Author Archives: shashinalla77

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – సూచికలు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< దినచర్య – ప్రధానాంశాలు

వివిధ రకములైన ప్రమాణసూచికలు వివిధ భాషలలో ఉన్నవి అవసరమైన విషయం  సులభగ్రాహ్యమునకు ఇక్కడ విషయాసూచికలను ఇవ్వడం  జరిగింది.

సాధారణ అనుసంధానములు (links)

 • http://koyil.org/index.php/portal/ – శ్రీవైష్ణవ వెబ్ సైట్ ప్రవేశ ద్వారం (portal)
 • http://acharyas.koyil.org–గురుపరంపర పోర్టల్ – అనుసంధానం(links) –ఆళ్వారుల,ఆచార్యుల జీవిత చరితం ఆంగ్లభాషతో కలుపుకొని వివిధ భారతీయ భాషలలో(తెలుగు, హింది, కన్నడం, మలయాళం మరియు తమిళం)లభించును
 • http://divyaprabandham.koyil.org-దివ్యప్రబంధం పోర్టల్ – వివిధభాషల్లో భాషాంతరీకరణం
 • http://pillai.koyil.org/– శ్రీవైష్ణవ పరిఙ్ఞానం/బాలకుల పోర్టల్
 • http://githa.koyil.org– భగవద్గీత మరియు సంబంధిత వ్యాసములు
 • http://srivaishNavagranthams.wordpress.com– సంప్రదాయ వ్యాసములు వివిధ భాషల్లో (ఆంగ్లం, తెలుగు,హింది,కన్నడం,మలయాళం మరియు తమిళం)
 • http://ponnadi.blogspot.in, https://srivaishnavagranthamstelugu.wordpress.com/ – సంప్రదాయముపై పలు వ్యాసములు ఆంగ్లభాషయందు

 ప్రత్యేక అనుసంధానములు

ప్రత్యే విషయములు

ఆచరణాత్మక మార్గదర్శకత్వం

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |                                                                                           శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్య మంగళమ్||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-references.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

Advertisements

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దినచర్య – ప్రధానాంశాలు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< అపచారముల నిర్మూలన

శ్రీవైష్ణవుల దినచర్యలో ఈ క్రింది అంశములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి మరియు చాలా ప్రయోజనకరమైనవి.

 

 1. వర్ణ-ఆశ్రమ-ఙ్ఞాన భేధం చూడకుండ శ్రీవైష్ణవులను గౌరవించాలి. భగవంతుడు తాను మొదటగా ఆకాంక్షించేది    భాగవతులను(భక్తులను) గౌరవించడం.
 2. అహం మరియు స్వార్థచింతనారహిత జీవితాన్ని గడపాలి. ఆత్మస్వరూపం మరియు భగవానుని వైభవం తెలిసినప్పుడు మనం మన స్వార్థచింతనను మానివేస్తాము.
 3. క్రమం తప్పకుండ ఆచార్యున్ని దర్శించడం శిష్యుని ప్రధానలక్షణం. ఆచార్యుని   భౌతికజీవనం    గడపడానికి అవసరమైన వస్తువులను మరియు ఆర్ధికావసరాలను ఏర్పాటుచేయడం శిష్యుని విధి.
 4. .నిత్యకర్మానుష్ఠానములైన స్నాన-ఊర్ధ్వపుండ్రధారణ-సంధ్యావందనములను వారివారి     వర్ణాశ్రమధర్మాలనుబట్టి       ఆచరించాలి. ఈ ధర్మాలను ఆచరించువారు బాహ్యాంతరశుద్ధులను పొంది ఙ్ఞానసముపార్జనకు సంసిద్ధులవుతారు.
 5. సదా శ్రీచూర్ణతిరుమణ్లను ధరించాలి. ఇది భగవద్దాసులమని తెలుపు ప్రాథమికస్వరూపం. కావున ఈ స్వరూపమును నిత్యము నిర్భయముగా మరియు లజ్జారహితముగా ధరించాలి.
 6. వర్ణ-ఆశ్రమ-లింగధర్మములను అనుకరిస్తు సాంప్రదాయ వస్త్రములను ధరించాలి. మగవారైతే పంచకజ్జమును(గోచి పెట్టిన ధోవతి) ఆడవారయితే మడిసార్(గోచి పెట్టిన చీరకట్టు)ను ధరించాలి. దీనికి సిగ్గుపడనవసరం లేదు. మన సాంప్రదాయ పరంపరావైశిష్ఠ్యమును మనం గ్రహించాలి.
 7. ఆళ్వారులందరు శ్రీమన్నారాయణున్ని సదా సేవించడంలో నిమగ్నులై ఉంటారు. ఆళ్వార్లు మరియు మన పూర్వాచార్యులందరు దేవతాంతర (రుద్ర, ఇంద్ర, వరుణ, అగ్ని మరియు నవగ్రహములు మొదలైనవారు) ఆరాధనను నిరసించారు. మన పూర్వాచార్యులు ఈ విషయానికి అధికప్రాధాన్యతను ఇచ్చారు. భగవానునికి మరియు ఈ జీవాత్మకు మధ్యన ఉండు నవవిధ సంబంధములలో భర్తృభార్యాసంబంధం విశేషమైనది. ప్రాయశముగా అన్ని జీవాత్మలు స్త్రీప్రాయములే. భగవానుడు మాత్రమే పరమపురుషుడు. కావున ఈ సంబంధం భగవానుని యందు  విశ్వాస్యతను మనయందు ఏర్పరుస్తుంది. ఇది మిగితా దేవతాంతరములతో సంబంధం నెరపుటను నిరోధిస్తుంది.
 8. శ్రీవైష్ణవుని నిత్యవిధులలో గృహతిరువారాధన చాలా ప్రధానమైనది. మన గృహములందు తనను ఆరాధించుకోవడానికి భగవానుడు పరమకృపతో అర్చారూపమున దిగివచ్చాడు. దీనిని విస్మరించుట భగవానున్ని అవమానపరచడమే. భగవానుని మరచిపోవడం మన ఆధ్యాత్మికప్రగతిని నష్ఠపరచుకోవడమే. ప్రయాణంలో కూడ మన తిరువారాధన భగవానునిమోసుకపోవచ్చు. ఒకవేళ అది వీలుకాకపోతే ఇతర శ్రీవైష్ణవులు మన గృహమునకు వచ్చి ఆరాధనచేయుటను ఏర్పరచాలి అలాగే దానికి తగిన ఏర్పాటును కూడా చేయాలి లేదా ఇతర శ్రీవైష్ణవగృహములయందు ఉంచి వెళ్ళవచ్చు. ఆరాధన లేకుండ గృహమునకు తాళంవేసిఉంచడం భగవానుని అగౌరవపరచడమే. తిరువారాధన  వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు . http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html.
 9. వారి వారి వర్ణాశ్రమధర్మాలను ఆధారంగా శాస్త్రం ఏర్పరచిన ఆహారనియమములను పాటించాలి. మొదట ఆహారపదార్థాలను భగవానునికి , ఆళ్వారాచార్యులకు నివేదన చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. భగవానుని నివేదనకు నిషిద్ధమైన పదార్థములను సమర్పించరాదు. ఆహారనియమ వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-aahaara-niyamam_28.html and http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-ahara-niyamam-q-a.html.
 10. శ్రీవైష్ణవుల సాంగత్యమును ఆశించాలి. ఈ సాంగత్యం వలన  ఆధ్యాత్మికభావనాప్రవాహం వృద్ధిచెంది ఉజ్జీవనమునకు దారితీయును.
 11. మన జీవితంలో దివ్యదేశములు, ఆళ్వారుల మరియు ఆచార్యుల అవతారస్థలములు మరియు అభిమానస్థలముల దర్శనమునకు ప్రాధాన్యతనివ్వాలి. దివ్యదేశములయందు కైంకర్యమును చేయవలెను. ఒకవేళ ప్రస్తుతం కైంకర్యము చేయవీలుకాకపోతే కనీసం దివ్యదేశయాత్రనైన తరచుగా చేయాలి. భవిష్యత్తులోనైన ఈ కైంకర్యం చేయాలని ప్రయత్నించాలి.
 12. శ్రీవైష్ణవులకు దివ్యప్రబంధము చాలాముఖ్యమైన అంశం. పాశురములను అభ్యసించి, పూర్వాచార్యుల వ్యాఖ్యానముననుసరించి వాటి అర్థములను తెలుసుకొని అనుష్ఠానమున పెట్టవలెను. ఈ మూడు విషయములు శ్రీవైష్ణవత్వమును పెంపొందిస్తాయి. దివ్యప్రబంధఙ్ఞానం ప్రాపంచిక సుఖములయందు అశ్రద్ధను, భగవంతుని మరియు భాగవతులయందు శ్రద్ధను నిలుపుటకు తోడ్పడతాయి.
 13. పూర్వాచార్యుల జీవన అనుష్ఠానం మనకు ఙ్ఞానార్జనకు మరియు  ప్రేరణకు తోడ్పడతాయి. ఈ రోజు మనమందరం విషమ పరిస్థిలను/ సంధిగ్ధావస్థలను దాటి  నిలబడ్డామంటే అది పూర్వాచార్యులు తమ జీవన అనుష్ఠానములో ప్రదర్శించిన కరుణ మరియు  సౌలభ్యమే .
 14. పూర్వాచార్యుల సాహిత్యపఠనం చాలా విశేషం. ప్రతిఒక్కరు ప్రతిదినమునందు కొంత సమయమును ఈ లభిస్తున్న సాహిత్యనిధిని పఠించుటకు కేటాయించాలి. ఈ సాహిత్యం మనకు వేదాంతం,దివ్యప్రబంధం , స్తోత్రగ్రంథములు ,వ్యాఖ్యానములు మరియు చారిత్రాత్మక సంఘటనలు అనే రూపములో లభిస్తున్నాయి.  ఈ విషయపరిఙ్ఞానము ఈ వెబ్ సైట్ నందు లభించును http://koyil.org/index.php/portal/
 15. ఆవశ్యకమైన సూత్రములను విద్వాంసుల నుండి కాలక్షేపముగా శ్రవణం( మూలమును అనుసరించి చెప్పు వ్యాఖ్యాన ప్రవచనం)చేయడం చాలా అవసరం. ప్రస్తుత కాలములో చాలా ప్రవచనములు CD మరియు  websites నందు విరివిగా లభిస్తున్నాయి. ప్రవచనములను ప్రత్యక్షముగా  విననివారు ఈ లభిస్తున్న వాటిని ఉపయోగించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు సమయానుకూలతను  బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు.
 16. కైంకర్యమునందు సదా నిమగ్నమై ఉండాలి. “ కైంకర్యము చేయకుంటే శేషత్వం లోపించును” అనేది శాస్త్రవచనం. కావున శ్రీమన్నారాయణునియందు,ఆళ్వారాచార్యులయందు దాసత్వం ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమును విధిగా చెయ్యాలి. అది భౌతిక, మానసిక , ఙ్ఞానసంబంధిత కైంకర్యము కావచ్చును. ఇలా కైంకర్యమునందు చాలా విధములున్నవి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమునందు నిమగ్నమై ఉండాలి. ఇది భగవంతుని యందు భాగవతులయందు స్థిరమైన కైంకర్యబుద్ధిని ఉండేలా చేస్తుంది.
 17. భగవానుని యందు మరియు ఆళ్వారాచార్యులయందు కైంకర్యఙ్ఞానం ఉన్న భాగవతులకు మరియు ఇతరులకు సహాయం చెయ్యవలెను. ఇలాంటి స్థిరమైన(విచ్చిత్తిలేని కైంకర్యఙ్ఞానం)ఙ్ఞానం కలవారితో సంపర్కం వలన పరస్పరం  ప్రయోజనం ఉంటుంది, అనగా చెప్పేవారు వినేవారు ఇద్దరు గుణానుభవం చేస్తారు. ప్రతిఒక్కరు ఉజ్జీవించాలనే ఏకైక పరమప్రయోజనముగా  ఈ ఙ్ఞానమును మన పూర్వాచార్యులు పరంపరగా అందించారు. కావున  మనమందరం ఈ ఙ్ఞానమును సరైన మార్గదర్శకత్వములో జాగ్రత్తగా చదివి మన కుటుంబసభ్యులకు, బంధువులకు,మిత్రులకు మరియు అభిలాష ఉన్న వారందరికి అందించాలి. ఇదే మన  కర్తవ్యం.
 18. ఆత్మస్వరూపగుణమగు నిత్యానందమును పొందడానికి ప్రయత్నంచేయవలెను. నిజమైన శ్రీవైష్ణవుడు మృత్యువుకు భయపడడు, కారణం శ్రీవైకుంఠమునందు  భగవానుని  నిత్యకైంకర్యము చేయు భాగ్యంలభిస్తుంది దీనివల్లనే. మన ఆళ్వారులు మరియు ఆచార్యులందరు నిత్యవిభూతి యందు ఉన్నప్పుడు భగవద్భాగవత కైంకర్యమును చేసేవారు, ఆ తర్వాత పరమపదమునకు వెళ్ళినను భగవద్భాగవత కైంకర్యమునే ఆశించేవారు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-important-points.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అపచారములు – అపచారముల నిర్మూలన

