Monthly Archives: August 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 44

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 43

జీయర్ తిరువడి ఆశ్రయం పొందాలని అన్నన్ నిర్ణయం

తదాగతాం తాం వ్యతిదామనిందితాం వ్యభేదహర్షాం పరిధీనమానసాం
శుభాన్నిమిత్తాని శుభానిభేజిరే నరంశ్రియాజుష్టం ఇవోపజీవినః

(నిరుపేదలు ధనవంతులను ఆశ్రయించి ప్రయోజనం పొందినట్లే, చెప్పనలవికాని కష్ఠాలు అనుభవించిన ఏ పాపము ఎరుగని సితా పిరాట్టిని పొందిన శుభ శకునాలు కూడా ఫలాన్ని పొందాయి). అన్నన్ కూడా కొన్ని శుభ శకునాలతో, ఆచ్చి [తిరుమంజన అప్పా కుమార్తె] ఇంటికి వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు.

రంగేశ కైంకర్యం సుతీర్థ దేవరాజార్యజాంపాకలు భాగ్యశీలా
రమ్యోపయంతుః పదసంశ్రయేణ యాస్మత్కులం పావనమాధనోతి

(తిరుమంజనం దేవరాజర్ తిరుకుమార్తె ఆచ్చి మాముణుల దివ్య తిరువడి యందు ఆశ్రయం పొంది ఆ మాహా భాగ్యవంతుడైన తిరుమంజనం దేవరాజర్ వంశాన్నే పవిత్రం చేసినది కదా?) అని సంతోషించి “నీవు వండిన ప్రసాదాన్ని స్వీకరించుట వలనే కదా మేము ఈ ఫలాన్ని పొందాము!” అని ఆనందించారు. వెంటనే ఉత్తమ నంబితో ఈ సందేశాన్ని తమ బంధువులకు, కందాడై అయ్యంగార్లకు పంపారు. మాముణుల దివ్య తిరువడి సంబంధం వారు కూడా పొందాలనే ఉద్దేశ్యముతో ఆయన వారి నివాసాలకు వెళ్లారు. అచ్చియార్ తిరు కుమారులైన అణ్ణా, దాశరథి అప్పై మరియు తందైతాయ్ ఎంబా తాము కూడా అదే స్వప్నాన్ని చూసారని చెప్పి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. అతను వారితో పాటు ప్రముఖులైన లక్ష్మణాచార్యుల మనవడు ఎంబా నివాసానికి వెళ్ళారు.

జరిగిన విషయము గురించి విన్న ఎంబా ఆక్రోశంతో,  “గొప్ప పేరు, జ్ఞానం, అనుష్టానము, అచారములున్న గొప్ప వంశంలో జన్మించిన నీవు ఇలా చేస్తావా?” అని కందాడై అన్నన్ పై కోపగించుకునారు. తరువాత, ఎంబాకు కొడుకు లాంటి పెరియ ఆయి వంశానికి చెందిన అప్పా, ఇతర సంబంధుల నివాసాలకు అన్నాన్ వెళ్లి, జీయర్ పాదాలను ఆశ్రయించమని కోరారు. కాని వారు కూడా నిరాకరించెను. అన్నన్ తన హృదయంలో విచారంతో, తోబుట్టువుల వంటి దాదాపు ఇరవై మంది తమ వంశస్థుల నివాసాలకు వెళ్లారు. వారు ఆప్యాయతతో ఆయనకు స్వాగతం పలికి, సాష్టాంగ నమస్కారం చేసి, అన్నన్ చెప్పిన మాటలు విన్నారు. వారి కలల గురించి అన్నన్ కు వివరించి, అళగియ మణవాళ మాముణుల మహిమను కీర్తించి, మాముణులను ఆశ్రయించాలనే తమ సంకల్పాన్ని వివరించారు. తమ ధర్మ పత్నులు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి, పండ్లు ఇతర సమర్పణలతో మాముణుల తిరుమాలిగకు వెళ్లమని అన్నర్ వాళ్ళను సూచించారు.

తల్లిదండ్రులను విడిచిపెట్టి, కందాడై అన్నన్ తిరుమాలిగలో గురుకులవాసం చేస్తూ, వారి తిరువడియే ధారకం పోషకం, భోగ్యముగా భావించే తిరువాళియాళ్వార్ పిళ్ళైని తమ వెంట తీసుకొని వెళ్ళారు. అప్పడికే జీయర్ తిరువడి సంబంధము పొందిన శుద్ధ సత్వ అణ్ణన్ ను, భగవత్ విషయంలో అన్నన్ ప్రమేయం గురించి మాట్లాడతారని, తద్వారా జీయర్ తమ కృపా వర్షాన్ని తనపైన కురిపిస్తారని కూడా తోడుగా తమతో తీసుకొని వెళ్ళారు. అన్నన్ “సుద్ధ సత్వం అన్న – అతని పేరుకి తగినట్టు, మన గురించి వారు కొన్ని మంచి మాటలు చెప్పగలుగుతారు. వారి సహృదయులు కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్నీ సవినయంగా జరిగిపోతాయి” అని భావించారు. వీరిద్దరితో పాటు, అన్నన్ తమ సోదరులు మరియు బంధువులను కూడా జీయర్ మఠానికి తీసుకొని వెళ్ళారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/28/yathindhra-pravana-prabhavam-44/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 42

కందాడై అన్నన్ స్వప్నము

మేడ మీద నుండి ఒక శ్రీవైష్ణవుడు క్రిందకు దిగి, తన వెంట తెచ్చుకున్న కొరడాతో కందాడై అన్నన్ ను కొట్ట సాగాడు. ఆపే సామర్థ్యం ఉన్నా ఆ శ్రీవైష్ణవుడిని అన్నన్ ఏమీ అనకుండా  ఊరుకున్నారు. యదార్థ స్వరూపానికి విరుద్ధమైన గుణం తనలో ఉన్నందుకు ఇలా  శిక్షించ బడుతున్నారని వారు భావించారు. “శస్త్రక్షారాగ్నికర్మాణిస్వపుత్రాయ యతా పితా” (తండ్రి తన పుత్రుని గాయాలను నయం చేయడం కోసం చర్మాన్ని కత్తిరించడం, కుట్టడం, వేడి వేడి ఇనుప కడ్డీలతో వాతలు పెట్టడం వంటివి చేయును) అనే సూక్తులను గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. కొంతసేపటికి ఆ కొరడా తెగిపోయేసరికి, ఆ శ్రీ వైష్ణవుడు అన్నన్ చేయి పట్టుకొని లాగి పైకి వెళ్ళమన్నారు. అన్నన్ నిచ్చెన గుండా పైకి వెళ్ళి  అక్కడ ఒక జీయర్ తమ ఒక కాలు క్రిందికి వేలాడించి మరో కాలు ముడుచుకొని త్రిదండం ధరించి తమ ఒక చేతిలో కొరడా పట్టుకొని నిప్పులు కక్కుతున్న కళ్ళతో కూర్చొని ఉండటం చూశారు.  శ్రీ వైష్ణవుడు అన్నన్ ను ఆ జీయర్ వద్దకు తీసుకొని వెళ్ళారు. జీయర్ తమ హస్తములో ఉన్న కొరడాతో అన్నన్ ను కొట్టడం ప్రారంభించారు. ఆ కొరడా కూడా తెగింది. అతన్ని ఇంకా శిక్షించాలనే ఉద్దేశ్యముతో తమ త్రిదండం నుండి ఒక దండాన్ని తీసారు. ఆ శ్రీవైష్ణవుడు జీయర్ ముందు సాష్టాంగ నమస్కారం చేసి అంజలి ముద్రలో చేతులు జోడించి, జీయర్ తిరు ముఖాన్ని చూసి ఇలా అన్నారు “ఈ నవ యువకుడు చాలా కొరడా దెబ్బలు తిన్నాడు. దయచేసి దేవరి వారు పెద్ద మనసు చేసుకొని అతనిపై జాలి చూపించి క్షమించండి.” అని ప్రార్థించారు. జీయర్ అన్నన్ పై దయ చూపి, అతనిని తమ ఒడిలోకి తీసుకుని, అల్లారుముద్దుగా అతని శిరస్సుపైన తమ చేతితో నెమరేసి, తల నుండి మొదలు అతని శరీరమంతా స్పర్శించారు.  “ఉత్తమ నంబి మరియు నీవు అపరాధం చేసారు” అని అన్నాన్‌ తో అన్నారు. “అళగియ మణవాళ జీయర్ గొప్పతనాన్ని గుర్తించలేక అస్పష్టమైన మనస్థితితో ఉన్నాను. దయచేసి నా అపరాధాన్ని మన్నించండి” అంటూ వారి చరణాలపై పడ్డారు. జీయర్ అతనిపై జాలిపడి, “మేము భాష్యకారులము, ఆ శ్రీవైష్ణవుడు ముదలియాండాన్” అని ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.

త్వదీయాన్ అపరాదన్యీరన్ త్వద్సంబంధి కృతానపి
క్షమామ్యహం దాశరథేః సంబంధం మాన్యతాకృతః

(మేము మీ తప్పులను వాటికి సంబంధించిన అపరాధాలను క్షమించాము. ముదలియాణ్డాన్ తో మీ సంబంధాన్ని నిరర్ధకం కానివద్దు) అని చెప్పి “మేము తిరు అనంత ఆళ్వానులము (ఆదిశేషుడు); మేము వరవరముణులము (అళగియ మణవాళ జీయర్). నీతో పాటు నీ బంధువులు వారి దివ్య తిరువడిని ఆశ్రయించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి” అని ఆదేశించారు. వారు వెంటనే మేలుకొని “ఈ కల ఏమిటి, ఎలా వచ్చింది!” అని ఆలోచించ సాగారు. ఆశ్చర్యపోతూ, కలలో తనతో జరిగిన సంఘటనల గురించి చింతన చేస్తూ తమ సోదరులను నిద్రలేపి, తన స్వప్నము గురించి వారికి వివరించారు. స్వప్నంలో జరిగిన సంఘటనలను వారికి వివరిస్తున్నప్పుడు, మధ్యలో కొన్నిసార్లు వారికి మాటలు రాక అవాక్కైనారు.

ఎమ్పెరుమానార్ కృప ద్వారా కందాడై అన్నన్‌ కు జరిగిన సంఘటనలను పెద్దలు ఈ క్రింది శ్లోకాలలో సంగ్రహించారు:

వాదూలదుర్య వరదార్య గురోర్ పపాణ
స్వప్నేయతీంద్ర వపురేత్య కృపాపరోన్యః
శేషోప్యహం వరవరోమునిరప్యహం త్వం
మామశ్రయేతితం అహం కలయామి చిత్తే

అత్యంత పాపనిరతః కథమార్యవర్య
త్వామాశ్రయేహమితి తం కృపణం వదంతం
దృష్ట్వా ఖమామి ననుదాశరథేః త్వదీయ
సర్వాపరాదమితి తం ప్రవదంతమీడే

(వాదూల వంశ ప్రముఖుడైన కందాడై అన్నన్ స్వప్నంలో, ఎమ్పెరుమానార్ల దివ్య స్వరూపంలో ప్రత్యక్షమైన ఆ కృపామూర్తి జీయర్‌ ను నేను ఆరాధిస్తాను. వారు ఆ స్వప్నంలో “మేము ఆదిశేషులం, మేము మాముణులము. మమ్ములను ఆశ్రయించుము” అని తెలిపారు. నా మనస్సులో వారిని ధ్యానించెదను. పరమ పాపి అయిన నన్ను వారు తమ శరణులోకి స్వీకరించెదరా అని కందాడై అన్నన్ నిస్త్రాణైన కంఠంతో ప్రశ్నించగా, వారు (రామానుజులు) అన్నన్ తో  “ఓ అణ్ణా ! ముదలియాండాన్ కొరకు, మీ దోషాలన్నింటినీ క్షమించివేస్తాము” అని అన్నారు. శ్రీవిష్ణు పురాణం 5 -17-3 “అధ్యమే సఫలం జన్మ సుప్రభాదాసమే నిశా” (నిన్నటి రాతిరి వేకువ ఝాము అయితే, ఈ రోజున నా జన్మ ఫలించింది) అని అన్నాట్లు, కందాడై అన్నన్ తమ సోదరులతో ఆచ్చి వద్దకు వెళ్లి ఆమె ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు.  ఆమె భయపడకూడదని, అన్నన్ ముందు రోజు రాత్రి తన కల గురించి ఆమెకు వివరించి ఉంచారు. అచ్చి తాను జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందానని, వారి పాదుకలను తన శిరస్సుపైన ధరించిన సంఘటనను, వాటి నుండి జాలువారిన జలముతో తాను ఎలా శుద్ధి పొందిందో వివరించింది. తరువాత, కావేరిలో జీయర్ స్నానమాడిన తర్వాత ఆ ప్రవాహపు నీటిలో తన తండ్రి స్నానం చేసి ఎలా జ్ఞానోదయం పొందాడో కూడా ఆమె వివరించింది. ఇది విని అన్నన్ ఎంతో ఉప్పొంగిపోయి, శింగరైయర్ వద్దకు వెళ్లి జరిగిన విషయాలు వారికి వివరించి, ఆ తర్వాత దివ్య కావేరి నది వద్దకు వెళ్లి, స్నానం చేసి, రోజువారీ అనుష్టానాలు చేసుకుని, జీయర్‌ వద్దకు బయలుదేరారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/28/yathindhra-pravana-prabhavam-43/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 42

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 41

ఆచ్చి తన తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో, కందాడై అన్నన్ తండ్రి [దేవరాజ తోళప్పర్] వారి తీర్థం (శ్రాద్ధం) ఆచరించాల్సి వచ్చింది. శ్రాద్ధం కోసం వంట వండడానికి రమ్మని శిఱ్ఱణ్ణర్ భార్య అయిన ఆచ్చిని రమ్మని పిలిచారు. ఆచ్చి వెళ్లి పూర్ణ స్వచ్ఛతతో అందరూ ఆనందించే విధంగా ఆహారాన్ని తయారు చేసింది. ఎమ్పెరుమానుకి ఆహారాన్ని సమర్పించిన తర్వాత, ఆ ప్రసాదన్ని శ్రీవైష్ణవులకు వడ్డించారు. భోజనం అయిన తర్వాత, కందాడై అన్నన్ తమ ఇంటి అరుగుపైన కూర్చొని ఉన్నారు.

శింగరైయర్ కథనం

జీయర్ తిరుమాలిగ నుండి ఒక శ్రీవైష్ణవుడు బయటకు వచ్చారు. కందాడై అణ్ణాన్ ఆ శ్రీవైష్ణవుడిని చూసి ఇలా అడిగారు….

“మీ స్వస్థలం ఏది?”
“వళ్ళువ రాజేందిరం”
“నీవు ఇక్కడికి ఏ పనిమీద వచ్చావు”

“జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందేందుకు అడియేన్ ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు కూడా అనుమతిని దొరకలేదు. ఆ రోజు త్వరలో వస్తుందనే ఆశతో అడియేన్ ఎదురు చూస్తున్నాడు”

“ఈ దివ్య స్థలములో ఎంతో మంది ఆచార్యులు ఉన్నారు. మీరు వారిలో ఒకరి యందు ఆశ్రయం పొంద వచ్చు కదా?

