈ సందేహానికి జవాబుఅడిగి తెలుసుకొనిరమ్మని  పంపించారు. కూరత్తాళ్వాన్ ఆచార్యఅనతి మేరకు తిరుకోట్టియూర్ నంబిగారి దగ్గరకువెళ్ళారు.

 

అక్కడ ఆచార్యులు చెప్పినట్టుగా అనువైన సమయం చూసి ఈ ప్రశ్నను లేవనేత్తుదా మనుకునే వరకే ఆరు నెలల కాలం గడచిపొయింది. కూరత్తాళ్వాన్ సరే వేళ్ళివస్తాను,ఆనతి ఇమ్మని తిరుకోట్టి యూర్ నంబిగారిని అడిగారు. అప్పుడు తిరుకోట్టియూర్ నంబి ‘ ఆడియెన్ ఉళ్ళాన్  ఉడనుళ్ళాన్ ‘ అన్నారు. ఇది తిరువాయిమోళిలో 8వ పత్తులో 8వ తిరువయిమోళిలోని 2వ పాశుర భాగము.  ఆత్మ సంకేతాలలో అది ఈశ్వరుడికి శేషమవటమే ప్రధానమైన సంకేతము అని తెలియజేసే పాశురభాగము. అదియే తిరుకోట్టియూర్ నంబి గారి అభిమతము. ఇందులోని ‘ఆడియెన్‘ పదము చెప్పే అర్థమే  ప్రధానమైనది.

తిరుకోష్టియూర్ స్వామి

ఆళ్వార్ల శ్రీసూక్తులలో ఈ ‘ఆడియెన్‘ పదము తరచుగా చూడవచ్చు. అలాంటప్పుడు తిరుకోష్టియూర్ నంబిగారు ఈ సందర్భాన్నే ఎందుకు చెప్పారు. ఎదో ఒకటని చెప్పారా? దీనికి ఏదైనా ప్రత్యేకతలున్నయా? అని పరిశీలిస్తే .. తిరువిరుత్తం అనే ప్రబంధంలో నమ్మాళ్వార్లు ‘అడియెన్  సెయ్యుం విణ్ణప్పమే‘ అనే ప్రారంభించారు. పైన పేర్కొన్న 8వ పత్తు లోని 8వ తిరువయిమోళిలో ప్రారంభంలోను  ‘అడియెన్‘ అనే అన్నారు. మరి తిరుకోష్టియూర్ నంబిగారు ఈ సందర్భాన్నే ఎందుకు ఎంచుకున్నారు? దీని ఔచిత్యం ఏమిటి? అని చూద్దాము .

 

                     ఇతర సన్నివేశాలలో ‘అడియెన్‘ అన్న ప్రయోగం ఒక ప్రత్యేక ఆత్మవిశేషాన్ని తెలియజేయటం లేదు. ఉదాహరణకు ‘అడియెన్  సెయ్యుం విణ్ణప్పమే‘ అనే ప్రయోగాన్ని తీసుకుంటే, విన్నపము అనేది శరీరమున్న అత్మకే సాధ్యమైన విషయము శరీరమును వదిలివేసిన ఆత్మకు సాధ్యము కాదు. ఈ ఉదాహరణ శరీరములో బందింపబడిన ఆత్మను తెలియజేస్తుంది కానీ శరీరమును కడచిన ఆత్మను సూచించలేదు. ఆత్మ పరమాత్మకు శేషభూతమని  చెప్పే సందర్భం కేవలం తిరువాయిమోళి 8 -8 -2 లోనే ఉన్నది.

