Monthly Archives: August 2020

విరోధి పరిహారాలు – 36

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/12/virodhi-pariharangal-35/

70. అనాప్త  విరోధి  –  అప్రామాణికమైన సూత్రాలను అర్థం చేసుకోవడంలో అవరోధాలు

ఎమ్పెరుమానార్ పట్ల ఎంతో అంకితభావంతో ఉండిన వడుగ నంబి

అనాప్త (ప్రామాణికం కాని అంశాలు/వ్యక్తులు, మనకు అనుకూలం కాని అంశాలు) ఆప్త (ప్రామాణికమైన అంశాలు/వ్యక్తులు, మనకు అనుకూలమైన అంశాలు)కు వ్యతిరేకమైనది. ఈ విభాగంలో చర్చించిన విషయాలు కూడా అదే సూత్రాన్ని ప్రతిబింబిస్తాయి. అనువాదకుల గమనిక: ఈ విభాగం మునుపటి భాగాన్ని ఇంకొంచం ముందుకు తీసుకెళుతుంది. జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలం కాని అంశాలు ఈ శీర్షికలో చర్చించబడ్డాయి.

  • ప్రపత్తికి (సంపూర్ణ శరణాగతి) విరుద్ధమైన ఉపాయాంతరములపై ​​(కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు భగవానుడి నిత్య కైంకార్యం సాధించడనికి సాధనాలని) నమ్మకం కలిగి ఉండటం ఒక అడ్డంకి. భగవానుడి నిత్య కైంకర్యం పొందడానికి ఏకైక మార్గము భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేయడమేనని ఆళ్వారులు వివరించారు, ఆచరించారు కూడా. కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైన వివిధ ప్రక్రియలు మన సొంత ప్రయత్నంపై ఆధారపడి ఉంటాయి, అందుకని భగవాన్ నిత్య దాసుడన్న జీవాత్మ యొక్క స్వరూపానికి అది విరుద్ధం. అందువల్ల, అటువంటి ఉపాయాంతరములపై విశ్వాసం కలిగి ఉండటం అననుకూలమైనది కాదు. జీవాత్మ యొక్క నిజమైన స్వరూపానికి తగినది కాదు. అనువాదకుల గమనిక: భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేయుట, ఆయనకు శాశ్వతమైన కైంకార్యాన్ని సాధించే ఏకైక మార్గమని మన ఆళ్వారులు / ఆచార్యులు పూర్తిగా నిర్ధారించారు. పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క రెండవ ప్రకరణంలో వివరించారు. ఈ సుత్రాంలో, ఉపాయాంతర త్యాగం చేయడం అవసరమని వివరిస్తున్నారు. ఎందుకంటే మనం సంపూర్ణంగా భగవత్ ఆధీనులం అన్న దానికి ఉపాయాంతరాలు విరుద్ధం కావడం వల్ల కానీ, జ్ఞానం లేదా సామర్థ్యం లేక కాదు. తరువాతి సూత్రాలలో, వారు ఈ సూత్రాన్ని చాలా వివరంగా వివరించారు.  సూత్రం 127 లో ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు, “వేదాంతాలు వీటిని (కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు) ఉపాయములుగా ఎందుకు కీర్తిస్తారు?” తరువాత వారే ఇలా బదులిస్తున్నారు, ఒక వ్యాధి ఉన్నవారికి వైద్యం చేసేటప్పుడు, వాళ్ళు (అమ్మలు మొదలైనవారు) వారికి ఇష్ఠమైన ఆహార పదార్ధాలలో ఔషదాన్ని కలిపిస్తారు. ఇక్కడ శాస్త్రం (జివత్మాను సంరక్షించే తల్లి లాంటిది) భగవాన్ను (నిజమైన ఔషధం) ఉపాయాంతరములతో (అవి స్వయం ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి) కలిపి ఇస్తుంది.  వ్యాధి నయమయ్యేది ఔషధంతోనే కాని ఆహార పదార్థాలతో కాదు అని మాముణులు అందంగా వివరిస్తున్నారు. అదేవిధంగా, మనకి భగవానుడే ఈ సంసారం నుండి ఉపశమనం పొందే నిజమైన ఉపాయం (సాధనం),  ఉపాయాంతరములు ఎప్పటికీ నిజమైన ఉపాయములు కాలేవు. ఔషదాన్ని ఇతర ఆహార పదార్ధాలతో కలిపినప్పుడు, వ్యాధిని నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని వారు వివరించారు. అదేవిధంగా, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల ద్వారా వెళితే, సంసార బారి నుండి విరుగుడు పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ సూటిగా ఎమ్పెరుమాన్ని ఆశ్రయించడం అనేది వ్యాధిని నయం చేయడానికి నేరుగా ఔషధం తీసుకోవడం లాంటిది – ఫలితం వెంటనే ఉంటుంది. తరువాతి సుత్రాములలో, ఎన్నో అద్భుతమైన అర్ధాలను పిళ్ళై లోకాచార్యులు మరియు మాముణులు వెల్లడించారు – వీటిని ఆచార్యుల నుండి కాలక్షేప రూపంగా వినడం ప్రయోజనకరం.
  • అనుకూలం కాని వ్యక్తులతో స్నేహం చేయడం మానేయాలని తెలుసుకున్న తరువాత కూడా, అయోమయ స్థితితో ఉండటం ఒక అడ్డంకి. అనుకూలం కాని వ్యక్తులతో సంబంధాన్ని వదులుకోవాలని బలమైన నిశ్చయంతో ఉండాలి. అనువాదకుల గమనిక: ఇక్కడ అనుకూలం కాని వ్యక్తులు అంటే సాధారణంగా దేవతాంతరములుతో సంబంధం ఉన్నవారు,  భౌతిక సాధనలు చేయువారు, నిరంతరం భగవత్, భాగవత, ఆచార్య అపచారాలు చేయువారు అని అర్థం. ఎందుకంటే ఈ రకమైన వ్యక్తులు క్రమేణా మన ఆలోచనలను కూడా ప్రభావితం చేసి చివరికి వారిలాగా మారేలా  చేస్తారు.
  • మన అంతిమ లక్ష్యానికి అడ్డంకులుగా ఉన్న నిగూఢ ప్రయోజనాలలో ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. కేవలం తమ సుఖం కోసం మాత్రమే అయ్యుండి, భగవాన్ యొక్క శాశ్వతమైన కైంకర్యానికి విరుద్ధమైన దేనినైనా ప్రయోజనాంతరం అంటారు. ఇటువంటి ఉద్దేశ్యాలను వదులుకోవాలి. అనువాదకుల గమనిక: మన అంతిమ లక్ష్యం ఏమిటంటే, పరమపదంలో శాశ్వతంగా భగవానుడికి భగవదానందం కొరకు మాత్రమే సేవ చేయడం. భౌతిక / ఇంద్రియ సుఖాలు, దేవతాంతరములకు సేవ చేయడం, భౌతిక వ్యక్తులకు సేవ చేయడం, కైవల్యం – తాను ఆనందం పొందడం, వ్యక్తి తమ ఆనందం కొరకు భగవాన్ని సేవించడం, అహంకారంతో భగవాన్కు సేవ చేయడం మొదలైన ఇతర లక్ష్యాలు జీవాత్మ స్వరూపానికి అనుకూలమైనవి కావు, అందువలన వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • శ్రీమన్నారాయణుడే పూజించగల దేవుడు అన్న సూత్రానికి విరుద్ధమైన దేవతాంతరములపై విశ్వాసం కలిగి ఉండటం ఒక అడ్డంకి. ఒక వైష్ణవుడికి, శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆరాధించగల దేవుడు అన్న ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోవాలి, నిష్ఠగా అనుసరించాలి. దేవతాంతర భజనం (ఆరాధించడం) ఆ సూత్రానికి విరుద్ధం కాబట్టి చేయకూడదు. అనువాదకుల గమనిక: మహోన్నత నాధుడు స్వయంగా శ్రీమన్నారాయణుడు కావడం వలన, ప్రాపంచిక కార్య వ్యవహారాలకై, అనేక  తామస, రాజస స్వభావం గల ఆరాధకులకై, వాళ్ళు నెమ్మదిగా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి దేవతాంతరములను శ్రీమన్నారాయణుడు  సృష్ఠించాడు. లేకపోతే నాస్తికత్వం ప్రబలమౌతుంది కాబట్టి. కానీ పూర్తిగా సత్వ గుణంలో ఉన్న వారి శుద్ధ భక్తులకు అతను మాత్రమే పూజ్యనీయుడు. వైష్ణవుడంటే శ్రీమన్నారాయణుడకు, అతని శుద్ధమైన భక్తులకు పూర్తి విశ్వాసకులుగా ఉండటం, వారిని మాత్రమే ఆరాధించడం అని అర్థం.
  •  ద్వయ మహామంత్రంలో వివరించిన సూత్రాలకు విరుద్ధమైన మంత్రాలపై విశ్వాసం కలిగి ఉండటం ఒక అడ్డంకి. ద్వయ మహామంత్ర యొక్క మాధుర్యం మరియు లోతైన అర్థాల కారణంగా శ్రీవైష్ణవులు నిరంతరం పఠించాలి, ధ్యానించాలి. రహస్య త్రయం ఈ మంత్రసంబంధిత స్వభావం ఉన్నందున, ద్వయ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా రహస్య త్రయం (తిరుమంత్రం – అష్టాక్షరం, ద్వయ మహామంత్రం మరియు గీతా చరమ స్లోకం) ఇక్కడ సూచించబడింది. కాబట్టి శ్రీవైష్ణవులు రహస్య త్రయాన్ని అనుసరించాలి. ఇతర మంత్రాలేవైనా – ప్రధానంగా దేవతాంతరములకు  సంబంధించిన మంత్రాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడిలో, పిళ్ళై లోకాచార్యులు తిరుమంత్రము యొక్క కీర్తిని వివరిస్తున్నారు. శ్రీమన్నారాయణుడకు సంబంధించిన మంత్రాలు రెండు రకాలు అని వారు వివరింస్తున్నారు – వ్యాపకం (భగవాన్ యొక్క సర్వవ్యాపకత్వాన్ని వివరించేవి) మరియు అవ్యాపకం (భగవాన్ వివిధ రూపాల్లో వెల్లడి చేసిన ఇతర గుణాలను వివరించేవి). విష్ణు గాయత్రిలో కీర్తించ బడినందున విష్ణు మంత్రాలకు (నారాయణ, వాసుదేవ, విష్ణు) ఎక్కువ ప్రాముఖ్యత ఉందని వారు నొక్కిచెబుతున్నారు. విష్ణు గయిత్రి మంత్రం నారాయణ మంత్రంతో మొదలవుతుంది కాబట్టి, అన్ని విష్ణు మంత్రాలలో ఇది గొప్పదని వారు వివరిస్తున్నారు. ఇతర మంత్రాలలో లేని అన్ని ప్రథానాంశ అర్ధాలను వివరించడంలో నారాయణ మంత్రం పూర్ణమైనదని వారు వివరిస్తున్నారు. ఇక్కడ ప్రథానాంశ అర్ధాలు అంటే అర్థపంచకాన్ని (ఐదు తత్వాలు / సూత్రాలు అనగా – జీవత్మ (ఆత్మ), పరమాత్మ (దేవుడు), ఉపాయం (సాధనాలు), ఉపేయం (లక్ష్యం) మరియు వీరోధి (ఆటంకాలు))  సూచిస్తుంది. వేదానికి, ఋషులకు, ఆళ్వారులకు, ఆచార్యులకు నారాయణ మంత్రం చాలా ప్రియమైనదని వారు వివరిస్తున్నారు. ద్వయ మహామంత్రం కేవలం నారాయణ మంత్రం యొక్క వివరణ, చరమ శ్లోకం అదే సూత్రానికి మరింత వివరణ. ఈ విధంగా, ముముక్షువులకు (పరమపదంలో శ్రీమన్నారాయణుని శాశ్వత కైంకర్యమైన మోక్షాన్ని కోరుకునే వాడు)  రాహస్య త్రయం ప్రధాన కేంద్రంగా ఉండాలి.
  • భగవత్ ప్రీతి అనే అత్యున్నత స్థితికి విరుద్ధమైన ప్రాపంచిక / ఇంద్రియ సుఖాలపై ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. భోగ్యం – ఆనందించేది. భగవాన్ / భాగవతులకు కైంకార్యం చేస్తున్న జీవాత్మ భగవానుడిని ఆనందపరుస్తాడు/సంతృప్తిపరుస్తాడు. భగవదానందాన్ని చూసి, జీవాత్మ కూడా ఆనందిస్తాడు.  మరే ఇతర ప్రాపంచిక సుఖాలైనా సరే జీవాత్మ యొక్క ఈ స్థాయికి అడ్డంకి.  అనువాదకుల గమనిక: కులశేఖర ఆళ్వారులు పెరుమాల్ తిరుమోళి 4.9 పాసురంలో ఇలా వివరిస్తున్నారు, “పడియాక్కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” – ఇక్కడ ఆళ్వార్ తిరుమల వేంకటేశ్వరుని సన్నిధి ఎదుట మెట్టుగా కావాలని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. పైగా ఆ వేంకటేశ్వరుని దివ్య చిరునవ్వుని కూడా చూడాలని అంటున్నారు. మెట్టుగా ఉండటం అంటే అచిత్ (జ్ఞానం ఉండదు) లాంటిది, కాని భగవత్ ఆనందాన్ని దర్శించడం అంటే భగవాన్ యొక్క ఆనందాన్ని ప్రతిస్పందించడం అని అర్థం. ప్రతిస్పందన జ్ఞానం యొక్క ఉనికిని సూచిస్తున్నందున, ఇక్కడ శ్రీవైష్ణవ సత్సాంప్రదాయం యొక్క అత్యున్నత సూత్రం తెలుస్తుంది. అనగా, తమ యజమాని సంపూర్ణ నియంత్రణలో ఉన్న ఒక నిర్జీవ వస్తువు ఉన్నట్లుగా ఉండాలి, అయినప్పటికీ, భగవానుడి ఆనందానికి ప్రతిస్పందిస్తే భాగవాన్ అమితానందాన్ని పొందుతారు. ఇది ఒక అమాయక పిల్లవాడి లాంటిది, పూర్తిగా తండ్రి నియంత్రణలో ఉంటాడు, అయినప్పటికీ, తండ్రి పిల్లవాడిని సంతోషపెట్టినప్పుడు, పిల్లవాడు అ తండ్రికి స్పందిస్తాడు, అప్పుడు ఆ తండ్రి అమితానందాన్ని పొందుతాడు. అందువలన, చివరికి, భగవానుడే ప్రథమంగా ఆనందించేవాడు, మాధ్యమిక ఆనందం పొందేవాడు జీవాత్మ – అదీ కూడా భగవత్సుఖాన్నే అనుభవిస్తాడు.
  • మోక్ష శాస్త్రానికి విరుద్ధమైన బంధ శాస్త్రం (భౌతిక సంపద, భాగ్యము, సమృద్ధి మొదలైన వాటికి సంబంధించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం) పై దృష్టి పెట్టడం ఒక అడ్డంకి. మోక్ష శాస్త్రం అంటే భగవానుడికి శాశ్వతమైన కైంకర్యం చేసే మార్గాన్ని చూపిస్తుంది. బంధ శాస్త్రం అంటే ఇంద్రియ సుఖసాధన,  ఈ సంసారంలో అనేక జన్మలకు దారితీస్తుంది. మోక్ష శాస్త్రంపై దృష్టి పెట్టాలి, బంధ శాస్త్రాన్ని విస్మరించాలి.
  • తమ సొంత శరీరాంశాలు, శారీరిక జాగ్రత్తలపై ఎక్కువ ఆసక్తి కలిగిఉండటం మన అత్యున్నత లక్ష్యమైన ఆచర్య సేవకది విరుద్ధము, అది ఒక అడ్డంకి. చరమ కైంకర్యం – చరమ  పర్వ నిష్ఠ – అత్యున్నత సేవ, ఇది “ఆచార్యులే సర్వస్వం అని భావించి అటువంటి ఆచార్యలకు సేవలందించడం”. ఉపదేశ రత్నమాలలో, మాముణులు పాసురం 65లో “ఆచార్యన్ చిచ్చన్ ఆరుయిరైప్ పేణుమవన్ తేచారుం చిచ్చన్ అవన్ చీర్ వడివై ఆచైయుడన్ నోక్కుమవన్” – ఆచార్యుడు శిష్యుని వాస్తవ స్వభావంపై దృష్ఠిపెట్టాలి, శిష్యుడు ఆచార్యుని పట్ల సంపూర్ణ భక్తితో వారి తిరుమేనిని (దేహాన్ని) మరియు వారి శారీరక అవసరాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆచార్యుని యొక్క రోజువారీ అవసరాల (ఆహారం, వస్త్రం,  ఆశ్రయం మొదలైనవి) బాధ్యత శిష్యుడిది కాబట్టి, శిష్యుడు తమ సొంత  అవసరాలకు మించి వారిని చూసుకోవాలి. మన శారీరిక జాగ్రత్తలపై ఆసక్తి మానుకోవాలి. అనువాదకుల గమనిక: ఉపదేశ రత్తమాల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క సారాన్ని వెలికితీస్తుంది. మాముణులు పిళ్ళై లోకాచార్యుల చేత వివరించబడిన సూత్రాల సారాన్ని అందంగా సంగ్రహించి వాటిని అర్థం చేసుకోవడానికి చాలా తేలికగా తమిళ్ పాసురాల రూపంలో అందించారు. ఆచార్యులపై దృష్టి కేంద్రీకరించడం, మరియు వారికి సేవలందించే ప్రాముఖ్యత  పిళ్ళై లోకాచార్యుల చేత  నొక్కి చెప్పబడింది, అదే ఇక్కడ మాముణులు చేత వివరించబడింది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/09/virodhi-pariharangal-36.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/08/virodhi-pariharangal-34/