“పెరియ జీయర్ (మణవాళ మాముణులు) తిరువడి వద్ద ఆశ్రయం పొందమని ఎమ్పెరుమానుని నిర్దేశం”
“ఎమ్పెరుమాన్ నుండి మీకు ఆదేశం ఎలా వచ్చింది?”
“అది ఒక దేవ రహస్యం”
“మీ పేరేమిటి?”
“శింగరైయర్”

ఎమ్పెరుమానుని కటాక్షానికి శింగరైయర్ సముచితమైన వారు అని తమ దివ్య మనస్సులో కందాడై అణ్ణన్ భావించారు.  శింగరైయర్ ను తమ ఇంటి లోపలికి తీసుకువెళ్లి వారికి తీర్థం, చందనం సమర్పించి, “దయచేసి ఈ రాత్రికి ఇక్కడే మా ఇంట్లోనే ఉండండి” అని ఆప్యాయంగా ప్రార్థించారు. కందాడై అణ్ణన్ తమ ఇంటి బయట ఉన్న అరుగుపైన తమ సోదరులు, కందాడై అప్పన్ మరియు తిరుక్కోపురత్తు నాయనార్ భట్టార్లతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో ఆచ్చి, తిరుఅధ్యయనం (శ్రాద్ధం) కి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకొని, అలసిపోయి “జీయర్ తిరువడిగలే శరణం, పిళ్ళై తిరువడిగలే శరణం, వాళి ఉలగాశిరియన్” అని చెప్పి క్రింద వాలి నిద్రపోడానికి సిద్ధమవుతుంది. ఈ మాటలు అరుగుపై కూర్చున్న ముగ్గురు అన్నదమ్ముల చెవిన పడింది. ఈ మాటలు విని ఆశ్చర్యాపోయారు. భట్టర్ (ముగ్గురిలో చిన్నవాడు) “అడియేన్ లోపలికి వెళ్లి కనుక్కుంటాను”  అని చెప్పి, “మదినియారే” (వదిన!) అని పిలిచి లోపలికి వెళ్ళాడు. తాను పడుకునే ముందు పలికిన మాటలను వారు విన్నారేమోనని ఆచ్చి భయపడింది. కందాడై అన్నన్ మరియు అప్పన్ భట్టర్ని పిలిచి, “ఇప్పుడు ఆచ్చిని నిద్ర లేపవద్దు. తెల్లవారగానే కనుక్కుందాం” అని చెప్పి నిద్రలోకి జారుకున్నారు. కందాడై అన్నన్ భక్తి భావములో వ్యాకులతతో నిద్రిపోలేకపోయారు; తమ సోదరులకు తెలియకుండా వారు శింగరైయర్ నిద్రిస్తున్న చోటికి వెళ్లి, వారిని మేల్కొలిపి, ఆధ్యాత్మిక ధర్మం గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. ఆ మాటలు విన్న శింగరైయర్ ప్రసన్నులైనారు. అణ్ణాన్ వారితో “జీయర్ దివ్య పాదాల యందు ఆశ్రయం పొందమని ఎమ్పెరుమాన్ నుండి దేవర్వారు ఆజ్ఞను ఎలా పొందారనే విషయం తెలుసుకోవాలని అడియేన్ కు చాలా కోరికగా ఉంది” అని ప్రార్థించెను. శింగరైయర్ ఈ కథనం వారికి వివరించారు:

“మా ఊరిలో పండే కాయకూరలను ఈ ప్రదేశంలోని ప్రముఖుల తిరుమాలిగలకు సమర్పించడం అడియేన్ ఆచారం. ఒక శ్రీవైష్ణవుడు కాయ కూరలను జీయర్ తిరుమాలిగలకు సమర్పించమని అడియేన్ తో అన్నారు. దానిని మహాభాగ్యంగా అడియేన్ భావించి వాటిని మఠానికి పంపించారు. అది చూసిన జీయర్ అడియేన్ ని ‘వీటిని ఎక్కడ పండించారు? ఎక్కడి జలం వాడారు? ఆ మొక్కలకు నీరు ఎవరు పోసారు? వీటిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?’ అని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు వినయంగా స్పందిస్తూ ‘వీటిని స్వచ్ఛమైన భూమిలో సాగు చేశాము. అడిచేరి [ఒక ప్రదేశం] లోని దేవార్వారి అనుచరులు వాటికి నీళ్ళు పోశారు. ఇది భాగవతుల సంపద. ఈ సమాధానము విన్న జీయర్ సంతోషించి అతనికి ఆమోదం తెలిపి సన్నిధికి వెళ్లి పెరుమాళ్ళని సేవించమన్నారు. అడియేన్, సన్నిధికి చేరుకున్న తర్వాత, అర్చకుడు ‘కూరగాయలను ఈ రోజు ఎవరికి సమర్పించారు?’ అని అడిగారు. అడియేన్ స్పందిస్తూ ‘జీయర్ మఠం’ అని బదులు చెప్పాను. అర్చకుడు సంతోషించి ఆప్యాయంగా భుజము తట్టి, ‘నువ్వు అదృష్టవంతుడివి. నీవు విశిష్ట సంబంధాన్ని పొందబోతున్నావు’ అని తెలియజేశారు. అడియేనుకి తీర్థం, చందనము, దివ్య మాల, తమలపాకులు, అభయ హస్తం (రక్షణ అందించే నమ్పెరుమాళ్ళ దివ్య హస్తం యొక్క చందనపు అచ్చు), శ్రీ శఠగోపురాన్ని సమర్పించారు. ‘ఈ రోజు అడియేన్ పైన అనంతమైన కృపా వర్షం కురుచుచున్నది! అని అవాక్కైపోయాను. ‘అతన్ని దృఢంగా పట్టుకో’ అనే మాటలు వినిపించాయి. ఆ మాటల్లో ఏదో అర్థం ఉందని అనిపించింది. మఠానికి తిరిగి వచ్చి, సాష్టాంగం చేసి, దేవర్వారి కారణంగా, పెరుమాళ్ళు కురిపించిన దయ, సన్నిధిలో జరిగిన సంఘటనలను వివరించి, మఠం నుండి అనుమతి కోరాను. మఠంలోని అనుచరులు అడియేన్ పట్ల ఆప్యాయతతో దారిలో తినడానికి ప్రసాదం కట్టి ఇచ్చారు. దారిలో ఆ ప్రసాదాన్ని తిన్న వెంటనే మనస్సులో పవిత్రతను అనుభవించి జీయర్ ఆశ్రయం పొందాలనే ఆసక్తిని పెరిగింది. ఆ రాత్రి స్వప్నంలో, తిరుమణత్తూణ్ (గర్భగుడి వెలుపల ఉన్న రెండు స్తంభాలు) దగ్గర నిలబడి అడియేన్ పెరియ పెరుమాళ్ళను సేవిస్తున్నట్లుగా, పెరియ పెరుమాళ్ళు తమ దివ్య హస్తాన్ని ఆదిశేషని వైపుకు ఎత్తి చూపి, ‘అతనే అళగియ మణవాళ చీయర్ (జీయర్). అతనితో సంబంధాన్ని ఏర్పరచుకో’ అని స్వప్నంలో చూశాను. సంతృప్తి చెంది, జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందాలని వేచి ఉన్నాను”. ఇది విన్న కందాడై అణ్ణన్ కు వారి పట్ల గౌరవం మరింత పెరిగి, అలా చాలా సేపు తమలో తాము ఆలోచిస్తూ నిద్రలోని జారుకున్నారు. నిద్రలో వారు ఒక కల కన్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/26/yathindhra-pravana-prabhavam-42/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 16

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/08/07/anthimopaya-nishtai-15/ ), మనము ఆచార్యులు, భాగవతుల ప్రసాదము, శ్రీపాద తీర్థ మహిమలను తెలుసుకొంటిమి. ఈ తదుపరి భాగములో మనము వారి జన్మతో సంబంధము లేని శ్రీవైష్ణవుల మరిన్ని మహిమలను చర్చించెదము.

పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్, మణవాళ మాముణులు

పిళ్ళై లోకాచార్యుల పిన్న దైవాంశ సోదరులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, ఆచార్య హృదయములో లోతైన రమణీయ అర్థాలను అనుగ్రహించి దీవించిరి.

చూర్ణిక 85 లో, శ్రీవైష్ణవుని జన్మ ఉత్తమమైనదా లేక అల్పమైనదా అను విషయము ఈ క్రింది సంఘటనల ద్వారా విశదీకరించిరి. (అనువాదకుని గమనిక: ఈ భాగములో, ఎవరినైనను వారి గొప్పదనము జన్మతః కాదని, వారికి భగవానునిపై మరియు భాగవతులపై గల భక్తిని బట్టి నిర్ణయించవలెనని నిరూపించిరి. ప్రతి విషయము భౌతిత దృష్టికోణంతో మాత్రమే ఎంచబడే నేటి యుగములో, మన పూర్వాచార్యుల సాహిత్యము, వారి నడవడిని మన ఆదర్శంగా చేసుకొని, ఈ భౌతిత భావన కంటే పైకి ఎదిగి జీవనము సాగించవచ్చును. చక్కదనమేమనగా – మన పూర్వాచార్యులు అన్ని వర్ణముల భాగవతులను గౌరవించే పరమ ఆస్తికులు (వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించేవారు).

 • మ్లేచ్చనుమ్ భక్తనానాల్ చతుర్వేదికళనువర్తక్క అఱివుకొడుత్తుక్కులదైవ త్తొడొక్క పూజై కొణ్డు పావన తీర్థప్రసాదనామెన్గిఱ తిరుముఖ ప్పడియుమ్

తన నిజమైన భక్తులకు 8 లక్షణములు ఉండవలెనని ఎంపెరుమాన్ స్వయముగా తెలిపిరి. వారు మ్లేచ్చులైనను (వర్ణాశ్రమ ధర్మములలో భాగము కాని వారు), ఈ లక్షణములు కలిగి, 4 వేదములలో నిష్ణాతులైనచో, వారిని అంగీకరించి ఎంపెరుమాన్ తో సమానముగా పరిగణించ వచ్చును (యధార్ధముగా వారిని గౌరవించి / ఎంపెరుమాన్ కంటే ఉన్నతముగా పరిగణించ వచ్చును) – అనగా వారితో భగవద్విషయమును పంచుకొని, వారిని ఆరాధించి, వారి శ్రీపాద తీర్థమును, శేష ప్రసాదమును స్వీకరించినచో, అవి మనను శుద్ధి పరచును.
ఆ 8 లక్షణములు ఇవి:

  1. భగవత్ భక్తులతో నిబంధనలేని ప్రేమతో నుండుట,
  2. ఇతరుల భగదారాధనను ఆనందించుట,
  3. స్వయముగా తాను భగవానుని ఆరాధించుట,
  4. అహంకారరహితుడుగా నుండుట,
  5. భగవత్ విషయాలను శ్రద్ధగా ఆలకించుట,
  6. భగవత్ శ్రవణము / చింతన / భాషణము చేయునపుడు శరీరములో మార్పులు కలుగుట (అనగా ఒడలు పులకరించుట, మొ || ),
  7. సదా ఎంపెరుమాన్ గురించే తలంచుట,
  8. కామ్య ఫలాలను ఆశించకుండా భగవత్ ఆరాధన చేయుట.
 • విశ్వామిత్ర – విష్ణుచిత్త – తుళసీ భృత్యరోడే ఉళ్ కలందు తొళుకులమానవన్ నిలైయార్ పాడలాలే బ్రాహ్మణ వేళ్విక్కుఱై ముడిత్తమైయుమ్

నంపాడువన్ (వీరు తిరుక్కురుంగుడిలో మలైనంబికి కైశికరాగ గానము చేసిరి. అందువలన వారిని విశ్వామిత్ర ఋషితోనూ, పెరియాళ్వార్ తోనూ, పెరుమాళ్ళ కోసం తిరుప్పళ్ళియెళుచ్చి (మేలుకొలుపు) ని గానము చేసిన తొండరప్పొడి ఆళ్వార్ తోనూ పోల్చిరి), అగ్ర కులములో జన్మించక పోయినను బ్రహ్మ రాక్షసుడుగా (ఒక యజ్ఞములో మంత్రోచ్చారణ లోపం వల్ల  బ్రాహ్మణుడు రాక్షసుడయ్యెను) పొందిన శాపమును, వారి గానముచే, తొలగించుకొనిరి.

 • కీళ్మగన్ తలైమకనుక్కు సమసఖావాయ్ , తంబిక్కు మున్ పిఱన్దు వేలుమ్ విల్లుమ్ కొణ్డు పిన్ పిఱన్దారై శోదిత్తు తమైయోన్ ఇళైయోన్ సద్భావమ్ శొల్లుమ్బడి ఏకకులమానమైయుమ్

బోయకులములో జన్మించిన గుహుడు పెరుమాళ్ళకు (శ్రీ రాముడికి) అత్యంత సన్నిహితుడు మరియు సోదరుడైనాడు, రాత్రి సమయములో పెరుమాళ్ నిద్రించునప్పుడు, ఇళయ పెరుమాళ్ (లక్ష్మణ స్వామి) ను శంకించెను. కావున, గుహుడు రాత్రి అంతయు మేల్కొని ఉండి లక్ష్మణుని గమనించెను. భరతుడు (శ్రీరామ లక్ష్మణుల గుణములను బాగుగా తెలిసినవాడు) గుహుని కలసినప్పుడు , లక్ష్మణుని గుణములు అతనికి తెలియవేమోనని, వానిని గుహుడు భరతునికి తెలిపినప్పుడు, భరతుడు అమితానందము పొందెను. ఈ విధముగా వారు ఐదుగురు (శ్రీరాముడు, గుహుడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు) ఒకే కుటుంబము వారైరి.

 • తూతుమొళింతు వన్దవర్ కళుడైయ సమ్యక్సగుణ సహ భోజనముమ్

శబరి (బోయ వంశములో జన్మించినది) ని స్వీకరించి ఆమె ఒసంగిన ఫలములను ఆరగించిన శ్రీరాముడు; భీష్ముడు, ద్రోణుడు, మొ || వారి గృహముల నేగక, శ్రీవిదురుని గృహములో ఆరగించిన కణ్ణన్ ఎంపెరుమాన్; సీతా పిరాట్టిని కలిసిన ఉదంతమును ఆలకించిన శ్రీరాముడు హనుమంతుని (వానరము) ఆలింగనము చేసికొనుట

 • ఒరుపిఱవియిలే యిరుపిఱవియానా రిరువర్ క్కు దర్మసూను స్వామిగళ్ అగ్రపూజై
  కొడుత్తమైయుమ్

శ్రీ కృష్ణుడికి (బ్రాహ్మణ వంశములో జన్మించలేదు) ప్రధమ మర్యాదనిచ్చిన యుధిష్టిరుడు,
ఒక వడ్రంగిచే పెంచబడిన తిరుమళిశై ఆళ్వారుకి ప్రధమ మర్యాదనిచ్చిన పెరుంబులియూర్ అడిగళ్ – కృష్ణుడు, తిరుమళిశై ఆళ్వార్ వీరిరువురు ఒకే జీవితములో రెండు జన్మలు పొందిరి – కృష్ణుడు క్షత్రియ దంపతులకు జన్మించినను యాదవ కుటుంబమునకు, బ్రాహ్మణ దంపతులకు జన్మించిన ఆళ్వార్ వడ్రంగి కుటుంబమునకు తరలి వెళ్ళిరి.

