Monthly Archives: November 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 79

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 78

ఉత్తర దివ్య దేశాల పెరుమాళ్ళను స్మరించిన పెరియ జీయార్

జీయర్ ఒకరోజు తెల్లవారు జామున తిరుమలయాళ్వార్ (కాలక్షేప మండపం) కు వెళ్లి, దివ్య దేశాలను స్మరించుచున్నారు. దీనమైన మనస్సుతో దాదాపు నాలుగు గంటల పాటు అలాగే దివ్యదేశాల నామ స్మరణ చేశారు. “సింధిక్కుం దిశైక్కుం తేరుం కై కూప్పుం”, “వెరువాదాళ్ వాయ్ వెరువి”, “ఇవఱిరాప్పగల్ వాయ్ వేరీ” అంటూ అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) పాశురాలను స్మరింస్తూ నిస్సహాయ స్థితిలో ధ్యానిస్తున్నారు. అప్పటికే కలాక్షేపం కోసమని ఆచార్యులు వచ్చి ఉన్నారు, మరికొందరు రావలసి ఉంది. ఈ శ్లోకంలో వివరించబడి ఉంది

అవ్యాజభందోర్ గరుడధ్వజస్య దివ్యాఞ్చిధాన్యాయతనానిభూయః
ధ్యాయంస్థమోనాశకరాణి మోహావశాత్తదేవప్రహరత్వయంసః
ధ్యాత్వా దివ్యాఞ్చిధార్చా విలసితనిలయాన్యౌత్తరాణ్యాసు
విష్ణోః తత్సేవా యత్తచిత్తే ప్రణిగతతిముహుర్నామతః తాని తాని
తూష్ణీం భూతేస భాష్పం సపుళగనిచయం రమ్యజామాతృయోగి న్యప్
యేత్యానమ్యసర్వే కిమితమితి పరామార్థిం ఆపుర్మహాంతః

(మణవాళ మాముణులు, గరుడ ధ్వజ స్తంభ రూపంలో ఉన్న దివ్య దేశాలను, అందరి బంధువైన భగవానుని ధ్యానం చేయుచున్నారు. వారు అనుభవానికి లోనై సుమారు యాభై నిమిషాల పాటు ఆ స్థితిలోనే ఉన్నారు. భగవాన్ తమ అర్చావతార స్వరూపాన్ని దర్శనమిస్తున్న ఉత్తర దేశపు దివ్య దేశలను వారు ధ్యానిస్తూ, ఆ దివ్యాదేశాలను దర్శించాలని ఆశించి వాటి దివ్యనామ జపం చేశారు. వారి శరీరం నిక్కపొడుచుకొని, కన్నుల నుండి కన్నీరు కారుతున్నాయి. ఆ స్థితిలో వారి శిష్యులు కొందరు వారిని చూచి ఆశ్చర్యపోతూ, ఏమి జరుగుతుందోనని అయోమయ స్థితిలో వారికి సాష్టాంగ నమస్కారం చేసారు). జీయర్ “కిళర్ ఒళి ఇలమై కెడువదన్ మున్నం” (తిరువాయ్మొళి 2-10-1) వంటి కొన్ని పాశురములను పఠిస్తున్నారు. వారు ఉత్తరాన ఉన్న అయోధ్య మొదలైన దివ్యదేశాలను స్మరిస్తూ బాధతో, “ఈ దివ్య క్షేత్రాలను సేవించుకునే అదృష్టం నాకు లేకపోయింది” అని అనుకున్నారు. అక్కడ ఉన్న అష్టదిగ్గజ ఆచార్యులు ఏమి జరిగుతుందని ఆశ్చర్యపోతూ బాధపడ్డారు. వాళ్ళు ఓదార్చడానికి ప్రయత్నించిననూ, జీయర్ కళ్ళెంబడి కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. వారి ఈ స్థితిని చూసి ఆచార్యులందరూ దుఃఖించసాగారు. అదే సమయంలో, “కండియూర్ అరంగం మెయ్యం కచ్చి పేర్ మల్లై” అని పేర్కొన్న విధంగా, చరమపర్వ (ఆచార్యుడే సర్వస్వంగా భావించే అత్యున్నత స్థితి) స్థితిలో దృఢ నిశ్చయులై, జీయర్ తిరువడికి విశ్వాసపాత్రులై ఉండి, దివ్యదేశంలో కైంకర్యం చేస్తున్న రామానుజ దాసర్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ క్రింది శ్లోకం ద్వారా చెప్పబడింది.

సమేత్య రామానుజదాస నామావ్య జిజ్ఞ బద్ధం వరయోగివర్యం
నిషేవ్య సర్వాణి పధాని విష్ణోః సమర్పయిష్యామిత్తైవ తత్వః

(రామానుజ దాసర్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తమ ఒక విన్నపాన్ని వ్యక్తపరచారు. “అడియేన్ విష్ణువు దివ్యదేశాలను దర్శించుకొని తిరిగి వచ్చి ఆ సేవను దేవర్వారి తిరువడి యందు సమర్పించు కోవాలనుకుంటున్నాను” అని విజ్ఞప్తి చేసాడు.) జీయర్ వద్దకు వెళ్ళి “రామానుజ దాసర్ అను ఈ అడియేన్ దేవర్వారి దివ్య పాదాలను మార్గదర్శిగా ముందుంచి, ఉత్తర దివ్య దేశాలకు వెళ్ళి, దేవర్వారి మంగళాశాసనాలుగా ఆ పెరుమాళ్ళను సేవించి వచ్చి వాటన్నింటినీ దేవర్వారి పాదాలకు సమర్పించుకుంటాడు” అని చెప్పాడు. ఈ క్రింది శ్లోకంలో చెప్పిబడింది

ఆసేతోరాపదర్యాశ్రమవరనిలయా దాసపూర్వాపరాప్తేః
క్షేత్రాణి శ్రీధరస్య ధృహిణ శఠజితాధ్యంచితాని ప్రణమ్య
ప్రాప్స్యేరామానుజోయం భవదనుజయధనుచతశ్చిత్తయంస్థవత్
పదావిద్యస్మిన్ విగ్యాపయిత్వా ప్రణమతి భుభుతేసౌమ్యజామాతృ యోగీ

(రామానుజ దాసర్ మణవాళ మాముణుల దివ్య పాదాలకు నమస్కరించి ఇలా అన్నారు, “ఉత్తర దేశంలోని భద్రికాశ్రమం నుండి దక్షిణంలోని సేతు వరకు, ఇటు తూర్పు మహాసముద్రం నుండి పడమర సముద్రం వరకు అన్ని ప్రాంతాలలో సకల దేవతలు, ఆళ్వార్లు ఆరాధించిన విష్ణువు యొక్క దివ్యదేశములను సేవించుకోలేదే నని దేవర్వారు బాధపడుతున్నారు. అడియేన్ దేవర్వారి తిరువడిని ధ్యానిస్తూ ఈ దివ్యాదేశాలకు వెళ్లి పెరుమాళ్ళను సేవిస్తాను” అని అన్నారు; ఈ మాటలు విన్న వెంటనే మాముణులు తమ ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చారు) రామానుజ దాసర్ జీయరుకి విజ్ఞప్తి చేసి సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే, జీయర్ తమ నేత్రాలను తెరిచి “ఓ రామానుజ దాసర్! రమ్ము!” అని పలికారు. అక్కడ ఉన్న అష్టదిగ్గజులు, ఆచార్యులందరి మనస్సు కుదుటపడి రామానుజ దాసర్ను కొనియాడారు. జీయర్ పైకి లేచి నిలబడి “ఎంతో కాలం గడిచిపోయింది, కలాక్షేపం చేయలేదు” అని అన్నారు. అక్కడ ఉన్న వారు, “దేవర్వారు అనుభవించిన దివ్య దేశ అనుభవాన్ని మేము సేవించి అనుభవించలేకపోయాము, ఎంతో కలరవరబడ్డాము.” అని అన్నారు. వెంటనే జీయర్ రామానుజ దాసర్ తో “ఓ రామానుజ దాసా! నీవు ఇప్పుడు చెప్పినది సంభవిస్తుందా?” అని అడిగారు. దాసర్ వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. జీయర్ తిరువడి సంబంధం ఉన్న కుమాండూర్ ఇళైయాళ్వార్ పిళ్ళైని పిలిచి, “నీవు రామానుజ దాసర్‌ తో వెళతావా?” అని అడిగారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పిబడినట్లు, వారు మహా భాగ్యమని అన్నారు.

తతోన్యయుంగ్త స్వగముత్తరీయం విధీర్య రామానుజదాసమాశు
సహస్వ పాదావని నిత్య యోగ మహోజుషాయాచిక లక్ష్మణేన

(తరువాత, జీయర్ కృపతో తమ ఉత్తరీయాన్ని రామానుజ దాసర్ కు ఇచ్చి, తమ దివ్య చరణ సంబంధ గొప్పతనం ఉన్న ఇళైయాళ్వార్‌ తో వెళ్ళమని దాసర్ ను ఆదేశించారు) రామానుజ దాసర్ కు తమ పై వస్త్రం ఇచ్చి, కుమాండుర్ ఇళైయాళ్వార్‌ కు తమ చరణ పాదుకలను ఇచ్చి త్వరగా ప్రయాణం చేయమని ఆదేశించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/06/yathindhra-pravana-prabhavam-79/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 78

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 77

తిరుమాలిరుంజోలై అళగర్ ఈ తనియన్ ప్రచారం చేసెను

మణవాల మాముణుల తిరువడి సంబంధం ఉన్న ఒక జీయర్, అళగర్ తిరుమల (తిరుమాలిరుంజోలై) లో వివిధ కైంకర్యాలు చేస్తుండేవారు. అతను తమ ఆచార్యులు పెరియ జీయర్ల ఆత్మగుణాలను, విగ్రహగుణాలను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవారు. అతను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అందరూ నిత్యం జపించగలిగే ఒక తనియన్ (మణవాళ మాముణుల గురించి) పెద్దలనుండి వెలువడాలని మననం చేస్తూ ప్రదక్షిణగా విశ్వక్సేనుని సన్నిధికి చేరుకున్నారు. విశ్వక్సేనుని తిరువారాధన చేయడానికి ఒక అర్చాకుడు అక్కడికి వచ్చి సేవ నిర్వహిస్తున్నాడు. అతను ఈ క్రింది శ్లోకాన్ని బిగ్గరగా పఠించి తిరువందిక్కాప్పు (విగ్రహానికి రక్షణగా కర్పూర హారతి ఇచ్చుట) సేవ చేశాడు.

శ్రీశైలసుందరేశస్య కైంకర్యనిరతోయతిః
అమన్యత గురోస్స్వస్య పద్యసంభవం ఆర్యతః

(తెఱ్కు తిరుమల (దక్షిణ తిరుమల) లో అళగర్ పెరుమాళ్ళ కైంకర్యంలో ఉన్న జీయర్, ఉత్తముని నోటి నుండి తనియన్ వెలువడాలని భావించి), తమ నిత్య సేవను నిర్వహించడానికి పెరుమాళ్ళ సన్నిధికి వెళ్లాడు. ఆ సమయంలో, మణవాళ మాముణుల తిరువడి సంబంధం ఉన్న సేనై ముదలియార్ అనే ఒక వ్యక్తి, దక్షిణంలో ఉన్న వివిధ దివ్య దేశాలకు మంగళాశాసనం చేస్తూ, అళగర్ పెరుమాళ్ళను సేవిచడానికి అళగర్ కొయిల్‌కి చేరుకున్నరు. అతనిని చూసి జీయర్ సంతోషించి, సన్నిధికి తీసుకెళ్లారు. అళగర్ పెరుమాళ్ళు సేనై ముదలియార్ కు తీర్థం శఠారీలు అందించి తమ కృపను వారిపై కురిపించి అర్చక ముఖేన ఇలా అన్నాడు.