    అచార్యుల మకుటాభరణంగా కీర్తింపబడిన ఎమ్పెరుమానార్
69. ఆప్త వీరోధి  – ప్రామాణికమైన సూత్రాలను అర్థం చేసుకోవడంలో అవరోధాలు.


ఆప్త అంటే నమ్మదగిన వ్యక్తి / అంశం లేదా శ్రేయోభిలాషి అని అర్థం. సాధారణంగా ఫలాన్ని ఆశించకుండా ఇతరుల శ్రేయస్సుకై  పాటుపడే వాడిని ఆప్తుడు అంటారు – స్నేహితులలో ఉత్తమమైనవాడు (ఆప్త మిత్రుడు). తిరువాయ్మొళి 10.1.6 లో నమ్మాళ్వార్ తిరుమోగూర్ పెరుమాళ్ని తిరుమోగూర్ ఆత్తన్ అని  ప్రశంసించారు. ఆత్తన్ (తమిళ పదం) అంటే ఆప్తుడు అని అర్థం. అనువాదకుల గమనిక: ఈ విభాగంలో, ప్రప్పన్నుని శ్రేయస్సుకు అవసరమైన అంశాలు చర్చింబడ్డాయి – ఇందులో తమ స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, భగవాన్, భాగవతులు, ఆచార్యులు మొదలైన వారి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం కూడా చర్చించబడ్డాయి.

