Monthly Archives: September 2019

విరోధి పరిహారాలు – 18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/09/02/virodhi-pariharangal-17/

49. అంజలి  విరోధి  – అంజలి (చేతులు జోడించి నమస్కరించడం). అర్పించడంలో అవరోధాలు 

అంజలి అంటే రెండు  అరచేతులను జోడించి నమస్కరించడం (నమస్కారం) అని అర్థం. ఇది 48 వ అంశానికి సంబంధించినది (వందన – సాష్టాంగ నమస్కారం). సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత, పైకిలేచి అంజలి (రెండు  అరచేతులను జోడించి వందనం) చేయాలి. కొన్ని సమయాల్లో, కొందరు పూర్తి నమస్కారం చేయకుండానే అంజలి చేస్తారు. అంజలి చేయడం ఎలా అంటే చేతులు ఛాతి దగ్గరకు తీసుకువచ్చి అరచేతులు రెండూ ఒకదానికొకటి తాకే విధంగా జోడించడం.  కొన్ని సార్లు రెండు  అరచేతులను జోడించి తలపైన పెట్టుకోవడం కూడా మనం చూస్తాము.  అంజలిని “అం జలయతి ఇతి అంజలిః” – “అ” – అకారం చేత ప్రస్తావించబడిన భగవాన్ను కరిగించేది. “అంజలిః పరమాముద్రా  క్షిప్రమ్ దేవప్రసాధినీ” – అంజలి అనేది భగవాన్ యొక్క దయను త్వరగా ప్రేరేపించే  అత్యున్నతమైన భంగిమ.

  • అంజలి అనేది భగవాన్ యొక్క పాద పద్మాలపై మన మనస్సును కేంద్రీకరించి చేయాలి. దేవతాంతరాలు, భౌతికంగా ధనవంతులు మొదలైన వారిపై దృష్టి కేంద్రీకరించిన మనస్సుతో చేయకూడదు.
  • అంజలి చేయటానికి సమయ పరిమితులు మరియు శుభ సమయం లేవని అర్థం చేసుకోవాలి.
  • ప్రతి  శ్రీవైష్ణవునికి చేయాలి మరియు ప్రతి  శ్రీవైష్ణవుడూ చేయాలి అని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. అదేవిధంగా, అంజలి చేయటానికి వారికి ప్రత్యేక అర్హత అవసరమని అనుకోవడం కూడా సరైనది కాదు. భగవత్ సంభంధం ఉన్న ఎవరికైనా అంజలిని అర్పించవచ్చు. తిరుమంగై ఆళ్వార్ యొక్క తిరునెడుంతాణ్డం పాసురం 14 లో “వాళర్త్తతనాల్  పయన్ పెఱ్ఱ ఏన్ వరుగవెన్ఱు మడక్కిళియైక్ కైకూప్పి వణంగినాళే ” – పరకాల నాయకి(నాయికా భావంలో తిరుమంగై ఆళ్వార్)  చిలుకను పెంచినపుడు, ఆ చిలుక ఎమ్పెరుమాన్ పేర్లను చాలా ఆనందంగా పఠించడం విని, ఆమె పరమానందపడి తన  అరచేతులను జోడించి ఆ చిలుకకు అంజలి చేస్తుంది.
  • ఏ పరిస్థితిలోనైనా అంజలి చేయవచ్చని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. శారణాగతి గధ్యంలో, ఎమ్పెరుమానార్ అన్నారు “ఏనకేనాబి ప్రకారేణ ద్వయవక్తా” – ఏ పరిస్థితిలోనైనా ద్వయ మంత్రాన్ని పఠించవచ్చు, అలాగే, ఏ పరిస్థితిలోనైనా అంజలి చేయచవచ్చు, ఎమ్బెరుమాన్ని కరిగింపజేస్తుంది.
  • ఒక అంజలి సరిపోతుందని భావించకపోవడం, అనేక సార్లు అంజలి చేయాలని భావించడం. సకృత్ – ఒకసారి. అసకృత్ – అనేక సార్లు. ఆళవందార్ల స్తోత్ర రత్నం 28 లో, వారు ఎమ్పెరుమాన్తో అంటున్నారు “త్వదంగ్రి ముద్దిచ్య కతాపి కేనచిత్ యతా తథా వాపి సకృత్ కృతోంజలిః తదైవ ముష్ణాతి అశుబాని అశేశతః సుభాని పుష్ణాతి నజాతు హీయతే” – మీ పాద పద్మాలకు ఏ సమయంలోనైనా ఎవరైనా ఏ విధంగానైనా చేసే ఒక్క అంజలి ఒకేసారి పాపాలను తొలగిస్తుంది, అలాంటి వ్యక్తి యొక్క శ్రేయస్సును పెంచుతుంది,  ఆ మంచి ఎప్పుడూ తగ్గదు. అందువల్ల, ఒక్కసారి అంజలి చేస్తే సరిపోతుంది. అనేక సార్లు చేయవలసిన అవసరం లేదు.  అనువాదకుల గమనిక:   పెరియ పిరాట్టి యొక్క మహిమను చాలా అందంగా భట్టార్ తన శ్రీ గుణరత్న కోశం, 58 వ స్లోకంలో వెల్లడిచేసారు – “ఐశ్వర్యం అక్షర గతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలి పరం వహతే విధీర్య అస్మై న కించిత్ ఉచితం కృతం ఇతి అత అంబత్వం లజ్జసే కతయ కః అయం ఉధారభావః” ఓ మాతా! ఒకవేళ ఎవరైనా మీ ముందు అంజలి వహిస్తే, మీరు అతనికి ప్రాపంచిక సంపద, సర్వోత్తమమైన గమ్యం (పరమపదం) మరియు పరమపదంలో కైంకర్యాన్ని ఆశీర్వదిస్తారు. ఇన్ని ఇచ్చిన తరువాత కూడా, ‘నేను తగినంత చేశానా?’ అని అనుకొని సిగ్గుతో తల క్రిందకు దించుకుంటారు. దీని నుండి మనం ఎమ్పెరుమాన్ మరియు పిరట్టి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు, భక్తుడు వారిని సమీపించడంలో కనీసం ప్రయత్నం చేయడాన్ని కూడా భరించక వారు దయను ఒకేసారి కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంక అనేక ప్రయత్నాల గురించి ఏమి చెప్పాలి?
  • అంజలి చేయడం వల్ల భవిష్యత్తులో చాలా కాలం తరువాత ఆశించిన ఫలితం లభిస్తుందని, ఆ ఫలితం వెంటనే ఇవ్వబడుతుందని అర్థం చేసుకోకపోవటం . “క్షిప్రం దేవ ప్రసాదినీ” లో చెప్పినట్లుగా, భగవాన్ ఎవరైనా అంజలి చేయడాన్ని చూసినప్పుడు వారు ఆశించిన ఫలితాన్ని వెంటనే ఇస్తాడు. మునుపటి వివరణ నుండి కూడా దీనిని అర్థం చేసుకోవచ్చు.
  • ప్రతి అపచారానికి ఒక అంజలి తప్పనిసరిగా నిర్వహించాలి అని భావించుట, అన్ని అపచారములను తొలగించడానికి ఒకే అంజలి సరిపోతుందని అనుకోకపోవుట. “అపరాదానిమాం సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ!” – ఆత్మలలో ఉత్తముడా(భగవాన్) దయచేసి నా నేరాలన్నిటినీ క్షమించండి అని అంజలి చేయడం సరిపోతుంది. అనువాదకుల గమనిక: ఈ సూచన స్లోకం “ఉపచారాపదేశేన …” లోని భాగం. ఈ స్లోకం ఇంట్లో మన తిరువారాదనం చివరిలో పారాయణం చేయబడుతుంది. దీని అర్థం “ఓ భగవాన్! నిన్ను విలాసపర్చడానికి మరియు మీకు సేవ చేయాలనే కోరికతో నేను ఈ తిరువారాదనం ప్రారంభించాను. అయితే నేను మీకు సేవ చేయడం కంటే ఎక్కువ అపరాధాలు చేశాను. దయచేసి ఇలాంటి నేరాలకు నన్ను క్షమించండి”. భగవాన్ యొక్క గొప్పతనాన్ని చూస్తే, మనం తగినంతగా వారికి సేవ చేయలేము. అలాగే, ఈ సంసారంలో చిక్కుకొని ఉన్న జీవాత్మ యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే, తిరువారాదనం చేసేటప్పుడు కూడా, ఎమ్పెరుమాన్ మీద మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టి వారిని సరిగ్గా ఆరాధించడం చాలా కష్టం. కాబట్టి, భగవాన్ యొక్క గొప్పతనం మరియు జీవాత్మ యొక్క లోపాలు,ఈ రెండు కోణాల నుండి చూస్తే, తిరువారాదనం జీవాత్మా వైపు నుండి అసంతృప్తికరంగా ముగుస్తుంది. కానీ భగవాన్ సౌలభ్యం (సరళత) తో, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తన భక్తుడు చేసిన కైంకర్యాలను ఎంతో ఆనందంతో స్వీకరిస్తారు.
  • మునుపటి వివరణ మాదిరిగానే, అంజలి కొన్ని పాపాలను మాత్రమే తొలగించుటయే కాకుండా అన్ని రకాల పాపాలను తొలగిస్తుంది. దీనిని “సర్వపాపనివారణి” (అన్ని పాపాలను తొలగించునది) అని అంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా పాపాలు చేసి, ప్రతిసారీ అంజలి చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చని అనుకునే వారికి పురోగతి ఆశ లేదు.
  • అంజలి చేయడం వల్ల కొన్ని శుభాలు మాత్రమే ఇస్తుందని, సంపూర్ణ శుభాలు కాదని భావిస్తే అది అడ్డంకి . ఇంతకుముందు స్తోత్ర రత్నం 28వ స్లోకం లో చర్చించినట్లుగా, ఇది అన్ని శుభాలను ప్రసాదిస్తుంది.
  •  ఆశించిన ఫలితం వచ్చేవరకు మాత్రమే అంజలి చేయడం మరియు ఫలితం లభించిన తర్వాత కూడా అంజలి చేయుట కొనసాగించాలని అర్థం చేసుకోకపోవుట. దీని ఫలితంగా భగవత్ అనుభవం మీద కేంద్రీకృతమై ఉంది. పరమపదంలో కూడా, నిత్యులు మరియు ముక్తులు “నమ ఇత్యేవ వాదినః” అని చెప్పినట్టుగా  అంజలి చేస్తూ ఉంటారు . అనువాదకుల గమనిక:  నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 3.8.4 లో “కైకళాలాఱత్ తోళుత్తు తొళుతున్నై” – అంజలి చేయడం ద్వారా నిన్ను నిరంతరం ఆరాధిస్తున్నాను. నంపిళ్ళై యొక్క వ్యాఖ్యానం దీనికి చాలా అద్భుతమైనది – ఆళ్వార్ యొక్క దివ్య భావోద్వేగాలను బహిర్గతం చేయడంలో వారి తేజస్సు ఒక ప్రకాశవంతమైన సూర్యుడిలా ప్రకాశిస్తుంది. అంజలి చేసే నమ్మాళ్వార్ ప్రవృత్తి తనకు చాలా ప్రియమైనదని ఆయన అన్నారు. అతను “భౌతిక కోరికలపై దృష్టి కేంద్రీకరించినవాడు వారి కోరిక నెరవేరిన తర్వాత ఆరాధనను ఆపివేస్తాడు. ఇది ఒక సాధనంగా చేసేవాడు వారి లక్ష్యం సాధించిన తర్వాత ఆగిపోతాడు. కాని ఇది వారి యాత్ర (జీవితం) గా ఉన్నవారికి ‘నిత్యాంజలి పుడాః” లో చెప్పినట్లుగా, స్వేత ద్వీప వాసులకు (క్షీరసముద్ర నివాసులకు), పరమపాదంలోని  (నిత్యులు మరియు ముక్తులు) కూడా గతంలో ‘ఇత్యేవ వాదినః’ చూసినట్లుగా నిరంతరం అంజలిని నిర్వహిస్తుంటారు. ఈ గొప్ప భక్తుల అంజలి ప్రదర్శనల  ప్రేరేపణల వల్ల ఎమ్పెరుమాన్ తనను తాను నిలుపుకుంటున్నారని వారు వివరిస్తున్నారు. కాబట్టి, ఎమ్పెరుమాన్ పట్ల ఎంతో ప్రేమ మరియు ఆప్యాయతతో కైంకర్యంగా చేసినప్పుడు, అంజలి చేస్తూనే ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు.
  • గరుడ ముద్ర పాము విషాన్ని నియంత్రించి అణచివేస్తుందని అర్థం చేసుకోకపోవుట, ఈ అంజలి ముద్ర భగవాన్ యొక్క స్వాతంత్ర్యము (మొత్తం స్వాతంత్ర్యం / స్వేచ్ఛా సంకల్పం) ను నియంత్రిస్తుంది మరియు లొంగదీస్తుంది. ఈ సూత్రం పట్ల చాలా నమ్మకంగా ఉండాలి. అనువాదకుల గమనిక: శ్రీ రామాయణ స్లోకంలో, “చ చాల చాపం చ ముమోచ వీరః” – రావణుడు రామునిపై బాణాలు వదులుతుండగా,  శ్రీ రాముడు కూడా విల్లు ఎక్కుపెట్టి యొద్ధం చేస్తున్నారు. కానీ రావణుని విల్లు శ్రీ రాముని చేత విరిగిపోయినప్పుడు,  రావణుడు ఆ విల్లును కింద పెట్టివెస్తాడు. (తన చేతుల్లో ఆయుధాలు లేకపోతే రాముడు అతన్ని కొట్టలేడని బాగా తెలుసు), శ్రీ రాముడు వెంటనే రావణునిపై  దాడి చేయకుండా అతనికి ప్రాణ దానమిచ్చాడు. మన పూర్వాచార్యులు ఈ విషయం గురించి వివరిస్తూ, ఆ సమయంలో రావణుడు ఒక అంజలిని ప్రదర్శించి ఉంటే, అతను శ్రీరాముడిని సులభంగా గెలిచి ఉండేవాడు – ఎందుకంటే ఎమ్పెరుమానుని ఈ సర్వోత్తమైన ముద్ర ద్వార నియంత్రించబడతారు కాబట్టి.
  • అభయ హస్తం (రక్షణ ముద్ర) శేషి (యజమాని) స్వభావానికి తగినట్లుగా, అంజలి హస్తం (జోడించిన చేతుల ముద్ర) శేష భూతుని (సేవకుడు)  స్వభావానికి తగినదని మనం దృఢముగా అర్థం చేసుకోవాలి. అలాంటి విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. శేషి  – స్వామి (యజమాని) అనగా, ఎమ్పెరుమాన్. అతను అభయ హస్తం (రక్షణ ముద్ర), వరద హస్తం (ప్రసాదిస్తున్న ముద్ర), ఆహ్వాన హస్తం (ఆహ్వానిస్తున్న ముద్ర) వంటి వివిధ ముద్రలలో తన హస్తాలని ఉంచుతారు. అదేవిధంగా, జీవత్మ కొరకు, అంజలి హస్తం అత్యంత సముచితమైనది – ఇది జీవాత్మ యొక్క అనణ్య గతిత్వం (వేరే ఆశ్రయం లేదని) మరియు అకించణ్యం (అతని చేతిలో ఏమీ లేదని) వెల్లడిస్తుంది. అనువాదకుల గమనిక: మునుపటి వివరణలో తిరువాయ్మొళి 3.8.4 పాసురం యొక్క వ్యాఖ్యానం మనం ఇప్పటికే చూశాము – ఎమ్పెరుమాన్ తన భక్తులను రక్షించడం ద్వారా తనను తాను నిలబెట్టుకుంటారు, ఇంకా జీవాత్మ ఎమ్పెరుమాన్ రక్షణతో తనను తాను నిలబెట్టుకుంటాడు.
  • తనను తాను రక్షించుకునే ఆలోచనతో అంజలి చేయడం అడ్డంకి. అంజలి చేయడం తనను తాను రక్షించుకునే సాధనం ఏమీ లేదని తెలుపుతుంది. వేరే ఆశ్రయం లేనట్లే, తనను తాను రక్షించుకోలేడు. తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై వార్తై గ్రంథం “ఇరు కైయుం విట్టేనో ద్రౌపదియైప్ పోలే” – నా రెండు చేతులతో నన్ను నేను రక్షించుకోవడం మానేసి ద్రౌపదిలాగా ఎమ్పెరుమానుకి పూర్తి శరణాగతి చేస్తున్నానా? ద్రౌపది తన గౌరవాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆమె తనను తాను రక్షించుకునే ప్రయత్నాలను వదలి, “హ కృష్ణా! హ ద్వారకావాసా!” అని ఆర్తితో పిలుస్తుంది, వెంటనే ఎమ్పెరుమాన్ ద్వారా రక్షించబడుతుంది కూడా. అదేవిధంగా, మనం కూడా మన రక్షణకై  ఎలాంటి అపేక్ష లేకుండా అంజలి చేయాలి.
  • కైంకర్యం తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసం అంజలి చేయుట. అనువాదకుల గమనిక: జీవాత్మ ఉనికి యొక్క మొత్తం ఉద్దేశ్యం భగవానుడికి వారి భక్తులకు సేవ చేయడమే. వేరే అపేక్షలు ఉండకూడదు. ప్రయోజనాలకు బదులుగా అంజలి చేయడం ఇది జీవాత్మ పరమాత్మల మధ్య వ్యాపార ఒప్పందం కాదు. మనం ఇంతకుముందు పోయిగై అజ్వార్ యొక్క ముదల్ తిరువంతాది పాసురం 26 “ఎళువార్ విడై కొళ్వార్ ఇన్ తుళాయానై వాళువా వగై నినైన్దు వైగల్ తొళువార్…” – సంపదను ఆశించేవారు, కైవల్యాన్ని ఆశించేవారు వారి కోరికలు నెరవేరిన తర్వాత ఎమ్పెరుమానుని వదిలివేస్తారు, కానీ పూర్తిగా ఎమ్పెరుమాన్ సేవ చేయాలనుకునే వారు నిరంతరం మరే ఇతర కోరిక లేకుండా ఎమ్పెరుమానుని ఆరాధించడంలోనే నిమగ్నమై ఉంటారు.
  • దేవతాంతర దేవాలయాల ముందు  శఠగోపునికి (నమ్మాళ్వార్ ) అంజలి చేయడం ఒక అడ్డంకి. తిరువాయ్మొళి పఠించేటప్పుడు, ప్రతి పదిగం (పది పాసురాలు) చివరిలో, 11 వ పాసురం పఠించేటప్పుడు, నమ్మాళ్వార్ పేరు విన్నప్పుడు (శఠగోపన్, వళుతి నాదన్, మాఱన్, మొదలైనవి), నమ్మాళ్వారు మనకు చేసిన గొప్ప సహాయానికి కృతఙ్ఙతగా అంజలి చేయాలి. ఎప్పుడైనా సరే నమ్మాళ్వార్ పేరు విన్నప్పుడు  అదే పద్దతిని (తప్పక అంజలి చేయడం) అనుసరించాలని చెప్పబడింది. కానీ అది కూడా, మనం ఇతరదేవతాంతర దేవాలయాల దగ్గర లేదా ముందు ఉన్నట్లయితే, అంజలి చేయకూడదు (ఎందుకంటే పొరపాటుగా ఇతర దేవతలకు అంజలి చేసినట్టు కావచ్చు). ఈ సందర్భంలో, “శఠగోపనుం త్యాజ్యం”  – (అంజలి) శఠగోపునికి కూడా వదులుకోవాలి. అనువాదకుల గమనిక: పురప్పాడు (ఊరేగింపు) సమయంలో తిరువాయ్మొళి వీధుల్లో పఠించక పోయినప్పటికీ, గొప్ప భాగవతులు తరచూ పాసురములను వారి మనస్సులో పఠిస్తూ  అర్ధాలను స్మరించుకుంటూ ఉంటారు.  అలాంటి సందర్భాల్లో కూడా, దేవతాంతరాలపై భక్తి చూపించకుండా జాగ్రత్త పడాలి.
  • అభాగవతులు (ఎమ్పెరుమాన్  భక్తులు కానివారు) ఎవరైనా అంజలి చేసినప్పుడు, మనం అంజలితో ప్రతిస్పందించకూడదు – దానిని విస్మరించాలి. దీనికి విరుద్ధంగా, మనం భాగవతులను చూసినప్పుడు, వారు చేసే ముందే మనం అంజలి చేయాలి.
  • అచార్యులను చూసినప్పుడు, కేవలం అంజలి చేయకుండా, పూర్తి సాష్టాంగ నమస్కారాలు చేయాలి, పైకి లేచి అంజలి చేయాలి.
  • మనస్సులో నిజాయితీ లేకుండా, లేదా పాక్షికంగా కూడా అంజలి చేయకూడదు. అనువాదకుల గమనిక: అంజలిని హృదయపూర్వకంగా సరైన పద్ధతిలో చేయాలి. ఒక్క చేత్తో వందనాలు చేయడం సాధారణంగా శాస్త్రంలో ఖండించబడింది.
  • నమ్మాళ్వార్ (శఠగోప స్వామి మొదలైన) నామమును విన్నప్పుడు తలపై అంజలి చేయకపోవుట. దీని గురించి గతంలో వివరంగా చర్చించారు. గోష్టిలో (సామూహికంగా) పాసుర పారాయణం చేసేటప్పుడు, తలపై చేతులు ఎత్తి అంజలి చేయడం మనం గమనించడం లేదు. ఎమ్పెరుమాన్ యొక్క పాదుకలను శ్రీ శఠగోప అంటారు. గోష్టిలో లేదా ఇంకెప్పుడైనా, మనం శ్రీ శఠారితో ఆశీర్వదించబడినప్పుడు, మనం వినయంగా తల వంచి, అంజలితో ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించాలి.
నమ్మాళ్వార్  శ్రీ శఠగోపం రూపంగా – వానమామలైలో ఉంది

