ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 4

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 <<ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 3

            ఆళ్వార్లు ,ఆళవందార్లు – సన్యాసుల నాయకులు

       మనకు నాలాయిర దివ్య ప్రబంధమును సాధించి పెట్టినవారైన స్వామి నాధమునుల మనుమడు , స్వామి రామనుజులకు పరమాచార్యులు అయిన ఆళవందార్లకు యామునచార్యులు, యమునైతురైవన్, యామునముని అని అనేక పేర్లున్నాయి. వారు అనుగ్రహించిన అర్థాలనే వారి తరువాత అవతరించిన ఆచార్యులు ఆదరించి తమ గ్రంధ రచనలో అనుసరించారనడం అతిశయోక్తి కాదు. ఆళవందార్లు అనుగ్రహించని అర్థాలు మన సంప్రదాయంలో లేవు.

స్వామి ఆలవందర్

            ‘ శ్రీయమునార్య సమోవిద్వాన్ నభూతో నభవిష్యతి ‘ श्रीयामुनार्यसमो विद्वान् न भूतो न भविष्यति| అని కీర్తించబడిన వారు ఆళవందార్లు. తిరువరంగత్తముదనార్లు వీరిని ‘ యతికట్ క్కిరైవన్ యమునై త్తురైవన్ ‘  ( యతులకు దైవ సమానుడు ) అని కీర్తించారు .

             ఆళవందార్ల అద్భుతమైన మేధాశక్తిని అర్థం చేసుకోవటానికి వారు అనుగ్రహించిన స్తోత్రరత్నం , సిద్దిత్రయం, ఆగమ ప్రామాణ్యం వంటి గ్రంధాలు ఉపకరిస్తాయి. వీటి ద్వారా వారి కవితా శక్తి ,తాత్విక జ్ఞానం  , రచనాపఠిమ , పంచరాత్రాగమముపై ఉన్న అధికారం తెలుసుకోవచ్చు. ఈ క్రింద వారి మాటలలోనే వారి అభిప్రాయం చూద్దా        न वयं कवयस्तु केवलंन वयं केवल-तन्त्र-पारकाः,

अपितु प्रतिवादिवारण-प्रकटाटोप-विपाटन-क्षमाः |

“ న వయం కవయస్తు కేవలం , న వయం కేవల-తత్ర –పారకాః ,అపితు

  ప్రతివాదివారణ –ప్రకటాటోప –విపాటన –క్ష్మమాః “

      “ మనం కేవలం కవి మాత్రం కాదు,కేవల ఆగమ తంత్రములు తెలిసినవాడిని కాదు. దానికి మించి ఏనుగు లాంటి ప్రతివాదులను గర్వ భంగము చేయగల సమర్దులం “ అని దైర్యంగా ప్రకటించారు. ఈ మాటలు స్వామి అహంకారంతో చెప్పినవి కావు, కేవలం తమ సమర్థతను ప్రతివాదులకు తెలియచేయటం కోసం చెప్పినవి.

మన సంప్రదాయంలో ఆచార్యులు ,సంస్కృత  భాషలో వేదవాక్యాల ఉదాహరిస్తూ అనేక సిద్దాంత గ్రంధాలను రచించారు.  వీటిలో ఆళ్వార్ల  రచనల నుండి ఉదాహరణలు కనపడవు. వాటిని చదివే వారిని సులభ గ్రాహ్యలు కావాలని భావించటమే దానికి కారణము . మన సిద్దాంతానికి సంభందించిన శ్రీవైష్ణవ సంప్రదాయ గ్రంధాలలో ఆళ్వార్ల  రచనల నుండి  అనేక ఉదాహరణలు కనపడతాయి .

నమ్మాళ్వార్

ప్రపన్న కులమునకు అధిపతిగా శ్రీశఠకోపులు

స్వామి నమ్మాళ్వార్లపై అళవందార్లకున్న అభిమానం ఎంతో తెలుసుకోవటానికి స్తోత్రరత్నంలోని 5వ శ్లోకం నుండి చూడవచ్చు. ‘ మతాపితా ‘  అని ప్రారంభమయ్యే ఈ శ్లోకంలో  స్వామి నమ్మాళ్వార్ల పేరు ప్రత్యక్షంగా ఉదాహరించ కుండా ‘ ఆద్యస్తనః కులపతేః వకుళాభిరామం ‘ అని ప్రయోగించారు. వకుళ మాలను ధరించిన వారు  నమ్మాళ్వార్లుఅని ఎలా భావించాలి ఎవరైనా వకుళ మాలను ధరించవచ్చు కదా అన్న సందేహం కలగవచ్చు. నమ్మాళ్వార్ల తమ పాశురాలలో ‘ నట్కమళ్ మగిళ్ మాలై మార్బినన్ మాఱన్ శఠకోపన్ ‘. అని చెప్పుకున్నారు. అందుకనే నమ్మాళ్వార్లకు వకుళాభరణ భూషణుడు అన్న పేరు స్థిరపడింది . తరవాత వచ్చిన ఆచార్యులు वकुलाभरणं वन्दे जगदाभरणं मुनिम्. ‘వకుళాభరణం వందే  జగదాభరణం మునిం ‘ అని కీర్తించారు.

నాథముని

స్తోత్రరత్నంలో ఆచార్య వరుస క్రమము

                  స్తోత్రరత్నంలో స్వామి ఆళవందార్లు మొదటి మూడు శ్లోకాలలో నాధమునులను కీర్తించి , తరువాత శ్రీవిష్ణుపురాణ కర్త అయిన పరాశర మహర్షిని గురించి ఒక  శ్లోకమును చెప్పారు . కాని మన గురుపరంపరా క్రమంలో ముందు నమ్మాళ్వార్లు , నాధమునులు , ఆళవందార్లు అనే క్రమంలో సేవిస్తాము.

పరాశర ముని

ఆళవందార్లు స్తోత్రరత్నంలో ముందు సంస్కృత వేదానికి ఆచార్యులైన పరాశర మహర్షిని, తమ కులపతులైన నాధమునుల గురించి  ప్రస్తుతించి  , తరువాత మన సంప్రదాయ కులపతులైన నమ్మాళ్వార్లను ప్రస్తుతించి వచ్చు కదా! లేక ముందు తమ ఆచార్యులను , కులపతులైన నమ్మాళ్వార్లను ప్రస్తుతించి సంస్కృత వేదానికి ఆచార్యులైన పరాశర మహర్షిని ప్రస్తుతించి వచ్చు కదా! ఎందుకని ఈ వరుస కరమాన్ని పాటించలేదు. అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్నకు స్వామి దేశికులు చక్కటి వివరణను ఇచ్చారు.

స్వామి దేశికుల వ్యాఖ్యానం

          ఈ ప్రశ్న యొక్క జవాబులోనే ద్రమిడోపనిషత్ ప్రభావం యొక్క గొప్పదనం దాగి వుంది. దానిని స్వామి వేదాంత దేశికులు ఎంత చక్కగా వివరించారో చూద్దాం .

స్వామి నాధమునుల తరవాత నమ్మాళ్వార్లను  స్తుతించినందుకు కారణము ఆళ్వార్లే  స్వామి నాధమునులకు ద్రమిడోపనిషత్ ను అనుగ్రహించినవారు అని మన సంప్రదాయంలో ప్రసిద్దము కదా అనుకోవచ్చు .  కాని ఆళ్వార్లను పరాశర మహర్షి తరవాత ఎందుకు స్తుతించారు? అంటే  “వేదవేదాంతము యొక్క  అర్థాలను పరాశర మహర్షి కంటే ఆళ్వార్లు చక్కగా వివరించారు. ఇంకా ఆళ్వార్ల పాశురాలు పరమాత్మకు ఇంపుగాను ,ఇష్టం గాను ఉన్నవి . పరమ కృపతో భగవద్విషయం మనకు అనుగ్రహించి వుండటం చేత ఆళవందార్లు- ఆళ్వార్లను,కోటాను కోట్ల జీవాత్మలకు స్వామి అయిన పరమాత్మను సమానంగా చూశారు . వేదాంతంలో ఎలాగైతే శ్రీమన్నారాయనుడే మాతా పితా సర్వం అని చెప్పబడిందో అలాగే ఆళవందార్లు వకుళా భరణ భూషణుడినే తమకు సర్వస్వముగా భావించారు.’ వకుళాభిరామం శ్రీమత్ తదంగ్రియుగళం మూర్తనా ప్రణమామి ‘

वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं मूर्ध्ना प्रणमामि |

మన పూర్వాచార్యులు కూడా , ఆళ్వార్లను పరమాత్మ శ్రీపాదాలుగానే భావించారు.అందువలననే ఆళవందార్లు పరమాత్మ కీర్తించే స్తోత్రమును చేసేముందు ఆయన  శ్రీపాదాలైన నమ్మాళ్వార్లను స్తుతించారు పెద్దల అభిప్రాయము . స్తోత్రరత్నంలోని పలు శ్లోకాలు ఆళ్వార్ల పాశురాలకు పోలిక కలిగి వుండటమో ,కొన్ని చోట్ల ప్రత్యక్షంగా అదే అర్థాన్ని తెలియజేసేవిగానో  అమరివున్నాయి. ( వీటి అర్థాలను వారి వారి ఆచార్యుల దగ్గర గ్రంధ కాలక్షెపము ద్వారా తెలుసుకోగలరు )

 1. कः श्रीः श्रियः (12) ,श्रियः श्रियम् (45) కః శ్రీః శ్రీయః (12)  శ్రీయః శ్రీయమ్ (45)అన్న ప్రయోగము ‘ తిరుమంగై ఆళ్వార్ల తిరువుక్కుతిరువాగియ సెల్వా ‘ అనే  పాశురభాగాన్ని పోలి ఉంది.
 2. ‘ నిరాసకస్యాపి న తవాదుత్సహే ‘ (26) అన్న శ్లోక పాదము

         ‘ తరుతుయరంతడాయేల్ ఉన్ శరణ అల్లాల్  శరణ్ ఇల్లై

         విరై కుళువు మలర్ పొళి సూళ్ విట్టువకొట్టమ్మానే ‘

         అనే  కులశేఖర ఆళ్వార్ల పాశుర భాగాన్ని పోలి ఉన్నాయి.

     3.గుణేన రూపేణ విలాస చేమష్టితౌ: సదా తవైవోచితయా తవ శ్రియా ‘(38 ) ‘ ఉనకేర్ కుం                       కోలమలర్ ప్పావై కణ్ పా  ‘ అన్న నమ్మళ్వార్ల  పాశుర భాగాన్ని పోలి ఉంది.