  • భగవత్ / భాగవత సంబంధము ఉన్న వారిని నిర్లక్ష్యం చేయడం ఒక అడ్డంకి. భగవాన్ మరియు భాగవతులతో సంబంధము ఉన్న వారెవరైనా సరే – వారిని మన శ్రేయోభిలాషులుగా భావించి వారిని ఆదరించాలి. అనువాదకుల గమనిక: శ్రీకృష్ణుడు స్వయంగా భవవద్గీత 7.19 లో  “బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే| వాసుదేవ సర్వమితి స మహాత్మా సు దుర్లబః ||”. జీవాత్మ ఎన్నో జన్మల తరువాత నిజమైన జ్ఞనాన్ని పొంది నన్నాశ్రయిస్తాడు. వాసుదేవుడే సర్వాధారం (మాధ్యమం, లక్ష్యం మొదలైనవి) అని అర్థం చేసుకున్నవాడు గొప్ప వ్యక్తి, చాలా అరుదుగా కనిపిస్తారు. అదేవిధంగా, భగవాన్ స్వయంగా వైష్ణవుల ఎనిమిది విశేష లక్షణాలను వివరిస్తున్నారు. వాటిలో, మొదటి వైష్ణవ గుణం “మద్భక్త జన వాత్సల్య” – తన భక్తుల పట్ల విశేష అనురాగం ఉండటం. అది కూడా “వాత్సల్య” అనే పదాన్ని ఇక్కడ ఎమ్పెరుమాన్  ఉపయోగిస్తున్నారు. వాత్సల్యం అంటే తల్లి ప్రేమ / సహనం – పిల్లల లోపాలతో సంబంధం లేకుండా ఒక తల్లి తన బిడ్డలను ప్రేమిస్తుంది, వైష్ణవుడు ఇతర వైష్ణవుల లోపాలను చూడకుండా వారికి గౌరవించాలి. ఈ రెండు ప్రమాణాల ద్వారా, భగవాన్ మరియు భాగవతుల పట్ల భక్తి ప్రేమలు ఉన్న వైష్ణవులను గౌరవించాలన్న ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. వైష్ణవులను నిర్లక్ష్యం చేయడం తగదని మనం అర్ధం చేసుకోవాలి, ఎందుకంటే అది వారిని అగౌరవించినట్లవుతుంది కాబట్టి.
  • భగవత్ / భాగవత సంబంధము లేని వారిపై ప్రేమ / అనురాగం చూపించడం ఒక అడ్డంకి. ఇది మునుపటి వివరణకు సంబంధించినది. భౌతికవాదుల పట్ల మనం ఆసక్తి చూపకూడదు. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు శ్రీవైష్ణవుల దినచర్యను వివరిస్తున్నారు. అనేక విషయాలలో వారు “అహంకార అర్థ కామంగల్ మూన్ఱుమ్ అనుకూలర్ పక్కలిలే అనాధరత్తైయుమ్ ప్రతికూలర్ పక్కలిలే ప్రావణ్యత్తైయుం, ఉపేక్షిక్కుమవర్గళ్ పక్కలిలే అపేక్షైయుం పిఱప్పిక్కుం” అని వివరిస్తున్నారు. మాముణులు ఈ అంశానికి అందమైన వివరణ ఇచ్చారు. ముఖ్యమైన మూడు అంశాలు ఇక్కడ చర్చించబడ్డాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. 1. శ్రీవైష్ణవులు మనకి అనుకూలర్లు (అనుకూలమైనవారు) – వాళ్ళు మన ప్రభువులు. మనం వారిని చూసినప్పుడు, వారి పట్ల ఎంతో గౌరవంతో వెంటనే నిలబడాలి. కానీ, అహంకారం (తమను తాము స్వతంత్రుడని భావించడం) వారిని విస్మరించడానికి దారితీస్తుంది. అహంకారం  తనను గొప్పవాడిగా భావింప జేసి, ఇతరులను గౌరవించకుండా ఆపుతుంది. 2. భౌతిక వ్యక్తులు మనకి ప్రతికూలర్లు (ప్రతికూలమైనవారు). అర్ధం అంటే భౌతిక సంపద. మనం సంపదను కోరడం ప్రారంభించినప్పుడు, ఆ సంపదను పొందడానికి ఎవరినైనా ప్రశంసించేందుకు సిద్ధపడతాము. అందువల్ల భౌతిక సంపద, కీర్తి మొదలైన వాటిపై ఉన్న కోరిక, ప్రతికూల వ్యక్తులను ప్రశంసకు దారితీస్తుంది.  3. కామంతో ఉన్న స్త్రీలను ఉపేక్షిక్కుమవర్  (మన గురించి పట్టించుకోని వారు) అని అంటారు. అపేక్ష అంటే కోరిక. ​​తమలో కామము పెరిగినప్పుడు, ఆ స్త్రీ అతన్ని పట్టించుకోకపోయినా/  అవమానించినా,  తన పరువుపోయినా సిగ్గుపడకుండా ఆమెను పొందటానికి వెనుకాడాడు. అందువల్ల, ఈ 3 ఆపదలను తెలుసుకొని జాగ్రత్తగా వాటికి దూరంగా ఉండాలి .
  • స్వకీయ స్వీకార నిష్ఠ (మన కృషిలో నమ్మకం) ఉండటం ఒక అడ్డంకి. మనం దేనినైనా కోరుకున్నప్పుడు, “ఇది నాది, నా స్వంత ప్రయత్నంతో నేను దీనిని సాధించాను” అనే ఆలోచనతో ప్రయత్నించడం మానుకోవాలి. ప్రతిదీ భగవాన్ యాజమాన్యంలో ఉన్నందున, భగవత్ ప్రసాదంగా (భగవాన్ కృప), ఆచార్య ప్రసాదం (ఆచార్య కృప) గా భావించాలి. అనువాదకుల గమనిక: ప్రపత్తి (శరణాగతి) రెండు రకాలు – స్వగత స్వీకారం మరియు పరగత  స్వీకారం. స్వగత స్వీకారం అనేది స్వీయ ప్రయత్నానికి ప్రాధాన్యతనిచ్చే శరణాగతి. పరగత  స్వీకారం అనేది భగవత్ కృపతో చేసిన శరణాగతి. ఈ రెండింటిలో, భగవాన్ మన సంరక్షకుడని, తన కృపాతో మనల్ని ఉద్ధరిస్తున్నాడని అంగీకరించే పరగత  స్వీకార మార్గాన్ని మన పూర్వాచార్యులు నొక్కిచెప్పారు. భగవానుడికి శరణాగతి చేయుట జీవాత్మకు తగినది ఎందుకంటే శరణాగతి అనేది జీవాత్మ యొక్క సహజసిద్ధమైన స్థితి. .
  • స్వప్రయోజన ప్రవృత్తిలో పాల్గొనడం (కోరికలను తీర్చుకోడానికి చేసే ప్రయత్నాలు) ఒక అడ్డంకి. మన ఆత్మ సంతృప్తిపై దృష్టి పెట్టకుండా ఎల్లప్పుడూ ఇతరుల అభ్యున్నతికి మరియు శ్రేయస్సుకై  ప్రయత్నించాలి. అనువాదకుల గమనిక: “విచిత్రా దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా  బ్రహ్మణ్ హస్తపాధాది సమ్యుతా”- లయం సమయంలో సూక్ష్మ స్థితిలో ఉన్న జీవాత్మ ఎటువంటి ఇంద్రియాలు / శరీరం లేకుండా ప్రాపంచిక సుఖాలు/ ముక్తి ప్రయత్నాలలో పాల్గొనలేక పోవడంతో, అత్యంత కృపతో  సర్వేశ్వరుడు, తన పాద పద్మాలను సమీపించే ప్రక్రియను ప్రారంభించడానికి ఇంద్రియాలను / శరీరాన్ని జీవాత్మకు ప్రసాదిస్తారు. జీవాత్మ, ఇంద్రియాలతో / శరీరంతో భగవాన్ను ఆశ్రయించడానికి బదులుగా, తిరువాయ్మొళి 3.2.1 లో “నమ్మాళ్వార్” చెప్పినట్లుగా, “అన్నాల్ నీ తంత ఆక్కైయిన్ వళి ఉళల్వేన్”, శరీర / ఇంద్రియ సుఖాలను పొందాలనుకుంటాడు. ఒక నది దాటడానికి మనిషికి తెప్ప ఇస్తే ఆ నీటి ప్రవాహంతో కొట్టుకెళ్లి సముద్రంలో కలిసాడట. ఈ సంసారం నుండి ఉద్ధరింపబడడానికి జీవత్మాకు ఇంద్రియాలను / శరీరాన్ని ప్రసాదిస్తే ఈ సంసారంలో మరింత కూరుకుపోడానికి ఆ ఇంద్రియాలలు ఉపయోగించబడుతున్నాయి. తిరువరంగత్తు అముదనార్ కూడా ఇదే సూత్రాన్ని రామానుస నూత్తందాది పాసురం 67లో ఇలా వివరిస్తున్నారు – “మాయవన్ తన్నై వణంగ వైత్త కరణం ఇవై” – భగవాన్ ఈ శరీరాన్ని తనను ఆరాదించేందుకు మరియు భాగవతులను సేవించడం కోసం ఇచ్చారు. ఈ విధంగా ఈ పుట్టుక ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని దానికణుగుణంగా ప్రవర్తించాలి.
  • కేవలం శేషత్వ (దాస్యం) జ్ఞానం ఉండి, పారతంత్రియం (సంపూర్ణంగా అధారపడం) జ్ఞానం లేకపోవడం ఒక అడ్డంకి. ఆత్మ యొక్క స్వభావం రెండు  దశల్లో ఉంటుంది: శేషత్వం – యజమాని ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉండటం; పారతంత్రియం – యజమాని కోరికలను తీర్చడం. స్వామి యొక్క కోరికలను తీర్చడం, కేవలం యజమాని సేవ చేయడానికి ఎదురుచూడడం కంటే ముఖ్యమైనదని అర్థంచేసుకోవాలి. భరతుడు శ్రీ రామునితో పాటు వెళ్లాలని అనుకున్నప్పటికీ, 14 సంవత్సరాలు శ్రీ రాముడు లేనప్పుడు అయోధ్య రాజ్యాన్ని పరిపాలించే సేవను చేపట్టాడని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు.
  • భోక్తుడుగా ఉండటం  మరియు భోగ్యుడిగా ఉండకపోవడం ఒక అడ్డంకి. భోగ్యం – ఆనందించేది, భోక్తా – ఆనందించేవాడు. శ్రీవైష్ణవులు తమను తాము భగవాన్ యొక్క ఆనందం కోసం ఉపయోగపడే వస్తువుగా భావించాలి. తమ సంపూర్ణ ఉనికి భగవత్ప్రీతి కోసం అని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. తాను భోగించే వ్యక్తిగా భావించడం, భగవాన్ యొక్క ఆనందం కోసం ఉపయోగపడే వస్తువుగా ఉండటానికి విరుద్ధం. అనువాదకుని గమనిక: –  అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం చూర్ణిక 21లో ఇలా వివరించారు “శేషత్వ భోక్తృత్వంగళ్ పోలన్రే పారతంత్రియ భోగ్యతైగళ్” – పారతంత్రియం (సంపూర్ణంగా ఆధారపడటం) మరియు భోగ్యత్తైగళ్ (భోగ్య వస్తువు), శేషత్వం (దాస్యం) మరియు భోక్తృత్వంగళ్(భోగించేవాడు) కన్నా గొప్పది. ఇక్కడ శేషత్వం అంటే బంగారు ఇటుక లాంటిదని (విలువైనది కానీ రూపాన్ని మార్చిన తరువాత మాత్రమే ఉపయోగించ గలము) మరియు పారతంత్రియం అంటే స్వర్ణాభరణం లాంటిది (అప్పడికప్పుడే ఉపయోగించ గలము) అని మాముణులు అందంగా వర్ణించారు. ఇది చాలా నిగూఢమైన మూల సూత్రం,  ఆచార్యుల నుండి కాలక్షేప రూపంగా అర్థం చేసుకోవాలి.
  • తాను భోగ్య వస్తువైనందుకు సంతృప్తి చెందడం, ఆ  ఆనందం తనదని బ్రమపడుట  ఒక అడ్డంకి. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.9.4 లో ఇల ప్రకటించారు, “తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీతే చిఱప్పు” – సంపూర్ణ భగవత్ సుఖానికై తానుండటం ఉత్తమము. భగవాన్ శ్రీ ముఖంలో కనిపించే సంతోషం కోసమే మన శేషత్వం (దాస్యం) మరియు పారతంత్రియం (ఆధారపడటం) ఉండాలి.  అనువాదకుల గమనిక: కులశేఖర ఆళ్వారులు, పెరుమాళ్ తిరుమోళి 4.9లో ఈ విషయాన్ని ఇలా వివరించారు, “పాడియాయ్ క్కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” – నేను నీ సన్నిధి ఎదుట మెట్టులా/గడపలా (వివేకము లేని అచిత్ వలె) ఉండి  ఆనందంగా చిరు మందహాసంతో ఉన్న మీ అధరాలను చూసి ప్రతిస్పందిస్తాను (వివేకము ఉన్న చిత్ వలె). (అనువాదకుల గమనిక: “అచిత్వత్ పారతంత్రియం” మన సత్ సాంప్రదాయంలో ఈ సూత్రం అత్యున్నతమైనది – అచిత్ వలే సంపూర్ణంగా భగవతాధీనుడై ఉండి, భగవాన్ తమ ఆనందాన్ని వ్యక్త పరచినపుడు జివత్మ వలే వారి ఆనందానికి ప్రతిస్పందించడం). ఈ సూత్రం (స్వయ – కేంద్రీకృతమైన ఆనందాన్ని నిర్మూలించడం) ద్వయ మహా మంత్రం యొక్క రెండవ భాగంలో “నమః”లో వివరించబడింది. ఆళవందారులు తమ స్తోత్ర రత్నం 46లో ఇదే సూత్రాన్ని వివరించారు, “కదా ..ప్రహర్శయిశ్యామి” – భగవత్  ప్రీతిని ఆశించడం. జీవాత్మ భగవత్సుఖానికి ప్రతిస్పందించినప్పుడు , భగవాన్ సంపూర్ణంగా సంతోషిస్తారు. వారి ఆనందమే మన కైంకార్యం యొక్క ఏకైక లక్ష్యం. వేరే మార్గాల గురించి ఆలోచించడం ఒక అడ్డంకి.
  • భగవత్  ప్రీతికై ఉనికిలో ఉండటం జీవత్మ యొక్క నిజమైన స్వభావమని తెలియకపోవడం, అంతర్లీన గుణాలు కూడా భగవత్ సుఖంపై కేంద్రీకృతమై ఉన్నాయని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవత్ సుఖమే జీవాత్మ యొక్క నిజమైన స్వభావం మరియు భగవతాధీనుడై ఉండటం జీవాత్మ యొక్క నిజమైన స్వభావం . భగవాన్ యొక్క నిజమైన దాసుడిగా ఉండటం దీని సారాంశం. తిరువాయ్మొళి 2.9.4 లో -“తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీతే చిఱప్పు” చూపిన విధంగా – మనం నిరంతరం భగవత్ సుఖానికై పాటుపడాలి.  అనువాదకుల గమనిక: “అకిన్చిత్కరస్య శేషత్వ అనుపపత్తిః” లో చెప్పినట్లుగా – నిజమైన దాస్యభావం (కనీసం) చిన్న చిన్న కైంకార్యాలలో పాల్గొనడం ద్వారానే నిలబడి ఉంటుంది.
  • మనకు తెలియని మూలసూత్రములను తెలియజేసిన ఆచార్యులను భగవంతునితో సమానమని పరిగణించకపోవడం ఒక అడ్డంకి. తిరువాయ్మొళి 2.3.2 లో చెప్పినట్లుగా “అఱియాధన అఱివిత్తు అత్తా!” (మనకు తెలియని భగవత్ విషయానుభవాలను తెలియజేసి శాశ్వతసంబంధం ఉన్నవాడు భగవానుడు మరియు ఆయనే ప్రథమాచార్యడు (మొట్టమొదటి ఆచార్య) అని. మన ఆచార్యులను భగవానుని మానవరూపంగా పరిగణించాలి. అటువంటి ఆచార్యులపై పూర్తి విశ్వాసం కలిగి ఉండకపోవడం, వారిని భగవంతునిగ పరిగణించకపోవడం అవరోధాలు.  అనువాదకుల గమనిక: దయచేసి http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-12.html చదవండి – ఈ వ్యాసం లో ఆచార్యులను భగవానుడిగా ఎలా పరిగణిస్తారో వివరించబడింది .
  • చరమ పర్వం (ఆచార్యుడు) అత్యున్నత మార్గం/ లక్ష్యమని విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం సూత్రం 447 లో ఇలా వివరించారు “ఆచార్య అభిమానమే ఉత్తారకం” – ఆచార్యుల ఆశ్రయంలో ఉండడం మన మోక్షానికి అత్యున్నత  మార్గం. శిష్యుడి గురించి “ఇతను నా ప్రియమైన శిష్యుడు” అని ఆచార్యుడు భావించే స్థితికి ఎదగాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సూత్రం 446 లో, పిళ్ళై లోకాచార్యులు ఇలా వివరించారు, “ఆచార్యనైయుం తాన్ పత్తుం పత్తు అహంకార గర్భమోపాధి కాలన్ కొణ్డు మోదిరమిడుమాపోలే” – ఆచార్యులను ఆశ్రయించే ప్రయత్నంలో కూడా, స్వగత స్వీకారం (సొంతంగా ప్రయత్నించి  ఆచార్యులను ఆశ్రయించినట్లయితే) అది జీవాత్మ స్వభావానికి విరుద్ధం, ఎందుకంటే స్వతంత్రుడనే అహంకారంతో జరుగుతుంది కాబట్టి. ఆచార్యులు శిష్యుడిని కృపతో ఆశీర్వదించారు అని భావించాలి (నిరంతరం శిష్యుడు ఈ భావనతో ఉండాలి). శిష్యుడు అహంకారంతో చేసినపుడు, అది ఒక అందమైన బంగారపు ఉంగరాన్ని తయారు చేసి, కాల (యమ ధర్మరాజు – మన మరణాన్ని నియంత్రించేవాడు) నుండి స్వీకరించడం లాంటిది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/09/virodhi-pariharangal-35.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 34