జిహ్వాగ్రే తవవయామి స్థిత్వావ సుపావనం
పద్యం త్వధార్యవిషయం మునేరస్య మమాజ్ఞయా

(నీ ఆచార్యుడు, మణవాళ మాముణుల ఏది అత్యంత ప్రీతికరమైనదో పవిత్రమైనదో, నేను నీ నాలుకపై కూర్చుని పారాయణం చేయబోతున్నానని మా ఆజ్ఞగా ఈ జీయర్‌కి చెప్పండి). ఇది విన్న సేనై ముదలియార్, ఆ శ్లోకంలో చెప్పినట్లు

ధన్యోస్మీతిచ సేనేశ దేశికోవదత స్వయం
వహన్శిరసి దేవస్య పాదౌ పరమపావనౌ

(సేనై ముదలియార్, అళగర్ పవిత్రమైన దివ్య పాదాలను తమ శిరస్సుపై ఉంచుకుని, గొప్ప అనుగ్రహంగా భావించి ఆ శ్లోకం పఠించారు), శ్రీ శఠారిని తమ శిరస్సుపై ఉంచుకుని, ‘శ్రీశైలేశ దయాపాత్రం’ తనియన్ ను సేవించారు. ఇది విన్న అర్చకుడు కూడా జీయర్ ను చూసి ఆ శ్లోకాన్ని పఠించారు. మరు క్షణం, సేనై ముదలియార్ మరియు ఆ అర్చకుడు ఇద్దరూ ఆ శ్లోకాన్ని మరచిపోయారు. వారిద్దరూ జీయర్ మఠానికి వెళ్లి జీయర్ను ఆ తనియన్ ను పఠించమని ప్రార్థించారు. “మీరు కదా అ తనియన్ ను సేవించారు. మీరు వినాలనుకుంటున్నారా?” అని జీయర్ ప్రశ్నించారు. సెనై ముదలియార్ “అడియేన్‌ ఏమీ ఎరుగడు. సుందరరాజర్ (తిరుమాలిరుంజోలై అళగర్ తిరునామం) స్వయంగా సుందరజామాతృముని (అళగియ మణవాళ మాముని) పై పాడినది” అని అన్నారు. జీయర్ ఆ తనియన్ ను పఠించారు, ముగ్గురూ పరవశులై ఆ తనియన్‌ ను తమ ఆశ్రయంగా స్వీకరించారు.

సేనై మొదలియార్ ఎంతో ఆతృతతో కోయిల్ (శ్రీరంగం) కి వెళ్లి ఈ సంఘటన గురించి అందరికీ చెప్పాలనుకున్నారు. శ్రీరంగానికి చేరుకుని జీయర్ గోష్ఠికి సాష్టాంగములు సమర్పించుకొని, జరిగిన సంఘటన గురించి అందరికీ వివరించారు. అది విన్న అందరూ, “తిరువేంకటేశ్వరుడు మరియు అళగర్లకు ఎంతో ప్రీతికరమైన దానిని మీరు వెలికి తీసుకొచ్చారు! ఎంతటి అనుగ్రహం!” అని ఆనందించారు.

జీయర్ను వానామామలై జీయర్ కీర్తించుట

వానమామలై రామానుజ జీయర్ పారవశ్యంతో నిశ్చేష్టులై ఉండిపోయారు. జీయర్ అతని చేతులను తాకి, “నీ ఆనందాన్ని ప్రకటిస్తూ కొన్ని మాటలు చెప్పండి?” అని అన్నారు. వానమామలై జీయర్ వెంటనే కందాడై అన్నన్ వైపు చూసి “రెండు రొమ్ముల నుండి పొంగి శ్రవిస్తున్న పాలను గ్రహిస్తున్నది మనమే కదా!” [ఇక్కడ జీయర్ తనియన్ లోని రెండు పంక్తులను సూచిస్తుంది]; అణ్ణన్ “దేవర్వారు చెప్పిన విధానం ఆ పాల కంటే తీయగా ఉంది” అని అన్నారు; ప్రతివాది భయంకరం అణ్ణా, అణ్ణన్ ను పొగుడుతూ, “మీరిద్దరి మాటలు ఒకరికంటే ఒరరిది గొప్పదిగా ఉంది!” అని అన్నారు; దీనికి అప్పిళ్ళై జోడిస్తూ, “ఈ మంత్ర రత్నంలో రెండవ పంక్తి [దీనిని ద్వయ మహా మంత్రం లేదా మణవాళ మాముణుల తనియన్‌ గా తీసుకోవచ్చు] మొదటి పంక్తి కంటే గొప్పది” అని అన్నారు; భట్టర్ పిరాన్ జీయర్ “శఠగోప ద్వయం, ద్వయ మహా మంత్రం కంటే గొప్పది; శఠగోప ద్వయం కంటే రామానుజ ద్వయం గొప్పది; మా ఆచార్యుని నమస్కరించే ఈ తనియన్ అంతకంటే గొప్పది”, అంటూ జీయర్ మహిమలను అనర్గళంగా కొనియాడారు.

వాఖ్య ద్వయం:

శ్రీమన్ నారాయణ చరణౌ శరణం ప్రపద్యే
శ్రీమతే నారాయణాయ నమః 

శఠగోప ద్వయం:

శ్రీమన్ శఠగోప చరణౌ శరణం ప్రపద్యే
శ్రీమతే శఠగోపాయ నమః 

రామానుజ ద్వయం:

శ్రీమన్ రామానుజ చరణౌ శరణం ప్రపద్యే
శ్రీమతే రామానుజాయ నమః 

పాద ద్వయం:

శ్రీశైలేశ దయా పాత్రం ధీభక్త్యాధి గుణార్ణవం
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం 

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/05/yathindhra-pravana-prabhavam-78/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 77

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 76

తిరువేంకటేశ్వరుడు ఈ తనియన్ ప్రచారం

ఈ తనియన్ కు [‘శ్రీశైలేస దయాపాత్రం’ తో ప్రారంభించి ‘మణవాళ మామునియే ఇన్నుం ఒరు నూఱ్ఱాండు ఇరుం’ తో తో ముగుస్తుంది] సంబంధించిన మరోక అద్భుతం ఉంది . తెన్నన్ ఉయర్ పొరుప్పులోని (దక్షిణంలో ఉన్న దివ్య పర్వతం, అనగా తిరుమాలిరుంజోలై) అళగర్ (తిరుమాలిరుంజోలై ఎమ్పెరుమాన్), దివ్య వడమలైలోని (ఉత్తరాన ఉన్న దివ్య పర్వతం) అప్పన్ (తిరువెంకటేశ్వరుడు) ఇరువురు ఈ తనియన్ ప్రచారంలో సహకరిస్తారు. ఈ తనియన్ పుట్టక ముందే, ఒక ముముక్షువు వివిధ దేశాల సంచారం చేస్తూ నిత్యం భగవానుని చింతన చేస్తూ ఉండేవాడు. అతన్ని ఉద్ధరించాలని సర్వేశ్వరుడు అతనికి ఈ తనియన్ ను బోధించెను. అతను ఈ తనియన్ ను తన శరణుగా భావించి నిరంతరం పారాయణం చేస్తూ ఉండేవాడు. తరువాత, పురట్టాసి (బాద్రపద) మాసంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరగాల్సి ఉన్న సమయంలో, అతను తిరుమలకు చేరుకున్నాడు. అర్చకుని ద్వారా, ఆ వేంకటేశ్వరుడు అతని చేయి పట్టుకుని, ‘ఇయల్ గోష్టి శాఱ్ఱుముఱ’ (దివ్య ప్రబంధ ఉదయం పారాయణం పూర్తి చేసే విధి) పఠిస్తున్న శ్రీవైష్ణవుల గోష్ఠికి తీసుకు వచ్చాడు. ఆ అర్చకుడు వాళ్ళు ఏమి పఠిస్తున్నారో గమనించమని అతడికి చెప్పాడు. ఆ శ్రీవైష్ణవులకు కూడా “అతను పఠించేది మీరు వినండి” అని చెప్పాడు. పెరియ కేల్వి జీయర్ -పెద్ద జీయర్, విశ్వక్సేనుల సందేశం ద్వారా వచ్చిన తనియన్ ను పఠించారు. ఇది విన్న ఆ వ్యక్తి గోష్ఠికి సాష్టాంగము చేసి “దయచేసి అడియేన్ ప్రార్థన వినండి” అని చెప్పి “ఇది ఎంతటి ఆశ్చర్యం! అడియేన్ కలలలో విన్న శ్లోకమే ఇక్కడ పఠించారు.” జీయర్ అతనితో “అలా అయితే, ఆ శ్లోకాన్ని పఠించుము” అని అన్నారు. ఆ వ్యక్తి వెంటనే ‘శ్రీశైలేశ దయాపాత్రం’ పఠించాడు… ఇది విన్న ప్రతి ఒక్కరూ చాలా సంతోషించి, ఆ శ్లోకాన్ని వారు ఎలా పొందారో అతనికి చెప్పారు. మొత్తం వృత్తాంతాన్ని విన్న తర్వాత, ఆ వ్యక్తి పూర్తి భక్తితో కోయిల్ (శ్రీరంగం) చేరుకుని, జీయర్ దివ్య పాదాల యందు పెలికివేసిన చెట్టులా నిటారుగా సాష్టాంగపడ్డాడు. అత్యంత దయాపూర్ణులైన జీయర్ తమ దివ్య హస్తాలతో అతనిని పైకి లేపి “ఎవరు నువ్వు? ఏమి కావాలి నీకు?” అని అడిగారు. ఆ వ్యక్తి బదులిస్తూ, “ముముక్షువైన అడియేన్ వివిధ దివ్య దేశాల యాత్ర చేశను” అని ప్రారంభించి, తన స్వప్నంలో జరిగిన సంఘటనలను వివరించాడు. అతను ఆ తనియన్ ను పఠించి, జీయర్ దివ్య పాదాలను తన శిరస్సుపై పెట్టుకున్నాడు. అతను జీయర్ తో “ఆ వేంకటేశ్వరుడు అడియేనుపై విశేష దయను కురిపించాడు, గోష్ఠిలో (తిరుమలలో) ఈ తనియన్‌ ను పఠించేలా చేసాడు, పైగా దేవర్వారి దివ్య చరణాలను సేవించేలా చేసాడు” అని చెప్పాడు. జీయర్ అతని మాటలు విన్న తర్వాత, “నీవు భగవానుని విశేష కృపకు పాత్రుడవైనావు. నీ కోరిక ఏమిటి?” అని అడిగారు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “మోక్షం సాధన ఉపాయమైన మంత్రాన్ని తనియన్‌ రూపంలో అందుకున్నాను; అడియేన్ మంత్రప్రద ఆచార్యుడి (మంత్రం ఉపదేశించిన వారు) రూపంలో తిరుమలై అప్పన్ ని పొందాను; అడియేన్ మంత్ర ప్రతిపాధ్యా దేవత (ఆ మంత్రం ద్వారా పొందిన వ్యక్తి) అయిన దేవర్వారిని పొందాను. ఇక అడియేన్ కోరదగినది ఇంకేముంది?” అని చప్పట్లు కొడుతూ నాట్యం చేశాడు.