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/03/virodhi-pariharangal-18.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

తత్త్వత్రయం – భగవంతుడు అనగా ఎవరు?

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

తత్త్వత్రయం

<< అచిత్తు: పదార్థము అనగా నేమి?

  • శ్రీ పిళ్ళై లోకాచార్యుల “తత్వత్రయం” అను ఈ గ్రంథమును శ్రీమణవాళ మహాముణుల యొక్క దివ్య వ్యాఖ్యాన సహితముగా చిదచిదీశ్వర తత్వముల యొక్క వైభవమును తెలుసుకొనుటకు సాగిస్తున్న మన ప్రయాణములో ఈ అధ్యాయములో సర్వ విశిష్టమైన ఈశ్వర తత్వమును గూర్చిన విషయములను తెలుసుకొందాం !!

పరిచయం

  • ఈ అధ్యాయములో సర్వోన్నతమైన ఈశ్వర తత్వమును మరియు ఈశ్వరేతర తత్వములైన చిదచిత్తులతో వైశేషిక బేధమలను ఆమూలాగ్రముగా విశ్లేషించెదము!!

స్వరూపము – దాని నిజ తత్వము

ఈశ్వర తత్వము యొక్క స్వభావము:
  • అశుభ గుణాలకు అతీతము – అనగా సృష్టిలోని అని మంగళకరమైన, శుభములైన పరిణామములు భగవంతుని యొక్క దివ్య కళ్యాణ గుణములే!
  • భావాతీతుడు – అనగా కాలము (కాలాతీతుడు – భూతభవిష్యద్వర్తమాన కాలముల యందు ఉండెడివాడు), ప్రదేశము (సర్వాంతర్యామి – అన్ని ప్రదేశముల యందు తన ఉనికి కలిగి ఉండెడివాడు), వస్తువు (స్థావర, జంగమ, జడ, చరాచర వస్తువుల యందు ఆత్మగా ఉండెడివాడు)!
  • అపార జ్ఞానమూర్తి, అనంత కరుణారసార్ణవుడు.
  • అనేకములైన దివ్యకల్యాణ గుణములకు నిలయుడు, అఘటిత ఘటనా సమర్థుడు.
  • సృష్టి స్థిత్యంత కార్యములను సమర్థముగా నిర్వహించెడివాడు.
  • చతుర్విధ పురుషార్థముల ద్వారా చేతనుల చేత ఆశ్రయించబడేవాడు – అలాగే చేతనులకు చతుర్విధ పురుషార్థములను ఒసగే వాడు.
  • చతుర్విధగాములు ఆశ్రయించెడివాడు – భగవద్గీత 7.6 లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధముగా చతుర్విధగాములు:  ఆర్తులు – సంసారములో అలమటించెడివారు, అర్ధార్ధులు –  ప్రాపంచిక సుఖసంపదలను అర్థించెడివారు, జిజ్ఞాసువులు – మోక్షము అర్థించెడివారు; జ్ఞానులు – అర్థభావ రహిత స్థితిలో ఉండెడివారు.
  • అనంత దివ్యరూపములు కలిగినవాడు
  • శ్రీభూనీళాది దేవేరులకు ప్రాణసఖుడైనవాడు

జీవాత్మ ఎటుల శరీరాలు మార్చినను దాని యొక్క మూల తత్వము నశించదో అటులనే అన్ని జీవుల యందు అంతర్యామిగా ఉన్నప్పటికిన్నీ పరమాత్మ యొక్క మూల స్వరూపము చెక్కుచెదరదు!

భగవత్కల్యాణ గుణములు
ఈశ్వరుని యొక్క అమేయ దివ్య కళ్యాణ గుణములు:
  • నిత్యము – ఎల్లపుడు ఉండెడివి
  • అనంతము – పరిమితులకు అందనివి
  • అనేకము – లెక్కించనలవి కానివి
  • నిర్హేతుకము – కార్యకారణములతో తెలియనలవి కానివి
  • నిర్మలము – లోపము చూపజాలనివి
  • నిరుపమానము – సర్వతంత్ర స్వతంత్రుడైన ఈశ్వరుని యొక్క దివ్య కల్యాణ గుణములను వర్ణించుటకు ఉపమానములు దొరకవు
అయితే అనంతమైన భగవత్కళ్యాణ గుణములను మూడు వర్గములుగా విభజించవచ్చు! అవి,
  • వాత్సల్యము: ఈశ్వరుని శరణుజొచ్చిన శిష్టుల యెడ ప్రేమగా అనుకూలముగా ప్రవర్తించుట – వాత్సల్యములో తిరువెంకటనాథుని గొప్పగా చెప్పెదరు.