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/07/01/virodhi-pariharangal-33/

68. జాతి విరోధి – జాతి/వర్ణంలో (జన్మ) అవరోధాలు

త్యాగ మండపంలో (కాంచీపురం)  దేవ పెరుమాళ్ను సెవిస్తున్న తిరుక్కచ్చి నంబిని ఎమ్పెరుమానార్ సేవించారు

ఈ రోజుల్లో జాతి అంటే కేవలం బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్రుల (వర్ణాలు) తో చేర్చి కలిపి చెప్పబడుతుంది. కానీ వాస్తవానికి ఇది నిజం కాదని మనం అర్థం చేసుకోవాలి.  జాతి అంటే దేవ (దేవతలు), మనుష్య (మానవ), తిర్యక్ (జంతువులు – అడ్డంగా పెరిగేవి) మరియు స్థావర (చెట్లు/మొక్కలు), వాటి పుట్టుక / శరీరానికి సంబంధించినది. జాతి శరీర రకానికి (జాతులకు) సంబంధించినది కానీ ఆత్మకు కాదు. తిర్యక్ అంటే జంతువులు / పక్షుల – ఉప వర్గానికి సంబంధించినవి – ఎగిరేవి, నడిచేవి, పాకేవి, నీటిలో నివసించేవి, భూమిపై నివసించేవి, అడవిలో నివసించేవి, పట్టణాల్లో నివసించేవి మొదలైనవి.  స్థావరమైనవి చెట్లు, మొక్కలు, పొదలు, లతలు మొదలైనవి. ఎత్తు (పొడవైనవి, పొట్టివి), రంగు (నలుపు, ఎరుపు) మొదలైనవి వివిధ జాతులు కావు. భగవద్గీత లో, శ్రీ కృష్ణుడు మొత్తం 4 వర్ణాలు తనచే సృష్టించబడ్డాయి, అవి వాటి లక్షణాలు ప్రక్రియల ద్వారా వర్గీకరించబడ్డాయి అని వివరించారు.

ఈ భాగంలో చర్చించబడిన ఈ అంశం చాలా గోప్యమైనది. దానిని సాధ్యమైనంత సరళంగా వివరించడానికి మేము ప్రయత్నిస్తాము. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం మొదలైన రహస్య గ్రాంథాలలో వివరించబడిన అంశాలు  మాత్రమే ఇక్కడ వివరించబడ్డాయి. మాముణుల పదాలను మనం గుర్తుచేసుకుందాము – “ఆర్ వచన భూతణత్తిన్ ఆళ్ పొరుళెల్లాం అఱివార్? ఆర్ అతు చొల్ నేరిల్ అనుట్టిప్పార్?” – శ్రీవచన భూషణం అర్ధాలను ఎవరు పూర్తిగా అర్థం చేసుకోగలరు? అలాంటి ఉపదేశాలను ఎవరు పూర్తిగా పాటించగలరు? దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ విభాగంలోకి ముందుకువెళ్దాం.

అనువాదకుల గమనిక: జాతికి వేర్వేరు అర్థాలున్నాయి. సాధారణంగా ఇది దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాలకు సంబంధించినది. కానీ దీనికి మించి, కొన్ని ప్రదేశాలలో జాతిని అప్పుడప్పుడు వర్ణంతో చేరుస్తారు (ఒక కుటుంబంలో పుట్టిన వర్గానికి సంబంధించినది కాబట్టి). మొత్తానికి జాతి దేహానికి, పుట్టుకకు సంబంధించినది. ఉదాహరణకు, ద్విజులు అంటే రెండుసార్లు జన్మించినవారు (బ్రాహ్మణ , క్షత్రియ, వైశ్య) – ప్రతి ఒక్కరూ శూద్రులుగా జన్మించినట్లు చెబుతారు, ఉపనయన సంస్కారం ద్వారా వారు ద్విజులౌతారు. ఉపనయనం తరువాత, ద్విజులు (బ్రాహ్మణ , క్షత్రియ మరియు వైశ్యులు) వేదాధ్యయయం ద్వారా బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హులౌతారు. మన ఇష్టానుసారంగా బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యులుగా మారాలని ఎంచుకోవడం కాదు. సాధారణంగా, మన కర్మానుసారంగా ఒక నిర్దిష్ట కుటుంబంలో జన్మిస్తారు. కాబట్టి, ఎవరైనా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినట్లయితే, వారికి బ్రాహ్మణుడు కావడానికి అవకాశం ఇవ్వబడుతుంది. వారు బ్రాహ్మణుడిగా మారిన తర్వాత, వాళ్ళు వారి నియమాలకు కట్టుబడి ఉండాలి.  తమ ఆచార్యుల నుండి వేదాధ్యయనం చేసి, నేర్చుకున్న ఆ వేద సూత్రాల ప్రకారం నడుచుకోవాలి. ఈ విధంగా వారి బ్రాహ్మణ్యాన్ని (బ్రాహ్మణ ధర్మం)  నిర్వహించుకోవాలి. అదేవిధంగా, ప్రతి వర్ణం వారు తమ సొంత ధర్మాలను నిర్వహిస్తూ, శ్రీమన్నారాయణుడికి ప్రియమైన వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించాలి. సమాజ వ్యవహరణకై,  ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడేందుకు భగవానునిచే  వర్ణాశ్రమ ధర్మం స్థాపించబడింది.  వివిధ వర్ణాల యొక్క ప్రధాన కార్యాలు:

  • బ్రాహ్మణులకు ఆరు ప్రధాన కార్యాలు గుర్తించబడ్డాయి. అధ్యయనం (వేదాధ్యయనం), అధ్యాపనం (ఇతరులకు వేదం నేర్పడం), యజనం (తమ కోసం యజ్ఞం చేయడం), యాజనం (ఇతరులకై యజ్ఞం చేయడం), దానం (దానం ఇవ్వడం), పరిగ్రహం (దానం తీసుకోవడం).
  • క్షత్రియులకు, అధ్యయనం (వేదాధ్యయనం), యజ్ఞం (తమ కోసం యజ్ఞం చేయడం) మరియు దానం (దాన ధర్మాలు చేయడం) మాత్రమే వర్తిస్తాయి – ఇతరులకు వేధాలను బోధించడం, ఇతరులకై యజ్ఞం చేయడం మరియు దానం తీసుకోవడం వర్తించవు. కానీ వాటి స్థానంలో, వారు ఆయుధం చేతపట్టి, పౌరులను రక్షించాలి, దేశాన్ని పరిపాలించాలి.
  • వైశ్యులకు కూడా, అధ్యయనం (వేదాధ్యయనం), యజ్ఞం (తమ కోసం యజ్ఞం చేయడం) మరియు దానం (దానధర్మాలు చేయడం) మాత్రమే వర్తిస్తాయి – ఇతరులకు వేధాలను బోధించడం, ఇతరులకై యజ్ఞం చేయడం మరియు దానం తీసుకోవడం వర్తించవు. కానీ వాటి స్థానంలో వాళ్ళు వ్యవసాయం, గో రక్షణ/ పోషణ, వ్యాపారాలు మొదలైన వాటిలో పాల్గొనవలసి ఉంటుంది.
  • శూద్రులు కేవలం ఈ మూడు వర్ణాల వారికి, వారి వారి కార్యాలలో సహాయం చేయాలి

పై సూత్రాలను అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ యొక్క  ఆచార్య హృదయం 31వ చూర్ణికకు మాముణులు వ్యాఖ్యానించారు. 

ఆచార్య హృదయం 33 వ చూర్ణికలో, నాయనార్లు  ఈ రెండవ జన్మను (ద్విజ) మరొక రెండవ జన్మతో అందంగా పోల్చారు – అదే పంచ సంస్కరం ద్వారా వైష్ణవునిగా మారుట. రెండవ జన్మ వైధిక కర్మలలో పాల్గొనడానికి దోహదపడినట్లే, పంచ సంస్కరం ద్వారా వచ్చిన ఆత్మ యొక్క రెండవ జన్మను శ్రీమన్నారాయణుడు మరియు వారి భక్తులు (భాగవతులు) యొక్క దాస్యంలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ఆత్మ శాశ్వతమైనదైనప్పటికీ, తిరుమంత్రం (అష్ఠాక్షరం) నేర్చుకోవడం ద్వారా, జీవాత్మ తాను శ్రీమన్నారాయణ యొక్క శాశ్వత సేవకుడని తన వాస్తవిక స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు. మాముణులు ఈ చూర్ణిక వ్యాఖ్యానంలో అందంగా వివరిస్తున్నారు – ఎలాగైతే గాయత్రి మంత్రం (అన్ని మంత్రాలకు తల్లి) మనల్ని బ్రాహ్మణుడిగా మార్చుతుందో అలాగే తిరుమంత్రం (గాయత్రి మంత్రానికి తల్లి) మనల్ని వైష్ణవునిగా మార్చుతుంది. బ్రాహ్మణుడిని  కర్మనిష్ఠ (కర్మపై దృష్టి కేంద్రీకరించినవాడు) అని పిలుస్తారు, వైష్ణవుడిని దాస భూత (దాసత్వంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినవాడు) అని పిలుస్తారు. తరువాత, నాయనార్  కర్మ నిష్టలు మరియు దాస భూతుల మధ్య చాలా తేడాలను వివరిస్తున్నారు.  37 వ చూర్ణికలో కూడా, నాయనార్ వివరణ ఇలా ఉంది – వేదాధ్యయనం చేయడం ద్వారా, వాటి అర్ధాలను అర్థం చేసుకోవడం ద్వారా, వేదంలో వివరించిన సూత్రాలను పాటించడం ద్వారా తమ బ్రాహ్మణ్యం ఎలా స్థాపించబడుతుందో అలాగే స్వయంగా తమ ఆచార్యుల నుండి తిరువాయ్మొళి (ఇతర దివ్య ప్రబందాలు కూడా) నేర్చుకోవడం, ఆచార్యుల నుండి వాటి అర్ధాలను అర్థం చేసుకొని తమ జీవితంలో ఆ సూత్రాలను పాటించడం ద్వారా తమ వైష్ణవత్వం స్థాపించ బడుతుంది.

ఈ విభాగంలో, వైష్ణవుని/ ప్రపన్నుని (శ్రీమన్నారాయణుడకు శరణాగతుడైన వ్యక్తి) యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యమైన వైష్ణవ లక్షణాలను లోతుగా వివరించారు. ఈ పరిచయంతో, విభాగంలోకి వెళ్దాం.