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఐదు ముఖ్యమైన అంశములు

చాణ్డిలి – గరుడ సంఘటన(చాణ్డిలి అనే మహాభక్తురాలు ఒక పర్వతముపై నివసిస్తు భగవధ్యానం చేసుకొనేది. ఒక సమయమున గరుడాళ్వార్ ఆ పర్వతం మీదుగా వెళ్తూ  ఈవిడని చూసి ‘ఏమిటి ఈ తపస్విని దివ్యదేశములోకాని పవిత్రక్షేత్రములోకాని నివసిస్తు ధ్యానం చేసుకోవచ్చుగా అని తలచారు (భాగవతాపచారం) వెంటనే తన రెక్కలకు అగ్నిఅంటుకుంటుంది. అనగా భాగవతులు ఏ ప్రదేశములో నివసిస్తే అదే గొప్పక్షేత్రం- ఈ శ్రీసూక్తి శ్రీవచనభూషణంలోనిది )

ఈ వ్యాసమునందు వివిధ రకముల అపచారములు వాటిని శ్రీవైష్ణవులు తొలగించుకొనే విధానములను తెలుసుకుందాము.

శ్రీవైష్ణవులకు శాస్త్రం పరమప్రమాణం- అన్ని విధులను శాస్త్రమునే ఆధారంగా తీసుకొని చేస్తారు. శాస్త్రం అనగా మనం ఏది చేయాలో(విధి) ఏది చేయకూడదో(నిషిద్ధమో) తెలుపుతుంది. సాధారణంగా శాస్త్రం మనకు నిత్యకర్మలను మరియు నైమిత్తిక కర్మలను అనుష్ఠించాలని అలాగే ఆస్తేయం (దొంగతనం), ఇతరుల సంపదను ఆశించడం, హింస మొదలైనవి చేయకూడదని విధిస్తుంది. మన  పూర్వాచార్యులు శాస్త్రసారమును గ్రహించి మనకై అందించారు.

పిళ్ళైలోకాచార్యులు తమ శ్రీవచనభూషణ దివ్యశాస్త్రమున సూత్రం 300 నుండి 307 వరకు నాలుగు విషయముల యందు అశక్తులుగా (చేయకుండ) ఉండాలని సూచించారు.

 • అకృత్య కరణం- శాస్త్రనిషిద్ధమైన వాటిలో అనాసక్తిగా ఉండడం.
 • భగవదపచారం- భగవంతుని ఎడల అపచారపడడం.
 • భాగవతాపచారం- భాగవతులయందు(భక్తుల యందు)అపచారపడకుండా ఉండడం.
 • అసహ్యాపచారం- ఏ కారణం లేకుండానే భగవత్/భాగవతులందు అపచారపడడం.

వీటిని విపులంగా తెలుసుకుందాం:

అకృత్య కరణం:-శాస్త్రం మనకు వీటి నుండి దూరంగా ఉండమని నిర్ధేశిస్తుంది.

పరహింస: జీవహింస కూడదు. అనగా  వృక్షమునకు గాని చీమగాని  హాని కలిగించరాదని శాస్త్రవచనం.

పర స్త్రోత్రం: మనకు భగవానుడు కంఠం అనుగ్రహించినది తనని తన భక్తులని  కీర్తించడానికే కాని ఇతరులను కాదు.

పరదారపరిగ్రహణం: పరుల భార్యలను చెరపట్టరాదు/ ఏవిధంగానైనను  వారి యందు దుష్ఠఆలోచనలు  చేయకూడదు.

పరద్రవ్యాపహరణం: ఒకరు ఇచ్చే వరకు వారి సంపదను గాని ధనమును కాని ద్రవ్యమును కాని ఆశించరాదు.

అసత్య కథనం:  సత్యమునకు వ్యతిరేకముగా పలుకరాదు.

అభక్షభక్షణం: తినే ఆహారపదార్థములు 3రకముల దోషములను కలిగి ఉంటాయి. జాతిదుష్ఠములు, ఆశ్రయదుష్ఠములు మరియు నిమిత్తదుష్ఠములు. దీనికై ఆహారనియమాలు (http://ponnadi.blogspot.in/2012/07/SrIvaishNava-AhAra-niyamam_28.html అనే  వ్యాసమును చూడండి.

ఇంకా చాల నియమనిభంధనములు మనకు మనుస్మృతిలో లభిస్తాయి.

శ్రీవైష్ణవులు ప్రధానంగా సామన్యశాస్త్రవిధులను నిర్వర్తించి నిషేధవిధులను త్యజించాలి.

భగవదపచారం:‌ పిళ్ళైలోకాచార్యులు క్రమంగా నిషేధవిధులను తెలుపుతు భగవదపచారం గురించి విశేషంగా  తెలుపుతున్నారు. దీనికి ఆచార్యసార్వభౌములైన మణవాళమామునులు విశేషమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఈ క్రిందివి భగవదపచారములు.

 • దేవాంతరములతో(ఇతర దేవతలతో) శ్రీమన్నారాయణున్ని సమానముగా తలచరాదు. శ్రీవైష్ణవులు శ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడని ధృడముగా విశ్వసించాలి. ఎవరైతే సర్వేశ్వరుడైన(బ్రహ్మ, శివ, ఇంద్ర వరుణ అగ్ని మొదలైనవారికి కూడ), అంతర్యామో(లోపల ఉండి అన్నీ నడిపించేవాడో),శ్రీమన్నారాయణుడికి సమానులు లేదా వారిని మించిన వారు ఉండరు. ఈ విషయపరిఙ్ఞానంచేత దేవాంతరములకు దూరంగా ఉండాలి.
 • అవతారములను అనగా రామకృష్ణాది అవతారములను సామాన్య మానవులుగా తలచరాదు. భగవానుడు ఈ సాంసారికలోకం (భౌతికజగత్తు)లో పరమపదములో ఉన్నట్లు అన్ని కళ్యాణగుణములతో ప్రకాశిస్తాడని తెలుసుకోవాలి. స్త్రీగర్భమున జన్మించడం,  దినమున జన్మించడం, వనవాసక్లేశములను అనుభవించడం మొదలైనవి అతని లీలలు మాత్రమే కాని మనలాగా కర్మబంధములు కావు. ఈ సంసారక్లేశములు అనుభవిస్తున్న జీవాత్మల ఉద్ధరణకై తన ఇచ్ఛతో చేయునటువంటివి. కావున మనకై ఈ కష్ఠములను అనుభవిస్తున్నాడు, అంతమాత్రమున మనవలె మానవజన్మ అని తలచరాదు.