 1. ‘ నివాస శయ్యాసన ‘ అన్న (40) శ్లోక పాదము ‘ సేన్ద్రాల్ కుడైయాం ‘ అన్న నమ్మళ్వార్లపాశుర భాగాన్ని పోలి ఉంది.
 2. నమ్మళ్వార్ల ‘ వళవేళులగు ‘ దశక సారంగా 47శ్లోక పాదము ‘ ధిగశుచిమవినీతం ‘ అమరింది.

     6 . నమ్మళ్వార్ల ‘ఎనదావితందొళిందెన్ ……

          ఎనదావియార్ ఆనార్ తంద నీ కొండు ఆక్కినయే ‘ అనే    పాశుర భాగం’ వపుషాదిషు ‘ (52) , ‘              మమనాథ ‘ (53)  శ్లోక పాదములకు సరిపోతుంది .

 1. ‘ మహత్మభి: మాం‘(56) అన్న ప్రయోగానికి , ‘ ఒరునాళ్  కాణ వారాయే , నమ్మై  యోరుకాల్ కాట్టి నడన్దాల్ నాంగలుయ్యోమే , ఎమ్మావీట్టుతిరముం సెప్పం ‘అన్న నమ్మాళ్వార్ల  పాశుర భాగానికి సరిపోతుంది .
 2. నమ్మాళ్వార్ల ‘ ఏరాళుమిరైయోన్ ‘ దశకం యొక్క సారం 57 వ శ్లోకంలో ‘న దేహం న ప్రాణాన్ ‘ అన్నశ్లోక పాదములో వివరించ బడింది.

పై ఉదాహరణల వలన ఆళ వందార్లు నమ్మాళ్వార్ల ప్రబంధాన్ని తమ రచనలకు ప్రమాణంగా స్వీకరించారని చెప్పడానికి ఉపకరిస్తాయని .

స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యన్ తార్తం సుదుర్గ్రహం !

స్తోత్ర యామాస యోగీంద్ర  తమ్ వందే యామునాహ్వాయం !!

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/02/dramidopanishat-prabhava-sarvasvam-4/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

Advertisements

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 3

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 2

 

ఈ క్రింద చూపిన తైత్తరీయోపనిషత్తులోఉన్న ద్రమిడోపనిషత్తు అనే దివ్యప్రబందానికి స్తోత్రంగా అమరివున్నది.  

సహస్రపరమా దేవి శతమూలా శతాంఙుంకరా !

సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని !!

              పైన చూసిన ‘ దేవి ‘ అన్న ప్రయోగం ప్రకారం ‘ దివు ‘ అన్న ధాతువు నుండి వచ్చింది . ఈ ధాతువులో

అనేక అర్థాలు పేర్కొనబడినవి. 

‘ దివు ‘ క్రీడా విజిగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు !

                  పైన చూసిన  వివరణలో ‘ స్తుతి ‘ పదమే ఇక్కడ సరిపోతుంది. ‘ స్తుతి ‘ అంటే స్తోత్రం, కీర్తన అనే అర్థం వస్తుంది.  దివ్యప్రబందంలో పరమాత్మ కళ్యాణ గుణాలను కీర్తించడమే కావున ‘స్తుతి ‘ అనటమే తగివుంటుందని పూర్వాచార్య మతము.

              ‘ దుర్వా ’ అన్న పదానికి విశేషణంగా ‘ దేవి ‘ అన్న పదం అమరి వుంది , అనగా పసుపు వర్ణమని అర్థం వస్తుంది. ఇలాగే ఆళ్వార్ల పాశురాలకు ‘ పసుంతమిళ్ ‘ అని పిలవబడుతుంది . పరమాత్మను కీర్తించు ‘ పసుంతమిళ్ ‘ అన్న అర్థం రావటం వలన సంస్కృతంలో చెప్పే ఉష్ణం అన్న అర్థం ఇక్కడ వర్తించదు.

తైత్తరీయంలో ఉన్న ‘ సహస్ర పరమా ‘ వేయి పాశురాలతో  కూడినది అని గ్రహించాల్సి వుంది.

        నాయనార్ల ఆచార్య హృదయం సూత్రంలో “ వేదంగళిల్ పౌరుష మానవ గీతా వైష్ణవంగళ్  ప్పోలే , అరుళి చేయల్ సారం “ అని అన్నారు. (ఆళ్వార్ల పాశురాలు వేదాలలో పౌరుష మనవ గీతా వైష్ణముల వంటివి)

         వేదాలలో పురుషసూక్తం , ధర్మ శాస్త్రాలలో మనుధర్మము , భారతంలో భగవద్గీత, పురాణాలలో విష్ణు పురాణం, ఎంత ముఖ్యమైనవో ద్రావిడ వేదంలో తిరువాయిమొళి అంత  ముఖ్యమైనది అని ఆచార్యు పురుషుల అభిప్రాయం .

శతమూలా – నూరు పాశురాలతో కూడినది … తిరువాయిమొళిలోని వెయ్యి పాశురాలు  తిరువిరుత్తం లోని  నూరు పాశురాలతో సంబంధం గలవి.

         నాయనార్ల ఆచార్య హృదయంలో “ఋక్ సామత్తాలే సరసమాయ్  స్తోపత్తాలే పరంబుమా పోలే సోల్లార్ తొడైయల్ ఇసై కూట్ట అమర్ సువై ఆయిరమాయిట్ట్రు .” 

         ఋగ్వేదంలో మధ్య మధ్య సంగీత  స్వరముల వలన అందము ఎలా చేకూరుతుందో ,అలాగే నూరు పాటలు పాడినా అదే అందం   చేకూరుతుంది.  అలాగే  తిరువిరుత్తంలోని  నూరు పాశురాలు, తిరువాయిమొళిలోని వెయ్యి పాశురాలుగా విస్తరించబడింది అనటం అతిశయోక్తి కాదు .  

ముదల్ ఆళ్వారులు

 

శతాంఙుంకరా నూరు పాశురాలు అనే విత్తనం నుండి మొలిచినవి. నాలాయిర దివ్య ప్రబంధము మొదటి ఆళ్వార్ల ముదల్ తిరువందాది , ఇరండాం తిరువందాది , మూండ్రాం తిరువందాది లోని నూరు నూరు , పాశురాల నుండి  మొలిచాయి అనటంలో అతిశయోక్తి ఏమి లేదు .

          

 

తరువాత పదమైన – దుస్వప్ననాశిని. .. దివ్యప్రబంధము మన చెడు స్వప్నాలను పోగొడతాయి. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్లు చెప్పిన పాశురాన్ని చూడాల్సి వుంది .

తిరుమంగై ఆళ్వార్లు

‘ ఊమనార్ కండ కనవిలుం   పళుదాయొళిందన”

      మూగవాడు స్వప్నముతో వృధా చేసే కాలం కన్నా పరమాత్మను తెలుసుకోని కాలమే వృధా అయిన కాలము.  అలాగే పరమాత్మను తెలుసుకోని కాలమే చెడు స్వప్నము వంటి కాలము . చెడు స్వప్నము అని ఎందుకు అన్నారంటే పరమాత్మను తెలుసుకోని వారు ఈ పెద్ద సంసార సాగరంలో పడి దుఃఖిస్తారు. ద్రావిడ వేదము  జీవులకు పరమాత్మను గురించి తెలియ జేసి ఈ పెద్ద సంసార సాగరం నుండి దరి చేరుస్తుంది .

“ ఇప్పత్తినాల్ సన్మం ముడి వెయిది

    నాసం కండీర్ గళేజ్ఞనాలే   “

 ‘  ( ఈ పది పాశురాల వలన ఎడారిలో ఎండమావి  వంటి ఈ జన్మ ముగిసి దుఃఖ సాగరం తొలగి పోతుంది   )

సర్వం హరతు మే పాపం …. మే సర్వం పాపం హరతు…..మన పురాకృత పాపం తత్వ హిత పురుషార్థాలను తెలుసుకోవటానికి ఆటంకంగా ఉన్నవి. ఈ స్తోత్రము అటువంటి పురాకృత పాప రాసిని తొలగ దోస్తుంది .

               ఈ శ్లోకము ఋక్, ద్రావిడ వేదమును పటించేవారి పాపాలను పోగొట్ట మని ప్రార్థిస్తుంది. పరమాత్మ మృదువైన పచ్చదనాన్ని గురించి మాట్లాడే వేయి పాసురాల తిరువాయి మొళిని ప్రధాన అంశంగా కలిగి ఉన్నది. ఇది మొదటి ఆళ్వార్ల తిరువందాడి నుండి విస్తరించబడినది . మన సంసారమనే దుస్వప్నాన్ని పోగొట్టగల శక్తి గలది. 

             ఇంక,  ఏడవ కాండంలో ఐదవ ప్రశ్నలో  వేదేబ్యాస్స్వాహా అని తరువాత గాథాబ్యాస్స్వాహా అని సంస్కృత వేదాన్ని , దివ్యప్రబంధమనే ద్రావిడ వేదాన్ని-‘ వేద , గాథా ‘అన్న ప్రయోగంతో పేర్కొన్నది. స్వామి దేశికులు ‘ గాథా ‘ అన్న ప్రయోగం ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో పలు చోట్ల ద్రావిడ వేదమనే అర్థంలో ప్రయోగించారని తెలుస్తున్నది  . ఉదాహరణకు తాత్పర్య రత్నావళి నుండి రెండవ శ్లోకం చూద్దాం .

ప్రజ్ఞాఖ్యే మంథశైలే ప్రథితగుణరుచిం నేత్రయన్ సంప్రదాయం

తత్తల్లబ్ది-ప్రసక్తౌః అనుపధీ –విభుదౌః   అథ్రీతో వెంకటేశః !

తల్పం కల్పామ్తయూనః సత శఠజిదుపనిషత్ -దుగ్ధ –సింధుం విమత్నన్

గ్రథ్నాని స్వాదు-గాథా-లహరి-దశ-శతి –నిర్గతం రత్నజాతం !!   

భావము: నిత్య యవ్వనుడైన శ్రీమన్నారాయణుని కల్యాణగుణాలనే రత్నాలను కలిగివున్న, ఆయన పవళించె పాలకడలి లాంటి, వేయి అలల లాగా వేయి పాశురాలు కలిగివున్న శఠకోపుల దివ్య ముఖము నుండి వెలువడిన భావసముద్రము, దీనిలో నిండి వున్న అమృతోపమానమైన విషయాలను అనుభవించాలని ఆశపడిన ఆస్థీకుల కోరిక మేరకు పూర్వాచార్యులనే కవ్వంతో ఈ అమృత మధనం చేస్తున్నాడు.