  • అజ్ఞానుడు, జ్ఞానాధికారుడు (పండితుడైనవాడు), భక్తి పరవశుడు (భక్తిలో పూర్తిగా నిమజ్ఞమైపోయినవాడు) – ఈ మూడు రకాల ప్రపన్నులకు అవసరమైనది భగవత్ సంరక్షణపై సంపూర్ణ విశ్వాసం (100% విశ్వాసం) కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. ప్రపన్నుడనగా భగవాన్ ని ఉపాయంగా స్వీకరించి వారికి శరణాగతుడైన వ్యక్తి  అని అర్థం. ఇక్కడ వివరించిన ఈ 3 రకాల ప్రపన్నులకు ఆ మహా విశ్వాసం ఉండాలి. ఈ మహావిశ్వాసం జాతి ధర్మం (ఒక నిర్దిష్ట వస్తువును గుర్తించే ప్రత్యేక గుణం) అని అంటారు. మహా విశ్వాసం అంటే భగవానుడిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండి ఆయన మనలను రక్షిస్తాడని, చివరికి మనలను ఉద్ధరిస్తాడన్న విశ్వాసం. ఈ మూడు రకాల ప్రపన్నులపై ఇంకొంచెం  వివరణ చూద్దాం.  (అనువాదకుల గమనిక:  శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాంలో, పిళ్ళై లోకాచార్యులు సూత్రం  41 నుండి ఈ 3 రకాల ప్రపన్నుల గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. వారు మహా పండితులైనప్పటికీ సూత్రం 43 లోని అజ్ఞార్ (అజ్ఞానుడు) భాగంలో తనను తాను చేర్చినప్పుడు, పిళ్ళై లోకాచార్యుల వంటి మన పూర్వాచార్యుల యొక్క వినయ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అభినందించవచ్చు. పిళ్ళై లోకాచార్యులు ఆ జాబితాలో తనను తాను నైచ్యానుసంధానం (వినయం మరియు తనను తాను చాలా తక్కువగా భావించడం) లో చేర్చారు అని మాముణులు అందంగా వివరించారు. ఈ సూత్రానికి మాముణుల వ్యఖ్యానం చాలా స్పష్టమైనది,  అర్థం చేసుకోవడానికి సులభమైనది.)
    • స్వరూపం (నిజ స్వభావం), ఉపాయం (మాధ్యమం), ఉపేయం (లక్ష్యం) మొదలైన వాటి గురించి స్పష్టమైన అవగాహన లేని వ్యక్తిని అజ్ఞార్ అంటారు. ఈ వర్గానికి మనమే మంచి ఉదాహరణ. స్పష్టమైన జ్ఞానం, సామర్థ్యం లేనందున స్వయం ప్రయత్నాలను (భగవానుని చేరుకునేందుకు శాస్త్రంలో వివరించినట్లుగా కర్మ, జ్ఞాన, భక్తి యోగమాధ్యమాలు) వీరు ప్రయత్నించరు. ముందు చెప్పినట్టుగా, మనం మంచి ఉదాహరణలు.
    • జ్ఞానాధికారుడు అనగా స్వరూపం, ఉపాయం, ఉపేయం, వంటి ఈ సూత్రాల గురించి పూర్తి అవగాహన, స్పష్టత ఉన్నవాడు. ఆపై ఇతరులకు వివరించగల వ్యక్తి. జ్ఞానం మరియు అనుష్ఠానముతో నిండిఉన్నవాడు. మన పూర్వాచార్యులు మంచి ఉదాహరణలు. వారు మహాజ్ఞానులు, స్వయం ప్రయత్నాలను కొనసాగించగల సామర్థ్యం ఉన్నారు. కాని స్వయం ప్రయత్నంలో పాల్గొనడం జీవత్మ స్వభావానికి విరుద్ధమని గ్రహించి, వారు అటువంటి ప్రయత్నాలను పూర్తిగా వదులుకొని (కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను ఉపాయంగా అనుసరించుట) భగవానుడికి సంపూర్ణ శరణాగతులైనారు.
    • భక్తి పరవసుడు అనగా భగవాన్ గురించి విన్న వెంటనే / ఆలోచించిన వెంటనే శుద్ద భక్తితో కరిగిపోయేవారు. ఈ వర్గానికి ఆళ్వారులు మంచి ఉదాహరణలు. భగవాన్ చేత ఆళ్వారులు స్పష్టమైన జ్ఞానభక్తితో ఆశీర్వదించబడినప్పటికీ, భగవాన్ పట్ల అమితమైన ప్రేమ భక్తి కారణంగా, వాళ్ళు సహజంగానే ఏ ప్రయత్నాలలో పాల్గొనలేదు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 5.8.8 లో “కళైవాయ్ తున్బం కళైయాతొళివాయ్ కళైకణ్ మత్తిలేన్” (మీరు నా అడ్డంకులను తొలగించినా లేదా తొలగించకపోయినా – నాకు వేరే ఆశ్రయం లేదు, నా సంరక్షణ భారం నీదే). తిరువాయ్మొళి 5.8.3 లో కూడా అన్నారు, “ఉన్నాలల్లాల్ యావరాలుం ఒన్ఱుం కుఱై వేణ్డేనున తాళ్ పిడిత్తే సెలక్కాణే” – మీ తప్ప నేనెవరి నుండి ఏమీ కోరుకోను  …..నేను ఎల్లప్పుడూ మీ పాదపద్మాలపైనే ఆధారపడి ఉంటాను.
  • మనుష్య ధర్మానికి (మానవత్వ సూత్రాలు) విరుద్ధంగా ప్రవర్తించడం ఒక అడ్డంకి. ప్రత్యేకంగా  మానవులకు ఒక సామర్ధ్యం ఉంది.  ఏమిటంటే కృత్య అకృత్య వివేకం (చేయవలసినది మరియు చేయకూడని వాటి మధ్య వివక్షత చూపే జ్ఞానం). దాని ప్రకారం, ఈ మానవ జీవితం / శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇదం కురు (దీన్ని చేయండి, మీకు ప్రయోజకరమైనది), ఇదం మాకార్షీః (దీన్ని చేయొద్దు, ఇది మీకు హానిచేస్తుంది) అని శాస్త్రం  అంటుంది. మనం వాటిని అర్థం చేసుకొని మన జీవితంలో అనుసరించడానికి ప్రయత్నించాలి. నాగరికత, మానవత్వం అంటే “ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా జీవించాలి” అని ఆలోచించడం – అలాంటి మంచి స్వభావం ప్రతి ఒక్కరికీ అవసరం. దీని కంటే ఇంక ఎక్కువ అవసరం లేదు. దీనికి విరుద్ధంగా ప్రవర్తించడం ఒక అడ్డంకి.  అనువాదకుల గమనిక: అద్భుతమైన శ్రీవైష్ణవ లక్షణాలలోకి వెళ్ళే ముందు, సామాన్య మానవత్వం గురించి అలోచించి,  ప్రతి ఒక్కరి పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలి. నాగరిక ప్రవర్తన అంటే నియమాలను పాటిస్తూ గౌరవంగా జీవించడం (కోరికలు/ఇంద్రియ తృప్తికై జీవించడం కాదు). అలాగే, ఆహార, నిద్ర, భయం మరియు మైత్తున (కుటుంబ జీవితం) అన్ని జీవులకు సాధారణమని చెబుతారు. చీమలు, పిల్లులు, కుక్కలు, గాడిదలు, మానవులు, ఇలా అన్ని జీవులకు ఎదో ఒక రూపంలో ఈ నాలుగు సూత్రాలు ఉన్నాయి. ఈ పుట్టుక / మరణం చక్రం నుండి మోక్షాన్ని పొందగలగడం ప్రత్యేకంగా మానవులకే ఉన్న సామర్థ్యం. శాస్త్రాన్ని జ్ఞానులైన ఆచార్యల నుండి నేర్చుకొని అర్థం చేసుకోవచ్చు. సృష్టి సమయంలో, భగవాన్ ఎంతో కృపతో జీవాత్మలకు దేహం ఇంద్రియాలను ప్రసాదిస్తాడు. బ్రహ్మ, ఋషులు మరియు ఆళ్వారుల ద్వారా కూడా శాస్త్రాన్ని వెల్లడిస్తాడు. ఇంద్రియాల ఉపయోగంతో, మానవుడు నియమాలను/సూత్రాలను అర్థం చేసుకోవచ్చు, వారి దేహాన్ని కైంకర్యానికి ఉపయోగించవచ్చు.  ఇలా చేస్తే ఆ జీవాత్మకు ఆధ్యాత్మిక పురోగతి ఖచ్చితంగా లభిస్తుంది. అలా చేయకపోతే, అది మానవ శరీరరూపంలో ఇవ్వబడిన అద్భుతమైన అవకాశాన్ని వృధా చేసుకోవడం వంటిది.
  • తమ ఉద్ధరణకై స్వప్రయత్నం చేయడం ఒక అడ్డంకి. ఇక్కడ నుండి మొదలుకొని, ప్రపన్న ధర్మం (ప్రపన్నుల ఆదర్శ ప్రవర్తన / మార్గదర్శకాలు) గురించి చర్చించబడింది. భగవానునికి ప్రపన్నుడు సంపూర్ణ శరణాగతుడై ఉండాలి,  ఎప్పుడూ స్వీయ ప్రయత్నంలో పాల్గొనకూడదు. ఇది జీవత్మా యొక్క నిజ స్వభావమైన శేషత్వానికి (సంపూర్ణ దాసత్వం) / పారతంత్రియానికి (సంపూర్ణ ఆశ్రయం) విరుద్ధం. అనువాదకుల గమనిక: భగవాన్ పై ఆధారపడటం అంటే ఎంతటి పరిస్తితి తలిత్తినా మన సొంత ప్రయత్నాలను వదులుకోవాలి. అంటే పనిలేకుండా ఖాళీగా ఉండమని కాదు. దీని అర్థం మనం కైంకర్యంలో నిమగ్నమై ఉండాలి మరియు కైంకర్యం అనేది ఏదైనా పొందడానికి చేసేది కాదు అని అర్ధం చేసుకోవాలి.
  • ప్రపత్తి చేసే ముందు శుద్ది / అశుద్దిని పరిగణించడం ఒక అడ్డంకి. ప్రపత్తి అనేది ఒక మానసిక స్థితి (భగవాన్ని సంపూర్ణ ఆశ్రయంగా స్వీకరించడం). దీనికి ప్రత్యేక స్థలం, సమయం,  శుద్ది / అశుద్ది స్థితి మొదలైనవి అవసరం లేదు, అలాగే కొనసాగించవచ్చు. ద్రౌపది ప్రమాదంలో ఉండి  అవమానానికి గురైనప్పుడు, ఆమె “హా కృష్ణ! రక్షమామ్ శరణాగతం” (కృష్ణ! ఈ శరణాగత ఆత్మను రక్షించు) అని ఆమె ఋతుక్రమము సమయంలో ఉన్నప్పటికీ సంపూర్ణ విశ్వాసంతో తన రెండు చేతులు పైకెత్తి వేడుకుంది – శ్రీ కృష్ణుని చేత ఖచ్చితంగా రక్షించబడింది. అదేవిధంగా, విభీషణుడు శ్రీ రామునికి శరణాగతి చేయడానికి వచ్చినప్పుడు, అతను సముద్రతీరంలో ఉన్నప్పటికీ స్నానమాచరించలేదు – అతను ఆకాశం నుండి శ్రీరామునికి శరణగతి చేస్తారు.  శుద్దులైనా లేదా అశుద్దులైనా అదే స్థితిలో ఉండి భగవానుడికి  శరణగతి చేయవచ్చు. ప్రపత్తి చేసే ముందు మన స్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, ప్రపత్తి గురించి వివరంగా చర్చించారు. సూత్రం 30లో, ఇదే సిద్ధాంతం అందంగా వివరించబడింది. మాముణులు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అందంగా స్పష్టం చేస్తున్నారు. ప్రపత్తి చేసే ముందు తమను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదని అర్ధం చేసుకోగలిగినప్పటికీ, ప్రపత్తి చేసే ముందు తమ శుద్ధ /అశుద్ధ స్థితిని పరిగణించకూడదని  ఎందుకు చెప్పారని ఆశ్చర్యపోవచ్చు. ద్రౌపదిని, అర్జునుడిని చూసి మాముణులు స్వయంగా ఈ ప్రశ్నను లేవనెత్తి ఇలా వివరించారు.  (మునుపటి సూత్రంలో (సూత్రం 29లో), అర్జునుడు చాలా తక్కువ / అణగారిన వాళ్ళ మధ్య శరణాగతి సూత్రాల ఉపదేశాలను విన్నట్లు వివరించబడింది – స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడి పక్షాన ఉండడం చూసి కూడా వాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా పోరాడతారు),  “నేను ప్రపత్తి చేయటానికి  అర్హుడ్ని కావాలంటే నేను బహుశా అపవిత్రుడిని కావాలి” అని అనుకోవచ్చు. కానీ అది కూడా అవసరం లేదు. మాముణుల వివరణ ఏమిటంటే ఎట్టి సందర్భంలో కూడా నిషిద్ధ (నిషేధించబడిన) కర్మలలో పాల్పడకూడదని వివరిస్తున్నారు. తరువాత సుత్రాంలో, నంపిళ్ళై యొక్క  అందమైన ఉల్లేఖనాలు ఇక్కడ గుర్తుచేసుకోబడింది. సముద్రం దాటి లంకకు వెళ్ళేందుకు సహాయం పొందడానికి శ్రీ రాముడు స్వయంగా సముద్ర రాజుకి ప్రపత్తి (శరణాగతి) చేసినప్పుడు, మొదట స్నానం చేస్తారు. సామాన్యంగా శ్రీ రాముడు ఏదైనా చేసేముందు స్నానమాచరించడం సహజమని, ఇది ప్రపత్తిలో భాగంగా చేయలేదని నంపిళ్ళై వివరిస్తున్నారు. కాబట్టి, ప్రపత్తి అనేది స్వతంత్ర ఉపాయం మరియు దీనిని చేయడానికి ముందుగా కావలిసినది ఏమి లేదు.