అది వినగానే జీయర్ ఈ శ్లోకాన్ని పఠించారు

మత్రేత్ దేవతాయాంచ తథామంత్రప్రదే గురౌ
త్రిషుభక్తిస్సదాచార్యా శాసిప్రతమసాధనం

(మూడిటి పట్ల నిరంతరం మన భక్తి ప్రపత్తులని చూపాలి. అవి మంత్రం, ఆ మంత్రంలో వివరించబడిన దేవత, ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుడు; అటువంటి భక్తియే భగవానుని పొందేందుకు సాధనమౌతుంది), ఆటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడని చెప్పండి. ఈ మూడు గుణాలు వీరిలో ఉన్నాయి, అర్హత పొందడానికి కావాల్సిన గుణం ఇదే కదా! వారు హర్షించి పంచ సంస్కారాలను నిర్వహించి అతనికి “తిరువేంగడరామానుజదాసర్” అను దాస్య నామం ప్రసాదించారు. పెరుమాళ్ళు కూడా అతనిని “ఓ తిరువేంగడరామానుజ దాసు! అని సంబోధించి, “రండి! మేము మీకు మేల్వీడు (శ్రీవైకుంటం) ప్రసాదిస్తున్నాము” అని చెప్పి వారికి శ్రీ శఠగోపురాన్ని అందించారు. వెంటనే ఆ వ్యక్తి తిరునాడు (శ్రీవైకుంఠం) ని అధీరోహించాడు. అక్కడ సమావేశమైన ప్రముఖులందరూ వారికి విధి పూర్వకంగా తగిన చరమ సంస్కారాలు నిర్వహించి, జీయరుని కొనియాడారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/04/yathindhra-pravana-prabhavam-77/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 76

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 75

అణ్ణన్ తిరుమాలిగలో జరిగిన అద్భుతమైన ఒక సంఘటన

ఈడు ఉత్సవాల శాఱ్ఱుముఱలో పాల్గొనేందు కొరకై అందరు గుడిలో సమావేశమైయ్యారు. కందాడై అణ్ణన్ దేవి (వారి ధర్మ పత్ని), సంప్రదాయంలో ఎంతో జ్ఞానం ఉన్న ఇతర స్త్రీలు కలిసి అణ్ణన్ తిరుమాలిగలో జీయర్ మహిమలను పఠిస్తున్నారు. ఒక బ్రహ్మచారి అక్కడికి ఒక చీటీతో వచ్చి, అణ్ణన్ ధర్మ పత్నికి ఇచ్చి, దానిని అణ్ణన్ కు ఇవ్వమని అన్నాడు. ఆమె ఆ చీటీని తీసుకుని చదివింది. ఆ చీటీలో “ఈ స్లోకం చాలా అద్భుతంగా ఉంది!” అని చెప్పింది. ఆ స్లోకం గురించి తెలుసుకుందామని ఆమె ఆ బ్రహ్మచారి కోసం చూస్తే, ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు. అందరూ లేచి అతని కోసం వెతికారు, కానీ ఎవరూ అతని ఆచూకీని కనుగొనలేకపోయారు. అక్కడ ఉన్నవారు అది భగవత్ లీల అని భావించారు. వారిలో కొందరు పెరియ తిరుమండపంలోని గోష్ఠికి వెళ్లి ఆ చీటీని అక్కడ అందించారు. ఈ క్రింది శ్లోకములో వివరించబడింది…..

హటాత్ తస్మిత్ క్షణే కశ్చిత్ వర్ణి సంప్రాప్య పత్రికాం
వాదూల వరదాచార్య తమపత్ న్యాః కరే దదౌ

(అకస్మాత్తుగా, ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చి, కోయిల్ కందాడై అణ్ణన్ ధర్మ పత్ని చేతికి ఒక చీటీని ఇచ్చాడు), అక్కడ సమావేశమైన అందరూ ఆశ్చర్యపోయారు. వారు ఆ చీటీలో వ్రాసిన శ్లోకం చదివి, అది శ్రీశైలేశ దయాపాత్రం శ్లోకం అని తెలుసుకొని అవాక్కైపోయారు. వారు తిరుమంత్రార్థానికి అనుగుణంగా ఉన్న ఆ తనియన్ అర్ధాన్ని ధ్యానించారు [శ్రీశైలం తిరుమలైయప్పన్‌ ను సూచిస్తుంది, ఆయన అకారవచుడు (ప్రణవంలోని ‘అ’ అక్షరాన్ని సూచించేవాడు), దయాపాత్రం అనేది అతని దయకు పాత్రుడైనవాడిని సూచిస్తుంది, అనగా, మకార వాచ్యం (ప్రణవంలోని ‘మ’ అక్షరం) భగవానునికి చెందినవాడు, ప్రణవంలో వలె రెండింటి మధ్య సంబంధాన్ని ఇస్తుంది]. ప్రముఖ శిష్యులైన వానమామలై రామానుజ జీయర్, కందాడై అణ్ణన్, ఎఱుంబియప్పా, ప్రతివాది భయంకరం అణ్ణా మొదలైన వారు తమ దివ్య మనస్సులలో మణవాళ మాముణులపై ఉన్న తమ భక్తిని ప్రకటిస్తూ సంకల్పించిన తనియన్ కు ఈ తనియన్ సమానంగా ఉన్నదని గమనించి, ఆ తనియన్ అందరి కోరికను సంతృప్తిపరచుతున్నందుకు ఎంతో ఆనందించారు. ఆళ్వార్లు తదితరులను సముచిత గౌరవ మర్యాదలతో పెరుమాళ్ వారి వారి సన్నిధులకు పంపి, పెరియ పెరుమాళ్ళ సన్నిధికి తాను వెళ్లారు. ఆలయంలోని శిష్య బృందం అందరు జీయరుతో కలిసి శ్రీరంగం తిరుమాడ వీధుల్లో ప్రదక్షిణలు చేసి, జీయరుని మఠంలో విడిచిపెట్టారు. ఆలయ పరిచారకులు పెరుమాళ్ల సన్నిధికి తిరిగి వచ్చారు. పెరుమాళ్ సంతృప్తితో , “జీయర్ ‘ముప్పత్తారాయిర ప్పెరుక్కర్’ (‘ఈడు’ అనుభవాన్ని రెట్టింపు చేసి వివరించేవాడు) అని పలికి తమ కరుణను వారిపైన కురిపించాడు. శిష్యులందరూ జీయర్ తనియన్, వాళి తిరువాయ్మొళి ప్పిళ్ళైని పఠించి మంగళాశాసనం చేశారు. ఈ పాశురంలో చెప్పబడి ఉంది.

అడిసూడి ఎన్ తలైమేల్ అరుమఱై ఆయ్ందు తొండర్
ముడి సూడియ పెరుమాళ్ వరయోగిమునంగురవోర్
పడి సూడు ముప్పత్తాఱాయిరముం పణిత్తరంగర్
అడి సూడి విట్టదఱ్కో ఎందాయ్ ఎన్బదు ఉన్నైయుమే

(తమ భక్తుల శిరస్సులపై తన దివ్య పాదాలను ఉంచే పెరుమాళ్, ముప్పత్తాఱాయిరత్తు ప్పడి ద్వారా తిరువాయ్మొళి అర్థాలను వివరించమని మణవాళ మాముణులను నియమించి, వారికి కూడా తనియన్‌ ను ప్రసాదించడం ఆశ్చర్యంగా ఉంది!) అక్కడ ఉన్నవారందరూ ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ, జీయర్ శుభ గుణాలను ధ్యానించుకుంటూ ఆనందించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/02/yathindhra-pravana-prabhavam-76/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 75

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 74

భగవత్ విషయ శాఱ్ఱుముఱ

ముందు లాగానే, దయామయుడైన ఎంబెరుమాన్ పరాంకుశ పరకాల భట్టనాథ యతివరర్ (నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్, రామానుజులు), పలు ఇతరులతో కలిసి దివ్యప్రబంధ వ్యాఖ్యాన శ్రవణం చేయుటకు వేంచేసారు. జీయర్ గొప్పతనాన్ని స్వయంగా స్తుతించాలని సంకల్పించారు. ఈ శ్లోకంలో చెప్పినట్లే

సమాప్తౌ గ్రంథస్య ప్రతితవివిధోపాయనచయే పరం సంజీభూతే వరవరమునేంగ్రి సవితే
హతాత్పాలః కశ్చిదృత ఇతినిరస్థోప్యుపగతః జగౌ రంగేశాక్యః పరిణతచతుర్హాయన ఇదం

(భగవత్ విషయం (తిరువాయ్మొళి వ్యక్యానం) శాఱ్ఱుముఱ (ముగింపు) సమయంలో తమలపాకులు, వక్క మొదలైన పదార్థాలు పల్లెంలో సిద్ధంగా ఉంచారు. రంగనాయకన్ అనే నాలుగేళ్ల పిల్లవాడు ఎక్కడినుండో అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. అక్కడున్న పెద్దలు “ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపో” అని అడ్డుకుంటుండగానే ఆ పిల్లవాడు జీయర్ దగ్గరికి వచ్చి ఈ తనియన్ పఠించారు) యాలకలు, లవంగం, కర్పూరం, తిరు పరివట్టం (దివ్య తల పాగ) మొదలైన పదార్థాలు సంభావనగా సిద్ధంగా ఉంచబడ్డాయి.

శ్రీశైలేశ దయాపాత్ర తనియన్ అవతారం

అళగియ మణవాళ భట్టర్ వారి నాలుగేళ్ళ కుమారుడు రంగనాయకన్, పైన పేర్కొన బడిన సంభావనలు పెరుమాళ్ళ పదార్థాల మధ్య నిలబడ్డాడు. ఆ పిల్లవాడిని అక్కడి నుండి తీసుకెళ్లి బయట నిలబెట్టినా మళ్లీ అక్కడికే వచ్చి నిలబడ్డాడు. “ఇది సాధారణ విషయం కాదు; అద్భుతమేదో జరగబోతోంది” అని అక్కడ ఉన్న వారందరూ అనుకున్నారు. ఆ చిన్నారిని “ఎందుకు ఇక్కడ నిలుచున్నావు?” అని అడగానే, ఆ పసివాడు చేతులు జోడించి అంజలి ముద్రలో నిర్భయంగా “శ్రీశైలేశ దయాపాత్రం” పఠించాడు. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అని అడుగగా, “ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం” అని చెప్పి పారిపోయాడు. అక్కడ ఉన్న పెద్దలు ఇది విని ఆశ్చర్యపోయారు; వెంటనే వారు ఈ శ్లోకాన్ని తాళపత్రపై వ్రాసి, పసుపు పూసి, నంపెరుమాళ్ళ దివ్య పాదాల వద్ద ఉంచారు. వారు దానిని ఒక కంచంలో ఉంచి, రంగనాయకుని పిలిచి, ఇంకా ఏమైనా పఠించ గలవా అని అడిగారు. “నాకేమీ తెలియదు” అని అన్నాడు. ఇంతకు ముందు చెప్పినదే మళ్ళీ చెప్పమని అడిగితే, “నాకేమీ తెలియదు” అని చెప్పి పారిపోయాడు.

వాళిత్తిరునామానికై ఆదేశం

తరువాత, అప్పిల్లైని (మణవాళ మాముణుల శిష్యులలో ఒకరు, 56 వ భాగంలో చూడవచ్చు) అరుళ్పాడు (కృపతో తమ ఆజ్ఞను ప్రకటించుట) ద్వారా ప్రశంశించి, వాళి తిరునామం (స్తుతి) పఠించమని కోరారు. అప్పిళ్ళై తమిళ భాష నిపుణులైనందున, ఈ క్రింది వాటిని పఠించారు.