  • సౌశీల్యము: ఎటువంటి ఆడంబరములు, భేషజములు లేక ఉన్నతులకు, కడువారికి కూడా అందేలాగ అందరి యెడ సమానమైన చిత్తముతో ప్రవర్తించుట – శ్రీ రామచంద్ర మూర్తి యొక్క కళ్యాణ గుణములలో సౌశీల్యము చెప్పుకోదగిన గుణము – అటు విభీషణునితో, హనుమంతునితో, ఇటు గుహునితో ఒకే విధమైన స్నేహనిరతి కలిగినవాడు శ్రీరాముడు.

  • సౌలభ్యము: అందరికి సులభముగా దొరికేవాడు! శ్రీ కృష్ణ పరమాత్మకు ఈ గుణము బహు విశేషముగా వర్తిస్తుంది!

అలాగే మరికొన్ని విశేషమైన భగవద్గుణములు,

  • మార్దవము: మృదుత్వము – శారీరకముగానూ, మానసికముగాను పరమాత్మ మృదు స్వభావి
  • ఆర్జవము: యోగ్యత, పెద్దరికము, న్యాయమూర్తిత్వము
  • దుష్టులు, అధర్మచారులైన వారిని నిర్జించగల శౌర్యము, వీర్యము కలవాడు!
  • సర్వజ్ఞత్వము: సర్వ విషయముల యందు అవగాహన కలిగినవాడు
  • శక్తి: సృష్టి యందలి అన్ని కార్యములను నడిపించగల శక్తి కలిగినవాడు
  • బలము: విశ్వగమనానికి సహాయపడగల సామర్థ్యము బలము కలిగినవాడు
  • ఐశ్వర్యము: సృష్టిని నియంత్రించ గలవాడు
  • వీర్య: ప్రతి శక్తులను సమర్థవంతముగా ఎదుర్కొనగల సామర్థ్యము కలవాడు
  • తేజస్సు: అపరిమితమైన ప్రకాశము కలిగినవాడు

భగవత్కళ్యాణగుణములు – వాటి ఉద్దేశ్యము

  • భగవంతుని యొక్క అనంతమైన కళ్యాణ గుణములకు ఉద్దేశ్యములు, లక్షణములు కలవు! అవి,
    • భగవంతుని యొక్క జ్ఞానము తమను అజ్ఞానులలుగా భావించే వారికి సహాయపడుటకుకు
    • భగవంతుని యొక్క శక్తి అతనిని ఆశ్రయించినవారిని రక్షించుటకు
    • భగవంతుని యొక్క క్షమ తప్పు ఒప్పుకుని శరణని ఆశ్రయించినవారిని అనుగ్రహించుటకు
    • భగవంతుని యొక్క కృప సంసార బాధలలో అలమటించుచున్నవారిని ఉద్ధరించుటకు
    • భగవంతుని యొక్క వాత్సల్యము తెలియక చేసిన తప్పుల వలన తన భక్తులకు పడ్డ కర్మల నుంచి కాపాడుటకు
    • భగవంతుని యొక్క శీలము అణగారిన కడజాతి వారి చెంత చేరుటకు
    •  భగవంతుని యొక్క ఆర్జవము తనను నమ్మని వారిని కూడా అనుగ్రహించుటకు
    • భగవంతుని యొక్క మార్దవము తనను విడిచి ఉండలేని అమాయక భక్తులను ఊరడించుటకు
    • భగవంతుని యొక్క సౌలభ్యము తన చెంతకి చేరలేని వారి చెంతకు తాను చేరి వారిని అనుగ్రహించుటకు
    ఇలా భగవంతుని యొక్క కళ్యాణగుణములకు అనేక దివ్య లక్షణములు చెప్పవచ్చును!
    భగవంతుని దివ్య గుణముల యొక్క సాక్షాత్కారము
     
    • భగవంతుడు ఈ సంసారములో అలమటిస్తున్న తన భక్తులను ఉద్ధరించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండును
    • ఈశ్వరుడు ప్రారబ్ధపీడితులైన జీవులను ఉద్ధరించుటకు సహాయము చేస్తూండును
    • ఈశ్వరుడు తనను శరణుజొచ్చిన వారి యొక్క జన్మ జ్ఞాన స్వభావ లక్షణములు గమనించక వెంటనే వారికి సహాయపడును.
    • తనను తాను రక్షించుకోలేని లేక మరే విధమైన సహాయ సాధనము లేని దుర్భర జీవులను ఈశ్వరుడు పట్టించుకుని సహాయపడును.
    • ఈశ్వరుడు జీవులను తనవైపు తిప్పుకొనుటకు దివ్య లీలలను ప్రదర్శించును. ఉదాహరణకు  కృష్ణావతారములో శ్రీ కృష్ణ పరమాత్మ ప్రదర్శించిన అద్భుతమైన దివ్యలీలలు.
    • ఈశ్వరుడు ఎల్లపుడు తనను జీవులకు అందుబాటులోనే ఉంచుతాడు.
    • జీవులకు సహాయపడటమే వ్రతముగా కలిగి ఉంటాడు!
    • ఈశ్వరుడు జీవుల నుంచి బదులు ఆశించక జీవులు వారి వారి తాహతిని బట్టి సమర్పించే చిన్న కానుకను కూడా స్వీకరించి వారికి అపరిమితమైన లాభమును చేకూరుస్తాడు!
    • ఈశ్వరుడు తనను శరణు జొచ్చినవారికి ఐహిక సుఖ భోగముల లాలస తగ్గించి వారిని మోక్ష సాధనవైపు మనసును మరలుస్తాడు!
    • ఈశ్వరుడు శరణాగతుడైన భక్తుడు చేసిన తెలిసి తెలియని పొరబాటులను తన భార్య శ్రీమహాలక్ష్మి ఎత్తి చూపిననూ తాను మాత్రం వాటిని విస్మరించి వాత్సల్యముతో క్షమించి రక్షిస్తాడు!
    •  ఈశ్వరుడు జీవులలో లోటుపాట్లను, పసి పిల్లల ఉచ్చిష్టములను తల్లి సహించినట్లుగా, సహిస్తాడు!
    •  తన శిష్టులు దూరమైతే వారికన్నా ఈశ్వరుడే ఎక్కువగా దుఃఖించును.
    • ఆవు అప్పుడే పుట్టిన లేగదూడను సాకుటకు కోడె దూడలను దూరము పెట్టినట్లు, జీవుడు భగవంతునికి శరణాగతి చేసినచో అతనిని తన దేవేరులు, నిత్యసూరులకంటే మిన్నగా ఈశ్వరుడు ఆదరించి రక్షిస్తాడు!
భగవంతుని కారణత్వం – సనాతన కారణత్వం

మనకు కనిపించే ఈ సృష్టిలోని పిండాండము నుంచి బ్రహ్మాండము వరకు సృష్టి చేసినవాడు చతుర్ముఖ బ్రహ్మ ! ఈ చతుర్ముఖ బ్రహ్మను కూడా సృష్టించిన పరబ్రహ్మమే ఈశ్వరుడైన శ్రీ మహా విష్ణువు! ఇంకా,

  • ఈశ్వరుడు ఈ చరాచర సృష్టికి కారణ భూతుడు.
  • పదార్ధముల యొక్క మూల వస్తువులైన అణువులు సనాతనమని నమ్మలేము!
  • ఒకవేళ విశ్వములో పదార్థము వలన జీవులు జీవులలో మూలకణములు సృష్టి కాబడినచో దానిని సృష్టించిన తత్వము ఒకటి ఉండవలెను!
  •  దేవతలలో బద్ధ చేతనులుగా చెప్పబడే బ్రహ్మ రుద్రాది ప్రభృతులు సృష్టి మొదలు పుట్టి ప్రలయ సమయమున భగవంతునిలోకి లీనమయ్యెదరను శాస్త్ర సత్యమును బట్టి వారునూ సనాతులు కాజాలరని తెలియుచున్నది!
  • కనుక పై పదార్థములను దేవతలను లోకాలను సృష్టి చేసి స్థితి కూర్చి లయం చేసుకోగల మహోన్నత శక్తికి ఈశ్వరుడు అని పేరు!
  • కనుక జగత్తుకు కారణ భూతుడైన శక్తి ఈశ్వరుడే! అయితే ఈ కారణత్వము భగవంతునికి అజ్ఞానము చేతనో లేక కర్మ చేతనో రాలేదు! అది ఒక కేవలం ఈశ్వరుని యొక్క సంకల్ప మాత్రము చేత జరుపబడిన సృష్టి కార్యము!!
  • సృష్టి స్థితి లయములు భగవంతుని సంకల్ప పరిణామాలు! ఆ కార్యముల వల్ల భగవంతునికి ప్రయోజనము కానీ వాటి యందు నిమిత్తము కానీ లేక కర్మానుభవము కానీ ఉండదు! ఇదంతా కేవలం ఒక లీలగా భగవంతుడు చేయుచున్నాడు!
  • భగవంతుని లీలామాత్రకమైన సృష్టి ప్రళయముతో ముగుస్తుంది! ఆటలాడుకొనుచున్న పిల్లలు ఇసుక కోట కట్టుకుని మరల ఆ కోటను చిదిమేసినట్లుగా భగవంతుడు లీలగా జగత్తును సృష్టి చేసి మరల తనలోకి లయమొనర్చుకొనును!
  • భగవంతుడు తననే ఈ చరాచర సృష్టిగా మార్చుకొనును! కనుక సృష్టి యొక్క మూల పదార్ధం కూడా భగవంతుడే!
  • కారణత్వములు మూడు: ఉపాధాన కారణత్వం (కార్యమునకు కావలసిన వస్తువు), నిమిత్త కారణత్వం (కార్యము చేయువాడు), సహకార కారణత్వం (కార్యసాధనలో ఉపకారములు): మట్టితో పాత్ర చేయునపుడు మన్ను ఉపాధానము, కుమ్మరివాడు నిమిత్తము మరియు తిరగలి యంత్రము సహకారము అగును-మట్టి పాత్ర నిర్మాణములో ఈ మూడు వస్తువులు కారణత్వము వహించును!
  • జగత్కార్యమునకు తానూ కారణ భూతుడైయున్ననూ ఈశ్వరుని యొక్క సహజ స్వరూపము మార్పు చెందదు! అందుకని భగవంతునికి నిర్వికారుడని ఒక నామము కలదు!
  • సాలీడు తన లాలాజలంతో దారములల్లి గూడుకొట్టుకుని మరల ఆ గూడును తానే మింగివేసినట్లు, భగవంతుడు తనలోని భాగమైన బ్రహ్మపదార్థము చేత చిదచిత్తులను సృష్టి చేసి మరల ప్రళయములో తనలోకి లయము చేసుకొనును!

సృష్టి – స్థితి – లయ

ఈశ్వరుడే కారణ భూతుడై ఈ మూడు కార్యములను నిర్వహించును! విశ్వసృష్టి శూన్య దశ నుంచి పంచ భూతముల వరకు తయారు చేసి జీవులను ప్రభవించి తానే అంతర్యామిగా వారిలో ప్రకాశించును!

సృష్టి
  • జడ పదార్థము నుంచి జీవ పదార్థమును ప్రభవింపజేయుట
  • జీవాత్మలకు ఇంద్రియ సహితముగా శరీరమును కూర్చుట
  •  జీవులలో బుద్ధిని సృజించి పెంచుట
స్థితి
  • సృష్టించిన జీవుల మనుగడకు తోడ్పడి వారిని అభివృద్ధి చేయుట!
  • సర్వకాల సర్వావస్థల యందు తాను జీవునికి తోడుగా యుండి అనుకూల మనస్సును కలుగజేయుట – మొక్క పెంచునపుడు నీరు భూమి నుండి మొక్కలోకి ఎగబాకి ఎదుగుదలకు ఊతమిచ్చినట్లు ఈశ్వరుడు జీవుని ఎదుగులలో తోడ్పడును!
  • ఋషుల చేత వేదము, ధర్మ శాస్త్రములు జీవులకు అందించుట – తద్వారా జీవుని బుద్ధిని  ధర్మానువర్తిగా చేయుట
  • తాను శ్రీ రామ కృష్ణాది అవతారాలు ఎత్తి జీవుల మధ్య తిరుగుతూ తాను ధర్మమును ధర్మశాస్త్రములను ఆచరించి జీవునికి చూపుట!
  • జీవాత్మలు అథోగతి పాలు కాకుండా వారిని శాస్త్ర జ్ఞాన రూపమున రక్షించుట!
  • వారిలో అంతర్యామిగా మనస్సాక్షిగా మారి సన్మార్గము చూపుట!