  • భగవద్దాసులుగా ఉన్నవారు నిత్య కర్మానుష్ఠానాలు చేయకపోవడం ఒక అడ్డంకి. సాధారణంగా  నిత్య కర్మలను పాటించడం నియమం. వాటిని భగవద్ ఆజ్ఞా కైంకార్యంగా (భగవాన్ ఆదేశాలు) పాటించాలి. మన దినచర్యలో  నిత్య కర్మలను (సంధ్యావందనం మొదలైనవి) వదులుకునే హక్కు మనకు లేదు. ఈ అంశంపై ఇప్పటికే మనం చాలా చర్చించాము. వాటిని గురించి స్పష్టత తెచ్చుకోవాలి. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 82 వ సూత్రంలో, “తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ స్వ వ్యాపారత్తై విట్టాన్” – తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ తమ వ్యక్తిగత కార్యాలన్నీ వదులుకున్నారు. మహావిశ్వాసం యొక్క శిఖరంపై చేరుకున్న వారు కాబట్టి వారన్ని ప్రయత్నాలను వదులుకున్నారు. మాముణులు  ఉపదేశరత్నమాల పాసురం 55 లో ఇలా వివరించారు,  “ఎల్లార్కుం అణ్డాత్తన్రో అతు”  – శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో వివరించిన సూత్రాలు పూర్తిగా అనుసరించేవారు కొందరే.  అనువాదకుల గమనిక: దయచేసి http://guruparamparai.wordpress.com/2014/07/13/thirukkannamangai-andan/  లో తిరుక్కన్నమంగై ఆణ్డాన్ వైభావం చదవండి. మాముణులు వ్యాక్యానంలో, ఆణ్డాన్ స్వీయ ప్రయత్నాలకు సంబంధించిన కార్యాలను మానుకొని పూర్తిగా కైంకర్యంలో నిమగ్నమై ఉండేవారు. నిత్య కర్మానుష్ఠానాలకు సంబంధించినంతవరకు, భగవత్ కైంకర్యాల మధ్యలో రానంతవరకు, అవి తప్పకుండా సమయానికి ఆచరించాలి. కానీ మనం భగవత్ కైంకర్యంలో ఉన్నప్పుడు, నిత్య కర్మానుష్ఠానములను ఆలస్యంచేయవచ్చు / దాటవేయవచ్చు అని వివరించారు. దీనిని అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం 31వ చూర్ణికలో  “…అత్తాణిచ్ చేవకత్తిల్ పొదువానదు నళువుం” – మనం భగవత్/భాగవత కైంకర్యంలో ఉన్నప్పుడు ఒక్కోసారి నిత్య కర్మానుష్ఠానాలను మానవచ్చు. వైధికులు తమ వైధిక అనుష్ఠానాలను పాటించక పోవడం చూసి ఈ ప్రపంచ ప్రజలు తప్పుదోవ పట్ట కూడదన్న గొప్ప కరుణాభావంతో మన పూర్వాచార్యులు అన్ని నిత్య కర్మానుష్ఠానాలను పాటించేవారు, అని మాముణులు అందంగా వివరిస్తున్నారు.
  • నిత్య కర్మానుష్ఠానములను పాటించని వ్యక్తులతో జీవించడం ఒక అడ్డంకి. శ్రీవైష్ణవ సన్యాసులు (ఇతర వర్గాల సన్యాసులలా కాకుండా) శిఖ, యజ్ఞోపవీతం మొదలైనవాటిని ధరించాలి, నిత్యా కర్మానుష్ఠానములను పాటించాలి. ఎమ్పెరుమానార్ 120 సంవత్సరాల పండు వయస్సులో కూడా తమ సంధ్యావందనములో భాగంగా అర్ఘ్యం (జల సమర్పణ) నిలబడి సమర్పించేవారని చెబుతారు. అనువాదకుల గమనిక: ఇది సన్యాసుల విషయం. ఇక గ్రుహస్థులు, బ్రహ్మచారులు మొదలైనవారి గురించి ఏమి చెప్పాలి – వారు నియమం తప్పకుండా వారి కర్మానుష్ఠానములను పాటించాలి. నిత్య కర్మానుష్ఠానములను పాటించని వ్యక్తులతో సహ జీవనం చేసినప్పుడు, వారితో ప్రభావితం కావచ్చు. అందుకే అటువంటి  సహ జీవనానికి దూరంగా ఉండటం మంచిది. 
  • తిరుమంత్రంలో తిరిగి పుట్టడం ఉత్తమ పుట్టుక అని తెలియకపోవడం ఒక అడ్డంకి. తిరుమంత్రంలో జన్మించడం అంటే జ్ఞాన జన్మ (జ్ఞానం యొక్క జన్మ) – తమ వాస్తవ స్వభావ  దివ్య జ్ఞానాన్ని పొందడం. తిరుమల అనంతాళ్వాన్ నంజియర్‌తో ఇలా అన్నారు. “తిరుమంత్రత్తిలే  పిఱంతు ద్వయత్తిలే  వళర్ న్తు ద్వయైక నిష్టరావీర్” – నీవు తిరుమంత్రంలో పుట్టి, ద్వయమహామంత్రంలో పెరగాలి. ద్వయం మంత్రంలో సంపూర్ణ నిష్ఠతో ఉండాలి.  అనువాదకుల గమనిక: నంజీయర్ సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత, తమ ఆచార్యులు పరాశర భట్టర్‌తో కలిసి ఉండటానికి శ్రీరంగానికి వెళ్ళినప్పుడు, అతను మార్గంలో అనంతాళ్వన్ను కలుస్తారు. ఆ సమయంలో, సన్యాసం స్వీకరించినందుకు నంజీయర్ను  అనంతాళ్వారులు ఆగ్రహించి సన్యాసాశ్రమానికి బదులుగా కేవలం గ్రుహస్థుడిగా ఉండి, ద్వయ మహామంత్రంపై పూర్తి విశ్వాసంతో తమ ఆచార్యసేవను కొనసాగించాల్సినది అని అంటారు.  ఈ వ్యాసం యొక్క పరిచయ విభాగంలో జ్ఞాన జన్మ గురించి ఆచార్య హృదయం 33 వ చూర్ణిక లో నాయనార్ వివరణను మనం చూశాము.
  • ఇతర మంత్రాలలో మళ్ళీ పుట్టడం మన స్వరూపంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. మునుపటి వివరణలో, తిరుమంత్ర దీక్ష గురించి వివరించబడింది, ఇది (పై వివరణ) ద్వయ మహామంత్రం, చరమ శ్లోకానికి కూడా వర్తిస్తుంది, ఎందుకంటే అవి తిరుమంత్ర విస్తరణలు/వివరణలు కాబట్టి. ఇక్కడ ఇతర మంత్రాలను దేవతాంతర సంబంధమైన మంత్రాలుగా పరిగణించవచ్చు. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడిలో, ప్రారంభంలోనే, పిళ్ళై లోకాచార్యులు ఇతర మంత్రాల కంటే తిరుమంత్రం యొక్క మహోన్నత మహిమలను వివరించారు. మొదట వారు, మూడు గొప్ప మంత్రాల యొక్క గొప్పతనాన్ని వివరించారు – తిరుమంత్రం (అష్టాక్షరి), వాసుదేవ మంత్రం (తిరు ద్వాదశాక్షరి), విష్ణుమంత్రం (షడక్షరి). ఆ మూడింటిలోనూ కూడా, తిరుమంత్రం గొప్పదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది అర్ధపంచక  స్వభావాన్ని వివరిస్తుంది – జీవత్మ (ఆత్మ), పరమాత్మ (మహోన్నతుడు), ఉపాయం (మాధ్యమం), ఫలం (లక్ష్యం) మరియు వీరోధి (అడ్డంకులు) సహజమైన రీతిలో వివరించారు. తిరుమంత్రం (ద్వయం మరియు చరమ స్లోకంతో కలిపి) ఇతర మంత్రాలకన్నా అర్థ పంచక జ్ఞానాన్ని స్పష్టంగా తెలుపుతుంది కాబట్టి, అగ్రస్థానంలో ఈ మంత్రాన్ని ఉంచవచ్చు. అందువల్ల ఇతర మంత్రాలను అనుసరించే అవసరం లేదు.
  • “కోయిలిల్ వాళుం వైష్ణవన్” (శ్రీరంగంలో సేవచేసే / నివసించేవారు) తమకది మహోన్నమైన గుర్తింపని తెలియకపోవడం ఒక అడ్డంకి. కోయిల్ అంటే సాధారణంగా శ్రీరంగం అని అర్థం. ఎమ్పెరుమానార్కి (శ్రీ రామానుజులు) నమ్పెరుమాళ్ (శ్రీరంగనాథుడు) ఇచ్చిన ఆదేశాల మేరకు – “యావచ్చరీరపాదం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ” – ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం శ్రీరంగంలో సంతోషంగా ఉండు. ఇది ప్రతి ఒక్కరికీ సాధ్యం కానందున, అన్ని దివ్య దేశాలతో చేర్చాలి. ఇక్కడ వైష్ణవుడు అంటే ద్వయ మహామంత్ర విశ్వాసపాత్రుడు అని అర్థం. నిష్టగలవాడు అంటే స్పష్టమైన జ్ఞానం ఉండి నేర్చుకున్న వాటిని ఆచరణాత్మకంగా అనుసరించేవాడు. శ్రీవైష్ణవుల ప్రవర్తన ఎలా ఉండాలంటే వారిని “పరమ సాత్వికర్” (అతిస్వచ్ఛమైన), “పరమ ప్రామాణికర్” (అతి ప్రామాణిక)గా గుర్తించబడాలి. తిరుమాలై 38వ పాసుర వ్యాఖ్యానాన్ని దయచేసి చూడండి… “కామ్బఱత్ తలై చిఱైత్తు ఉన్ కడైత్ తలై ఇరుంతు వాళుం చోమ్బరై ఉగత్తి….”  అనువాదకుల గమనిక: తిరుమాలై 38వ పాసురాన్ని పెరియవాచాన్ పిళ్ళై “ద్వయ మహామంత్రం యొక్క సమగ్ర వివరణ” గా కీర్తించారు. ప్రధానంగా పాసురం యొక్క ఈ భాగంలో, ఉపాయాంతరాలకు (స్వీయ ప్రయత్నాలు)  తమను దూరంగా ఉంచవలసిన ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పబడింది. వెంట్రుకలను వదులుకోవడం అహంకారాన్ని వదులుకోవడానికి సంకేతం – ప్రాచీన కాలంలో, ఎవరినైనా శిక్షించాలన్నా / అవమానించాలన్నా వాళ్ళ జుట్టుని కత్తిరించేవారు. అదేవిధంగా మన సొంత ప్రయత్నాల్ని మానుకొని మన సంరక్షణకై పూర్తిగా భగవాన్పై ఆధారపడి ఉండాలి. అలాంటి వ్యక్తిని “చోంబర్” (సోమరి వ్యక్తి) గా అభివర్ణిస్తారు. కానీ మనం “వాళుం చోంబర్” (చురుకైన / ఆనందకరమైన సోమరి వ్యక్తి) కూడా అయి ఉండాలి – మన వాస్తవ స్వభావాన్ని పూర్తిగా గ్రహించి, మన ప్రయత్నాలను మానుకొని, కైంకర్యంలో (భగవాన్ /భాగవత సేవ) పూర్తిగా మునిగి ఉండటం వల్ల ఆనందంగా ఉంటాము. అలాంటి వ్యక్తులు శ్రీమన్నారాయణుడకు నిత్యాసూరుల వలే ప్రియమైనవారు.