వాళి తిరువాయ్మొళిప్పిళ్ళై మాదగవాల్
వాళుం మణవాళ మామునివన్ – వాళియవన్
మాఱన్ తిరువాయ్మొళిప్పొరుళై మానిలత్తోర్
తేఱుం పడి ఉరైక్కుం శీర్

(తిరువాయ్మొళి పిళ్ళైల అపారమైన అనుగ్రహ పాత్రులైన మణవాళ మాముణులు దీర్ఘకాలం వర్ధిల్లాలి. సమస్థ మానవాళికి అర్థమయ్యేలా, ఉద్ధరింపబడేలా తిరువాయ్మొళి అర్థాలను అనుగ్రహించిన వారికి వందనాలు)

శెయ్య తామరై త్తాళిణై వాళియే సేలై వాళి తిరునాభి వాళియే
తుయ్య మార్బుం పురినూలుం వాళియే సుందరత్తిరు త్తోళిణై వాళియే
కైయుం ఏందియ ముక్కోలుం వాళియే కరుణై పొంగియ కణ్ణిణై వాళియే
పొయ్యిలాద మణవాళ మాముని పుంది వాళి పుగళ్ వాళి వాళియే

(ఎర్రటి కమలముల వంటి వారి దివ్య పాదాలకు జోహార్లు; ఆతని దివ్య పట్టు పీతాంబరం, వారి దివ్య నాభీ దీర్ఘ కాలం వర్ధిల్లాలి; ఆతని స్వచ్ఛమైన మనస్సు, యజ్ఞోపవీతం దీర్ఘ కాలం వర్ధిల్లాలి; ఆతని దివ్య భుజాలు దీర్ఘ కాలం వర్ధిల్లాలి; ఆతని త్రిదండం దీర్ఘ కాలం వర్ధిల్లాలి; కరుణ పొంగిపొర్లుతున్న ఆతని దివ్య నేత్రాలు దీర్ఘ కాలం వర్ధిల్లాలి; సత్య వచనములు మాత్రమే పలికే మణవాళ మాముణులు దీర్ఘ కాలం వర్ధిల్లాలి; అతని మేధస్సు కీర్తి దీర్ఘ కాలం వర్ధిల్లాలి)

అడియార్గళ్ వాళ అరంగ నగర్ వాళ
శడగోపన్ తణ్ తమిళ్ నూల్ వాళ – కడల్ శూళ్ంద
మన్నులగుం వాళ మణవాళ మామునియే!
ఈన్నుమొరు నూఱ్ఱాణ్డు ఇరుం

(భక్తుల పురోగతి కోసం, శ్రీరంగం పురోగతి కోసం, నమ్మాళ్వార్ల దివ్య ప్రబంధం పురోగతి కోసం, సాగరంతో ఆవరించి ఉన్న ఈ భూమి పురోగతి కోసం, ఓ మణవాళ మామునీ! తమరు మరో వందేళ్లు జీవించాలి)

ఈ పాశురాలను వింటూ పెరుమాళ్ ఎంతో ఆనందించి అప్పిళ్ళైపైన తమ కృపను కురిపించి పలు సన్మానాలను ప్రసాదించి సత్కరించారు.

దివ్యదేశాలకు నంపెరుమాళ్ళ ఆదేశం

తక్షణం, జీయార్ గురించి నంపెరుమాళ్ పాడిన తనియన్ను పఠించాలని తిరుమల, పెరుమాళ్ కోయిల్ మొదలైన అనేక దివ్య దేశాలకు సెనై ముదలియార్ (విష్వక్సేనులు) దివ్య సందేశాన్ని పంపించారు.

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం

(తిరువాయ్మొళి పిళ్ళై కృపా పాత్రుడు, దివ్య మేధస్సు, భక్తి సాగరుడు, రామానుజుల పరమ భక్తులైన ఆ మణవాళ మాముణులకు నా నమస్కారాలు.) ఏదైనా పారాయణం ప్రారంభంలో ఈ తనియన్ను పఠించాలని, ఆ పారాయణం సాఱ్ఱుముఱ సమయంలో “వాళి తిరువాయ్మొళి పిళ్ళై” తో ప్రారంభించి “మణవాళ మామునియే ఇన్నుం ఒరు నూఱ్ఱాండు ఇరుం” అని ఈ మూడు పాశురాలను పఠించాలని అని సందేశం పంపారు. ఆ తర్వాత మణవాళ మాముణులను ఆలయ మర్యాదలతో సత్కరించి, ఆలయ పరివార సమేతంగా వారి మఠానికి పంపాడు. మరో ఆశ్చర్యకరమైన సంఘటన సంభవించింది.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/01/yathindhra-pravana-prabhavam-75/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 74

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 73

భగవత్ విషయంపై కాలాక్షేపం నిర్వహించమని పెరియ జీయరుని ఆదేశించిన నంపెరుమాళ్

ఈ శ్లోకానుసారంగా….

తతః కదాచిత్ ఆహూయ తమేనం మునిపుంగవం!
సత్కృతం సాధుసత్కృత్య చరణాబ్జ సమర్పణాత్
సన్నితౌ మేనిషీతేతి శశాసమురశాసనః
మహాన్ప్రసాద ఇత్యస్య శాసనం శిరసావహన్
తదైవత్ర వ్యాఖ్యాతుం తత్ క్షణాత్ ఉపచక్రమే
శ్రీమతి శ్రీపతిః స్వామి మంటపే మహతిస్వయం
తద్వంతస్య ప్రబంధస్య వ్యక్తంతేనైవ దర్శినం
శటవైరిముఖైః శృణ్వన్ దేశికైర్దివ్యదర్శినైః
అత దివ్యమునేస్థస్య మహిమానం అమానుషం
అనుభూయేమమాపాల గోపాలం అఖిలో జనః
అమన్యత పరంధన్యం ఆత్మానం తత్ర నిక్షిపన్

(కొంతకాలం తర్వాత, నిత్యసూరుల అధిపతి అయిన పెరుమాళ్, మునివర్ పెరుమాన్ (యతులకు అధిపతి) అయిన మణవాళ మాముణులను పిలిచి, వారికి తమ శ్రీశఠారితో సత్కరించి, “మా సన్నిధిలో తిరువాయ్మొళి అర్థాలను వివరిస్తూ ఉపన్యాసం ప్రారంభించుము” అని ఆదేశించెను. మాముణులు ఆ ఆదేశాన్ని గొప్ప అనుగ్రహంగా భావించి శిరసా వహించారు. తక్షణమే ఉపన్యాసం ప్రారంభించారు. శ్రీయః పతి శ్రీ రంగనాధులు కృపతో దివ్య అనుగ్రహ పాతృలైన నమ్మాళ్వార్లు మొదలైన వారితో కూడి, అందమైన పెరియ తిరుమండపం (దివ్య విశాల మండపం) లో ఆసీనులై తిరువాయ్మొళి అర్థాలను ఆనందంగా అనుభవించారు. పిల్లలు, పెద్దలందరూ ఆ మణవాళ మాముణుల మానవాతీత మహిమను విని ముగ్దులై తమను తాము వారికి సమర్పించి శరణాగతి చేశారు.)

కృపయా పరయా శరఙ్గరాట్ మహిమానం మహతాం ప్రకాశయన్
గురుచేస్వయమేవ చే ఆతసా వరయోగి ప్రవరసస్య శిష్యతాం

(యతులలో ఉత్తములైన ఆ మణవాళ మాముణుల గొప్పతనాన్ని ప్రదర్శించేందుకు, ఆ శ్రీరంగరాజు గొప్ప కృపతో, అతనికి శిష్యులు కావాలని తమ దివ్య మనస్సులో సంకల్పించారు). “పితరం రోచయామాస తథా దశరథం నృపం” అని చెప్పినట్లు, పెరుమాళ్ శ్రీ రాముడిగా అవతారం దాల్చబోయే ముందు దశరథుడు అతనికి తండ్రి కావాలని సంకల్పించినట్లే. శ్రీరంగానికి స్వామి అయిన పెరుమాళ్, పరమ కృపతో, అందరికి జీయర్ గొప్పతనాన్ని చాటి చెప్పెందుకు, మణవాళ మాముణులకు శిష్యుడు కావాలని కోరుకున్నారు. ఈ క్రింది శ్లోకంలో వర్ణించబడినట్లుగా, నంపెరుమాళ్ శ్రీరంగవాసులందరితో కలిసి గరుడమండపానికి వెళ్ళారు.

శ్రోతుం ద్రావిడవేదపూరి వివృతం సౌమ్యోపయంతృమునే
రుత్కటణ్టాస్థిమమైన మానయతదస్థార్క్ష్యాశ్రయం మంటపం 
ఆవి యార్చకముచి వ్వనిధిముతా నిశ్వోషలోకాన్వితో
రంగీవత్సరమేకమేవం అశృణోత్ వ్యక్తం యతోక్తం క్రమాత్

(దయామయుడైన శ్రీ రంగనాధుడు అర్చక ముఖేన ఇలా ఆజ్ఞాపించాడు, ‘ద్రావిడ వేదముగా పరిగణించబడే తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానం మణవాళ మాముణుల ద్వారా నేను వినాలనుకుంటున్నాను. అతనిని గరుడ మండపం వద్దకు తీసుకురండి’ అని ఆదేశించారు. తరువాత, మునివర్ ఒక సంవత్సరం పాట్లు ఇచ్చిన ఆ ఉపన్యాసాన్ని ఎంబెరుమానునితో పాట్లు అన్యులందరూ విని ఆనందించారు) జీయర్ ఉపన్యాసాన్ని అందించిన క్రమంలో అందరూ విన్నారు. ఉపన్యాసం ఎలా అందించబడింది?

మంగళాయతనేరంగే రమ్యజామాతృయోగిరాట్
యుగపద్ద్రావిడామ్నాయ సర్వ వ్యాఖ్యాన కౌతుకీ

(సమస్త శుభాలకు నిలవైన శ్రీరంగంలో, మణవాళ మాముణులు, తిరువాయ్మొళి వ్యాఖ్యానాలన్నింటి నుండి ఉపన్యాసాన్ని అందించాలని ఆశించారు).

దేశాంతరగతోవాపి ద్వీపాంతరగతోపివా
శ్రీరంగాపిముఖోభూత్వా ప్రణిపత్య నసీధతి

(ఒక వ్యక్తి ఈ దేశంలోనే కాక మరెక్కడున్నా, అతను శ్రీరంగం వైపు సాష్టాంగ నమస్కారం చేస్తే అతనికి ఎటువంటి దుఃఖాలుండవు).

ఆ శ్లోకాలలో వివరించబడినట్లుగానే, ద్రావిడ వేదమైన తిరువాయ్మొళికి ఆరాయిరప్పడి, ఒన్బదినియారప్పడి, పన్నీరాయిరప్పడి, ఇరుబత్తు నాలాయిరప్పడి, ముప్పత్తాఱాయిరప్పడి (ఈ ఐదు వ్యాక్యానాలు తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్, నంజీయర్, అళగియమణవాళచ్చీయర్ (పెరియ వాచ్చాన్ పిళ్ళై సత్శిష్యులు), పెరియ వాచ్చాన్ పిళ్ళై, వడక్కుత్తిరువీధి పిళ్ళైల ద్వారా నంపిళ్ళై రచించారు) వ్యాక్యానాల నుండి, ఇతర అరుళిచ్చెయల్ వ్యాక్యానముల అంగములు మరియు ఉపాంగముల ద్వారా ఉపన్యాసం ఇవ్వాలని అళగియ మణవాళ మాముణులు సిద్ధంగా ఉన్నారు. తిరుపవిత్రోత్సవం (సంవత్సరానికి ఒక సారి ఆలయం, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసే ఒక ఉత్సవం) ను వంకగా పెట్టుకొని పెరుమాళ్ ఉపన్యాసం వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ కరుణామయుడైన పెరుమాళ్ తిరుపవిత్రోత్సవ మండపంలోకి ప్రవేశించి, అణియరంగన్ తిరుముఱ్ఱత్తడియార్ (దివ్య శ్రీరంగనాధుని గోష్ఠి) – ఆచార్య పురుషులు, ఆలయాల పరిచారకులు, జీయర్ల మధ్య మహా మండపం ఉన్నారు. జీయర్ (మణవాళ మాముణులు) తమ శిష్యులతో కలిసి పెరుమాళ్ళకు తమ మంగళాశాసనాన్ని సమర్పించారు. ఒక విశేష రీతిలో పెరుమాళ్ళు జీయర్‌కు తమ శ్రీ శఠగోపాన్ని ప్రసాదించి తమ భక్తిని చాటుకున్నారు. “రేపటి నుండి, మా పెరియవణ్కురుగూర్ నంబి (కురుగూర్ నంబి అయిన నమ్మాళ్వార్) అందించిన తిరువాయ్మొళి అర్థాలను మా పెరియ తిరుమండపంలో ఈడు ముత్తాఱాయిరప్పడి ద్వారా ప్రసంగించండి” అని ఆజ్ఞా ఇచ్చెను. మణవాళ మాముణులు “ఏమి అనుగ్రహమిది!” అని సంతోషించి ఈ పాశురాన్ని రచించారు.