లయ (సంహారం)

  • ధర్మ మూలము మరిచి అధర్మ మార్గమున చరించుచున్న జీవాత్మల వలన సృష్టి ఇబ్బంది పడుతున్న సమయమున సామూహిక కర్మానుభవ సాక్షిగా ప్రళయము జరుగును
  • ప్రళయము జగత్తును స్థితి దశ నుంచి శూన్య దశకు చేర్చును.
  • సంహారముగా ఈశ్వరుని అంతర్యామిగా చేర్చుకుని రుద్రుడు, అగ్ని, కాలము ప్రచోదన చేసి వినాశనమును కలిగించును.
  • వినాశనము భగవంతుని యొక్క తమోగుణ రూపము.
భగవానుని స్వాతంత్రత
  • సృష్టి క్రమములో భగవంతుడు స్వాతంత్రుడై స్వయం నియంతృత్వముతో సృష్టి చేయును
  • జీవులు వారి వారి కర్మ వాసనాలను బట్టి రకరకాల రూపములు దాల్చి సృష్టించబడుదురు! వారిలో సుఖపడువారు కొందరు దుఃఖపడువారు మరికొందరు! జీవుల కర్మ ఫలితములకు భగవంతడికి ఎటువంటి నిమిత్తము లేదు! (నమ్మాళ్వార్లు సాయించినట్లు తిరువాయ్మొళి 3.2.1)
భగవానుని అనంత దివ్య రూపములు
 
భగవంతుని గుణ, స్వభావముల కంటే అతని దివ్య రూపములు మిక్కిలి రమ్యములు, అవి:
  • అనాది స్వరూపము
  • సమమైనవి
  • నిత్యమై సత్యమై నిజ జ్ఞానరూపకమైనది
  • జీవుని బంధించిన శరీరము వలె కాక భగవంతుని రూపము అతని నిజ తత్వము చూపించునట్లుగా అపౌరుషేయమైనదై ఉండును
  • మిక్కిలి ప్రకాశవంతమైనదై ఉండును
  • అనంత దివ్య కల్యాణ గుణ మిళితమైయుండును
  • ఋషులు తమ తపస్సులలో దర్శించనలవి కాని అద్భుతమై సత్వ గుణోపేతమై ఉండును
  • ఏ రూపము దర్శిస్తే ఇక ప్రాపంచిక రుచులపట్ల ఆసక్తి సన్నగిల్లునో అట్టి మహోన్నతమైన దివ్య రూపము ఈశ్వర రూపము
  • ముక్తాత్మలు, దివ్యసూరులు అనుక్షణం సేవించి దర్శించే దివ్యరూపము
  • అన్ని బాధలను తొలగించునట్టి శక్తి కలది
  • లీలావతారములకు మూలమైనది
  • అన్ని తనలో ఇముడ్చుకున్నది! అన్నిటియందు తాను ఇమిడియున్నది!
  • శంఖచక్రగదాపద్మాది దివ్యాయుధాభరణ ధరితమైనది!

అటువంటి భగవత్స్వరూపము అయిదు విధములుగా దర్శించవచ్చును,. అవి:

  • పరత్వము: పరమపదము యందు ఉండెడి దివ్యరూపము (వైకుంఠనాథుడు, పరమపదనాథుడు)
  • వ్యూహము: లోకాలలో కనిపించి సంచరించెడి రూపములు (ప్రద్యుమ్న, సంకర్షణాది రూపములు)
  • విభవము: అవతార రూపములు (మత్స్యకూర్మాది దివ్యావతార రూపములు)
  • అర్చ: స్వయంభువుగా లోకులు అర్చించుకొనుటకు ఏర్పడిన రూపములు (తిరుమల, శ్రీరంగేత్యాది దివ్యక్షేత్రములలో మూర్తులు)
  • అంతర్యామి: చేతనాచేతన శరీరములలో మనస్సులోపలి హృద్పద్మమందు వెలసిన రూపము
  • ఈ రూపములు క్లుప్తముగా ఇచట వర్ణించబడినవి: http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html.

పరత్వ రూప లక్షణము

  • బ్రహ్మాండమునకు వెలుపల వెలసిన అనంతానంద నగరి పరమపదము! అనంతమైన దివ్య ప్రకాశముతో కాలాతీత నియమమున దివ్య సూరులు, ముక్తులు నివసించెడి పరబ్రహ్మలోకమది!
  • సర్వత్రా మంగళకర శకునములతో ఆ పరమపద నగరము అలరారుచుండును
  • అచట పరబ్రహ్మము పరవాసుదేవునిగా, అనంతగరుడవిశ్వక్సేనాది నిత్యసూరిగణముల దివ్య కైంకర్యములను స్వీకరిస్తూ, శ్రీభూనీలాది దేవేరీయుతుడై, అచట మణిమయ మండపము నందు కుర్మాసనముపై ఆదిశేషుడు సింహాసనమవగా, దానిమీద ధర్మ పీఠముపై కూర్చుని, దివ్యాన్గనలు చామరములు వీచుచుండగా సర్వాకాలంకార విభూషితుడై, పాదముల వద్ద వైనతేయుడు నిలుచుండగా, సర్వదివ్య కళ్యాణ గుణసమన్వితుడై, పరాత్పరుడిగా, పరత్వరూపుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు ప్రప్రన్నులకు అమితమైన సంతోషాన్ని కలిగించుట కొరకు పరమపదమందు సేవ శాయించును!
వ్యూహ రూప లక్షణము
  • పరవాసుదేవుడైన పరమపదనాథుడు వ్యూహ వాసుదేవునిగా రూపమును పొందును! ఈయనే క్షిరాబ్ధి నాథుడైన శ్రీ మహావిష్ణువు!
  • భౌతిక లోకముల యొక్క పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించుట కొరకు శ్రీ మహాలక్ష్మితో కూడి పరమాత్మ పాల కడలిని రాజధానిగా చేసుకొని సృష్టి స్థితి లయములను కార్యములు నిర్వర్తించుచుండును!
  • వ్యూహ వాసుదేవుడు సంకర్షణునిగా, ప్రద్యుమ్నునిగా, అనిరుద్ధునిగా మరో మూడు రూపములు దాల్చును!
  • సంకర్షణుడు – జ్ఞానము, బలము అనే గుణములు కలిగి, జీవులయందు శరీరాత్మ భేదములు కలిగించుచుండును. వేదశాస్త్రముల యందలి జ్ఞానమునకు కారణభూతుడితడు! సంకర్షణుడే ప్రద్యుమ్నునిగా ఆవిర్భవించును!
  • ప్రద్యుమ్నుడు ఐశ్వర్యము, వీర్యమనే గుణములకు అధిపతి యితడు! శరీరియందు మనస్సును అధిష్టించి ఉండును! ధర్మాధర్మ విచక్షణ శరీరిలో ఉద్దీపించే శక్తే ప్రద్యుమ్నుడు! జీవులలో మంచి బుద్ధి కలిగించి సత్కర్మాచరణకు ప్రేరేపిస్తాడు! తద్వారా జగత్తులో ధర్మము నడిచే విధముగా చేసే శక్తి ఈ ప్రద్యుమ్నుడు! అంతే కాక జీవులను సృజించుట, వర్ణాశ్రమ ప్రక్రియలకు బాధ్యుడు కూడా ఈ ప్రద్యుమ్నుడే! ప్రద్యుమ్నుడు పిదప అనిరుద్ధునిగా రూపు దాల్చును!
  • అనిరుద్ధుడు – అనిరుద్ధుడు కాలాన్ని నడిపించేవాడు! శక్తి, తేజస్సు ఇతని గుణములు! అలాగే జీవులలో సత్వరజస్తమో గుణములకు కారకుడు యితడు!
విభవం:

శ్రీమహావిష్ణువు యొక్క దశావతారలకు విభవ అవతారాలని పేరు. అయితే ఈ దశావతారాలే కాక ఇంకా ఎన్నో అవతారాలు కలవు. విభావావతారములను రెండు విధములుగా వర్గీకరించవచ్చును, అవి:

  • ముఖ్యావతారములు:
    • ఇవి శ్రీ రామకృష్ణాది దశావతారములు. భగవానుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం తన స్వయం సంకల్పము చేత అవతరించేవి ముఖ్య అవతారములు.
    • ముముక్షవులు ధ్యానించి ఉపాసించవలసిన అవతారములు ఇవి.
    • భగవానుడు పరమపదంలో ఉండెడి తనయొక్క అపూర్వమైన గుణగణములను ఈ అవతారములలో తన కలిగియుండును.
    • పరమపదములో భగవంతునికి ఉండెడి తేజస్సంపద అవతార సమయమందు కూడా కలిగియుండును.
    • దీపమును వెలిగించిన అగ్గిపుల్ల కంటే దీపము మిక్కిలి ప్రకాశమానమై వెలిగినట్లు పరమపదమందలి భగవంతుని ప్రకాశవిశేషము మరింతగా ఈ ముఖ్యావతారములందు బయల్వెడును.
  • గౌణావతారములు:
    • భగవానుడు తానే స్వయముగా అవతరించిననూ అవతరించకపోయిననూ తన యొక్క శక్తి విశేషమును మరియొక జీవునియందు ప్రవేశపెట్టి లోక కళ్యాణమును తలపెట్టును.
    • ప్రాపంచిక కార్యములు తలపెట్టుటకు అవతరించుట చేత గౌణావతారములు ముముక్షువులకు అంత ముఖ్యము కాదు.
    • ఈ గౌణవతరములు రెండు విధములు, అవి:
      • స్వరూపావేశం: భగవంతుడు తన యొక్క దివ్యమైన తేజస్సు ద్వారా జీవులను ఉత్తేజపరిచి భగవత్కార్యమును జరిపించుట. ఉదా: వ్యాస మహర్షి, పరశురాముడు, మొ||
      • శక్త్యావేశం: భగవంతుడు తన యొక్క శక్తిని దివ్యాంశగా ప్రవేశపెట్టి జీవుల చేత కార్యములు చేయించుట. ఉదా: బ్రహ్మ రుద్రాది దేవతాంశలు
    • భగవంతుడు ఎప్పుడు అవతరించినా పూర్తిగా తన యొక్క స్వయం సంకల్పం చేత అవతరించును.
    • తాను అవతరించుటకు కారణమును భగవంతుడే గీతలో (4.8) చెప్పియున్నాడు, “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ…. “. సాధువులైన తన యొక్క భక్తులను రక్షించుట కొరకు, దుష్ట బుద్ధులను వినాశన చేయుటకు మరియు ధర్మగ్లాని ఏర్పడ్డ ప్రతి సమయందు లోకమును సంస్కరించి ధర్మమును పునః ప్రతిష్ఠ కావించుటకు భగవంతుడు అవసరమైనపుడు అవతరించును.
    • కొన్ని అవతారములలో భగవంతుడు మునులచేత శాపమును పొంది భూమియందు జీవునిగా అవతరించుట పురాణ కథలలో చూచెదము. అయితే అది కేవలం ఒక లీల మాత్రమే! ఇది ఒక రహస్యము! అసలు నిజము భగవంతుని యొక్క స్వతంత్ర సంకల్పమే!

అంతర్యామి

  • జీవాత్మలందు నిర్హేతుక కృప కలిగిన భగవంతుడు జీవుల మనస్సులలో హృదయాంతర్వర్తియై అంతర్యామిగా కొలువుండును.
  • ధ్యానము యోగము ద్వారా మోక్షసాధన చేయు ముముక్షువులకు మొదటగా స్వామి అంతర్యామిగా దర్శనమిచ్చును.
  • ముముక్షువును సర్వకాల సర్వావస్థల యందు గమనించు మనస్సాక్షియే భగవంతుని యొక్క అంతర్యామి స్వరూపము.
  • జీవుల హృదయ మందిరములో కొలువైన భగవంతుడు ఎల్లప్పుడూ జీవులను రక్షిస్తూ ఉండును.

