విరోధి పరిహారాలు – ముగింపు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/05/01/virodhi-pariharangal-46/

ఎమ్పెరుమానార్, వంగి పురత్తు నంబి

పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, మణవాళ మాముణులు

ఇప్పటి వరకు, ఈ అద్భుతమైన గ్రంథంలో వివరించిన అన్ని అడ్డంకులను చాలా వివరంగా చూశాము. ఇప్పుడు మనం అన్ని అడ్డంకులను, ఆ అడ్డంకులు తొలగితే లభించే ఫలితాలను తెలియజేసే చివరి విభాగం చూద్దాము.

 1. సంసారంపైన (ఇల్లు, భార్య, పిల్లలు మొదలైనవి) వ్యామోహం వదులుకుంటే, స్వర్గానికి చేరుకుంటాము. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 2. ఈ లౌకిక గ్రహాలలో భౌతిక సుఖ కోరికలు తొలగించబడినప్పుడు, వారికి  స్వర్గ సుఖాలు పొందాలనే కోరిక ప్రారంభిస్తారు. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 3. స్వర్గ సుఖాలు పొందాలనే కోరిక తొలగిన్నప్పుడు, వారికి స్వయం సాక్షాత్కారం అవుతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 4. స్వర్గ సుఖాలపై ఆసక్తి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్న తరువాత, వారు ఆత్మానుభవం పొందడం ప్రారంభిస్తారు.    https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 5. ఆత్మానుభవముపై  ఆసక్తి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్న తరువాత, వారు భగవత్ అనుభవం పొందడం ప్రారంభిస్తారు.      https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 6. ఆత్మానుభవ కోరికలు తొలగిన్నందున, భగవత్ అనుభం కోసం కోరిక ప్రారంభమవుతుంది.    https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 7. జ్ఞానం / ఆనందంతో నిండి ఉన్న ఒక అత్యున్నత తత్వంగా బ్రహ్మ అన్న భావన నుండి దూరమైనపుడు,  మన హృదయం భగవాన్ యొక్క అనేక దివ్య గుణాలను ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 8. భగవత్ సౌదర్యం నుండి మన దృష్ఠి మరలించినపుడు, మన భగవత్ శేషత్వం వృద్ధి చెందుతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 9. భగవత్ శేషత్వం పట్ల రుచి తగ్గినపుడు, భాగవతుల పట్ల దాసత్వం వృద్ధి చెందుతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/02/10/virodhi-pariharangal-1
 10. కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు ఉపాయాలు అన్న అపోహ తొలగినప్పుడు, భగవానుడు ఏకైక ఉపాయం అన్న విశ్వాసం మరింత దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/20/virodhi-pariharangal-2/
 11. ఉపాయాంతరములు అతి కష్టమైన స్వయం ప్రయత్నాలు అని,  ఫలితం తొందరగా పొందలేమని అర్థం చేసుకున్నప్పుడు, ప్రపత్తి (శరణాగతి)పై విశ్వాసం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/20/virodhi-pariharangal-2/
 12. అగ్ని, ఇంద్రుడు మొదలైన  దేవతాంతరముల పట్ల మన దాస్య కోరిక తొలగినపుడు, భగవాన్ పట్ల మన దాస్య కోరిక మరింత దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/20/virodhi-pariharangal-2/
 13. దేవతాంతరముల సేవ మానుకోవాలి అని గ్రహించినపుడు,  జీవాత్మ యొక్క సహజ స్వరూపమైన భగవత్ సేవ అతనిలో / ఆమెలో ఉదయిస్తుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/20/virodhi-pariharangal-2/
 14. తమ శరణాగతి  ఉపాయం (మాధ్యమం) కాదని స్పష్టంగా అర్థం చేసుకున్న తరువాత, భగవాన్ ఉపాయం అని అర్థం చేసుకుంటాడు. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/20/virodhi-pariharangal-2/
 15. శాస్త్రంలో సూచించిన కార్యాలలో పాల్గొన్నపుడు (స్వతంత్రంగా), సాధనాంతరములు (కర్మ, జ్ఞాన, భక్తి యోగం) ఫలిస్తాయి. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/20/virodhi-pariharangal-2/