  • మన జన్మస్థలం, వంశం / కుటుంబం ఆధారంగా గుర్తింపు / పేరు / కీర్తి రావడం ఎందుకూ పనికిరానివని తెలియకపోవడం ఒక అడ్డంకి. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, సూత్రం 78 లో ఈ విషయం వివరించబడింది – “గ్రామకులాదిగళాల్ వరుం పేర్ అనర్ త్త హేతు” . గ్రామం అంటే ఊరు / పట్టణం. కులం అంటే వంశం / కుటుంబం. అలాంటి కీర్తి  అహంకారానికి దారి తీస్తుంది కాబట్టి (ఉదాహరణకు: “నేను ఈ దివ్య దేశంలో జన్మించాను” లేదా “నేను ఈ గొప్ప ఆచార్య పురుషుని కుటుంబంలో జన్మించాను”), చివరికది వినయపూర్వకమైన శ్రీవైష్ణవుడనే సహజ స్వరూపాన్ని నిర్మూలనకు దారితీస్తుంది. తరువాతి సూత్రంలో, పిళ్ళై లోకాచార్యులు తమ వివరణకు శ్రీ పాంచరాత్రం నుండి ఒక ప్రమాణాన్ని ఉల్లేఖిస్తున్నారు. “ఏకాంతి వ్యపతేష్ఠవ్యో నైవ గ్రామకులాధిబిః విష్ణునా వ్యపతేష్టవ్యస్తస్య సర్వం స ఏవ హి” – ఎవరైతే భగవానుడికి సంపూర్ణ శరణాగతులై ఉంటారో వారిని తమ జన్మస్థలం/ తమ కుటుంబం మొదలైన వాటితో గుర్తించరు. వారిని భగవత్ సంబంధంతో గుర్తిస్తారు. అటువంటి భక్తుడికి, భగవానుడే తనకు కుటుంబం, జన్మస్థలం కూడా.
  • ప్రపన్న జన కూటస్థరుడు (ప్రపన్నులందరికి ప్రధాన పూర్వీకుడు) పరాంకుశులు అని తెలియకపోవడం ఒక అడ్డంకి. సాధారణంగా కూటస్థరుడు అనగా ఒక కుటుంబ వృక్షం యొక్క మొదటి వ్యక్తిని (ప్రధాన పూర్వీకుడు)  సూచించడానికి ఉపయోగిస్తారు. ఆచార్య హృదయం చూర్ణిక 36 లో, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ వివరిస్తున్నారు “విప్రర్కు గోత్ర సరణ సూత్ర కూటస్తర్ పరాంగుస పరాసర్య బోదాయనాదిగళ్; ప్రపన్న జన కూటస్తర్ పరాంగుస పరకాల యతివరాదిగళ్” – బ్రాహ్మణులకు ప్రధాన పూర్వీకులు (వారి గోత్ర, శరణ (వారు అధ్యయనం చేయవలసిన వేద భాగం), సుత్ర (కర్మానుష్ఠానములను నిర్దేశించే శాస్త్రంలోని భాగం) ఆధారంగా పరాసర, వ్యాస, బోధాయన, వంటి ఋషుల ఆనవాలు గుర్తించవచ్చు; శరణాగతి మార్గంలోకి వెళ్ళిన శ్రీవైష్ణవులకు పరాంకుస (నమ్మాళ్వార్), పరకాల (తిరుమంగై ఆళ్వార్), యతివర (శ్రీ రామానుజ) మొదలైన సూత్రాధికారులు  పూర్వీకులుగా ఆనవాలు గుర్తించవచ్చు. వైధిక కర్మానుష్ఠానములు చేస్తున్నప్పుడు, ప్రణామం (నమస్కారాలు), అభివాదనం (ఋషులకు సంబంధించి పూర్వీకులను పఠించి తమ పరిచయం చేసుకోవడం, తమ వేద సాకా (శాఖ), ప్రత్యేకమైన సూత్రానుబంధం, తమ సొంత పేరు) మొదలైనవి నిర్వహించుకోవచ్చు. అయితే, ప్రపన్నులకు, వారు ఎల్లప్పుడూ తమను తాము ఆళ్వారులు మరియు ఆచార్యలతో గుర్తించాలి, ఎందుకంటే వారు భగవాన్ మరియు భాగవతుల దాసుడిగా జీవత్మ యదార్ధ స్వరూపాన్ని వ్యక్తంచేసినవారు.
  • శ్రీవైష్ణవులుగా మారిన తరువాత కూడా కుటుంబ జీవితంతో ముడిపడి ఉన్న ఆకులు-అలుములను తినే  ఋషులను తమ పూర్వీకులుగా పరిగణించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఆచార్య హృదయం చూర్ణిక 58 నుండి 62 వరకు, ఋషులు (మునులు) మరియు నమ్మాళ్వారుల మధ్య అంతరాన్ని అద్భుతంగా వివరణ చేయబడింది. చూర్ణిక 58 – ఋషులు అనగా ధ్యానం, యోగం మొదలైన వాటిలతో, తమ సొంత ప్రయత్నాల ద్వారా మేధ స్థితికి ఎదుగుతారు. కానీ నమ్మాళ్వార్ భగవాన్ చేత దివ్య అనుగ్రహం పొందినవారు,  భగవాన్ కల్యాణ గుణాలను పూర్తిగా గ్రహించడం వలన, భగవాన్ పట్ల ప్రేమ, భక్తితో నిండి ఉన్నారు. చూర్ణిక 59 – ఋషులు మహా జ్ఞానులు, అయినప్పటికీ వాళ్ళు భౌతిక ఇచ్చలతో కూడి ఉన్నవారు (గొప్ప ఋషులు పదేపదే భౌతిక కోరికలలో చిక్కుకొని, తరువాత ఆ స్థితి నుండి బయటకు వచ్చి, మళ్ళీ చిక్కుకున్న వారెందరో ఉన్నారు). కానీ నమ్మాళ్వార్ ఏ భౌతిక ఇచ్చలతో ఏ సంబంధం లేనివారు. చూర్ణిక 60 – ఋషులు అడవులలో నివసించి  కాయ-కూరలు, పండ్లు, ఆకులు అలుములు, నీరు, గాలిని భుజించి వైరాగ్య జీవితాన్ని గడిపేవారు. అయితే నమ్మాళ్వార్ కృష్ణుడిని ధ్యానిస్తూ తమ వైరాగ్య జీవితాన్ని గడిపారు – తాను తిరువాయ్మొళి 6.7.1 లో “ఉణ్ణుం సోఱు పరుగుం నీర్ తిన్నుం వెత్తిలై ఎల్లాం కణ్ణన్” – నా ఆహారం, నీరు అన్నీ కృష్ణుడే. చూర్ణిక 61 – తమ పిల్లలు దూరమైనప్పుడు తాను అనుభవించే దుఃఖం (సుఖ మహర్షి (వ్యాసుని పుత్రుడు) వ్యాసుని ఒంటరిగా వదిలి వెళ్లిపోయినప్పుడు వ్యాసుడు దుఃఖాన్ని అనుభవించాడు) భగవాన్తో వేరైనపుడు నమ్మాళ్వార్ అనుభవించారు. చూర్ణిక 62 – ఋషులు గొప్పగా అవగాహన ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో వాళ్ళు ఫలాతరం (కైంకర్యం కాని ఇతర లక్ష్యాలు), సాధనాంతరం (స్వయం ప్రయత్నాలు – భగవాన్ కాని ఇతర మాధ్యమాలు), దేవతాంతరములు (ఇతర దేవతల పట్ల స్వామిభక్తి) పట్ల తమకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తారు. కానీ ఆళ్వారులు సంపూర్ణంగా భగవత్ కైంకర్యమే లక్ష్యంగా దృష్టి పెట్టినవారు, భగవానుడే ఏకైక ఉపాయంగా స్వీకరించినవారు మరియు భగవాన్‌ను మాత్రమే ఆరాధన మూర్తిగా స్వీకరించినవారు. ఋషులు  మరియు ఆళ్వార్ల మధ్య ఈ తేడాల కారణంగా, ప్రపన్నులు తమ పూర్వీకులుగా ఆళ్వార్లను ఆచార్యులను చాటాలి.
  • మనల్ని నిజమైన శ్రీవైష్ణవులుగా తీర్చిదిద్దే తిరువాయ్మొళిని నేర్చుకోకపోవడం,  దానిలో వివరించిన సూత్రాలను సరిగ్గా పాటించక పోవడం అడ్డంకి. అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయంలో చూర్ణిక 37లో ఇలా వివరించారు “అధ్యయన జ్ఞాన అనుష్ఠానంగళాలే బ్రాహ్మణ్యమాగిఱాప్పోలే చన్దంగళాయిరముం అఱియక్కత్తు వల్లారానాల్ వైష్ణవత్వ సిద్ధి”  – ఎలాగైతే  బ్రాహ్మణుడి బ్రాహ్మణ్యం (బ్రాహ్మణుడిని నిజమైన స్వభావం) వేదాధ్యయనం చేయడం ద్వారా మరియు ఆ సూత్రాలను అనుసరించడం ద్వారా స్థాపించబడుతుందో అలాగే వైష్ణవుడి వైష్ణవవత్వం (వైష్ణవుని నిజమైన స్వభావం)  తిరువాయ్మొళిని సరిగ్గా అధ్యయనం చేసి దానిలో వివరించిన సూత్రాలను అనుసరించడం ద్వారా స్థాపించబడుతుంది.  ఇక్కడ అఱియ అంటే ఆచార్యుల నుండి తిరువాయ్మొళి నేర్చుకోవడం; కత్తు అంటే ఆచార్యుల నుండి భగవత్ విషయ కాలక్షేపాలను (వ్యాక్యానాలు) శ్రవణం చేయడం; వల్లార్ అంటే నేర్చుకున్న సూత్రాలను తమ జీవితంలో  ఆచరణాత్మకంగా అమలు చేయగల వ్యక్తి అని అర్థం. తిరువాయ్మొళి 5.5.11 లో, నమ్మాళ్వార్ “అరియక్కత్తు వల్లార్ వైట్టణవర్ ఆళ్కడల్ జ్ఞాలత్తుళ్ళే” – తిరువాయ్మొళిని, వాటి అర్థాలను నేర్చుకొని ఆ సూత్రాలను తమ జీవితంలో అమలు చేసే వ్యక్తియే వైష్ణవునిగా పరగణించబడతాడు.
  • అహంకారానికి దారితీసి, భాగవత అపచారానికి కారణమయ్యే మన వర్ణాన్ని వదలివేయకపోవడం ఒక అడ్డంకి. వర్ణంతో సంబంధం లేకుండా, వైష్ణవుడంటే భగవాన్, భాగవతుల కైంకర్యంలో నిమగ్నమై ఉన్నవాడని అర్థం. ఉన్నత వర్ణంలో జన్మించి నందుకు గర్వపడటం ఖచ్చితంగా భాగవత అపచారానికి దారి తీస్తుంది, కాబట్టి ఆ వైఖరిని మానుకోవాలి. ఎమ్పెరుమానార్ తిరుమలకి వెళ్లినప్పుడు, పెరియ తిరుమలై నంబి (ఎమ్పెరుమానార్ మేనమామ మరియు ఆచార్యులు) స్వయంగా బయటకు వచ్చి స్వాగతం పలుకుతారు. ఇంకొకరిని ఎందుకు పంపించలేదని ఎమ్పెరుమానార్ అడిగినప్పుడు, “చుట్టూ చూస్తున్నప్పుడు నాకన్నా తక్కువైన వ్యక్తి నాకు కనిపించలేదు” అని సమాధానం ఇస్తారు – అది వారి వినయం.  అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శస్త్రంలో,  207 నుండి 217 సూత్రాల వరకు ఈ విషయం గురించి వివరంగా చర్చించబడింది. శాస్త్రపరంగా బ్రాహ్మణ వర్ణాన్ని, వారి నిరంతర వేదాధ్యయనం కారణంగా ఉత్కృష్ఠమని ప్రశంసిస్తారు. కానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం బ్రాహ్మణ్య సాధన చేయడం వల్ల అది అహంకారానికి దారితీయవచ్చు (ఇది వైష్ణవ తత్వానికి విరుద్ధం). కాబట్టి, “అహంకారానికి కారణమయ్యే జన్మ” ఏదైనా అయినా సరే అది నిమ్నమైనదని పిళ్ళై లోకాచార్యులు స్థాపించారు. అలాగే, బ్రాహ్మణులు (క్షత్రియ, వైశ్యులు కూడా) కావడంతో, వారు ఉపాయాంతరములలో (కర్మ, జ్ఞాన, భక్తి యోగం వంటి ఇతర ఉపయాలు) పాల్గొనే అవకాశం ఉంది. అందువల్ల, చివరికి, “వినయానికి సహకరించి, ఉపాయాంతరములకు పూర్తిగా దూరంగా ఉంచే జన్మ వాస్తవానికి ఉన్నతమైన జన్మ” అని చాటారు. అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం చూర్ణిక 85లో,  ఈ సూత్రాన్ని చాలా విశదంగా వివరించారు. ఇది చాలా సంక్లిష్టమైన అంశం – ఈ అంశంపై సంపూర్ణ స్పష్టత పొందడానికి మాముణులు యొక్క వ్యాఖ్యానాలను అర్హతగల ఆచార్యుల వద్ద కాలక్షేప రూపంగా శ్రవణం చేయాలి.