వర్ణాశ్రమ ధర్మములు:

ప్రతిఒక్కరు వర్ణాశ్రమధర్మములను విధిగా పాటించాలి. కారణం భగవానుడు ఇలా అన్నాడు  “ శ్రుతి స్మృతి మమ ఏవ ఆఙ్ఞా.. ఆఙ్ఞా చేధి మమ ద్రోహి , మత్ భక్తోపి  న వైష్ణవః” –  శ్రుతి స్మృతి రెండుకూడ నా ఆఙ్ఞలే  కావున వీటిని ప్రతిఒక్కరు విధిగా అనుసరించాలి, వీటిని పాటించని వారు నా భక్తులైనప్పటికి వారు నా ద్రోహులు, వీరు అవైష్ణవులుగా పరిగణింపబడతారు. ఈ ప్రత్యేక  సందర్భమును పురస్కరించుకొని మామునులు  శ్రీవైష్ణవులు  తిరువారాధన చేసేసమయమున వినియోగించు వైదికమంత్రాలను తెలిపారు, సన్యాసులు వక్కపొడిని సేవించుట వంటి శాస్త్రనిషిద్ధ విషయాలను కూడ తెలిపారు.

అర్చామూర్తి విలువను తెలుపుతు- అది ఏ లోహముతో తయారైనదని పరిశీలించడం- భగవానుడు భక్తుల సౌలభ్యార్థం మరియు ప్రీతికోసం మనం కోరినరూపాన్ని ధరిస్తాడు- మనం ఈ  అర్చావిగ్రహం  బంగారముతో తయారైనదని చాలా గొప్పదని- ఇది రాతితో తయారైనదని- ఇది కేవలం చిత్రమేనని భేదములు చూపుట భగవదపచారం. ఇలా మూర్తి యొక్క విలువను గణించడం మన మాతృమూర్తి పవిత్రతను గణించటం వంటిది అని శాస్త్రవచనం.

జీవుడు స్వత్రంతుడు  అని భావిస్తే- మన స్వాత్రంత్య బుద్దే అన్నీ పాపములకు మూలకారణం. శాస్త్రరీత్యా ఇది క్షమింపరాని దొంగతనం. కాని ఈ జీవుడు భగవంతునికి పరతంత్రుడు కావున భగవానుని ప్రకారమే నడుచుకోవాలి.

భగవానుని ద్రవ్యమును అపహరించుట- అతని భోగము(ఆహారపదార్థం), తిరువాభరణములను, వస్త్రములను   ,  అలాగే అతని స్థిరాస్తులైన స్థలం మొదలైన వాటిని అపహరించుట. నేడు ఇవి సర్వసాధారణమైనవి.

 • వీటిని అపహరించు వానికి సహాయపడడం కూడ అపచారమే. అపహరించిన వాని దగ్గరనుండి గ్రహించినా, అపహరించమని ప్రోత్సహించినా కూడ భగవదపచారమే. “ ఆ వస్తువులు మనం అడగడంలేదు, అయినా వాడు ఇస్తున్నాడు, స్వీకరించుటలో దోషమేమిలేదు కదా!” అని   అనుకొన్నా భగవదపచారమే.  ఇంకా చాలా భగవదపచారములను శాస్త్రం పేర్కొన్నది.

భాగవతాపచారం:

             ప్రాథమికంగా ఇతర శ్రీవైష్ణవులను తనతో సమానమనికాని వారికన్న తాను అధికుడనని  భావించడం భాగవతాపచారం. ఇతర శ్రీవైష్ణవులకన్న తాను అల్ఫుడనని భావించాలి. ఈ విషయమున శ్రీపిళ్ళైలోకాచార్యులు ఇలా అనుగ్రహిస్తున్నారు- మన శ్రీవైష్ణవత్వవృద్ధికి భాగవతాపచారం పరమవిరోధి.   శ్రీవచననభూషణం 190 నుండి 207 సూత్రం వరకు ఈ   భాగవతాపచారములను  పేర్కొన్నారు,  వాటి సారమును పరిశీలిద్దాం‌‌-

 • బాహ్యముగా శ్రీవైష్ణవవేషం ధరించి(వస్త్రధారణ , ఊర్ధ్వపుండ్రధారణ మొదలైనవి) భాగవతాపచారమున చేయుట. ఎలాగేతే చక్కగా మడతపెట్టిన ఒక వస్త్రం అగ్నికి ఆహుతి అయినప్పుడు బాహ్యంగా చూడడానికి అలాగే మడతపెట్టి ఉంటుంది. కాని గాలి వీచినప్పుడు చెల్లాచెదురవుతుంది.
 • వరాహ, నరసింహ, రామ మరియు కృష్ణ మొదలైన భగవతారములయందు హిరణ్యకశిపుడు, రావణుడు తన భక్తులయందు చేసిన అపచారములను చూసి భగవానుడు సహింపలేక పొయ్యాడు.  ఎందుకనగా ఈ సంసారమందు తన భక్తుల వేదనను సహింపలేని భగవానుడు  వివిధ అవతారములను ఎత్తాడు. భక్తులరక్షణార్థం తాను ఎత్తిన అవతారముల రహస్యమును భగవద్గీత 4వ అధ్యాయమున ఇలా చెప్పుకున్నాడు- “యధా యధాహి” “పరిత్రాణాయ సాధూనామ్”  “బహూని మే వ్యతీతాని”, “అజోపి సన్” మరియు “జన్మ కర్మచ మే దివ్యాని”. గీతాభాష్యమున భగవద్రామానుజాచార్యులు మరియు తాత్పర్యచంద్రిక లో వేదాంతాచార్యులు  ఈశ్లోకములను ఉదాహరిస్తు  తమ భాష్యమును రచించారు.

భాగవతాపచారములు:

 • జన్మచేతకాని, ఙ్ఞానంచేతకాని, వృత్తిచేతకాని,ఆహారపదార్థముల భక్షణచేతకాని, బంధువుల సంబంధముచేతకాని, జన్మించిన స్థలంచేతకాని, నివాసస్థలంచేతకాని  మొదలైన విషయముల ఆధారంగా  భక్తులను అవమానించడం/ వివక్షత చూపడం భాగవతాపచారం.
 • వీటన్నింటిలో జన్మనాధారంగా చేసుకొని అవమానించడం చాలా అపచారం. ఇది భగవానుని అర్చావిగ్రహం ఏ లోహంతో తయారుచేయబడిందో అని విలువకట్టడమంత దోషం. (మాతృమూర్తి యొక్క పవిత్రతను అవమానించడమంత దోషం)
 • మన పూర్వాచార్యులు శ్రీవైష్ణవులతో  వ్యవహరించేటప్పుడు, ప్రవర్తించు విషయమందు చాలా కఠినమైన ప్రమాణాలను పాటించేవారు. వారితో చాలా అప్రమత్తంగా/జాగరూకతతో మెలగాలి. ఉదాహరణకు  ఆచార్యులు కూడ తమ శిష్యులతో ఇలానే వ్యవహరించాలి. ఇలాంటి గౌరవాన్ని పాటించేవారు మన పూర్వాచార్యులు. కాని ఈ నాటి పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. శిష్యులెవరు తమ స్వాచార్యులకు కనీస మర్యాదనుకూడ ఇవ్వడంలేదు కదా , “అతను అంత ఙ్ఞాని కాదు” “కావున అతనికి ఎలా మర్యాదనివ్వడం” అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. కావున ప్రతిఒక్కరు తమ ఆచార్యులను విధిగా గౌరవించాలి ఇది భగవానుని గౌరవించడం తో సమానం.