 • ఐవరిల్ నాల్వరిల్ మూవరిల్ ముఱ్పట్టవర్గళ్ సందేహియామల్ సహజరోడే పురోటాసమాక
  చ్చైయ్త పుత్ర కృత్యముమ్

ఐదుగురు సోదరులలో జ్యేష్టుడైన యుధిష్టిరుడు శ్రీవిదురునికి (సేవకురాలికి జన్మించినవాడు) చరమ కైంకర్యము చేసెను. నలుగురు సోదరులలో జ్యేష్ఠుడైన శ్రీరాముడు జటాయువు (పక్షి) కి చరమ కైంకర్యము చేసెను. ముగ్గురు నంబిలలో (పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, తిరుమలై నంబి) పెద్దవాడైన పెరియ నంబి మాఱనేరి నంబికి చరమ కైంకర్యము చేసిరి.

 • పుష్ప త్యాగ భోగ మండపంగళిల్ పణిప్పూవుమ్ ఆలవట్టముమ్ వీణైయుమ్ కైయుమాన అంతరంగరై ముడిమన్నవనుమ్ వైదికోత్తమరుమ్ మహామునియుమ్ అనువర్తిత్త క్రమముమ్
   • పుష్ప మండపములో (తిరుమల) కురుమ్బురుత్త నంబిచే మట్టి పూలను స్వీకరించిన తిరువేంగడముడియాన్ ను ఆరాధించిన తొండమాన్ చక్రవర్తి

   • త్యాగ మండపములో (కాంచీపురము) తిరుక్కచ్చి నంబిచే వింజామన సేవనందుకున్న పేరారుళాళన్ ను ఆరాధించిన ఎంపెరుమానార్

   • భోగ మండపములో (శ్రీరంగము) తిరుప్పాణాళ్వార్ల వీణ కైంకర్యమును ఆలకించిన పెరుమాళ్ళను ఆరాధించిన లోకసారంగముని

 • యాగానుయాగ ఉత్తర వీధికళిల్ కాయాన్న స్థల శుద్ది పణ్ణిన వృద్దాచారముమ్

తిరువారాధన సమయములో, పిళ్ళై వురంగా విల్లి దాసర్ను స్పృశించి, ఎంపెరుమానార్ శుద్ధి నొందిరి: ప్రసాదమును స్వీకరించుటకు ముందే దానిని స్పృశించమని పిళ్ళై ఏఱు తిరువుడైయార్ దాసర్ తో నంపిళ్ళై అనిరి; తమ నూతన గృహమును శుద్ధి చేయుటకై పిళ్ళై వానమామలై దాసర్ ను ప్రదక్షిణ చేయుమని నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనిరి;

‘అఱివార్ క్కిరే జన్మోత్కర్షాపకర్షఙ్గళ్ తెరివతు’ – పై సంఘటనలు అర్ధమైనచో, నిజమైన అధమ ఉన్నత జన్మల గురించి తెలియును. తమ అద్భుతమైన వ్యాఖ్యానములో, ఈ సూత్రమునే భాగవతుల (జన్మముతో సంబంధము లేకుండా) మహిమలను సులువుగా, మిక్కిలి ఉపయుక్తముగా మందమతులు కూడ అర్ధము చేసుకొనగలరని నయనార్ వివరించిరని, మాముణులు ముగించిరి.

86 వ చూర్ణికలో, దీనినే ఇంకను వివరించిరి :

అజ్ఞర్ భ్రమిక్కిఱ వర్ణాశ్రమ విద్యా వృత్తన్గళై గర్దభ జన్మమ్, శ్వపచాధమమ్, శిల్పనైపుణ్యమ్, భస్మాహుతి, శవవిధవాలన్కారమెన్ఱు కళిప్పర్కళ్

సాధారణ అనువాదము

 • కేవలము బ్రాహ్మణ వర్ణములో (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) జన్మించుట అనగా కుంకుమ పువ్వును మోయు గాడిదగా (దాని విలువ తెలియక) తెలిపిరి.
 • కేవలము సన్యాసాశ్రమమును (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) స్వీకరించుటను అత్యంత హేయమైన ఛండాలుడుగా (శునక మాంస భక్షకుడు) వివరించిరి,
 • కేవలము వేద జ్ఞానము ఉండుట (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) అనగా పాద రక్షలు చేయు నైపుణ్యముతో మాత్రమే సమానముగా (ఉదరపోషణకు తప్ప మరి దేనికి నిరుపయోగము) భావించవచ్చును.
 • కేవలము కర్మానుష్ఠానములు (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) కాలిన బూడిద వలె నిరుపయోగమనిరి.
 • భగవానుని స్తుతించని మాటలు, చర్యలు ఒక మృతదేహమునకు చేయు అలంకరణముల వంటివి.
 • ఎంపెరుమాన్ పై భక్తిలేని పైనవన్నియు, ఒక విధవరాలికి గల అందమైన ఆభరణముల వలె నిరుపయోగమగును. ఏలనన, ఆమెకు మంగళ సూత్రము ఉండదు (అది లేనందువల్ల ఆమెకు ఆ ఆభరణములు నిరూపయోగములు) కనుక. అదే విధముగా, కేవలము వర్ణము, ఆశ్రమము, జ్ఞానము మరియు మాటలు (భగవానునిపై భక్తిలో తడిసి ముద్ద కానివి) పామరులకు పరవశము కలుగజేయును గాని, జ్ఞానులైన పండితులు వానిని విస్మరించి, వానికి ఎట్టి విలువను ఆపాదించరు.

తదుపరి భాగములో, పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణమను దివ్య శాస్త్రము నుంచి అనేక సూత్రములను ఉటంకించి, జన్మ సంబంధము లేకుండా శ్రీవైష్ణవుల మహిమలను తెలిపిరి. ఆ సూత్రములలో, సూత్రము 212 వరకు వైష్ణవుని కీర్తిని ముఖ్యముగా ప్రస్తావించిరి.

సూత్రము – 212ఉత్కృష్టమాక భ్రమిత్త జన్మమ్ భ్రంశ సమ్భావనైయాలే  “శరీరేచ” ఎన్గిఱపడియే భయ జనకమ్

  • తమది ఉత్కృష్టమైన జన్మగా భ్రమించుటచే, వారు దిగ్భ్రాంతితో భీతిల్లి ఉపాయాంతరములకై (అనగా వారు మొదటి 3 వర్ణములలో జన్మించిన ఫలితముగా కర్మ, జ్ఞాన, భక్తి యోగములు నిర్వహించు అవకాశము / యోగ్యత వున్నది) చూచెదరు.
  • జితంతే స్తోత్రము 1.9 “శరీరే చ” లో భయము కలుగు అనేక విషయములను ప్రస్తావించుతూ, వర్ణాశ్రమ ధర్మమును పాటించుటకు అర్హత కలిగిన మన శరీరమునే, భీతికి ప్రధాన కారణముగా తెలిపిరి.

సూత్రము 213అతుక్కు స్వరూప ప్రాప్తమాన నైచ్యమ్ భావిక్క వేణుమ్

అట్టి ఉత్కృష్ట జన్మనొందినవారు, జీవాత్మకు స్వాభావికమైన అణకువను, దానిని సక్రమముగా పాటించు ఇతరుల నుంచి చూచి సాధన చేయవలెను.

సూత్రము – 214అపకృష్టమాక భ్రమిత్త ఉత్కృష్ట జన్మత్తుక్కు ఇరణ్డు దోషముమిల్లై

నిజముగా ఉత్కృష్ట జన్మనొందిన వారికి (అది అల్ప జన్మమనే భ్రమచే) ఈ రెండు దోషములు వుండవు. అవి ఏమనగా,

  • తాము జన్మించిన వర్ణము వలన ఏర్పడిన బాధ్యతలకు దిగ్బ్రాంతి నొంది తద్వారా తమ శరీరము చేయవలసిన చర్యలకు భీతిల్లి,
  • తాము స్వాభావికముగ గాక, ఇతరులను చూచి అణకువను సాధన చేసి నేర్చుకొనవలెను.

సూత్రము – 215నైచ్యమ్ జన్మ సిద్దమ్

ఉత్కృష్ట జన్మ (అల్ప జన్మమనే భ్రమలో నుండుట) పొందిన వారికి వినయము సహజము.

సూత్రము – 216 – ఆకైయాలే ఉత్కృష్ట జన్మమే శ్రేష్ఠమ్

కావున ఉత్కృష్ట జన్మమే శ్రేష్ఠమైనది

సూత్రము 217 – శ్వపచోపి మహీపాల

స్వయముగా భగవానుడే పై శ్లోకములో తెలిపిన విధముగా, ఛండాలుడైనను తన భక్తుడైనచో, ద్విజుని కంటే గొప్పవాడు. అదే ప్రకారము, సన్యాసుడైనను, నా భక్తుడు కానిచో, ఛండాలుని కంటే అల్పుడు.

సూత్రము 218నికృష్ట జన్మత్తాల్ వంద దోశమ్ శమిప్పతు విలక్షణ సంబంధత్తాలే

నికృష్ట జన్మను నొందినవారు ఇతర ఉపాయాంతరములు, మొ || వానిలో నుండుటచే, వారి దోషములు తొలగుటకై, లోపరహితులైన శ్రీవైష్ణవులతో సంబంధము నేర్పరచుకొనవలెను.

సూత్రము 219సంబంధత్తుక్కు యోగ్యతైయుండా మ్బోతు జన్మక్కొత్తై పోకవేణుమ్

లోపరహితుడైన శ్రీవైష్ణవునితో అట్టి సంబంధమునకు యోగ్యత కలుగుటకు, తనది ఉత్కృష్ట జన్మమనే ఆభిజాత్యమును వీడవలెను.

సూత్రము 220జన్మత్తుక్కు కొత్తైయుమ్ అతుక్కుప్పరిహారముమ్ “పళుతిలా ఒళుకల్” ఎన్గిఱ పాట్టిలే అరుళిచ్చెయ్ తార్

తమ జన్మ సంబంధిత అపార్ధములను, వాటిని తొలగించు పరిష్కారమును దయతో మనకు తొండరప్పొడి ఆళ్వార్ “పళుతిలా ఒళుగల్ ” (తిరుమాలై 42) పాశురములో వివరించిరి. ఈ పాశురములో ఆళ్వార్ “జన్మ జన్మల నుండి బ్రాహ్మణ వంశములో జన్మించి, 4 వేదములలో నిష్ణాతులై, తమ అహంకారము మొ || వానిని పోగొట్టుటకై, అహంకార రహితులైన శ్రీమన్నారాయణుని భక్తులను ఆరాధించవలెను. తాము శుద్ధి పొందుటకు జ్ఞానమును వారి నుంచి స్వీకరింపవలెను / పొందవలెను” అని వివరించిరి.

సూత్రము 221వేదగప్పొన్బోలే ఇవర్ కళోట్టై సంబంధమ్

అట్టి మహిమగల భక్తులతో సంబంధము స్పర్శవేదితో (ఇనుమును బంగారముగా మార్చును) సంబంధము వంటిది.

సూత్రము 222 – ఇవర్గళ్ పక్కల్ సామ్య బుద్దియు మాధిక్య బుద్ధియుమ్ నడక్క వేణుమ్

అట్టి శ్రీవైష్ణవులను సమానులుగా పైగా అధికులుగా భావించవలెను.

సూత్రము 223అతావతు ఆచార్య తుల్యరెన్ఱుమ్ సంసారి కళిలుమ్ తన్నిలుమ్ ఈశ్వరనిలుమ్ అధికరెన్ఱుమ్ నినైక్కై

యధార్ధమునకు, వారిని తమ స్వయమాచార్యులతో సమమైన వారిగా పరిగణించి, సంసారులకంటే (విషయవాంఛలపై దృష్టి కలవారు), తమకంటే, స్వయం ఈశ్వరుని కంటే ఉన్నతులుగా పరిగణించవలెను.

సూత్రము 224ఆచార్య సామ్యత్తుక్కడి ఆచార్య వచనమ్

ఆచార్యుని పాదపద్మములను శరణాగతి చేయునపుడు, స్వయముగా ఆచార్యులే ఇచ్చిన ఆదేశము ప్రకారము, అట్టి శ్రీవైష్ణవులను తమ ఆచార్యునితో సములుగా పరిగణించ వచ్చును.

సూత్రము 225ఇప్పడి నినైయాతొళిగైయుం అపచారమ్

శ్రీ వైష్ణవుని జన్మ విశ్లేషణ చేయుట ఎంత పెద్ద నేరమో, వారికి సరియైన గౌరవమును (ఇంతకు మునుపు తెలిపిన సూత్రముల ప్రకారము) ఇవ్వక పోవుట కూడ అంతే పెద్ద నేరము / తప్పిదము అగును.

సూత్రము 226 – ఇవ్వర్ధమ్ ఇతిహాస పురాణఙ్గళిలుమ్, పయిలుమ్ శుడరొళి నెడుమాఱ్కడిమైయిలుమ్ కణ్ శోర వెఙ్గురుతియిలుమ్ వణ్ణాత వాళవుణరిలుమ్ తేట్టరుమ్ తిఱల్ త్తేనిలుమ్, మెమ్బురుళుక్కు మేలిఱ్పాట్టుక్కళిలుమ్ విచదమాక క్కాణలామ్

ఈ సూత్రమునే (జన్మతో సంబంధము లేని భాగవతుల యొక్క మహిమలు) మరింత వివరముగా క్రింది వానిలో తెలిపిరి :

 • ఇతిహాసములు (శ్రీరామాయణము, మహాభారతము), పురాణములు
 • పయిలుమ్ శుడరొళి పదిగము – తిరువాయ్మొళి  3.7
 • నెడుమాఱ్కడిమై పదిగము – తిరువాయ్మొళి  8.10
 • నణ్ణాద వాళ్ అవుణర్ పదిగము – పెరియ తిరుమొళి 2.6
 • కణ్ శోర వెఙ్గురుది పదిగము – పెరియ తిరుమొళి 7.4
 • తెట్టు అరుమ్ తిఱల్ తేన్ పదిగము – పెరుమాళ్ తిరుమొళి 2
 • తిరుమాలై – 39 – 43 పాశురములు

సూత్రము 227క్షత్రియనాన విశ్వామిత్రన్ బ్రహ్మర్షి యానాన్

క్షత్రియ కుటుంబములో జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి (సాధారణముగా బ్రాహ్మణులకు వర్తించును) అయిరి.

సూత్రము 228 – శ్రీవిభీషణనై రావణన్ కులపాంసనమ్ ఎన్ఱాన్; పెరుమాళ్ ఇక్ష్వాకు వంశ్యనాగ  నినైత్తు వార్తై యరుళిచ్చెయ్ తార్

శ్రీ విభీషణుని రావణాసురుడు ద్రోహిగా ప్రకటించెను; శ్రీరాముడు (పెరుమాళ్) శ్రీ విభీషణుని (రాక్షస వంశములో జన్మించినవాడు) తమ స్వంత ఇక్ష్వాకు వంశములో నుండి వచ్చిన సోదరునిగా భావించిరి, వారితో ప్రేమతో సంభాషించిరి.

సూత్రము 229పెరియ ఉడైయారుక్కు పెరుమాళ్ బ్రహ్మమేధ సంస్కారమ్ పణ్ణియరుళినార్

సాధారణముగా పుత్రులు / శిష్యులు తమ పితరులకు / ఆచార్యునికి జరుపు చరమ కైంకర్యములు (అంతిమ సంస్కారములు) శ్రీరాముడు అభిమానముతో జటాయు మహారాజుకు (పక్షి జన్మ నొందిన వానికి) నిర్వహించిరి.