 16. తనను తాను (స్వతంత్రంగా) ఉద్ధరించుకోవాలనే ఆసక్తి  తొలగినపుడు, మనలో సిద్దోపాయం (భగవానుడు ఉపాయమని) దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/20/virodhi-pariharangal-2/
 17. ఉపాయం (మాధ్యమం) లోని అడ్డంకి తొలగినపుడు, మనలో భగవాన్ ఉపాయమన్న భావన  దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/26/virodhi-pariharangal-3/
 18. ఉపేయం (లక్ష్యం) లోని అడ్డంకి తొలగినపుడు,  భగవాన్ (కైంకర్యం) మాత్రమే అత్యున్నత లక్ష్యం అన్న భావన https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/26/virodhi-pariharangal-3/
 19. ఉపేయం (లక్ష్యం) లోని మూడు ప్రధాన అడ్డంకులు తొలగినపుడు, భగవానుడికి అపరిమితమైన, శాశ్వతమైన మరియు అత్యంత ఆనందకరమైన కైంకర్యం చేయాలనే అంతిమ లక్ష్యం మనలో దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/26/virodhi-pariharangal-3/
 20. మూల ప్రమాణాలని అర్థం చేసుకోవడంలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, శాస్త్రం  విశ్వాసం మనలో  దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/27/virodhi-pariharangal-4/
 21. జీవాత్మను నిరంతరం వెంబడిస్తున్న అడ్డంకి శాశ్వతంగా తొలగినపుడు, నిజమైన ఆత్మ స్వభావం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/27/virodhi-pariharangal-4/
 22. శాశ్వతమైన అడ్డంకి తొలగినపుడు, ప్రాపంచిక సుఖాల పట్ల నిర్లిప్తత తనలో దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/27/virodhi-pariharangal-4/
 23. తాత్కాలికమైన అడ్డంకులు తొలగినపుడు, శాశ్వతమైన ఆనందం దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/27/virodhi-pariharangal-4/
 24. జీవాత్మ యొక్క యదార్థ స్వరూపం యొక్క అడ్డంకి తొలగినపుడు, జీవాత్మను భగవానుడు పూర్తిగా ఆనందించాలని  మనసుపూర్వకంగా అర్థం చేసుకుంటారు. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/03/27/virodhi-pariharangal-4/
 25. పరమాత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో అడ్డంకి తొలగినపుడు, భగవత్  పారతంత్రియం (ఆధారపడుట) మనలో దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/17/virodhi-pariharangal-5/
 26. తన సుఖం అన్న వైఖరి తొలగినపుడు, తన పట్ల నిరసక్తి దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/17/virodhi-pariharangal-5/
 27. భగవాద్ ఆనందం యొక్క అడ్డంకి తొలగినపుడు, నియంత్రించాలనే కోరిక పట్ల నిర్లిప్తత దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/17/virodhi-pariharangal-5/
 28. భగవానుడి‌తో  ఐక్యత యొక్క అడ్డంకి తొలగినపుడు, భగవానుడిని చేరుకోవడం సులభ సాధ్యమన్న భావన దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/17/virodhi-pariharangal-5/
 29. భగవత్ విరహ అడ్డంకి తొలగినపుడు, భగవానుడి‌తో సుదీర్ఘ ఐక్యతా భావన దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/17/virodhi-pariharangal-5/
 30. ప్రాపంచిక సుఖాల యొక్క అడ్డంకి తొలగినపుడు, ఇంద్రియాలపై నియంత్రణ / విజయం దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/21/virodhi-pariharangal-6/
 31. విశ్వాసంలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, అత్యున్నత విశ్వాసం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/21/virodhi-pariharangal-6/
 32. తమ ప్రవృత్తిలోని అడ్డంకి తొలగినపుడు, భగవాన్ యొక్క ఆనందంపై దృష్టి కేంద్రీకరించే కార్యాలు దృఢమౌతాయి. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/21/virodhi-pariharangal-6/
