Monthly Archives: January 2021

విరోధి పరిహారాలు – 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/24/virodhi-pariharangal-42/

73. పుంస్త్వ విరోధి  – పురుషత్వంలో అవరోధాలు  

    పెరుమాళ్తో (శ్రీ రాముడు – మరియాదా పురుషోత్తముడు – ఆదర్శ పురుషుడు) సీతా పిరాట్టి, లక్ష్మణ పెరుమాళ్ – శ్రీ పెరుంబుదూర్

పుంస్త్వం అంటే మగతనం / పురుషత్వం – పురుషునిగా ఉండటం. దివ్య ప్రబంధం వ్యాఖ్యానాలలో శారీరక స్థితి ఆధారంగా, మగవారిని “మోవాయెళున్తార్” అని పిలుస్తారు (గడ్డం ఉన్న ప్రాంతాన్ని సూచించే ఎత్తైన దవడ అని అర్థం. ఆడవారిని “ములైయెళున్తార్” అని పిలుస్తారు (ఎత్తైన వక్ష స్థలం ఉన్నవారు అని అర్థం). తమ గత కర్మల ఫలితంగా ఈ బాహ్య / శారీరక గుణాలు పొందుతారు. అత్యోన్నత పురుషుడైన భగవానుడిని “ఉత్తమః పురుషః” అని భగవద్గీతలో వివరించిబడింది. ” స్థ్రీ ప్రాయం ఇతరం జగత్” ప్రమాణంలో వివరించినట్లుగా, ఈ విశ్వంలో కర్మానుసారంగా శరీరం పొందిన స్త్రీ అయినా పురుషుడైన అందరూ స్త్రీ వర్గానికి చెందినవారే అని అర్థం. స్త్రీత్వం యొక్క ముఖ్యమైన గుణాలు ఏమిటంటే పూర్తిగా ఆధారపడటం, వినయంగా ఉండటం, సిగ్గుపడటం మొదలైనవి. జీవాత్మ కూడా అంతర్గతంగా పరమాత్మపై పూర్తిగా ఆధారపడి ఉన్నట్లు గుర్తించబడింది. ఇప్పుడు వ్యాఖ్యానానికి వెళ్దాం. అనువాదకుల గమనిక:  ప్రణవంలో “అ” యొక్క అర్థంగా భగవాన్ని కీర్తించారు. పరాశర భట్టర్ తన అద్భుతమైన అష్ట శ్లోకి (ఎనిమిది అద్భుతమైన శ్లోకాలతో కుడి ఉన్న ఈ ప్రబంధం, రాహస్య త్రయం – తిరుమంత్రం, ద్వయం మరియు చరమ శ్లోకం యొక్క అర్ధాలను సమగ్రంగా వెల్లడిస్తుంది) యొక్క మొదటి శ్లోకమును “అకారార్ధో విష్ణుః” అని ప్రారంభించారు. రక్షకత్వము “అకారం” యొక్క ప్రధాన వివరణలలో ఒకటి. రక్షకత్వం అంటే అనవసరమైన అంశాలను తొలగించి, కావలసిన అంశాలను అందించడం. ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే స్వతంత్రుడు, మిగతావారందరూ అతనిపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. మన పూర్వాచార్యులు జీవితాల నుండి ఒక ఆసక్తికరమైన సంఘటనను మనం గుర్తు చేసుకోవచ్చు.  పెరియవాచాన్ పిళ్ళై ఈ సంఘటనను తిరునెడుంతాండగం 3వ పాసుర వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు. పరాశర భట్టర్ పాల మహాసముద్రాన్ని చిలుకుతున్న సంఘటనను వివరిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి పాల సముద్రం నుండి బయటకు వచ్చినప్పుడు, ఆమె నేరుగా శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్లి, అతని వక్షస్థలాన్ని (ఇది ఆమె శాశ్వత నివాసం) అధిరోహించి అతనిని తన భర్తగా స్వీకరిస్తుందని అతను వివరించారు. ఈ సమయంలో, నంజియర్, భట్టర్ను ఇలా ప్రశ్నిస్తారు, “అక్కడ ఎంతో మంది దేవతల సమక్షంలో, బహిరంగంగా ఒక పురుషుని వద్దకు వెళ్ళడానికి ఒక మహిళగా ఆమె సిగ్గుపడలేదా?”. భట్టర్ తెలివిగా “భర్త దగ్గరకు వెళ్ళేటపుడు, అలంకరణ వస్తువులు, బహుమతులు మొదలైనవి తీసుకువెళ్ళే తన చెలికత్తలను చూసి భార్య సిగ్గుపడాలా?” అని జవాబు ఇస్తారు. దీని అర్థం, అక్కడ ఉన్న అందరు జీవాత్మలు (దేవతలు, అసురులు) మగ శరీరాలతో ఉన్నప్పటికీ స్త్రీ స్వభావం గలవారు. ఈ విధంగా, అత్యున్నత స్వాతంత్రం యొక్క ఈ అంశం పురుషత్వంతో ముడిపడి ఉంటుంది,  దీనికి విరుద్ధంగా ఉన్న అంశాన్ని  స్త్రీత్వంతో ముడిపడి ఉంటుంది.