సూత్రము 230ధర్మపుత్రర్ అశరీరి వాక్యత్తైయుమ్, జ్ఞానాధిక్యత్తైయుమ్ కొణ్డు శ్రీవిదురరై బ్రహ్మమేదత్తాలే సంస్కారిత్తార్

అశరీరవాణి ఆదేశముల ప్రకారము, శ్రీ విదురుని జ్ఞానాధిక్య స్వభావము వలనను, అతని అంతిమ సంస్కారములను (దాసి పుత్రునిగా జన్మించినను) యుధిష్ఠిరుడు (వర్ణాశ్రమ ధర్మములలో నున్నవాడు) నిర్వహించెను.

సూత్రము 231ఋషికళ్ ధర్మవ్యాదన్ వాశలిలే తువణ్డు ధర్మ సందేహంగళై శమిప్పిత్తుక్కొణ్డార్ కళ్

ఋషులు ధర్మవ్యాధుని (ఒక కటిక వాడు) వాకిట కాచియుండి, వారు తమ తల్లిదండ్రుల సేవ ముగించు వరకు వేచియుండి, తమ ధర్మ సందేహములను నివృత్తి చేసికొనిరి.

సూత్రము 232కృష్ణన్ భీష్మ ద్రోణాదిగళై విట్టు శ్రీవిదురర్ తిరుమాళికైయిలే అముతు శెయ్ తాన్

ఎంపెరుమాన్ కృష్ణుడు, భీష్మ, ద్రోణ, దుర్యోధనాదులను విస్మరించి, శ్రీవిదురుని గృహమున ఆహారమును ఆనందముగా స్వీకరించిరి.

సూత్రము 233పెరుమాళ్ శ్రీశబరి కైయాలే అముతు శెయ్తరుళినార్

బోయ కుటుంబములో జన్మించినను, తమ ఆచార్యునిపై అత్యంత భక్తిగల శ్రీశబరి ఇచ్చిన ఫలములను శ్రీరాముడు భుజించెను.

సూత్రము 234మాఱనేరి నంబి విషయమాక పెరియనంబి ఉడైయవర్ క్కరుళిచ్చెయ్ద వార్తైయై స్మరిప్పతు

మాఱనేరి నంబి అంతిమ సంస్కారములను చేసిన పిదప పెరియ నంబి (ఒక శ్రీవైష్ణవుని అవసరమును తీర్చుట మరియొక శ్రీవైష్ణవుని భాధ్యత అని అనేక ఉదాహరణములను వివరించుచు తెలిపిరి) శ్రీరామానుజునికి ఇచ్చిన వివరణమును గుర్తుంచుకొనవలెను.

ఈ సూత్రమునే యతిరాజ వింశతి 16 వ శ్లోకములో మన జీయర్ (మాముణులు) వివరించిరి

శబ్దాదిభోగ విషయా రుచిరస్మదీయా
నష్టా భవత్విహ భవద్దయయా యతీంద్ర!
త్వద్దాసదాసగణనాచరమావదౌ యః
తద్దాసతైకరసతావిరతా మమాస్తు

తిరువహీంద్రపురములో శ్రీవిల్లిపుత్తూరు పగవర్ అను ఒక సన్యాసి నివసించుచుండిరి. వారు ఒక వైపున తమ స్నాన అనుష్ఠానములను చేసెడివారు. ఇతరులు మరియొక వైపున తమ అనుష్ఠానములను చేసెడివారు. ఒకసారి వీరు తమ అనుష్ఠానములు ముంగించుకొని తిరుగు ప్రయాణములో నుండగా, ఒక బ్రాహ్మణుడు “మా అందరితో కలవక, మీరు అనుష్ఠానములు మరియొక స్థలములో చేయుటకు కారణమేమి?” అని అడిగిరి. దానికి వారు సమాధానముగా “మీరు బ్రాహ్మణులు, వర్ణాశ్రమముపై మాత్రమే దృష్టి కలవారు. కాని మేము దాసులము, కైంకర్యపరులము (భగవానునితో పాటు భాగవతులపై దాస్య భావమున్నవారము) – కావున మీతో కలిసిఉండ నవసరము లేదు” అని పలుకుచు, ఆ స్థలమును వీడి వెళ్ళిరి. ఈ సంఘటనను తిరునారాయణ పురత్తు అను వారు తమ ఆచార్య హృదయము వ్యాఖ్యానములో స్పష్టముగా వివరించిరి. శ్రీవిల్లిపుత్తూరు పగవర్ దీనినే సమర్థించుచు, ఈ క్రింది పురాణ శ్లోకమును ఉటంకించిరి.

విష్ణుదాసా వయమ్ యూయమ్ బ్రాహ్మణా వర్ణధర్మినః
అస్మాకమ్ దాస వృత్తీనామ్ యుష్మాకమ్ నాస్తి సంగతిః

సాధారణ అనువాదము : మేము విష్ణు సేవకులము, మీరు వర్ణాశ్రమ ధర్మమును మాత్రమే పాటించు బ్రాహ్మణులు. మేము దాస్య భావముతో నుందుము, కావున కలియుటకు కారణము లేదు.

తమ జ్ఞాన సారములోని క్రింది పాశురముల ద్వారా అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ ఈ సూత్రమునే నిరూపించిరి. కేవలము వర్ణాశ్రమ ధర్మమును పాటించుట మాత్రమే నిరుపయోగము, ప్రతి వారికి శ్రీమన్నారాయణుని పాద పద్మములే అంతిమ లక్ష్యము.

పాశురము 14

బూదంగళ్ ఐందుం పోరుందుడలినాఱ్పిఱంద
సాదంగళ్ నాన్గినోడుం సంగతమాం – బేధం కొండు
ఎన్న పయన్ పెఱువీర్ ఎవ్వుయిరుక్కుం ఇందిరై కోన్
తన్నడియే కాణుం శరణ్

సాధారణ అనువాదము : పంచ భూతములతో తయారైన ఈ శరీరమును వ్యక్తి యొక్క వర్ణముతో గుర్తించిన ఏమి ప్రయోజనము? ప్రతి వారికి శ్రీమన్నారాయణుని పాదపద్మములే శరణ్యము.

పాశురము 15
కుడియుమ్ కులముమ్ ఎల్లామ్
కోకనకై కేళ్వన్ అడియార్కు అవనడియే యాగుం
పడియిన్ మేల్ నీర్ కేళువుం ఆఱుగళిన్ పేరుం నిఱముమ్ ఎల్లామ్
ఆర్ కలియై శేన్ందిడ మాయన్ తఱ్ఱు

సాధారణ అనువాదము : సాగరములో కలియునప్పుడు నదుల రంగు, నామ రూపాలు మొ || నవి ఎట్లు అదృశ్యమగునో, అదే విధముగా శ్రీమన్నారాయణుని భక్తుల ఊరు, వంశ పారంపర్యము మొ || నవి అదృశ్యమై అతను కేవలం భగవానుని తిరువడి సంబంధముతోనే అతనిని గుర్తించవస్తారు.

దేహాత్మ జ్ఞాన కార్యేణ వర్ణభేదేన కిమ్ పలమ్
గతి సర్వాత్మనామ్ శ్రీమన్నారాయణ పదద్వయమ్

సాధారణ అనువాదము : శరీర ఆత్మల వ్యత్యాసము గుర్తించిన పిదప ఆ వ్యక్తిని వర్ణము ఆధారముగా గుర్తించినచో ఫలమేమి? ప్రతి ఒక్కరికి శ్రీమన్నారాయణుని పాదపద్మములే శరణ్యము.

ఏకాంతి వ్యపతేస్థవయః నైవ గ్రామకులాధిపిః
విష్ణునా వ్యపతేస్థవ్యస్ తస్య సర్వమ్ స ఎవ హి

సాధారణ అనువాదము : విష్ణుని నిజమైన భక్తుని అతని స్వగ్రామము, వంశపారంపర్యము మొ || వానిచే గుర్తించరాదు. అట్టి భక్తునకు, భగవానుడే సర్వస్వము.

శ్రీశుక బ్రహ్మర్షి ఎంత గొప్పవాడనగా, వారి తండ్రి వేద వ్యాసుని (4 వేదములను, 18 పురాణములను వర్గీకరించగల సామర్ధ్యుడు) శుకతాతర్ (శుకుని తండ్రి) గా గుర్తించెదరు. శాస్త్రము (భగవద్విషయము) పై వారికున్న పట్టు వలన, వారు భగవానునిపై తమకున్న జ్ఞానము / అనుబంధమును ప్రకటించుకొని, సంసారులకు భోగవిషయ ప్రీతిపై గల జ్ఞానము / అనుబంధము కారణముగా వారితో సంబంధమును తెగతెంపులు చేసుకొనిరి.

అద్య ప్రబృతి హే లోకా! యూయమ్ యూయమ్ వయమ్ వయమ్
అర్ధ కామ పర యూయమ్ నారాయణపరా వయమ్
నాస్తి సంగతిః అస్మాకమ్ యుష్మాకమ్ చ పరస్పరమ్
వయమ్ తు కింకరా విష్ణోః యూయుమ్ ఇంద్రియ కింకరః

సాధారణ అనువాదము : ఈ జగత్తులో నివసించుచున్న వారా! మీరు భౌతిక సంపదపై, భోగములపై ఆసక్తులై వున్నారు. మేము శ్రీమన్నారాయణుని సేవకై తపించుచున్నాము. మీరు మీ ఇంద్రియాలకు దాసులు. మేము శ్రీమన్నారాయణుడికి దాసులము. కావున మీతో పొత్తు కుదిరే అవకాశం లేదు.

తమ వర్ణాశ్రమముపై గాక, మన నిజమైన గుర్తింపు ఆత్మ ద్వారానే అని వారు తెలిపిరి.

నాహం విప్రో న చ నరపతిర్ నాపి వైశ్యో న శూద్రో నో వా వర్ణీ చ గృహపతిర్నో వనస్థో యతిర్వ
కింతు శ్రీమద్భువన భవనస్తిత్యపాయైక హేతోర్ లక్శ్మీభర్తుర్ నరహరితనోర్ దాసదాసస్య దాస

సాధారణ అనువాదము : నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, వైశ్యుడను, శూద్రుడను కాను. నేను బ్రహ్మచారిని, గృహస్థుడను, వాన ప్రస్థుడను, సన్యాసిని కాను. నేను శ్రీమహాలక్ష్మి పతియైన శ్రీనరసింహుని దాసానుదాసుడను.

శుక బ్రహ్మర్షి “వర్ణాశ్రమ ధర్మమును బట్టి నా గుర్తింపు కాదు. జ్ఞానము, పరమానందము ఆధారముగా గుర్తింపు పొందిన జీవాత్మ వలన కూడ కాదు. శ్రీలక్ష్మీ నరసింహుని భక్తులకు నేను చేయు దాస్యము వలన నాకు గుర్తింపు. ఇట్టి అవగాహన కలిగిన పిదప, మనము 2 రకముల వ్యక్తులను గమనింప వచ్చును – భాగవతులు (భక్తులు), అభాగవతులు (భక్తి లేనివారు) – మరి ఏ ఇతర వర్గము లేదు” అని పలికిరి. ఆ విధముగా వారు విషయలోలులైన వారందరి నుంచి సంబంధమును తెగతెంపులు చేసుకొనిరి, శ్రీలక్ష్మీ నరసింహ ఎంపెరుమాన్ భక్తులతో చేరిరి. ఈ చరిత్రము ప్రముఖము మరియు ప్రసిద్ధమైనది.

ఇంకను, అట్టి భాగవతుల స్వరూపమును వివరించిరి:

పంచాస్త్రాంగాః పంచ సంస్కారయుక్తాః పంచార్త్యాగ్యాః పంచమోపాయనిష్ఠాః
తేవర్ణానామ్ పంచమాశ్చాశ్చ్రామాణాం విష్ణోర్భక్తాః పంచ కాల ప్రపన్నాః

సాధారణ అనువాదము : పంచాయుధములు కలవారు (శంఖము, చక్రము, మొ || నవి భగవానుని నుంచి వారసత్వముగా పొందినవి), పంచ సంస్కారములు పొందినవారు, ఆచార్య నిష్ఠలో పూర్తిగా నిమగ్నులైనవారు, పంచకాల పారాయణము (దినమును 5 భాగములుగా విభజించి అభిగామనము / మేల్కొనుట, ఉపాదానము / తిరువారాధనకై సామాగ్రి సమీకరించుట, ఇజ్జా / తిరువారాధనము, స్వాధ్యానము / శాస్త్ర అభ్యాసము, యోగము / భగవద్ ధ్యానము – ఎంపెరుమాన్ సేవ కొరకై ) – వీటికి వర్ణాశ్రమముతో సంబంధము లేకుండా విష్ణు భక్తులుగా సంబోధించుదురు.

దేవర్షి భూతాప్త నృణామ్ పితృణామ్ న కింకరో నాయమ్ ఋణీ చ రాజన్
సర్వాత్మనా యశ్శరణమ్ శరణ్యమ్ నారాయణమ్ లోకగురుమ్ ప్రపన్నః

సాధారణ అనువాదము : విశ్వ గురువైన శ్రీమన్నారాయణునికి సంపూర్ణ శరణాగతి చేసిన వారు, ఋషులకు, దేవతలకు, ప్రజలకు, పితరులకు మరి ఏ ఇతరులకు ఋణగ్రస్తులు కారు.

కాబట్టి, పండితులైన జ్ఞానులు కేవలం వర్ణము, ఆశ్రమము, జ్ఞాన అనుష్ఠానములను (ఎంపెరుమాన్ పట్ల భక్తి లేకుండా అజ్ఞానులచే స్తుతింపబడేవారు) వరుసగా కుంకుమ పువ్వును మోసే గాడిదగా, చండాలుని కంటే తక్కువగా , కాలిన బూడిద వంటి పనికిరానిదిగా, మృతదేహము/వితంతువులకు చేయు అందమైన అలంకరణముల వంటివిగా భావిస్తారు. అటువంటి పండితులకు, వారు చేయు శరణాగతి వారి స్వంత నిష్ఠ / అర్హతపై ఆధారపడి ఉంటుంది. అనగా..

 • బంధము / మోక్షము రెండింటికీ సామాన్యమైన ఈశ్వరుడు లేదా మోక్షమును మాత్రమే చూస్తున్న ఆచార్యుడు,
 • ఈశ్వరునకు పూర్తిగా శరణాగతి చేసిన వారు గాని లేదా వారి స్వంత ఆచార్యుల పట్ల ఉన్న విపరీతమైన అనుబంధము కారణముగా అత్యంత అనుకూలమైన వారు గాని

అందుకే, ఆళ్వాన్ “న చేత్ రామానుజేత్ యేషా చతుర చతురాక్షరి; కామావస్థం ప్రపధ్యంతే జంతవో హంత మాదృశః” అనిరి. ఇక్కడ వారు “నారాయణ” మరియు “రామానుజ” అనే పదములను స్పష్టముగా గుర్తించిరి – ఇక్కడ నారాయణ అను పదము, బంధ మోక్షములు రెండింటికీ సాధారణము అయితే, రామానుజ అను పదము కేవలము మోక్షముపై మాత్రమే దృష్టి కలిగినది. అందుకే రామానుజులకు “చతుర చతురాక్షరి” అనే ప్రత్యేక విశేషణము కలదు, దీని అర్థం “ఇది అత్యంత వివేకవంతమైన నాలుగు అక్షరముల పదము” అని అర్థం.