నామార్? పెరియతిరుమండపమార్? నంపెరుమాళ్
తామాగ నమ్మైత్తనిత్తళైత్తు – నీ మాఱన్
శెందమిళ్ వేదత్తిన్ శెళుం పొరుళై నాళుం ఇంగే
వందురై ఎన్ఱేవువదే వాయ్ న్దు

(నేనెవరు? తిరుమండపం అంటే ఏమిటి? నంపెరుమాళ్ స్వయంగా పిలిచి, “నీవు ప్రతిరోజూ, మాఱన్ (నమ్మాళ్వార్) స్వరపరిచిన స్వచ్ఛమైన తమిళ్ వేదార్థాలను తెలియజేయుము” అని ఆజ్ఞాపించాడు. “ఎంతటి అనుగ్రహం!”

శ్రీ రామాయణ శ్రవణ చేయుటకు శ్రీ రాముడు అప్పటి రారాజులందరినీ తమ ఆస్థానానికి పిలిచినట్లుగా, మరుసటి రోజే, సంగీత బృందం సంగీతాన్ని వినడానికి పోషించినట్లుగా, నంపెరుమాళ్ ఉభయ నచ్చియార్లతో కూడి తమ దివ్యసింహాసనంలో సిద్ధంగా ఉన్నారు. తమ సభలో తిరువనంతాళ్వాన్ (ఆదిశేషుడు), పెరియ తిరువడి (గరుడ), సేనాపతియాళ్వాన్ (విశ్వక్సేనుడు) మొదలైన దివ్యసూరులు, నమ్మాళ్వార్లతో మొదలు పెట్టి అందరు ఆళ్వార్లు, నాథమునులు, ఆళవందార్ మొదలైన ఆచార్యులు, శ్రీ రంగ నారాయణ జీయర్, తిరుమాలై తంద భట్టర్ మొదలైన స్థలపురుషులు, భక్తులు భాగవతుల మహా గోష్టి అయిన అణియరంగన్ తిరుముఱ్ఱం (శ్రీరంగ దివ్య ప్రాంగణం) అందరూ ఉపస్థితులై ఉన్నారు. మణవాళ మాముణులు ఈడు వ్యాక్యానం నుండి ప్రారంభించి, శృతి ప్రక్రియ (వేదంలో చూపినట్లుగా), శ్రీభాష్య ప్రక్రియ (శ్రీ రామానుజులు రచించన శ్రీభాష్యంలో చూపినట్లుగా). శృతప్రకాశికా ప్రక్రియ (దివ్య సూరీ భట్టర్ అనుగ్రహించిన శ్రీ భాష్య వ్యాక్యానంలో చూపినట్లు), గీతాభాష్య ప్రక్రియ (శ్రీ రామానుజులు అనుగ్రహించిన భగవద్గీత వ్యాక్యానంలో చూపినట్లు), శ్రీ పాంచరాత్ర ప్రక్రియ, శ్రీ రామాయణ ప్రక్రియ్ర, మహాభారత ప్రక్రియ, శ్రీ విష్ణు పురాణం ప్రక్రియ, మహాభాగవత ప్రక్రియల ఉల్లేఖనలతో వ్యాక్యానము అందించారు); వారు ఇది ప్రతి పదార్థం అని, ఇది వాక్యార్థం అని, ఇది మహావాక్యార్థం అని (అనేక వాక్యాల అర్థం), ఇది సమభివ్యాహారార్థం (ఇతర అర్థాలతో అనుబంధించిన) అని, ఇది ధ్వన్యార్థం (ప్రత్యేక శబ్దార్థం) అని, ఇది వ్యంగ్యార్థం అని, ఇది శబ్ధరసం (పద్య సౌందర్యం) అని, ఇది అర్థరసం (అర్థంలో ఉన్న సౌందర్యం) అని, ఇది భావరసం (భావ సౌందర్యం) అని, ఇది ఒణ్ పొరుళ్ (అర్థం యొక్క శ్రేష్ఠత) అని, ఇది ఉట్పొరుళ్ (అంతరంగార్థం) మొదలైనవి అన్నీ వివరించారు. ఈ విధంగా శ్రీ రంగనాధుడు ఒక సంవత్సరం పాటు మణవాళ మాముణుల శుద్ధ స్పష్ట కథన శ్రవణ చేశారు. చివరికి ఉపన్యాసం శాఱ్ఱుమురకి (ముగింపు) కి చేరుకుంది.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/30/yathindhra-pravana-prabhavam-74/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 73

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 72

ఉత్తమ పురుషుల గోష్టిని సేవిస్తూ, తాను పొందిన అదృష్టాన్ని ప్రతి నిత్యం ధ్యానించారని ఈ పాశురాలలో వర్ణించబడింది.

అంతః స్వాన్తం కమపిమధురం మంత్రం ఆవర్తయంతీం ఉత్యద్భాష్ప                        స్థిమితనయనాముజ్జితా శేషవృత్తిం
వ్యాక్యాగర్భం వరవరమునే త్వన్ముఖం వీక్షమాణాం కోణేలీనః
క్వచిత్ అణురసౌ సంసతంతాం ఉపాస్తాం

(ఓ మణవాళ మాముని! ఆ ఉత్తమ పురుషుల గోష్టిలో అల్పమైన ఈ అడియేన్ ఒక మూలన దాక్కొని, ఉభయ వేదాంతములు (సమస్కృతం, తమిళ వేదాంతాలు), రహస్యార్థాల వివరణలు తమ దివ్య శ్రీముఖంలో కలిగి, మనస్సులో మధురమైన మంత్రాన్ని జపిస్తూ, చలించని వారి కళ్ళు, కానీ ఆనంద బాష్పాలను కార్చే దివ్య నేత్రాలు కలిగి ఉన్న దేవర్వారిని సేవిస్తూనే ఉంటాను). వారు వరవరముని ఇతర శిష్యులతో కలిసి అక్కడ నివసించసాగారు. వాళ్ళల్లో, వరం తరుమ్ పెరుమాళ్ పిళ్ళై అనే ఒక శిష్యుడు ఉండేవాడు, అతను జీయర్ వారి తిరుక్కై చెంబు (చెంబు), తిరువొఱ్ఱువాడై (తుడుచుకోడానికి వాడే దివ్య బట్ట) ను మోసుకెళ్లేవాడు. అతను పొడవాటి జుట్టుని పెంచుకొని ఉన్నాడు. అతన్ని చూసి జీయర్ ప్రశ్నించగా, అతను తనకు బిడ్డ పుట్టబోతున్నాడని, అందుకే వెంట్రుకకు కత్తిరించుకోలేదని చెప్పాడు. వెంటనే వెళ్ళి వెంట్రుకలు కత్తిరించుకోమని జీయర్ అదేశించారు. అతను అలాగే చేశాడు. అతను తిరిగి వస్తుండగా, అతని గ్రామం నుండి ఒక వ్యక్తి వచ్చి, అతనికి పది రోజుల క్రితం ఒక కుమారుడు జన్మించాడని కబురిచ్చాడు [ఆచారం ప్రకారం, బిడ్డ జన్మించిన పదవ రోజున తన వెంట్రుకలు కత్తిరించుకోవాలి) . అది విని అక్కడున్న వాళ్ళందరూ ఏమిటీ విచిత్రం అని ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి తన కుమారుడికి జీయార్ దివ్య నామమైన ‘నాయనార్’ అని నామకరణం చేశాడు. ఉపదేశ రత్నమాల “వందు పరందదు ఎంగుం ఇత్తిరునామం” (దూర దూరం వరకు వ్యాపించింది ఈ దివ్య తిరునామం) లో చెప్పినట్లుగానే, అనేక మంది తమ కుమారులకు ‘నాయనార్’ అని నామకరణం చేయడంతో, ఆ పేరు మహా ప్రసిద్దికెక్కింది.

కందాడై అణ్ణన్, మాముణుల తిరువడి యందు భక్తితో నిత్యం వారిని ఆరాధిస్తుండేవారు. ఆ రోజుల్లో, వారు మాముణులకు ప్రియమైన కాయకూరల ఏర్పాట్లు చూసుకునేవారు. అణ్ణన్ తమ తిరువారాధన కోసం నివేదనల ఏర్పాట్లు కష్టంగా ఉన్న పరిస్థితిలో, అది గమనించిన జీయర్ దయతో తాను అందుకున్న నివేదనలను వారికి ఇచ్చేవారు. ఈ విధంగా, జీయర్ తమ శిష్యుల యొక్క కనీ కనిపించని అవసరాలను చూసుకునేవారు. ఆ సమయంలో, ఆ పాశురంలో వివరించినట్లుగా, భట్టర్పిరాన్ జీయర్ గోష్టిలో లేని వెలితిని జీయర్ భావించారు.

అప్పిళ్ళై కందాడై అణ్ణన్ ముదలానోర్
శెప్పముడన్ శేర్ంద తిరళ్తన్నై ఎప్పొళుదుం
పార్తాలుం ఎమక్కు ఇళవాం భట్టర్పిరాన్ తాదర్ తన్నైచ్
చూర్ తీరక్కాణామైయాల్

(అప్పిళ్ళై, కందాడై అణ్ణన్ మొదలైన ప్రముఖులున్న ఈ గోష్టిని నేను చూసినప్పుడల్లా, భట్టర్పిరాన్ జీయర్ గోష్టిలో లేని వెలితికి నేను బాధపడ్డాను).

ఈ పాసురంలో పేర్కొన్న విధంగా భట్టర్పిరాన్ జీయర్ వెంటనే వచ్చి జీయర్ పాదాలను సేవించుకున్నారు.

అప్పిళ్ళానుం కందాడై అణ్ణనుమ్ అరుళ్ పిరింద శడగోప దాసరుం
ఒప్పిల్లాద శిఱ్ఱానుం కూడియే ఓంగువణ్మై మణవాళ యోగిదాన్
శెప్పి వాళ్ందు కళిత్తు త్తెన్ కోయిలిల్ శిఱంద వణ్మైయై చ్చేవిత్తిరామలే
తప్పియోడి త్తవిత్తు త్తిరివదు తలైయెళుత్తు త్తప్పాదు కాణుమే

(దయాశీలుడైన మణవాళ మాముణుల దివ్య కృపకు పాత్రులైన అప్పిళ్ళాన్, కందాడై ఆండాన్, శఠకోప దాసర్ల దివ్య దర్శినానికి నోచుకోని నా దురదృష్ఠాన్ని నేను ఏమని వివరించాలి? ఈ దివ్య గోష్టికి దూరమై భ్రమిస్తున్నాను)

ఈ పాసురంలో వర్ణించబడినట్లు, అనేక విద్వాంసులు, ప్రముఖ ఆచార్యులు, సామాన్యులు, విద్యావంతులు మొదలైన అనేక వర్గాల వారితో మణవాళ మాముణుల మఠం నిండిపోయింది.