  • గరుడ వాహనుడు అయిన భగవానుడే పురుషోత్తముడు (మగవారిలో ఉత్తముడు) అని  అర్థం చేసుకోవడానికి బదులుగా తనను తాను మగవాడిగా పరిగణించడం ఒక అడ్డంకి. పురుషుడిగా కీర్తించబడే అర్హత ఉన్న ఒకే ఒక్కడు పురుషోత్తముడు. మిగతా జీవాత్మలందరూ ఆడవారి విభాగంలోకి వస్తారు. మగ శరీరం ఆధారంగా తనను తాను మగవానిగా పరిగణించుకోవడం అజ్ఞానం. ఇది కూడా తప్పు. అనువాదకుల గమనిక: గరుడ వాహనత్వం అత్యున్నత బ్రహ్మం యొక్క ముఖ్యమైన గుణం. గరుడను వేదాత్మ అంటారు – వేదం యొక్క ఆత్మ అని అర్థం. భగవాన్ గరుడపై అధిరోహించడం మరియు  భగవాన్ వైపు గరుడ వేళ్లు చూపడం శ్రీమన్నారాయణుడి యొక్క ఆధిపత్యానికి స్పష్టమైన సూచన. అలాగే, శ్రీమన్నారాయణుడిని పురుషోత్తముడు అని పిలుస్తారు – పురుషులలో ఉత్తమమైన వారు. కాబట్టి, పురుషత్వం శ్రీమన్నారాయణకు మాత్రమే సంబంధించినది.
  •  బ్రహ్మ, రుద్రుడు మొదలైన దేవతలను వారి మగ శరీరాలు కారణంగా వారిని మగవారిగా పరిగణించడం ఒక అడ్డంకి. ముందు వివరించినట్లుగా, ఈ సూత్రం దేవతులకు కూడా వర్తిస్తుంది. పురుషోత్తముడితో పోల్చినప్పుడు – మిగతా అందరు దేవుళ్ళు మగ శరీరాలు కలిగి ఉన్నప్పటికీ అతని ఆడ ప్రతిరూపాలు మాత్రమే. దీనికి విపరీతంగా పరిగణనలోకి తీసుకోవడం అజ్ఞానం అవుతుంది.
  • మనలో ఉన్న సహజమైన స్త్రీ స్వభావగుణం అతని సహజ పురుష స్వభావానికి ప్రతిరూపమైనదని తెలియకపోవడం ఒక అడ్డంకి. అతని సంపూర్ణ స్వాతంత్ర గుణానికి సహకరించి అతనిపై పూర్తిగా ఆధారపడటమే మన నిజమైన స్వభావం,  .
  • మన వద్ద ఉన్న మగ శరీరం మన కర్మానుసారంగా పొందినదని,  తాత్కాలికమైనదన్న విషయం తెలియకపోవడం ఒక అడ్డంకి. మగ దేహం యొక్క ఈ బాహ్య రూపం మన గత కర్మల ఆధారంగా పొందుతాము. మన కర్మ ఆధారంగా వేర్వేరు శరీరాలను ఒకదాని తరువాత ఒకటి పొందుతామని మనం తెలుసుకోవాలి. అనువాదకుల గమనిక: భగవద్గితలో, కృష్ణుడు శరీరాలు మారే ఈ సూత్రాన్ని 2 వ అధ్యాయంలో చాలా విస్తృతంగా వివరించారు. ఉపయోగకరం లేని చిరిగిన పాత వస్త్రం పారవేసి కొత్త వస్త్రం తొడిగినట్లే, జీవాత్మ తన పాత శరీరం విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తాడు.  భగవాన్ మరొక ఉదాహరణ కూడా ఇచ్చి  వివరిస్తున్నారు –  ఆత్మ ఒక పసిబిడ్డ శరీరం, పిల్లల శరీరం, యుక్త శరీరం మరియు వృద్ధాప్య శరీరం గుండా వెళుతున్నట్లే, ఆ శరీరానికి కర్మ పూర్తయినప్పుడు, ఆ శరీరం విదిచిపెట్టి కొత్త శరీరం ధరించబడుతుంది. ఈ విధంగా మనం జీవితాంతం వివిధ శరీరాలను పొందుతామని, ఈ శరీరాలలు తాత్కాలికమైనవని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.
  • అనాది కలాం నుండి పొందిన మగ, ఆడ శరీరాలు అశాశ్వతమైనవి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. మనము ఈ సంసారం (భౌతిక ప్రపంచం) లో అనాదిగా ఉంటున్నాము,  మన కర్మ ఫలితాల ఆధారంగా వివిధ శరీరాలను పొందుతున్నాము. కాబట్టి, అవి ఏవీ శాశ్వతం కాదు. ఇది స్వయం స్పష్టమైనది.
  • భగవానుడిపై పూర్తిగా ఆధారపడటం జీవాత్మ యొక్క  స్వభావం అని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవత్ పారతంత్రియం (భగవానుడిపై ఆధారపడటం) అనేది జీవత్మా యొక్క శాశ్వతమైన మరియు అంతర్లీన స్వభావం. పారతంత్రియం అంటే యజమాని (ఈ సందర్భంలో భగవాన్) పూర్తి నియంత్రణలో ఉండటం . అనువాదకుల గమనిక: మనం ఇంతకు ముందు ప్రమాణంలో చూశాము,  “స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం” – భగవానుడి ఆస్తిగా ఉండటం జీవత్మా యొక్క స్వభావం, యజమానిగా ఉండటం భగవానుడి స్వభావం. జీవత్మ యొక్క స్వభావం భగవాన్ మీద ఆధారపడి ఉండటం అని దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు.
  • భగవానుడిపై మన ఆధారపడుట గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా శారీరక పరిస్థితి కారణంగా రవ్వంతైనా స్వాతంత్రం కలిగి ఉండి  తనను తాను మగవాడిగా భావించడం ఒక అడ్డంకి. ఒకసారి మనం పారాంతంత్రియం (ఆధారపడుట) యొక్క నిజమైన జ్ఞానాన్ని పొందిన తరువాత, తనను తాను మగవాడిగా భావించడంలో ఎటువంటి ప్రశ్న లేదు.  స్వాతంతృలమని రవ్వంత భావన మగవారికి సహజంగానే ఉంటుంది. అనువాదకుల గమనిక: ఇక్కడ ప్రాథమిక సమస్య అయిన దేహాత్మాభిమానం (ఆత్మ మరియు శరీరం ఒకటే నని భావించడం) అన్న విషయానికి తిరిగి తీసుకెళుతుంది. ఎన్నో కాలక్షేపములు విన్న తరువాత, సూత్రాలను అర్థం చేసుకున్న తరువాత కూడా మనము, ఆత్మ దేహమని భ్రమపడతాము. శరీరానికి ఆత్మకి మధ్య ఉన్న ఈ ముఖ్యమైన వ్యత్యాసాన్ని పదే పదే ధ్యానించడం, మన రోజువారీ జీవితంలో దీనిని నిరంతరం అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు.
  • స్వభావంతో స్త్రీగా భగవాన్ మీద పూర్తిగా ఆధారపడి ఉండి, ఇతర ఆడవారిని (శారీరక సుఖం కోసం) ఆశించుట ఒక అడ్డంకి. భగవాన్ (పరమ పురుషుడు) పై ఆధారపడిన స్త్రీగా (జీవాత్మ) తనను తాను అర్థం చేసుకున్న తరువాత, తనకోసం మరొక స్త్రీని ఆశించడం అజ్ఞానం వల్లనే జరుగుతుంది (ఆత్మకు బదులుగా శరీరంతో తనను తాను అనుబంధించుకుంటాడు). ఇది సముచితం కాదు. ఈ సందర్భంలో మనం శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం, సూత్రం 101 “విహిత విషయ నివృత్తి తన్నేఱ్ఱం” ను గుర్తుచేసుకోవాలి. అనువాదకుల గమనిక: సూత్రాలు 99, 100 మరియు 101 లలో, పిళ్ళై లోకాచార్యులు ఇంద్రియ సుఖాల నిర్లిప్తత యొక్క అంశాన్ని మరియు ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించ వలసిన అవసరాన్ని గురించి చర్చిస్తున్నారు. ఇంతకుముందు, ప్రాపంచిక సుఖాల నిర్లిప్తత, ఆధ్యాత్మిక పురోగతికి మూలధారమైన అర్హత అని ఆయన పేర్కొన్నారు. మాముణులు ఈ సుత్రమును అనర్గళంగా ప్రమాణాల ద్వారా చాలా అందంగా వివరించారు. 99 వ సూత్రంలో, భౌతిక సంపదను కోరుకునే వ్యక్తులకు, భక్తి యోగంలో నిమగ్నమైన వ్యక్తులకు, చివరకు ప్రపన్నులకు (భగవాన్కు పూర్తిగా శరణాగతులైన వ్యక్తులు) ఈ నిర్లిప్తత అవసరమని పిళ్ళై లోకాచార్యులు వివరించారు.  భౌతిక సంపదను కోరుకునే వ్యక్తులకు, దానిని సాధించే ప్రక్రియలో, వారు తమ భావాలను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉందని మాముణులు వివరించారు. ఉపసాకులు (భక్తి యోగ నిష్ఠాపరులు) మరియు ప్రపన్నులకు నిశ్చయంగా వారు తమ ఇంద్రియాలపై మరియు ప్రాపంచిక సుఖాలపై పూర్తిగా నిర్లిప్తతను కలిగి ఉండాలి. 100 వ సూత్రంలో, ఈ మూడు వర్గాలలో, ప్రపన్నులకు, ఇంద్రియాలపై ఇటువంటి నియంత్రణ చాలా ముఖ్యమైనదని పిళ్ళై లోకాచార్యులు వివరించారు.  ప్రపన్నులకు నిర్లిప్తత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మాత్రమే పిళ్ళై లోకాచార్యులు ఇతర 2 వర్గాలను చేర్చారని మాముణులు అందంగా తెలియజేస్తున్నారు. 101 వ సూత్రంలో, భౌతిక సంపదను కోరుకునేవారికి మరియు ఉపసాకులకు, శాస్త్రాంలో నిషేధించబడిన వాటిలో నిర్లిప్తత ఉండాలి అని పిళ్ళై లోకాచార్యులు తెలియజేస్తున్నారు. కానీ ప్రపన్నులకు, శాస్త్రంలో అనుమతించబడిన వాటిపై కూడా నిర్లిప్తత ఉండాలి, ఎందుకంటే ఇది స్వరూప విరోధం (జీవాత్మ యొక్క స్వభావానికి విరుద్ధం) అవుతుంది కాబట్టి. శాస్త్ర ప్రకారం శారీరిక సుఖం వివాహం యొక్క సరిహద్దులో అనుమతించబడింది, అయినప్పటికీ,  శారీరక సంబంధం ఎప్పుడు, ఎలా జరగాలనే దానిపై అనేక నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ, ప్రపన్నులు తమ భార్య పట్ల కూడా నిర్లిప్తతను చూపించాలని పిళ్ళై లోకాచార్యులు తెలియజేస్తున్నారు.  మాముణులు తమ వ్యాఖ్యానములో ఈ విషయాన్ని చాలా వివరంగా వివరించారు. ఆచార్య మార్గదర్శకత్వంలో వినడం ఉత్తమము. ఈ విషయం తమను భగవతాధీనులమని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి సంబంధించినది.
  • భగవాన్ యొక్క దృష్ఠికోణంతో చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆడవారే అన్న అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి. పరమపురుషుని దృష్ఠికోణం నుండి చూసినప్పుడు, సమస్థ జీవాత్మలు ఆడవారే అని తెలుసుకోవాలి.
  • భగవాన్ మరియు భాగవతులను సేవించడానికి తన భార్యతో పాటు తాను దాసుడిగా ఉండకపోవడం ఒక అడ్డంకి. గృహస్థాశ్రమం – భార్యతో కలిసి జీవించడం. శ్రీ రామాయణం “సహపత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాకమత్” – శ్రీ రాముడు సీతను వివాహమాడి, తాను స్వయంగా పెరియ పెరుమాళ్ను (శ్రీ రంగనాథుడు) సేవించారు. ఇది గ్రుహస్థాశ్రమ ధర్మం. భార్యా భర్తల సంబంధం ఉన్నప్పటికీ, భగవాన్ ఎదుట స్త్రీ పురుషులిద్దరూ  స్త్రీ స్వభావం కలిగిన వారే. ఇద్దరూ భగవానుకి మాత్రమే లొంగి ఉండలి. అనువాదకుల గమనిక: నాలుగు ఆశ్రమాలలో (బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం మరియు సన్యాసం). ఇతరులకు సేవ చేయడంపై పూర్తిగా దృష్టి సారించ గలిగిన ఆశ్రమం గ్రుహస్థాశ్రమం. బ్రహ్మచారిగా తాను విధ్యాభ్యాసంపై దృష్టి కేంద్రీకరించి ఉంటాడు. సంపాదించడానికి అవకాశం ఉండడు. వానప్రస్థుడు అడవిలో నివసించి ధ్యానంపై కేంద్రీకరించి ఉంటాడు. ఒక సన్యాసి బోధనపై దృష్టి కేంద్రీకరించి ఉంటాడు, ఎటువంటి సంపాదన ఉండదు. బ్రహ్మచారులు మరియు సన్యాసు సేవ/సంరక్షణకై  గ్రుహస్థుడు మాత్రమే సంపదను సేకరించగలడు.  అలాగే, తీర్థయాత్రలో యాత్రికులు సేవలందు కోవడానికి, స్థానికంగా నివసించే గృహస్థులపై ఆధారపడతారు. ఈ విధంగా గ్రహస్థాశ్రమం పూర్తిగా భగవాన్ (వారి ఇంట్లో మరియు ఆలయంలో తిరువారాధనం) మరియు భాగవతుల (బ్రహ్మచారులు, సన్యాసులు మరియు యాత్రీకులు) పై పూర్తిగా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి, సొంత భార్యతో ఇంద్రియ సుఖాలపై దృష్టి పెట్టడానికి బదులు, ఎమ్పెరుమాన్ మరియు శ్రీవైష్ణవుల సేవ చేయడంపై దృష్టి పెట్టాలి.
  • తనను తాను మగ దాసునిగా భావించడం ఒక అడ్డంకి. తనను తాను మగవాడిగా భావించకూడదని ఇప్పటికే వివరించబడింది. అనువాదకుల గమనిక: భగవాన్ మరియు భాగవతులకు తాను ఒక స్త్రీ దాసుడని ఎప్పుడూ తనను తాను పరిగణించాలి.
  • ఈ జ్ఞానాన్ని సంపాదించిన తరువాత, భార్యతో పాటు (మరొక స్త్రీలాగా) పడుకుని, నిజమైన స్వభావాన్ని మరచి ఆమెతో శారీరకంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం ఒక అడ్డంకి. భార్య తనను తాను తన భర్తకు సమర్పించినట్లే, మనం కూడా భగవానుడికి సమర్పించుకోవాలి. మనకు మగ శరీరం ఉన్నప్పటికీ, మనకు రవ్వంత కూడా స్వతంతృల మన్న ఆలోచన రాకూడదు. అనువాదకుల గమనిక: ఇక్కడ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. తన సొంత భార్యతో పడుకున్నప్పుడు కూడా, లైంగికంగా వ్యవహరించే  ప్రశ్నే లేకుండా స్త్రీతో మరొక స్త్రీ పడుకున్నట్లు అనిపించాలి. అంటే, తన భార్య పట్ల అటువంటి కోరికలేవీ లేనపుడు, ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా అలాంటి ఆలోచనలు రావు.  ప్రత్యేకించి భ్రమం (నిజమైన స్వభావంపై సరైన అవగాహన లేకపోవడం) మరియు రాగం (ఇంద్రియ సుఖాలపై ఆసక్తి) గురించి ప్రస్తావించబడింది – ఏ ఒక్కటి ఉన్నా, స్త్రీ పురుషులు శారీరక సంబంధంలో పాల్గొనడం ప్రారంభిస్తారు.
  • ఆళ్వారులు మగ దేహంతో  జన్మించారు, అయినప్పటికీ, వారు స్త్రీ భావంతో (నాయికా భావం) భగవానుని దివ్య స్వరూపానికై తాపత్రేయపడ్డారు. మునుపటి అనుభవాల నుండి వచ్చిన భ్రమ కారణంగా, అటువంటి పాసురములు విని వాటి అర్థాలను తెలుసుకున్న తరువాత కూడా, శారీరక అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం మరియు అలాంటి శారీరక ఆనందానికై ఆరాటపడటం అవరోధాలు. ఆళ్వారులు, ఎమ్బెరుమాన్ యొక్క దివ్య స్వరూపాల పైన ప్రత్యేకంగా నమ్మాళ్వారులు మరియు తిరుమంగై  ఆళ్వారులు  నాయికా భావం (స్త్రీ తన పురుషుడి కోసం ఆరాటపడే మానసిక స్థితి) లో అనేక పాసురా‌లను పాడారు. వారు భగవాన్ నుండి తమ విరహ బాధను  తమ పాసురాలలో అద్భుతంగా కురిపించారు. అటువంటి పాసురములు యొక్క బాహ్య మరియు అంతర్గత అర్ధాలను విన్న తర్వాత కూడా, “నేను ఒక పురుషుడిని” అన్న భావనకి తిరిగి వెళ్ళకూడదు, ఇంద్రియ సుఖాల ఆసక్తికై ఆరాటపడకూడదు. దయచేసి తిరుమంగై ఆళ్వారుల తిరుమొళి 1.1.2 చుడండి, “ఆవియే అముదే ఎన నినైన్తురుగి అవరవర్ పణైములై తుణైయా పావియేనుణరాతు ఎత్తనై పగలుం పళుతు పోయొళిన్తన నాళ్గళ్” – నేను పాపిని,  అజ్ఞానంగా తెలియకుండా ఎదిగిన స్తనములున్న మహిళల గురించి ఆలోచిస్తూ, “నా జీవితం! నా మధువు!” అని ఎన్నో నా రోజులు వృధా చేసుకున్నాను. అతను తరువాత శ్రీమన్నారాయణ కృపతో అలాంటి బాధల నుండి విముక్తి పొందారని తెలియజేస్తున్నారు.
  • ఆస్తిక నాస్తికుడు కావడం వల్ల ఆచార్యుల చేత వదిలివేయబడటం ఒక అడ్డంకి. సాధారణంగా, ఆస్తిక నాస్తికుడు భగవంతుడు ఉన్నాడని స్వీకరిస్తారు కానీ దృఢమైన విశ్వాసం ఉండదు,  ఏ సూత్రాలను పాటించరు. మరింత అవగాహన కోసం, దయచేసి ఉపదేశ రత్నమాల 68 వ పాసురం చూడండి, “నాత్తిగరుం నన్నెఱిచేరాత్తిగరుం ఆత్తిగనాత్తిగరుమామివరై ఓర్తు నెంజే! మున్నవరుం పిన్నవరుం మూర్కరెన విట్టు నడుచ్చొన్నవరై నాళుం తొడర్”.  అనువాదకుల గమనిక: ఆస్తికుడు అంటే వేద (ప్రామాణికమైన మూలం) శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించేవాడు. ప్రమేయమైన భగవానుడిని శాస్త్రం అనే ప్రమాణం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వేద శాస్త్రంలో ఉపనిషత్తులు, స్మృతి, ఇతిహాసం, పురాణములు, పాంచరాత్రం మొదలైనవి ఉన్నాయి. ఆస్తికులకు  వ్యతిరేకమైన వారు నాస్తికులు. అంటే వేద శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించనివాళ్ళు. మూడవ వర్గం కూడా ఉంది, ఇది ఆస్తిక – నాస్తిక వర్గం వారు. ఆస్తిక – నాస్తిక అంటే వేద శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారు కాని తమ జీవితంలో అనుసరించే సమయంలో గౌరవించరు. ఈ పాసుర వ్యాఖ్యానంలో, పిళ్ళై లోకం జీయర్ మాముణులు యొక్క సొంత వాక్కులను ఉటంకిస్తూ వీటిని వివరంగా వివరించారు. ఈ పాసురంలోని అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే – ఈ పాసురం చివరికి ఆచార్యులకు సంపూర్ణ శరణాగతిపై దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆస్తిక, నాస్తిక మరియు ఆస్తికా-నాస్తిక యొక్క ఈ అంశాన్ని ఈ కోణం నుండి అర్థం చేసుకోవాలి – అనగా, పూర్తిగా విశ్వాసపాత్రంగా ఉండి, ఆచార్యులకు శరణాగతులై ఉండటం, ఆచార్యపై నమ్మకం లేకపోవడం,  విశ్వాసం ఉంటుంది కాని ఆచార్యులను అనుసరించక పోవడం వంటివి.  శిష్యుడు ఆస్తికుడు కావడం వల్ల ఒకవేళ ఆచార్యుడు ఆ శిష్యుడిని వదులుకుంటే, ఆ శిష్యునికి ఇక వేరే దారే లేదు. జ్ఞానం, అనుష్ఠానం (అభ్యాసం) అనే రెండు ముఖ్యమైన అంశాలు ఆచార్యులకు ఉంటాయని ఉపదేశ రత్నమాల ప్రబంధం లో మాముణులు కీర్తించారు. ఇది అందరి శ్రీవైష్ణవులకు వర్తిస్తుంది.
  • సారం (సారాంశం) మరియు అసారం (అన్యమైనవి) అంశాల మధ్య తేడాను గుర్తించనందున పండితులు / పెద్దలచే ఖండించబడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఆచార్యులను ఆశ్రయించడం యొక్క ఉద్దేశ్యం వివేక జ్ఞానం (సారాంశం మరియు అన్యమైనవాటి మధ్య వివక్ష చూపే సామర్థ్యం) పొందడం. సాధారణంగా పాలు నీళ్ళని వేరుచేసే సామర్థ్యం గల హంసను  కీర్తిస్తారు. సారాంశాన్ని కీర్థించి, మన శాస్త్రాంలో కూడా అన్యమైన అంశాలను తీసివేయగలిగి నందుకు మన పూర్వాచార్యులను హంసలుగా కీర్తించబడ్డారు. మన పూర్వాచార్యులు యొక్క అడుగు జాడలను అనుసరించడం మరియు పెద్దల నుండి నేర్చుకోవడం, సారాంశం మరియు బాహ్య అంశాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యాన్ని మనలో అభివృద్ధి చేసుకోవాలి. సారాన్ని అట్టి పెట్టుకొని మరియు అన్య అంశాలను విస్మరించాలి. అన్య అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపడం పండితులచే ఖండనకు దారి తీస్తుంది. ఉదాహరణకు, పండితుల అధీనములో అధ్యయనం చేసిన తరువాత కూడా, శారీరక సుఖాలు మొదలైనవాటిని పట్టుకుని, ఆధ్యాత్మిక పురోగతిపై దృష్టి కేంద్రీకరించకపోతే, అలాంటి వ్యక్తులను గొప్ప ఆచర్యులు ఖండిస్తారు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/11/virodhi-pariharangal-43.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 42

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథరూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/17/virodhi-pariharangal-41/

72. తత్వ విరోధి  – యథార్థము / వాస్తవికతను అర్థం చేసుకోవడంలో అవరోధాలు – మూడవ భాగం

మనము తత్వ విరోధి యొక్క మునుపటి వ్యాసాన్ని కొనసాగిస్తున్నాము. ఈ విషయాలలో చాలావరకు లోతైన జ్ఞానం అవసరం, ఇది శాస్త్రం యొక్క క్రమబద్ధమైన అధ్యయనం ద్వారా పొందవచ్చు. పూర్తి లోతైన అవగాహనకై  పండితుల మార్గదర్శకత్వంతో ఈ సూత్రాలను నేర్చుకోవడం మంచిది.