అనువాదకుని గమనిక: ఈ విధంగా, శ్రీవైష్ణవుల పుట్టుకతో సంబంధము లేకుండా వారి దివ్య మహిమలను మనము గమనించాము.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-16.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 41

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 40

తిరుమంజనం అప్పా తిరుకుమార్తె జీయర్ వద్ద ఆశ్రయం పొందుట

ఒకానొక రోజు తెల్లవారుజామున, జీయర్ తమ స్నానమాచరించుటకు కావేరికి బయలుదేరినపుడు అనుకోకుండా వర్షం కురవడం మొదలైంది. వర్షం ఆగే వరకు ఒక ఇంటి అరుగులో నిలుచొని జీయర్ ఎదురుచూస్తున్నారు. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని భార్య జీయర్ పట్ల భక్తితో తన చీర అంచుతోటి ఆ అరుగుని శుభ్రం చేసి, “స్వామీ, దయచేసి ఇక్కడ కూర్చోండి” అని వేడుకొని, అత్యంత వినయంతో, భక్తితో వారి చరణాలను సేవించింది. జీయర్ తమ పాదుకలను పక్కన వదిలి అరుగుపైన కూర్చున్నారు. వార్షంలో తడుచున్న జీయర్ పాదుకలను తీసుకుని శిరస్సుపై పెట్టుకుంది. ఆ పాదుకల నుండి జలం కారి ఆమె తడిచిపోయింది. తరువాత ఆమె తన చీర అంచుతో ఆ పాదుకలను తుడిచి ఆరబెట్టింది. ఇవన్నీ చూసిన జీయర్ ఆమెను “ఎవరు నీవు? నీ పేరు ఏమిటి? ఇది ఎవరి ఇల్లు?” అని అడిగారు. ఆమె బదులిస్తూ “అడియేన్ దేవార్వారి దివ్య తిరువడి సంబంధం ఉన్న తిరుమంజనం అప్పా కుమార్తెను. అడియేన్ పేరు ఆచ్చి. వారి అల్లుడు కందడై అయ్యంగార్ల ఇల్లు ఇది” అని వివరించింది. అప్పా ఆ పేరు వినగానే ఎంతో సంతోషించి జీయర్ “ఓ! మన అప్పాచ్చియార్! [అప్పా కూతురు]” అని పలికి కృపతో ఆమెను ఆశీర్వదించారు. వర్షం ఆగిన తర్వాత కావేరికి బయలుదేరెను.

జీయర్ పాదుకల నుండి జాలువారిన జలముతో ఆచ్చి తడిచి, ఒక్కసారిగా భగవత్ జ్ఞానాన్ని పొందింది. ఆమె తక్షణమే జీయర్ దివ్య తిరువడి సంబంధం పొందాలని నిశ్చయించుకుంది. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసింది. వారు ఎంతో సంతోషించి, ఆమె కొడుకులకి ఈ విషయం తెలియకూడదని ఆమెతో అన్నారు. జీయర్ తిరువడి సంబంధం పొందిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఆమెను తమ ఇంట్లోనే ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో, వారు ఆమెను జీయర్ తిరుమాలిగకి తీసుకెళ్లెను. జీయర్ ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ, విషయాన్ని జీయరుకి విన్నపించారు. జీయర్ అతనితో “కందాడై అయ్యంగార్ల వంశంతో సంబంధ పరచ వచ్చు కదా? ఇది ఫలించదు” [కందాడై అయ్యంగార్లు ముదలియాండాన్ వంశానికి చెందినవారు, స్వయంగా ఆచార్యులు కాబట్టి]. తిరుమంజనం అప్పా మనసు చిన్నబుచ్చుకోకుండా, తమ కుమార్తె భగవత్ విషయాసక్తి గురించి, జీయర్ ఆశ్రయం పొందాలనే ఆమె కోరిక గురించి వారికి వివరించి విజ్ఞప్తి చేశారు. “దేవార్వారు అనుకుంటున్న అడ్డంకులు సంభవించవు. దయచేసి ఆమెను అనుగ్రహించండి” అని జీయరుని ప్రార్థించారు. బహుశా ఆమె ద్వారా, దివ్య కందడై  వంశం మొత్తము ప్రయోజనం పొందుతుంది అని జీయర్ భావించి, సమాశ్రయణం (పంచ సంస్కారాలు – తాప, పుండ్ర, మంత్ర, నామ, యాగం) నిర్వహించారు. అప్పా తమ కుమార్తెను తమ నివాసానికి తీసుకువెళ్లి, ఆమె కుమారులు అణ్ణా మరియు ఇతరులకు మరేదో కారణము చెప్పి ఆచ్చిని కొంత కాలము తమ తండ్రి వద్దనే ఉంది. జీయర్ దివ్య పాదుకలనుండి జాలువారిన జలముతో ఆచ్చి అనుగ్రహం పొందబడిన ఈ సంఘటన ఈ క్రింది శ్లోకంలో వర్ణింపబడింది.

శ్రీపాదుకాంబుజనితాత్మ వివేకరంగ భూనాథ తీర్థ జలదాతజమాతృదేవం ద్వన్ద్వచ్చితం నిఖిలదేశిక వంద్యపాదం సౌమ్యోపయంతృ మునివర్యమహం నమామి

(వేడి/చలి, సంతోషం/దుఃఖం వంటి జంట ప్రభావాలను దూరం చేసే జీయర్, వారి దివ్య పాదుకల నుండి జాలువారిన జలము వల్ల జ్ఞానాన్ని పొందిన తిరుమంజన అప్పా తిరుకుమార్తె ఆచ్చికి ఆచార్యులైన అళగియ మణవాళ మాముణులకు నమస్కరిస్తున్నాను.)

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/25/yathindhra-pravana-prabhavam-41/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 39

జీయర్ ను భట్టర్పిరాన్ జీయర్ మరియు తిరుమంజనం అప్పా ఆశ్రయించుట

జీయర్ ప్రతి రోజు, సూర్యోదయానికి ముందు తమ స్నానమాచరించుటకై  దివ్య కావేరి ఒడ్డుకి వెళ్లేవారు. తిరుమంజనం అప్పా ఒక్క రవ్వంత కూడా ప్రతి ఫలాన్ని ఆశించకుండా కేవలం సత్వ కార్యములలో నిమగ్నమై ఉండి పెరుమాళ్ల సన్నిధిలో కైంకర్యం చేసేవారు. వీరు జీయరుతో కూడా నదిలో స్నానమాచరించుటకై వెళ్ళేవారు. జీయర్ దివ్య తిరుమేనిని తాకిన నీరు క్రిందకు ప్రవహించే ప్రదేశంలో వీరు నిలుచొని స్నానం చేసేవారు. ఆ కారణంగా వీరికి, జీయర్ దివ్య తిరువడి సంబంధం పొందాలనే జ్ఞానాన్ని పొందారు. జీయర్ పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు పెంచుకుని వారి దివ్య పాదాల శరణు పొందారు. ఈ సంఘటనను చూసిన వ్యక్తులు క్రింది శ్లోకము ద్వారా ఈ సంఘటనను సంగ్రహించారు:

ఉషస్యయమ్వారిణి సహ్యజాయాః స్నాతో యతీంద్రప్రవణోమునీంద్రః
తత్రైవ పశ్చాద్ అవగాహ్య తీర్థే శ్రీతీర్థాతాదస్ తం ఉపాశ్రితోభూత్

(తెల్లవారుజామున, యతీంద్ర ప్రవణర్ అని పిలువబడే మాముణుల తిరుమేనిని తాకి ప్రవహించే పుష్కలమైన కావేరీ నదీ ప్రవాహంలో తిరుమంజనం అప్పా స్నానం చేసేవారు. జీయర్ పట్ల అప్పా అమితమైన భక్తి ప్రపత్తుల కారణంగా వారి ఆశ్రయం పొందిరి). జీయర్ యొక్క దివ్య నోటి ద్వారా అన్ని శాస్త్రార్థాల శ్రవణం చేసే భాగ్యము వీరికి లభించినది. “ఛాయావాసత్వమనుగచ్ఛేత్” అనే శ్లోకంలో చెప్పినట్లు, వీరు జీయరుని ఒక్క క్షణం కూడా వదలకుండా వారిపైనే ఆధారపడి ఉండి వారి దివ్య తిరు ఛాయలో విశ్వసనీయ శిష్యునిగా జీవించారు.

అనంతరం, గోవింద దాసప్పర్ అనే ఒక వ్యక్తి, జీయర్ తిరువడి ఆశ్రయం పొంది భట్టార్పిరాన్ జీయర్ అయ్యారు. జీయర్ పాద పద్మాలనే తమ జీవనాధారముగా భావించేవారు.

“ముగిల్ వణ్ణన్ అడిమేల్ శొన్న శొల్ మాలై ఆయిరం” (మేఘ వర్ణుడైన ఆ భగవానుని చరణాలపై పాడిన వేయి పాశురాల మాల) లో చెప్పినట్లు, “మదిళరంగర్ వణ్పుగళ్ మేల్ ఆన్ఱ తమిళ్ మఱైగళ్ ఆయిరం” (కోట లాంటి ఆలయం లోపల నివసించే శ్రీ రంగనాధునిపై వేయి పాశురముల ద్రావిడ వేదం) లో చెప్పినట్లు మణవాళ మాముణులు ఎంబెరుమానునిపై పాడిన తిరువాయ్మొళి ఈడు వ్యాక్యానముపై ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. వీరు ఆరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) వ్యాఖ్యానాలపై, అలాగే శ్రీ వచన భూషణ నిగూఢమైన అర్థాలపైన, వీటికి సమతుల్యమైన రహస్య గ్రంథాలపైన కూడా ఉపన్యాసాలు ఇచ్చారు. “గురోర్ నామ సదా జపేత్” (ఆచార్యుని దివ్య నామాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలి) అని చేప్పినట్లుగా ప్రపన్న గాయిత్రి అనబడు ఇరామానుజ నూఱ్ఱందాదిని పఠిస్తూ రామానుజుల దివ్య తిరువడిని సేవిస్తూ ప్రతిరోజూ ఉపన్యాసాలు తీసుకునేవారు. వారు తిరుమలైయాళ్వార్ (తమ తిరుమాలిగలోని మంటపం) దివ్య నీడలో నివసిస్తూ, రామానుజుల తిరువడిని నిరంతరం సేవిస్తూ, ఇదే పురుషార్థముగా, తమ జీవనాధారముగా భావించేవారు. నిరంతరం సాటిలేని రామానుజుల మహిమల గురించి చర్చిస్తుండేవారు. పెరియ పెరుమాళ్ళ ఆజ్ఞానుసారంగా శ్రీ రంగరాజుని తమ తిరువారాధన పెరుమాళ్‌ గా ఆరాధించారు. ఐప్పసి (తులా మాసం) మాసంలో పిళ్ళై లోకాచార్యుల తిరునక్షత్రం రోజున (శ్రవణం) ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి తన దివ్య హస్తాలతో తిరువారాధన చేశారు. ఆ రోజున తమ తిరువారాధన పెరుమాళ్ళకు అక్కారడిశిల్ (పాయసం) ని సమర్పించి, పూర్వాచార్యుల దివ్య వాక్కులను వివరిస్తూ, శ్రీరంగశ్రీకి మంగళదీపంగా నిలిచాడు.

మణవాళ మాముణుల మహిమను విన్న జనులు ఇలా అన్నారు

చిరవిరహదశ చింతానజర్జచేతసం భుజగశయనం
దేవం భూయః ప్రసాదయితుం దృవం
యతికులపతిః శ్రీమాన్ రామానుజస్య మభూతయంత్విది
సమదుషన్ సర్వే సర్వత్ర తత్రసుధీజనాః

(శేష శయ్యపైన ​​శయనించి ఉన్న పెరియ పెరుమాళ్ళు శ్రీ రామానుజులకు దూరమై ఆ విరహ వేదనను భరించలేక వారిని ఓదార్చేందుకు శ్రీ రామానుజులే మణవాళ మాముణులుగా  అవతారము ధరించారని వివిధ ప్రాంతాలలోని పండితులు తెలిపిరి).

జీయరుని ఇలా కీర్తించారు…..

శమునిః సౌమ్యజామాతా సర్వేషాం ఏవ పశ్యతాం
శ్రీసకస్యనిధేశేన శుశుపే దేశిక శ్రియా

(అళగియ మణవాళన్ అనే నామాన్ని ధరించిన ఆ మునివర్యులు, తిరుమగళ్ (శ్రీ మహాలక్ష్మి) కి పతి అయిన పెరుమాళ్ళ ఆదేశాన్ని అనుసరించి, అందరి శ్రేయస్సు కొరకై, ఆచార్యశ్రీ (ఆచార్యుని జ్ఞాన సంపద) తో ఉండిపోయారు).

ఇవి విని, ఇతర ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఇలా అన్నారు….

తదస్సముత్సుఖాస్సర్వే శతశోత సహస్రశః
శరణం తస్య సంశ్రిత్య చరణౌ దన్యతాం గతాః

(ప్రజలు ఉప్పొంగిపోతూ వందలు వేల సంఖ్యలో వచ్చి, ఆ మణవాళ మాముణుల దివ్య పాదాల చెంత ఆశ్రయం పొంది కృతజ్ఞులైనారు).

దూరము దగ్గర తేడా లేకుండా సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా లెక్కలేనంత సంఖ్యలో వచ్చి వారి తిరువడి యందు ఆశ్రయం పొందారు. మాముణులు పరమ కృపతో, “తిరుత్తిత్ తిరుమగళ్ కేళ్వనుక్కు ఆక్కి (వారిని సరిదిద్ది శ్రీమహాలక్ష్మి పతికి దాసులుగా చేయడం) మరియు “అరంగన్ శెయ్య తాళిణైయోడార్తాన్నై”(శ్రీ రంగనాధుని పాద కమలములతో సంబంధపరచుట), మాముణులు వారి గుర్తింపును “అరంగన్ మెయ్యడియార్గల్” (శ్రీ రంగనాధుని దివ్య దాసులు) గా మార్చి, తిరుమాలడియార్గళ్ (శ్రీ మహాలక్ష్మి పతి యొక్క దివ్య దాసులు) అన్న గురింపుని అనుగ్రహించారు. వారందరూ కూడా తమలో ఎలాంటి దోషం లేకుండా, జీయరుకి అనుకూలంగా ఉండి వారి దివ్య పాదాలను సేవించుకున్నారు. మాముణులు వారికి ఉపదేశిస్తున్న భగవత్ విషయము వింటూ, ఆచార్యుల పట్ల అత్యంత భక్తితో జీవించారు..

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/25/yathindhra-pravana-prabhavam-40/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 15

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/29/anthimopaya-nishtai-14/ ), మనము భాగవతాపచారము వల్ల కలిగే దుష్పరిణామములను గమనించితిమి. ఈ వ్యాసములో, మనము ఆచార్యునితో మెలగుట, సేవించుట గురించి, ముఖ్యముగా ఆచార్యుని/భాగవతుని ప్రసాదము (ఉఛ్చిష్టము), శ్రీపాద తీర్థము (వారి పాదపద్మములను శుద్ధిపరచిన పుణ్య జలము) యొక్క విశిష్టతను గురించి తెలుసుకొందాము.