స్వామి నమ్మాల్వార్

ఈ పదము యొక్క అర్థాన్ని ముందుగా చూద్దాము. ఈ పాశురములో ఆళ్వార్లు పరమాత్మ, ఆత్మను అవలంభించి ఉండేవాడన్న అర్థంలో  ‘అడియెన్ ఉళ్ళాన్‘ అని, అవలంభించి ఉన్నాడు అని తెలియ జేయడానికి  ‘ఉడ నుళ్ళాన్‘ అని అనుగ్రహించారు. ఈశ్వరుడు అంతట వ్యాపించి ఉన్నాడని, ఆత్మలో కూడా ఉన్నాడని, శరీరములో కూడా వ్యాపించి ఉన్నాడని అర్థము. అలౌకికమైన ఆత్మలోనూ, లౌకికమైన శరీరములోనూ వ్యాపించివున్నాడు అని తెలియజేస్తున్నారు. ‘ఉడ నుళ్ళాన్‘ అనటం వలన శరీరంలోని వ్యాప్తిని, ‘అడి యెన్  ఉళ్ళాన్ ‘ అనటం వలన ఆత్మలోని వ్యాప్తిని వేరుచేసి చూపిస్తున్నారు. ‘ఉడల్‘ అని  శరీరం ఆత్మ నుండి వేరు అని ఆళ్వార్లు ప్రత్యేకంగా వివరించనవసరం లేకుండానే  స్పష్టమవుతున్నది.

 

               ఈ సందర్భము, దీని వివరణ చాలా అందంగా ఉన్నా , ఇదే వాస్తవమైనది అనడానికి ఇంకా ఏవైన ఉదాహరణలున్నాయా! రామానుజులు తమ ఇతర గ్రంధాలలో ఎక్కడైనా దీనిని ప్రస్తావించారా?

అన్న విషయం తెలుసుకోకపొతే ఇది కేవలం కథగా మిగిలిపోవచ్చు. అప్పుడు దీనికి ఇంత ఔన్నత్యం ఒనగూడదు. స్వామి గీతా భాష్యంలో ‘జ్ఞానీ‘, ‘జ్ఞానవంతుడు‘ అని వచ్చిన సందర్భాలలో ఈ ప్రమాణాన్నే ఉదాహరించారు. శంకరభగవత్పాదులు సాదరణంగా చేతనుల గురించి చెప్పె సమయంలో “ విష్ణోః తత్వ విత్ “ (విష్ణువు యొక్క తత్వమును తెలిసిన వాడు)  అని అన్నారు. కానీ రామానుజులు జ్ఞాని అయిన వాడు ఆత్మ, పరమాత్మకు శేష భూతమని తెలుసుకొని వుంటాడు అనే అర్థములో ‘భగవత్ శేషతైక రస ఆత్మ స్వరూపవిత్ –జ్ఞానీ“ అని అన్నారు. ఆళ్వార్లు  ‘నేను‘  అంటే ‘ఆడియెన్‘  అని చెప్పిన వివరణకు అనుగుణంగానే రామానుజులు జ్ఞానము కంటే శేషత్వమే ఉన్నతమైనదని స్పష్టంగా చెప్పారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/14/dramidopanishat-prabhava-sarvasvam-16/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 15

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 14

శ్రీ భట్టనాధ ముఖాబ్జ మిత్రం

                భగవద్గీతలో కొన్ని ఉదాహరణలను చూస్తే, భగవద్రామానుజులకు దివ్యప్రబంధలో ఉన్న ప్రావీణ్యం మనకు బోదపడుతుంది.  దివ్యప్రబంధలోని మధురిమను జోడించటం వలన వీరి వ్యాఖ్యాన శైలి ప్రత్యేకంగా ఉంటుంది.

పెరుమాళ్ కొయిళ్ ఆళ్వారులు మరియు ఆచార్యులు

                “ చతుర్విధా భజంతే మాం  “ (భగవద్గీగీత 7-16) అనే శ్లోకమలో నలుగురిని పేర్కొన్నారు. 1. ఆర్తా

2. జిజ్ఞాసు

3.అర్థార్తి

4.జ్ఞాని

ఈ నలుగురి గురించి చెప్పేటప్పుడు వ్యాఖ్యాతలలో అభిప్రాయ బేధాలు కనపడుతున్నాయి. 7వ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు తనను శరణాగతి చేయడం వలన మాత్రమే (యే మామేవ ప్రపద్యంతే ) చేతనులు మాయమయమైన ఈలోకంలోని క్లేశాల నుండి బయట పడగలరని (తే మమా మాయాం తరంతి) తన ఉన్నతమైన మాహాత్మ్యాన్ని (దైవిమాయ) ఉపదేశించారు.