  • ఉపాయాంతరములలో పాల్గొనడానికి వీలు కల్పించే వర్ణం నిమ్నమైనదని భావించక పోవడం ఒక అవరోధం. శ్రీవచన భూషణం సుత్రం 215 లో, పిళ్ళై లోకాచార్యులు ఇలా అన్నారు, “నైచ్యం జన్మ సిద్దం” – వినయం సహజ గుణం. సహజంగానే  జీవాత్మ భగవాన్ కు నిరంతర దాసుడు. ఏ వర్ణం వారైనా, వినయం నటించకుండా సహజంగానే  వినయం ప్రదర్శించాలి. నమ్మాళ్వార్  కూడా తిరువాయ్మొళి 1.2.3 లో ఇలా అన్నారు “నీర్ నుమదు ఎన్రివై వేర్ ముదల్ మాయ్ త్తు…” – మనం మన అహంకార మమకారాలను పూర్తిగా జయించాలి.  అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 215 లో, శూద్ర వర్ణం గురించి తెలియజేస్తూ,  నిజమైన భక్తి / విశ్వాసానికి అవసరమైన నైచ్యం (వినయం) వారికి సహజమైన గుణం అని వివరించబడింది. వాళ్ళు వేదాధ్యయనానికి అనర్హులు కావడం వల్ల, ఖచ్చితంగా ఉపాయాంతరాలలో పాల్గొనే అవకాశం లేదు – అందువల్ల వారు వైష్ణవులుగా మారడానికి అర్హులు. ఇంతకు ముందు వివరించిన విధంగా ఇతర వర్ణాలు విషయంలో ఇది సాధ్యం కాదు. కాబట్టి, వర్ణంతో సంబంధం లేకుండా, అహంకారాన్ని పూర్తిగా వదలి భగవాన్, భాగవతుల వినయపూర్వకమైన దసుడిగా మారాలి.
  • ఉపాయాంతరాలకు దూరం ఉంచి,  సహజమైన వినయానికి సహకరించే జన్మ ఉన్నతమైనదని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఇంతకుముందు వివరించినట్లుగా, సహజ వినయం, భగవాన్కు సంపూర్ణ శరణాగతిని మనం అపేక్షించాలి – అలాంటి వ్యక్తులు మాత్రమే నిజమైన వైష్ణవులు కావడానికి అర్హులు.
  • నిమ్న వ్యక్తుల లోపాలు మహోన్నత వ్యక్తుల దివ్య దృష్టి మాత్రం చేత తొలగిపోతాయని తెలియకపోవడం ఒక అడ్డంకి. గొప్ప వైష్ణవుల దివ్య దృష్టి ఎవరి మీదపడితే వారిలో ఉన్న లోపాలు తొలగించబడతాయి. దారితప్పిన ఒక శ్రీవైష్ణవ పుతృడు శుద్దుడై తిరిగి వచ్చినప్పుడు, అతని తండ్రి “నీవు కూరత్తాళ్వాన్ చేత చూడబడ్డావా / ఆశీర్వదించబడ్డావా?” అని ప్రశ్నిస్తాడు – స్వచ్ఛమైన వైష్ణవుల శక్తి అటువంటిది,  అన్ని అమంగళాలను, కళంకాలను తొలగిస్తుంది.
  • అహంకారం మొదలైన లోపాల నుండి దూరంకాకుండా, శుద్దమైన వైష్ణవులతో కలవడం వారికి ఇబ్బంది కలిగించడం ఒక అడ్డంకి.
  • పారసం (రాగిని బంగారంగా మార్చేది) అని ప్రశంసించబడే శ్రీవైష్ణవులను సందేహించడం, ఇతరులను శుద్ధి చేయగల వారి సామర్థ్యాన్ని సందేహించడం అడ్డంకి. స్వచ్ఛమైన శ్రీవైష్ణవులను వారి వర్ణంతో సంబంధం లేకుండా పారసం అని ప్రశంసిస్తారు. వారి పవిత్రతను, ఇతరులను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఎప్పుడూ అనుమానించకూడదు. స్వయంగా ఎమ్పెరుమానార్లు స్నానం చేసిన తరువాత పట్టు కోసం  పిళ్ళై యుఱంగా విల్లి దాసులను  (అబ్రాహ్మణుడు) పట్టుకునేవారని మనం గుర్తుచేసుకోవచ్చు. కాబట్టి, ఖచ్చితంగా వారి పవిత్రతలో సందేహం లేదు.
  • గొప్ప జ్ఞానులు ఆచార్యులతో సమానమైనవారని, భగవాన్ కంటే గొప్పవారని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవత్ విషయం పై సంపూర్ణ అవగాహన ఉన్నవారు, వారి వర్ణం, కుటుంబం మొదలైన వాటితో సంబంధం లేకుండా – వారిని ఆచార్యులతో సమానంగా గౌరవించాలి. వారు భగవాన్ కన్నా కూడా గొప్పవారు. పెరియ తిరుమొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వార్, “నిన్ తిరువెట్టెళుత్తుం కత్తు యానుత్తతు ఉన్నడియార్కు అడిమై” – తిరుమంత్రం నేర్చుకున్న తరువాత, నీ దాసులకు నేను దాసుడనని అర్థం చేసుకున్నాను అని అన్నారు. సాధారణంగా, భగవాన్ కంటే ఎక్కువగా భాగవతులను పూజించాలి.  అనువాదకుల గమనిక: నమ్మాళ్వారు, తిరువాయ్మొళి 8.10 లో “నేడుమార్కడిమై” పదిగంలో భాగవతులు వారి ప్రభువులని స్థాపించారు.  అదేవిధంగా 3.7లో “పయిలుం చుడరోళి” పదిగంలో వారి కైంకర్యానికి లక్ష్యం భాగవతులని స్థాపించారు. 3.7.1లో ఇలా అన్నరు , “పయిలుం చుడరొళి మూర్తియైప్పంగయక్ కణ్ణానై పయిల ఇనియ నం పార్కడల్ చేర్ న్ద పరమనై పయిలుం తిరువుడైయార్ యవరేలుం అవర్ కణ్డీర్ పయిలుం పిఱప్పిడై తోఱు ఎమ్మై ఆళుం పరమరే” – ఎవరైనాసరే అతి ప్రకాశవంతమైన భగవాన్ (కమల నేత్రాలు కలిగిన వాడు, పాల సముద్రంలో పడుకున్నవాడు) ఆరాధిస్తే, అలాంటి వ్యక్తి జన్మ జన్మలకు నన్ను ఆజ్ఞాపించగలడు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, ఆచార్య సామ్యం అనేది భగవాన్ కంటే గొప్పది అన్న విషయసూత్రాన్ని  సూత్రం 222 నుండి వివరించబడింది. ఆచార్యులు స్వయంగా ఇతర శ్రీవైష్ణవులను తనకు సమానంగా ఆదరించమని శిష్యులకు మార్గనిర్దేశం చేస్తారు కాబట్టి, అందరు శ్రీవైష్ణవులను ఆచార్యులకు సమానంగా ఆదరించాల్సి ఉంటుంది. పైగా భగవాన్ కంటే శ్రీవైష్ణవులు గొప్పవారని ఆయన వివరించారు. ఈ విషయాన్ని స్థాపించడానికి మాముణులు తమ వ్యాఖ్యానాలలో అనేక అంశాలలో అందంగా వివరించారు. భగవాన్ జీవాత్మను కొన్నిసార్లు ఈ సంసారంలో  తన కర్మాధారంగా ఉంచుతారు, కరుణతో శ్రీవైష్ణవులను మోక్షం వైపు నిర్దేశిస్తారు. జీవాత్మ శరణాగతులైనపుడు తాయార్  యొక్క పురుషాకారాన్ని ఆశించే భగవాన్ మాదిరిగా కాకుండా, శ్రీవైష్ణవులు వారిని ఆశ్రయించిన వారిని స్వీకరిస్తారు. సాధారణంగా అర్చా రూపంలో ఎవరితోనూ సంభాషించకూడదని ప్రతిజ్ఞ చేసిన భగవాన్లా కాకుండా,  శ్రీవైష్ణవులు అందరినీ వారి స్వభావానికి అనుగుణంగా తగిన కైంకర్యాలలో ఉంచుతారు. ఆ విధంగా శ్రీవైష్ణవులు భగవాన్ కన్నా ఎక్కువగా మహిమపరచబడ్డారు.
  • వైష్ణవుడిగా ఉండి దేవతాంతర సంబంధం (వాసన/స్పర్శ ద్వారా కూడా) కలిగి ఉండటం ఒక అడ్డంకి. దేవతాంతర సంబంధం (ఇతర దేవతలతో సంబంధం) అనేది వైష్ణవులకు ప్రధాన కళంకం. అది క్రమేణా వైష్ణవత్వాన్ని (వైష్ణవ లక్షణం) నాశనం చేస్తుంది. కాబట్టి పూర్తిగా దూరంగా ఉండాలి. అనువాదకుల గమనిక: దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సంఘటనలను మనం చూశాము. ఒకసారి నమ్పెరుమాళ్ యొక్క ఊరేగింపు సమయంలో, భారీగా వర్షం కురుస్తుండగా నమ్పెరుమాళ్ని  తిరువానైక్కావల్ శివాలయంలో భాగమైన ఒక మణ్డపంలోకి తీసుకువెళతారు. కానీ, స్వయంగా ఎమ్పెరుమానార్ , “పెరుమాళ్ అందరికీ యజమాని, వారు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్పి ఆ  మణ్డపంలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. కానీ మేము పెరుమాళ్ యొక్క దాసులము మాత్రమే, కాబట్టి మేము దేవతాంతర సంబంధిత ప్రదేశాలలోకి ప్రవేశించము”. పిళ్ళై ఉఱంగా విల్లి దాసుల మేన అల్లుడులు  ధృడమైన శ్రీవైష్ణవులైనప్పటికీ ఒక సందర్భంలో కొందరు కుట్రతో నమ్మించి విష్ణు ఆలయంలా కనిపించే జైన మందిరానికి సాష్ఠాంగం చేయిస్తారు. వారి తప్పును గ్రహించిన వెంటనే మూర్చపోతారు. పిళ్ళై ఉఱంగా విల్లి దాసుల పాద పద్మాల ధూళిని వారి నుదిటిపై రాసిన తర్వాత వాళ్ళు స్పృహను తిరిగి పొందుతారు. పరాశర భట్టర్ ఒకసారి ఒక అవైష్ణవ సంపర్కంలో ఉండి ఉండవచ్చని అనుమానంతో ఆందోళన చెందుతారు. వారి తల్లి సలహా మేరకు ఆయన ఒక అబ్రహ్మణ శ్రీవైష్ణవుని యొక్క శ్రీపాద తీర్థాన్ని త్రాగి తనను తాను శుద్ధి చేసుకుంటారు. మన పూర్వాచార్యులు  దేవతాంతర సంబంధానికి పూర్తిగా దూరంగా ఉండేవారని సూచించే అనేక సంఘటనలు ఉన్నాయి.
  • మన సాంప్రదాయంపై విశ్వాసాన్ని నాశనం చేసే ఇతర పద్ధతులను అనుసరించడం ఒక అడ్డంకి.  వైష్ణవునిగా జన్మించినప్పుడు (పంచ సంస్కారం ద్వారా) ఇతర వర్గాల పద్ధతుల అనుబంధాన్ని వదులుకోవాలి. ఉదాహరణకు, భస్మాన్ని (బూడిద) మొదలైనవాటిని పెట్టుకూడదు. ఇతర శాఖలను అనుసరించడం ద్వారా వైష్ణవ సాంప్రదాయం మీద మన విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. అనువాదకుల గమనిక: ఇది స్వధర్మాన్ని అనుసరించే అంశాన్ని మనకు గుర్తు చేస్తున్నట్లు కూడా చూడవచ్చు (తమ స్వధర్మం). ఉదాహరణకు, ఒక వైష్ణవుడు బ్రాహ్మణుడైతే, క్షత్రియ లేదా వైశ్య పద్ధతులను పాటించకుండా తన స్వంత నియమ నిబంధనలను పాటించాలి.  వర్ణం ఏదైనా సరే, అదే వర్ణంలో ఉండి కూడా వైష్ణవునిగా  వినయం, భక్తి, దాస్యం మొదలైనవాటిని వ్యక్తపరచవచ్చు, గౌరవించబడతారు కూడా. శాస్త్రాన్ని అగౌరవపరచడానికి దారితీస్తుంది కాబట్టి వారి వర్ణాన్ని  మార్చే ప్రయత్నం చేయకూడదు. మన పూర్వాచార్యులు వైష్ణవత్వం మరియు వర్ణశ్రమ ధర్మం రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడంపై నొక్కి చెప్పారు. ఇది ఇప్పటికే మునుపటి విభాగాలలో చర్చించబడింది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/08/virodhi-pariharangal-34.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org