 33. నివృత్తి (నిష్క్రియాత్మకత) లోని అడ్డంకి తొలగినపుడు, అటువంటి కార్యాలలో నిర్లిప్తత దృఢమౌతాయి. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/21/virodhi-pariharangal-6/
 34. నిద్రలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, తమ యదార్థ స్వరూపం యొక్క పూర్తి సాక్షాత్కారం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/01/virodhi-pariharangal-7/
 35. మేల్కోవడంలో ఉన్న అడ్డంకులు తొలగినపుడు, వాస్తవికత గురించి జ్ఞానం ఏర్పడి దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/01/virodhi-pariharangal-7/
 36. నడకలో ఉన్న అడ్డంకి (మార్గం, పనులు మొదలైనవి) తొలగినపుడు, మళ్ళీ ఈ సంసారంలోకి తిరుగి రావాలన్న (మరొక జన్మ తీసుకోవడం) భావన తొలగి దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/02/virodhi-pariharangal-8/
 37. నిలబడటం ఉన్న అడ్డంకి తొలగినపుడు, పరమదంలో భక్తుల మధ్య ఆనందంగా నిలబడటం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/02/virodhi-pariharangal-8/
 38. అవసరమైన అంశాలలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, ఈ ప్రస్తుత శరీరం మచ్చలేని తుది శరీరం (పరమపదాన్ని అధీష్ఠించే ముందు)  అని దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/06/virodhi-pariharangal-9/
 39. శారీరక స్వచ్ఛతలోని అడ్డంకి తొలగినపుడు, ఆత్మ యొక్క స్వచ్ఛత దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/06/virodhi-pariharangal-9/
 40. స్నాన అడ్డంకి తొలగినపుడు, విరాజా నదిలో స్నానం చేయడం (పరమపద ప్రవేశానికి ముందు) ఏర్పాటు చేయబడుతుంది.https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/06/virodhi-pariharangal-9/
 41. మన ప్రవర్తనలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, సంప్రదాయం ఆధారిత ప్రవర్తన  (పూర్వాచార్యుల యొక్క ప్రవర్తన ) దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/23/virodhi-pariharangal-10/
 42. గుణం / లక్షణంలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, విలక్షణత్వం (గొప్పతనం) దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/30/virodhi-pariharangal-11/
 43. సంస్మరణంకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, అటువంటి సంస్మరణం యొక్క స్వచ్ఛత దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/07/07/virodhi-pariharangal-12/
 44. పాడటం / మాట్లాడటంలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, వాక్కు శుద్ధి దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/07/08/virodhi-pariharangal-13/
 45. వినికిడికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, సత్ సాంప్రదాయం (నిర్మలమైన సంప్రదాయం) యొక్క స్వచ్ఛత తనలో దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/06/virodhi-pariharangal-14/
 46. సేవలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, భగవాన్ అటువంటి సేవను ఆనందంగా స్వీకరించడం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/10/virodhi-pariharangal-15/
 47. సమారాధనం (ఆరాధన) లోని అడ్డంకి తొలగినపుడు, భగవాన్ అటువంటి ఆరాధనను సంతోషంగా స్వీకరించడం దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/25/virodhi-pariharangal-16/