పెరుమాళ్ చరణాల వద్ద ఆళ్వారుల పూర్ణ శరణాగతి

          ఈ శ్లోకంలో పరమాత్మ తనను శరణాగతి చేసేవారు నాలుగు రకాల వారు అని అన్నారు. శరణాగతి చేసినప్పుడు ‘ప్రపద్యంతే ‘ అన్నవాడు, ఇప్పుడు ‘భజంతే‘ అంటున్నాడు. ‘భజంతే‘ అన్న ప్రయోగానికి శ్రీ శంకరులు, ‘సేవంతే‘ అన్నారు. భక్తీ, శరణాగతి రెంటి అర్థము కైంకర్యము చేయటమే అవుతుంది. పైన చెప్పిన నాలుగు రకాల వారు శ్రీ కృష్ణుని దాసులే.

విభిన్న రకాల కృష్ణుని సేవలు

దీనికి వివరణగా శ్రీ శంకరులు ‘ఆర్తాః‘ = తస్కర వ్యాగ్రా రోగాదినా అబిభూతాః ఆపన్నః

జిజ్ఞాసు = భగవత్ తత్త్వం జ్ఞాతుమిచ్చతి యః

ఆర్తార్థి =ధనకామః

జ్ఞానీ = విష్ణోః తత్వవిత్ ‘ అని వివరించారు .

                 పై నలుగురు తమకు కావలసినది కోరటంలో వైవిధ్యం కనపడుతుంది. మొదటి వర్గం వారు దొంగల నుండి, క్రూర జంతువుల నుండి, భయంకర వ్యాధుల నుండి తమను కాపాడమని ప్రార్థించేవారు, రెండవ వర్గం వారు భగవత్తత్వాన్ని, కృష్ణతత్వాన్ని అకాంక్షించేవారు, మూడవ వర్గం వారు సంపదను కోరుకునేవారు, నాలుగవ వర్గం వారు భగవత్తత్వం తెలిసిన జ్ఞానులు.

తిరుమలలో రామానుజులు

         వేదాంతంలో చిత్, అచిత్, ఈశ్వరుడు అని మూడు తత్వాలు ఉండటమే చేతనులలో నాలుగు వర్గాలవారు ఉండటానికి కారణం అని స్వామి రామానుజులు నిర్వహిస్తున్నారు.  ఆత్మ, తాను స్వయంగా ఈశ్వర స్వరూపమైన అచిత్తును వెదుకుతూ వెళుతుంది. ఇక్కడే ఈశ్వరుడి భక్తులలో భేదం మొదలవుతున్నది. ఐశ్వర్యాన్ని కోరే వారిలో రెండు రకాలవారుంటారు . ఒకటి భ్రష్టైశ్వర్యం (ఒకప్పుడు సంపదలు ఉండేవి. వాటిని పోగొట్టుకున్నారు ప్రస్తుతం వాటిని పొందటం కోసం ప్రార్థింస్తున్నారు), రెండు అపూర్వఐశ్వర్యం (గతంలో సంపదలు ఏవీలేవు, ఇప్పుడు సంపదలు కోరుకుంటున్నారు). ఈ విభజన చేతనునికో ఈశ్వరుడికో తగనిది. కైవల్య ప్రాప్తి గాని, భగవత్ప్రాప్తి గాని, మోక్షప్రాప్తి గాని, నిరంతరమైనది. దానిని పోగొట్టుకోవటమో మళ్ళీపొందటమో సాద్యం కాదు. అవి కొత్తగా కోరి పోందవలసినవి మాత్రమే. కావున పై నాలుగు రకాల భక్తులు  భ్రష్టైశ్వర్య కామః , అపూర్వఐశ్వర్య కామః , కైవల్య కామః , భగవత్ కామః అని అన్నారు.

భగవద్రామానుజుల ఈ వ్యాఖ్యానం ఎక్కడ లభించింది అని ప్రశ్నించుకుంటే, తిరుపల్లాండులో పెరియళ్వార్లు భక్తులను పై నాలుగు వర్గాలుగా పాడినందునే వీరికి ఈ విభజన లభిచింది అని బోధపడుతుంది. మొదటి రెండు పాశురాల తరవాత వరుసగా మూడు పాశురాలలో  ఈ భావాన్నే పెరియళ్వార్లు పాడారు.