భగవదపచార ఫలితములను ఇక్కడ చెప్పబడ్డాయి:

 • త్రిశంఖు ఇక్కడ ఉదాహరణంగా చెప్పబడుతున్నాడు- ఇతను తన ఆచార్యుడైన వశిష్ఠున్ని మరియు అతని కుమారులను ఈ పాంచభౌతికదేహంతో తనను స్వర్గమునకు పంపించాలని పట్టుబట్టాడు. కాని వారు దీనికి నిరాకరించి ఆగ్రహముతో అతనిని చండాలుడి(కుక్కమాంసం తినేవారు)గా మారమని శపించారు. అతనికి ఙ్ఞానమును అందించిన యఙ్ఞోపవీతమే చండాలుడు ధరించే పట్టీగా మారిపోయినది. ఇలా ఉన్నతస్థితిలో ఉండి శ్రీవైష్ణవులు తప్పుచేయుటకు ఉపక్రమిస్తే శాస్త్రప్రకారం చాలా తీవ్రమైన దండనను అనుభవించవలసి వస్తుంది. ఎలాగంటే దేశ ప్రధానమంత్రి అవినీతిలో భాగం పంచుకుంటే అతనిని నీచంగా చూస్తారు, అదే సామాన్య పౌరుడు చేస్తే అంతగా పట్టించుకోరు.
 • తొండరడిపొడి ఆళ్వార్ ఇలా అంటున్నారు,“త్తమర్గళిల్  తలైవరాయ శాది అందణర్గళేలుం”- ఒకడు శ్రేష్ఠమైన బ్రాహ్మణజాతిలో జన్మించి బ్రహ్మోపదేశం(గాయత్రిమంత్రోపదేశం) పొంది, వేదాభ్యాసం పూర్తిచేసుకొని పండితుడైనప్పటికీ ఒకవేల శ్రీవైష్ణవునికి(ఇతర ఙ్ఞానాష్ఠానములులేక కేవలం భగవానుడే రక్ష అని విశ్వసించేవాడు)  అపచారంచేస్తే అతనికి  బ్రాహ్మణత్వం పోయి వెంటనే చండాలుడైపోతాడు. శ్రీవైష్ణవులకు ఎన్ని అపచారములు చేసినా నాకేమి కాలేదు అనిభావించరాదు. బాహ్యంగాగాని శారీరకంగాకాని  మార్పు కనబడకపోవచ్చు.
 • చాణ్డిలి – గరుడ సంఘటన(గరుడాళ్వార్ ఒక ఏకాంత ప్రదేశంలో/పర్వతంపై నివసిస్తున్న చాణ్డిలిని  చూచి స్మరించినప్పుడు తన రెక్కలు కాలిపోయాయి- చాణ్డిలి అనే మహాభక్తురాలు ఒక పర్వతముపై నివసిస్తు భగవధ్యానం చేసుకొనేది. ఒక సమయమున గరుడాళ్వార్ ఆ పర్వతం మీదుగా వెళ్లుతూ ఈవిడని చూసి ‘ఏమిటి ఈ తపస్విని దివ్యదేశములోకాని పవిత్రక్షేత్రములోకాని నివసిస్తు ధ్యానం చేసుకోవచ్చుగా అని తలచారు (భాగవతాపచారం) వెంటనే తన రెక్కలకు అగ్నిఅంటుకుంటుంది. అనగా భాగవతులు ఏ ప్రదేశములో నివసిస్తే అదే గొప్పక్షేత్రం- ఈ శ్రీసూక్తి శ్రీవచనభూషణంలోనిది )
 • పిళ్ళైపిళ్ళై ఆళ్వాన్ అనే వారు చాలాసార్లు భాగవతాపచారం చేయగా కూరత్తాళ్వాన్ వారికి భాగవత వైభవముని తెలిపి వారిని సరిదిద్ది  మరలా భాగవతాపచారం చేయకుండా నిరోధించారు.

చివరగా ప్రధానమైన విషయమమేమనగా , కేవలం ఆచార్య సంబంధమువలననే మనకు మోక్షం లభిస్తుంది, మన ఙ్ఞానానుష్ఠానములచేత కాదు. అదే క్రమమున ఙ్ఞానానుష్ఠానమున్నను అపచారం చేయడం  వలన  సంసారమున అథోగతిని పొందుతాము.

అసహ్యాపచారం- అసహ్యమనగా ఏ కారణం లేకుండ అని అర్థం. భగవంతునికి, ఆచార్యునికి లేదా శ్రీవైష్ణవులకు ఏ కారణం లేకుండ వారి యందు అపచారమునకు ఉపక్రమించుట.

 • భగవంతుని విషయమందు- హిరణ్యకశిపు తాను భగవద్వైభవాన్ని వినదలచుకోలేదు, భగవానుడు కూడ అతని యందు ఏ ద్వేషభావనను ఉంచుకోలేదు.
 • ఆచార్యుని విషయమందు- అతని సూచనలు అనుకరించకపోవుట. అతడు సంపద, అదృష్ఠముల యందు అసమర్థుడని భావించుట.
 • భాగవతుల విషయమందు- శ్రీవైష్ణవులయందు అసూయపడరాదు.

ఈ అపచారములు ఉత్తరోత్తరం బలీయమైనవి. అనగా ముందు చెప్పిన అపచారములకంటే తర్వాత చెప్పినవి పెద్ద అపచారములు. అకృత్య కరణముకన్న భగవదాపచారం, భగవదాపచారం కన్నా భాగవతాపచారం, భాగవతాపచారం కన్నా అసహ్యాపచారం బలీయమైనవి.

మన పూర్వాచార్యులందరు శాస్త్రములయందు గౌరవభావమునుంచేవారు, అలాగే ఎలాంటి అపచారమునకు ఉపక్రమించేవారు కాదు. మన గురుపరపరంలోని ఆచార్యులందరు తమ అవసానదశలో తమ శిష్యులను ఇతర శ్రీవైష్ణవులను పిలిచి  వారకి క్షమాప్రార్థన చేసేవారు. వారి యందు  అపచారపడకపోయినను మన్నింపమని ప్రార్థన చేసేవారు. ఇదీ వారికి శాస్త్రముపై ఉన్న వినమ్రత ,గౌరవం మరియు నమ్మకం.

ఈ అనుష్ఠానమే మనకు మార్గదర్శకం. మన జీవితమున దీనిని పాటించాలి. అనుష్ఠానము వలన ఙ్ఞానాధిక్యమగును. అనుష్ఠానమునకు ఉపకరించేదే ఙ్ఞానం. ఏ ఙ్ఞానమైతే అనుష్ఠానమునకు ఉపకరించలేదో అది అఙ్ఞానమే.

మనం స్పష్ఠముగా తెలుసుకోవలసినది ఏమనగా శ్రీవైష్ణవులయందు ససేమిరా అపచారపడరాదు.  శ్రీవైష్ణవ అపచారం చేయరాదని శాస్త్రమునందు చెప్పిన విషయములను అనుష్ఠించి గ్రంథస్థం చేశారు మన పూర్వాచార్యులు. పూర్వాచార్యులు  మరియు సమకాలీన ఆచార్యులు మనం ఎలా జీవించాలో అనే విషయముపై చాలా గ్రంథాలు వ్రాశారు. ఈ గ్రంథములను చదివి  ఙ్ఞానము పెంచుకొని అనుష్ఠించాలని వారి అభిమతం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలం : http://ponnadi.blogspot.com/2015/12/simple-guide-to-srivaishnavam-apacharams.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అర్థపంచకం – ఐదు ముఖ్యమైన అంశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు

భగవానుడు 6 రూపములలో (తన ఉనికిని)వేంచేసి ఉంటాడు- పరత్వం(పరమపదమున), వ్యూహ(పాలసముద్రమున), విభవ(రామకృష్ణాది అవతారములు), అంతర్యామి(యోగుల హృదయములలో నివసించు), అర్చావతారం (దేవాలయాలు,మఠం,గృహములలో ఉన్న విగ్రహరూపం) మరియు ఆచార్యుని  రూపమున.

మిక్క ఇఱైనిలైయుం మెయ్యాం ఉయిర్ నిలైయుం*                                                                                                     తక్క నెఱియుం తడైయాగిత్తొక్కియలుం*                                                                                                                     ఊళ్ వినైయుం వాళ్ వినైయుం  ఓదుం కురుగైయర్ కోన్ *                                                                                  యాళిన్ ఇశై వేదత్తియల్

– తిరువాయ్ మొళికి  పరాశరభట్టర్ అనుగ్రహించిన తనియ

                   ఆళ్వార్ తిరునగరి నివాసి మరియు అధికారియైన నమ్మాళ్వార్ అనుగ్రహించిన  తిరువాయ్ మొళి అను వీణానాదం అతి ముఖ్యమైన ఐదుఅంశములను చాలా శ్రావ్యంగా పలుకుతుందట. ‌అవి – పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని (పరస్వరూపం)- జీవాత్మ స్వభావం(జీవాత్మ స్వరూపం)- ఉపాయస్వరూపం(జీవాత్మ పొందవలసినది) – విరోధి స్వరూపం (పరమాత్మను పొందుటకు అడ్డంకులు)- ఉపేయస్వరూపం (పరమాత్మను పొందుటకు పరికరం)  .

           అర్థపంచకం అనగా “ఐదు అంశములు” (అత్యంతావశ్యకంగా తెలుకోవలసినవి). పిళ్ళైలోకాచార్యులు తమ రహస్యగ్రంథములలో ఈ ఐదుఅంశములను  “అర్థపంచకం” అను పేరుతో  కృపచేశారు. ఈ గ్రంథమంతా ఈ ఐదుఅంశముల సంకలమే.

ఈ గ్రంథములోని ఈ విషయాలను పరిశీలిద్దాం:

I – జీవాత్మ – ఇది తిరిగి 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.

1) నిత్యసూరులు: పరమపదమున అనాదిగా నివసిస్తున్నవారు. (శ్రీవైకుంఠం-నిత్యం భగవదానందానుభవం చేయు స్థలం)

2) ముక్త్మాత్ములు:  ఆత్మవిమోచనం పొంది పరమపదమును చేరుకున్నవారు( అంటే ఒకానొక జన్మలో సంసారబంధ వాసన కలిగిఉన్నవారు).

3) బద్ధాత్ములు: సంసారబంధముననే అతి అభిలాష కలవారు.

4) కైవల్యులు: మోక్షమును పొందిన ఆత్మలు(సంసారం నుండి విముక్తి పొందిన వారు). కాని ఆత్మాను భవమును కోరుకొనేవారు( అనగా భగవత్ కైంకర్యమునకు అతి దూరులు) భగవదనుభవమున ఆశలేనివారు.