అర్చావతారము

  • పరవ్యూహవిభవాది అవతారములలో భగవంతుడు దేశకాల ధర్మాది పరిమితులకు లోబడి చరించును.
  • అయితే, పొయిగైయాళ్వారు ముదల్ తిరువదందాది, 44 వ పాశురములో కీర్తించినట్లుగా  అర్చావతారములలో భగవంతుడు భక్తులు కోరుకున్న చోట, కోరుకున్న విధముగా కొలువై ఉండును.
  • ఆలయములో విగ్రహరూపములో వేంచేసి ఉండే దివ్యమూర్తికి అర్చావతారం అని నామము.
  • భగవంతుని అర్చావతారములు ఆళ్వార్లు మంగళాశాసనము చేసినవి 108 దివ్యదేశములు
  • ఇవే కాక భగవద్, ఆచార్యాభిమాన క్షేత్రములు, మానవ నిర్మితములైన రకరకాల ఆలయములలో రకరాకల రూపములలో (శయన, ఉపవిష్ట, ఉత్తిష్ఠ భంగిమలలో) భగవంతుడు సేవ శాయించును.
  • అర్చావతారములో, మిగిలిన అవతారములలో ఉన్న అన్ని దివ్యలక్షణములు ఉండును. అవి సౌశీల్య, సౌలభ్య, వాత్సల్య గుణవిశేషములు.
  • అర్చావతారములో భగవంతుడు భక్తుని యొక్క దోషములన్నిటిని క్షమించి మిక్కిలి అనుగ్రహదృష్టి చేత భక్తుని కైంకర్యములను స్వీకరించును.
  • భక్తుడు వేదవిహితమైన ఆగమ పద్ధతులలో షోడశోపచారములతో భగవంతుని సేవించుకొనవలెను.
  • అర్చావతారము యొక్క పరిపూర్ణ వివరము:
    • అర్చా విగ్రహ రూపములో భగవంతుడు భక్తునికి తన అమేయమైన వైభవము యొక్క రుచిని చూపించును
    • జన్మ కర్మ జ్ఞాన వివక్ష లేకుండా అర్చారూపము అందరి జీవులకు నెలవగును
    • భగవంతుని యొక్క దివ్య గుణానుభవమును అర్చావతార మూలముగా ముముక్షువులు పొందవచ్చును. పూర్వము ఆళ్వారాచార్యులందరూ అర్చా రూపమైన పరమాత్మను సేవించి తరించినవారే! (ఆళ్వారాచార్య వైభవము ఈ క్రింది లింకులో చదవవచ్చును. http://ponnadi.blogspot.in/p/archavathara-anubhavam.html)
    • భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడైననూ, సర్వ జీవ కోటికి ఆధార భూతుడైననూ, అర్చా రూపమైన విగ్రహరూపములో భక్తుల చేత ఉపచారములు స్వీకరించుచు భక్త పరాధీనుడై ఉండును.
    • అయిననూ తన యొక్క నిర్హేతుక కృప చేత, భక్తుల యెడ అమితమైన కరుణ చేత భగవంతుడు విగ్రహరూపుడై మన చెంతనే ఉండి అమితమైన వాత్సల్యముతో మనము తెలిసి తెలియక చేసేది అపచారములను క్షమించి మన ఐహిక కామ్యములను ఈడేర్చును.

ముగింపు

అత్యంత సంక్లిష్టమైన, మర్మగర్భమైన చిదచిదీశ్వర తత్వములను తెలిపే “తత్వ త్రయము” అనే గ్రంథమును స్థాళీపులాక న్యాయముగా చూచితిమి!శ్రీ పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించిన  “కుట్టి భాష్యము” గా కీర్తింపబడే ఈ గ్రంథమునకు శ్రీమణవాళ మహాముణులు అనుగ్రహించి వ్యాఖ్యానములో మరిన్ని లోతైన అర్థములు, వివరణలు కలవు. అయిననూ మన శక్తి కొలది ఈ దివ్య గ్రంథమును తెలుసుకొనుటకు మనకు శక్తిని ఆసక్తిని ఒసగిన పూర్వాచార్యులకు, ఆళ్వార్లకు శ్రీ శ్రీయ: పతులకు పల్లాండు పాడెదము! వారు అనుగ్రహించిన ఇటువంటి అద్వితీయమైన గ్రంథముల కన్నను వేరు సంపద లేదు మనకు!

దాసునికి ఈ తత్వత్రయం గ్రంథమును పరిచయము చేసి దాని అర్థమును వివరించిన శ్రీ ఉ. వే. ప్రతివాది భయంకరం సంపత్ స్వామికి సదా రుణపడి ఉందును!

“శ్రీమతే రమ్యజామాతృ మునింద్రాయ మహాత్మనే

శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళమ్ ”

మంగళాశాసన పరై: మదాచార్య పురోగమై:

సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-iswara-who-is-god.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 26

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 25

ఆళ్వార్ – ఆళ్వాన్

అతిమానుష స్తవంలో మూడవశ్లోకం ఆళ్వాన్లకు ఆళ్వార్లపై గల భక్తిని ప్రకటిస్తున్నది.

శ్రీమత్పరాంజ్ఞ్కుశ మునీంద్ర మనోనివాసాత్ తజ్జానురాగరసమజ్జనమంజసా22ప్య  I
అధ్యాప్యనారతతదుత్తిత రాగయోగం శ్రీరంగారాజా చరణాంబుజ మున్నయామః II

” శ్రీరంగారాజా చరణామ్బుజ మున్నయామహః”   అనే శ్లోక భాగమే ఇందులో జీవగర్ర. ఇది శ్రీరంగనాధుని శ్రీపాదపద్మాలను సంకేతిస్తున్నది. సాధారణ కవులు శ్రీరంగనాధుని శ్రీపాదపద్మాలు ఎర్రబడటానికి కారణం ఆ పాదాలమృదుత్వం లేదా మృదువైన పాదాలతో నడవటం వలన అని చెప్తారు.  కానీ శ్రీవైష్ణవుల శిరోమణి అయిన నమ్మాళ్వార్లు అలా అనడం లేదు. శ్రీపాదలు ఎర్ర బడటానికి ఒక అందమైన కారణం చెప్పారు.

నమ్మాళ్వార్ల లోతైన హృదయానికి చేరుకున్నపరమాత్మ శ్రీపాదలు అక్కడ భక్తిలో మునిగి, ఆ ప్రేమకు చిహ్నమైన ఎర్రని రంగులో ఉన్నవని వర్ణించారు.

పరమాత్మమీద నమ్మాళ్వార్లకున్న ప్రేమకంటే నమ్మాళ్వార్లమీద అళ్వాన్ కున్నప్రేమ పదిరెట్లు ఎక్కువ. అతిమానుషస్తవం రెండవ భాగంలో కృష్ణావతార అనుభవం వర్ణించడానికి నమ్మాళ్వార్ల దివ్యశ్రీసూక్తులే ఆధారంగా కనపడుతుంది.
సుందరబాహుస్తవంలో పన్నెండవ శ్లోకం ఈ విధంగా ఉంది.

“ వకుళధర సరస్వతీ విషక్త స్వర రస భావయుతాసు కిన్నరీషు!

 ద్రవతి ద్రుషదపి ప్రసక్తగానా స్విహ వనశైల తటీషు సుందరస్య !!

కిన్నెర బాలికలు తిరుమాలిరుంశోలైలో సుందరబాహుపెరుమాళ్ళ దగ్గరకువచ్చి, తమ మధురమైన గాత్రంతో  నమ్మాళ్వార్ల పాశురాలకు తగినట్లు స్వరపరచి గానం చేయగా, ఆ గానం విన్న రాళ్ళు కరిగి ప్రవహించి అది నూపుర గంగగా మారింది అంటున్నారు.

ఆళ్వార్లు “మరంగళుం ఇరంగుం వగై మణి వణ్ణా  ఎన్రు కూవుమాల్”  అన్న ఆళ్వార్ల పాశురాన్ని గుర్తు చేస్తున్నారు. ఆళ్వార్ల దైవిక ప్రేమలో పుట్టిన పాటలు రాయిని కూడా కరిగించగల శక్తివంతమైనవి. ఇక మామూలు మనుషుల గురించి చెప్పేదేముంటుంది. ఆ పాశురాలు మానవులందరినీ పరమాత్మ సన్నిధికి చేర్చే శక్తిగలవి.

            ఆళ్వాన్, ఆళ్వార్ల పాటలను ఈ భూలోకంలోనే కాక ఇతర అన్నిలోకాలలోనూ భగవంతుడిని చేరాలనుకునే  వాళ్ళు పాడతారు అని ఆళ్వార్లను తన ప్రత్యేకమైన శైలిలో కీర్తిస్తున్నారు.

            వరదరాజ స్తవం (59) లో పరమాత్మ ఎక్కడెక్కడ ఆనందంగా విశ్రాంతి తీసుకుంటారో చెపుతూ  “యత్స్య మూర్థా శఠారే” అని చెప్పారు. పరమాత్మకు విశ్రాంతి తీసుకోవటానికి పరమానందమైన ఆహ్లాదమైన ప్రదేశంగా ఆళ్వార్ల తిరుముడిని ఆళ్వాన్ చెపుతున్నారు.

          ఆళ్వాన్ల స్తవాలన్నీ ఆళ్వార్ల పాశురార్థాలుగానే ఉన్నాయి. అయినా కంచి ప్రతివాది భయంకరం  అణ్ణంగరాచార్య స్వామివారి వ్యాఖ్యానంలో పేర్కొన్నవాటిలో స్థాలిపులాక న్యాయంగా కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

ఆళ్వార్ల  శ్రీసూక్తికి, ఆళ్వాన్ల స్తవాలతో ఉన్నపోలిక ఈక్రింద వివరించబడింది.

ఆళ్వాన్ల గ్రంధం ఆళ్వాన్ల వాక్కు ఆళ్వార్ల  శ్రీసూక్తి పోలిక
వైకుంఠ స్థవం (7) ఊర్ధ్వ పుంసాం…మూర్థిని… చకాస్తి 1. తిరుమురాలిన్జోలైమలైయే ఎన్ తలియే.
2. ఎన్ ఉచ్చియుళానే  (నా రసుపై అధిరోహిం చినవాడా)
ఆళ్వార్లు, పరమాత్మ దివ్యదేశాలలో వేమ్చేసినట్లు నా శిరసు మీద  వేమ్చేశారని చెపుతున్నారు.
శ్రీవైకుంఠ స్థవం (10) ప్రేమాగ్ర విహ్వలిత గిరా: పురుషా: పురాణా: 1. ఉళ్ళెల్లాంఉరుగి కురల్.
2.వేరారావేట్కైనోయ్ మేల్లావి ఉళ్ ఉలర్త .
3.ఆరావముదే అడియే నుడలం నిన్పాల్ అన్బాయే .
ఆళ్వార్లు పరమాత్మమీద ప్రేమవలన తనస్వరం పరవశించి కంపిస్తున్నదని, అందువలన తన ప్రేమ గొప్పదని అంటున్నారు.

దీనినే ఆళ్వాన్  మహాత్ములకు  పరమాత్మమీద భక్తివలన స్వరం కంపిస్తున్నదని, అంటున్నారు.

శ్రీవైకుంఠ స్థవం (10) ప్రేమాగ్ర విహ్వలిత గిర: పురుషా: పురాణా: 1.కేట్టు ఆరార్ వానవర్గళ్ సెవికినియ
2. తొండర్కముదుండ, సోల్ మాలైగళ్ సోన్నేన్
ఆళ్వార్లు తన మాటలు పరమాత్మకు, నిత్యసూరులకు, భక్తులకు మధురమైనవిగా అమరినవి అని అంటున్నారు.                                                                       ఆళ్వాన్  ఆళ్వార్ల వంటి మహాత్ముల వాక్కులు మధురమైనవి అని అంటున్నారు.
సుందరబాహు స్తవము (4) ఉదధిగ మంన్దరాద్రి మధి మన్థన లబ్ధ పయో ఆండాళ్  మదుర రసేన్దిరాహ్వాసుధ సుందరదోఃపరిగమ్!  మందిరం నాట్టియన్రు క్షీరసాగరమధనం గురించి చెప్పబడింది .
సుందరబాహు స్తవము (5) శశధర రిజ్ఞ్ఖణాఢ్యశిఖ ముచ్చిఖర ప్రకరం మదితవళ్ కుడుమి  మాలిరుం సోలై ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము
సుందరబాహు స్తవము (5) భిదురిత సప్తలోక  సువిశృజ్ఞ్ఖల శజ్ఞ్ఖరవమ్!! అదిర్ కురల్ శజ్ఞత్తు అళగర్ తమ్  కోయిల్ ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (8) మొత్తం శ్లోకం పెరియాళ్వార్లు – కరువారణం తన్పిడి తణ్  తిరుమాలిరుంశోలైయే ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (16,17) ప్రారూఢశ్రియ మాశ్రయే వనగిరేః   యం-అరుత-శ్రీ: ఆరూఢశ్రీ ఆండాళ్  ఏరుతిరుఉడైయాన్ ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (40) మొత్తం శ్లోకం కొల్గిన్ర కోళిరుళై సుగిర్దిట్ట మాయన్ కుళల్ ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (49) మొత్తం శ్లోకం ఆండాళ్ – కళి వండెంగుం కలన్దార్పోల్  మిళిర్ నిన్రు విళైయాడ
తిరుమంగై ఆళ్వార్ – మైవణ్ణ నరుం కుంజీ కుళల్ పిన్ తాళ మగరం సేర్ కుళైఇరుపాడి ఇలంగియాడ
ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ల అనుభవాన్ని ఆళ్వాన్ శ్లోకంలో కనపదుతుంది .
సుందరబాహు స్తవము (55) మొత్తం శ్లోకం ఆండాళ్ – సేమ్కమలనాణ్ మలర్ మేల్     తేనుగరుమన్నంపోల్ ద్రావిడ  పాశురానికి సంస్కృత శ్లోకము
సుందరబాహు స్తవము (62,63) మొత్తం శ్లోకం తణ్ తామరై సుమక్కుం
పాదపెరుమానై
ఆళ్వార్ల పాశురంలో ‘సుమక్కుం’ అన్న ప్రయోగ భావాన్ని ఆళ్వాన్  తమ శ్లోకంలో అనుభవించారు.
సుందరబాహు స్తవము (92) మొత్తం శ్లోకం తిరుమంగై  – నిలై యిడ మెంగుంమిన్రి ద్రావిడ  పాశురానికి సంస్కృత శ్లోకము. ఆళ్వాన్, ఆళ్వార్లు ఎంచుకున్న చందస్సులోనే పాడారు.                                            భాగంలో ఆళ్వార్ల, ఆళ్వాన్ల రచనలలోని పోలికలను చూసి తరించాము.