శ్రీ భట్టనాథ – ముఖాబ్జ – మిత్రః

ఉదాహరణకు ‘వాళాళ్ పట్టు‘ అనే పాశురములో  భగవంతుని కోరే వాళ్ళను, ‘ఏడు నిలత్తిల్‘ లో కైవల్యార్థులను, ’అండ కులత్తుక్కు‘ లో అపూర్వైశ్వర్యార్థులను, భ్రష్టైశ్వర్యార్థులను గురించి చెప్పారు. ఈ ప్రబంధంలో పెరియాళ్వార్లు భగవంతుడికి మంగళాశాసనము చేయడానికి కోరికగలవారిని రమ్మని పిలిచారు.

            భక్తులకు సంభందించిన భగవద్గీతలో చెప్పిన విభజనను వివరించడానికి రామానుజులు తిరుపల్లాండులోని పెరియాళ్వార్ల శ్రీసూక్తులను ప్రకాశింపచేసారు. అలాగే శ్రీమణవాళమామునులు రామానుజులకు  పెరియాళ్వార్ల మీద ఉన్న భక్తిని ప్రకాశింపచేస్తూ ‘శ్రీభట్ట నాధ ముఖాబ్జమిత్రులు‘ అని కొనియాడేవారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/13/dramidopanishat-prabhava-sarvasvam-15/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 14

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 13

 

తిరుప్పావై జీయర్

               తిరువరగంగత్తముదనార్, స్వామి రామానుజులను “చూడికొడుత్తవళ్  తోల్ అరుళాల్ వాళ్గిన్ర వళ్లల్” (ఆండాళ్ అనుగ్రహ సంపన్నులు) అని కొనియాడేవారు. స్వాభావిక కృపా సంపన్నురాలైయన ఆండాళ్ వలన రామానుజులు ఉజ్జివించారని వారి అభిప్రాయం. తిరుప్పావైలోని పద్దెనిదవ పాశుసురానికి సంబంధించిన ఐతిహ్యం ఒకటి ఉంది. దాని వలననే  స్వామి రామానుజులు తిరుప్పావై జీయర్ గా  కొనియాడబడుతున్నారు.

స్వామి రామానుజుల మీద తిరుప్పావై ప్రభావాన్ని తెలిపే ఉదంతాన్ని ఇక్కడ చూద్దాం.

భగవధ్గీత ౩వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పినప్పుడు  ఇలా చెప్పారు.

 ” యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవేతరో జనః

స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ” ( 3-21)

‘సామాన్య అర్థంలో చూస్తె ఈ శ్లోకంలో విశేషం ఏమి కనపడదు, కానీ తెరచి చూస్తే  మంచివారి నడవడి, శీలము గురించి చెప్ప బడిందని బోధపడుతుంది.  ఈ శ్లోకంలోని రెండవ పాదాన్ని శంకర భగవత్పాదులు

“సః శ్రేష్టాః యత్ ప్రమాణం కురుతే – లౌకికం వైదికం వా, లోకాః తత్ అను వర్తతే – తదేవ ప్రామాణికరోతి ఇతి అర్థం” అన్నారు.

లౌకిక వైదిక విషయాలలో సామాన్యులు ఎక్కువ మంది ఏది చేస్తే అదే ప్రమాణంగా స్వీకరింపబడుతున్నది అన్నారు.

“యత్ వాక్యాధికం  ప్రామాణీ కురుతే యదుక్త ప్రకారేణ తిష్యంతి ఇతి అర్థతః” అని అన్నారు.

పై వివరణలలో “యత్ ప్రమాణం“ అన్నభాగం “యత్ “ — “ ప్రమాణం“ అని విడగొట్టబడింది. ఈ  ప్రయోగానికి స్వామి రామానుజులు తమ భాష్యంలో ఒక ప్రత్యేకమైన వివరణను చెప్పారు.

“యత్ ప్రమాణం“ అన్న ప్రయోగాన్ని బహువ్రీహి సమసంగా గ్రహించి వివరించారు. దీనికంటే ముందు ఈ శ్లోకానికి వీరు చేసిన వ్యాఖ్యానాన్ని ఒక సారి చూడవలసి వుంది.