              శ్రీ మహాలక్ష్మి, భూ దేవి, నీళా దేవి, నిత్య సూరులతో                శ్రీమన్నారాయణ  – పరమపదం (శ్రీ వైకుంఠం)

                      నమ్మాళ్వార్, ఎమ్పెరుమానార్, పిళ్ళై లోకాచార్యులు, మణవాళ మాముణులు
  • భగవాన్ యొక్క శరీరం భాగాలైన చిత్, అచిత్లలో, చిత్ (జీవాత్మ- ఆత్మ) ను దేహం (శరీరం), ఇంద్రియాలు మొదలైనవిగా పరిగణించడం ఒక అడ్డంకి. శ్రుతిలో చెప్పబడినట్లు “జీవద్వారా అనుప్రవిశ్య” – జీవాత్మ ద్వారా ప్రవేశించి, అచిత్త్ (అసంఖ్యాక అచేతనులు) లో భగవాన్ జీవాత్మ ద్వారా ఉంటాడు. “దేహేంద్రియ మనః ప్రాణదీబ్యో అన్యః”, అని చెప్పినట్లుగా – దేహం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం (ప్రాణ వాయువు, ఊపిరి), ధీ (బుద్ధి)  మొదలైనవాటికి జీవాత్మ భిన్నమైనవాడన్నది ఒక సాధారణమైన జ్ఞానం.  అనువాదకుల గమనిక: ఈ వివరణతో ప్రారంభించి, జీవాత్మ యొక్క తత్వాన్ని వివరంగా వివరించబడింది. తత్వ త్రయంలో, చిత్ ప్రకరణం యొక్క మొదటి భాగంలో పిళ్ళై లోకాచార్యులు ఈ విషయాన్ని చాలా వివరంగా వివరించారు. మణవాళ మాముణుల విస్తృతమైన వ్యాఖ్యానంతో, మనము ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సూత్రం 6 లో, పిళ్ళై లోకాచార్యులు ఆత్మ, దేహం మొదలైన వాటి మధ్య అనేక తేడాలను వివరించారు. ప్రధానంగా, ఆత్మను “నేను” గా,  దేహం మొదలైన వాటిని “నాది” గా చూశారు. ఆత్మ తనను ఎల్లప్పుడూ ఏకవచనంగా భావించుకుంటుంది (“నేను” – ఒకే ఒక్కటి) కానీ ఆ నేనుకి దేహం, మొదలైనవి ఎన్నో ముడిపడి ఉంటాయి (శరీరం, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి). వీటి నుండి మనం ఆత్మ మరియు దేహం మధ్య తేడా ఉందని అర్థం చేసుకోవచ్చు. సూత్రం 7 లో, వారు చాలా ముఖ్యమైన అంశాన్ని వివరిస్తున్నారు. ఈ విషయాలను కూడా శాస్త్రంలో చెప్పిన పలు వాఖ్యల ఆధారంగా  తెలివైన (తప్పు అయిన) వాదనతో  ద్వారా తిరస్కరించవచ్చు, కానీ  ఆత్మ దేహానికి భిన్నమైనదనిగా అర్థం చేసుకోవాలి. మణవాళ మాముణులు దీనిని చక్కగా వివరించారు. ఈ అంశాలను తిరస్కరించడం అతికష్టమని వారంటున్నారు – అయినప్పటికీ,  తెలివిగలవారు,  ‘నేను’ మరియు ‘నాది’ మధ్య వ్యత్యాసాన్ని తిరస్కరించే ఒక వాదనను ప్రదర్శిస్తే, ఆత్మ దేహానికి  భిన్నమైనదన్న శాస్త్ర సూత్రాన్ని సులభంగా స్థాపించవచ్చు. సూత్రాన్ని స్థాపించడానికి తమ వ్యాఖ్యానంలో అనేక ప్రమాణాలను ఉల్లేఖించారు.  చివరిలో మణవాళ మాముణులు, పిళ్ళై లోకాచార్యులు  శాస్త్రం ఆధారంగా ఆత్మ యొక్క భిన్నమైన స్వభావాన్ని  స్థాపించారని మరియు ఇది ఏ మేధావుల వాదనతో కూడా తిరస్కరించబడలేనిది అని అంటున్నారు.
  • ఆత్మను జ్ఞానంగా మాత్రమే పరిగణించడం, ఆత్మ జ్ఞానం సంఘటిత కూడిక అని భ్రమపడటం ఒక అడ్డంకి. ఆత్మ జ్ఞాన స్వరూపుడు (సంపూర్ణ జ్ఞానంతో ఉన్నవాడు) అని శాస్త్రం తెలుపుతుంది. కానీ ఆత్మను జ్ఞానం యొక్క నివాసంగా కూడా పిలవచ్చు. ఆత్మ అనేది జ్ఞానం మరియు జ్ఞానగుణకుడు (జ్ఞానం ఉన్నవాడు)  అని రెండు. అనువాదకుల గమనిక: ధర్మి జ్ఞానం (ఆత్మ దానికదే జ్ఞానంతో కూడి ఉన్నది), ధర్మ భూత జ్ఞానం (ఆత్మ జ్ఞాన నివాసం). ధర్మి జ్ఞానం అనేది సొంత ఉనికి గురించి నిరంతరం గుర్తుచేస్తుంది. ధర్మ భూత జ్ఞానంతో బాహ్య అంశాలను గ్రహించడం అని అర్థం. కొన్ని సిద్దాంతాలలో (బౌద్ధమతం వంటివి) ఇక్కడ ఆత్మను జ్ఞానం మాత్రంగా మాత్రమే వర్ణించారు, ఇతర గుణాలను తిరస్కరించారు. కానీ అలాంటి సూత్రాలు శాస్త్రం విరుద్ధమైనవి, శాస్త్రం ఆత్మకు జ్ఞానం కూడా ఉందని వివరిస్తుంది. పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని తత్వ త్రయం  26, 27, 28 సూత్రాలలో వివరించారు. దీనిని మణవాళ మాముణుల యొక్క అద్భుతమైన వ్యాఖ్యానంతో మనం అర్థం చేసుకుందాం.  సూత్రం 26 లో, వారు ఆత్మ జ్ఞానానికి నివాసమని చెప్పారు. మణవాళ మాముణులు దీనిని ఒక మంచి ఉదాహరణతో వివరిస్తున్నారు. ఎలాగైతే దీపం (వెలుగు) మరియు ప్రభా (ప్రకాశం) రెండూ కూడా తేజస్సు (కాంతి) నుండి లబ్ధమయినట్లే, దీపం అనేది ప్రభ యొక్క నివాసం. అదేవిధంగా, ధర్మి జ్ఞానం, ధర్మ భూత జ్ఞానం రెండూ జ్ఞానములే. ధర్మ జ్ఞానం (ఆత్మ) ధర్మ భూత జ్ఞానం యొక్క నివాసం. ఆత్మ, జ్ఞానం యొక్క నివాసమని వారు అనేక ప్రాణనాములతో దీనిని వివరించారు. సూత్రం 27 మరియు 28 లలో, పిళ్ళై లోకాచార్యులు “జ్ఞానం యొక్క నివాసం కాకుండా ఆత్మ కేవలం జ్ఞానం మాత్రమే అయితే, మనల్ని మనం జ్ఞానం అని చెప్పుకోవాలి, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోకూడదు”. మణవాళ మాముణులు “ఒక దాని గురించి తెలుసుకోవడం” అనేది తమకు జ్ఞానం ఉందని సూచిస్తుంది, దీనిని ప్రత్యక్షం (అవగాహన) ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మణవాళ మాముణులు ఈ సూత్రాన్ని శాస్త్రం, పూర్వాచార్యుల పలుకులు,  ప్రత్యక్షం ద్వారా స్థాపించారు.
  • స్వాభావికంగా పరతంత్రుడైన జీవాత్మను స్వతంత్రుడిగా పరిగణించడం ఒక అడ్డంకి. జ్ఞానం కావడం, జ్ఞానం కలిగి ఉండటం అనేది జీవత్మ స్వభావం అయినప్పటికీ, భగవత్ శేషత్వం (భగవాన్ పట్ల దాసత్వం) మరియు పారతంతర్యం (సంపూర్ణంగా ఆధారపడి ఉండటం) జీవాత్మ యొక్క అత్యంత రహస్యనీయమైన అంశాలు. జీవాత్మ  తనను తాను స్వతంత్రునిగా భావించడం అతి పెద్ద అపరాధం. అనువాదకుల గమనిక:  తనను తాను (ఆత్మ) స్వతంత్రునిగా భావించి ఆ ప్రకారంగా వ్యవహరించడం అతి పెద్ద దొంగతనం / అపరాధం అని శాస్త్రంలో వివరించబడింది. దీనిని మహాభారతంలో ఇల వివరించబడింది, “కిం తేన న కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణా” –  ఆత్మను (ఇది భగవాన్ యొక్క సంపత్తి) తన సొంతమని భావించేవాడు అన్ని రకాల దొంగతనం / పాపాలు చేసినట్లు భావించబడుతుంది. తమ గురించి నిజమైన జ్ఞానం ఉన్నవాడు అంటే, తాను జీవాత్మ అని అర్థం చేసుకోవడం, భగవానుడికి శేషుడైన వ్యక్తి అని అర్థం చేసుకోవడం. తిరువాయ్మొళి 8.8.2 లో, “అడియెన్ ఉళ్ళాన్” పాసురంలో, మన పూర్వాచార్యుల జీవితాల నుండి వచ్చిన ఒక సంఘటనను నాంపిళ్ళై వివరించారు. ఎమ్పెరుమానార్ యొక్క కాలక్షేప గోష్ఠిలో ఒక సందేహం తలెత్తుతుంది – జీవాత్మ  యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి? జ్ఞానవంతునిగా ఉండటమా లేదా భగవానుడికి దాసునిగా ఉండటమా? అని.  ఎమ్పెరుమానార్ సమాధానం తెలుసుకోవడానికి కూరతాళ్వన్ను తిరుక్కోష్టియూర్ నంబి (వారి ఆచార్యాలలో ఒకరు) వద్దకు పంపుతారు.  6 నెలల పాటు నంబికి ఆళ్వాన్ సేవ చేస్తారు, నంబి చివరకు ఆళ్వాన్ను తాను వచ్చిన కారణం అడిగినప్పుడు, ఆళ్వాన్ ప్రశ్న అడుగుతారు. అందుకు నంబి జవాబిస్తూ “అళ్వార్ అడియేన్ ఉళ్ళాన్” అని చెప్పి నందున, ఇక్కడ ‘అడియేన్’  జివత్మకు సంకేతం  వహిస్తుంది, శేషత్వం జీవాత్మ యొక్క ప్రధాన గుణం. “అడియేన్” అనేది భగవానుడికి  దాసత్వాన్ని  సూచిస్తుంది – కాబట్టి ఈ విధంగా నమ్మాళ్వార్ జీవాత్మ యొక్క నిజమైన గుర్తింపును స్థాపించారు.
  • భగవాన్ శేషభూతుడిగా ఉన్న జీవాత్మ ఇతరులకు శేషభూతుడిగా భావించడం ఒక అడ్డంకి. స్వాభావికంగా జీవాత్మ భగవాన్ యొక్క సేవకుడు. తనను తాను ఇతరులకు సేవకుడిగా భావించడం ఒక అడ్డంకి. ఇక్కడ ఇతరులు అంటే భగవానుడి దివ్య భార్యలు, వారి ప్రియమైన భక్తులు కాని వారు. అనువాదకుల గమనిక: భగవాన్ మాత్రమే యజమాని, మిగతా వాళ్ళందరూ వారి సేవకులు. దేవతాంతరములు అంటే ఇతర దేవతలు. ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మతో ప్రారంభమయ్యి అనేక దేవతలు ఉన్నారు. ఈ దేవతలు మనలాగే కర్మ బంధనం, జన్మ / మరణం యొక్క చక్రంలో బంధించి ఉన్నారు. కానీ ధర్మ బద్ధమైన కర్మలను అనుసరించిన కారణంగా కొంత మంది జీవాత్మలు ఈ దేవతల స్థానానికి చేరుకున్నాయి. అయినప్పటికీ, శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత శ్లోకము 8.16 లో చెప్పినట్లుగా “ఆ బ్రహ్మ భువనాత్ లోకాః…” – బ్రహ్మ లోకం నుండి అని అర్థం. అగ్రస్థానం నుండి అత్యల్ప స్థానం వరకు జన్మ / మరణం చక్రం పునరావృతమవుతూనే ఉంటుంది.  కాబట్టి, ముముక్షువులకు (మోక్షాన్ని కోరుకునేవాడు) ఈ దేవతలకు బదులు, నేరుగా భగవానుడిని (మోక్షాన్ని ప్రసాదించేవాడు)  ఆరాధించాలని / సేవ చేయాలని సలహా ఇవ్వబడింది. ముముక్షుప్పడిలో పిళ్ళై లోకాచార్యులు  ప్రణవంలో ఉకారం (ఉ) గురించి వివరిస్తూ దీనిని వివరించారు. ఉకారం భగవాన్ పట్ల జీవాత్మ యొక్క ప్రత్యేకమైన శేషత్వాన్ని నొక్కి చెబుతుంది. ఇక్కడ, సూత్రం 61 లో, ఇతరులకు ఏరకమైన సేవను తొలగించే ప్రాముఖ్యతను వారు ఎత్తి చూపారు. సూత్రం 62 లో, అతను దీనిని ఒక ఉదాహరణతో వివరించారు. ఇతరుల పట్ల దాసత్వాన్ని వ్యక్తపరిచే జీవాత్మ, ఒక యజ్ఞంలో దేవతల కోసం ఉంచిన నైవేద్యాన్ని కుక్కకు (చూడతగనిది, తాకతగనిది) సమర్పించడం లాంటిదని వారు వివరిస్తున్నారు. భగవాన్ పట్ల దాసత్వాన్ని వ్యక్తపరచడం కంటే ఇతరుల పట్ల దాసత్వాన్ని తొలగించడం చాలా ముఖ్యమని సుత్రం 63 లో వివరించారు.  సూత్రం 64 లో, వారు తిరుమళిసై ఆళ్వార్ యొక్క నాన్ముగన్ తిరువంతాది 68 వ పాసురాన్ని వివరిస్తూ,  శ్రీవైష్ణవులు ఎప్పటికీ దేవతాంతరములను ఆరాధించకూడదు అని చెబుతున్నారు. “తిరువడి తన్ నామం మఱన్తుం పుఱం తొళా మాన్తర్” – శ్రీవైష్ణవులు ఎలాంటివారంటే, వాళ్ళు భగవాన్ నామాలను మరచిపోతారు కానీ ఇతరినెవరినీ ఆరాధించరు. చివరికి సూత్రం 65 లో,  ఉకారం జీవాత్మ తనకు (స్వయం) మరియు ఇతరులకు అధీనుడై ఉండడని నిర్ధారిస్తుంది – అతను భగవతాధీనుడై మాత్రమే ఉంటాడు. ఇక్కడ, భగవాన్ యొక్క దివ్య భార్యలు, భాగవతులు భగవాన్కు సంపూర్ణ శరణాత స్వభావకుల కారణంగా సహజ అధిపతులు. భగవాన్‌కు పూర్తిగా శరణాతి చేసినా వారెవరైనా, మన యజమానులుగా పరిగణించాలి.
  • జీవాత్మ ఆ దివ్య  దంపతులకు అధీనుడై ఉంటాడని తెలియకపోవడం ఒక అడ్డంకి. శ్రీ మహాలక్ష్మి  శ్రీమన్నారాయణ యొక్క పట్టమహిషి. మిథునం అంటే జంట అని అర్థం. ఇక్కడ భగవాన్ మరియు తాయార్ దివ్య జంట. అనువాదకుల గమనిక: రహస్య త్రయంలో, ద్వయ మహమంత్రాన్ని పుర్వచార్యులు ఎక్కువగా కీర్తించారు. దీనికి కారణం శ్రీ మహాలక్ష్మి యొక్క పాత్ర ఇందులో స్పష్టంగా చూపబడింది. మొదటి భాగంలో, శ్రీ మహాలక్ష్మిని పురుషాకార భూతిగా (సిఫారసు ప్రాధికరణము) వర్ణించారు, భగవాన్ జీవాత్మ యొక్క శరణాగతిని స్వీకరించేలా చేస్తుంది. రెండవ భాగంలో, శ్రీమన్నారాయణ మరియు శ్రీ మహాలక్ష్మి ఇద్దరికీ జీవాత్మ కైంకర్యమును నిర్వహిస్తాడని వివరించబడింది. పిళ్ళై లోకాచార్యులు దీనిని ముముక్షుప్పడి సూత్రం 166 లో ఈ అంశాన్ని వివరిస్తున్నారు, భగవాన్  ఉపాయం (మాధ్యమం) అయినప్పుడు, ఆమె పురుషాకారం (మొదటి భాగంలో) అవుతుంది,  భగవాన్ ప్రాప్యం (లక్ష్యం) అయినప్పుడు, ఆమె లక్ష్యం మరియు జీవాత్మ యొక్క కైంకర్యాన్ని పెంచేది అవుతుంది.  జీవాత్మవారికి కైంకర్యం చేసినప్పుడు, ఆమె దానిని రెట్టింపు చేసి చెప్పి భగవానుడికి మరింత సంతోషం కలిగిస్తుంది అని మణవాళ మాముణులు వివరిస్తున్నారు. సీతా రాములిద్దరికీ లక్ష్మణుడు కైంకార్యం చేసినట్లు పిళ్ళై లోకాచార్యులు సూత్రం 168 లో వివరించారు. సూత్రం 169 లో, భగవాన్ మరియు తాయార్ కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కైంకార్యం సంభవిస్తుందని, సంతోషకరంగా ఉంటుందని ఆయన వివరిస్తున్నారు. సీతా పిరాట్టి యొక్క సిఫారసుతో లక్ష్మణుడు శ్రీ రామునికి ఎలా శరణాగతి చేశాడో, అతను వారికి చక్కగా ఎలా సేవ చేశాడో మణవాళ మాముణులు అందంగా ఉల్లేఖిస్తున్నారు. వారు ఒక ఆచరణాత్మక ఉదాహరణతో కూడా వివరించారు – ఒక పుత్రుడు తన తల్లిదండ్రులకు (తల్లి మరియు తండ్రికి) కలిసి సేవ చేసినప్పుడు, అది చాలా సముచితమైనది – అదేవిధంగా జీవాత్మ తన దివ్య తల్లి తండ్రులకిద్దరికీ సేవ చేయడం అతని స్వభావానికి చాలా సముచితమైనది.