 48. నమస్కారం / సాష్టాంగం చేయడంలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, భగవాన్ అటువంటి నమస్కారాన్ని ఆనందంగా స్వీకరించడం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/09/02/virodhi-pariharangal-17/
 49. చేతులు జోడించి నమస్కారాలు చేయడంలో అడ్డంకి తొలగినపుడు, భగవాన్ హృదయాన్ని దొంగిలించడం / బంధించడం జరుగుతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/09/19/virodhi-pariharangal-18/
 50. మన సమయాన్ని గడపడానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, అటువంటి సమయాన్ని ఉపయోగకరమైన రీతిలో గడపడం పట్ల నిజమైన సంతృప్తి దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/10/02/virodhi-pariharangal-19/
 51. సంపాదించడంలో అడ్డంకి తొలగినపుడు, సాత్విక స్వభావం దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/11/17/virodhi-pariharangal-20/
 52. ఇంటికి  సంభందించిన అడ్డంకి తొలగినపుడు, సాధు సన్యాసుల రాక యొక్క గొప్ప అదృష్టం/ అనుబంధం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/11/24/virodhi-pariharangal-21/
 53. భూమి / ఆస్థులకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, అటువంటి భూమి / ఆస్థుల యొక్క ఫలాలను భగవానుడికి అర్పించడం  దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/11/24/virodhi-pariharangal-21/
 54. ఇతరుల పోషణకు (ఆహారం) సంభందించిన అడ్డంకి తొలగినపుడు, వాటిని ఇచ్చేవారు,  ఆనందించేవారుగా స్థిరపడతారు.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/12/01/virodhi-pariharangal-22/
 55. ఆహారానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, ఉన్నతమైన సత్వం (మంచితనం) దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/12/01/virodhi-pariharangal-22/
 56. తీర్థం (పవిత్ర జలం) లోని అడ్డంకి తొలగినపుడు, వారి అభ్యున్నతి దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/01/06/virodhi-pariharangal-24/
 57. ప్రసాదం (శుద్ధమైన / పవిత్రమైన ఆహారం) లోని అడ్డంకి తొలగినపుడు, తమ శుద్దీకరణ దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/02/03/virodhi-pariharangal-25/
 58. వాక్కుకి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, సంసారుల పట్ల భేదం  దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/02/16/virodhi-pariharangal-26/
 59. అనుబంధాలకు సంభందించిన అడ్డంకులు తొలగినపుడు, శ్రీవైష్ణవ లక్షణాలు / గుణాలు దృఢమౌడతాయి. గమనిక: శ్రీ ఉ. వె. వి వి రామానుజం స్వామి ప్రచురించిన ఈ పుస్తకంలో “సంగ విరోధి” విభాగంలో లేదు.
 60. సంబంధాలకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, నిత్య బంధువు అయిన భగవానుడి గురించి జ్ఞానం దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/03/15/virodhi-pariharangal-27/
 61. అనురాగానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, భగవత్ ప్రాప్తి దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/03/16/virodhi-pariharangal-28/
 62. భక్తికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, మన దాసత్వం (భగవాన్ దాసత్వం) దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/03/16/virodhi-pariharangal-28/
 63. దాసత్వానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, యజమాని (భగవాన్) గురించి మన జ్ఞానం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/04/21/virodhi-pariharangal-29/
 64. స్నేహానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, అందరి పట్ల అనుకూలత దృఢమౌతుంది.