ద్రావిడ  పాశురానికి సంస్కృత శ్లోకము. ఆళ్వాన్, ఆళ్వార్లు ఎంచుకున్న చందస్సులోనే పాడారు.

ఈ భాగంలో ఆళ్వార్ల ,ఆళ్వాన్ల రచనలలోని పోలికలను చూసి తరించాము.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/24/dramidopanishat-prabhava-sarvasvam-26/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

విరోధి పరిహారాలు – 17

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/25/virodhi-pariharangal-16/.

48. వందన విరోధి  – నమస్కారం చేయడంలో అవరోధాలు. 

వందనం అనగా సాష్టాంగ నమస్కారం – ఈ సందర్భంలో భూమిని ఎనిమిది అవయవాలతో (2 కాళ్ళు, 2 మోకాళ్ళు, ఉదరము (కడుపు), 2 భుజాలు, 2 చేతులు మరియు నుదురు) తాకినట్టుగా పూర్తి నమస్కారాలు (సాష్టాంగ నమస్కారం) సమర్పించుట. “వైష్ణవో వైష్ణవం ధృష్త్వా దణ్డవత్ ప్రణామేత్ పువి” – ఒక వైష్ణవుడు మరొక వైష్ణవుడిని కలిసినప్పుడు, అతను వెంటనే భూమిపై ఒక కర్ర లాగా పడి నమస్కారాలు సమర్పించాలి. పూర్తి నమస్కారాలను సమర్పించడాన్ని దండం సమర్ప్పిత్తల్, దణ్డనిడుతల్  (తమిళం లో) అని అంటారు. ఈ విభాగంలో, భగవాన్, భాగవతలు మరియు ఆచార్యుల సమక్షంలో నమస్కారాల గురించి అనేక అంశాలు వివరించబడ్డాయి. ఇక్కడ ఒక సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన పూర్వాచార్యులు ఎప్పుడూ ఒకసారి నమస్కారాలు అర్పించేవారు – సకృత్ (ఒకటి) ప్రణామం (నమస్కారం) మాత్రమే. ఒక విభాగం వైష్ణవులు  ఒకటి కంటే ఎక్కువ సార్లు నమస్కారాలు చేస్తారు – నేను (వి.వి.రామానుజం స్వామి) ఇక్కడ ఆ సూత్రంపై చర్చలోకి రావడం లేదు. కానీ దణ్డనిడుతల్ (ఒకవేళ) – అంటే కర్ర లాగా నిటారుగా పడటం. కింద పడిన కర్ర పైకి లేచి మళ్ళీ పడదు – మనం అలా గుర్తుంచుకోవచ్చు.

అనువాదకుల గమనిక: సాధారణంగా, ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం / భక్తి చూపించడానికి నమస్కారం చేస్తారు. మనం మన నమస్కారం ఎమ్పెరుమాన్ , తాయార్, నిత్యసూరులు (అనంతుడు, గరుడ, విశ్వక్సేనుడు, మొదలైనవారు), ఆళ్వారులు, ఆచార్యలు మరియు భాగవతులకు అర్పిస్తాము. మనతో దేహ సంభందము ఉన్న లౌకిక ప్రవ్రుత్తి గల వ్యక్తులకు లేదా వారు వృద్ధులైనందున, దేవతాంతర సంభందం ఉన్న వారికి, సామాన్య ఆచార్యులకు (కళలు, విజ్ఞానము నేర్పించే ఉపాద్యాయులు), భగవాన్ పట్ల గౌరవం లేనివారికి మనం నమస్కారం చేయకుండా ఉండాలి.  ఈ విభాగంలో ఈ అంశాలు వివరంగా చర్చించబడ్డాయి. మరో ముఖ్యమైన విషయం – శ్రీవైష్ణవంలో, నమస్కారం చేసేటప్పుడు వయస్సుకు పరిమితం లేదు. మన పూర్వాచార్యుల జీవితంలో చాలా సంఘటనలలో, వయస్సులో పెద్ద శ్రీవైష్ణవుడు చిన్న శ్రీవైష్ణవునికి నమస్కారం సమర్పించారు. తిరుమంగై ఆళ్వార్ తిరుమొళి పాసురం 8.2.9 లో  “కణ్ణపురం కైతొళుం పిళ్ళైయైప్ ఎన్ఱేన్నప్ పెఱువఱే” – తిరుక్కణ్ణపురం ను  ఎవరైతే  ఆరాధిస్తారో వాడు చిన్నపిల్లవాడైనా సరే, చిన్నవానిగా భావించరాదు.  అతడైనా / ఆమైనా శ్రీవైష్ణవిడిగా భావించాలి. తిరుమంగై ఆళ్వార్ తిరునెడుంతాణ్దగం పాసురం 14 లో “వళర్త్తతనాల్ పయన్ పెఱ్ఱఏన్ వరుగవెన్ఱు మడక్కిళియైక్ కైకూప్పి వణంగినాళే ” – పరకాల నాయకి (తిరుమంగై ఆళ్వార్ నాయికా భావంతో) ఒక చిలుకను చేరదీసి పెంచినపుడు, ఆ చిలుక ఎమ్పెరుమాన్ నామాలను చాలా ఆనందంగా పలుకుతుండటం చూసి ఆనందంతో పరకాల నాయకి చేతులు జోడించి తన స్వంత చిలుకకు అంజలి పెడుతుంది. ఆళ్వాన్ యొక్క ధర్మ పత్ని (భార్య) ఆండాళ్ తన సొంత పుత్రుని ( శ్రీ రంగంలోని మన సత్ సాప్రదాయం యొక్క గొప్ప పండితులు పరాశర భట్టర్ ) శ్రీపాద తీర్ధాన్ని తీసుకునేవారు. కాబట్టి, యువకులైనా వ్రుద్ధులైనా, శ్రీవైష్ణవులకు పరస్పర నమస్కారం చేయడం అవసరమైన అంశం.ఆదర్శమైన ఉదాహరణ – ఎంపెరుమానార్ తిరుక్కోష్టియూర్ నంబికి ప్రణామాలు అందిస్తున్నారు