  • జీవాత్మ భగవత్ భక్తుల అధీనుడని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  భగవత్ దాస్యత్వమే జీవాత్మ యొక్క సహజ స్వభావం,  పూర్తి భగవత్ అధీనుడై ఉండాలి. అంతకన్నా ముఖ్యమైనది – స్వరూప యతాత్మ్యం (వాస్తవ స్వభావ సారాంశం) – భాగవత శేషత్వం (భాగవతులకు దాసునిగా ఉండటం). పెరియ తిరుమొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వారులు  తిరుమంత్ర సారాన్ని స్వయంగా భగవానుడికి తెలియజేసారు ( “నిన్ తిరువెట్టెళుత్తుం కత్తు నాన్ ఉత్తతుం ఉన్నడియార్క్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే” –  తిరుక్కణ్ణపుర భగవాన్!  తిరుమంత్రం యొక్క సారాంశాన్ని తెలుసుకున్న తర్వాత నేను మీ భక్తుల దాసుడనని అర్థం చేసుకున్నాను).  తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాది 18 వ పాసురాని తెలియజేస్తున్నారు,  “ఏత్తియిరుప్పారై వెల్లుమే మత్తవరైచ్చాత్తియిరుప్పార్ తవం” – భాగవతుల పట్ల భక్తి భగవత్ భక్తి కంటే గొప్పది. ఏత్తియిరుప్పవర్ – భగవత్ శేష భూతుడు –  భగవానుడికి శరణాగతులైనవాడు. అటువంటి భక్తులకు శరణాగతులైన వారి స్థితి చాలా గొప్పది. శ్రీ రామాయణంలో లక్ష్మణ భరతులు శ్రీ రామునికి సంపూర్ణ శరణాగతులై ఉన్నవారు. భరతుడే సర్వస్వంగా శతృఘ్నుడు ఉండేవాడు. “చతృఘ్నో నిత్యచతృఘ్నః” – శాశ్వతమైన అడ్డంకిని జయించినవాడు, అని శ్రీ రామాయణంలో చెప్పబడింది.  “శతృఘ్నుడు శ్రీ రాముని సౌందర్యాన్ని, శుభ గుణాలను విస్మరించి/జయించి పూర్తిగా భరతుని సేవించాడు” అని మన పూర్వాచార్యులు వివరించారు.  తిరువాయ్మొళి  8.10.3 లో, నమ్మాళ్వార్ “అవనడియార్ సిఱుంమామనిసరాయ్ ఎన్నైయాన్దార్” – ఎమ్పెరుమానుకి  పూర్తిగా శరణాగతులైన వారు, పరిమాణంలో చిన్నవారు కాని జ్ఞానం మరియు ఆచారములో గొప్పవారు. అటువంటి భక్తులు తమకు స్వామిలాంటి వారని నమ్మాళ్వారు తెలియజేస్తున్నారు. అటువంటి భాగవతులు ఉన్నప్పుడు, వారిని విస్మరించి భగవానుడి పాద పద్మాలను ఎలా సేవించవచ్చు? జీవత్మ యొక్క అసలు స్వభావానికి,  భగవత్ కైంకార్యం కంటే భాగవత కైంకర్యం ఎక్కువ సముచితమైనది. పిళ్ళై లోకాచార్యులు ముముక్షుప్పడి సూత్రం 89 లో “ఉఱ్ఱతుం ఉన్ అడియార్క్కడిమై” ఎంగిఱపడియే ఇతిలే భాగవత శేషత్వముం అణుసందేయం” అని వివరిస్తున్నారు. తిరుమంగై ఆళ్వార్ తిరుమంత్రం తెలుసుకున్న తరువాత, నేను మీ (శ్రీమన్నారాయణ) దాసులకు దాసుడను అని అర్థం చేసుకున్నాను అని తెలియజేస్తున్నారు, నమః  పదం భాగవత శేషత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
  • సర్వేశ్వరుడైన భగవాన్ సర్వశరీరి (అంతరాత్మ – అందరిలొ నివసించే ఆత్మ)  అని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఇది ఇప్పటికే వివరించబడింది. అనువాదకుల గమనిక: శరీరి అనేది ఆత్మ, శరీరం అనేది దేహం. ఆత్మ ద్వారా శరీరం నియంత్రించబడుతుంది – దీనిని ప్రత్యక్షం (అవగాహన) ద్వారా మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. నియంత్రించే ఆత్మ దేహంలో ఉన్నంతవరకే ఆ శరీరం పని చేస్తుంది.  నియంత్రించే ఆ ఆత్మ వెళ్లి పోయిన తర్వాత, శరీరం చనిపోయి చలనం లేకుండా మారుతుంది. భగవాన్ అన్ని తత్వాలలో (చిదచిత్తులలో) అంతరాత్మగా ఉంటాడు. అతడు అందరిలో అంతరాత్మగా ఉండటం, మనందరమూ అతని నియంత్రణలో ఉన్నామని అర్థమౌతుంది. అంతార్యమిత్వం (అంతరాత్మగా ఉండటం), నియంతృత్వం / ఈశ్వరత్వం (నియంత్రించు వాడు) – ఈ రెండూ కలిసి ప్రయాణిస్తుంటాయి.
  • భగవానుడు సర్వ స్వతంత్రుడని తెలియకపోవడం, తన భక్తాధీనుడిగా అభివ్యక్తపరచడం అతని అత్యున్నత స్వతంత్రాన్ని వ్యక్తపరుస్తుంది, అతను శాశ్వతంగా భక్తాధీనుడని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవానుడిని సత్య కాముడు (అన్ని కోరికలను తీర్చగలడు), సత్య సంకల్పుడు (ఏ పనినైనా సంపన్నం చేయగలడు), నిరంకుశ స్వతంత్రుడు (నియంత్రణలేని స్వతంత్రుడు) మొదలైన వాటితో పిలుస్తారు. అయినప్పటికీ, అతను ఆశ్రిత పక్షపాతి (భక్తానకూలమైనవాడు). తనను ప్రేమతో ఆశ్రయించిన వారికి అతను సంపూర్ణంగా కట్టుబడి ఉంటాడు. ఇది అతడు తన ఇష్ఠప్రకారంగా చేస్తాడు కాబట్టి ఇది వారి స్వేచ్ఛా స్వతంత్రానికి నిదర్శనం. ఇది శాశ్వతమైనది, ఇది వారి అవతారాములలో వ్యక్తమౌతుంది. అనువాదకుల గమనిక: భగవాన్ మహోన్నతమైన స్వతంత్రుడు. అయినప్పటికీ, అతను తన భక్తాదీనుడై ఉంటాడు.  మహాభారతయుద్ధంలో  పాండవుల దూత అయ్యాడు. అర్జునుడికి రథసారధి అయ్యాడు. అతనికి ఎంతో అంకితభావంతో ఉన్న పాండవుల పట్ల ఆయనకున్న ప్రేమాభావం అటువంటిది. అతను తన స్వసంకల్పంతో  భక్తులకు అధీనుడై ఉంటాడు. ఈ గుణాన్ని అర్చావతారాంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అతను తన ప్రసాదం, తిరుమంజనం, వస్త్రం, అలంకారం మొదలైన వాటన్నింటికీ తన అర్చకునిపై ఆధారపడి ఉంటాడని ప్రతిజ్ఞ చేశాడు. ఇది తన సౌలాభ్యం (సరళత) యొక్క అత్యున్నత వ్యక్తీకరణ అని మన పూర్వాచార్యులు వివరిస్తున్నారు.
  • తన భక్తాధీనత్వం వారి భక్తుల పట్ల వారి ప్రేమకు నిదర్శనమని తెలియకపోవడం ఒక అడ్డంకి. ప్రణయిత్వం – గొప్ప ప్రేమ / అనుబంధం కలిగి ఉండటం. ఎవరిపైనైనా మనకి అమితమైన ప్రేమ ఉన్నప్పుడు, ఆ స్థితిలో మన గురించి మనం పెద్దగా పట్టించుకోము. అనువాదకుల గమనిక: భగవాన్ అత్యున్నతుడు, జీవాత్మ అల్పుడు అయినప్పటికీ, తన భక్తుల పట్ల వారికున్న గొప్ప కరుణ మరియు కృప కారణంగా, అతను జీవాత్మ అల్పత్వాన్ని పట్టించుకోడు. జీవాత్మలోని నిర్మలమైన ప్రేమను మాత్రమే చూస్తాడు, జీవాత్మని గొప్ప అనురాగంతో స్వీకరిస్తాడు. తనకన్నా తక్కువ స్థానంలో ఉన్న వారితో స్వేచ్ఛగా కలసే ఈ గుణాన్ని సౌశీల్యం అంటారు.
  • ప్రతి ఒక్కరికీ తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమానుబంధం వల్ల తమ భక్తుల పట్ల అలాంటి అనురాగం ఉందని తెలియకపోవడం ఒక అడ్డంకి. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి  10.10.7 లో “కోలమలర్ప్ పావైక్కన్బాగియ ఎన్ అన్బేయో” – అతను తమకు అతిప్రియమైన శ్రీ మహాలక్ష్మి యొక్క సేవకుడు కావడం వల్ల అతనికి చాలా ప్రియమైన వ్యక్తి అని నమ్మాళ్వారులు భగవానుడికి తెలియజేసుకుంటున్నారు.  అనువాదకుల గమనిక: ఈ వివరణతో ప్రారంభించి, శ్రీ మహాలక్ష్మి స్వరూపం వివరించబడింది. భగవాన్ సర్వ స్వతంత్రుడు. శ్రీ మహాలక్ష్మి భగవానుడిపై ఆధారపడి ఉన్న అతని దివ్య పత్ని. ఆమె పురుషాకరం (సిఫారసు) కారణంగా, భగవాన్ తనకు శరణాగతి చేసిన వారిని స్వీకరిస్తాడు. శరణాగతి చేస్తున్న వ్యక్తి యొక్క  అపరిమితమైన పాపాల కారణంగా,  భగవాన్ సాధారణంగా అటువంటి జీవాత్మలను స్వీకరించడానికి వెనుకాడతాడు. కానీ భగవాన్ యొక్క  స్వాతంత్ర్యం కన్నా వారి కరుణ / దయకి  ప్రాధాన్యతనిచ్చి భగవాన్ జీవాత్మను స్వీకరించేలా ఆమె నిర్ధారిస్తుంది. భగవాన్ కూడా, తాయార్ పట్ల ఉన్న గొప్ప ప్రేమతో, జీవాత్మను స్వీకరిస్తాడు. అటువంటి జీవాత్మని పూర్తి శ్రద్ధతో చూసుకుంటాడు.
  • శ్రీ మహాలక్ష్మి భగవానుడికి అతి ప్రియమైనదని, భగవానుడితో సమానమైన సౌందర్యం గలదని, ఆమె ద్వారా అతను గుర్తించబడతాడని, అతని నుండి ఎన్నడూ విడదీయలేనిదని, అతనికి పూర్తి అధీనురాలని, అతని దివ్య పట్టమహిషి అని, ప్రతి ఒక్కరికీ తల్లి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఇక్కడ పిరాట్టి స్వభావం స్థాపించబడింది. ఆమె అభిమత – అతనికి అతి ప్రియమైనది అని అర్థం; అనురూప – శారీరక సౌందర్యంలో అతనితో సమానమైనది అని అర్థం; నిరూపక – అతని వ్యక్తిత్వంలో భాగము అని అర్థం. అతన్ని శ్రియః పతి (శ్రీ మహాలక్ష్మికి పతి) అని గుర్తిస్తారు; నిత్యానపాయిని – ఎన్నడూ విడదీయరానిది అని అర్థం; శేషభూత – సంపూర్ణగా వారి అధీనురాలు అని అర్థం; మహిషి – భగవానుడి యొక్క పట్టపు రాణి / భార్య –  “అస్యేసానా జగతో విష్ణు పత్నీ” (ఆమె విశ్వానికి అధిపతురాలు, విష్ణువుకి భార్య) – ఆమెకు ఏకైక స్వామి  శ్రీమన్నారాయణ కావడం వల్ల, ఆమె కూడా విశ్వానికి అధిపతురాలు అవుతుంది; జగన్మాతా – విశ్వానికి తల్లి – భగవాన్ సమస్థ విశ్వానికి తండ్రి కాబట్టి, అతని భార్య సమస్థ విశ్వానికి తల్లి అవుతుందని శృతి తెలియజేస్తుంది. అనువాదకుల గమనిక: ఇక్కడ శ్రీ మహాలక్ష్మి యజమానిగా వివరించబడింది. పిళ్ళై లోకాచార్యులు ఈ ఉపదేశాన్ని ముముక్షుప్పాడి సూత్రంలో 44 లో చక్కగా వివరించారు. సాధారణంగా ఇండ్లల్లో పనివాళ్ళను పెట్టుకున్నప్పుడు, ఆ ఇంటి యజమాని ఆ సేవకుడితో మాట్లాడి కుదుర్చుకుంటారు. కానీ వాస్తవానికి, పగలంతా ఆ భర్త ఇంట్లో ఉండడు కాబట్టి, ఆ పనివాడు యజమాని భార్య ఆదేశాలను అనుసరిస్తాడు. కాబట్టి, సహజంగా, యజమాని యొక్క సేవకుడు అతని భార్యకి కూడా సేవకుడు అవుతాడు. శ్రీమన్నారాయణ దివ్య యజమాని, శ్రీ మహాలక్ష్మి అతని దివ్య పత్ని.  జీవాత్మలందరూ శ్రీమన్నారాయణకు దాసులు. తాయార్ అతని ప్రధాన పట్ట మహిషి, అందరు జీవాత్మలు సహజంగానే ఆమెకు కూడా దాసులౌతారు.
  • ఆమె ఒక జీవాత్మ అయినప్పటికీ, ఆమె నిత్యసూరులు (నిత్య ముక్తులు), ముక్తాత్మలు (విముక్తి పొందిన జీవాత్మలు), బద్ధాత్మలకు (బద్దుడైన జీవాత్మ) భిన్నమైనదని తెలియకపోవడం ఒక అడ్డంకి. జీవాత్మలందరూ ఒకే పదార్ధంతో కూడినవారు – కాని వాటి స్థితి కారణంగా నిత్య, ముక్త మరియు బద్దులుగా వర్గీకరించబడ్డారు. బద్ధ – ఈ భౌతిక ప్రపంచంలో కట్టుబడి ఉన్న మనలాంటి వారు; ముక్త – ఈ భౌతిక ప్రపంచం నుండి భగవాన్ కృపతో ముక్తి పొంది పరమపదం చేరుకున్నవారు; నిత్య – పరమపదంలో భగవానుడికి నిత్య కైంకర్యం చేస్తున్నవారు. పిరాట్టి నిత్యసూరుల వర్గంలో భాగం అయినప్పటికీ, ఆమె భగవాన్ యొక్క దివ్య పట్ట మహిషి అయినందున ఆమె నిత్యసూరులకు భిన్నమైనది. అనువాదకుల గమనిక: సామాన్యంగా శ్రీ మహాలక్ష్మి నిత్యాసురి వర్గంలోని భాగమని భావిస్తారు. అయినప్పటికీ, ఆమె భగవాన్ యొక్క దివ్య పట్ట మహిషి కావడం వల్ల, జీవాత్మలందరిలోకి ఆమెను అగ్రస్థానంలో ఉంచబడింది. భూదేవి, నీళా దేవి మరియు భగవాన్ యొక్క ఇతర అసంఖ్యాక భార్యలు కూడా శ్రీ మహలక్ష్మికి అధీనులై ఉంటారు. అనంత, గరుడ, విశ్వాక్సేనుల వంటి  అందరూ నిత్యసూరులు మరియు ముక్తాత్మలందరూ  శ్రీ మహాలక్ష్మికి అధీనులై ఉంటారు. ఆలవందారులు తమ చతుః శ్లోకి యొక్క మొదటి స్లోకంలో ఇలా వివరించారు – శ్రీ మహాలక్ష్మిని పరమపదంలో ప్రతి ఒక్కరూ సేవిస్తారు.  బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుల వంటి ఈ ప్రపంచంలోని దేవతలు కూడా సేవిస్తారు – ఎందుకంటే ఆమె శ్రీమన్నారాయణుడి యొక్క అత్యంత ప్రియమైన భార్య కాబట్టి.