వాదు శెయవెన్ఱు శిల వాదియర్గళ్ వందు మనముఱియ నిఱ్పర్ ఒరుపాల్
వాళియెనవే పెరియ శాబమఱ వెన్ఱు శిలర్ వందనైగళ్ శెయ్వర్ ఒరుపాల్
పోదుం ఇని వాదం ఉన పాదం అరుళెన్ఱు పుగళ్ందు నిఱ్పర్ ఒరుపాల్
పొంగివరుం ఎంగళ్ వినై మంగ అరుళ్ ఎన్ఱు శిలర్ పోఱ్ఱి నిఱ్పర్ ఒరుపాల్
ఈదివై కిడక్క మఱై నూల్ తమిళ్ తెరిందు శిలర్ ఏదమఱ వాళ్వర్ ఒరుపాల్
ఏదమఱ వాదులర్గళ్ పేదైయర్గళ్ తామయంగి నిఱైందు ఇఱైంజి నిఱ్పర్ ఒరుపాల్
మాదగవినాల్ ఉలగం ఏళైయుం అళిక్క ఎన వంద ఎదిరాశన్ అడిశేర్
మామునివర్ దీపం అరుళాళర్ మణవాళ మాముని మన్ను మడం వాళుం వళమే

(కొంతమంది మణవాళ మాముణులతో చర్చలో పాల్గొనాలని వచ్చి, చర్చలో ఓడిపోయి, మనస్సు విరిగి ఒక వైపు నిలబడేవారు; మరి కొంతమంది తమ పాపాలను తొలగించుకోవాలని మాముణులకు సాష్ఠాంగ నమస్కారాలు చేసి ఒకవైపు నిలబడేవారు; ఇంకే చర్చ అక్కర్లేదని కొందరు, వారిని స్తుతించి, వారి దివ్య తిరువడి కృపను కోరుతూ, ఒక వైపు నిలబడేవారు; మరికొందరు, పొంగిపొర్లుతున్న తమ పాపాలను తొలగించమని వేడుకుంటూ, ఒకవైపు నిలబడేవారు; ఇవన్నీ ఇలా ఉండగా, తమిళ వేదం తెలిసిన కొందరు, నిర్మలమైన జీవనం సాగించే కొందరు ఒకవైపు నిలబడేవారు; ఈ లోకంలో భ్రమిస్తూ సామాన్య మనస్తత్వం గల కొందరు తమను ఉద్ధరించమని వచ్చి వేడుకొని ఒక వైపు నిలబడేవారు; ఏడు లోకాలను తమ దివ్య కృపతో ఉద్దరించాలని అవతరించిన రామానుజుల తిరువడి యందు ఆశ్రయం పొందిన మణవాళ మాముణుల దివ్య మఠం ఈ విధంగా సుసంపన్నంగా కొనసాగింది.)

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/29/yathindhra-pravana-prabhavam-73/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 72

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 71

జీయర్ ప్రధాన శిష్యులకు ఆచార్య స్థానములలో పట్టాభిషేకం గావించారు

ఒకానొక రోజు, జీయర్ ప్రతివాది భయంకరం అణ్ణాను పిలిచి, కాందాడైయణ్ణన్, పోరేఱ్ఱు నాయనార్, అనంతయ్యనప్పై, ఎమ్పెరుమానార్ జీయర్ నాయనార్, కందాడై నాయన్లకు శ్రీభాష్యం (వ్యాస మహర్షి అందించిన బ్రహ్మ సూత్రానికి రామానుజులు రాసిన వ్యాఖ్యానం) బోధించమన్నారు. తరువాత వారు ప్రతివాది భయంకరం అణ్ణాను శ్రీభాష్యసింహాసనముపై ఆసీనపరచి, అభిషేకం (పట్టాభిషేకం) నిర్వహించి వారికి శ్రీభాష్యాచార్యర్ అను దివ్య బిరుదుని ప్రసాదించారు.

మరొక రోజు, జీయర్ కందాడైయణ్ణాన్ ను పిలిచి, పెరియ కందాడై అప్పన్, తిరుక్కోపురత్తు నాయణార్ భట్టార్, శుద్ధసత్వమణ్ణన్, అండ పెరుమాళ్ నాయనార్, అయ్యనప్పాలకు భగవత్ విషయం (తిరువాయ్మొళి వ్యాఖ్యానం) బోధించమన్నారు. ఆ తర్వాత కందాడైయణ్ణాన్ ను ఆచార్య సింహాసనంపై ఆసీనపరచి, అభిషేకం నిర్వహించి, ‘భగవద్ సంబంధాచార్యర్’ అను బిరుదును ప్రసాదించారు. వ్యాఖ్యానం రాయడంలో శుద్ధసత్వమణ్ణన్ సామర్థ్యాన్ని చూసి సంతోషించి, భగవత్ విషయ సింహాసనంపై ఆసీనపరచి, అభిషేకం నిర్వహించి, అతనికి తిరువాయ్మొళి ఆచార్య అను బిరుదును ప్రసాదించారు. ఒక నాడు రాత్రి, కందాడై నాయన్, జీయర్ నారాయణ్ భగవత్ విషయార్థాల గురించి చర్చించడం జీయర్ చెవిన పడింది. భగవత్ విషయార్థాలను కందడై నాయన్ సంస్కృతంలో ప్రసంగించడం వారు విన్నారు. సమస్కృతంలో భగవత్ విషయానికి అరుంపదవిళక్కం (అర్థ వివరాలు) వ్రాయమని నాయన్‌ ను నియమించారు.

జీయర్ ఎఱుంబి అప్పాని కోయిల్ కు పిలుచుట

జీయర్ దివ్య సాన్నిధ్యాన్ని విడిచి ఎఱుంబికి [భాగం-66 చుడండి] చేరుకున్న ఎఱుంబి అప్పా తట్టుకోలేక దుఃఖ సాగరంలో మునిగి బాధలో ఉన్నారు. జీయర్ దినచర్యను (రోజువారీ అనుష్టానాలు) ధ్యానించ సాగారు. ఆ అనుభవం పొంగి ఆ ప్రవాహ అనుభవంలో వారు దినచర్య ప్రబంధం అను గ్రంథాన్ని రచించి, ఒక శ్రీవైష్ణవుని ద్వారా జీయరుకి పంపారు. అది చదివి జీయర్ ఎంతో సంతోషించి, ఎఱుంబి అప్పాపై తమ కృపను కురిపించారు. “నిజమైన ‘అభిమానం’ అనుసరించే వారు, వీరిలా ఉండాలి కదా?” అని వారి దివ్య మనస్సు ఎఱుంబి అప్పా వైపు మల్లింది. వెంటనే కోయిల్‌ కి బయలుదేరి రమ్మని అప్పాకి సందేశం పంపారు. మాముణులను వెంటనే దర్శించాలని ఆశించి ఈ శ్లోకాన్ని వారు పఠించారు..

పారావారప్లవనచతురః కుంజరేవానరాణాం
ప్రియసహచర బద్రిణామీశ్వరోవా
వాయుర్భూత్వాసపతియతివా మార్గముల్లంగ్య దుర్గం కాలేకాలే
వరవరమునయే కామయే వీక్షితుం త్వాం

ఓ మణవాళ మాముని! వానరులలో (కోతులలో) ఉత్తముడు మరియు భారీ సముద్రాన్ని దాటడంలో నిష్ణాతుడైన ఆంజనేయుడిగా లేదా పెరియ తిరువడి (పక్షి రాజన్) గా నన్ను నేను మార్చుకోని  ఈ అగమ్య మార్గాన్ని దాటడం ద్వారా దేవవార్ని తక్షణమే చూడాలని మరియు ఆనందించాలనుకుంటున్నాను. పొంగిపొర్లుతున్న వాత్సల్యంతో ఆ సందేశాన్ని తలపై పెట్టుకుని ఈ శ్లోకాన్ని వారు పఠించారు..

దేవః స్వామీ స్వయమిహభవన్ సౌమ్యజామాతృయోగీ
భోగీశ త్వద్విముఖామపిమాం భూయాసాభః యసిత్వం?
అర్తౌతార్యాతపిచ వచసామజ్ఞాసా సన్నివేశా
తావిర్ భాషపైరమలమపిధిర్ నిత్యం ఆరాధనీయం
ఆశాసానైర్ వరవరమునే నిత్యముక్తైరలభ్యం మర్త్యోలబ్దుం
ప్రభవధికతం మధ్వితః శ్రీముఖంతే
సారాసారప్రమితి రహితః సర్వధాశాసనంతే
సత్యశ్రీమాన్ కపికరకృతామాలికామేవ కుర్యాం

(ఓ తిరు అనంతాళ్వాన్ (ఆదిశేషుడు)! మా స్వామి అయిన మణవాళ మాముణులుగా మీరు అవతరించారు. మీ పట్ల నేను విముఖంగా ఉన్నప్పటికీ, నాకు విశేష అనుగ్రహం ప్రసాదించారు. ఓ మణవాళ మామునీ! దివ్య శ్రీసూక్తులు, వాటి అర్థాలు, స్వచ్ఛమైన మనస్సు గలవారు వారి ఆనంద బాష్పాలతో నిత్యం అరాధించువారికి, నిత్య సూరులు, ముక్తులు నిత్యం నీ పల్లాండు పాడే వారు అరాధించువారికి తగి ఉన్నప్పుడు, మాబోటి వారు మీ సందేశాన్ని పొందే అర్హత ఎలా పొందగలము? మంచి చెడుల మధ్య వ్యత్యాసం ఎరుగని ఈ అడియేన్, దేవర్వారు అందించే దివ్య సందేశాలను ఒక కోతి పూల దండను చీల్చి చెల్లా చెదరు చేసే విధంగా చింపివేస్తాను). మణవాళ మాముణుల నుండి వచ్చిన ఆ దివ్య సందేశంలో మునిగి, ఎంతో ఇష్టంగా కోరికతో వెంటనే శ్రీరంగానికి బయలుదేరారు. మఠంలోకి ప్రవేశించి, వారిని దర్శించాలనే వాంఛ, ఇంత కాలంగా జీయరుకు సాష్టాంగ నమస్కారం చేయలేదనే కోరికను పూరించడానికి, భక్తితో వారి దివ్య పాద పద్మాలను తమ కళ్ళకి, ఛాతికి హత్తుకొని, ‘సుధానిధిం స్వీకృతోతగ్ర విగ్రహం’ (తేనె సముద్రం వంటి జీయర్ తమ స్వసంకల్పానుసారంగా ఈ స్వరూపాన్ని స్వీకరించారు) అని ఈ క్రింది శ్లోకములో వివరించబడింది.

పొన్నిదనిల్ కుళిత్తు ఆంగు అందనిల్ పుగుద ప్పెఱ్ఱోం
పొరువరుం శీర్ నంపెరుమాళ్ పదం పుగళ ప్పెఱ్ఱోం
మన్నియ శీర్ మణవాళ మామునివన్ ఎన్నైయన్
వాళ్ందిరుక్కుం మడం తనిల్ వందిరుక్క ప్పెఱ్ఱోం
సెన్నిదనిల్ అవన్ అడియార్ పదం శూడ ప్పెఱ్ఱోం
తిరుమలైయాళ్వారిల్ ఎన్ఱుం శిఱందిరుక్క ప్పెఱ్ఱోం
పిన్నై అవర్ క్కు అందరంగ ప్పొరుళుం ప్పెఱ్ఱోం
పెరుం తివత్తిల్ ఇన్బం ఇంగే పెరుగవుం ప్పెఱ్ఱోం

(కావేరిలో స్నానమాచరించే భాగ్యము కలిగిన పిదప శ్రీరంగంలోకి ప్రవేశించాము. నంపెరుమాళ్ళ దివ్య పాదాలను సేవించుకునే అదృష్టం కలిగింది. మణవాళ మాముణులు నివసించే ప్రదేశంలో ఉండే భాగ్యం కలిగింది. వారి శిష్యుల దివ్య తిరువడిని ధరించే అవకాశం కలిగింది. తిరుమలైయాళ్వార్ (ఉపన్యాసం మొదలైనవాటి కోసం మాముణులు నిర్మించిన మండపం) లో ఉండే భాగ్యము కలిగింది. వారికి సన్నిహితులుగా ఉండే అవకాశం కలిగింది. ఈ భూమిపైన మా ఆనందం అంచలంచలుగా పెరడం మా అదృష్టం.