  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/04/23/virodhi-pariharangal-30/
 65. సమర్పణలోని అడ్డంకి తొలగినపుడు, మన సంపత్తి  మరియు భగవత్ సంపత్తి యొక్క జ్ఞానం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/05/12/virodhi-pariharangal-31/
 66. తత్వశాస్త్రం అడ్డంకి తొలగినపుడు, ఆచార్యుల స్వీకరణ దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/06/23/virodhi-pariharangal-32/
 67. ఆశ్రమానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, భగవాన్ పట్ల మాత్రమే మన అంకితభావం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/07/01/virodhi-pariharangal-33/
 68. జాతి (జన్మ) లోని అడ్డంకి తొలగినపుడు, భాగవత సేవ గురించి జ్ఞానం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/08/virodhi-pariharangal-34/ 
 69. నమ్మదగిన సూత్రాలకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, అటువంటి నమ్మదగిన సూత్రాల యొక్క నిష్కల్మశమైన స్వభావంపై నమ్మకం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/12/virodhi-pariharangal-35/ 
 70. నమ్మదగని సూత్రాలలో ఉన్న అడ్డంకి తొలగినపుడు … (గమనిక: ఈ వాక్యం మూలంలో లేదు). https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/29/virodhi-pariharangal-36/
 71. సిద్ధాంతానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, అత్యంత గౌరవనీయమైన ప్రణామాల పట్ల విశ్వాసం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/09/12/virodhi-pariharangal-37/,    https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/09/24/virodhi-pariharangal-38/ and  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/10/31/virodhi-pariharangal-39/
 72. వాస్తవానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, అత్యంత పవిత్రమైన ప్రమేయం (లక్ష్యం – భగవాన్) గురించి జ్ఞానం దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/11/15/virodhi-pariharangal-40/https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/17/virodhi-pariharangal-41/ and https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/24/virodhi-pariharangal-42/
 73. పురుషత్వానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, భగవాన్ యొక్క భార్యగా మన స్వరూపం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/31/virodhi-pariharangal-43/ 
 74. అంతిమ క్షణాలను అర్థం చేసుకోవడంలో ఉన్న అడ్డంకి తొలగినపుడు, సంపూర్ణ శరణాగతి చేసిన ప్రపన్నత దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/12/virodhi-pariharangal-44/ 
 75. సందేహాలకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, వారు భగవాన్, భాగవతులు, ఆచార్యులు మరియు విషేశ శాస్త్రం (భాగవత ధర్మానికి ప్రాధాన్యతనిచ్చే శాస్త్రం) యొక్క దివ్య పదాలపై నమ్మకం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/22/virodhi-pariharangal-45/
 76. సాంగత్యానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, భగవన్ జ్ఞానం దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/22/virodhi-pariharangal-45/ 
 77. సంతానానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, వైష్ణవ సంతానం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/22/virodhi-pariharangal-45/ 
 78. వర్ణానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, ఆత్మ యొక్క వర్ణం, అంటే శేషత్వం దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/22/virodhi-pariharangal-45/
 79. జపానికి (పారాయణం) సంభందించిన అడ్డంకి తొలగినపుడు, ద్వయ మహామంత్రం యొక్క అడ్డంకి లేని నిరంతర పారాయణం ఏర్పాటు చేయబడుతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/22/virodhi-pariharangal-45/
