యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 76

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 75

అణ్ణన్ తిరుమాలిగలో జరిగిన అద్భుతమైన ఒక సంఘటన

ఈడు ఉత్సవాల శాఱ్ఱుముఱలో పాల్గొనేందు కొరకై అందరు గుడిలో సమావేశమైయ్యారు. కందాడై అణ్ణన్ దేవి (వారి ధర్మ పత్ని), సంప్రదాయంలో ఎంతో జ్ఞానం ఉన్న ఇతర స్త్రీలు కలిసి అణ్ణన్ తిరుమాలిగలో జీయర్ మహిమలను పఠిస్తున్నారు. ఒక బ్రహ్మచారి అక్కడికి ఒక చీటీతో వచ్చి, అణ్ణన్ ధర్మ పత్నికి ఇచ్చి, దానిని అణ్ణన్ కు ఇవ్వమని అన్నాడు. ఆమె ఆ చీటీని తీసుకుని చదివింది. ఆ చీటీలో “ఈ స్లోకం చాలా అద్భుతంగా ఉంది!” అని చెప్పింది. ఆ స్లోకం గురించి తెలుసుకుందామని ఆమె ఆ బ్రహ్మచారి కోసం చూస్తే, ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు. అందరూ లేచి అతని కోసం వెతికారు, కానీ ఎవరూ అతని ఆచూకీని కనుగొనలేకపోయారు. అక్కడ ఉన్నవారు అది భగవత్ లీల అని భావించారు. వారిలో కొందరు పెరియ తిరుమండపంలోని గోష్ఠికి వెళ్లి ఆ చీటీని అక్కడ అందించారు. ఈ క్రింది శ్లోకములో వివరించబడింది…..

హటాత్ తస్మిత్ క్షణే కశ్చిత్ వర్ణి సంప్రాప్య పత్రికాం
వాదూల వరదాచార్య తమపత్ న్యాః కరే దదౌ

(అకస్మాత్తుగా, ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చి, కోయిల్ కందాడై అణ్ణన్ ధర్మ పత్ని చేతికి ఒక చీటీని ఇచ్చాడు), అక్కడ సమావేశమైన అందరూ ఆశ్చర్యపోయారు. వారు ఆ చీటీలో వ్రాసిన శ్లోకం చదివి, అది శ్రీశైలేశ దయాపాత్రం శ్లోకం అని తెలుసుకొని అవాక్కైపోయారు. వారు తిరుమంత్రార్థానికి అనుగుణంగా ఉన్న ఆ తనియన్ అర్ధాన్ని ధ్యానించారు [శ్రీశైలం తిరుమలైయప్పన్‌ ను సూచిస్తుంది, ఆయన అకారవచుడు (ప్రణవంలోని ‘అ’ అక్షరాన్ని సూచించేవాడు), దయాపాత్రం అనేది అతని దయకు పాత్రుడైనవాడిని సూచిస్తుంది, అనగా, మకార వాచ్యం (ప్రణవంలోని ‘మ’ అక్షరం) భగవానునికి చెందినవాడు, ప్రణవంలో వలె రెండింటి మధ్య సంబంధాన్ని ఇస్తుంది]. ప్రముఖ శిష్యులైన వానమామలై రామానుజ జీయర్, కందాడై అణ్ణన్, ఎఱుంబియప్పా, ప్రతివాది భయంకరం అణ్ణా మొదలైన వారు తమ దివ్య మనస్సులలో మణవాళ మాముణులపై ఉన్న తమ భక్తిని ప్రకటిస్తూ సంకల్పించిన తనియన్ కు ఈ తనియన్ సమానంగా ఉన్నదని గమనించి, ఆ తనియన్ అందరి కోరికను సంతృప్తిపరచుతున్నందుకు ఎంతో ఆనందించారు. ఆళ్వార్లు తదితరులను సముచిత గౌరవ మర్యాదలతో పెరుమాళ్ వారి వారి సన్నిధులకు పంపి, పెరియ పెరుమాళ్ళ సన్నిధికి తాను వెళ్లారు. ఆలయంలోని శిష్య బృందం అందరు జీయరుతో కలిసి శ్రీరంగం తిరుమాడ వీధుల్లో ప్రదక్షిణలు చేసి, జీయరుని మఠంలో విడిచిపెట్టారు. ఆలయ పరిచారకులు పెరుమాళ్ల సన్నిధికి తిరిగి వచ్చారు. పెరుమాళ్ సంతృప్తితో , “జీయర్ ‘ముప్పత్తారాయిర ప్పెరుక్కర్’ (‘ఈడు’ అనుభవాన్ని రెట్టింపు చేసి వివరించేవాడు) అని పలికి తమ కరుణను వారిపైన కురిపించాడు. శిష్యులందరూ జీయర్ తనియన్, వాళి తిరువాయ్మొళి ప్పిళ్ళైని పఠించి మంగళాశాసనం చేశారు. ఈ పాశురంలో చెప్పబడి ఉంది.

అడిసూడి ఎన్ తలైమేల్ అరుమఱై ఆయ్ందు తొండర్
ముడి సూడియ పెరుమాళ్ వరయోగిమునంగురవోర్
పడి సూడు ముప్పత్తాఱాయిరముం పణిత్తరంగర్
అడి సూడి విట్టదఱ్కో ఎందాయ్ ఎన్బదు ఉన్నైయుమే

(తమ భక్తుల శిరస్సులపై తన దివ్య పాదాలను ఉంచే పెరుమాళ్, ముప్పత్తాఱాయిరత్తు ప్పడి ద్వారా తిరువాయ్మొళి అర్థాలను వివరించమని మణవాళ మాముణులను నియమించి, వారికి కూడా తనియన్‌ ను ప్రసాదించడం ఆశ్చర్యంగా ఉంది!) అక్కడ ఉన్నవారందరూ ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ, జీయర్ శుభ గుణాలను ధ్యానించుకుంటూ ఆనందించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/02/yathindhra-pravana-prabhavam-76/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s