మణ్ణాడు వాళవందోన్ మణవాళమామునివన్ వణ్మై
కణ్ణారరుళుక్కు ఇలక్కాగ నల్వాళుం కండవన్ తన్
తిణ్ణార్ అడిగళిల్ కుఱ్ఱేవల్ శెయ్దు తిరియవుం నాన్
ఎణ్ణాదిరుక్క నడువే నమక్కు వందు ఎయ్దియదే

(ఈ భూమ్మీద అవతరించిన మణవాళ మాముణుల కృపకు పాత్రులైన వారికి సేవ చేయాలనే ఆలోచన కూడా లేని వ్యక్తిని నేను. అయినప్పటికీ, నేను ఎంత అదృష్టవంతుడిని అయ్యాను!)

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/28/yathindhra-pravana-prabhavam-72/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 71

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 70

తిరుమంగై ఆళ్వారుకి మంగళాశాసనం చేసిన తర్వాత, తిరుమంగై ఆళ్వారుకి అత్యంత ప్రియమైన వాయలాలి మణవాళన్ (తిరువాలి తిరునగరి ఎమ్పెరుమాన్) ను జీయర్ దర్శించుకున్నారు. ఆ తర్వాత కరుణాపూర్వకంగా వారు తిరుమణంగొల్లై [తిరుమంగై ఆళ్వారుకి పెరుమాళ్ళు తిరుమంత్రం ఉపదేశించిన చోటు) చేరుకొని ఈ క్రింది పాశురాన్ని పఠించారు:

ఈదో తిరువరసు? ఈదో మణంగొల్లై?
ఈదో ఎళిలాలి ఎన్నుమూర్? – ఈదోదాన్
వెట్టుంగలియన్ వేలై వెట్టి నెడుమాల్
ఎట్టెళుత్తుం పఱిత్తవిడం 

(ఇది పవిత్ర రావి వృక్షమా? ఇది తిరుమణంగొల్లై? తిరువాళి అని పిలవబడే అందమైన ప్రదేశమా? తిరుమంగై ఆళ్వార్ తమ బల్లెము చూపించి ప్రజలను బెదిరించి, తిరుమాళ్ (సర్వేశ్వరిని) నుండి తిరుమంత్రం (అష్టాక్షరి) ని బలవంతంగా లాక్కున్న ప్రదేశమేనా ఇది)).

జీయర్ తమ దివ్య మనస్సులో తిరుక్కణ్ణపురానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు, దీనిని తిరుమంగై ఆళ్వార్ తన పెరియ తిరుమొళిలో “నీణిలా ముఱ్ఱత్తు నిన్ఱవళ్ నోక్కినాళ్ కాణుమో కణ్ణపురం ఎన్ఱు కాట్టినాళ్” (పరకాల నాయకి {తిరుమంగై ఆళ్వార్ నాయికా భావంలో} మిద్దెపై నుంచి దూరంగా తిరుక్కణ్ణపురం ఆలయాన్ని చూసి, ఆశ్చర్యంపోయి ఇదే తిరుక్కణ్ణపురమని తమ స్నేహితులకు చూపించింది.) జీయర్ వెంటనే గొప్ప కోరికతో బయలుదేరి తిరుక్కణ్ణపురాన్ని చేరుకున్నారు. చక్కటి అవయవ సౌందర్యంతో నల్లని కొండలా కనిపించే సౌరిరాజు [తిరుక్కణ్ణపురం ఉత్సవ పెరుమాళ్పే] ని దర్శించుకున్నారు. క్కణ్ణపురత్తాన్ (తిరుక్కణ్ణపురం పెరుమాళ్) పెరుమాళ్ళని దాసుడని గుర్తింపు పొందిన తిరుమంగై ఆళ్వార్ల విగ్రహాన్ని దయతో జీయర్ అక్కడ ప్రతిష్టించారు. తరువాత వారు తిరునఱైయూరుకి వెళ్లి నంబిని (సర్వ గుణ సంపూర్ణుడైన తిరునఱైయూర్ నంబి పెరుమాళ్), నచ్చియారుని దర్శించుకున్నారు. తరువాత ఎర్రటి మణులకు నిధి అయిన తిరుక్కుడందై (ప్రస్తుత కుంభకోణం) చేరుకున్నారు, అక్కడ ఆరావముదాళ్వార్ (అక్కడి పెరుమాళ్ళు) యొక్క ఎరార్ కోలత్తిరువురువు (సుందరమైన దివ్య స్వరూపం) ని దర్శించుకున్నారు. అక్కడి నుండి బయలుబేరి ‘తిరుమాల్ సెన్ఱు శేర్విడం’ (ఎమ్పెరుమాన్ నివాసమున్న దివ్య ప్రదేశం) అని పాడబడిన ‘తెన్ తిరుప్పేర్’ చేరుకుని తిరుప్పేర్ నగరాన్ దివ్య తిరువడిని సేవించుకున్నారు. ఆ క్రింది శ్లోకంలో వర్ణించబడింది.

దివ్యాని తత్రనగరాణి దిగంతరాళేర్ దేవేనయాని హరిణా విషయీకృతాని
సత్యం త్వదీక్షణ సమర్థ మహోత్సవాని ధన్యాని తాని జగతశ్శమయంత్వకాని

(పెరుమాళ్ళు కొలువై ఉన్న దివ్య దేశాలన్ని, మీ కటాక్షంతో, ఆ దివ్య దేశాలలో విశిష్టమైన ఉత్సవాలు జరపబడుతున్నాయి, ఆ దివ్య దేశాలలన్నీ మన పాపాలను తొలగిస్తాయి), వారు దయతో వివిధ దివ్య దేశాలకు వెళ్లి మంగలాసాసనాలు చేశారు. “ఏషబ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే సీతమిలహ్రతం” (వేసవి కాలంలో చెరువులో మునక వేసినట్లే నేను పరబ్రహ్మంలో లీనమై ఉన్నాను) అని చెప్పినట్లుగా, వారు దయతో శ్రీరంగానికి బయలుదేరారు.

పెరుమాళ్ కోయిల్ లో అప్పాచ్చియారణ్ణ ను నియమించుట

ఆ తర్వాత తమ నివాసస్థలమైన శ్రీరంగం చేరుకుని పెరుమాళ్ళను సేవించుకున్నారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.

చిత్రాణి దీప్తర రత్నవిభూషణాని ఛత్రాణి చామరయుగం వ్యజనాశనాని
తన్నామలాంచగనయ్ తాని తతౌ తదైవ రంగాధిపాయ దయితా సహితాయతస్మై 

(అళగియ మణవాలన్ అనే దివ్యనామంతో పాటు దివ్య శంఖ చక్రాలను, అద్భుతమైన, ప్రకాశవంతమైన, రత్నాలతో పొదిగి ఉన్న దివ్యాభరణాలను; దివ్య శ్వేత గొడుగులను; అలంకార సింహాసనాలను పెరియ పిరాట్టితో కూడి ఉన్న ఆ అళగియ మణవాలనుడికి లొబడి ఉన్నారు), అతను పెరుమాళ్ళ కోసమై తమ వెంట తీసుకెళ్లిన సమర్పణలను [దివ్య దేశ యాత్రా సమయంలో సమర్పించిన] సమర్పించారు – దివ్యాభరణాలు, దివ్య తెల్లని గొడుగులు, చామర, దివ్య వింజామర, కెంపులు పొదిగబడిన తివాచీ, దివ్య దిండ్లు మొదలైనవి పెరుమాళ్ళకు సమర్పించుకొని మంగళాశాసనం చేసి వినయంగా నిలబడ్డారు. పెరుమాళ్ళు వారికి తీర్థ శఠారీలు మొదలైనని అందించి, ఆలయ పరిచాలకులను, నంబిని (ప్రధాన అర్చకులు) మణవాళ మాముణులకు తోడుగా తమ మఠం వరకు వెళ్ళమని ఆదేశించాడు. పెరుమాళ్ళు నంబిని అష్టాదశవాద్యాలతో (పద్దెనిమిది రకాల సంగీత వాయిద్యాలు) మహోత్సవ రూపంలో ఊరేగింపుగా వెళ్ళమని ఆదేశించాడు. జీయర్, తమ మఠానికి చేరుకున్న తర్వాత అప్పిళ్ళైని, తిరువాళి ఆళ్వార్ పిళ్ళైని, అక్కడ ఉన్న ఇతర ప్రముఖులను, శ్రీవైష్ణవ కైంకర్యపరర్లపై తమ కృపను కురిపించారు. వివిధ దివ్య దేశాలనుండి వారు తెచ్చిన తీర్థ ప్రసాదాలను వారందరికీ దయతో అందించారు.

తరువాత జీయర్ ముందు చెప్పినట్లుగా అప్పాచ్చియారణ్ణాను పిలిచి, పెరుమాళ్ కోయిల్ (కాంచిపురం) లో కైంకర్యం చేయమన్నారు. అప్పాచ్చియారణ్ణా సంకోచించి “ఈ సేవను, ఈ గోష్ఠిని వదలడం సాధ్యమా?” అని జీయరుని అడిగారు. జీయర్ అతని చేయి పట్టుకుని, సన్నిధి లోపలికి తీసుకెళ్లి, ‘రామాసుశన్’ అను నామంతోనున్న ఒక రాగి బిందెను అతనికి ఇచ్చారు. జీయర్ వాడిన ఈ బిందెను వానమామలై జీయర్ తమ బుట్టలో ఉంచుకునేవారు. ఆ బిందెపైన చెక్కిన ‘రామానుశ’ నామము, శంఖ చక్రాలు కాలక్రమేణ అరిగిపోయి ఉన్నాయి. ఆ కడవను ఉపయోగించి తనను పోలిన రెండు విగ్రహాలు తయారు చేసి ఒకటి ఆచార్యులకు సమర్పించి, మరొకటి తమ వద్ద ఉంచుకోమని అప్పాచ్చియారణ్ణాను జీయర్ ఆదేశించారు. దానితో పాటు తమ కోయిలాళ్వార్ (తిరువారాధన పెరుమాళ్ ఆసీనమై ఉన్న మందిరం) లో ఉన్న ఎన్నై తీమనం కెడుత్తార్ విగ్రహాన్ని కూడా అణ్ణాకు అందజేసి, “ఇంతకుముందు ఈ విగ్రహం ఆట్కొండవిల్లి జీయర్ తిరువారాధన పెరుమాళ్. కందాడైయాండాన్ దివ్య వంశీయుడివి అయినందున, ఈ పెరుమాళ్ళకి తిరువారాధనం చేసే పూర్ణ అర్హత నీకుంది” అని అన్నారు. ఆ తర్వాత వారు శ్రీవైష్ణవుల గోష్టికి [తిరుమలైయాళ్వార్‌లోని ] వెళ్లి ఈ శ్లోకాన్ని పఠించారు.