5) ముముక్షువులు: సంసారంలో ఉండి విముక్తినిపొంది భగవానునికి నిత్యకైంకర్యము చేయాలనుకొనేవారు.

II- బ్రహ్మా-  (పరమాత్మ- భగవానుడు) ఐదు రూపములలో భగవానుడు వేంచేసి ఉంటాడు.

1) పరత్వం:  పరమపదమున వేంచేసి ఉండు దివ్యమైనరూపం.

2) వ్యూహం: క్షీరాబ్ధిలో ఉండు అనంతశయనుని రూపాలు. ఇవి సంకర్షణ(సృష్ఠి), ప్రద్యుమ్న(స్థితి) , అనిరుద్ధ(లయ) రూపాలు.

3) విభవ:  శ్రీరామ, శ్రీకృష్ణ వంటి అవతారములు.

4) అంతర్యామి: ఆత్మలోపల నివాసముండువాడు. ఇతను రెండు రూపములచే వేంచేసిఉంటాడు- ఒకటి ఆత్మలోనుండు రూపం, మరొకటి హృదయంలో శ్రీమహాలక్ష్మితో కూడుకొని ఉన్న ప్రకాశించు రూపం.

5) అర్చావతారం: ఆరాధనకు వీలుగా కంటికి కనిపించు రూపం. దేవాలయములు, మఠములు, గృహములలో వేంచేసిఉన్న రూపం.

III – పురుషార్థం: పురుషుని(జీవుని)చేత సాధించ దగినది. ఇది ఐదు విభాగములు

1) ధర్మం:  లోకకళ్యాణార్థం చేయు కార్యములు.

2) అర్థ:  శాస్త్రానుసారం సంపదను ఆర్జించుట.

3) కామ:  ప్రాపంచిక సుఖములు.

4) ఆత్మానుభవం: స్వీయానుభవం

5)భగవత్కైంకర్యం(పరమపురుషార్థం): పరమపదమున భగవానునికి సర్వవిధసేవలు చేయడం. భౌతికశరీరమును వదలి పరమపదమునకు చేరి, దివ్యశరీరమును పొంది, నిత్యసూరులకు ముక్త్మాత్మలకు అర్పింపబడుట.

IV- ఉపాయం: ఇది ఐదు విభాగములు

1) కర్మయోగం: శాస్త్రవిహితమైన  యఙ్ఞం, దానం, తపం మరియు ధ్యానం మొదలైన వాటిని ఆచరించుటచే ఇంద్రియనిగ్రహం పొంది దీనిద్వారా  అష్ఠాంగయోగాదులను అనుష్ఠించి ఆత్మతత్త్వం తెలుసుకొనుట. ఇది ఙ్ఞాన యోగమునకు సహకారిగా ఉండును. ఐహికమైన సంపదలపై నియంత్రణను చేయును.

2) ఙ్ఞానయోగం: కర్మయోగముద్వారా ఆర్జించిన ఙ్ఞానముతో హృదయాంతర్గతుడై మనపైననే తదేక దృష్ఠిసారించిన  భగవానుడైన శ్రీమన్నారాయణున్ని ధ్యానంచేయుట. ఇది భక్తి యోగమునకు దోహదపడి కైవల్యమోక్షమును అందించును.

3) భక్తియోగం: ఙ్ఞానయోగ సహకారంతో స్థిరమైన ధ్యానము ఏర్పడుతుంది, ఇది పరమానందమునకు దారి తీసి పేరుకుపోయిన పాపాలను మరియు దుర్గుణములను తొలగించివేసి  చేరుకోవలసిన లక్ష్యము వైపు  పయణంసాగేలా చేస్తుంది.

4)ప్రపత్తి: భగవానున్ని శరణుజొచ్చుట/ఆధీనమవుట. అత్యంతసులభమైనది మరియు ఆనందానుభవమును కలిగించునది. శీఘ్రముగా ఫలితములనిచ్చునది. ఒకసారి శరణాగతి చేశామా చాలు ఇక ఇతర వ్యాపారములన్నీ దీనికి   అనుగుణంగా భగవత్ సేవలో భాగంగా మారిపోతాయి.

               ఇది కర్మ,ఙ్ఞాన,భక్తి యోగములు అనుసరించలేని వారికి మరియు ఇవి అనుచితంగాలేని వారికి  అత్యంత సులభమైన మార్గం. (తాను భగవానునికి మాత్రమే చెందినవాడిని అనే స్వరూపఙ్ఞానం కలిగినప్పుడు స్వీయరక్షణ , స్వప్రయత్నములు సరైనవికావని తెలుసుకొంటాడు)దీనిలో రెండు విభాగములు   – ఆర్తప్రపత్తి- (ఈ భౌతికజగత్తులో క్షణకాలం కూడ ఉండడం సహించలేక పరమపదంచేరాలని త్వర ఉన్నవారు)మరియు ద్రుపద ప్రపత్తి(పరమపదమునకు చేరుకొనేవరకు ఈ భౌతికజగత్తులో ఉంటు సర్వం భగవానునిపై భారమునుంచి  భగవత్భాగవతఆచార్య కైంకర్యమునుచేస్తుండేవారు).

5) ఆచార్య అభిమానం:  పైన చెప్పబడిన మార్గములన్నీ అనుష్ఠించడం క్లిష్ఠతరమైనప్పుడు ఆచార్యుడే (భగవదాఙ్ఞతో)పరమకృపతో , ప్రేమతో అతనిని స్వీకరించి అతని రక్షణాభారాన్ని తాను స్వీకరించి ఙ్ఞానమునందించి మార్గదర్శం చూపుట. శిష్యుడు తన సర్వస్వం ఆచార్యుడే అని భావించి అతనిని వినమ్రతో సదా అనుకరించాలి.

విశేషసూచన: ఇక్కడ మనం ఉత్తారక ఆచార్యులైన(ఈ సంసారం నుండి ఉజ్జీవింపచేశేవారు)  భగవద్రామానుజులను స్మరించాలి. అలాగే మనకు ఈ ఉత్తారకాచార్యులను చూపినవారిని(స్వాచార్యులను) ఉపకారకాచార్యులుగా భావించాలి. మన పూర్వాచార్యులందరు దీనిని అనుష్ఠానమున ఉంచి భగద్రామానుజుల శ్రీపాదములనే శరణువేడారు.

విశేషంగా తెలుసుకోవాలన్న దీనిని పరిశీలించవచ్చుhttp://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html .

మణవాళ మామునులు తమ ఆర్తిప్రబంధమున  భగవద్రామానుజులకు పూర్తిగా వశుడై కైంకర్యంచేసిన వడుగనంబి వలె  తాముకూడ ఉండాలని ఆర్తిచెందారు.

విరోధి  – ఈ అంశం మనను మన లక్ష్యమును చేరుకోకుండ అడ్డగించును. ఇది ఐదు విభాగములు

1)స్వరూపవిరోధి: శరీరమునే ఆత్మగా భ్రమింపచేయును. భగవతేతర అంశములపై ప్రీతిని కలిగించి స్వతంత్రునిగా భ్రమింపచేయును.

2) పరత్వవిరోధి: ఇతర దేవతలను పరత్వముగా భావింపచేయును. దేవతాంతరములను భగవంతునితో సమానమనే భ్రమను కలిగించును.  అల్పదేవతలు సర్వశక్తిమంతులని, భగవానుని అవతారములను సామాన్య మానవునిగా, భగవానుని అర్చామూర్తిని కేవలం బొమ్మ అని భావింపచేస్తుంది.

3) పురుషార్థవిరోధి: భగవానుని కైంకర్యము కన్న ఇతరములపై వ్యామోహమును కలిగించును. భగవానుని సేవలో వ్యక్తిగతతత్త్వమునకు ప్రాధాన్యతను కలిగించును.(భగవానుని నియమమునకు వ్యతిరిక్తముగా)

4) ఉపాయ విరోధి: ఇతరోపాయములకు అధికప్రాధాన్యత నిచ్చుట. ఫలాపేక్షతో ఆశ్రయించడం. పరమపద  కైంకర్యముకన్న వీటిని అధికంగా భావించడం. (సర్వార్థ ఫలముననుగ్రహించు ఆచార్య/భగవానుని కంటే వీటిని అధికంగా నమ్ముట).అన్ని సమస్యలకు భీతి చెందుట.(ఆచార్య/భగవానుని పై నమ్మకలేమి)

5) ప్రాప్తివిరోధి: పొందవలసిన దానిని పొందనీయకుండచేయును. ప్రస్తుతశరీరముతో దుశ్చర్యలను, భగవతాపచార, భాగవతాపచారములను చేయించును.

స్వామి పిళ్ళైలోకాచార్యులు అర్థపంచకమును ఇలా వివరించి(సారం) ముగిస్తున్నారు.

      ఈ అర్థపంచకఙ్ఞానమును పొందిన తర్వాత ముముక్షువు(మోక్షము నందు ఇచ్ఛకలిగినవాడు)వర్ణాశ్రమ ధర్మాలకనుగుణంగా ఆర్జిస్తు, వైష్ణవనియమాలను పాటిస్తు, ఆర్జించిన దానిని తన శరీరపోషణ సరిపడమాత్రమే స్వీకరించి మిగిలినది భగవానునికి/భాగవతులకు  సమర్పించి, ఆచార్యుని కృపతో ఙ్ఞానోదయం పొంది అతనికి సేవచేస్తు జీవించాలి.