ఇక్కడితో ద్రావిడ వేదం యొక్క గొప్పదన్నాన్ని సంస్కృత వేదంతో పోల్చు చర్చ ముగుస్తున్నది.  

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/01/dramidopanishat-prabhava-sarvasvam-3/

archived in https://srivaishnavagranthamstelugu.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 2

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 1

కూరత్తళ్వారు

 

  స్వామి నమ్మళ్వార్లే వేదాంతానికిమన సంప్రదాయానికి ఉన్నతమైన ఆచార్యులని స్వామి రామానుజులుకు ద్రావిడ వేదం మీద ఉన్న ప్రీతిని ఇంతకు ముందు చూసాము. ఇక మన పూర్వాచార్యులైన ఆళవందార్లుకూరత్తళ్వాన్లుభట్టరు,వేదాంత దేశికులు ,వారు అనుగ్రహించిన గ్రంధాలుఉపబ్రహ్మణముల సహాయంతో మన ఆళ్వార్ల ఔన్నత్యాన్నిదివ్యప్రబంధ ఔన్నత్యాన్ని అనుభావిద్దాము.

 

ఆళవందారు

స్వామి దేసికన్

వేదములో ద్రమిడొపనిషత్-నమ్మాళ్వార్లు అనే సూర్యుడు

నమ్మాళ్వార్లు

            స్వామి మధురకవి ఆల్వార్లు ఉత్తరాది యాత్ర చెస్తూ వుండగా దక్షిణం నుండి అధ్బుతమైన జ్యోతి ఒకటి  కనపడింది. ఆ జ్యోతి గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో వారు ఆ వెలుగు వెంట దక్షిణ దిక్కుగా నడవగా ఆఖరికి అది తిరుక్కురుగూరులోని నమ్మాళ్వార్ల నుండి వస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు.

           ఈ సందర్భంగా స్వామి  అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్లు అనుగ్రహించిన ఆచార్యహృదయంలోని చూర్ణిక చూడతగినది.

 ” ఆత్తియ రామ దివాకర అచ్త్యుతభానుక్కళుక్కు పోగాద వుళ్ళిరుళ్ నీంగ సోషియాత పిఱవి క్కడల్ వఱ్ఱి విహసియాద పోదిఱ్ కమలమలర్దదు వకుళభూషణ భాస్కరత్తిలే. “

        తూర్పున ఉదయించే సూర్యుడి వెలుగు వలన తొలగని మన అజ్ఞానం అనే చీకటి తొలగిపోయింది.  రాముడి  ప్రకాశవంతమైన వేడివలన ఎండిపోని ఈ దరిలేని సంసార సాగరం ఇప్పుడు ఎండిపోయింది. కృష్ణుడి ప్రకాశము వలన వికసించని జీవాత్మల హృదయాలు ఇప్పుడు పూర్తిగా వికసించినవి. వీటన్నిటికి కారణం మన లోకంలో అవతరించిన భాస్కరుడువకుళ పుష్పాలను అలంకరించుకున్న  నమ్మాళ్వార్లు అంటే అది అతిశయోక్తి కాదు.

  శ్రీమన్నాధమునులు నమ్మళ్వార్ల గురించి ఈ క్రింది శ్లోకాన్ని చెప్పారు.

నాథముని

” యద్గోసహహస్రమపహంతి తమాంసి పుంస్వాంనారాయణో వసతి యత్ర సశంకచక్ర !

యన్మండలం  శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ!! “

                       ఏ వేయి కిరణాలు (వెయ్యి తిరువాయిమొళి పాశురాలు) జీవాత్మల అజ్ఞానాన్ని పోగొడుతున్నవోఎవరి తిరుమేనిలో నారాయణుడు తన శంఖచక్రాలతో ప్రవర్దిల్లుతున్నారోఎవరి నివాసస్థానమును శాస్త్రాలు పొగుడుతున్నాయోవేదాంతులచే నమస్కరింప బడుతున్నదో ఆ వకుళ  మాలాంకృత సూర్యుడిని దాసుడు నమస్కరిస్తున్నాడు.

నాధమునుల ఈ శ్లోకానికి మూలమైన  శ్లోకాన్ని చూద్దాము.

‘ ద్యేయసదా సవితృమండల మధ్యవర్తీ

నారాయణ సరసిజాసన, సన్నివిష్టః !

కేయూరవాన్ మఖరకుండలవాన్ ,కిరీటీ

హరి హిర్ణ్యనయ వపుః ధృతశంఖచక్రః ” !!

          ఈ శ్లోకంలో అందంగా అలంకరింపబడిన నారాయణుడు శంఖచక్రములను ధరించి సవితృ మండలంలో వేంచేసివున్నాడు. ఆయన ఎల్ల వేళల ధ్యానింప తగినవాడు. నాధమునులు ఇక్కడ నమ్మాళ్వార్లను ఆనందంగా  వేంచేసివున్న సవితృ మండల సూర్యునిగా చెపుతున్నారు. వారి వేయి పాశురాలను వేయి కిరణాలుగా వర్ణిస్తున్నారు. ఆళ్వార్లు తమ కాంతితో మధురకవులను ఉత్తరం నుండి దక్షిణానికి ఆకర్షించారు.  సవితృ మండలము నుండి ప్రకాశించే కిరణాలను సావిత్రం అని అంటారు. అందువలన తిరువాయిమొళికి ఇక్కడ  సావిత్రం అన్న పేరు ఏర్పడింది. ఇంద్రుడు భరద్వాజుడిని సావిత్రిని  నేర్చుకోమని ఆదేశించారు. 

భరద్వాజుడి కోరిక ఇంద్రుడి తీర్చటం …

         యజుర్ బ్రాహ్మణంలో, గాటకం మొదటి ప్రశ్నలో , ఇంద్ర-భరద్వాజ సంవాదం ఉంది.

భరద్వాజుడు త్రయీ అని పొగడబడే వేదాధ్యయనం చేయాలనీ సంకల్పించాడు. ఇంద్రుడి దగ్గర వందల సంవత్సరాల ప్రమాణం ఉన్న మూడు పురుషకాలాలు వరంగా పుచ్చుకొని ప్రయత్నించి ఆఖరికి తన శక్తినంతా కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు భరద్వాజుడి దగ్గరకు వెళ్ళి మరొక పురుషకాలం ఇస్తే ఏమి చేస్తారని ప్రశ్నించాడు. దానికి ఆయన మళ్ళి వేదాధ్యయనం చేస్తానని చెప్పాడు. ఇంద్రుడు భరద్వాజుడి వేదాధ్యయనం చేయాలన్న కోరికను అర్థం చేసుకొని తన యోగవిద్య వలన మూడు వేదాలను మూడు పర్వతాలుగా చేసి  భరద్వాజుడి ముందు నిలిపాడు . ఒకొక్క పర్వతం నుండి ఒకొక్క గుప్పెడు మట్టిని తీసుకు రామన్నాడు. అలా తెచ్చిన మట్టిని చూపించి “ వేదాలు అనంతాలు, ఇప్పటి దాకా మీరు నేర్చినది ఈ గుప్పెడు” అని చెప్పాడు. అది విన్న భరద్వాజుడు వేదాలను ఆసాంతం అధ్యయనం చేయటం సాధ్యం కాదు కదా అని చింతించారు . ఇంద్రుడు భ్రరద్వాజుడికి సకల వేద సారమైన సావిత్రి విద్యను ఉపదేశించాడు.  ‘ సావిత్రి ‘ అంటే తిరువాయిమొళి .

భట్ట భాస్కరుడు ,తన వ్యాఖ్యానంలో ఈ క్రింది విధంగా చెప్పారు.

“ఇదం సావిత్రం విద్ది, అయం హి సావిత్రః సర్వ విద్యా సర్వవేద విధ్యాధ్యయనపుణ్య ఫలావాత్పిహేతు: తస్మాత్తక్తిహేతు: తస్మాత్తక్తిం వ్రుతాశ్రమేణ? ఇదామేవ వెడితవ్యమిత్యుక్త్వా తస్మై భారద్వాజాయ సావిత్రమువాచ”.

‘సావిత్రి ఆధారంగా వేదాలలోని సకల అర్థాలను తెలుసుకోవచ్చు. సావిత్రి ఉండగా మనం ఎందుకు చితించాలి ? సావిత్రిని తెలుసుకుంటే చాలు’   అని ఆ సావిత్రిని ఇంద్రుడు భ్రరద్వాజుడికి ఉపదేశించాడు.

           వేదాలు అనంతం. మన ప్రయత్నంతో అధ్యయనం చేయటం సాధ్యం కాదు. వేదాధ్యయనం చేయాలంటే సావిత్రిని తెలుసుకోవాలి. అనంత సాగరాన్ని చూసి అప్రతిభుడై నిలిచినప్పుడు ఆ అర్థాలను సులువుగా తెలుసుకునే మార్గం చూపించటం అవసరమే కదా! మన ఆచార్యులు సూర్యుడి వేయి కిరణాలను వకుళ భూషణ భాస్కరుని వేయి  పాశురాలుగాలుగా పేర్కొన్నారు.  

అడియేన్ చూడామణి రామానుజ దాసి 

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/01/31/dramidopanishat-prabhava-sarvasvam-2/

archived in https://srivaishnavagranthamstelugu.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 1

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

స్వామి రామానుజులు మరియు దివ్య ఫ్రబంధము

  ఆళ్వార్లచే అనుగ్రహింపబడిన దివ్య ఫ్రబంధమును ముఖ్య ప్రమాణమంగా తీసుకొని స్వామి రామానుజులు శ్రీభాష్య గ్రంధ  రచన చేసారు. అందు వలన స్వామి రామానుజులకు దివ్య ఫ్రబంధంతో ఉన్న అనుబంధాన్ని ఇక్కడ చూద్దాం. జ్ఞానాదికులు నేర్చుకోదలచిన సిద్ధాంతమును  ఒక ఆచార్యులుగానోపండితులుగానోశిష్యులుగానో ఉండి అధ్యయనం చేయవచ్చు. అలా అధ్యయనం చేసేవారు ఇతరులకు నేర్పించే అర్హత గల వారవుతారు అనటంలో సందేహం లేదని పెద్దల భావన. ఈ విషయాన్ని మనసులొఎ నిలుపుకొని ముందుకు సాగుదాం.