 80. ఆరాధనకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, భగవాన్ ఆరాధన దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/22/virodhi-pariharangal-45/ 
 81. స్వామిత్వానికి సంభందించిన అడ్డంకి తొలగినపుడు, భగవాన్ యొక్క అత్యున్నత స్వామిత్వం గురించిన జ్ఞానం దృఢమౌతుంది. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/05/01/virodhi-pariharangal-46/
 82. వర్జించతగ్గ అంశాలకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, సాత్విక ఆహారం, సాత్విక గ్రంథంపై విశ్వాసం మరియు సాత్విక పనులు దృఢమౌతాయి. https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/05/01/virodhi-pariharangal-46/
 83. తప్పించకూడని అంశాలకు సంభందించిన అడ్డంకి తొలగినపుడు, ఈ శరీరం చివరిలో అంతిమ లక్ష్యాన్ని సాధన దృఢమౌతుంది.  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/05/01/virodhi-pariharangal-46/

ఒక జీవాత్మకు ఈ అడ్డంకులు అతని స్వరూప, స్థితి మరియు ప్రవృత్తికి సంబంధించినవి. భగవత్ స్వరూపాన్ని వెల్లడిచేసే ప్రణవంపై నిరంతరం చింతన ద్వారా, జీవాత్మ యొక్క స్వభావం మరియు అస్తిత్వానికి సంబంధించిన అడ్డంకులు తొలగించబడతాయి. నమః యొక్క చింతన ద్వారా జీవత్మ యొక్క  స్థితికి సంబంధించిన అడ్డంకులు తొలగించబడతాయి. భగవాన్ చేత ప్రేరేపించబడిన భగవత్ కార్యములను, తాను మాత్రమే పూర్తిగా ఆనందించే భగవత్ కార్యములను వెల్లడించే “నారాయణ” శబ్ధం పై ధ్యానం ద్వారా, జీవాత్మ యొక్క కార్యములకు సంబంధించిన అడ్డంకులు తొలగించబడతాయి. ఈ విధంగా, నిజమైన ఆచార్యులకు సేవ చేయడం ద్వారా, మూడు భాగాలున్న తిరుమంత్రార్ధాలను నేర్చుకోవడం, అడ్డంకులను తొలగించి తమ జీవితాన్ని గడపాలని వివరించబడింది. అనువాదకుల గమనిక: తిరుమంత్రం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ తెలియజేయబడింది. తిరుమంత్రం అతి ముఖ్యమైన సూత్రాలకు ఆధారం. తిరుమంత్రం ద్వయ మహామంత్రం మరియు చరమ స్లోకంలో తిరుమంత్రం మరింత వివరించబడింది. రాహస్య త్రయం అని పిలువబడే ఈ మూడింటిని అర్హత గల ఆచార్యల నుండి నేర్చుకోవాలి. ఆచార్యులకు సేవ చేయడం కూడా చాలా ముఖ్యమైనది. మాముణులు నిరంతరం ద్వయ మహామంత్ర పారాయణం చేస్తారని మరియు ద్వయ మహామంత్రం  యొక్క అర్ధాలను నిరంతరం ధ్యానం చేస్తారని పూర్వ దినచర్య 9 వ స్లోకాంలో ఎరుమ్బి అప్పాచే వివరించబడింది. ద్వయ మహా మంత్రాన్ని పఠించే ముందు గురు పరంపర మంత్రాన్ని (అస్మద్ గురుభ్యో నమః … శ్రీధారాయ నమః) పఠించాలని పిళ్ళై లోకాచార్యులు కూడా నొక్కిచెప్పారు. ఈ విధంగా, ఒక శ్రీవైష్ణవునిగా, త్వరగా తమ అడ్డంకులను తొలగాలని కోరుకొని మన పూర్వాచార్యుల సూచనలకు అనుగుణంగా ఈ ప్రపంచంలోనే అద్భుతమైన జీవితాన్ని గడపడంపై దృష్టి పెట్టాలి,  చివరకు పరమపదానికి చేరుకొని ఆ దివ్య దంపతులకు సంపూర్ణ ఆనందం కోసం నిత్య సేవ చేయాలని ఆశపడాలి. 

ఈ విధంగా భగవత్ రామానుజాచార్యుల చేత అనుగ్రహించబడిన “విరోధి పరిహారాలు” కి వంగి పురత్తు నంబి యొక్క వ్యాఖ్యానం ముగుస్తుంది.

శ్రీ ఉ.వే. వి వి రామానుజం స్వామి

ఈ విధంగా   శ్రీమన్నారాయణ, ఆళ్వారులు, ఆచార్యులు మరియు అస్మదాచార్యుల కృపతో అనువాద ప్రయత్నంలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.  సాంకేతికంగా లోతైన ఈ గ్రంథానికి అతి సరళమైన మరియు సమర్థవంతమైన అనువాదాన్ని ఇచ్చిన ఉ.వె. వి వి రామానుజం స్వామికి, మన  సత్ సాంప్రదాయం యొక్క అనేక విలువైన సూత్రాలను నాకు బోధించిన అనేక విద్వానులకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే, మన పూర్వాచార్యుల గ్రంథాలను అనువదించే ప్రయత్నాలలో నన్ను నిరంతరం ప్రోత్సహించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా వంగీ పురత్తు నంబికి ఎమ్పెరుమాన్ యొక్క  తుది సూచనల యొక్క “విరోధి పరిహారాలు” గ్రంథం యొక్క తెలుగు అనువాదం ముగుస్తుంది.

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/12/virodhi-pariharangal-conclusion.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s