యోసౌ మంత్రవరమ్ ప్రాధాత్ సంసారోచ్చేద సాధనమ్
యది చేత్గురువర్యస్య తస్య ఉఛ్చిష్టమ్ సుపావనమ్

సాధారణ అనువాదము: సంసారము నుండి ఉద్ధరింపబడుటకు ఆచార్యుడు దయతో తిరుమంత్రమును ఎవరికైతే అనుగ్రహించి, వారికి తమ శేష ప్రసాదమును అనుగ్రహించిరో, దానిని శ్రేష్ఠమైనదిగా తప్పక స్వీకరించవలెను.

‘గురోర్యస్య యతోచ్చిష్టమ్ భోజ్యమ్ తత్పుత్ర శిష్యయోః’

సాధారణ అనువాదము: గురువు యొక్క శేషములను స్వీకరించుట శిష్యులకు పుత్రులకు శ్రేష్ఠము.

‘గురోరుఛ్చిష్టమ్ భుంజీత’

సాధారణ అనువాదము: గురువు యొక్క శేషములను తప్పక స్వీకరించవలెను.

పైన పేర్కొన్న ప్రమాణములు, అంతకు ముందు ఉదాహరించిన ప్రమాణములు, శిష్యులకు (ఆచార్య నిష్ఠయే అంతిమ లక్ష్యముగా నున్న వారికి) తమ ఆచార్యులే స్వయముగా సర్వేశ్వరుని అవతారమని సంపూర్ణ విశ్వాసము కలిగి, ఆచార్యుని శేష ప్రసాదము, వారి శ్రీపాద తీర్థము
(ప్రక్షాల్య చరణౌ పాత్రే ప్రణిపత్యోపయుజ్య చ; నిత్యమ్ విధివదర్ జ్ఞాత్యైర్ ఆవృత్తోభ్యర్చ్యాయేత్ గురుమ్ – ఆచార్యుని పాదపద్మములను ప్రక్షాళన గావించి వానిపై ప్రణమిల్లవలెను. వారి పాదపద్మములకు ప్రతి రోజు అర్ఘ్యప్రధానము చేసి అర్చించవలెను) మిక్కిలి శుద్ధి చేయునని, తల్లి పాలను సేవించే పసిపాపకు కలుగు తృప్తి వలే, వారికి తృప్తి నిచ్చును. ఇదియే శిష్యునికి జీవితాంతము మిక్కిలి ఆహ్లాదమును కలిగించే అంశమగును.

ఆచార్యుని పట్ల శిష్యుని ప్రవర్తనను విశదపరిచే మరికొన్ని ప్రమాణములు.

శ్రీరామానుజుని శ్రీపాద తీర్థమును స్వీకరించి వడుగనంబి పూర్ణ శుద్ధి నొందిరి.

గంగాసేతుసరస్వత్యాః ప్రయాగాన్ నైమిశాదపి
పావనమ్ విష్ణుభక్తానామ్ పాదప్రక్షాలనోదకమ్

సాధారణ అనువాదము : విష్ణు, గంగ, సేతు సముద్రము, సరస్వతి, ప్రయాగ, నైమిశారణ్యముల భక్తుని శ్రీపాద తీర్థము మిక్కిలి శుద్ధి గలది (ఇతరులను శుద్ధి చేయు శక్తి కలది)

శ్రీరామానుజుని శ్రీపాద తీర్థము స్వీకరించి దుష్ట ఆలోచనలున్న వ్యాపారులు కూడా శుద్ధి నొందిరి

యత్ తత్సమస్తపాపానామ్ ప్రాయశ్చిత్తమ్ మనీషిభిః
నిర్ణీతమ్ భగవద్భక్తపాదోదక నిషేవణమ్

సాధారణ అనువాదము : భగవత్ భక్తుల శ్రీపాద తీర్థమును స్వీకరించిన వివిధ పాపముల నుండి ముక్తి కలుగునని జ్ఞానులు తేల్చిరి.

ముదలియాండన్ శ్రీపాద తీర్థముచే గ్రామస్థులు శుద్ధి నొందిరి

తిస్రః కోట్యర్థకోటీ చ తీర్థాని భువనత్రయే
వైష్ణవాంఘ్రి జలాత్ పుణ్యాత్ కోటి భాగేన నో సమః

సాధారణ అనువాదము : ముల్లోకాలలోని (ఊర్ధ్వ, భూ, అధో లోకాలు) పుణ్య నదులను పరిశీలించినను, ఒక వైష్ణవుని శ్రీపాద తీర్థముతో కొంచెము కూడ పోల్చబడదు.

ప్రాయశ్చిత్తమ్ ఇదమ్ గుహ్యమ్ మహాపాతకినామపి
వైష్ణవాంగ్రి జలమ్ శుభ్రమ్ భక్త్యా సంప్రాప్యతే యది

సాధారణ అనువాదము : అత్యంత ఘోర పాపాత్ములకు కూడ విశ్వసనీయమైన ప్రాయశ్చిత్తము విష్ణు భక్తుని దోష రహితమైన శ్రీపాద తీర్థము స్వీకరించుటే.

నారదస్యాతితేః పాదౌ సర్వాసామ్ మందిరే స్వయమ్
కృష్ణ ప్రక్షాల్య పాణిభ్యామ్ పాపౌ పాదోదగమ్ మునేః

సాధారణ అనువాదము : శ్రీ కృష్ణుడు స్వయముగా మహర్షులైన నారదుడు, అధీతి వంటి వారి పాదములను కడిగి ఆ జలమును స్వీకరించిరి.

పెరుమాళ్ తిరుమొళి 2.3

‘తొణ్డర్ శేవడి చ్చెళుం శేఱు ఎన్ శెన్నిక్కణివనే’

సాధారణ అనువాదము : భక్తుల పాదపద్మములచే పవిత్రమైన (తొక్కబడిన) ఈ మృత్తిక నా శిరమునలంకిరించగలదు.

పెరుమాళ్ తిరుమొళి 2.2

‘తొణ్డరడిప్పొడి ఆడ నామ్ పెఱిల్ గంగై నీర్ కుడైన్ దాడుమ్ వేట్కై ఎన్నావదే’

సాధారణ అనువాదము : శ్రీమన్నారాయణుని సదా తలంచు పావనులైన శ్రీవైష్ణవుల పాదపద్మములపై బాంధవ్యమేర్పడిన వారికి, గంగలో మునిగి స్నానము చేయుట కూడ ఆకర్షణీయము కాదు.

తత్ పాదాంబుధూలం తీర్థమ్ తదుఛ్చిష్టమ్ సుపావనమ్
తదుక్తిమాత్రమ్ మంత్రాగ్ర్యమ్ తత్ స్ప్రుష్టమ్ అఖిలమ్ శుచి

సాధారణ అనువాదము : వారి పాద పద్మములను కడిగిన జలము పావనము; వారి ఉఛ్చిష్టము స్వచ్చము; వారి పలుకులు మహా మంత్రములు; వారిచే స్పృశించబడినవి శుద్ధమైనవి (దోషరహితములు)….

కోటిజన్మార్జితమ్ పాపమ్ జ్ఞానతోజ్ఞానతః కృతః
సత్యః ప్రదహ్యతే నృణామ్ వైష్ణవ ఉఛ్చిష్ట భోజనాత్

సాధారణ అనువాదము : శ్రీవైష్ణవుని ఉచిష్టమును భుజించినచో, అనేక జన్మల నుంచి తెలిసో/తెలియకో చేసిన పాపములన్నియు దగ్ధమవును.

తిరుమాలై 41

‘పోణగమ్ చెయ్త చేతమ్ తరువరేల్ పునిదమన్ఱే’

భగవానుని యొక్క మిక్కిలి సాధుపుంగవులైన భక్తులు తమ ఉచ్చిష్టమును ప్రసాదించి ఆశీర్వదించినచో మాత్రమే (అనగా, దానిని పొందుట అతి దుర్లభము)

ఈ విధముగా, పైన పేర్కొన్న ప్రమాణముల ద్వారా, మనము మన ఆచార్యులతో సమానులు, సత్వగుణ సంపన్నులు, మిక్కిలి జ్ఞానులు, అంకిత స్వభావులు, భౌతిక విషయ వాంఛారహితులైన గొప్ప భక్తుల ప్రసాదము, శ్రీపాద తీర్థమునకై ఎదురు చూచి, వానిని స్వీకరించవలెను. వారి ప్రసాదమును,  శ్రీపాద తీర్థమును ప్రేమతో మాత్రమే గాని మొక్కుబడిగా శాస్త్రము తెలిపినదని స్వీకరించరాదు. కారణము, అది శ్రీవైష్ణవులపై జీవాత్మ యొక్క దాస్యత్వమునకు నిదర్శనము మరియు జీవాత్మను నిలబెట్టును.

దీనినే ఇంకను వివరించిరి. ఆపస్థంభ ఋషి “శరీరమేవ మాతాపితరౌ జనయతః” అని ఆదేశించిరి.

(మాతా పితరులు ఈ శరీరమును ప్రసాదించిరి)

‘పితుః జ్యేష్టస్య బ్రాతురుచ్చిష్టమ్ భోక్తవ్యమ్’

(తమ పితరుల మరియు జ్యేష్ఠ సోదరుల ప్రసాదమును స్వీకరించవలెను) శిష్యులు / పుత్రులు పితరుల ప్రసాదమును స్వీకరించవలెను. ఆ ఋషియే ఈ విధముగా ఆదేశించిరి
“స హి విద్యాతస్తమ్ జనయతి; తచ్చ్రేష్టమ్ జన్మః”

(అతను తప్పక ఒక జ్ఞానునికి జన్మనిచ్చును. ఇది శ్రేష్ఠమైన జన్మ) ఆచార్యుడు యధార్థమైన జ్ఞానమును అనుగ్రహించును కనుక, వారిని విశిష్ఠ (ఆధ్యాత్మిక) పితరులుగా భావించవలెను. మన శారీరిక సంబంధము వల్ల పితరులైన వారి ప్రసాదమును ఎట్లు స్వీకరించెదమో, అదే విధముగా ఆధ్యాత్మిక పితరులైన (తమ ఆచార్యునికి సమానులైన గొప్ప భాగవతులు) వారి ప్రసాదమును, శ్రీపాద తీర్థమును కూడ స్వీకరించవలెను. సదాచార్యతుల్యులు అనగా (ఆచార్యునికి సమానులైన భాగవతులు) “ఆచార్యవత్ దైవన్ మాతృవత్ పితృవత్ ” (శ్రీవైష్ణవులు ఆచార్యులుగా, భగవానునిగా, మాతా పితరులుగా), తమ ఆచార్యునితో సమముగా శ్రీవైష్ణవులను భావించి ఆదరించవలెను.

ఇంకా, శ్రీ వచన భూషణంలో పిళ్ళై లోకాచార్యుల దివ్య వక్కుల ప్రకారం స్వచ్ఛమైన భాగవతుల గురించి ఈ విధంగా వివరించబడింది..

సూత్రము 259

‘అనుకూలరాగిరార్ జ్ఞానభక్తివైరాగ్యన్గళ్ ఇట్టు మాఱినాప్పోలే వడివిలే తొడై కొళ్ళలామ్పడియిరుక్కుమ్ పరమార్ త్తర్’

సాధారణ అనువాదము : అత్యంత జ్ఞానము (నిజమైన ప్రజ్ఞ), భక్తి (శ్రద్ధ), వైరాగ్యము (భౌతిక వాంఛలనుంచి దూరము), పరమపదము పొందవలెనని కోరిక వున్నవారు అనుకూల వ్యక్తులు. వారిని చూడగానే, అందరు వారితో సంబంధమునకై స్ఫూర్తి కలిగి – వారికి ఎల్ల వేళలా గల ప్రేమాతిశయము ద్వారా భగవానునితో వారికి గల అమిత అనుబంధమును గమనించవచ్చును.

సూత్రము 223

‘అతావతు, ఆచార్యతుల్యర్ ఎన్ఱుమ్ సంసారిగళిలుమ్, తన్నిలుమ్, ఈశ్వరనిలుమ్ అధికర్ ఎన్ఱుమ్ నినైక్కై’

అనగా, శ్రీవైష్ణవులు ఆచార్యునితో సమానులు. వారు సంసారులు (విషయ వాంఛాపరులు), స్వీయులు, స్వయముగా భగవానుని కన్నా ఆదరణీయులు.

సూత్రము 451

‘…అనుకూలర్ ఆచార్య పరతంత్రర్…’

తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసము గల శిష్యునికి, మిక్కిలి ఇష్టులైన వారు ఎవరనగా వారి ఆచార్యునిపై పూర్తిగా ఆధారులైన వారు.

రామానుజ నూఱ్ఱందాది పాశురములలో ఈ సూత్రమునే తిరువరంగత్తు అముదనార్ గుర్తించిరి.

పాశురము 85

‘ఇరామానుజనైత్ తొళుం పెరియోర్ పాదమల్లాల్ ఎన్ఱన్ ఆరుయిర్కు యాదొన్ఱుమ్ పఱ్ఱిల్లైయే’

శ్రీరామానుజుని ఆరాధించే గొప్ప భాగవతుల పాదపద్మములు మాత్రమే నా మనస్సుకు శరణాగతి – ఇతరములేవియును కాదు.

పాశురము 105

‘ఇరామానుజనైత్ తొళుం పెరియోర్ ఎళుంతిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కిరుప్పిడమే’

శ్రీ రామానుజుని ఆరాధించి, వారి మహిమలను గానముగా, నృత్యముగా గొప్ప భాగవతులు ఎచట చేయుదురో, అదియే నా నివాసము.

కావున, భాగవతులనగా భౌతిక విషయ వాంఛారహితులు, ఆచార్యునికి శరణాగతి చేసినవారికి విధేయులు. అట్టి ఆచార్య నిష్ఠాపరుల సేవలో సదా నిమగ్నమైన వారు.

సర్వజ్ఞులైన మన ఆచార్యులు ఈ సూత్రమునే మిక్కిలి స్పష్టముగా తగిన ప్రమాణముల ద్వారా వివరించిరి. ఇతరులు కూడ దీనినే వివరించిరి. దీనినే పిళ్ళై లోకాచార్యులు రామానుజ నూఱ్ఱందాదిలో వివరించుట గమనించవచ్చును.

పరమ సాత్వికుల మధ్య శ్రీరామానుజులు

పాశురము 80

నల్లార్ పరవుమ్ ఇరామానుజన్ తిరు నామమ్
నంబ వల్లార్ తిఱత్తై మఱవాతవర్గళ్ ఎవర్
అవర్కే ఎల్లా విటత్తిలుమ్ ఎన్ఱుమ్ ఎప్పోతిలుమ్ ఎత్తొళుంబుం
చొల్లాల్ మనత్తాల్ కరుమత్తినాల్ చెయ్వన్ చోర్విన్ఱియే

సాధారణ అనువాదము: పరమ సాత్వికులైన శ్రీరామానుజులకు శరణాగతి చేసిన, వారి దివ్య నామమును సదా స్మరించు, భాగవతులను నేను సేవించెదను. వారి కొరకు నేను అన్ని స్థలములలో, అన్ని వేళలలో, అన్ని విధములుగా మనసా వాచా కర్మణా సేవ చేయుదును.