  దివ్య ఫ్రబంధం శిష్యులుగా స్వామి రామానుజులు

                స్వామి రామానుజులు శిష్యులుగా  దివ్య ఫ్రబంధంతో సహా అనేక విషయాలను అధ్యయనం చేశారన్న విషయం గురుపరంపరా ప్రభావంలో పలు సందర్భాలలో కనపదుతుంది. 

ఎంబెరుమానార్ తిరుమలైయాండాన్ శ్రీ పాదత్తిలే తిరువాయిమొళి అర్థం కేట్టరుళినార్ “

 (ఎంబెరుమానార్లు తిరుమలైయాండాన్ల దగ్గర దివ్య ఫ్రబంధం అధ్యయనం చేశారు.)

            స్వామి రామానుజులు ఆళ్వార్ల  ఫ్రబంధాలను గురుముఖత నేర్చుకున్నారని రామానుజ నూత్తందాదిలో చెప్పబడింది. పూర్వాచారుల స్తూత్రాలనుగురుపరంపరా సారం మొదలైన శ్రీవైష్ణవ సంప్రదాయ గ్రందాలను స్వామి రామానుజులు శిష్యులుగా ఉండి అధ్యయనం చేశారని తెలుస్తున్నది. దివ్య ప్రబంధ తాత్పర్యాన్ని, అంతరార్థాలను ఆసాంతం ” అంజుకుడిక్కొరు సంతతియాయ్ ” (ఐదు వంశాలకు ఒక్క సంతానంగా) అన్నట్లు నాధమునుల నుండి శిష్యాచార్య పరంపరగా సాగి ,ఆళవందార్ల శిష్యులైన ఐదుగురు ఆచార్యుల దగ్గర అధ్యయనం చేసారు.ఈ నాటికి ఆచార్య పరంపర కొనసాగుతున్నందుకు గురుపరంపరా ప్రభావము, దివ్యప్రబంధమే కారణం. వీటిని మనం అధ్యయనం చేయటమే కాక, అధ్యాపనం చేసి మన సత్సాంప్రదాయాన్ని కొనసాగించా వలసిన అవసరం ఉంది. మన సంప్రదాయంలో దివ్యప్రబంధ అధ్యయనం తప్పనిసరి అయిన భాగం. అందువలననే స్వామి రామానుజులు కూడా ఈ ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని ఎంతో ఆదరంతోఆశక్తితో అధీకరించారు.

” దివ్య ప్రబంధ ఆచార్యులుగా శ్రీరామానుజులు “

       ప్రతి ప్రబంధాన్ని సేవించే ముందు ఆ ప్రబంధానికి సంబంధించిన  తనియన్లను సేవించటం ఆచారంగా ఉన్నది. ఒక్కొక్క ప్రబంధానికి ఒకటికంటే ఎక్కువ తనియన్లు ఉండవచ్చు. ఈ తనియన్లు ఎందుకు ఉన్నాయి అన్న విషయం చూద్దాం.

1. ఆయా  ప్రబంధాల ప్రాముఖ్యతను తెలియ చేయటానికోసం.

2. ఆయా  ప్రబంధాలను అనుగ్రహించిన ఆళ్వార్ల గొప్పదనాన్ని తెలియచేయటం కోసం.

3.ఆళ్వార్లను వారి అవతార స్థలాలను కీర్తించడం కోసం.

4.ఆయా  ప్రబంధాల సారాన్ని తెలియచేయటం కోసం.

          పైన చూసిన విషయాల వలన తనియన్లు ఆళ్వార్ల ప్రబంధాలలోని తాత్పర్యాలను సంక్షిప్తంగా తెలియచేస్తా యని బోధపడుతుంది. కాని, తిరువాయిమొళిలోనుపెరియ తిరుమొళిలోను అలా లేకపోవటం చూడవచ్చు. తిరువాయిమొళికి పూర్వాచార్యులు ఆరు తనియలను అనుగ్రహించారు. వాటిలో ఒకటి సంస్కృతములోను ,మిగిలినవి తమిళంలోను ఉన్నాయి. అందులో రెండు స్వామి రామానుజుల కాలము తరవాత వారి శిష్యులైన అనంతాళ్వాన్లు చేసిన తనియన్ ఒకటి కాగా, స్వామి పరాశర భట్టర్లు చేసిన తనియన్ ఒకటి .

అనంతాళ్వారు

” ఏయ్ న్ద పెరుం కీర్తి ఇరామానుసమునితన్

వాయ్ న్ద మలర్పాదం వణంగుగిన్ఱేన్

ఆయ్ న్ద పెరుం శీరార్ శఠకోపన్ సెంతమిళ్ వేదం తరిక్కుం పేరాద ఉళ్ళం పెర “

 

          ఈ తనియన్లో స్వామి నామ్మాళ్వార్లు అనుగ్రహించిన ద్రావిడ వేదం పరిపూర్ణంగా మనసుకు పట్టడానికి స్వామి రామానుజులే కృప   అని ప్రార్థిస్తున్నారు.

” వాన్ తిగళుం శోలై మదిరళంగర్ వణ్పుగళ్ మేల్

ఆన్ఱ తమిళ్ల్ మఱైగళ్  ఆయిరముం

ఈన్ఱ ముదల్ తాయ్ శఠగోపన్

మొయింబాల్ వళర్త ఇదత్తయ్ ఇరామానుసన్ “

పరాశర భట్టర్

       

 

  వేయి పాశురాల తిరువాయిమొళి అనే బిడ్డను కన్న తల్లి నమ్మాళ్వార్లు కాగా(వ్యాఖ్యానాలు చేసిన)

పెంచిన తల్లి రామానుజులు అని ఈ తనియన్ అర్థము.

 

 

 

 

 

 

 

 

ఎంబార్ స్వామి

        అదే విధంగా పెరియ తిరుమొళికి సంస్కృతములో ఒకటి ,తమిళములో మూడు తనియన్లు అమరి ఉన్నాయి. అందులో స్వామి ఎంబార్లు అనుగ్రహించినది ఒకటి ఉన్నది.

ఎంగళ్ గతియె ఇరామానుస మునియే!

శంగై కెడుత్తండ తవరాసా!

పొంగు పుగళ్ మంగైర్ కోనీంద మఱై ఆయిరమనైత్తుం ,

తంగు మనం నీ ఎనక్కు తా! “

    ఈ తనియన్లో తిరుమంగై ఆళ్వార్లు  అనుగ్రహించిన పెరియ తిరుమొళి అంతరార్దాలతో మనసులో స్థిరముగా ఉండేవిధంగా అనుగ్రహించమని స్వామి రామానుజులను ప్రార్థిస్తున్నారు.

          ఈ తనియన్లను చేసిన వారు పరమపద నాధుడినోశ్రీమహాలక్ష్మినోశ్రీమన్నాధమునులనోఆళ్వార్లనో కాక స్వామి రామానుజులను ప్రార్థించటం కనపడుతుంది.  దీనికి కారణం భట్టర్లు అనుగ్రహించిన తనియన్ వలన గ్రహించ వచ్చు. ఆళ్వార్లు దివ్య ప్రబంధాలను అనుగ్రహించినప్పటికీవాటి ఔన్నత్యాన్ని అందరికి తెలియజేసివాటిని రక్షించి స్వామి రామానుజులు. తన శిష్యుల మూలంగా ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రాయించి వాటిని అంగీకరించి వాటిని కోరిక గలవాళ్ళందరు చదివి ప్రయోజనాన్ని పొందేట్లుగా చేసిన వారు స్వామి రామానుజులు.  రామానుజులను గురించిన ఐతిహ్యాలువారే ఉత్తాకాచార్యులని పూర్వాచార్యులు చేసిన నిర్వాహాలు తెలియచేస్తున్నాయి.

 

“ మాఱనురై సెయిద తమిల్ మఱైవళర్తోన్ వాళియే  “

             స్వామి మామునులు కూడా తమ ఆర్తి ప్రబంధంలో ద్రావిడ వేదాన్ని రక్షించి పొషించినది స్వామి రామానుజులనే కీర్తించారు.

పై విషయాల వలన స్వామి రామానుజుల ఆచార్య స్థానము యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది.

స్వామి రామానుజులు నడిచి చూపిన ఉన్నతమైన మార్గము

                స్వామి రామానుజుల జీవన విధానాన్ని చూసినపుడు వారు విద్వానాలేక వేదాంతియాఅన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు తిరువరంగత్తముదనార్ల పాశురాలలో చూడవచ్చు. ఎందుకంటే అముదనార్లు రామానుజుల జీవన విధానాన్ని దగ్గర ఉండి చూసినవారు.    

” ఉరు పెరుంసెల్వముం తందైయుం తాయుం

ఉయర్ గురువుం వెరి తరు పూమగళ్ నాధనుం

మాఱన్ విళంగియ సీర్నెరితరుం  సెంతమిళారనమే యెన్ఱి

నీణిలత్తోర్ అఱితర నిన్ఱ ఇరామానుసనెన క్కారముతే!”

         స్వామి రామానుజులు నమ్మాళ్వార్లచే అనుగ్రహించబడిన ప్రబంధాలను తమ తల్లిగాతండ్రిగాఆచార్యులుగాసంపదగాదైవముగా,  భావించటమే కాక ఆ మర్గములోనే నడచి చూపిన వారు . మనోవాక్కాయకర్మల దివ్య ప్రబంధాలను ఆదరించిఆచరించివాటిపై తమకు ఉన్న భక్తిని ప్రపంచానికి చాటి చూపించారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/01/30/dramidopanishat-prabhava-sarvasvam-1/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

తత్త్వత్రయం – చిత్తు: నేనెవరిని?