శ్రేష్టః – క్రుస్న శాస్త్ర జ్ఞాత్రుతయా అనుష్టాత్రుతయా చ ప్రతితః

పెద్దలనగా శాస్త్రములను బాగా చదివి, దాని ప్రకారం ఆచరిచేవారు.

‘ యద్యదాచరతి తత్త దేవ అక్రుస్న జనా అపి ఆచరతి‘

 శాస్త్ర జ్ఞానము అంతగాలేని సామాన్యులు పెద్దల ఆచరణను చూసి అనుసరిస్తారు.

“అనుష్టీయమానం అపి కర్మ శ్రేష్టో, యత్ ప్రమాణం యత్ – అంగయుక్తం అనుతిష్టతి  తత్  అంగయుక్తం ఏవ అక్రుత్స్నవిల్లోకోను తిష్టతి.“

ఈ ప్రకారం చేయబడే కర్మలలో సామాన్యులు, పెద్దలు చేసేకర్మలనే అనురిస్తున్నారు.

యత్ ప్రమాణం అన్న ప్రయోగం చక్కగా వివిరింపబడింది. ఇక్కడ రామానుజులవారు ఇచ్చిన వివరణ చక్కగా సరిపోవటమే కాక చాలా చక్కగా అమరింది. సామాన్యులు కర్మలను ఆచరించే విధానాన్ని వివరించే ప్రకరణంలో  కర్మ, కర్మఫలములను మాత్రమే వివరిస్తే సరిపోతుంది. పెద్దలు ఆచరించినదానినే సామాన్యులు ఆచరిస్తారు అని చూపటం చాలా చక్కగా అమరింది. ఎందుకంటే సరియిన ప్రమాణాన్నే అనుసరించాలన్న విషయము భగవగ్దీతలో ౩వ అధ్యాయంలో ప్రస్ఫుటంగా చెప్పలేదు. అర్జునుడికి ఏ ప్రమాణము తగినది అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. కర్మను గురించిన చర్చ మాత్రమే జరిగింది. అందువలన సామాన్యుల ఆచరణకు సంబంధించిన ప్రమాణాన్ని గురించి చెప్పలేదు.

                స్వామిరామానుజులు ఈ అర్థాన్ని తిరుప్పావై నుండి గ్రహించి మనకు అనుగ్రహించారన్న విషయం గుర్తించ వలసిన విషయము.  తిరుప్పావైలోని 26వ పాశురములో ఆండాళ్,  “మేలైయార్ సేయ్వనగళ్ వేండువన కెట్టియేల్“  అన్నది. ‘వేండువన ‘  అన్న ప్రయోగమే ఇక్కడ ‘యత్ ప్రమాణం‘ అన్న ప్రయోగాన్ని వివరిచేదిగా అమరింది.

                సమస్త విషయాలకు ప్రమాణంగా స్వీకరించే వేదము పలు నియమనిబంధనలను చెప్తుంది. ఇంకా, పెద్దలు వేదములో చెప్పబడ్డ అన్నింటిని పెద్దలు ఆచరించటము లేదు. వేటిని ఆచరించక పొతే పాపమో వాటిని మాత్రమే ఆచరిస్తున్నారు.

“క్రియమాణమ్ న కస్మైచిత్ యత్ అర్దాయ ప్రకల్పతే

అక్రియావదనర్దాయ తతు కర్మ సమాచరేత్“

ఫలమును ఆశించి చేసేకర్మలను వాళ్ళు చేయటం లేదు. చేయకుండా వదిలి వేస్తె పాపం అన్న విదిత కర్మలను మాత్రమే వాళ్ళు చేస్తున్నారు.

 ఒక సన్యాసి ఆశ్వమేధం చేయడానికి సంకల్పించరు కదా!

పెద్దలు ఆచరించే కర్మలు అవి లౌకికమో వైదికమో ఏదైనా సామాన్యులు  ఆచరించతగినవిగా తిరుప్పావైలోను  భగవగ్దీతలోను చెప్పబడ్డాయి. అందువలన శీలవంతులైన, వేద విదులైన పెద్దల ఆచరణయే సామాన్యులకు శిరోదార్యము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/12/dramidopanishat-prabhava-sarvasvam-14/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org