పాశురము 107

ఇన్బుఱ్ఱ శీలత్తిరామానుజ, ఎన్ఱుమ్ ఎవ్విటత్తుమ్
ఎన్బుఱ్ఱ నోయుడల్ తోఱుమ్ పిఱన్తిఱన్తు
ఎణ్ణరియ తున్బుఱ్ఱు వీయినుమ్ సొల్లువతొన్ఱుణ్డు
ఉన్ తొణ్డర్కట్కే అన్బుఱ్ఱిరుక్కుమ్ పడి, ఎన్నై ఆక్కి అన్గాట్పడుత్తే

సాధారణ అనువాదము : ప్రియ రామానుజ! నేను అత్యంత అల్పుడనైనను, మీరు మిక్కిలి కరుణచే నా మనస్సున విచ్చేయుట మీ ఆశీర్వాదముగా భావించెదను. నాకొక చిన్న కోరిక కలదు. నేను అనేక అల్ప జన్మలు పొందినను, రోగగ్రస్థుడనైనను, ఎచట ఏ స్థితిలో జన్మించినను మీ ప్రియ సేవకులకు నేను సంపూర్ణ శరణాగతి చేయునట్లు అనుగ్రహించుడు.

కూరత్తాళ్వాన్ ప్రియ తనయులైన పరాశర భట్టర్ భగవద్విషయముపై (తిరువాయ్మొళి కాలక్షేపము) ఒక పెద్ద గోష్ఠిలో ప్రసంగించుచుండగా, ఆళ్వాన్ సతీమణి ఆండాళ్ (భట్టర్ కు తల్లి) అచ్చటకు విచ్చేసి, తమ తనయుని ముందు మోకరిల్లి, శ్రీపాద తీర్థమును గైకొనిరి. దీనిని చూచిన గోష్ఠిలోని ఒక శ్రీవైష్ణవుడు “ఒక తల్లి తన పుత్రుని ముందు మోకరిల్లి వారిచే శ్రీపాద తీర్థమును స్వీకరించుటయా?” అనిరి. అతనికి, గోష్ఠికి సమాధానముగా ఆండాళ్ “ప్రియ పుత్రులారా! ఎవరైనను ‘ఇతరుల కొరకు ఇతరులచే ప్రతిష్టింపబడిన భగవానుని తీర్థ ప్రసాదములను స్వీకరింపవచ్చునని, కాని నాచే ప్రతిష్టింపబడిన ఎంపెరుమాన్ నుంచి దానిని నేనెట్లు స్వీకరించవచ్చును?’ అనినచో, అట్టి వారు కఠినాత్ములు మరియు సరియైన జ్ఞానము పొందని వారు – అవునా?” అనిరి. ఈ సంఘటనను అళగియ పెరుమాళ్ నయనార్ తమ తిరుప్పావై వ్యాఖ్యానములో వివరించిరి. ఆండాళ్ తమ పుత్రుని నుంచి తీర్థమును ఎందుకు అంగీకరించిరి? ఎందుకనగా :

‘న పరీక్ష్యవయో వంధ్యాః నారాయణపరాయణాః’

శ్రీమన్నారాయణుని భక్తుని వయస్సును, సామర్ధ్యతను బట్టి నిర్ణయించరాదు. పెరుమాళ్ తిరుమొళి – 7.6 – ‘వణ్ణచ్చెమ్ శిఱుకైవిరలనైత్తుమ్ వారి వాయ్ క్కొణ్డ అడిశిలిన్ మిచ్చల్ ఉణ్ణప్పెఱ్ఱిలేనో కొడువినైయేన్…’

దేవకి భావములో కులశేఖరాళ్వార్ – కృష్ణుడు తన అందమైన ఎర్రని వ్రేళ్లతో గుప్పెడు అన్నమును అందుకొని ఆరగించినప్పుడు, నోటి నుండి జారి పడిన ముద్దలను నేను తినలేక పోవుట మిక్కిలి దురదృష్టకరము అని గానము చేసిరి.

అనువాదకుని గమనిక : ఈ విధముగా, మనము ఆచార్యులతో,  శ్రీవైష్ణవులతో వ్యవహరించు సరియైన ఆచారములను, ఆచార్య/భాగవత ప్రసాదము, శ్రీపాద తీర్థ మహిమలను గమనించితిమి. తదుపరి భాగములో, తమ జన్మతో సంబంధము లేకుండా శ్రీవైష్ణవుల విశిష్టతను వివరముగా తెలుసుకొనెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారమునిచ్చిన శ్రీరంగనాథన్ స్వామికి కృతజ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-15.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 39

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 38

నాయనార్ల సన్యాసాశ్రమ స్వీకారం

ఆ సమయంలో, దక్షిణ దేశము నుండి కొందరు వచ్చి, నాయనార్ల బంధువులలో ఒకరు పరమపదించారని కబురిచ్చి, వారు చేసే పెరుమాళ్ళ సేవలో బాధ కలింగించారు. శ్రీరంగనాధుని తిరువడిని తమ శిరస్సుపై ఉంచుకొని వారికి కైంకర్యము నిర్వహిచుకుంటూ తనను తాను నిలబెట్టుకుంటున్న తనకు, ఎమ్పెరుమానుని నుండి ఈ విరహము మహా దుఃఖాన్ని కలిగిస్తుందని శోకించసాగారు; “త్వద్పాదపద్మ ప్రవణాత్మ వృద్దేర్ భవంతి సర్వే ప్రతికూలరూపాః” (పెరుమాళ్ళ దివ్య తిరువడి సంబంధములో మునిగి ఉన్న ఈ దాసుడికి, ఈ విషయాలన్ని పెరుమాళ్ళ అనుభవానికి విరుద్దమైనవి), వెంటనే వారి విద్యార్థి రోజుల్లోని చిన్ననాటి స్నేహితుడైన శఠగోప జీయర్ను కలుసుకోడానికి వెళ్ళారు. ఈ క్రింద శ్లోకములో చెప్పబడింది…..

చన్దం తస్యైష విజ్ఞాయ నందన్ నందన్ నిరంతరం
సర్వం శంగం పరిత్యజ్య తుంగం ప్రావిశదాశ్రమం

(అళగియ మణవాళ నాయనార్, శఠగోప జీయర్ల దివ్య సంకల్పాన్ని తెలుసుకుని, చాలా సంతోషించారు. అన్ని అనుబంధాలను త్యజించి గొప్పదైన సన్యాసాశ్రమ స్థితికి చేరారు. అన్ని సంబంధాలను విడిచిపెట్టి  పూర్ణ వైరాగ్యముతో సన్యాసిగా మారెను. శఠగోప జీయర్ వారికి త్రిదండం [చిత్, అచిత్, ఈశ్వరులకి ప్రతీకమైన మూడు దండములు] మరియు కాషాయ వస్త్రాలు తమ చేతులతో వారికి అందించగా, నాయనార్ వాటిని ధరించి ఇద్దరూ కలిసి సన్నిధికి వెళ్లి పెరుమాళ్ళను సేవించుకున్నారు. ఈ శ్లోకాన్ని పఠించారు.

మంగళం రంగదుర్యాయ నమః పన్నగశాయినే
మంగళం సహ్యజామధ్యే సాన్నిత్యకృత చేతసే

(శ్రీరంగనాధునికి మంగళం. ఆదిశేషుని శయ్యపై పవ్వళించి ఉన్న పెరుమాళ్ళ దివ్య పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. ఉభయ కావేరుల నడుమ నిత్యం నివాసముండాలని దృఢ సంకల్పముతో ఉన్న ఆ పెరుమాళ్ళకి మంగళం). పెరుమాళ్ వారిని అనుగ్రహించి, తమ పూర్వాశ్రమ దివ్య నామాన్నే (మణవాళన్) తమ సన్యాశ్రమ నామముగా పెట్టుకోమని ఆదేశించారు. “మేము మీకు పల్లవరాయ మఠం ప్రసాదిస్తున్నాము. ఎంపెరుమానార్ వలే మీరు కూడా మీ దేహమున్నంత వరకు ఇక్కడే ఉండండి” అని ఆదేశించారు. [అంతకు ముందు ఈ పల్లవరాయ మఠం కందాదైయాండాన్ (రామానుజర్ మేనల్లుడు మరియు శిష్యుడైన ముదలియాండన్ తిరుకుమారులు) తమ ఆచార్యులైన ఆట్కొణ్డవిల్లి జీయర్ కోసం నిర్మించారు].  ‘ఎన్నైత్ తీమనం కెడుత్తార్’ (కృష్ణుడికి దివ్య నామము, మనస్సు నుండి చెడు ఆలోచనలను తొలగిస్తాడు కాబట్టి) అను తమ తిరువారాధన పెరుమాళ్ళ కోసం, పెరుమాళ్ళు శ్రీ రంగం ఆలయం నుండి నేతి దీపము మరియు ప్రసాదం [జీయర్లకు అగ్నితో ఎలాంటి సంబంధం ఉండకూడదు; అందువల్ల వారు ప్రసాదం వండ లేరు మరియు దీపాలను వెలిగించలేరు] ఏర్పాటు చేశారు. వారి వంశస్థులు, ఆ సమయంలో పరస్పర భేదాల కారణంగా ఆలయ ఉగ్రాణము (స్టోర్ హౌస్‌) కు ఆ విగ్రహాన్ని ఇచ్చేసారు. అంతకు పూర్వం, అత్యంత విశిష్టమైన రామానుజ కూటం పల్లవరాయులు నడుపు చుండుట వలన పల్లవరాయ మఠంగా మారింది. పెరుమాళ్ళు ఆ మఠాన్ని మరియు తిరువారాధన విగ్రహమైన ఎన్నైత్ తీమనం కెడుత్తార్ ని మణవాళ మాముణులకి ప్రసాదించెను. “నిసృష్టాత్మా సుహృత్సుచ” (తమ స్నేహితులకు తన బాధ్యతలను అప్పగించేవాడు) అని చెప్పినట్లు, పెరుమాళ్ కూడా తమ బాధ్యతను వారికి అప్పగించి, పరివట్టం, తీర్థ శఠారీలను వారికి ప్రసాదించిరి. అనంతరం పెరుమాళ్ళు ఉత్తమ నంబి మరియు ఇతరులను అళగియ మణవాళ జీయర్ ను వారి మఠానికి తోడుగా వెళ్ళమని ఆదేశించారు. వారు కూడా అలాగే చేసి “అడియార్గళ్ వాళ అరంగ నగర్ వాళ.. మణవాళ మామునియే ఇన్నుమొరు నూఱ్ఱాండు ఇరుం” (భక్తులను అలాగే శ్రీరంగం నగరాన్ని ఉద్ధరించడం కోసం .. . . . . . . . . ఓ అళగియ మణవాళ మాముని! మరో వంద సంవత్సరాలు జీవించు) అని కీర్తించారు.

వానమామలై జీయర్ మరియు ఇతరుల సహాయంతో, వారు మొత్తం మఠాన్ని పునరుద్ధరించారు. వారు వ్యా ఖ్యాన మండపం నిర్మించి, దానిని తిరుమలైయాళ్వార్ అని పిలిచేవారు (తమ ఆచార్యుల నామము). పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరుమాలిగ నుండి మట్టిని తెచ్చి, దానిని “రహస్యం విళైంద మణ్” (రహస్యార్థాలు వెలువడిన నేల) అని పలుకుతూ తాము కూర్చునే చోటి ఎదుట రక్షణగా చల్లేవారు. ఆ ప్రదేశాన్ని తమ గురుకులవాసంగా భావించి, అక్కడ తమ ఆచార్యుల దివ్య పాద పద్మ యుగళి యందు నివసిస్తున్నట్టుగా భావించి అక్కడి నుండి నిత్యం ఉపన్యాసాలు ఇచ్చేవారు. తిరువాయ్మొళి పిళ్ళై నమ్మాళ్వార్ల దివ్య నామంతో ప్రకాశించినట్లే, మాముణులు కూడా నంపెరుమాళ్ళ దివ్య నామంతో ప్రకాశించారు. “రంగమంగళ దుర్యాయ రమ్యజామాతృయోగినః” (మంగళాసనపరర్లు అయిన మణవాళ మాముణులకి శుభం కలుగుగాక) అన్న సూక్తి ప్రకారం ఆలయానికి శుభం చేకూర్చుచున్న ఆ రోజుల్లో స్థానిక వాసులు వారిని ఇలా కీర్తించారు…

ఆచార జ్ఞాన వైరాగ్యై రాగారేణచ తాదృశః
శ్రీమాన్ రామానుజస్సోయమిత్యాశం సన్మితః ప్రజాః

(రూపంలో, ప్రవర్తనలో, జ్ఞాన వైరాగ్యములో మాముణులు రామానుజులను పోలి ఉండేవారు కాబట్టి, వీరు ఆ శ్రీమాన్ రామానుజులే నని స్థానికులు ఒకరితో ఒకరు చెప్పుకునేవారు). వీరు ఎంపెరుమానార్ల పునరవతారమని తమ మనస్సులో దృఢంగా వాళ్ళు భావించేవారు. అందరూ వారి దివ్య తిరువడి యందు ఆశ్రయం పొంది పునీతులు కావాలని ఆశించేవారు. వారు “పరమపద నివాస పణిపుంగవ రంగపదేర్ భవనమిదం హితాయ జగతో భవదాదిగతం” ”(శ్రీ  వైకుంఠంలో నివసించే ఓ తిరు అనంతుడా! ఈ లోకరక్షణ కోసం అళగియ మణవాళన్ (శ్రీ రంగనాధుడు) కొలువై ఉన్న ఈ శ్రీ రంగములో లోక రక్షణ కొరకై మణవాళ మాముణులు నివాసులై ఉన్నారు) వారు పెరుమాళ్ తిరుమొళి పాశురం 1-10 “వన్పెరు వానగం ఉయ్య అమరరుయ్య మన్నుయ్య మన్నులగిల్ మణిసరుయ్య తుంబమిగు తుయర్ అగల అయర్వొన్ఱిల్లాచ్చుగం వళర అగమగిళుం తొణ్డర్ వాళ అన్బొడు తెన్దిసై నోక్కి ప్పళ్ళి కొళ్ళుం” (శ్రీ రంగంలో దక్షిణం వైపు చూస్తూ కొలువై ఉన్న పెరుమాళ్ళు,  స్వర్గం, పై లోకాలు, దేవలోక వాసులు, భూమి, భూలోక వాసులు, ఎటువంటి బాధ లేకుండా సుఖ సమృద్ధులతో వృద్ధి చెందాలని, తమ భక్తుల ఆనందాన్ని పొందడం కోసం అక్కడ ఉన్నాడు). భక్త రక్షణ కోసమై పెరియ పెరుమాళ్ళు శ్రీరంగంలో తమ నివాసం ఏర్పరచుకున్నట్లు, మణవాళ మాముణులు కూడా అక్కడే నివాసం ఉన్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/24/yathindhra-pravana-prabhavam-39/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 38

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 37

శ్రీ భాష్యం వ్యాఖ్యానాన్ని కిడాంబి నాయనారు వద్ద నాయనార్లు శ్రవణం చేయుట

అక్కడ [కాంచీపురంలో] కిడాంబి ఆచ్చాన్ [ఉడయవర్ల కోసమై మడప్పళ్ళి కైంకర్యం చేయమని తిరుక్కొట్టియూర్ నంబి చేత నియమించబడిన వారు] వంశస్థులైన కిడాంబి నాయనార్ల దివ్య పాదాలకు వారు సాష్టాంగ నమస్కారం చేసి, తమకు శ్రీ భాష్యము ఉపదేశించమని అభ్యర్థించెను. వారితో పాటు, వారి శిష్యులు మరో ఇద్దరు ఐయైగళ్ అప్పా మరియు శెల్వనాయనార్ కూడా శ్రద్దా భక్తులతో కిడాంబి నాయనార్ల వద్ద శ్రీ భాష్య వ్యాఖ్యానాన్ని విన్నారు.  నాయనార్ల వాక్పటుత్వ శక్తిని ఐయైగళ్ అప్పా చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు కిడాంబి నాయనార్లతో  “దేవర్వారు తమ సామర్థ్యాలకు సరితూగే భావార్థాలను తమకి బోధిస్తున్నట్లు గోచరించడం లేదు” అని తమ మనస్సులో ఉన్న మాట వారికి తెలిపారు.