  • ఈశ్వరత్వం (నియంత్రించే స్వభావం) ఒక్కరిలో కంటే ఎక్కువ ఉండలేనప్పుడు శ్రీ మహాలక్ష్మి సర్వశ్వరి (అందరికీ యజమాని – స్వతంత్రంగా) అని చెప్పడం, ఆమెను బ్రహ్మం యొక్క స్వభావమయిన కారణత్వం (సర్వ కారణం) అని చెప్పడం అడ్డంకి. శ్రీ మహాలక్ష్మికి, యజమానిగా ఉండటం సహజమైన గుణం కాదు – కానీ ఆమె శ్రీమన్నారాయణ యొక్క దివ్య పట్ట మహిషి కావడం ఆధారంగా సంపాదించిన గుణంమది. అదేవిధంగా కారణత్వం (సర్వ కారణం) పరమ పురుషునికి (పరబ్రహ్మం) మాత్రమే ఉన్న ప్రత్యేకమైన గుణం. ఇది ఆమెకు వర్తించదు. కారణత్వం అంటే జగత్ వ్యాపారంలో పాల్గొనడం – సృష్టి, స్తితి, సంహారం మొదలైన వాటిలో ప్రత్యక్షంగా పాల్గొనడం. అనువాదకుల గమనిక:  రెండు అత్యోన్నత తత్వములు ఉండవు.  బ్రహ్మము అనేది ఒకే ఒక్కటి ఉంటుంది,  అది శ్రీమన్నారాయణుడు మాత్రమే. అన్ని జీవాత్మలలో భగవానుడికి పిరాట్టి ప్రియమైనది, ఎందుకంటే ఆమె అతని దివ్య పట్ట మహిషి కాబట్టి.
  • శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీమన్నారాయణుడు  స్వభావంలో భిన్నమైన వారు కారని, కేవలం వారి రూపంతో మాత్రమే భిన్నమైన వారని, భగవత్ స్వరూపం రెండు రూపాల్లో ఉందని చెప్పడం (భగవాన్ మరియు పిరాట్టి రూపంలో) అడ్డంకి అవుతుంది. పిరాట్టి జీవాత్మ వర్గానికి చెందినది కాబట్టి, ఆమె స్వభావం ప్రకారం పరమాత్మకు భిన్నమైనది. తారుమారు చేయడం సత్యానికి విరుద్ధమౌతుంది.
  • శ్రీ మహాలక్ష్మియే భగవానుడని చెప్పడం, వేరే ఒక తత్వం కాదని చెప్పడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: శ్రీ మహాలక్ష్మి జీవాత్మల వర్గంలోని భాగము, భగవాన్ యొక్క దివ్య పట్ట మహిషి. కాబట్టి స్వాభావికంగా,  ఆమె అనేక రకాలుగా భగవానుడికి భిన్నమైనది – అన్నింటికంటే ముఖ్యమైనది – ఆమె సంపూర్ణంగా భగవానుడిపైన ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా, మునుపటి వివరణలో మనం ఇప్పటికే చూసిన ఈశ్వరత్వం, కారణత్వం మొదలైన వాటితో శ్రీ మహాలక్ష్మిని కలిపే ప్రశ్నే లేదు.
  • వాస్తవానికి ఆమె అతి సుందరమైన  గుణాలతో ఉన్న జీవాత్మ, అయితే ఆమె కేవలం ఒక తత్వం/గుణం అని చెప్పడం ఒక అడ్డంకి.
  • భగవాన్ అహం (పరమ పురుషుడు) అని తెలియకపోవడం, ఆమె అహంత (భగవాన్‌ను ప్రత్యేకంగా గుర్తించే అంశం) అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంతకుముందు చర్చించినట్లుగా, భగవాన్ ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి భర్తగా గుర్తింపబడతారు.
  • అణు స్వరూపం అయిన శ్రీ మహాలక్ష్మి ఎల్లప్పుడూ విభు స్వరూపం (సర్వ వ్యాపి) అయిన భగవానుడితో చేరి ఉంటుందని తెలియకపోవడం  ఒక అడ్డంకి. పిరాట్టి ఒక జీవాత్మ కాబట్టి, ఆమె అణు స్వరూపమైనది. అయినప్పటికీ, ఆమె భగవాన్ యొక్క అనపాయిని (విడదీయరానిది) కాబట్టి, ఆమె ఎప్పుడూ భగవానుడితో చేరి ఉంటుంది.  ఇది భగవాన్ యొక్క ఒక ప్రత్యేకమైన సామర్ధ్య గుణం – ఇది అనూహ్యమైనది – కానీ అతనికి సాధ్య సామర్ధ్యంగా పరిగణించబడుతుంది. అనువాదకుల గమనిక: తిరువాయ్మొళి  6.10.10లో, నమ్మాళ్వార్ “అగలగిల్లేన్ ఇఱైయుం ఎన్రు అలర్మేల్ మంగై ఉఱై మార్బా” – ఇక్కడ నమ్మాళ్వార్ “అగలగిల్లేన్ ఇఱైయుం” అని పిరాట్టిని వర్ణిస్తూ – క్షణం కూడా నేను మీ వక్ష స్థలాన్ని వదిలిపెట్టను అని వివరిస్తున్నారు. పురాణములలో, శ్రీమన్నారాయణుడు అనేక విభిన్న రూపాలలో (దేవ, మనుష్య, తిర్యక్ – జంతువు / పక్షి, స్థావర – చెట్లు/మొక్కలు) దిగి వచ్చినప్పుడల్లా పిరాట్టి అతనితో పాటు తగిన రూపాల్లో వస్తుంది. కాబట్టి, భగవాన్ ఏ రూపంలో ఉన్నా సరె, పిరాట్టి కూడా అతనితో ఎల్లప్పుడూ ఉంటుంది.
  • క్షీరాబ్ది అంతటా రసం (రుచి) వ్యాపించి ఉన్నట్లే, పిరాట్టి కూడా భగవాన్ అంతటా వ్యాపించి ఉంటుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. మన మహాసముద్రాలు ఉప్పుతో నిండినట్లే, పాల మహా సముద్రం దివ్య రుచితో నిండి ఉంటుంది. అదేవిధంగా, భగవాన్ ఉన్నచోట వారితో పాటు పిరాట్టి కూడా ఉంటుంది. అనువాదకుల గమనిక: భగవాన్ సూర్యుడిలాంటి వాడైతే, పిరాట్టి సూర్య కిరణాలలాంటిదని, భగవాన్ పుష్పం లాంటి వాడైతే, పిరాట్టి ఆ పువ్వులోని సువాసన లాంటిదని ముముక్షప్పడి సూత్రం 46 లో పిళ్ళై లోకాచార్యులు వివరించారు. మణవాళ మాముణులు, భట్టార్‌ను ఉటంకిస్తూ, పువ్వు మరియు సువాసన ఎల్లప్పుడూ కలిసి విడదీయరానివిగా ఉంటాయి,  భగవాన్ మరియు పిరాట్టి కూడా విడదీయలేని వాళ్ళు అని వివరించబడింది.
  • భగవానుడితో అలాంటి సహజీవనం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, అన్ని సమయాలలో భగవాన్‌కు సిఫారసు చేయడంలో జీవాత్మలకు సహాయం చేయడమే అని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవాన్ ఎప్పుడైనా తనను ఆశ్రయించిన జీవాత్మలను స్వీకరించే వీలు కల్పించేందుకు శ్రీ మహాలక్ష్మి ఎల్లప్పుడూ భగవానుడి‌తో కలిసి ఉంటుంది. అనువాదకుల గమనిక: ఈ సూత్రాన్ని ద్వయ మహమంత్రంలో అందంగా వివరించబడింది. పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుప్పడిలో ,  “శ్రీ” అంటే జీవాత్మల ఆర్తిని వింటూ, వారి అభ్యర్థనను భగవానుడికి తెలియజేసేది అని వివరించబడింది. జీవాత్మలు ఎప్పుడైనా భగవానుడిని ఆశ్రయించవచ్చని ఆయన వివరించారు. ఆ సమయంలో ఆమె అతనితో లేనట్లయితే, అతను వారి అసంఖ్యాక పాపాలను పేర్కొంటూ ఆ జీవాత్మలను తిరస్కరించవచ్చు. అటువంటి పరిస్థితి రాకుండా, శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ శ్రీమన్నారాయణుడితో చేరి ఉంటుంది. ఇంతకుముందు ఉల్లేఖించిన “అగలగిల్లేన్” పాసురంలో ఈ విషయం విస్తృతంగా వివరించబడింది. “వివాహం తర్వాత సీతా పిరాట్టి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళనట్టే, ముక్తాత్మ కూడా ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు”, అని నంపిళ్ళై అందంగా వివరించారు.  ఆమె కూడా భగవానుడిని వదిలి వెళ్ళడం గురించి ఎన్నడూ ఆలోచించదు.
  • భగవత్ స్వరూపమైన “శ్రియః పతి” ని స్థాపించడానికి శ్రీ మహాలక్ష్మిని ఉపయోగించాలని తెలియకపోవడం ఒక అడ్డంకి. ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని “విష్ణు పత్ని” గా గుర్తించినట్లే, ప్రత్యేకంగా శ్రీమన్నారాయణను కూడా “శ్రియః పతి” (శ్రీ మహాలక్ష్మి భర్త) గా గుర్తించాలి – దీనిని సందేహం లేకుండా అర్థం చేసుకోవాలి.
  • సహజంగానే  భగవాన్ జ్ఞానం మరియు ఆనందంతో నిండి ఉన్న వాడని, అన్ని లోపాలను నాశనం చేసేవాడని, అన్ని శుభ లక్షణాలకు నివాసుడని, మూడు రకాల (దేశ, కాల, విషయాల ద్వారా) పరిమితుల ద్వారా నియంత్రించబడని వాడని, విభు (సర్వవ్యాపి), అతను కోరికలు లేనివాడు అయినప్పటికిని సృష్టి, స్థితి, లయ యొక్క అంతులేని చక్రం ద్వారా ఆనందించడం, ఎవరి నుండి ఏమీ ఆశించడని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఈ అంశంతో ప్రారంభించి, భగవత్ స్వరూపం వివరించబడింది. తిరువాయ్మొళి  1.1.2 లో భగవత్ స్వరూపం ఉణర్నలం అని నమ్మాళ్వార్ వివరిస్తున్నారు. ఉణర్ –  జ్ఞానం, నలం – ఆనందం – పరమానందం అని అర్థం. అతడు అన్ని లోపాలు / అమంగళాలకు వ్యతిరేకమైనవాడు. పైగా ఎదుటివారిలో లోపాలను నాశనం చేసేవాడు. అతను అనేక పవిత్ర గుణాలతో నిండి ఉన్నవాడు. అతను దేశ, కాల, విషయాల ద్వారా నియంత్రించబడడు. అంటే అతను ప్రతిచోటా ఉంటాడు (స్థలం ద్వారా నియంత్రించబడడు), ఎల్లప్పుడూ (సమయం ద్వారా నియంత్రించబడడు) మరియు అన్ని రూపాల్లో / అంశాలలో (నిర్దిష్ట వస్తువులచే నియంత్రించబడడు) అని అర్థం. అతను తన నిజమైన స్వరూపం ద్వారా అన్ని చోట్లా విస్తరించి ఉన్నాడు – ఈ గుణాన్ని “విభు” అంటారు. అతడు అవాప్తసమస్తకాముడు – అన్ని కోరికలు తీరినవాడు,  కొత్తగా నెరవేరడానికి ఏమీ లేనివాడు. అన్నింటిలో సంపూర్ణత ఉన్న భగవాన్  సృష్టి, స్థితి, లయలను ఒక క్రీడగా వహిస్తాడు. తిరువాయ్మొళి  3.10.7 లో “ఇన్బుఱుం ఇవ్విళైయాట్టుడైయాన్” – ప్రతిదీ తనకు ఒక క్రీడ అని నమ్మాళ్వారులు వివరిస్తున్నారు.
  • భగవానుడు నిత్య విభూతిలో (పరమపదం/శ్రీ వైకుంఠం) ఉంటాడు. తిరుమామణి మండపంలో (తిరు ఆభరణాలతో అలంకరించబడిన సభా మందిరం) ఆదిశేష సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. అతి కాంతివంతంగా ప్రకాశిస్తున్న భగవాన్ తన దివ్య పత్నులతో పాటు అక్కడ ఆసీనుడై ఉంటాడు. అక్కడ నుండి నిత్య విభూతి (పరమపదం) మరియు లీలా విభూతి (సంసారం) లోని ప్రతిదాన్ని నియంత్రిస్తుంటాడు. అతను “సోష్ణుతే సర్వాన్ కామాన్” (ఆనందంగా అన్ని రకాల సేవలను ఆస్వాదించడం) లో వివరించిన విధంగా అనంత, గరుడ, విశ్వక్షేనుడు వంటి నిత్యసూరుల సేవలను ఆనందిస్తుంటాడు. అయినప్పటికీ, సంసారంలో బాధపడుతున్న ఆత్మలకు సహాయం చేయడానికి, అతనిని ధ్యానించే వారిని సంతృప్తి పరచడానికి / ఆశీర్వదించడానికి అతను పరంపదం నుండి క్షీరాబ్ధిలోకి వ్యూహ వాసుదేవునిగా దిగువస్తాడు. అనువాదకుల గమనిక: ఇక్కడి నుండి, భగవాన్ యొక్క ఐదు విభిన్న రూపాలు (పరత్వాది పంచకం – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html) వివరంగా వివరించబడ్డాయి. వీటిని పిళ్ళై లోకాచార్యుల తత్వ త్రయం గ్రంథం మణవాళ మాముణులు యొక్క వ్యాఖ్యానంలో వివరించబడింది. ఈ వివరణ పరమపదంలో పరవాసుదేవునిలో కనిపించే భగవాన్ యొక్క పరత్వ రూపాన్ని వివరిస్తుంది. పరమపదం అనేది శుద్ధ సత్వానికి (దైవిక పదార్థం) నిలయం, ఇది మండపాలు, గోపురాలు మొదలైన రూపాలలో కనిపిస్తుంది. మునుపటి వ్యాసాలలో దీని గురించి మనం ఇప్పటికే చూశాము. పరమపదం సంపూర్ణంగా ఆనందంతో నిండి ఉంటుంది, ఆనందించేవాడు భగవానుడు, నిత్యులు (నిత్యసూరులు) మరియు ముక్తులు (ముక్తాత్మలు) ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడుచుకుంటారు. పరవాసుదేవుడు నుండి, వ్యూహ వాసుదేవుని యొక్క తరువాత దశ కనిపిస్తుంది. మరో మూడు రూపాలు – సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ వ్యూహ వాసుదేవుని నుండి ప్రత్యక్షమౌతారు. సాధారణంగా క్షీరాబ్ది వ్యూహ రూపంలో విష్ణు యొక్క నివాసంగా ఆపాదించబడుతుంది. ఇక్కడ భగవాన్ తన భక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో నివాసుడై ఉంటాడు. బ్రహ్మతో ప్రారంభమయ్యి అందరు దేవతలు వారి వారి కష్థనివారణలకు ఇక్కడికి వస్తుంటారు.