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

తత్త్వత్రయం

<< శ్రీ పిళ్ళైలోకాచార్యులు అనుగ్రహించిన తత్వ త్రయము గ్రంథ పరిచయము

జ్ఞానుల ఉపదేశముల ద్వారా చిత్ (ఆత్మ) తత్వమును అర్థం చేసుకొనుట :

పరిచయము:

 • సామాన్య జనుల నుంచి శాస్త్రజ్ఞులు, జ్ఞానుల వరకు సమాధానము తెలియగోరే గొప్ప ప్రశ్న “నేను ఎవరిని?” అని. అలాగే ప్రకృతి అంటే ఏమిటి? దాని సృష్టికర్త ఎవరు? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి!
 • తరతరాలుగా అనేక నాగరికతలలో జ్ఞానులు ఈ మూడు వస్తువుల గురించి కొత్త విషయములు తెలుసుకొనుటకు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు.
 • సనాతన ధర్మం వేదము, వేదాంగము, స్మృతి ఇతిహాస పురాణములపై ఆధారపడియుండుట చేత పై మూడు (చిదచిదీశ్వరులు) విషయముల గూర్చి చక్కగా వివరిస్తుంది.
 • గీతాచార్యుడు (శ్రీమన్నారాయణుడు), నమ్మాళ్వార్లు, శ్రీపిళ్ళైలోకాచార్యులు మరియు స్వామి మణవాళ మహామునులు తమతమ గ్రంథములలో చిదచిదీశ్వర తత్వములను అద్భుతముగా చెప్పియున్నారు.
 • ముఖ్యముగా శ్రీపిళ్ళైలోకాచార్యులు రచించిన ఈ “తత్వ త్రయం” గ్రంథము మరియు స్వామి మణవాళ మహామునులు రచించిన వ్యాఖ్యానము సామాన్యులు కూడా సులువుగా అర్థము చేసుకొను రీతిలో మలచబడియున్నవి.
 • ముముక్షువులు చిదచిదీశ్వరతత్వము గూర్చి తెలుసుకోకుండా సాధన చేయుట కష్టసాధ్యమే అవుతుంది. కనుక ఆస్తికులు, ప్రపన్నులు తత్వ త్రయము గూర్చి తప్పక తెలుసుకొనవలెను.
ఆత్మ యొక్క నిజమైన తత్వము
 • ఆత్మ, పాంచభౌతికమైన స్థూల శరీరము ఒకటి కాదు.
 • ఆత్మ యొక్క గుణములు:
  1. ప్రకాశవంతం: తన అస్తిత్వమును పూర్తిగా తెలుసుకొన్నది మరియు స్వయం ప్రకాశమైనది.
  2. అమితానందమైనది: ఎప్పుడూ బ్రహ్మానందస్థితిలోఉండునది.
  3. అక్షయమైనది: సృష్టి నాశనములు లేనిది.
  4. అగోచరమైనది: బాహ్య దృష్టికి కానరానిది.
  5. అణ్వాత్మకమైనది: స్థూల దృష్టితో దర్శించలేనంత అల్పమైనది.
  6. దురవగతమైనది: ఇంద్రియముల చేత గ్రహించనలవికానిది.
  7. అభేద్యమైనది: భాగించుటకు, విభజించుటకు సఖ్యము కానిది.
  8. మార్పులేనిది: మార్పు చెందే గుణములేనిది.
  9. జ్ఞానపూర్ణమైనది.
  10. భగవానుని చేత నియంత్రించబడునది.
  11. భగవంతునికి దాస్యము  చేయుటయే ఆత్మకు  స్వాభావికము.

ఆత్మకు శరీరమునకు, ఇంద్రియములకు, బుద్ధికి, శ్వాసకు గల భేదములు :

 • శరీరేంద్రియములను “నా శరీరము”, “నా బుద్ధి”, “నా ఇంద్రియములు” అని వ్యవహరిస్తుంటాము. “నేను” అనునది ఆత్మ కాగా పైన చెప్పిన ఉదాహారణలలోని శరీరాదులు ఆత్మకు చెందిన వస్తువులుగా ఆపాదించవచ్చు.
 • ఆత్మ గూర్చి ఎరుక ఎల్లప్పుడూ ఏదోక రూపములో ఉండును కానీ శరీరాదుల ఎరుక ఎల్లప్పుడూ ఉండదు.
 • ఉదాహరణకు నిద్రావస్థయందు శరీరస్మృతి ఉండదు కానీ ఆత్మ యొక్క ఉనికి (జాగృతముగా) ఉండును. కనుకనే నిద్ర మేల్కొనగానే మనము ఎవరో తిరిగి తెలుసుకొనగలుగుతున్నాము. అలాగే చేతికి మత్తు మందు ఇస్తే చేయి స్పర్శ కోల్పోతుంది కానీ మిగిలిన శరీరము చైతన్యముతో ఉంటుంది. అదే ఆత్మయొక్క గుణము.
 •   అందుచేత ఆత్మ వేరు, శరీరాదులు వేరు.

పై గమనికల ద్వారా శరీరేంద్రియములు, ఆత్మ వేరు అన్న విషయము మనకు అర్థమవుతుంది.

 • పై గమనికలలో బేధములను ఇతరులు ఆక్షేపించవచ్చు. తర్కము ఎల్లప్పుడూ సాధ్యమే. అయితే మనకు శృతిస్మృతిపురాణాదులు ప్రమాణము కనుక పూర్వాచార్యుల సూక్తులు వాటిపై ఆధారపడినవి కనుక మనము పై గమనికలను ఒప్పుకొనవలెను. శాస్త్ర ప్రమాణము దుర్బేధ్యమైనది, తర్కమునకు అందనిది కనుక దానినే ఒప్పుకొనవలెను.

అందుచేత శరీరము వేరు ఆత్మ వేరు. ఆ రెండు వస్తువులు వేరైనను ఒకదానికి మరొకటి సంబంధము కలిగియుండి పరస్పరము ఆధారమైనవి. ఈ విషయము బాగా అర్థము చేసుకోగలిగితే మనకు శారీరిక సంబంధిత విషయములపై ఆసక్తి తగ్గనారంభిస్తుంది.

శరీరములోని మార్పు ఆత్మ యొక్క శరీర ప్రయాణము:
 • భగవానుడు భగద్గీతలోని రెండవ అధ్యాయములో ఆత్మ శరీరము గూర్చి చక్కగా వర్ణించాడు.
 • 13వ శ్లోకములో, “ఆత్మ శరీరములో ప్రవేశించిన పిదప శరీరమునకు జననము, బాల్యము, కౌమార్యము, యవ్వనము, వార్ధక్యం,మరణము అనెడి స్థితులు కలిగి ఆత్మ ఒక శరీరమును వదిలి మరొక శరీరమునకు ప్రయాణించును. ఈ విషయము తెలిసినచో శరీరము పట్ల మమకారము పట్టదు.”
 • 22వ శ్లోకములో, “పాడైపోయిన దుస్తులను విడిచి మనము కొత్త దుస్తులు ఎలా తొడుక్కుంటామో అలాగే ఆత్మ క్షిణించిన ఒక శరీరమును విడిచి మరొక శరీరమునకు ప్రయాణము చేయును”.

కనుక శరీరము క్షయమగును కానీ ఆత్మ క్షయమవదు.

కర్త కర్మ క్రియ ఆత్మయే:
 • ఆత్మ జ్ఞానపూర్ణమైనది కనుక కర్త ఆత్మయే.
 • శాస్త్రము ఆత్మ జ్ఞానపూర్ణమైనదిగా చెబుతున్నది.
 • జ్ఞానము కర్మకు హేతువు. కర్మ అనుభవమునకు హేతువు. కనుక కర్మ, అనుభవము అనునవి జ్ఞానము యొక్క రెండు దశలుగా చెప్పవచ్చు.
 • ఆత్మ శరీరాంతర్గతమైయుండి భూమిపై సత్వ రజస్తమో (ప్రశాంతత, ఆవేశము, నిర్లక్ష్యము) గుణవిరాజితమైయుండును కనుక దానికి అనుగుణముగా ప్రవర్తించును.
 • భగవానుడు ఆత్మకు స్వాతంత్య్రమునిచ్చి ఇష్టారీతిలో వర్తించుటకు అనుమతిచ్చిననూ భగవానుని నిరంకుశ గుణము చేత జీవుని నియంత్రించే అధికారము భగవానునికి కలదు.
 • జీవుడు ఆచరించే ప్రతీ కార్యములోనూ జీవునికి స్వాతంత్య్రము కలదు. భగవానుడు సాక్షిభూతుడై అది గమనించుచూ జీవుడు తన ఇష్టానుసారం చేయు చర్యలకు ఫలితమును అనుగ్రహించును.
 • జీవుడు చేయు కర్మలు శాస్త్రానుసారమా లేక శాస్త్రవిరుద్ధమా నిర్ణయించి భగవానుడు జీవునికి తగిన కర్మఫలమును ఇచ్చును. దీని వలన భగవానుడు పరోక్షముగా జీవుని నియంత్రించుచుండును. అయితే కర్మ ఇష్టానుసారముగా ఆచరించే స్వాతంత్య్రత జీవునికి భగవంతుడు ఇచ్చుట చేత తాను చేయు కర్మలకు తానే బాధ్యుడవుతాడు జీవుడు.
 • కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భగవానుడే జీవుని కర్మలను పూర్తిగా నియంత్రించి లోకోపకార రీతిలో జీవుని చేత కర్మలు ఆచరింపచేయును. అవి కారణ జన్ముల జీవితాలలో జరుగు సంఘటనలు, వారి కర్మలు మొదలగునవి.
భగవానుని చేత నియంత్రింపబడుట, ఉద్ధరింపబడుట – భగవానునికి దాస్యము చేయుట :

భగవానుని చేత పూర్తిగా నియంత్రించబడిన జీవుని జీవితములోని కర్మలన్నీ భగవానుడే చేయించుచుండును. అటువంటి వారి జీవితములో వారు ఆచరించిన కర్మలకు బాధ్యులు వారు కాదు. భగవానుడే!

 • శరీరములోని అన్ని చర్యలను జీవుడు నియంత్రించినట్లు, జీవుని పూర్తిగా నియంత్రించు సర్వాంతరాత్మ ఆ భగవంతుడు.
 • భగవంతుడు సర్వజీవులను నియంత్రించువాడు అయిననూ వారి ఇష్టానుసారము జీవించుటకు, శాస్త్రమును అనుష్ఠించుట కొరకు జీవునికి స్వతంత్రత ఇచ్చెను.
 • అనుష్టానము లేనిచో శాస్త్రము అర్థరహితమగును.
 • అందుచేత జీవుడైన ఆత్మ భగవానునిచే నియంత్రించబడి, ఉద్ధరించబడుతుంది. జీవుని కర్తవ్యము భగవద్దాస్యము చేయుటయే.
 • కర్మలను ఎలా చేయవలెనో, ఏది విసర్జనీయమో తెలిపేది శాస్త్రము. కర్మ స్వాతంత్య్రము కలిగిన జీవుడు శాస్త్రాన్ని అధ్యయనము చేసి, అనుష్టించి శాస్త్రానుసారముగా జీవించవలెను.
 • జీవుడు కర్మలు ఆచరించునపుడు భగవంతుడు మూడు రూపములలో ఉండును, అవి
  • సాక్షి : జీవుడు ఆచరించు కర్మలను గమనిస్తూ పరోక్షముగానుండును.
  • అంగీకర్త: జీవుడు కర్మలను తాను అనుకున్న విధమున ఆచరించుటకు అంగీకరించును.
  • ప్రేరేపించువాడు: జీవుడు ఆచరించు కర్మలనుంచి పుట్టే మరిన్ని కర్మలను జీవుని చేత ఆచరింపజేయువాడు.
 • భగవంతుడే జీవుని ఉద్ధరించువాడు. జీవుడు భగవానుని గూర్చి అవగాహన కోల్పోయినప్పుడు తాను అజ్ఞానావస్థలో ఉంటాడు. జీవునికి భగవానుని విషయములో తెలియవలసిన విషయములు:
  • జీవునికి భగవంతునికి సంబంధము ఎట్టిది?
  • భగవత్తత్వము ఎటువంటిది?
  • భగవంతుని కళ్యాణగుణములు ఏవి?
 • విశ్వాంతరాత్ముడైన భగవంతునికి జీవుడు దాసుడు.
 • అనగా, జీవుడు తన స్వార్థమును విడిచి ఎల్లవేళలా భగవంతుని సంతృప్తి పరుచుట కొరకు, భగవంతుని ఆనందింపచేయుట కొరకు నిస్వార్థముగా కర్మలు ఆచరించవలెను. జీవములేని అచిత్తులైన చందనము, పుష్పములు ఎలా అయితే సుగంథములతో మనలను ఆనందింపజేయునో అటులనే జీవుడు భగవానుని సంతోషపరుచుటకు సత్కర్మలు ఆచరించవలెను.
 • చివరగా భగవానుడు వేరు , జీవుడు వేరు అయిననూ భగవంతునికంటే ఇతరమైన ఉనికి జీవునికి లేదు.