  • నమస్కారం చేసే ముందు భూమిని తనిఖీ చేయడం ఒక అడ్డంకి. నేల తడిగా, బురదగా ఉన్నప్పటికీ, శరీరాన్ని / బట్టలను పట్టించుకోకుండా నమస్కారం చేయాలి.
  • పూర్తి నమస్కారం చేయకపోవడం ఒక అడ్డంకి. కిందకు కొంచం వంగి చేతులతో నేలను తాకకూడదు. క్రింద పడుకున్నపుడు మొత్తం ఎనిమిది అవయవాలు భూమిని తాకేలా చూడాలి. కర్ర లాగా పడటం అని ఇప్పటికే వివరించబడింది.
  • పూర్తి ఏకాగ్రత లేకుండా నమస్కారం చేయుట ఒక అడ్డంకి. నమస్కారం చేసేటప్పుడు ఆ వ్యక్తి పూర్తి దృష్టి ఎమ్పెరుమానుపై / భాగవతులపై / ఆచార్యలపై పెట్టాలి.
  • ద్వయ మహ మంత్రాన్నిస్మరించకుండా, పఠించకుండా నమస్కారం చేయుట. ఎమ్పెరుమాన్కి నమస్కారాలు చేస్తున్నప్పుడు ద్వయ మహ మంత్రాన్ని పఠించాలి. మన పెద్దలలో సాధారణంగా ఆళవందార్ యొక్క స్తోత్ర రత్న స్లోకం 22 పఠించడం గమనించ వచ్చు,  “న ధర్మ నిష్టోస్మి …” – నాకు కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి ఏవీ లేవు; నా చేతులతో మీకు అర్పించగలది ఏమీ లేదు, ఇంకెక్కడికి వెళ్ళ లేను; నేను మీ పాద పద్మాలకు శరణాగతి చేస్తున్నాను. ఈ సందర్భంలో మనం ఒక ముఖ్యమైన అంశాన్ని అర్థం చేసుకోవాలి. నమస్కారాలు చేసిన తరువాత, అభివాదనం (మన గోత్రం, సూత్రం, పేరు మొదలైనవి) తెలియ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అభివాదనం  వైధిక కర్మానుష్టానమునకు మాత్రమే పరిమితం. శ్రీ వైష్ణవులని కలిసినప్పుడు మనల్ని మనం “అడియేన్ రామానుజ దాసు” అని సంభోదించుకోవాలి”, అడియేన్ శ్రీవైష్ణవ దాసు”  – ప్రతివాది భయంకర అణ్ణా శిష్యులు పఠించినట్లు. ” అడియేన్ మధురకవి దాసు” అనంతాళ్వార్ శిష్యులు మొదలైన వారు పఠించినట్లు. ఈ అంశాన్ని శ్రీవైష్ణవులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అనువాదకుల గమనిక: అభివాదనం (గోత్రం , సుత్రం, వేదం మొదలైన వాటికి సంబంధించి తనను తాను గుర్తించుకోవడం) శరీరానికి సంబంధించినది. మనం ఆత్మ (స్వయం) పై దృష్టి కేంద్రీకరించినప్పుడు, మనం ఆత్మ-బంధువులను (శ్రీవైష్ణవులు – ఎమ్పెరుమానార్ యొక్క సేవకులుగా ఉండటం వల్ల మనకు సంబంధించిన వారు) కలిసినప్పుడు, మనం మన ఆత్మను సూచిస్తూ మనల్నిసంభోదించుకోవాలి. ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ చాలా అందంగా చూర్ణిక 36లో ఈ సూత్త్రాన్ని వివరించారు – “విప్రర్క్కు గోత్ర చరణ సూత్ర కూటస్తర్ పరాశర పారాసర్య బోదాయనాదిగళ్; ప్రపన్న జన కూటస్తర్ పరాంకుశ పరకాల యతివరాదిగళ్”-  బ్రహ్మణులకు (కేవలం శారీరికముగా ఆలోచిస్తున్న వారు), గోత్రం (వంశం), చరణ (వేదం యొక్క భాగం), సూత్రం (కర్మానుష్టానముపై  దృష్టి కేంద్రీకరించే వేదం యొక్క ఒక భాగం) పరాశర, వ్యాస, భోదాయన వంటి ఋషులు. ప్రపన్నులకు (వారు ఎమ్పెరుమాన్ యొక్క సేవకులని పూర్తిగా గ్రహించి, వారికి శరణాగతి చేసినవారు), వారి గుర్తింపు ఆళ్వారులైన అయిన నమ్మాళ్వార్ (పరామ్గుస), తిరుమంగై ఆళ్వార్ (పరకాల), మరియు ఎమ్బెరుమానార్ మొదలైన అచార్యుల సంబంధంతో ఉంటుంది. ఇక్కడ, మాముణులు వారి వ్యాఖానంలో చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నారు – ప్రపన్నులు ఆళ్వారులు మరియు అచార్యుల సంబంధంతో తమను తాము గుర్తించుకుంటారు, ఎందుకంటే ఆళ్వారులు మరియు అచార్యులు, వారి ఉపదేశాలు (సూచనలు) మరియు అనుష్ఠానాలు (ఆచరణాత్మక ఉదాహరణలు) ద్వారా ప్రపన్నలుకు అనుసరించాల్సిన సూత్రాలను నిర్దేశించారు. 
  • ఇది శాస్త్రంలో నియమించబడినదని ప్రేమ, భక్తి విహీనంగా నమస్కారం అర్పించడం.
  • ఎమ్పెరుమానుని నమస్కరించినట్టగా భాగవతులకు నమస్కారం సమర్పించడంలో సంకోచించుట. అనువాదకుల గమనిక: భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్పెరుమాన్కు సులభంగా ప్రేమ భక్తులతో నమస్కారం చేయవచ్చు. కానీ భాగవతులకు కూడా అదేవిధంగా ప్రేమ గౌరవాలు సమర్పించాలి. భగవాన్ తన భక్తుల నుండి ఆశించే ఎనిమిది లక్షణాలను వివరిస్తూ, తన భక్తులను ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా చూసుకోవాలని వివరించారు.  భక్తుడిగా అర్హత పొందాలంటే, మొదట భగవాన్ భక్తుల పట్ల గౌరవం మరియు శ్రద్ధ ఉండాలి.
  • ఆచార్యులకు నమస్కారం చేసేటప్పుడు వారి పాద పద్మాలకు దగ్గరగా మన శిరస్సు ఉండే విధంగా చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇలా చెప్పినప్పటికీ, ఆచార్యులను తాక కుండా జాగ్రత్తగా ఉండాలి – ముఖ్యంగా సన్యాసులకు కఠినమైన నియమనిబంధనలు ఉంటాయి, ఎవరితో కూడా శారీరక సంబంధం ఉండదు. కాబట్టి, మనం సరైన మర్యాదను పాటించాలి,  అలాంటి సందర్భాల్లో ఆచార్యులను శారీరకంగా తాకకుండా ఉండాలి.
  • ఒక్కసారి నమస్కారం చేసి సంతృప్తి చెందకూడదు. ఇక్కడ అసకృత్ ప్రణామం (పదేపదే నమస్కారాలు) ను సూచించట్లేదు – ఏదైనా నిర్దిష్ట కారణాల వల్ల ఆచార్యులచే సూచించబడినపుడు లేదా ఎమ్పెరుమాన్ / ఆచార్య సన్నీధి నుండి బయలుదేరుతున్న సమయాల్లో, “నేను మొదల్లో ఒకసారి నమస్కారం సమర్పించుకున్నాను ఈ రోజుకు సరిపోతుంది” అని అనుకోకూడదు.
  • ఆచార్యులు “చాలు! దయచేసి లేవండి” అని చెప్పే వరకు నమస్కారం చేస్తూ నేలపైనే ఉండాలి. ఇక్కడ మనము ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకోవచ్చు: ఎమ్పెరుమానార్ శ్రీ రంగంలో ఆలయ పరిపాలనలను సంస్కరిస్తున్నారు. ఆ సమయంలో, ఎమ్పెరుమానార్ యొక్క పరివర్తన ప్రయత్నాలను కొంతమంది ఇష్టపడ లేదు,  ఎమ్పెరుమానార్ యొక్క భిక్షను విషపూరితం చేయడానికి ఏర్పాట్లు చేశారు (సన్యాసిగా, వారు భిక్షాటన చేసేవారు – కాబట్టి వారి ఆహారాన్ని విషం చేయాలని నిర్ణయించుకున్నారు). ఎమ్పెరుమానార్ విష ప్రయత్నం గురించి తెలుసుకొని, సుమారు ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉంటారు. ఇది విన్న తిరుక్కోష్టియూర్ నంబి (ఎమ్పెరుమానార్ యొక్క ఆచార్యలలో ఒకరు) శ్రీరంగానికి పరుగెత్తుకు వెళతారు. ఎమ్పెరుమానార్ వారి ఆచార్యులను స్వాగతించాలన్న తపనతో, మిట్ట మధ్యానం మండే ఎండలో కావేరి నది ఒడ్డుకి వెళతారు. నంబిని చూసిన తరువాత, ఎమ్పెరుమానార్ క్రింద పడి వారికి నమస్కారాలు చేస్తారు. నంబి అతనికి లేవమని సూచించనందున, ఎమ్పెరుమానార్ వేడి ఇసుకలో అలాగే ఉంటారు. ఇది చూసిన కిడంబి ఆచాన్ (ఎమ్పెరుమానార్ యొక్క ప్రియమైన శిష్యులలో ఒకరు), పరుగెత్తుకు వెళ్ళి ఎమ్పెరుమానార్ని ఎత్తడానికి ప్రయత్నిస్తారు,  నంబిని “శిష్య ఆచార్యల మధ్య ఎలాంటి మర్యాద ఇది? మీరు ఈ వేడి మైదానంలో ఎమ్పెరుమానార్ని ఎందుకు బాధపెడుతున్నారు? ఎవరైనా లేత పువ్వును అగ్ని / వేడితో కాలనిస్తారా? ” అని అడుగుతారు. కిడంబి ఆచాన్కి ఎమ్పెరుమానార్ పట్ల ఉన్న అనుబంధంతో నంబి సంతోషిస్తారు మరియు “ఎమ్పెరుమానార్ పట్ల గొప్ప అనుబంధం కలిగి ఉన్న నీలాంటి వ్యక్తిని నేను వెతుకుతున్నాను. ఇప్పడినుండి ఎమ్పెరుమానార్  భిక్ష (ప్రసాదం) మీ నుండి మాత్రమే పొందుతాడు, వారు భిక్షాటన చేయవలసిన అవసరం లేదు”.  ఎమ్పెరుమానార్ స్వయంగా  నమస్కారాలు అర్పించి సరైన మర్యాదలను ప్రదర్శించే వారని దీని నుండి మనం తెలుసుకోవచ్చు.
  • నమస్కారం అర్పించడం మరియు ఆచార్య  పాద పద్మాలని శిరస్సుతో తాకక పొవడం. గతంలో చర్చించిన అంశాన్ని పోలి ఉంటుంది.
  • మనము ఎమ్పెరుమాన్ ఆరాధనకై వెళ్ళినప్పుడు, ఆచార్యులు అక్కడ ఉన్నట్లయితే, మొదట  ఆచార్యులకు మరియు తరువాత ఎమ్పెరుమాన్కు నమస్కారం అర్పించాలి. భౌతికంగా సాధ్యం కాకపోతే, ఎమ్పెరుమాన్కు నమస్కారాలు చేసే ముందు తమ ఆచార్యులకు మానసికంగా నమస్కారాలు అర్పించాలి. అనువాదకుల గమనిక:  ఎప్పుడూ మన ఆచార్యుల ద్వారా ఎమ్పెరుమాన్ దగ్గరకు వెళ్లాలి. కాబట్టి, వారు ఉన్నట్లయితే, మొదట ఆచార్యులకు నమస్కారం చేసి, ఆపై ఎమ్పెరుమాన్ దగ్గరకు వెళ్లాలి. ఈ అంశాన్ని మనం తిరువారాధనంలో కూడా చూశాము, మొదట మన ఆచార్యులను ఆరాధించి, వారి అనుమతి తీసుకొని  వారి తరపున తిరువారాదనం చేస్తాము. మాముణులు తన “జీయర్ పడి తిరువారాధన క్రమం” లో మనం తిరువారాదనమును ఎమ్పెరుమానార్, ఆళ్వార్లు, నిత్యసూరులకు అర్పించి ఆపై చివరికి  ఎమ్పెరుమాన్కి అర్పిస్తాము.
  • భగవాన్ సన్నిధిలో భాగవతులకు నమస్కారం సమర్పించుటకు సంకోచించడం ఒక అడ్డంకి. అయినప్పటికీ, ఈ రోజుల్లో ఇది ఆచరణలో కనిపించట్లేదు. సాధారణంగా, ఆలయం లోపల, ఎమ్పెరుమాన్ , తాయార్, ఆళ్వారులు, ఆచార్యలు తప్ప మరెవరికీ నమస్కరించడం ఈ రోజుల్లో పాటించబడటం లేదు.
  • ఇతర శ్రీవైష్ణవుల వందనాలకై ఆగి (వేచి) ఉండి, ఆపై మనం నమస్కారించి ప్రతిస్పందించడం ఒక అడ్డంకి. శ్రీ రాముడు “మృదు పూర్వంచ భాషతే” గా వర్ణించబడ్డారు –  ఎవరైనా కలిసేటప్పుడు శ్రీ రాముడు దయగల పదాలతో మొదట బాగోగులను అడిగేవాడు. అదేవిధంగా, శ్రీ వైష్ణవులు మనకు నమస్కారం చేసే ముందే మనం నమస్కారం చేయాలి.
  • ఒక శ్రీవైష్ణవుడు నమస్కారం చేసినప్పుడు, “అతను నన్ను ఆరాధిస్తున్నాడు” అని భావించి ప్రతిస్పందించడం  ఒక అడ్డంకి. ఈ సంధర్భంలో అళగియ మణవాళ పెరుమాళ్ నాయానార్ యొక్క తిరుప్పావై 1 వ పాశురం వ్యాఖ్యానంలోని ఒక సంఘటన గుర్తించబడింది. ఒకసారి ఎమ్పెరుమానార్ తన శిష్యులతో కలిసి నడుస్తున్నప్పుడు, పెరియ నంబి (మహా పూర్ణ స్వామి – ఎమ్పెరుమానార్ యొక్క ఆచార్యులు) ఎదురు వస్తే ఎమ్పెరుమానారుకి నమస్కారాలు చేస్తారు. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఎమ్పెరుమానార్ పెరియ నంబి యొక్క అంతర్ హృదయాన్ని తెలుసుకున్నప్పటికీ, చుట్టూ ఉన్న జనాలకు స్పష్టం చేయడానికి,  వారు తన సొంత శిష్యులకు నమస్కారాలు ఎందుకు చేశారని నంబిని అడుగుతారు. ఆళవందార్ ఉన్నారని భావించి తాను నమస్కారాలు చేశానని నంబి బదులిస్తారు (ఎమ్పెరుమానార్ను ఆళవందార్ (పెరియ నంబి యొక్క ఆచార్యులు) ప్రతినిధిగా చూసారు). ఆ విధంగా ఎమ్పెరుమానార్ వారి హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా, నమస్కారాలు తనకు చెందినవి కాదని భావించడం ద్వారా వారి ఆచార్యులపై పారతంత్రియాన్ని(పూర్తిగా  ఆధారపడుటను) ప్రదర్శించారు.  అనువాదకుల గమనిక: ఇచ్చే నమస్కారం తమకేనని మనము అనుకోకూడదు, కాని అవి అంతర్యామిగా ఉన్న భగవాన్ కోసమని మరియు మన సొంత అచార్యులతో, ఇతర అచార్యులతో  మరియు ఆళ్వారులతో కలిగి ఉన్న భాగవత సంభంధం కోసమని అని భావించాలి. ఇది నమస్కారం స్వీకరించి దానిని ఇతరులకు ప్రతిస్పందించే సరైన విధి.
  • ఒకవేళ  శ్రీవైష్ణవులకు మన పట్ల ఉన్న అభిమానం కారణంగా నమస్కారం చేయాలనుకుంటే, దానిని విస్మరించి పక్కకు తప్పుకోకూడదు. అనువాదకుల గమనిక: మునుపటి వివరణ మాదిరిగానే. శ్రీవైష్ణవులను, వారి నిజమైన కోరికలను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. వారి కోరిక ప్రకారం వారు మనకి నమస్కారాలు అర్పించాలని ఉంటే, అది మనకంటే ఉన్నత స్థానంగా భావించి, ఎంతో వినయంతో స్వీకరించాలి.
  • తిరువారాదనం పూర్తి చేసిన తర్వాత పూర్తి నమస్కారం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: తిరువారాదనం చివరలో, “ఉపచారాపదేశేన …” స్లోక పారాయణం చేసి, పూర్తి నమస్కారాలు చేస్తాము, తిరువారాదన సమయంలో ఏదైనా తప్పులు జరిగితే క్షమించమని అడుగుతాము. ఈ అంశం ఇక్కడ వివరించబడింది.
  • ఇయల్ గోష్టి సేవాకాలం (పురప్పాడు / ఊరేగింపు సమయంలో కలిసి పాసుర పఠనం) పూర్తి అయిన తరువాత, శ్రీవైష్ణవులు ఒకరికొకరు నమస్కారాలు చేస్తారు. నమస్కారం చేయకుండా వదిలివేయడం నేరం. ఇక్కడ “ఇయల్ సాఱ్ఱఉ”, కీర్తింపజేసే శ్లోకాన్ని పేర్కొన్నప్పటికీ, దీనిని ఇయల్ గోష్టి (రేగింపుల సమయంలో పాసురాలను జపించడం) గా పరిగణించవచ్చు. అనువాదకుల గమనిక: ఇది ఇప్పటికీ ప్రతిచోటా ఆచరణలో కనిపిస్తుంది. పురప్పాడు పూర్తయిన తరువాత, సమావేశమైన శ్రీ వైష్ణవులు సాధారణంగా నమస్కారాలు చేస్తారు, తరువాత తిరువందిక్ కాప్పు (దిష్టి నుండి రక్షణ కోసం హరతి) చేస్తారు.
  • శ్రీవైష్ణవ గోష్తిలోకి ప్రవేశించినపుడు ప్రారంభంలో నమస్కారం చెయ్యాలి,  ఆఖరిలో వెళ్ళేటపుడు నమస్కారం చేసి బయలుదేరడానికి అనుమతి తీసుకోవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • మనము ఆచార్యుల సమీపంలో నివసిస్తే, ప్రతిరోజూ ఆచార్యులను దర్శించుకొని, నమస్కారం చేసి  శ్రీపాద తీర్థం  (చరణామృతం) తీసుకోవాలి. కానీ, ఆచార్యుల సమీపంలో ఉండకపోతే, ప్రతిరోజూ ఆచార్యుల నివాసం దిశవైపు నమస్కారం చేయాలి.
  • పురోదాస అంటే యజ్ఞం (భగవాన్) యొక్క అవశేషాలు – అవి కుక్కలకు అర్పించకూడదు. అదేవిధంగా మనం ఒకసారి ఎమ్పెరుమానునికి శరణాగతి చేసిన తరువాత,  దేహ సంభందం (శ్రీవైష్ణవులు కాని వారు) ఉన్న వారు వృద్ధులు కదా అని నమస్కారం చేయకూడదు.
  • ఎవరైనా కెవలం ఎక్కువ కులంలో (బ్రహ్మణ  మొదలైనవి) జన్మించి నందున మనము నమస్కారం చేయకూడదు. అనువాదకుల గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ శ్రీవైష్ణవులు మరియు కేవలం బ్రహ్మణుల మధ్య తేడాలను అందంగా మరియు విస్తృతంగా వివరించారు. బ్రాహ్మణ్యం పూర్తిగా భగవాన్‌ను చేరికను  ఉద్దేశించినది – ఒక బ్రాహ్మణునికి అది అర్థం కాకపోయి, వేదం, వేదాంతం, మొదలైన వాటిలో బాగా ప్రావీణ్యం ఉన్నట్లు చెప్పుకుంటే, అది కేవలం విలువైన జ్ఞానాన్ని వృధా చేసినట్టవుతుంది.
  • ఒక శ్రీవైష్ణవుడు మన ఇంటికి వచ్చినప్పుడు, తగిన సౌకర్యవంతమైన ఆసనాన్ని అందించాలి, ఆపై నమస్కారం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: అతిథులు వచ్చినప్పుడు, వారి చేతులు, కాళ్ళు కడగడానికి మరియు నోరు శుభ్రం చేసుకోవడానికి నీటిని అందించాలి.  ప్రయాణంలో అలసినందుకు వారిని సుఖవంతంగా ఉంచాలి.
  • దేవతాంతర దేవాలయాల పరిసరాల్లో పాషండుల సమక్షంలో (అవైష్ణవులు , ప్రధానంగా అవైధికులు – వెదాన్ని ప్రమాణంగా స్వీకరించనివారు) నమస్కారం చేయుట. అవైష్ణవులను గౌరవించకూడదనే ఈ సూత్రం గురించి గతంలో విస్త్రుతంగా వివరించబడింది.
  • తిరుప్పత్తి లోకి (తిరుప్పత్తి అంటే సాధారణంగా దివ్య దేశం అని అర్ధం, దేవాలయం అని కూడా అర్ధం), ప్రవేశించే ముందు ప్రవేశద్వారం వద్ద నమస్కారం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  • ఆచార్యులకు మరియు ఆచార్య సమానులైన వారికి (శ్రీవైష్ణవులు) బహిరంగంగా  నమస్కారాలు సమర్పించడానికి సంకోచించడం ఒక అడ్డంకి. మనం వారిని ఎక్కడ చూసినా వెంటనే నమస్కారం చేయాలి.
  • ఇతర (ప్రాపంచిక) విషయాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మ విద్య (భగవాన్ యొక్క అత్యంత రహస్య జ్ఞానం) గురించి అంత బాగా తెలియని వ్యక్తికి నమస్కారం చేయుట ఒక అడ్డంకి. “తత్ కర్మ యన్నా భందాయ స విద్యా య  విముక్తయే, ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా సిల్పనైపుణం” – (మనలను బంధ విముక్తులను చేసే చర్య, మనలను బంధ విముక్తులను చేసే జ్ఞానమే నిజమైన జ్ఞానము,  ఇతర చర్యలన్నీ కెవలం మనిషిని అలసేలా చేస్తాయి).  ప్రాపంచక జ్ఞానాన్ని బోధించే గురువులు మన నమస్కారాలకు నిజమైన యొగ్యులు కారు. మన పూర్వాచార్యులు అటువంటి జ్ఞానాన్ని చెప్పులు కుట్టటానికి పనికివచ్చే జ్ఞానం (ఇతర సామాన్య చేతి కళల నైపుణ్యత లాగా) పోల్చారు మరియు వేదం యొక్క ఉద్ధేశ్యాన్ని అర్థం చేసుకోకుండా పఠించే వ్యక్తులను కాషాయాన్ని మొసుకెళుతున్న గాడిదలతో పోల్చారు (కాషాయము యొక్క నిజమైన విలువను అర్థం చేసుకోకుండా).
  • మంత్ర రత్నం (ద్వయ మహా మంత్రం మరియు దాని అర్ధాలు) బొధకులు కానివారికి,  ఇతర మంత్ర బొధించే వారికి నమస్కారాలు సమర్పించుట. ఇక్కడ ద్వయ మహా మంత్రం మాత్రమే కీర్తించబడింది. అంటే తిరుమంత్రం, ద్వయ మంత్రం, చరమ స్లోకం ఈ మూడు పరస్పర సంబంధం ఉన్నందున అని మనం అర్ధం చేసుకోవాలి. ఇక్కడ ఇతర మంత్రాలు అంటే సాధారణంగా అవైష్ణవ మంత్రాలు మరియు పాము కాటు మొదలైన వాటి నుండి ఉపశమనం పొందటానికి ఇవ్వబడేటువంటి మంత్రాలను సూచిస్తుంది.
  • కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు లౌకిక వ్యక్తులకు లొంగిపోకూడదు (నమస్కారం చేయకూడదు). అనువాదకుల గమనిక: భగవాన్‌ ఎల్లప్పుడూ మనలను సంరక్షిస్తారని పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు, ఇతర సహాయాల కోసం చూడవలసిన అవసరం ఉండదు.
  • మనము సోమరితనంతో ఎమ్పెరుమానుకి  నమస్కారాలు సమర్పించడం మానకూడదు. ఆచార్యులకు మరియు భాగవతులకు కూడా ఇదే వర్తిస్తుంది.
  • ఎమ్పెరుమాన్ యొక్క సన్నీధి / ఉనికిలో, అభాగవతులకు నమస్కారం చేయడం, భాగవతులకు నమస్కారం చేయకపోవడం అడ్డంకులు. మనము ఇంతకు ముందు ఈ విషయాన్ని చర్చించాము – అవైష్ణవులకు నమస్కారాలు చేయడం మానుకోవాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/03/virodhi-pariharangal-17.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 25