  • అజ్ఞానంతో కప్పబడి ఉన్న సంసారి జీవాత్మలను ఉద్ధరించడానికి, అతడు మానవుడు వంటి అనేక విభిన్న రూపాలను ధరిస్తాడు, సాధారణ మానవుడిగా కష్థాలను అనుభవిస్తాడు. ఈ వివరణతో ప్రారంభమయ్యి  పర మరియు వ్యూహ స్వరూపాలకు మించి, విభవం (అవతారములు), అర్చా (విగ్రహ స్వరూపాలు), అంతర్యామి గురించి వివరించబడింది. క్షీరాబ్దినాథుడు సాధు పరిత్రాణం (సాధువులను రక్షించడం), ధర్మ సంస్థాపనం (ధర్మాన్ని స్థాపించడం) మరియు దుఃఖ నాశనం చేయడం వంటి విభిన్న లక్ష్యాలను సాధించడానికి వివిధ రూపాల్లో వేర్వేరు లోకాల్లోకి దిగివస్తాడు. అతి ప్రాచీన కాలం నుండి, ఈ సంసారంలో జీవాత్మలు జనన / మరణ చక్రంలో చిక్కుకొని బాధపడుతున్నారు  – దీనిని నిద్ర (అజ్ఞాన స్థితి) అంటారు. వారిని మేల్కొలిపి శ్రీ రామ, కృష్ణ వంటి వివిధ రూపాలను స్వీకరించడం ద్వారా వారిని ఉత్తేజపరుస్తాడు. మానవుల మాదిరిగానే అతి సాధారణ మానవ రూపాన్ని ధరించి, అతడు కూడా ఆ స్వరూపంలో సుఖదుఃఖాలను అనుభవిస్తాడు.  అనువాదకుల గమనిక: విభవం – అవతారం. అవతారం అంటే క్రిందకు దిగిరావడం – తనను తాను తగ్గించుకోవడం. భగవాన్ దేశ, కాల, వస్తువుతో కట్టుబడి ఉండదు. కానీ వివిధ అవతారాలుగా దిగివచ్చిన్నప్పుడు, అతడు ఒక నిర్దిష్ట కాలంలో (శ్రీ రాముడు త్రేతా యుగంలో అవతరించారు), ఒక నిర్దిష్ట దేశంలో (శ్రీ రాముడు అయోధ్యలో ఉన్నడు), ఒక నిర్దిష్ట తత్వం లోపల (భగవాన్ శ్రీ రాముని రూపంలో ఉన్నాడు) తనను తాను బంధించుకున్నాడు. అతను తన గొప్పతనాన్ని తగ్గించుకునే ఈ అంశాన్ని ఆళ్వారులు మరియు ఆచార్యలు ఎంతో అభినందించారు. ఇక్కడ అవతారాలను రెండు ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు – ముఖ్యావతారములు – స్వయంగా భగవాన్ వివిధ రూపాల్లో అవతరిస్తారు, రెండవది గౌణావతారాలు – భగవాన్ నిర్దిష్ట కార్యాలను సంపన్నం చేయడానికి ఇతర జీవాత్మలకు తన గుణాలను / శక్తిని ప్రసాదిస్తాడు. ముఖ్యావతారములు ముముక్షువులు (మోక్షాన్ని కోరుకునేవారు) ఆరాధించవచ్చు, గౌణావతారములను ముముక్షువులు ఆరాధించకూడదు.
  • గొప్ప కృపతో, ప్రతి ఒక్కరిలో కనిపించని అంతర్యామి (అంతరాత్మ) గా దాగి ఉంటాడు.  తిరువాయ్మొళి  1.1.10 లో నమ్మాళ్వార్ వివరించిన విధంగా “కరంతసిలిడంతొఱుం ఇడన్తిగళ్ పొరుళ్ తొఱుం కరన్తెంగుం పరన్తుళన్” – అంతటా వ్యాపించి ఉన్నవాడు. తిరువాయ్మొళి 7.2.2. “కట్కిళ్” (మన కళ్ళకు కనిపించనివాడు) – భగవాన్ అంతర్యామి పాత్రను వహిస్తాడు. అనువాదకుల గమనిక: అంతర్యామిత్వం భగవాన్ యొక్క అంశం, అంతరాత్మగా ప్రతి కణంలో ఉండి వారి కార్యకలాపాలను నియంత్రిస్తుంటాడు. చిత్ మరియు అచిత్ రెండింటిలో భగవాన్ విస్తరించి వారిచే నియంత్రించబడుతూ ఉంటాయి.
  • అటువంటి అత్యున్నత భగవానుడు అర్చా రూపాన్ని (విగ్రహ రూపాన్ని) ధరిస్తాడని, నిలబడి, కూర్చోవడం, పడుకోవడం మొదలైన వివిధ భంగిమలలో దివ్య దేశాలలో మరియు ఇతర దేవాలయాలలో ఉంటాడని, ఒక రాజు తోటలో విశ్రమిస్తుండగా అతని సేవకులు సేవించడం లాంటిదని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఎలగైతే ఒక దొంగను పట్టుకోవటానికి, ఆ ప్రాంతం మొత్తం పోలీసులు చుట్టు ముట్టేసి ఉంటారు, అలాగే జీవాత్మల హృదయాన్ని ఆకట్టుకోవటానికి భగవాన్ అనేక దేవాలయాలలో ఎన్నో అనేక  భిన్న భిన్న రూపాలను ధరించి ఉన్నాడు. పైగా, అర్చావతార భగవానుడు వారి ప్రసాదం, అభిశేకం, వస్త్ర ధారణ, శయనం మొదలైన వాటికై పూర్తిగా అర్చకులపై ఆధారపడి ఉంటారు. అనువాదకుల గమనిక: దివ్య దేశములను”ఉగంతు అరులిన నిలంగళ్” అని పిలుస్తారు (జీవాత్మలను ఉద్ధరించాలన్న భగవాన్ యొక్క  అతి తీవ్ర సంకల్పం కారణంగా వారు బస చేసిన ప్రదేశాలు). అర్చావతార భగవానుడు అటువంటి దివ్య దేశములు, అభిమాన స్థలములు (మన పూర్వాచార్యులకు ప్రియమైన దేవాలయాలు), గ్రామం / నగర దేవాలయాలు, మఠాలు, గృహాలు మొదలైనవి భగవాన్ యొక్క అత్యంత సౌలభ్య (సరళత) స్వభావాన్ని అభివ్యక్తిపరుస్తుంది. అతను ప్రతి ఒక్కరూ సులభంగా చేరుకోగల ప్రదేశానికి దిగుతాడు, తమ సౌందర్యాన్ని చూపించి, అతని వైపు ఆకర్షిస్తాడు. అదృష్టవంతులు, అతని మహిమలను గ్రహించి, అతనిపై వారి విశ్వాసం పెరిగి, అత్యున్నత లక్ష్యంమైన భగవాన్ నిత్య కైంకార్యంపై విశ్వాసాన్ని అభివృద్ధి చెందేలా చేస్తుంది.
  • పరత్వం (పర వాసుదేవ రూపం) నిత్యుల (మరియు ముక్తాల) ఆనందం కోసమేనని, అవతారాములు (విభవం, అర్చ రూపం) అన్ని వర్గాల జీవాత్మల (నిత్య, ముక్త మరియు బద్ధ) ఆనందం కోసమని తెలియకపోవడం ఒక అడ్డంకి. పరమపదంలో భగవానుడిని నిత్యసూరులు మరియు ముక్తాత్మలు మాత్రమే చూడవచ్చు మరియు ఆనందించవచ్చు. కానీ  విభవ మరియు అర్చా భగవానుడిని ఈ ప్రపంచంలో  అందరూ చూడవచ్చు మరియు ఆనందించవచ్చు. అనువాదకుల గమనిక: ఇక్కడ ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే అర్చావతార భగవానుడిని నిత్యసూరులు కూడా సేవింస్తారు. ఉదాహరణకు, ఒళివిల్ కాలం పదిగం (తిరువాయ్మొళి  3.3) లో, నిత్యసూరులు కూడా పరంపదం నుండి దిగి వచ్చి తిరువెంకటేశ్వరుడిని (శ్రీనివాసుడిని) సేవిస్తారని నమ్మాళ్వారులు తెలియజేస్తున్నారు. కానీ ఈ సంసారంతో భందింపబడి ఉన్న ఎవరైనా (దేవతలు, ఋషులు, మానవులు మొదలైనవారు) ఈ భౌతిక శరీరంతో పరమపదంలోకి ప్రవేశించడం అనేది ఊహించలేని స్థితి. భగవాన్ కృప వల్ల మాత్రమే సంపూర్ణంగా భౌతిక ఆసక్తి నుండి  విముక్తి పొందిన తరువాత పరమపదంలోకి ప్రవేశించవచ్చు.
  • ముఖ్యావతారములలో కనిపించే భగవానుడిని సమస్థ జీవరాశిలో కేవలం ఒక జీవునిగా పరిగణించడం ఒక అడ్డంకి. ముఖ్యావతారములలో, భగవానుడి యొక్క ఆధిపత్యం సంపూర్ణంగా వ్యక్తమవుతుంది. భగవానుడిని కేవలం ఒక చేప (మత్స్యావతారం), తాబేలు (కుర్మావతారం), పంది (వరాహావతారం), మానవుడు (వామనుడు, శ్రీ రామ, కృష్ణ), మొదలైనవాటిని పరిగణించకూడదు. ఇటువంటి స్వరూపాలను ధరించినప్పుడు కూడా వారి ఆధిపత్యాన్ని, పుండరికాక్షత్వాన్ని (అతి సుందమైన కమల నయనాలు) మొదలైన వారి అత్యున్నత గుణాలను అన్ని సమయాలలో వ్యక్తపరుస్తూ ఉంటారు. అనువాదకుల గమనిక: భగవాన్ కేవలం ఒక జంతువుగా, మానవుడు మొదలైన రూపాన్ని ధరిస్తున్నందున, అతను కూడా నశ్వరమైన వాడని అర్ధం కాదు. అతని స్వరూపం ఏమైనప్పటికీ, అతి దైవికమైనది. భౌతిక శరీరాలు / రూపాలకు భిన్నమైనది. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాంలో, భగవాన్ యొక్క శారీరక పరిమితుల గురించి అపోహ పడటం భగవత్ అపచారంగా పరిగణించబడుతుందని వివరించారు.
  • గౌణావతారములు ఆరాధన యొగ్యమని భావించడం ఒక అడ్డంకి. గౌణావతారములలో పరశురామ, కార్తవీర్యార్జున వంటి ఆవేశ అవతారములు కూడా ఉన్నాయి. ఆ రూపాలను భగవాన్ అవతారాలుగా గౌరవించాలి. కానీ వారిని ముమ్ముక్షువులు పూజించరాదు. దయచేసి రామానుజ నూఱ్ఱందాది పాసురం 56 “కోక్కుల మన్నరై మూవెళుకాళ్”  (వ్యాఖ్యానం చూడండి). అనువాదకుల గమనిక: భగవాన్ కొన్ని కార్యాలను సంపన్నం చేయడానికి తన శక్తిని కొన్ని జీవాత్మలకిస్తాడు, అలాంటి జీవాత్మలు పూర్తిగా సాత్విక ప్రవృత్తితో ఉండకపోవచ్చు, ముముక్షులు వాళ్ళను ఆరాధించకూడదు. మణవాళ మాముణులు వ్యాఖ్యానంలో ఈ ప్రశ్నను లేవనెత్తి అలాంటి అవతారాలు వారు సాధించిన కర్యానికై వారిని గౌరవించాలి, కానీ అంతకు మించి ఆరాధించకూదదు అని వివరిస్తున్నారు. అదేవిధంగా పరశురాముని కీర్తింపజేసిన ఇతర ఆళ్వారుల పాసురములను కూడా వారు తెలియజేస్తున్నారు.
  • అర్చావతార భగవానుడిని అసమర్థునిగా పరిగణించడం ఒక అడ్డంకి. అర్చా రూపంలో వివిధ సన్నిధులలో ఉన్న భగవాన్ తన అర్చకుని (ఆరాధకుడు) పై పూర్తిగా ఆధారపడతానని ప్రతిజ్ఞ చేసాడు. ఆ ప్రతిజ్ఞను అతని అసమర్థతగా పరిగణించలేము. భగవాన్ యొక్క ఆధిపత్యం అతని అర్చా స్వరూపాల్లో కూడా సంపూర్ణంగా ఉందని మన ఆచార్యులు వివరించారు. అనువాదకుల గమనిక: ప్రతి ఒక్కరినీ ఉద్ధరించాలనే అత్యున్నత సంకల్పంతో భగవాన్  అర్చా రూపంలో ఉన్నారని మనము ఇప్పటికే చూశాము. అతను ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా సంభాషించకపోవడం, అతని అవసరాలను/కోరికలను ఆజ్ఞాపించకపోవడం వల్ల, అతను అసమర్థుడు అని మనము అనుకోకూడదు. అర్చావతార భగవానుడు గొప్ప మహాంతులతో / భక్తులతో మాట్లాడే అనేక ఉదాహరణలు ఉన్నాయి. దేవ పెరుమాళ్ తిరుక్కచి నంబితో తరచూ సంభాషించడం చరిత్ర ఆధారంగా ప్రసిద్ధి చెందిన వాస్తవము.
  • భగవాన్ యొక్క అవతారమైన ఆచార్యునిపై పూర్తి విశ్వాసం ఉండకపోవడం ఒక అడ్డంకి. “ఆచార్య స హరిః సాక్షాత్” – ఆచార్యుడు భగవాన్ అవతారమని పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. భగవాన్ యొక్క 5 ప్రకారములు (స్వరూపాలు) పైన, ఆచార్య స్వరూపం 6 వ రూపంగా పరిగణించబడుతుంది. అనువాదకుల గమనిక: దయచేసి ఈ అంశంపై పూర్తి అవగాహన కోసం అంతిమోపాయ నిష్ఠ (http://ponnadi.blogspot.in/p/anthimopaya-nishtai.html) చూడండి.
  • పరత్వం (పరమపదంలో పరవాసుదేవుడు) కంటే అవతారాములు ఉన్నతమైనవని తెలియకపోవడం ఒక అడ్డంకి. పరమపదంలో, అతని ఆధిపత్యం మాత్రమే గొప్పగా గోచరిస్తుంది. భగవాన్ శ్రీ రామ, కృష్ణ, మొదలైనవారిగా దిగివచ్చినప్పుడు, అతని సమస్థ కల్యాణ గుణములన్నీ కాంతివంతంగా ప్రకాశిస్తాయి. ఈ విధంగా మనం పరత్వం కంటే అవతారముల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. అనువాదకుల గమనిక:  దుఃఖ సాగరంలో ఉన్న జీవాత్మలకు సహాయం చేయడానికి గొప్ప కృపతో భగవాన్ ఈ సంసారంలో జన్మిస్తాడు. అందుకే ఋగ్వేదంలో “స ఉ శ్రేయాన్ భవతి జాపమానః” – అతను పరమపదం నుండి సంసారానికి దిగివచ్చినప్పుడు అతను మరింత ప్రశంసనీయుడౌతాడు. అలాగే, అతను పరమపదం నుండి సంసారానికి దిగివచ్చినప్పుడు తన పవిత్ర గుణాలు ఏమాత్రం తరగవు, అదే దివ్య రూపంతో దర్శనమిస్తాడు. ఈ సూత్రాన్ని తిరువాయ్మొళి  5.3.5 లో నమ్మాళ్వార్ అందంగా వివరించారు – “ఆధియం చోతి ఉరువై అంగు వైతు ఇంగుప్ పిఱంతు” – భగవాన్ నిత్యమైనవాడు, పరంపదంలో అత్యంత ఆకర్షణీయమైన రూపంతో దర్శనం ఇచ్చినట్టే ఈ  ప్రపంచంలో కూడా  ప్రత్యక్షమౌతాడు.
  • ఆచార్యుల దివ్య తిరుమేని / స్వరూపం భగవాన్ అవతారంగా వివరించబడినప్పటికీ భౌతికమని పరిగణించడం ఒక అడ్డంకి.  అనువాదకుల గమనిక:  శిష్యుడు భగవాన్ ను చేరుకోవడానికి సహాయపడేవాడు ఆచార్యుడు అని అర్థం చేసుకోవాలి. ఇది గొప్ప కరుణతో, ఆచార్యలు తన బోధనలు మరియు ప్రవర్తన/ఆచరణ ద్వారా అందరికీ నిజమైన జ్ఞానాన్ని వివరిస్తారు. అలాంటి ఆచార్యులను శిష్యులు గౌరవించి, కీర్తించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/11/virodhi-pariharangal-42.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 41