ఆత్మలు మూడు రకములు :

 • జీవులు అనంతకోటి కలవు. వాటిని స్థూలముగా మూడు విధములుగా విభజించవచ్చును. అవి బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ
 • బద్ధాత్మ
  • ఇవి సంసారసాగరమందు బంధింపబడి అనాది కాలము నుంచి జనన మరణ చక్రములో తిరుగుచున్నవి.
  • తమ యొక్క నిజతత్వమును ఎరుగక సంసారము శాశ్వతమనుకునే జీవాత్మలు ఈ కోవకు చెందినవి.
  • పూర్తిగా అజ్ఞానభూయిష్టులై శరీరము, తానూ ఒకటే అనే భ్రమలో జీవించే ఆత్మలను బద్ధాత్మలుగా పరిగణించవచ్చు.
  • సంసారము అశాశ్వతము అని తెలిసినా తాము స్వతంత్రులమని భ్రమించి ఎటువంటి నియంత్రణలేక సంసారములో చరించే జీవాత్మలు కూడా ఒకరకమైన బద్ధాత్మలే.

 • ముక్తాత్మ
  • ముక్తాత్మలు ఒకకాలములో బద్ధాత్మలై సంసారమందుండి ముముక్షువులై మోక్షము కొరకు సాధన చేసి మోక్షము పొందినవి.
  • భక్తి, జ్ఞాన వైరాగ్యముల చేత సంసారశృంఖలాలనుంచి విముక్తి పొంది, భగవానుని యొక్క నిర్హేతుక కృప చేత మోక్షార్హత పొంది కైవల్యసామ్రాజ్యమును పొందినవి ముక్తాత్మలు.
  • ఇవి మోక్ష సాధన పరిపక్వమైనపుడు అర్చిరాది మార్గాన పయనించి విరజా నదిలో తీర్థమాడి దివ్య శరీరమును పొంది సారూప్య ముక్తిని పొందుతాయి.
  • శ్రీవైకుంఠము నందు నిత్యసూరులు మరియు ముక్తాత్మల చేత ఆహ్వానించబడి శ్రీపరమపదనాథుని సన్నిధానములో శాశ్వతానంద స్థితిలో పరమపదంలో పెరుమాళ్ళకు పల్లాండు పాడుతూ అనంత కాలము శ్రీకైంకర్యములో అన్వయింపబడతాయి.

 • నిత్యాత్మ
  • నిత్యాత్మలు సంసారగంథము ఎన్నడూ అంటనివారు.
  • వారు అహర్నిశలు క్షణక్షణము భగవానుని యందే నిమగ్నులై ఉండును. అది పరమపదమైనా సరే,సంసారమైనా సరే.
  • పరమపదములో నిత్యసూరులు భగవానుని ఆజ్ఞ చేత జీవోద్ధరణకు సంసారలోకమందు అవతరించెడి వారు నిత్యాత్మలు. సంసారమందు ఉండిననూ సంసార వాసనలు వారికి అంటవు.
  • అటులనే పరమపదములో స్వామికి నిత్య కైంకర్యము అన్వయించెడి నిత్యసూరులు ఈ నిత్యాత్మల కోవకు వస్తారు. వారు అనంత, గరుడ విశ్వక్సేనాదులు.
  • పరమపదనాథుడు ఎల్లప్పుడూ నిత్యాత్మలైన నిత్యసూరులచేత కైంకర్యములను స్వీకరించుచుండును.

 •   అనంత కోటి జీవాత్మలు – వాటి గుణములు
  • చల్లటినీరు పాత్రలో వేసి నిప్పుపై పెడితే వేడిపడినట్లు భగవద్దాసులైన జీవాత్మలు సంసారవాసన తగలగానే అజ్ఞానమును, కర్మలు వాటి ఫలితాలకు బద్ధులవుతారు. ఇది బద్ధాత్మల లక్షణము.
  • విషయప్రావణ్యము తరుగుతున్నకొద్దీ అజ్ఞానము పోవనారంభిస్తుంది.
  • అనంతకోటి జీవాత్మలు మూడు రకములు – అవి బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ – ఇవి ఒక్కొక్కటి అనంత కోటి
  • శాస్త్రమును సరిగా అర్థం చేసుకోనివారు అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని భ్రమిస్తారు (అద్వైతము కూడా దీన్ని ఒప్పుకోదు). కానీ అది శాస్త్ర విరుద్ధము, తర్కదూరము.
  • అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయితే ఒకరు సంతోషముగానుంటే మరొకరు బాధగా ఉండకూడదు. అంతే తర్కము. కనుక ఒక శరీరాన్ని ధరించిన జీవాత్మ ఆ శరీరానికే బద్ధమైయుండును.
  • శాస్త్రానుసారము, కొన్ని నిత్యాత్మలు, కొన్ని ముక్తాత్మలు మరికొన్ని జీవాత్మలు అనే వేర్పాటు ఉండుట చేత ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క జ్ఞానదశలో ఉండుట చేత కొన్ని ఆచార్యత్వము వహిస్తే కొన్ని శిష్యత్వము వహిస్తాయి.
  • మోక్షము పొందిన ముక్తాత్మలు కూడా అనంతకోటి ఉంటాయి.
  • మోక్షమందు కూడా అన్ని ముక్తాత్మలు ఒకే జ్ఞాన స్థితిలో ఉంటాయా అంటే అవును అని చెప్పడం  కుదరదు. ఒకే పరిమాణములో, ఒక కుమ్మరి చేత చేయబడి ఒకే ఆకారములో ఉన్న కుండలు కూడా ఒకదానితో మరొకటి వేరుగా ఉంటాయి. ఆ సామ్యాన్ని ఇక్కడ ఉపయోగించుకొని కొన్ని ముక్తాత్మలు భగవంతుని దర్బారులో  భగవద్గుణానుభవము చేస్తుంటే కొన్ని ముక్తాత్మలు పెరుమాళ్ళ ఆజ్ఞ చేత మరల సంసారములో జన్మిస్తూ జనోద్ధరణ చేస్తుంటాయి. ఒకే స్థితిలో కూడా వేరుపాటు గమనించవచ్చు.
  • కనుక సంసారలోకమందు, పరమపదమందు కూడా అనంతకోటి జీవాత్మలు కలవని మనం గమనించవచ్చు.
ధర్మి జ్ఞానం – ధర్మభూత జ్ఞానం

ఇక జ్ఞానము యొక్క విధములను తెలుసుకుందాము ! జ్ఞానము రెండు రకములుధర్మి జ్ఞానము – ధర్మము పట్ల ఎరుక

ధర్మ భూత జ్ఞానము – ధర్మమును గూర్చి తెలుసుకొనుట వలన లభించిన జ్ఞానము

ఆత్మ తత్వము (బద్ధ, ముక్త, నిత్య అను వైవిధ్యముతో సంబంధము లేక ) యొక్క నిజ రూపములో రెండు గుణములు కలిగియుండును! అవి,

శేషత్వము : భగవంతునికి శేషునిగా అనగా సేవకుని వలె ఉండుట

జ్ఞాతృత్వము: భగవద్గుణానుభవ ప్రభావిత జ్ఞానము కలిగియుండుట

 • రెండు గుణములు ఆత్మకు అత్యావశ్యక లక్షణములు
 • ఆత్మ జ్ఞానియై ఉండుట చేత అచిత్తు నుంచి వేరగుచుండును
 • భగవంతునికి శేషుడై ఉండుట చేత భగవానుని నుంచి వేరగుచుండును
 • ధర్మి జ్ఞాన ప్రభావము చేత ఆత్మ స్వాభావిక జ్ఞాన స్వరూపమై ఉండిననూ ధర్మభూత జ్ఞానమును ఆవశ్యక విశేషముగా పొందవలెను
 • అంటే, ధర్మి జ్ఞానము ఆత్మ యొక్క అనంతమైన, నాశనము లేనట్టి, ఎటువంటి మార్పు లేనట్టి అస్తిత్వ గుణమును సూచిస్తుంది
 • ధర్మభూత జ్ఞానము ప్రకృతిని, బాహ్య ప్రపంచమును గమనించుట చేత ఆత్మకు అలవడును. అది ఆత్మ యొక్క బుద్ధి పరిపక్వ స్థితిని బట్టి మారుతూ ఉండును
 • నిత్యాత్మలకు ధర్మభూత జ్ఞానము అనంతమై పూర్తి జ్ఞానభూత స్థితి కలిగియుండును
 • ముక్తాత్మలకు  ఒకప్పడు పరిమిత స్థితిలో యుండి, ముక్తి పొందిన పిమ్మట పూర్తి వ్యాకోచమై నిత్యులవలె అనంతమై ఉండును
 • ప్రకృతిపై ఆధారపడి జీవించే బద్ధాత్మలకు చాలా పరిమితముగా ధర్మభూత జ్ఞానము ఉండును
 • నిజమైన జ్ఞానము సత్యమై శాశ్వతమై అనంతమై ఉన్ననూ, సత్త్వరజస్తమో గుణములవలన జ్ఞానము గ్రహించు ఇంద్రియముల యొక్క పరిమితుల చేత జ్ఞానము పరిమితముగా ఆత్మకు అందును.
 • ఎందుకనగా ఇంద్రియములు సత్త్వరజస్తమో గుణములవలన అన్ని వేళలా జ్ఞానగ్రహణకు సిద్ధముగా ఉండవు. కనుక, ధర్మభూత జ్ఞానము కొన్నిసార్లు పెరగవచ్చు, కొన్నిసార్లు తరగవచ్చు.