శ్రీతీర్థ దేవరాజార్య తనయాంభేడి విశృతా
తస్యాస్థనుజో వరదః కాంచీనగర భూషణః

(తిరుమంజనం అప్పా కుమార్తె అయిన ఆచ్చి కుమారుడు వరదాచార్యర్ (అప్పాచ్చియారణ్ణ), దేవరాజార్యార్ అని కూడా పిలువబడే వీరు కాంచీపురానికి ఆభరణం వంటివారు). ఎంతో ప్రేమతో, పేరారుళాళర్ (దేవరాజ పెరుమాళ్) ఆచ్చి కుమారునిగా అవతరించారని కృపతో జీయర్ తెలిపారు. వారు “కోయిల్ లోనే శాశ్వతంగా ఉండి కైంకర్యం చేయండి” అని అణ్ణాను ఆదేశించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/27/yathindhra-pravana-prabhavam-71/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 70

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 69

తిరువాలి తిరునగరిలో తిరుమంగై ఆళ్వార్ను దర్శించుకున్న జీయర్

అనంతరం, ఈ శ్లోకంలో చెప్పబడినట్లు

అహిరాజశైలమపితో నిరంతరం బృతనాశతేనసవిలోకయన్ తతః
అవరుహ్య దివ్యనగరం రమాస్పదం భుజగేశయం పునరుపేత్యపూరుషం

(ఆ మణవాళ మాముణులు తమ శిష్య బృందంతో తిరుమల నలువైపులా రెప్పార్చకుండా ఆర్తిగా చూస్తూ, కొండ దిగి తిరుపతి దివ్య పట్టణానికి చేరుకున్నారు. ఆదిశేషునిపై శయనించి ఉన్న గోవిందరాజుని మరలా దర్శించారు, శ్రీమహాలక్ష్మి నివాసస్థలాన్ని సేవించుకున్నారు), అక్కడి నుండి బయలుదేరి తిరువెవ్వుళూర్ (ప్రస్తుత తిరువళ్ళూర్) దివ్య దేశానికి చేరుకొని ఎమ్పెరుమానుని దివ్య పాదాలకు మంగళాసశాసనాలు చేసారు. తరువాత తిరువల్లిక్కేణి పెరుమాళ్ళ తిరువడిని సేవించిన పిదప పెరుమాళ్ కోయిల్ (కాంచిపురం) కి వెళ్లి పేరరుళాళర్ పెరుమాళ్ళను దర్శించుకున్నారు. వారి అనుమతితో, అక్కడి నుండి బయలుదేరి మధురాంతకం చేరుకున్నారు. మధురాంతకం పొలిమేరలకు చేరుకుని ఈ క్రింది తమిళ పాశురాన్ని వల్లించారు:

మరుమలర్ కమళుం శోలై మధురై మానగర్ వందు ఎయ్ది
అరుళ్ మొళి పెరియ నంబి అన్ఱు ఎదిరాశరర్ క్కు
అరుం పొరుళ్ వళంగుం ఎంగళ్ ఏరి కాత్తరుళ్వార్ కోయిల్
తిరుమగిళడియిఱ్శెల్వీర్ తీవినై తీరుమాఱే

(సువాసనతో కూడిన తోటలు విస్తరించి ఉన్న మధుర (మధురాంతకం) దివ్య దేశాన్ని చేరుకుని, ఏరికాత్త రామ కోయిల్ [ఆ ప్రదేశంలోని కొలనును సంరక్షించిన శ్రీ రాములవారి ఆలయం] లోపల పెరియ నంబి ఎతిరాజులకు (రామానుజులు) అరుదైన ఐశ్వర్యాన్ని (సమాశ్రయణం) ప్రసాదించిన చోటుకి వెళ్లాలి.

ఆ ఊరు సమీపంలోకి వెళ్ళగానే మరో పాశురాన్ని పఠించారు

ఇదువో కిళియాఱు? ఇవ్వూరో తిమధురై?
ఇదువో తిరుమగిళుం గోపురముం? – ఇదువో
పెరియ నంబి తాం ఉగందు పిన్నుం ఎతిరాశరాసర్ క్కు
తుయం అళిత్త తూయప్పది?

(ఇదేనా కిళి నది? ఇది మధురాంతకం దివ్య ప్రదేశమేనా? శ్రీమహాలక్ష్మికి అతి ప్రియమైన దివ్య గోపురం ఇదేనా? పెరియ నంబి పరమానందంతో ద్వయ మంత్రార్థాన్ని రామానుజులను అనుగ్రహించిన చోటు ఇదేనా?)

ఎంతో ఇష్టంగా ఆ ఊరుకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ రోజు అక్కడే ఉన్నారు. మర్నాడు, తిరుచిత్తిరకూటం దివ్య దేశానికి వెళ్ళి గోవిందరాజుల తిరువడిని దర్శించుకున్నారు. తరువాత వారు చోళ మండల (చోళ నాడు నలభై దివ్య దేశాలు) దివ్య దేశాల పెరుమాళ్ళను సేవించాలని ఆశించారు. వారు తిరుచిత్తిరకూటం నుండి బయలుదేరి, ఈ దివ్య దేశాల పెరుమాళ్ళకు మంగళాశాసనము చేశారు. తరువాత వారు తిరువాలి తిరునగరికి చేరుకుని తిరుమంగై ఆళ్వార్ దివ్య తిరువడిని సేవించుకున్నారు.

ఈ క్రింది పాశురాలను పఠించారు:

ఉఱై కళిత్త వేలై అత్త విళి మదందై మాధర్మేల్
ఉఱైయవైత్త మనమొళిత్తు అవ్వులగళంద నంబిమేల్
కుఱైయై వైత్తు మడల్ ఎడుత్త కుఱైయలాలి తిరుమణంగ్
గొల్లై తన్నిల్ వళిపఱిత్త కుఱ్ఱమఱ్ఱ శెంగైయాన్
మఱైయుళ్ వైత్త మందిరత్తై మాల్ ఉరైక్క అవన్ మున్నే
మడి ఒదుక్కి మనం ఒదుక్కి వాయ్ పుదైత్తు అవ్వొన్నలార్
కుఱై కుళిత్త వేలణైత్తు నిన్ఱ ఇంద నిలైమై ఎన్
కణ్ణై విట్టు అగన్ఱిడాదు కలియన్ ఆణై ఆణై ఆణైయే

(తిరుమంగై ఆళ్వార్ స్త్రీల చక్రాల వంటి నేత్రాల నుండి తమ మనస్సును మల్లించి ఆ పరమాత్మపై దృష్టి సాయించి, తమ బాధను కూడా వారిపైనే ఉంచారు. వారు ఎర్రని లేత అరిచేతులు కలిగి తిరుమణంగొల్లై అను దివ్య దేశములో శయనించి ఉన్న ఆ ఎమ్పెరుమానుని పైన మడల్ (తమిళ సాహిత్యంలో కవిత రూపం) కూడా రచించారు; ఎమ్పెరుమాన్ వేదాలలో దాగి ఉన్న తిరుమంత్రం (అష్టాక్షరం) పఠించగా, తిరుమంగై ఆళ్వారు విధేయులై నిలబడి తనలోకి తీసుకున్నారు. ఎమ్పెరుమాన్ చెబుతుండగా వింటూ తిరుమంగై ఆళ్వార్ తమ బల్లెమును ఆలింగనం చేసుకునే ఆ దృశ్యం నా మనస్సులో మెదులుతూనే ఉంది; ఆ కలియన్ [తిరుమంగై ఆళ్వార్] మీద ఆన)

అణైత్త వేలుం తొళుకైయుం అళుందియ తిరునామముం
ఓమెన్ఱ వాయుం ఉయర్ న్ద మూక్కుం కుళిర్ న్ద ముగముం
పరంద విళియుం ఇరుండ కుళలుం సురుండ వళైయముం
వడిత్త కాదుం మలర్ న్ద కాదుకాప్పుం తాళ్ న్ద శెవియుం
శెఱింద కళుత్తుం అగన్ఱ మార్బుం తిరండ తోళుం
నెళిత్త ముదుగుం కువింద ఇడైయుం అల్లిక్కయిఱుం
అళుందియ శీరావుం తూక్కియ కరుం కోవైయుం
తొంగలుం తనిమాలైయుం శాత్తియ తిరుత్తండైయుం
శదిరాన వీరక్కళలుం కుందియిట్ట కణైక్కాలుం
కుళిర వైత్త తిరువడి మలరుం మరువలర్ తం ఉడల్ తుణియ
వాళ్ వీశుం పరకాలన్ మంగై మన్నరాన వడివే

(వారు ఆలింగనం చేసుకున్న బల్లెము, అంజలి హస్థాలు, దివ్య ముద్రలు, ప్రణవాన్ని (ఓం) పలికే వారి దివ్య నోరు, సూటి ముక్కు, చల్లని ముఖం, విశాలమైన నేత్రాలు, నల్లటి శిరోజాలు, కరణ పత్రాలు, దిగిన చెవులు, మెడ, విశాలమైన ఛాతీ, గుండ్రని భుజాలు, వంగిన వీపు, సన్నని నడుము, కవచం, పెదాలు, చెవి కుండలాలు, పూల దండ, దివ్య కడియం, దివ్య అందెలు, చక్కటి గడ్డం, పుష్పాలవంటి చల్లని దివ్య పాదాలు, శత్రువుల శరీరాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఖడ్గం – ఇవన్నీ మంగై దేశ రాజైన పరకాలన్ యొక్క దివ్య స్వరూప రేఖలు.)

ఐయన్ అరుళ్ మారి శెయ్య అడియిణైగళ్ వాళియే
    అందుగిలుం శీరావుం అణైయుం అరై వాళియే
మైయిలగు వేలణైత్త వణ్మై మిగ వాళియే
   మాఱామల్ అంజలిశెయ్ మలర్ క్కరంగళ్ వాళియే
శెయ్యకలన్ ఉడనలంగల్ శేర్మార్బుం వాళియే
    తిణ్బుయముం పణింద తిరుక్కళుత్తుం వాళియే
మైయల్ శెయ్యుముగముఱువల్ మలర్ క్కంగళ్ వాళియే
    మన్నుమిదిత్తొప్పారం వలయముడన్ వాళియే

(తిరుమంగై ఆళ్వార్ యొక్క ఎర్రని దివ్య పాదాలు చిరకాలం వర్ధిల్లాలి! అందమైన దివ్య వస్త్రం, కవచంతో ఉన్న వారి దివ్య నడుము చిరకాలం వర్ధిల్లాలి! దివ్య బల్లెమును ఆలింగనం చిరకాలం వర్ధిల్లాలి! అంజలి ముద్రతో ఉన్న వారి దివ్య హస్థాలు చిరకాలం వర్ధిల్లాలి! ఎర్రని ఆభరణలతో, తిరు మాలలతో అలంకరించి ఉన్న వారి దివ్య వక్ష స్థలం చిరకాలం వర్ధిల్లాలి! గుండ్రని వారి భూజాలు, వినయంతో వంగి ఉన్న వారి మెడ చిరకాలం వర్ధిల్లాలి! వారి దివ్య పెదాలపై మైమరపించే చిరుమందహాసము, నిండు నేత్రాలు చిరకాలం వర్ధిల్లాలి!)

వేలణైంద మార్వుం విళంగు తిరువెట్టెళుత్తై
మాలురైక్క త్తాళ్ త్త వలచ్చెవియుం – కాలణైంద
తండైయుం వీరక్కళలుం తార్ క్కలియన్ వాణ్ముగముం
కండు కళిక్కుం ఎన్ కణ్

(దివ్య బల్లెమును ఆలింగనం చేసుకొని ఉన్న వారి దివ్య ఛాతిని, తిరుమాళ్ ఉపదేశిస్తున్న దివ్య అష్టాక్షరాన్ని వినడానికి వంగి ఉన్న వారి దివ్య కుడి చెవిని, దివ్య పాదాలను అంటి పట్టుకొని ఉన్న దివ్య అందెలు, కడియాలు, దివ్య మాలను ధరించిన తిరుమంగై ఆళ్వారి దివ్య ముఖారవిందాన్ని నా కాళ్ళు ఆస్వాదించుచున్నాయి.)

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/27/yathindhra-pravana-prabhavam-70/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org