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 24

పరాంజ్ఞ్కుశ  పయోనిధి –  నమ్మాళ్వార్లనే పయోనిధి

              స్వామి రామానుజుల గ్రంధాలలో ఆళ్వార్ల ప్రబంధాల ప్రభావం ఎంత ఉందో తెలుసుకోవటానికి ఇప్పటి దాకా చాలా విషయాలను చూసాము. వారికి ఆళ్వార్ల మీద ఎంతటి భక్తి భావం ఉందో కూడా చూసాము. ఇప్పుడు సంస్కృతంలో గ్రంధాలను అనుగ్రహించిన ఆచార్యుల మీద ఆళ్వార్ల ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాము.

12 ఆళ్వారులు

స్వామి కూరత్తాళ్వాన్

 

ఆళ్వాన్  అని ప్రసిద్దిగాంచిన కూరత్తాళ్వాన్ స్వామి రామానుజుల ప్రియశిష్యులు, “పంచ స్తవము” అనే స్తుతి గ్రంధాలను రాసిన మహామేధావి. వీరి మొదటి స్తవం శ్రీవైకుంఠ స్తవము. ఈ గ్రంధాన్ని వీరు “యో నిత్యమచ్యుత ” అని అద్భుతమైన ఆచార్య స్తుతితో ప్రారంభించారు . ఆ తరువాత రెండు శ్లోకాలలో ఆళ్వార్లను స్తుతించారు. స్వామి రామానుజులకు ఆళ్వార్ల మీద అపారమైన భక్తి ఉన్నందున వీరు కూడా ఆళ్వార్లను స్తుతించారని అంటారు . ఇక ఈ రెండు శ్లోకాలను వివరంగా చూద్దాం.

 

 

 

 

త్రైవిద్య వృధ్ధజన మూర్థ విభూషణం యత్ సమ్పచ్చ సాత్విక జనస్య యదేవ నిత్యమ్ I
యద్వా శరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్ సంశ్రయేమ వకుళాభరణాంజ్ఞ్రియుగ్మమ్ II

స్వామి నమ్మాళ్వార్

 త్రైవిద్యవృత్తజన మూర్థ విభూషణం:  ఆళ్వార్ల శ్రీపాదాలే “త్రైవిద్యవృత్తజన మూర్థ విభూషణం”. వేదాలను అభ్యసించిన వేద మూర్తుల శిరస్సులకు ఆళ్వార్ల శ్రీపాదాలే ఆభరణం అంటున్నారు. అవియే “సాత్విక జనస్య నిత్యమ్ సంపత్” – శుద్ధసాత్వికుల నిత్య సంపద. ఆళవందార్లు   తమ “మాతా పితా” అనే శ్లోకంలో ఆళ్వార్ల శ్రీపాదాలే తమకు సర్వస్వం అని చెప్పుకున్నారు.

మశరణ్యజనస్య శరణ్యం: ఆళ్వార్ల శ్రీపాదాలే ఏదిక్కు లేనివాడికి దిక్కు….. లోకంలో ప్రజలు డబ్బునో, పరపతి గల వారినో ఆశ్రయిస్తారు. కానీ భగవద్కైంకర్య నిష్టులు ఇలాంటి నీచమైన వాటిని మనసా వాచా ఆశ్రయించరు. తమ త్రికరణాలను భగవంతుడి మీదే నిలుపుతారు. ఆళ్వార్లె ఇటువంటి భాగవత గోష్టికి నాయకులు కావున ఆళ్వార్ల శ్రీపాదాలనే ఆశ్రయిస్తారు. ఆళ్వార్ల శ్రీపాదాలు మాత్రమే ఈ లోకంలోని ఈతిబాధల నుండి చేతనులను రక్షించగల శక్తిగలవి. శరీరాన్ని శుష్కించి తపస్సులో మునగటమో, పాపాలను పోగొట్టు కోవటానికి తీర్థాలు వెతకటమో చేయనవసరం లేదు, ఆళ్వార్ల శ్రీపాదాలను శరణాగతి చేస్తేచాలు, అవి మన పాపాలను పోగొట్టి మనలను పవిత్రులుగా చేయగలవు .

ఇక తరువాతి శ్లోకాన్ని చూద్దాం :

భక్తిప్రభావ భవదద్భుత భావబంధ సంధుక్షిత ప్రణయ సారరసౌఘ పూర్ణః !

వేదార్థరత్ననిధి రచ్యుత దివ్యధామ జీయాత్ పరాఙ్కుశపయోధిః అసీమభూమా!! 

   ఈ శ్లోకములో  ఆళ్వార్లను ఒక సముద్రంగా చిత్రీకరించారు.  ఇలా చెప్పటానికి నాలుగు కారణాలు ఉన్నాయి.

1.  భక్తిప్రభావ భవదద్భుత భావబంధ – సందుక్షిత ప్రణయ సార రసౌఘపూర్ణః = సముద్రం వివిధ నీటి వనరులతో నింప బడుతుంది. అలాగే పరాంఙ్కుశ సముద్రం కూడా భక్తి అనే అద్భుత నవరస భరితమైన పవిత్రభావ ప్రవాహంతో నిండిన సముద్రం.

2.సముద్రం ముత్యాలు, పగడాలు, ఇంకా ఎన్నో వెలలేని విలువైన సంపదలకు నిలయం. ఆవిధంగానే ఇది వెలలేని విలువైన వేదాంత  రత్నాలకు నెలవు.

3.  సముద్రం పరమాత్మకు శయన మందిరం. అచ్యుత దివ్య ధామము.  ఆయన సముద్రం మీద శయనిస్తారు, రామావతారంలో సముద్రం మీద ఒక ఆనకట్టను నిర్మించాడు. అయినా  ఆయనకు వైకుంఠం కన్నా, ఆ పాల కడలి కన్నా, తిరువేంకటము కన్నా నా హృదయమే ఇష్టం కాబట్టి వాటిని వదిలివేసి వచ్చి నా హృదయంలో స్థిరపడ్డాడు. “కల్లుం, కనైకడలుం, వైకుంద వానాడుం పుల్లెండ్రోళిందన కొల్ ఏ పావం, వెళ్ళ నెడియాన్  నిరంగరియాన్ ఉళ్ పుగుందు నిన్రాన్ అడియేనదు ఉళ్ళతగం” (కల్లుం – తిరుమల, కనైకడలుం – పాలసముద్రము, వైకుంద వానాడు – శ్రీవైకుంఠంము, పుల్లెండ్రోళిందన కొల్ ఏ పావమే – నే చేసిన పాపమేమిటో తృణ ప్రాయంగా వదిలి వేసి, వెళ్ళ నెడియాన్  నిరంగరియాన్ ఉళ్ పుగుందు నిన్రాన్ అడియేనదు ఉళ్ళతగం = నల్లని వాడు వెంటనే వచ్చి నా హృదయంలో స్థిరపడ్డాడు)

“కొండల్ వణ్ణన్ సుడర్ ముడియాన్ నాన్గు తోళన్ కునిసార్గన్ ఒణ్ సంగదై వాళాళియాన్ ఒరువన్ అడియే నుళ్ళానే” (నల్లని వాడు ప్రకాశమానమైన శిఖ గలవాడు చతుర్భుజములవాడు  శంఖ, చక్రం, గధ, శార్జము, ఖడ్గం, మొదలైన ఆయుధములు గలవాడు) ఈ పాశురాల అర్థము తిరువాయిమోళిలో చక్కగా వివరించబడింది.

4. సముద్రము అంతుచిక్కనంత పెద్దది. ఆసీమ భూమా  అని పిలువబడుతున్నది. “కణ్ణినుణ్ శిరుత్తాంబినాల్”  అనే ప్రబంధంలో మధుకవి ఆళ్వార్లు నమ్మాళ్వా ర్లను “అరుళ్ కొండాడుం అడియవర్” అని వర్ణించారు.

ఈ ప్రకారంగా పరంజ్ఞుశ పయోనిధి ఔన్నత్యాన్నిఆళ్వార్లు కీర్తించారు .

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/23/dramidopanishat-prabhava-sarvasvam-25/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org