ముగింపు :

 • పరిపూర్ణ జ్ఞానస్థితి పొందు ఆత్మ యొక్క గుణములను గూర్చి చెప్పుట జరిగినది
 • భౌతిక శరీరమును హింసించెడి వస్తువుల (విషం, శస్త్రములు) వలన దుఃఖము ఏర్పడుచున్నది .
  • ఎందుకనగా, ఆత్మ, శరీరము ఒకటే అన్న భ్రాంతి కలుగుట చేత.
  • దానికి కారణము మనము చేయు కర్మలు ఆత్మను శరీరమునకు కట్టివేసి శరీరాత్మ  భ్రాంతి కలుగుచేయుచున్నవి.
  • మనకు పాంచభౌతికమైన ప్రకృతి గూర్చి పూర్తి అవగాహన లేకపోవుట చేత శస్త్రములు, రోగములు అంటే భయము కలుగుతున్నది. నిజానికి విశ్వవ్యాపకుడగు పరమాత్మ అన్ని పదార్థములయందు కలడన్న జ్ఞానము పొందిన రోజు శరీరము ఆత్మ వేరనే ఎరుక కలిగి అన్ని భయములు పటాపంచలు అయిపోతాయి. ప్రహ్లాదునికి తనను చంపటానికి సిద్ధం చేసిన విషమో, కౄర మృగములో, మారణాస్త్రములో తనను ఏమీ చేయలేకపోవుటకు కారణము ఇదియే. “ఇందుగలడందు లేడను…. ” చందమున ప్రహ్లాదుడు అన్నిటియందు ఆ హరిని దర్శించగలిగెను.
 • భయము కేవలం మన అజ్ఞానము (పరమాత్మ విశ్వవ్యాపకుడను సత్యమును నమ్మకపోవుట చేత) వలన కలుగుచున్నది
 • కేవలం పరమాత్మ తప్ప మరే వస్తువు ఆత్మకు పడదు. ఒకరికి ఈనాడు ఇష్టమైన వస్తువు రేపు ఇష్టము లేకపోవచ్చును. నేడు హితమైనది రేపు వర్జనీయమగును. కానీ పరమాత్మ మాత్రమే ఆత్మకు శాశ్వతముగా ఉపాయమగు వస్తువు. అందులో సందేహము అవసరము లేదు.
 • ప్రకృతిలోని ప్రతి మార్పుని (శారీరిక మార్పులు సైతం) పరమాత్మకు అనుసంధానము చేసి చూస్తే మనస్సులో మార్పు జరగదు. ఒక నిశ్చలమైన భావన ఏర్పడుతుంది. తద్వారా అశాశ్వతమైనవాటిపై మమకారము తగ్గి శాశ్వతమైన మోక్షము కొరకు మనసు తపిస్తుంది.

చిత్ ప్రకరణము ఇంతటితో ముగిసినది. ఈ అద్వితీయమగు మోక్ష శాస్త్రము ఒక ఆచార్యుని సముఖమున నేర్చినచో మరింత గొప్పగా అవగతపడుతుంది.

శ్రీమతే రమ్యజామాతృ మునీన్ద్రాయ మహాత్మనే |

శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళమ్ ||

మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై: |

సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్ ||

ఇక తర్వాతి అధ్యాయములో అచిత్తు యొక్క తత్వమును తెలుసుకుందాము

మూలము: http://ponnadi.blogspot.in/2013/03/thathva-thrayam-chith-who-am-i5631.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

తత్త్వత్రయం – శ్రీ పిళ్ళైలోకాచార్యులు అనుగ్రహించిన తత్వ త్రయము గ్రంథ పరిచయము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

మనము ఇంతవరకు అయిప్పసి (తులా మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము. మరిన్ని వివరముల కొరకు https://srivaishnavagranthamstelugu.wordpress.com/thathva-thrayam/ లింక్ చూడవచ్చును. ఇప్పుడు మనము పరమ కారుణికులు,దివ్య వైభవము కలిగిన శ్రీపిళ్ళైలోకాచార్యుల గురించి మరియు వారు రచించిన చిన్న శ్రీభాష్యమైన “తత్వత్రయము” గ్రంథము, దానికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానావతారికను తెలుసుకుందాము.

ఎమ్బెరుమానార్, శ్రీపిళ్ళైలోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు -తిరుప్పవళ వణ్ణం దివ్య దేశం
“తత్వత్రయము” అను ఈ గ్రంథము “చిన్న శ్రీభాష్యము” గా మన సంప్రదాయములో ప్రసిద్ధి గాంచినది. శ్రీభాష్యకార బిరుదాంకితులైన భగవద్రామానుజులు బ్రహ్మ సూత్రములకు అద్భుతమైన, సరళమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానమే “శ్రీభాష్యము” గా సుప్రసిద్ధమైనది. విశిష్టాద్వైత సిద్ధాంతమునకు అవసరమైన అన్ని ప్రధాన ప్రమాణములు ఇందులో ఇమిడియున్నవి. అయితే శ్రీభాష్యము సంస్కృతములో ఉండుట చేత సంస్కృత భాషాప్రవేశము లేనివారికి శ్రీభాష్యమునందలి విషయములు తెలుసుకొనుటకు కష్టసాధ్యముగానుండెను. శ్రీపిళ్ళైలోకాచార్యులవారు శ్రీభాష్యము యొక్క సారమును “తత్వ త్రయము” అను గ్రంథములో పొందుపరిచి ద్రావిడ భాషలో సామాన్యులకు సైతం సులభముగా అర్థమగు రీతిలో రచించారు. ఈ గ్రంథములో వేదాంతమునందలి ప్రాథమిక విషయములైన చిత్తు, అచిత్తు, మరియు ఈశ్వరుడు అను మూడు విషయములగూర్చి విశదీకరించుట జరిగినది. తత్వత్రయం గ్రంథము యొక్క సారాంశము ఈ లింకులో చదువుకొనవచ్చును.

ఇక స్వామి మణవాళ మహామునులు ఈ గ్రంథమునకు అనుగ్రహించిన ఉపోద్ఘాతమును చూద్దాము

“అనాది మాయయా సుప్తః”అనునట్లు, అనంతకోటి సంవత్సరాలుగా ఎడతెగని ఈ కాలచక్రములో జీవుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి సంబంధము చేత కర్మలు ఆచరించుచూ వాటి వల్ల సంక్రమించే పుణ్య పాపముల ఫలితముగా జననమరణ చక్రములో పడి అలమటిస్తున్నాడు. అజ్ఞానమనెడి అంధకారంలో చిక్కుకున్న జీవుడు తాను వేరు ప్రక్రుతి వేరు అన్న సత్యమును (తెలిసినచో కేవలము భగవత్కళ్యాణ గుణములనే స్మరిస్తూ భగవంతుని అనుభవిస్తూ ఈ ప్రకృతిని విస్మరించెడివాడు) మరచి తానూ ప్రకృతిలో ఒకనిగా భావించి ఈ ప్రకృతినే అనుభవిస్తూ కాలము గడుపుతున్నాడు. అటువంటి అజ్ఞానముతో జీవుడు
 • “దేహోZహమ్, మనుష్యోహమ్”, నేను దేహిని, మనుష్యుడును – అనే మాయలో దేహము తానూ ఒకరే అని భ్రమపడుతున్నాడు.
 • “ఈశ్వరోZహమ్ అహం భోగి”, నేనే ఈశ్వరుడను, స్వతంత్రుడను – తానూ శరీరమూ వేరన్న భావము జీవునికి కలిగిననూ, తానే భగవంతుడనని భావించి, తాను స్వతంత్రుడనని భ్రమిస్తున్నాడు.
 • తాను పరతంత్రుడనని భావించిననూ, భగవంతుని సేవకుడైన జీవుడు, తగు భగవత్కైంకర్యములను చేయక ప్రాపంచిక భోగములలో మునిగి తేలుచున్నాడు.

“యోzన్యథా సంతమానం అన్యథా ప్రతిపద్యతే, కిమ్ తేన న కృతం పాపమ్ చోరేణాత్మాపహారినా”, జీవుడు తన యొక్క స్వరూపజ్ఞానమును (తాను భగవంతుని దాసుడనన్న సత్యమును) విస్మరించి ప్రాపంచిక కార్యకలాపములందు నిమగ్నుడగుట ఆత్మచౌర్యమే అవుతుంది. తనది కాని వస్తువైన ఆత్మను తనదిగా భావించి తనది కాని శరీరమునకు ఆత్మను ఆపాదించి అశాశ్వతమైన, కర్మప్రదమైన ప్రాపంచిక సుఖములనుభవించుట పాపములలోకెల్లా మహా పాపమైనదని దీని భావము.

“విచిత్ర దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుతా”, అని చెప్పినట్లు పూర్వము ప్రళయ సముద్రమునందు విశ్వము గాఢాంధకారమైయుండి, సృష్టి చేయునపుడు, సర్వేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృప చేత అప్పటివరకు అస్థిత్వము లేని జీవునికి శరీరమును, ఇంద్రియములను ఇచ్చి వాటి ద్వారా తనకు దాస్యము చేసి తరించి చివరికి తన శ్రీచరణాలను చేరమని  ఆశీర్వదించెను.