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/11/15/virodhi-pariharangal-40/

72. తత్వ విరోధి  – యథార్థము / వాస్తవికతను అర్థం చేసుకోవడంలో అవరోధాలు – రెండవ భాగం

పిళ్ళై లోకాచార్యులు, మణవాళ మాముణులు – శ్రీపెరుంబుతూర్

మనము  తత్వ విరోధి యొక్క ఈ భాగంలో ముందుకు వెళదాము. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి చాలావరకు లోతైన జ్ఞానం, అవగాహన అవసరం, అది క్రమబద్ధమైన శాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా పొందవచ్చు. పూర్తి మరియు లోతైన అవగాహనకై, జ్ఞానుల ద్వారా ఈ సూత్రాలను నేర్చుకోవడం మంచిది.

  • మన అణ్డం (విశ్వం) మరియు వేరే ఇతర అండాల (విశ్వాలు) లో తత్వం యొక్క అన్ని మార్పులు / పరివర్తనలు ఒక చేతన యొక్క సంకల్పం వల్ల జరుగుతుంది అని తెలియకపోవడం ఒక అడ్డంకి. మన విశ్వంలో అనేక అచిత్తులు, ఈ విశ్వం బయట ఉన్న ఇతర విశ్వాలు (ఈ భౌతిక విశ్వాలన్నింటినీ కలిపి లీలా విభూతి (సంసారం) అంటారు) పరమ చేతనుడు (భగవాన్ – శ్రీమన్నారాయణ) యొక్క సంకల్పం ఆధారంగా రూపాంతరం / మార్పు చెందుతాయి. ఛాందోగ్య ఉపనిషత్తులో ఇలా వివరించబడింది, “తదైక్షత – బహుస్యాం ప్రజాయేయేతి” – నా భిన్న భిన్న అభివ్యక్తములను చూద్దాం.  అనువాదకుల గమనిక: అత్యున్నత చెతనుడైన (అత్యున్నత  జ్ఞానుడైన) భగవాన్ యొక్క సంకల్పం ప్రకారం సృష్టి జరుగుతుంది.  “నిత్యో నిత్యానాం చేతనస్ చేతనానాం” – సమస్థ నిత్యులలో నిత్యుడు, సమస్థ జ్ఞానులలో మహా జ్ఞానుడు అని అర్థం. అనేక సందర్భాలలో  “బహు స్యాం” అని సూచించబడింది, భగవాన్ యొక్క సంకల్ప ఫలితం శ్రుతి అని స్థాపించబడింది. తిరువాయ్మొళి 3.2.1 లో, నమ్మాళ్వారులు ఇలా వివరిస్తున్నారు,  “మున్నీర్ జ్ఞాలం పడైత్త ఎం ముగిల్వణ్ణనే…” – మేఘం లాంటి వాడు (నలుపు వర్ణంతో,  కృపా స్వభావం గలవాడు)! – మూడు రకాల నీటిని కలిగి ఉన్న ఈ విశ్వాన్ని సృష్టించావు నీవు. నంపిళ్ళై ఇక్కడ నమ్మాళ్వార్ యొక్క ఉత్కృష్ఠమైన భావాలను వెల్లడి తెస్తున్నారు. ఈ విశ్వాన్ని సృష్టించినందుకు ఆళ్వారులు భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని, అందువల్ల తనతో సహా జీవాత్మలందరికీ తగిన శరీరాలు, ఇంద్రియాలు మొదలైనవి పొందారని, దానితో వారు ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది, చివరికి వాళ్ళు ఉద్ధరించబడతారని తెలుపుతున్నారు. అయినప్పటికీ, కేవలం భౌతిక కోరికలను తీర్చడానికి శరీరం ఉపయోగించబడుతున్నందున, అలాంటి అవకాశం వృధా అవుతుందని ఆళ్వారులు బాధను వెల్లడి చేస్తున్నారు. దీని నుండి, భగవాన్ యొక్క దివ్య చిత్తాన్ని మనం అర్థం చేసుకోవచ్చు,  జీవాత్ములందరి అభ్యున్నతికి ఈ సృష్టి దోహదపడుతుందని మనం అర్థంచేసుకోవచ్చు.
  • జగత్ (విశ్వం) పరిణామం (మార్పు) అధ్వారక భగవద్ సంకల్ప అధీనం (భగవత్ సంకల్పం యొక్క ప్రత్యక్ష నియంత్రణ) అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంతకుముందు వివరించినట్లుగా, సృష్టి రెండు రకాలు అని మనం చెప్పుకున్నాము – అధ్వారక సృష్టి మరియు సధ్వారక సృష్టి. అధ్వారక సృష్టి అనేది సూక్ష్మ పదార్థాన్ని స్థూల పదార్థంగా (విశ్వాల సృష్టి వరకు) మార్చే మొదటి దశ, ఇది స్వయంగా భగవాన్ చేత సృష్టించబడుతుంది. భగవాన్ చేత బ్రహ్మ ద్వారా వివిధ రకాలైన రూపాలు / జాతులు సృష్టించబడతాయి. అదేవిధంగా, సంహార సమయంలో కూడా, పరోక్షంగా భగవాన్ రుదృడు, అగ్ని మొదలైనవారి ద్వారా విశ్వంలోని వివిధ రూపాలను / జాతులను నాశనం చేయబడతాయి. తుదకు, వారు స్వయంగా సమస్థ స్థూల పదార్థాలను తనలో లీనం చేసుకొని వాటిని సూక్ష్మ రూపంగా మారుస్తాడు. ఈ చక్రం అలా మళ్లీ మళ్లీ కొనసాగుతుంది.
  • సమస్థ అస్తిత్వాలు భగవదాత్మకం (అందరిలో అంతరాత్మగా వ్యాపించి ఉన్న పరమాత్మ) అని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. ఇది నారాయణ సూక్తం నుండి స్పష్టమౌతుంది – “అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్తితః” – నారాయణుడు అన్నింటి లోపల మరియు బయటి వ్యాపించి ఉండి అన్నింటినీ ఒక్కటిగా పట్టుకుని ఉన్నాడు, “సర్వభూతాంతరాత్మా” – సమస్థ అస్తిత్వాలలో నివసించే ఆత్మ అని అర్థం.  అనువాదకుల గమనిక: బ్రహ్మం (భగవాన్) అస్తిత్వమున్న ప్రతిదానిలో నివసించి ఉన్న ఆత్మ. భూత అనే పదము “భూ సత్తాయం” (అస్తిత్వం ఉన్న) నుండి ఉద్భవించింది. అస్తిత్వమన్నది ఏదైనా భగవాన్ నియంత్రణలో ఉంటుంది. అంతర్యామిగా ఉండటం ద్వారానే ప్రతి అస్తిత్వము ఉనికిలో ఉంటుంది. శాస్త్రం ఇలా చెబుతుంది “యస్య ఆత్మా శరీరం, యస్య పృత్వి శరీరం, …” – బ్రహ్మానికి శరీరం జీవాత్మ, బ్రహ్మానికి శరీరం పృథ్వీ…. ఇదే సూత్రము నమ్మాళ్వార్ తిరువాయ్మొళి  1.1.10లో వివరించారు,  “పరంద తణ్ పరవైయుళ్ నీర్ తొఱుం పరందుళన్ పరంద అండ ఇదెన నిల విసుంబు ఒళివఱ కరంద సిల్ ఇడం తొఱుం ఇడం తిగళ్ పొరుళ్ తొఱుం కరన్దెంగుం పరందుళన్ ఇవై ఉణ్డ కరనే” – సముద్రపు చల్లని నీటి బిందువులలో హాయిగా భగవాన్ ఎలా ఉంటారో అంతే హాయిగా విశాల విశ్వంలో కూడా ఉంటారు.
  • భగవాన్ చేత వ్యాపించబడి ఉన్నందున అన్ని తత్వాల ఉపయుక్తమైనవి అని తెలియక పోవడం ఒక అడ్డంకి. అన్ని తత్వాలు (చేతనా చేతనములు) భగవాన్ చేత విస్తరించబడి ఉన్నందున, అవి ఉపయుక్తకరమైనవిగా  ఉంటాయి.
  • మనం శరీరమన్న భ్రమ కారణంగా కొన్ని అంశాలు అననుకూలమైనవిగా గోచరిస్తాయని తెలియకపోవడం ఒక అడ్డంకి. శరీరాన్ని ఆత్మగా భావించే మన అజ్ఞానం వల్లనే కొన్ని సందర్భాలలో ప్రతికూల భావనకు దారితీస్తుంది. అనువాదకుల గమనిక: ఇది మునుపటి వివరణకు సంబంధించినది. దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం. జీవాత్మ యొక్క స్వభావాన్ని నిజంగా గ్రహించిన వ్యక్తికి జీవాత్మ స్వాభావికంగానే పరమానందకరమైనదని తెలుస్తుంది. ఈ సూత్రాన్ని పిళ్ళై లోకాచార్యులు చేత తత్వ త్రయం, సుత్రాలు 73 నుండి 76 వరకు అందంగా వివరించబడింది, మాముణులు తమ వ్యాఖ్యానంలో విస్తృతంగా వివరించారు. సుత్రాలు 73 లో,  వికసించిన నిజమైన జ్ఞానం ఆనందానికి దారితీస్తుంది, ఇది జీవాత్మ స్వభావానికి అనుకూలంమైనదని వారు వివరిస్తున్నారు. తరువాతి సూత్రంలో విషము, ఆయుధాలు మొదలైనవి ఆత్మతో శరీర భ్రమ కారణంగా అననుకూలమైనవిగా కనిపిస్తాయని వారు వివరించారు. మూడు కారణాల వల్ల మనము విషం మొదలైన వాటికి భయపడతామని మాముణులు వివరిస్తున్నారు – 1.) తానూ శరీరం ఒకటేనని భావించి,  ఏదైనా శరీరాన్ని హానిచేసేది తనకు (ఆత్మకు) కూడా హాని చేస్తుందని భావించడం; 2.) మన ఆలోచన విధానమును ప్రభావితం చేసే మన కర్మ (ఇది విషము, ఆయుధం మొదలైన వాటిలో భయం కారణానికి అనుసంధానమైన). 3) మన శరీరంలో వ్యాపించి ఉన్న భగవానుడు, విషము, ఆయుధంలో కూడా వ్యాపించి ఉన్నాడనే  వాస్తవిక జ్ఞానం లేకపోవడం. తరువాతి సూత్రంలో, అన్ని వస్తువులు భగవాన్ చేత విస్తరించి ఉన్నందున, అవి సహజంగానే అనుకూలంగా ఉంటాయి, అవి అననుకూలమైనవి అనే భావన ప్రమాదకరం అని ఆయన వివరించారు. మాముణులు వివిధ ప్రామాణాలను ఉదహరించి ఈ సూత్రాన్ని స్థాపించారు (వాటిలో కొన్నింటిని ఇప్పటికే చూశాము). చివరగా, పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని చక్కని ఉదాహరణలతో వివరిస్తున్నారు. 74 వ సూత్రంలో, “ఒక వస్తువు అనుకూలంగా ఉండటానికి ఈ కారణం (అవి భగవాన్ చేత వ్యాపించబడటం మినహా)  కాక వేరే కారణం ఉంటే, ఒక నిర్దిష్ట సమయంలో ఒక వ్యక్తికి అనుకూలంగా ఉండే గంధపు లేహ్యం, పువ్వులు మొదలైనవి  అదే వ్యక్తి వేరే సమయంలో / స్థలంలో  ఉన్నప్పుడు ఆ వస్తువులు అననుకూలమైనవి అవుతాయి, కానీ అదే ప్రదేశంలో మరొక వ్యక్తికి అనుకూలమైనవి అవుతాయి – అలా ఉండకూడదు”. మాముణులు దీన్ని చక్కగా వివరిస్తున్నారు. ఒక వ్యక్తికి, శరీర వేడిని తగ్గించడానికి చందనం లేహ్యం అనుకూలమైనది. కానీ అదే వ్యక్తి, చల్లగా ఉన్నప్పుడు, అ చందనం లేహ్యం అననుకూలమైనదిగా ఉంటుంది. అదేవిధంగా, వేసవిలో ఆరోగ్యమైన వ్యక్తికి, గంధపు  లేహ్యం అనుకూలమైనది, కానీ అదే స్థితిలో, మరొక వ్యక్తి జ్వరంతో బాధపడుతుంటే, అదే చందనం అననుకూలమైనది అవుతుంది. కాబట్టి, చందనం లేహ్యం యొక్క చల్లని స్వభావం  అనుకూలమైనదో కాదో అదే నిర్ణయించదు – కాని దాన్ని స్వీకరించే వ్యక్తి యొక్క శారీరక స్థితి ద్వారా తీర్మానించబడుతుంది. కాబట్టి,  అది గంధపు చెక్కతో వ్యాపించి ఉన్న అనుకూల స్వభావం ఉండటం మరియు అనుకూలమైన స్వభావం కలిగిన శరీరంతో తనను తాను అనుబంధించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. భగవత్ శరీరం అనేదానిపై మనకు నిజమైన అవగాహన ఉన్నప్పుడు – వారు ఏ శారీరక పరిస్థితుల్లో ఉన్నా స్వాభావికంగానే ఆనందంగా ఉంటారు.