         భగవానుని ముందు వినమ్రతతో(భగవానుడే సర్వశ్రేష్ఠుడని భావిస్తు), ఆచార్యుని ముందు అఙ్ఞానిలా (ఆచార్యుడే ఙ్ఞానాధికుడని భావిస్తు) శ్రీవైష్ణవుల యందు ఆదరణ భావనతో(వారి వైభవమును తెలుసు కనుక) , సంసారులయందు హేయభావమును ప్రదర్శిస్తు( భౌతిక సంసారులను దూరపరచుటకు)  ఉండవలెను.

             లక్ష్యసాధనకై త్వర/తృష్ణ కలిగి ఉండాలి, ఈ విధానముపై ప్రగాఢవిశ్వాసం కలిగిఉండాలి, అడ్డంకులను (విరోధములను) అధిగమించాలి, శరీరం పై వ్యామోహమును వదలాలి, ఆత్మపరిపూర్ణత కలిగి ఉండాలి, తనకు తాను రక్షకుడనే విషయంలో అశక్తుడవ్వాలి, భగవానుని యందు కృతఙ్ఞతాభావం కలిగి ఉండాలి, ఆచార్యుని యందు కృతఙ్ఞతా మరియు విశ్వాసమును కలిగి ఉండాలి.

              ఎవరైతే ఆచార్యుల ద్వార ఙ్ఞానము పొంది ఆ ఙ్ఞానమును అనుష్ఠానమున పెడతారో వారు భగవానునికి తన దేవేరల కన్నా, నిత్యసూరుల కన్నా మరియు ముక్తాత్మలకన్నా అధికంగా  ప్రీతిపాత్రుడవతారు.

 ఆళ్వార్ తిరువడిగళే శరణం                                                                                                                        ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం                                                                                                                  పిళ్ళైలోచార్యర్ తిరువడిగళే శరణం                                                                                                                    జీయర్ తిరువడిగళే శరణం                                                                                                                               జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలం:  http://ponnadi.blogspot.in/2015/12/artha-panchakam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిని – తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< రహస్యత్రయం

తత్త్వములు  ప్రథానంగా మూడుగా విభజించబడ్డాయి అవి చిత్తు , అచిత్తు మరియు ఈశ్వరుడు.

నిత్యవిభూతి(పరమపదం) మరియు లీలావిభూతి(సంసారికలోకం) లో అసంఖ్యాకమైన జీవాత్మల సమూహములే  చిత్తు. సహజముగానే జీవాత్మలు ఙ్ఞానముతో నిర్మితమై ఙ్ఞానపరిపూర్ణతను కలిగి ఉంటాయి.

ఈ సహజఙ్ఞానం నిత్యానందమైనది. ఎప్పుడైతే జీవాత్మ సహజఙ్ఞానమును పొందునో అప్పుడు అది నిత్యానందమును పొందును. ఈ జీవాత్మ 3గా విభజించబడింది- నిత్యసూరులు(పరమపదమున అనాదిగా ఉండేవారు), ముక్తాత్మ(ఒకానొకప్పుడు సంసారబంధమును ఉండి ముక్తిని పొందినవారు) మరియు బద్ధాత్మలు(ఈ సంసారిక లోకమున సంసారబంధం కలిగినవారు). మరలా ఈ బద్ధాత్మలు రెండుగా విభజించబడ్డారు- మొదటివారు భుభుక్షువులు(సంసారానుభవమును కోరుకొనేవారు) రెండవవారు ముముక్షువులు(ఈ సంసారబాధలనుండి ముక్తిని కోరుకొనేవారు). తిరిగి ఈ ముముక్షువులు రెండు రకములు- కైవల్యార్థులు (స్వీయఆత్మసాక్షాత్కారం/స్వీయానందమును కోరుకొనేవారు) మరియు  భగవత్కైంకర్యార్థులు  (పరమపదమున భగవానునికి కైంకర్యముచేయాలని కోరుకొనేవారు ).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-chith-who-am-i5631.html . దర్శించండి.

అచిత్తు అనగా  ఈ స్థూలఇంద్రియాలకు గోచరించు వైవిధ్యములు కలిగిన జడవస్తువులు. ప్రళయకాలమున అవ్యక్తముగా(అదృశ్యముగా)ఉండి సృష్ఠిసమయమున వ్యక్తమవుతాయి(దృశ్యముగా). అచిత్తు లీలా మరియు నిత్య విభూతులలో ఉండును. సాధారణముగా ఈ భౌతికజగత్తులో  అచిత్తు స్వరూపఙ్ఞానమును కప్పివేస్తుంది అదే అలౌకికజగత్తులో స్వరూపఙ్ఞానమును ఉత్తేజపరుస్తుంది. మరలా ఈ అచిత్తు మూడు విధములు ఒకటి శుద్ధసత్వం(పరమ సాత్వికమైనది- కేవలం పరమపదముననే అగుపించును)రెండవది మిశ్రసత్వం (తమోరజోగుణమేళనం- ఈ సంసారమున అగుపించును)  మరియు సత్త్వశూన్యం (గుణవిహీనమైనది- అదే కాలం(సమయం)).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-achith-what-is-matter.html . దర్శించండి.

ఈశ్వరుడు: శ్రీమహాలక్ష్మితో కూడి  సర్వశక్తిమంతుడు, పరమపురుషుడైన  శ్రీమన్నారాయణుడు. భగవానుడు అనగా ఆరు కళ్యాణగుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు. అవి ఙ్ఞాన,బల,ఐశ్వర్య,వీర్య,శక్తి మరియు తేజస్సు. ఈ ఆరు కళ్యాణగుణములు తిరిగి అనేక కళ్యాణగుణములుగా విస్తరిస్తాయి. భగవానుడు అన్ని కళ్యాణగుణములకు ఆశ్రయణీయుడు మరియు హేయగుణములకు వ్యతిరిక్తుడు. చిత్తు మరియు అచిత్తులు భగవానునియందు లీనమై ఉంటాయి మరియు వాటికి అతనే ఆధారం- కావున అన్నింటికి ఆధారం మరియు  భరించేవాడు అతనే. అన్నింటికి సర్వాధికారి. చిత్తు అచిత్తులన్ని అతని దివ్యానందమునకై ఉద్భవిస్తున్నాయి.

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-iswara-who-is-god.html . దర్శించండి.

తత్త్వముల మధ్య      సారూప్యతలు:

 • ఈశ్వరుడు మరియు చిత్తు(జీవాత్మ) ఇద్దరు ఙ్ఞానం కలిగిన వారే.
 • చిదచిత్తులు ఈశ్వరుని సొత్తు.
 • ఈశ్వరుడు మరియు అచిత్తులు తమ లక్షణాలను బట్టి చిత్తును పరివర్తనం చెందించే సామర్థ్యం కలవారు. ఉదాహరణకు జీవాత్మ అతిగా  భౌతికకార్యకలాపాలయందే నిమగ్నమైనప్పుడు అతను పదార్థముగా రూపాంతరం చెందుతాడు. ఒకవేళ జీవాత్మ భగవద్విషయములందు నిమగ్నుడైతే అతను ఈ సంసారమునుండి విముక్తిని పొంది భగవానుని వలె  ఆనందరూపాన్ని పొందుతాడు.

తత్త్వముల మధ్య భేధములు:

 • అన్నింటికన్న ఈశ్వరునికి భేధము/ఏకైక లక్షణం సర్వేశ్వరత్వం. అనగా సర్వఙ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు.
 • ఈశ్వరుని యందు దాసత్వం అనే విశిష్ఠ లక్షణం చిత్తు కలిగిఉండును.
 • అచిత్తు ఙ్ఞాన శూన్యమైనది. ఇతరులకై మాత్రమే దీని ఉనికి.

పిళ్ళైలోకాచార్యుల తత్త్వత్రయం అను రహస్య గ్రంథమును ఇక్కడ పరిశీలించవచ్చు. http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html .

ఆళ్వార్ తిరువడిగళే శరణం                                                                                                                     ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం                                                                                                             పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం                                                                                                                     జీయర్ తిరువడిగళే శరణం                                                                                                                               జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/thathva-thrayam-in-short.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – రహస్యత్రయం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  దివ్యప్రబంధం మరియు దివ్యదేశములు

పంచసంస్కారములలో  ఒక్కటైన మంత్రోపదేశం అనే ప్రక్రియ (రహస్య మంత్రముల ఉపదేశము) చాలా  ప్రథానమైనది. ఈ సంస్కారములో ఆచార్యునిచే మూడు రహస్యమంత్రములు శిష్యునికి ఉపదేశించబడతాయి.  అవి

*తిరుమంత్రం/అష్ఠాక్షరి మహామంత్రం – బదరికాశ్రమములో నారాయణఋషిచే నరఋషికి ఉపదేశించబడింది (వీరిద్దరు భగవానుని అవతారం).

   “ ఓం నమో నారాయణాయ ”  

సంక్షిప్తార్థం: భగవానునికే చెందిన ఈ జీవాత్మ భగవానుని  ముఖోల్లాసమునకై జీవించాలి. సర్వేశ్వరుడైన నారాయణునికి మాత్రమే కైంకర్యమును చేయాలి.

* ద్వయంమంత్రం- విష్ణులోకమున శ్రీమహాలక్ష్మికి శ్రీమన్నారాయణునిచే ఉపదేశించబడింది.

“ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే ||   శ్రీమతే నారాయణాయ నమః ”   

సంక్షిప్తార్థం: శ్రియఃపతియైన శ్రీమన్నారాయణుని శ్రీపాదములను ఆశ్రయిస్తున్నాను. శ్రియఃపతియై సర్వసులభుడైన నారాయణుని శ్రీపాదముల నిస్వార్థ సేవ చేయుటకు ఉపాయముగా ఆశ్రయించుచున్నాను.

*చరమ శ్లోకం(భగవద్గీతలో భాగం) : కురుక్షేత్ర యుద్ధరంగమున శ్రీకృష్ణుడిచే అర్జునునకు  ఉపదేశించబడింది.

 

సర్వధర్మాన్  పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వాం
 సర్వపాపేభ్యో  మోక్షయిష్యామి మా శుచః ||

సంక్షిప్తార్థం: ఇతరోపాయములన్నింటిని సవాసనగ విడిచి నన్నే ఇతరోపాయ నిరపేక్షకునిగా నమ్మియుండుమా! సర్వశక్తిమంతుడనైన నేను నిన్ను అన్ని ప్రతిబంధకముల నుండి విడిపింతును, దుఃఖింపకుమా!  అని భగవంతుడు ప్రతిఙ్ఞాపూర్వకముగా ఉపదేశించెను.

 ఈ మూడు రహస్య మంత్రములకు  రెండు విధములైన సంబంధబాంధవ్యములున్నాయని మామునులు తమ ముముక్షుపడి వ్యాఖ్యానమున తెలిపారు.(ద్వయమహామంత్ర వివరణలో )

 • విధి –అనుష్ఠానం (సిద్ధాంతం- ఆచరణ) తిరుమంత్రం జీవాత్మ మరియు పరమాత్మల మధ్య సంబంధమును తెలుపుతుంది. చరమశ్లోకం  పరమాత్మ జీవాత్మను తనకు ఆధీనంమవ్వమని ఆదేశిస్తుంది. ద్వయం  జీవాత్మ పరమాత్మను ఆశ్రయించుటకు సదా ధ్యానమును చేయుమని తెలుపుతుంది.
 • వివరణ- వివరణి(సంక్షిప్తవర్ణన) తిరుమంత్రం  ఓం నమో నారాయణ లో   ప్రణవం(ఓం) గురించి తెలుపుతుంది.  ద్వయం , తిరుమంత్రమును వివరించును. చరమశ్లోకం దీనినే అతి వివరంగా తెలుపుతుంది.

ఈ  మూడు రహస్యమంత్రములలో ద్వయమంత్రము  మన పూర్వాచార్యులచే విశేషంగా ధ్యానించబడి   కీర్తింపబడింది. ఇదే మంత్రరత్నముగా(అన్ని మంత్రములలో రత్నం వంటిది)  ప్రసిద్ధిచెందినది. ఈ మంత్రం శ్రీమహాలక్ష్మి  పురుషాకార(మధ్యవర్తిత్వం/సిఫారిస్) పాత్రను తెలుపుతుంది.

శ్రీమహాలక్ష్మితో కూడుకొని ఉన్న శ్రీమన్నారాయణుడే జీవుల ఉజ్జీవనకు ప్రధానకారణం. దేవరాజ గురు (ఎరుంబియప్ప) “వరవరముని దినచర్య” లో మణవాళమామునుల పుణీతమైన దినచర్యను గ్రంథస్థపరిచారు. ఆ విషయమై దీనిలోని 9వ శ్లోకములో-

మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం| తదర్థతత్త్వ నిధ్యాన సన్నద్ధపులకోద్గమం||

శ్రీమణవాళ మామునుల అధరములు (పెదవులు) నిరంతరం మంత్రరత్నమును అనుసంధించుచుండును. ఈ ద్వయానుసంధానముచే(ద్వయం యొక్క వివరణే తిరువాయ్ మొళి)  వారి శరీరం పులకించిపోయేది- అని వివరణ. కావున ద్వయమంత్రం  ఎప్పుడుకూడ స్వతంత్రముగా అనుసంధించరాదని – గురుపరంపర మంత్రం (అస్మద్గురుభ్యో నమః నుండి శ్రీధరాయ నమః వరకు) అనుసంధానం చేసిన పిమ్మట మాత్రమే ద్వాయానుసంధానం చేయాలని ఇది  ఙ్ఞప్తికి తెస్తుంది.

మన పూర్వాచార్యులలో పరాశరభట్టర్ మొదలుకొని (అష్ఠశ్లోకి), పెరియవాచ్చాన్ పిళ్ళై (పరందరహస్యం) , పిళ్ళైలోకాచార్యులు (శ్రియఃపతి పడి,  యాదృచ్ఛికపడి, పరందపడి, ముముక్షుపడి) అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్(అరుళిచ్చెయళ్ రహస్యం) మణవాళ మామునులు(ముముక్షుపడి వ్యాఖ్యానం) మొదలైన వారందరు రహస్యత్రయమున వారివారి వ్యాఖ్యానములలో విశదముగా తెలియపరచారు. ఈ ప్రబంధములన్నింటిలో అతి ప్రధానముగా ముముక్షుపడి నిలుస్తుంది మరియు శ్రీవైష్ణవుల కాలక్షేపములలో ఈ గ్రంథమే సింహభాగమును ఆక్రమిస్తుంది.

రహస్యత్రయం ముఖ్యంగా తత్త్వత్రయం  మరియు అర్థపంచకం పైన దృష్ఠిని సారిస్తుంది. శ్రీవైష్ణవులు తెలుకోవలసిన ముఖ్యార్థములలో   ఇది ప్రధానమైనది.

ఆళ్వార్ తిరువడిగళే శరణం                                                                                                                   ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం                                                                                                             పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం                                                                                                                     జీయర్ తిరువడిగళే శరణం                                                                                                                               జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/rahasya-thrayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దివ్యప్రబంధం మరియు దివ్యదేశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  ఆచార్య – గురుపరంపర

paramapadhanathanపరమపదమున శ్రీదేవి (శ్రీమహాలక్ష్మి)భూదేవి , నీళాదేవి  సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో

కిందటి సంచికలో మనం గురుపరంపరప్రభావం గురించి తెలుసుకున్నాము. ఈ సంచికలో దివ్యదేశములు మరియు దివ్యప్రబంధ వైభవమును తెలుసుకుందాము.

శ్రీమన్నారాయణుడు అపరిమితమైన అనంత  కళ్యాణగుణములతో  కూడుకొని ఉన్న సర్వోన్నత  పరతత్త్వం.  తన విశేష నిర్హేతుక కృపాకటాక్షములచే  కొంత మంది జీవాత్మలపై కృపచూపడం వల్ల ఆ జీవాత్మలు ఆళ్వార్లు(శ్రీమన్నారాయణుని గురించి ప్రభోధించిన  వైభవం కలిగిన యోగులు ) అయ్యారు. తాను నిత్యసూరుల(నిత్యాత్మలు)కు , ముక్తుల(ముక్తి చెందిన జీవాత్మలు)కు  కూడా  సర్వతంత్రస్వతంత్రనియామకుడు అయినా, ఎల్లవేళలా ఒక వేదనలో ఉండేవారు.

ఆ ఆవేదన అంతా లౌకిక సంసారమున బంధింప బడిన జీవాత్మలకొరకై, ఎందువలెననగా, పరమాత్మ సమస్త జీవులకు తండ్రిలాంటి వాడు, తన సంతానం ఈ సంసారమున  జరామరణచక్రంలో పరిభ్రమిస్తుంటే చూసి భరించనివాడు. సరే ఇక్కడ ఒక ప్రశ్న  ఉత్పన్నమవుతుంది- సర్వశక్తిమంతుడైన  భగవానునకు వేదన / బాధ ఉంటుందా?  అనుకుంటే, మరి భగవానుడు సత్యకాముడు(అన్నీ కోరికలు తీరినవాడు) మరియు సత్యసంకల్పుడు (తన సంకల్ప మాత్రముచే అన్నింటిని నెరవేర్చుకొను వాడు)  కదా – దీనికి మన పూర్వాచార్యులు ఇలా తెలిపారు- ఈ జీవాత్మల ఉజ్జీవనముకొరకై ఉండు ఆవేదన కూడ అతని కళ్యాణ గుణమే. ఎలాగనగా  సర్వతంత్రస్వాతంత్ర్యము కలిగిన తండ్రి తన సమీపాన ఉన్న  సంతానంతో సంతోషంగా ఉన్నను తన బాధ అంతా తన నుండి దూరంగా ఉండి కష్టపడుతున్న సంతానం పైనే  ఉండును కదా. భగవానుడు కూడ సర్వతంత్రస్వాతంత్ర్యము కలిగినప్పటికి  తన బాధ అంతా  ఈ సంసారంలో అనాదిగా అఙ్ఞానం  మరియు అవిద్య చే ఆవరించబడిన జీవాత్మల దురవస్థ గురించియే.

ఈ జీవాత్మలు ఉజ్జీవించడానికి భగవానుడు ఈ జీవాత్మలకు సృష్ఠి సమయాన దేహాన్ని మరియు ఇంద్రియాలను, శాస్త్రములను అనుగ్రహిస్తాడు.శ్రీరామ శ్రీకృష్ణుడిగా తానే అవతరిస్తాడు.ఇనన్నీఅనుగ్రహించినప్పటికి ఈ జీవుడు భగవానుని యొక్క పరత్వమునంగీకరించక అఙ్ఞానముతో ఉంటాడు. ఒక వేటగాడు ఒక జింక పట్టుకొనుటకు ఇంకొక జింకను ఎలాగైతే ఎరవేస్తాడో ఆమాదిరి ఈ జీవాత్మలనుద్ధరించుటకు వేరొక జీవాత్మలను ఉద్భవింపచేస్తాడు. వారే ఆళ్వార్లుగా పరిగణిస్తాము. ఆళ్వార్లు అనగా భగవంతుని విషయమందు మాత్రమే మునిగినవారని అర్థం. భారతావనిలో దక్షిణ దేశమున  పవిత్రస్థలములయందు ఈ ఆళ్వార్లు అవతరిస్తారని  శ్రీవేదవ్యాసులు శ్రీమద్భాగవతమున  తెలిపినారు.