శ్రీనమ్మాళ్వారులుశ్రీరంగనాథుని యందు జీవులను అనుక్షణం ప్రేమతో అనుగ్రహించెడి  “వ్యూహ సౌహార్ద్రత” అను కళ్యాణగుణమును బాగుగా అనుభవించియున్నారు.
తిరువాయిమొళి, 3.2.1 లో, “అన్నాళ్ నీ తంద అక్కైయిన్ వాళి ఉళల్వేన్” అని  చెప్పినట్టుగా, జీవుడు భగవదనుగ్రహము చేత పొందిన శరీరేంద్రియములను దుర్వినియోగపరుచుచూ భౌతికసుఖలోలుడై కాలము గడుపుచున్నాడు. నది దాటుటకు పడవను పొంది నది దాటకపోగా, ఆ పడవలో సముద్రములోనికి పోయి అలలాడినట్లు, ఈ జీవుడు పాంచభౌతిక శరీరమును తానేయని భ్రమించి స్వార్థపూరిత కర్మలు ఆచరించుచూ సంసారసాగరములో కొట్టుమిట్టాడుచున్నాడు. చేసిన కర్మల ఫలితముగా మరల మరల జన్మించుచూ తాపత్రయగ్రస్థుడై గర్భస్థ, జన్మ, కౌమార, యవ్వన, మరణ అనెడి దశలను గడిపి చేసిన పాప కర్మల ఫలితముగా నరకముననుభవించి, పుణ్య కర్మల ఫలితముగా ఉత్తమ జన్మలెత్తుతూ అలా పడుతూ లేస్తూ ఈ జననమరణ చక్రములో తిరుగుచున్నాడు. “ఏవం సంస్మృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే కృపా కాపి ఉపజాయతే “, అనునట్లు భగవానుడైన శ్రీమహావిష్ణువు జీవులపట్ల తనకుగల నిర్హేతుక కృప చేత జీవులను సంసారసాగరము నుంచి ఉద్ధరించుటకు అనేక అవతారాల ఎత్తి ధర్మ రక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. “జాయమానమ్ యమ్ పశ్యేన్ మధుసూదనః సాత్విక స్సతు విజ్ఞేయః సవై మోక్షార్థ చిన్తకః”, జీవుడు తల్లి గర్భములో జనించునపుడు తాను ఎటుల తరించవలెనో తెలుసుకుని సత్యమైన జ్ఞానమును పొంది సాత్వికుడై విష్ణువును ఆశ్రయించి మెలిగినపుడే ముముక్షుత్వము సాధించినవాడు అవుతాడు.   

సత్యమైన నిజ జ్ఞానము పొందేందుకు రెండు దారులు కలవు : 1) శాస్త్రము 2) ఉపదేశము (ఆచార్యోపదేశముగా పొందేది )

శాస్త్రాధ్యయనము వలన కొన్ని ఇబ్బందులు కలవు,
 • “శాస్త్ర జ్ఞానం బహు క్లేశం “, అనునట్లు శాస్త్రాధ్యయనము బహు క్లిష్టతరమైనది. అందు విషయము అంత సులభముగా అవగతపడదు. పదములకు గల నానార్థముల వలన శాస్త్ర వాక్యాలకు వివిధములైన అర్థములు స్ఫురించి ఏ అర్థమును అన్వయించుకొనవలెనో తెలియక చివరికి అజ్ఞానావస్థలోనే మిగిలిపోయే ప్రమాదం కలదు.
 • ఒకవేళ అంత శ్రమను ఓర్చి శాస్త్రజ్ఞానము సొంతముగా పొందగోరిననేమి, “అనంత భారమ్ బహు వేదితవ్యం అల్పచ్చ కాలో బహవశ్చ విఘ్నా:”, అనునట్లు జీవుడు తనకు గల పరిమిత జీవిత కాలములో మరియు, పరిమితమైన బుద్ధి చేత అనంత సాగరమైన శాస్త్రమును తెలియగోరుట అసాధ్యమే అవుతుంది.
 • చివరగా జీవులలో ఆడవారు, శూద్రులు శాస్త్రాధ్యయనమునకు నిషిద్ధులు. అయితే ముముక్షుత్వమునకు వారు అర్హులు.

అయితే శాస్త్రాధ్యయనము చేసిన పెద్దలైన ఆచార్యులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్రజ్ఞానమును ఉపదేశముగా పొందవచ్చును. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. శాస్త్రజ్ఞులైన గురువులు అపారమైన శాస్త్రజ్ఞానమును అవపోశన పెట్టినవారు గనుక శిష్యుని యొక్క బుద్ధి పరిమితులను బట్టి శిష్యుడు సుకరముగా తరించుటకు ఎంత జ్ఞానము అవసరమో అంతే ఉపదేశిస్తారు. ఏ భాషలో (అంటే అత్యంత క్లిష్టమైన భాషలో శాస్త్రమున్ననూ దానిని సంస్కరించి శిష్యునికి అర్థమగునట్లు లలితముగా చిన్న చిన్న పదాలతో ఆళ్వార్లు రచించిన పాశురముల వలె గురువు శాస్త్రార్థములను శిష్యునికి ఉపదేశిస్తాడు.) చెబితే శిష్యునికి అర్థమవుతుందో ఆ భాషలో గురువు ఉపదేశిస్తాడు.

అందువలన పరమ కారుణికులైన శ్రీపిళ్ళైలోకాచార్యులు వేదాంత శాస్త్రమును ఆసాంతం అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులైననూ జీవుల పట్ల గల నిర్హేతుక కృప చేత అందరికీ అర్థమగునట్లు లలితమైన భాషలో వేదాంతమునకు మూల వస్తువులైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి ఈ తత్వ త్రయమను గ్రంథమును రచించియున్నారు.
పూర్వాచార్యులైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళై వంటివారు కూడా క్లిష్టతరమైన వేదాంతశాస్త్రమును సులభరీతిలో జనులకు అర్థమగునట్లు తమ గ్రంథములు ద్రావిడభాషలో రచించుటకు కారణం జీవులపట్ల తమకు గల నిర్హేతుక కృప మాత్రమే. ఎందుకంటే మన పూర్వాచార్యులు
 • అహంకార రహితులు
 • జీవుల పట్ల ఎల్లప్పుడూ అక్కర కలిగినవారు
 • ఎప్పుడూ తమ స్వార్ధము, గొప్పతనము చూసుకోనివారు

మరి ఇందరు ఆచార్యులు ఒకే విషయముపై ఇన్ని గ్రంథములు రచించుట ఎందులకు? ఒకరు రచించిన గ్రంథమునే మిగిలిన వారందరునూ ఒప్పుకొని అన్వయించవచ్చును కదా? దీనికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వివరణ చూద్దాము:

 • ఆళ్వార్లు ఏకకంఠులు (అంటే శరీరములు వేరువేరైననూ పాడిన పాశురములు ఒక్కటే), ఒకే విషయమగు భగవద్గుణానుభవము గురించి పన్నెండుగురు ఆళ్వార్లు ప్రతిపాదించుట చేత శరణాగతి సిద్ధాంతము మరింత స్థిరీకరించబడినది. ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధమందలి మూల వస్తువు శరణాగతి తత్వమే కదా.  అదే విధముగా పూర్వాచార్యులు కూడా ఏకకంఠులు అగుట చేత దుష్కరమైన వేదాంత తత్వమును వివిధ గ్రంథముల ద్వారా ఒకే విషయమును ఒకే విధముగా ఒక గ్రంథమునకు ఇంకొక గ్రంథము భావ వ్యత్యాసము లేకుండా అంగీకృతముగా నుండు విధమున అనుగ్రహించారు. అందుచేత సిద్ధాంత ప్రమాణములుగా ఈ గ్రంథములు విలసిల్లుచున్నవి.
 •  ఒక గ్రంథమున క్లుప్తముగా వివరించిన విషయము మరొక గ్రంథములో విస్తారముగా చెప్పియుండును. ఇందువలన ఒకదానికి మరొకటి సామరస్యముగానుండును.

ఇదే సూత్రము ఒకే ఆచార్యుడు రచించిన అనేక గ్రంథములకూ వర్తించును. ఒక గ్రంథమందు ప్రతిపాదించిన విషయములను మరొక గ్రంథము ఆదరించుచూ సమన్వయముగలవైయుండును.

శ్రీపిళ్ళైలోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు – శ్రీపెరుంబుదూరు

 

ఈ విధముగా పరమాద్భుతమైన తత్వత్రయ గ్రంథము యొక్క పరిచయము చెప్పబడినది. విశిష్టాద్వైత సిద్ధాంతమందలి క్లిష్టమైన వేదాంత సూత్రములు ఈ గ్రంథములో అత్యంత సులభతరంగా వివరించబడినవి. స్వామి మాణవాళ మహామునుల యొక్క వ్యాఖ్యానము ఈ గ్రంథమునకు మరింత వన్నె తెచ్చినది. ఈ గ్రంథము నిజానికి ఒక ఆచార్యుని ఆశ్రయించి వారి ముఖేన వినదగిన శాస్త్రము. ఆ అవకాశము లేని వారికి ఈ అనువాదం ఒక సుగమవారధిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. పరమకృపాపూర్ణులైన మన పూర్వాచార్యుల దివ్య శ్రీచరణాలను మనసా స్మరించి ఈ గ్రంథములోని మరిన్ని విషయాలను వచ్చే అధ్యాయాలలో తెలుసుకుందామ్!

మూలము : http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – సూచికలు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< దినచర్య – ప్రధానాంశాలు

వివిధ రకములైన ప్రమాణసూచికలు వివిధ భాషలలో ఉన్నవి అవసరమైన విషయం  సులభగ్రాహ్యమునకు ఇక్కడ విషయాసూచికలను ఇవ్వడం  జరిగింది.

సాధారణ అనుసంధానములు (links)

 • http://koyil.org/index.php/portal/ – శ్రీవైష్ణవ వెబ్ సైట్ ప్రవేశ ద్వారం (portal)
 • http://acharyas.koyil.org–గురుపరంపర పోర్టల్ – అనుసంధానం(links) –ఆళ్వారుల,ఆచార్యుల జీవిత చరితం ఆంగ్లభాషతో కలుపుకొని వివిధ భారతీయ భాషలలో(తెలుగు, హింది, కన్నడం, మలయాళం మరియు తమిళం)లభించును
 • http://divyaprabandham.koyil.org-దివ్యప్రబంధం పోర్టల్ – వివిధభాషల్లో భాషాంతరీకరణం
 • http://pillai.koyil.org/– శ్రీవైష్ణవ పరిఙ్ఞానం/బాలకుల పోర్టల్
 • http://githa.koyil.org– భగవద్గీత మరియు సంబంధిత వ్యాసములు
 • http://srivaishNavagranthams.wordpress.com– సంప్రదాయ వ్యాసములు వివిధ భాషల్లో (ఆంగ్లం, తెలుగు,హింది,కన్నడం,మలయాళం మరియు తమిళం)
 • http://ponnadi.blogspot.in, https://srivaishnavagranthamstelugu.wordpress.com/ – సంప్రదాయముపై పలు వ్యాసములు ఆంగ్లభాషయందు

 ప్రత్యేక అనుసంధానములు

ప్రత్యే విషయములు

ఆచరణాత్మక మార్గదర్శకత్వం

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |                                                                                           శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్య మంగళమ్||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-references.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org