  • నిత్య బ్రహ్మం (నిత్య భగవానుడు) యొక్క నిత్య ఇచ్ఛ (శాశ్వతమైన కోరిక) వల్ల నిత్య విభూతి (నిత్య  ఆధ్యాత్మిక ప్రపంచం) నిత్యమైనదని తెలియకపోవడం ఒక అడ్డంకి. నిత్య విభుతి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం – శ్రీ వైకుంఠం. భౌతిక క్రియాకలాపంలోని భాగంగా సృష్టించబడిన లీలా విభూతిలో ఎల్లప్పుడూ సృష్ఠి నాశనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా, ఇది ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతంగా ఉన్నందున, దీనిని నిత్య విభుతి అంటారు. దీనికి ప్రాథమిక కారణం భగవత సంకల్పం. అనువాదకుల గమనిక: ఆధ్యాత్మిక ప్రపంచమైన  పరమపదం గురించి వివిధ సాహిత్యాలలో వివరించబడింది. విష్ణు సూక్తం “తద్ విష్ణోర్ పరమం పదం సదా పశ్యంతి సూరయః” – విష్ణు వారి నివాసంలో నిరంతరం నిత్య సూరులతో కనిపిస్తారు. లింగ పురాణం “వైకుంఠేతు పరే లోకే ….ఆస్తే విష్ణుర్ అచింత్యాత్మా” – ఉభయ దేవేరులతో శ్రీమన్నారాయణను వారి భక్తులు నిత్యం సేవిస్తుంటారు.  ఆళవందారులు తమ స్తోత్రరత్నంలో  శ్రీ వైకుంఠం యొక్క సౌందర్యాన్ని వివరించారు. ఎమ్పెరుమానార్ శ్రీ వైకుంఠ గద్యంలో ఇదే విషయాన్ని వివరించారు. ఈ పరమపదం శ్రీమన్నారాయణుడి యొక్క నిత్య ఆధ్యాత్మిక నివాసంగా వివరించబడింది.
  • అప్రాకృత అచిత్ (దివ్య పదార్థం) యొక్క పరివర్తనలు భగవద్ సంకల్పంతో జరుగుతుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. పరమపదంలో కనిపించే అచిత్ తత్వం మన భౌతిక ప్రపంచంలో ఉన్న వాటిలా ఉండదు. అది శుద్ధ సత్వమైన (స్వచ్ఛమైనది) దివ్య పదార్థం. భగవాన్ కోరిక ఆధారంగా, వివిధ రూపాలను ధరిస్తుంది. అనువాదకుల గమనిక: పరమపదం గురించి ఈ సూత్రాలను పిళ్ళై లోకాచార్యులు తత్వ త్రయంలో చాలా వివరంగా వివరించారు. సరైన మార్గదర్శకత్వంలో అధ్యయనం చేయడం మంచిది.
  • ఐదు మూలకాలతో కూడిన సూక్ష్మ, స్థూల స్థితులు, భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగా పరమపదంలోని దివ్య తత్వాలు ఉండవని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. ఈ దివ్య తత్వం పంచ ఉపనిషద్దులతో (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 మూలకాలతో తయారైన భౌతిక ప్రపంచంలా కాకుండా) తయారు చేయబడిందని అంటారు. కాబట్టి, అవి భౌతిక ప్రపంచంలో కనిపించే పదార్థంతో సమానం కాదు. అనువాదకుల గమనిక: భౌతిక ప్రపంచంలో జీవాత్మ  స్వభావాన్ని విషయం కప్పివేస్తుంది, అది జీవాత్మలో అజ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. కానీ పరమపదం యొక్క దైవీక తత్వాలు జ్ఞానాన్ని సులభతరం చేస్తుంది, అక్కడ ఉన్న జీవాత్మలకూ మరింత ఆనందాన్నిస్తుంది.
  • భగవాన్ యొక్క దివ్య రూపాలు, దివ్య తత్వాలతో (ఇది పంచ ఉపనిషద్లతో తయారు చేయబడినవి) కూడినవని తెలియకపోవడం  ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: సాధారణంగా  భగవాన్ యొక్క దివ్య రూపాలు 5 వర్గాలలో వివరించారు – పర, వ్యూహ, విభవ, అర్చా, అంతర్యామి. దీన్నిhttp://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.htmlలో వివరంగా వివరించబడింది. ఈ ఐదు సందర్భాల్లో, భగవాన్ రూపం ఉన్నచోట, అది దైవీక తత్వముతో తయారైందని మనం అర్థం చేసుకోవాలి. ఈ వివరణతో ప్రారంభించి, ఈశ్వర తత్వం (భగవాన్), వారి రూప గుణాలను అర్థం చేసుకోవడం వైపు దృష్టి మారుతుంది.
  • భగవాన్ యొక్క ఈ రూపాలు వారి 6 ప్రధాన గుణాలను వెల్లడి చేస్తాయని తెలియకపోవడం ఒక అడ్డంకి. దివ్య తత్వాలతో తయారైన ఈ రూపాలు భగవాన్ యొక్క నిజమైన గుణాలను వెల్లడిస్తాయి, మన జ్ఞానాన్ని పెంచుతాయి. ఆరు ప్రధాన లక్షణాలు ఉన్నాయి – జ్ఞానం, బలం, వీర్యం (శౌర్యం), ఐశ్వర్యం (సంపద, అందరినీ నియంత్రించే సామర్థ్యం), శక్తి, తేజస్సు (అందం / ప్రకాశం). ఇతర భగవాన్ గుణాలన్నీ ఈ 6 గుణాల నుండి ఉద్భవించినవే. అనువాదకుల గమనిక: భగవాన్ అంటే ఈ ఆరు లక్షణాలు సంపూర్ణగా కలిగి ఉన్నవాడు (ముందు వివరించినట్లు). ఈ విధంగా, ఈ ఆరు గుణాలు పూర్తిగా ఉన్న శ్రీమన్నారాయణను మాత్రమే భగవాన్ అని పిలవబడే అర్హత ఉన్నవాడు. ఇతర వ్యక్తిత్వాలను భగవాన్ (పరాశర భగవాన్, వ్యాస భగవాన్ మొదలైనవారు) అని పిలువడం ఇది కేవలం వారి ప్రశంసగా మాత్రమే కాని అసలు అర్థంతో కాదు – ఎందుకంటే ఈ లక్షణాలను పూర్తిగా మరెవరొ లోనూ లేవు. భగవాన్ యొక్క దివ్య రూపాలు అతని అంతర్లీన గుణాలను వ్యక్తపరుస్తాయి.
  • భగవాన్ మరియు నిత్యసూరులు ఒకే వర్గానికి చెందినవారని తెలియకపోయినా (విముక్తి చెందిన ఆత్మలు), భగవత్ స్వరూపం దివ్య తేజస్సుగల స్వరూపం కారణంగా ఇది వర్గీకరణపరంగా అసాధారణమైనది అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనంత, గరుడ, విశ్వక్సేనుడు మొదలైనవి నిత్య విముక్తులు.  వర్ణ భేదాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగా వాళ్ళల్లో ఆ తేడాలు ఉండవు. వీళ్ళ స్వరూపాలు కూడా అసాధారణమైనవి. వారి శరీరాలు / రూపాలు దైవిక తత్వాలతో తయారైనందున, వారు చేసే భిన్న భిన్న కైంకార్యాధారంగా వారు వర్గీకరించ బడతారు.  ఉదాహరణకు, అనంతుడు ఒక సర్ప రూపాన్ని ధరిస్తాడు, గరుడ ఒక పక్షి రూపాన్ని వహిస్తాడు, అలాగే విశ్వక్సేనుడు మానవ రూపాన్ని ధరిస్తాడు. గజముక (ఏనుగు ముఖం గల వ్యక్తి), సింహాముక (సింహ ముఖం గల వ్యక్తి), మగ సేవకులు, ఆడ సేవకులు మొదలైనవారు కూడా ఉంటారు. కానీ  స్థ్రీ పురుష సంబంధం (దేహ సౌదర్యం మొదలైనవాటికి సంబంధించిన) ఈ సంసారంలో ఉన్నట్లుగా అక్కడ ఉండదని గమనించాలి. అనువాదకుల గమనిక: ముఖ్యమైన కైంకర్యాలకై, నిత్యసూరులు వివిధ రూపాలను ధరిస్తారు. పరమపదంలోని అన్ని “తత్వాలు” దైవీకమైనవని, ఈ సంసారంలో కనిపించే తత్వాలకు భిన్నమైనవని ఇంతకు ముందే చూశాము. అలాగే, నిత్యసూరులు కూడా  భగవానుడికి భిన్నమైన వారని అర్థం చేసుకోవాలి –  నిత్యసూరులు జీవాత్మలు అయితే, భగవాన్ పరమత్మ. భగవాన్ యొక్క దివ్య సంకల్పం ద్వారా, నిత్యసూరులు నిత్య ముక్తులుగా సృష్ఠించబడ్డారు. భగవత్ స్వరూపం అత్యంత తేజస్సుతో ప్రకాశించేదిగా మరియు మేలిమి బంగారు రూపంగా ఉంటుందని ఛాందోగ్య ఉపనిషత్తులో వివరించబడింది.
  • భగవాన్ తమ అవతార (వరాహ, నరసింహ, శ్రీ రామ, కృష్ణ మొదలైన) రూపాలలో కూడా దివ్య తత్వాలతో (పరమపదంలో ఉన్నట్లు) కూడి ఉంటారు.  భగవాన్ దివ్య సంకల్పం చేత శివుడు మొదలైన వాళ్ళు వారి (భౌతిక) రూపాలు / శరీరాలు పొందుతారు, భగవాన్ యొక్క దివ్య స్వరూపాన్ని “సాధారణ తత్వం” గా పరిగణించడం ఒక అపరాధం. అతని ఆర్చావతార రూపాలను  ఇఛ్ గృహీత అప్రాకృత దివ్య మంగల విగ్రహం అని పిలుస్తారు – తమ కోరిక మేరకు దివ్య మంగళ రూపాన్ని ధరిస్తారు. ఈ రూపాలు మానవుడిలా కనిపిస్తున్నప్పటికీ, అవి ఒకే తత్వంతో తయారు చేయబడినవి కావు.  అనువాదకుల గమనిక: భగవద్గీత యొక్క 4 వ అధ్యాయంలో, భగవాన్ అనేక స్లోకాములలో తన అవతార రహస్యాన్ని బహిర్గతం చేయడం మనం ఇప్పటికే చూశాము. ఆయన స్వయంగా భగవద్గీత 4.9 లో ఇల ఉపదేశించారు – “జన్మ కర్మ చ మే దివ్యం” – నా జన్మ, లీలలు అలౌకికమైనవి అని అర్థం. భగవాన్ స్వయంగా గీత 9.11 లో “అవజానంతి మాం మూడా…” – నా ఆధిపత్యాన్ని అర్థం చేసుకోని మూర్ఖులు నన్ను మానవునిగా భావిస్తారు (నా అవతారాల సమయంలో) నన్ను అవమానిస్తారు అని ఉపదేశిస్తున్నారు. పిళ్ళై లోకాచార్యులు, తమ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, సుత్రాలు 303 మరియు 304 లలో భగవత్ అపాచారము గురించి వివరించారు. భగవాన్ తమ ఇష్టం ప్రకారం ఈ దివ్య రూపాలను ధరిస్తారు. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన ఇతర దేవతలు, వాళ్ళు అనేక పుణ్యకర్మలు చేసిన జీవాత్మలు అని వివరిస్తున్నారు. కాబట్టి, భౌతిక ప్రపంచంలో అటువంటి శక్తివంతమైన పదవులను చేపట్టడానికి జీవాత్మల కర్మలు మరియు భగవత్  సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది.
  • సమస్థ చిత్ (జీవాత్మలు – ఆత్మలు) మరియు అచిత్తులతో (పదార్థం) కూడినది భగవాన్ శరీరం అని తెలియకపోవడం ఒక అడ్డంకి. “సర్వం విష్ణుమయం జగత్” – విశ్వంలో కనిపించే వాటన్నిటిలో విష్ణువు వ్యాపించి ఉన్నాడు, భగవాన్ అంతరాత్మ – కాబట్టి ప్రతిదీ శ్రీమన్నారాయణ శరీరంలోని భాగం అని వివరించబడింది. అనువాదకుల గమనిక:  దీనిని ఇప్పటికే మనం నారాయణ సూక్తంలో “అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః”, శ్రీ రామాయణ శ్లోకం “జగత్ సర్వం శరీరం తే” – సర్వం వ్యాపించి ఉన్నవాడు విష్ణువు – కాబట్టి శ్రీమన్నారాయణుడు అన్నింటిలో నివసించే అంతరాత్మ అని అర్థం.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/10/virodhi-pariharangal-41.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org