కిడాంబి నాయనార్ “మీరు రేపు వారిని పరీక్షించండి” అని ఐయైగళ్ అప్పాకు  చెప్పి వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. నైపుణ్యులైన ఐయైగళ్ అప్పా మరునాడు నాయనారుని పరీక్షించడానికి సిద్ధమయ్యారు. ఉపన్యాసంలో నాయనారు మొదటి పాఠము యొక్క భావార్థాలను వెయ్యి రెట్లు ఎక్కువగా వివరించారు. ఇది విన్న ఐయైగళ్ అప్పా “కిడాంబి నాయనారు మాకు చెప్పిన అన్ని వివరణలు దేవర్వారు మాకు వివరించారు, పైగా ప్రత్యేక అర్ధాలను జోడించి అంతకంటే ఎక్కువగా, దేవర్వారు అనుగ్రహించారు” అని ఆశ్చర్యపోయారు. అది విన్న కిడాంబి నాయనారు అక్కడికి వచ్చారు. వారి శిష్యగోష్ఠిలో కొందరు విద్వానులు నాయనారుతో చర్చలో పాల్గొనాలని తమ కోరికను వ్యక్తం చేశారు. ఆళ్వార్ తిరునగరిలో తిరువాయ్మొళి పిళ్ళై చెప్పిన మాటలను నాయనార్లు గుర్తు చేసుకుంటూ “ఇతర తత్వాలకు సంబంధించిన వ్యక్తులతో వ్యవహరించవద్దని మా ఆచార్యులు నిషేధం విధించారు” అని నాయనారు ఐయైగళ్ అప్పాకి వినయంతో చెప్పారు. ఐయైగళ్ అప్పా నాయనార్లతో “వీరు శ్రీవైష్ణవులే కాదా! వీరితో చర్చించడం ద్వారా మీ స్వరూపానికి ఎటువంటి హానీ కలుగదు. దయచేసి వారి కోరికను మన్నించండి” అని ప్రార్థించారు. నాయనారు వారికి తర్కం, అర్థాలు, తత్వశాస్త్రంపై ఒక ఉపన్యాసము ఇచ్చారు. నాయనార్ల పలుకులు విన్న తర్వాత వాళ్ళందరూ నాయనార్లను స్తుతిస్తూ వారి దివ్య తిరువడికి ఎదుట సాష్టాంగము చేశారు. వాళ్ళు “వీరెవరో ఇతరులలాగే సాధారణ శిష్యుడు అని భావించాము. కానీ శాస్త్రాలన్ని వారిలో ఇమిడి ఉంచుకున్నారు వీరు” అని కిడాంబి నాయనారుతో అన్నారు. కిడాంబి నాయనారు వారికి “అతన్ని ఒక అవతారంగా భావించండి” అని తెలిపారు. తరువాతి కాలములో నాయనార్ల ద్వారా ఆరుళిచ్చెయల్ అర్థాల ప్రచారము చేయాలనే ఉద్దేశ్యంతో, కిడాంబి నాయనారు ఎంతో ఆసక్తితో నాయనార్లతోకి శ్రీ భాష్యం బోధించుట ప్రారంభించారు. నాయనారు ఈడు వ్యాఖ్యానం కంఠస్థం చేస్తూ ఉండేవారు. ఇది విన్న కిడాంబి నాయనారు ఒకరోజు నాయనారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని కలుసుకుని, “దేవర్వారికి ముప్పత్తాఱాయిర ప్పెరుక్కర్ అనే దివ్య నామం ఊరికే రాలేదు. ఇంతటి తెలివితేటలు మెధస్సు మేము మరెక్కడా చూడలేదు. నా మనస్సులో ఒక కోరిక ఉంది, మీరు తప్పక నెరవేర్చాలి.” అని ప్రార్థించారు. నాయనారు వారి కోరిక ఏమిటో అడిగారు. కిడాంబి నాయనార్ వారితో, “దేవర్వారు ఒక ముఖ్యమైన అవతారమని మేము విన్నాము. దయచేసి మా వద్ద దాచవద్దు. అదేమిటో మాకు వెల్లడి చేయండి” అని పార్థించారు. నాయనారు వారితో “మీరు అడియేన్ ఆచార్యులు, మీతో నేను ఏ విషయము దాచలేను. దయచేసి పెరియ పెరుమాళ్ళ ఈ ఆజ్ఞను ఎవరికీ తెలియకుండా దాచండి” అని చెప్పి దగ్గరలో ఉన్న దీపపు కాంతిని పెంచి, భయపడ వద్దని కిడాంబి నాయనారుని సావధానపరచి, తమ నిజ స్వరూపమైన ఆదిశేషుని దివ్య రూపాన్ని వారికి దర్శింపజేసెను. కిడాంబి నాయనారు భయంతో వణికిపోయి, దయచేసి ఈ రూపాన్ని దాచిపెట్టండి అని ప్రార్థించగా నాయనారు తమ యధా రూపాన్ని తిరిగి ధరించారు. అనంతరం, దీనిని దేవ రహస్యంగా భావించి కిడాంబి నాయనారు నాయనార్లకి వాత్సల్యంతో వారి దివ్య స్వరూపానికి తగిన ప్రసాదాలను అందించేవారు. శ్రీ భాష్యం కలక్షేపం పూర్తయ్యే వరకు, తమ తిరుమాలిగలో ఉన్న ఆవుల నుండి పిండిన పాలను  నాయనార్లకు పంపేవారు. కొద్ది రోజుల్లోనే శ్రీ భాష్యం పూర్తయింది. పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళిలో “వేదంత విళుప్పొరుళిన్ మేలిరున్ద విళక్కై విట్టుశిత్తన్ విరిత్తనన్” – ఎలాగైతే విష్ణుచిత్తులు {పెరియాళ్వార్} ఉపనిషత్తుల అంతరంగ అంతరార్థమైన ఎమ్పెరుమానుని వెల్లడి చేశారో), సంస్కృత వేదంతం మరియు ద్రావిడ వేదాంతం రెండింటిలో నిపుణుడైన నాయనార్ దేవ పెరుమాళ్ళ మహిమలను వెల్లడిచేస్తూ కాంచిపురములోనే కొంతకాలము ఉన్నారు. వారు దయతో ఒక సంవత్సరం పాటు  శ్రీ భాష్యం మరియు భగవత్ విషయములపై యతోక్తకారి సన్నిధిలో​​ ఉపన్యసించారని పెద్దలు చెబుతారు.  ఈ కారణంగానే ఈ క్షేత్రములో వీరి అర్చా స్వరూపం ఉపదేశ ముద్రతో దర్శనమిస్తారు. కాంచీపురంలో ఉన్న కాలములో, భగవత్ విషయానికి (తిరువాయ్మొళి) సంబంధించిన వివిధ తాళపత్రాలను, ఆ ప్రాంతంలో వెతికి వెలికి తీసి, వాటిని తీసుకొని శ్రీరంగానికి బయలుదేరారు. ఈ క్రింద శ్లోకంలో చెప్పినట్లు.

తతః ప్రతినివృత్తంతం పురుషో భుజకేశయః
ప్రత్యుత్కమ్య ప్రభుః స్వైరం పునః ప్రవేశయ్ త్ పురం

(అనంతరం, సర్పశయ్యపైన శయనించి ఉన్న శ్రీ రంగనాధుడు తమ సంకల్పానుసారం, శ్రీ రంగానికి తిరిగి వస్తున్న ఆ అళగియ మణవాళ పెరుమాళ్ ను స్వాగతించుటకు వెళ్ళెను). పెరుమాళ్ళచే స్వాగతిపబడిన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ శ్రీ రంగములోకి ప్రవేశించి పెరుమాళ్ళను సేవించెను. పెరుమాళ్ళు తమ తీర్థ ప్రసాదాన్ని వారికి ఎంతో సంతోషంగా ఇవ్వాలని ఆశించెను. పెరుమాళ్ళు వారితో ఇలా అన్నారు…

నిత్యం రంగే నివాసాయ ప్రార్తితః పణిశాయినా
పశ్యన్ పదాంబుజం తస్య పాలయామాస శాసనం

(“ఇకపై ఈ శ్రీరంగంలో ఉండండి” అన్న పెరుమాళ్ళ అభ్యర్థనకు అనుగుణంగా, అళగియ మాణవాళ పెరుమాళ్ ఆ ఆజ్ఞను పాటించెను), “శాశ్వతంగా ఇక్కడే ఉండుము” అన్న పెరుమాళ్ ఆజ్ఞను నాయనార్ స్వీకరించి శిరసా వహించారు. అక్కడ ఉన్న ప్రముఖులందరూ “పెరుమాళ్ళను నిత్యం స్తుతిస్తూ దేవర్వారు ఇక్కడే ఉండాలి” అని అభ్యర్థించారు. వారు ఆమోదము పలికారు.  పూర్వాదినచర్య 19వ శ్లోకం ప్రకారం

శ్రీమద్ రంగం జయతు పరమం ధామ తేజో నిదానం
భూమా తస్మిన్ భవతు కుశలే కోపీ భూమాసహాయః
దివ్యం తస్మై దిశతు విభవం దేశికో దేశికానాం
కాలే కాలే వరవరమునిః కల్పయన్ మంగళాని

(ఇతరులపై గెలుపు పొందే సామర్థ్యం ఉన్న మహోన్నత శ్రీరంగం బాగా వర్ధిల్లాలి. శ్రీదేవి భూదేవిలతో పెరియ పెరుమాళ్ళు తగిన రీతిలో అక్కడ నివాసముండాలి. ఆచార్యులలో ప్రథములైన వరవరముని (అళగియ మణవాళన్) ఆ పెరుమాళ్ళకి మంగళాశాసనాన్ని చేసి ఆ పెరుమాళ్ళకి మహా కీర్తిని తెచ్చిపెట్టాలి), వారు తగిన సమయాల్లో పెరుమాళ్ళకు మంగళాశాసనాలు చేస్తుండేవారు. “అరంగర్ తం శీర్ తళైప్ప” (శ్రీరంగనాధుని దివ్య మంగళ గుణాలు పోషింపబడ్డాయి) అని చెప్పినట్లు, పెరుమాళ్ళ దివ్య సంపద సమృద్ధి చెంది అన్ని చోట్లా వ్యాపించింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/22/yathindhra-pravana-prabhavam-38/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 36

నాయనార్ శ్రీపెరుంబుదూరుకి బయలుదేరుట

అనంతరం, ఈ క్రింది శ్లోకములో చెప్ప బడినట్లు నాయనార్లు శ్రీపెరుంబుదూరుకి బయలుదేరారు.

యతీంద్రత్ జననీంప్రాప్య పురీం పురుషపుంగవః
అంతః కిమపి సంపశ్యన్నత్రాక్షీల్ల క్షమణం మునిం

(పామరోత్తముడైన అళగియ మణవాళర్, యతిరాజుల జన్మస్థలమైన శ్రీపెరంబుదూరుకి వెళ్ళి, ఆ ప్రదేశము వైశిష్ఠతను వీక్షించి ఎంతో సంతోషించి ఇళయాళ్వార్ (రామానుజ) ను దర్శించుకున్నారు). ఆ ఊరు ఎదుట నిలబడి ఆనంద అనుభూతిని అనుభవిస్తూ ఇలా అన్నారు…

ఇదువో పెరుంబుదూర్? ఇంగే పిఱందో
ఎతిరాశర్ ఎమ్మిడరై త్తీర్ త్తార్? – ఇదువోదాన్
తేంగుం పొరునల్ తిరునగరిక్కొప్పాన
ఓంగు పుగళుడైయ ఊర్

(ఇది శ్రీపెరుంబుదూరేనా? మన అవరోధాలను తొలగించేందుకు అవతరించిన యతిరాజుల ఊరా ఇది? తామ్రపర్ణి ఒడ్డున ఉన్న ఆళ్వార్ తిరునగరికి సమానమైన ప్రతిష్ఠ ఉన్నది ఈ చోటికే కదా!) వారు పట్టణ ప్రవేశం చేస్తూ మరో పాశురాన్ని పఠించారు.

ఎందై ఎతిరాశర్ ఎమ్మై ఎడుత్తళిక్క
వంద పెరుంబుదూరిల్ వందోమో! – శిందై
మరుళో? తెరుళో? మగిళ్ మాలై మార్బన్
అరుళో ఇప్పేఱ్ఱుక్కడి?

(మనల్ని ఆదుకోడానికి వచ్చిన మన స్వామి యతిరాజుల శ్రీ పెరుంబుదూరుకి చేరుకున్నామా? మన మనస్సు స్థిరంగా ఉందా లేదా  భ్రమిస్తోందా? మగిళమాలను తమ ఛాతీపై ధరించిన అతని (నమ్మాళ్వార్) కృపనా మనకు దక్కిన ఈ భాగ్యం [శ్రీ పెరుంబుదూరుకి వచ్చే]?) అసాధ్యమైన దివ్య లక్ష్యాన్ని సాధించాలని, మననము చేస్తూ ఆనందంతో పట్టణ ప్రవేశం చేసారు. ఇరామానుశ నూఱ్ఱందాదిలోని 31వ పాశురము పఠించారు. “ఆండుగళ్ నాళ్ తింగళాయ్ …. ఇరామానుశనై ప్పొరుందినమే” (ఓ మనసా! ఎంతో కాలంగా ఎన్నో జన్మలనెత్తి ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాము. కానీ, ఈ రోజు కాంచీపురంలో, దివ్య భుజములతో కొలువై ఉన్న దేవరాజ పెరుమాళ్ళ తిరువడి ఆశ్రయం పొందిన రామానుజులు మనతో ఉన్నారు) అని తమ చంచలమైన మనస్సుతో అన్నారు. శ్రీభాష్యం నేర్చుకోవడానికి అనుమతి కోరుతూ శ్రీపెరుంబుదూర్ ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రాత్రి వారి స్వప్నంలో ఎమ్పెరుమానార్లు వచ్చి, నాయనారుని పిలిచి, అతనికి శ్రీ భాష్యము బోధిస్తూ, “మేము మీకు పెరుమాళ్ కోయిల్ (కాంచిపురం దేవ పెరుమాళ్ ఆలయం) లో శ్రీ భాష్యాన్ని నేర్పిస్తాము. కిడాంబి నాయనార్ వద్దకు వెళ్ళండి. మమ్మల్ని మరియు తిరువాయ్మొళి పిళ్ళైని సంతోష పెట్టడం కోసం నేర్చుకోండి, ఆపై ఆరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం) వ్యాఖ్యానాల ప్రచారం చేస్తూ ఉండండి” అని ఆదేశించెను. ఎమ్పెరుమానార్ల సూచనలకు అనుగుణంగా, రామానుజులు రచించిన శ్రీ భాష్యాన్ని అధ్యయము చేయాలని ఎంతో శ్రద్ధతో కాంచీపురం పెరుమాళ్ కోయిల్‌కు చేరుకున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/21/yathindhra-pravana-prabhavam-37/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org