Azhwars

ఆళ్వార్లు శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తు పాశురాలను(పద్యాలను) కృపచేశారు. ఇవన్నీ కలసి సుమారు 4వేల పాశురాలు, కావున వీటిని నాలాయిర దివ్యప్రబంధముగా పేర్కొంటారు. దివ్య మనగా విశేషమైనది అని ప్రబంధమనగా పద్యముల కృతి (కేవలం భగవానున్ని కీర్తించునవి) అని అర్థవివరణ.  ఆళ్వార్లు  అర్చారూపమున భగవానుడు వేంచేసిఉన్న స్థలములను కీర్తించారు వాటినే దివ్యదేశములుగా పిలుస్తారు. మొత్తం 108 దివ్యదేశములున్నవి.106 దివ్యద్యదేశములు భారతావనిలో వివిధ ప్రదేశములయందు ఉన్నవి(నేపాల్ తో కూడుకొని). క్షీరాబ్ధి(పాలసముద్రం) ఈ లీలావిభూతికి దూరంగా ఎవరు చేరుకోలేని ప్రదేశం.  మోక్షం పొందిన జీవులు చేరుకొను పరమపవిత్రస్థలం పరమపదం. ఈ 106 దివ్యదేశముల యందు శ్రీరంగం ప్రథానమైనది, ఆ తరువాత తిరుమల, కాంచీపురం, ఆళ్వార్ తిరునగరి ,తిరువల్లిక్కేణి మొదలైనవి కొన్ని ముఖ్యదివ్యదేశములు. భగవానుడు ఐదు రూపములందు ఉంటాడు. అవి పరత్వముగా పరమపదమున, వ్యూహరూపమున క్షీరాబ్ధిలో, అంతర్యామిగా జీవుల హృదయములందు, రామకృష్ణాదిగా విభవరూపమున, చివరిదైన రూపముగా అర్చావతారం (విగ్రహరూపం) దివ్యస్థలములందు వేంచేసి ఉంటాడు. ఈ అర్చావతారం సర్వసులభుడిగా అందరికి సదా చేరువలో ఉండే భగవానుని రూపముగా చెప్పబడుతుంది. మన పూర్వాచార్యులందరు దివ్యదేశమున నిత్యనివాసం చేస్తు భగవానునికి, భాగవతులకు కైంకర్యం చేస్తు తమ జీవనాన్ని గడిపారు. పూర్తి వివరణకై   http://koyil.org దర్శించండి.

వేదం/వేదాంతము యొక్క సారం సరళంగా తమిళ దివ్యప్రబంధములో కూర్చబడింది. ఈ దివ్యప్రబంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యం  ఙ్ఞానప్రసారం వలన జీవాత్మలను ఉజ్జీవింప చేయడం.  ఆళ్వారుల  ఈ దివ్యప్రబంధం వేల సంవత్సరముల నుండి ఆచార్యుల ద్వారా నాథమునుల నుండి ప్రారంభించబడి శ్రీరామానుజలు మధ్యముగా కొనసాగుతూ శ్రీమణవాళ మామునుల వరకు  పరంంపరగా వస్తున్నది.    అఙ్ఞానులు ఈ  ఆళ్వారుల పాశురములను సాధారణ తమిళ పద్యములుగా భావిస్తున్నారు కాని ఙ్ఞానాధికులైన ఆచార్యులు ఈ పాశురాలు శ్రీమన్నారాయణుని దివ్యతత్త్వమును (భవబంధ విమోచాకాలు) ప్రభోధిస్తున్నాయని, శ్రీమన్నారాయణునికి మనం చేయవలసిన కైంకర్యం ఈ దివ్యప్రబంధం ద్వారా అవగతమగుచున్నదని విశదపరిచారు. మన పూర్వాచార్యులు  తమ జీవితాన్నంతటిని ఈ ప్రబంధ అభ్యాసమునకై మరియు ఉపదేశించుటకే వెచ్చించారు.

azhwar-madhurakavi-nathamuni

ఆళ్వారుల అనంతరం దివ్యప్రబంధమునకు కొంత కాలం గడ్డుపరిస్థితి ఏర్పడింది.  క్రమంగా నమ్మాళ్వారుల అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరి యందు నాథమునులు బహుశ్రమకోర్చి నాలాయిరదివ్యప్రబంధమును అర్థానుసంధానముగా నమ్మాళ్వార్ కృపతో వారి వద్ద నుండి పొందారు.  ఈ  దివ్యప్రబంధమును నాథమునులు నాలుగు విభాగాలుగా చేశారు. ఇది అందరికి సుపరిచితమే. నాథమునులు ఈ ప్రబంధమును తమ శిష్యులకు నేర్పించి ప్రచారం గావించారు. అలాగే నమ్మాళ్వార్ విషయమున మధురకవిఆళ్వార్ పరమభక్తితో అనుగ్రహించిన కణ్ణినుణ్ శిరుత్తాంబును నాథమునులు వారి గౌరవార్థం నాలాయిరదివ్యప్రబంధమున చేర్చారు.

Ramanuja_Sriperumbudur

ఆదిశేషుల అవతారమైన శ్రీరామానుజులు గురుపరంపర ద్వారా వస్తున్న ఈ విశేషమును యామునాచార్యుల కృపచే  వివిధ ఆచార్యుల ద్వారా అభ్యసించారు. ఆళ్వారుల వైభవమును మరియు వారి కృతులను శ్రీరామానుజులు సమాజంలోని వివిధ స్థాయిలలో ఉన్న ప్రజలందరికి   ప్రచారం గావించి శ్రీవైష్ణవ సంప్రదాయమును ప్రబలపరిచారు. శ్రీరామానుజుల విశేష కృషి ఫలితంగా ఈ సంప్రదాయమునకు ‘శ్రీరామానుజదర్శనం’ అని స్వయంగా శ్రీరంగనాథునిచే స్థాపించబడింది. అలాగే శ్రీరామానుజుల విషయంగా శ్రీతిరువరంగత్తముదనారు అనుగ్రహించిన రామానుజనూత్తందాదిని నాలాయిరదివ్యప్రబంధమున మన పూర్వాచార్యులచే చేర్చబడింది.   ఈ శ్రీరామానుజనూట్ఱ్రందాది ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి చెందినది – ఎలాగైతే బ్రాహ్మణులు గాయత్రిని ప్రతిరోజు పఠిస్తారో అలాగే ప్రతి  ప్రపన్నులు (పంచసంస్కారము పొందినవారు ) ప్రతిరోజు విధిగా దీనిని పఠించాలి.

nampillai-goshti1
 నంపిళ్ళై కాలక్షేపగోష్ఠి

నంపిళ్ళైగారు ఆ కాలమున(శ్రీరామానుజులు,ఎంబార్, భట్టర్ మరియు నంజీయర్ పరంపర తరువాత) గొప్ప ఆచార్యులుగా విరాజిల్లుతుండేవారు. వీరు శ్రీరంగమున నిత్యవాసం చేయుచు  ఆకాలమున శ్రీవైష్ణవసంప్రదాయమునకు అధికారిగా వెలుగొందేవారు. వీరికాలమున శ్రీరంగమున  నాలాయిరదివ్యప్రబంధమునకు అతిప్రాధాన్యం ఇవ్వబడేది.  పెరియపెరుమాళ్-శ్రీరంగనాథుని సన్నిధిన  వీరు  కాలక్షేపమున సదా నిమగ్నమై ఉండేవారు. పెరియపెరుమాళ్ నిలబడి గవాక్షం/కిటికి గుండా వీరి ప్రవచనమును శ్రవణం చేసేవారట. అలాగే నంపిళ్ళై శిష్యులు కూడా దివ్యప్రబంధ అర్థమును ప్రచారం గావించారు. నంపిళ్ళై  ప్రధానశిష్యులు వ్యాఖ్యానచక్రవర్తి (వ్యాఖ్యాతలలో  శ్రేష్ఠులు)అను బిరుదాంకితులైన  పెరియవాచ్చాన్ పిళ్ళై  నాలాయిర దివ్యప్రబంధమునకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి పూర్వాచార్యులచే బహు ప్రశంసించబడ్డారు.   నంపిళ్ళై  మరొక ప్రధానశిష్యులు   వడక్కుతిరువీథిపిళ్ళై, నంపిళ్ళై యొక్క   నాలాయిర దివ్యప్రబంధ ప్రవచనములను గ్రంథస్థపరిచారు. తిరువాయ్ మొళి కి ఉన్నవీరి  వ్యాఖ్యానము ‘ఈడు’ (ఈడు ముపత్తు ఆరాయిరప్పడి) గా ప్రసిద్ధిచెందినది.

pillailokacharya-goshtiపిళ్ళైలోకాచార్యుల కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళై అనంతరం ఈ సత్సాంప్రదాయమున పిళ్ళైలోకాచార్యులు   ఉత్తరాధికారిగా ఉండి  దివ్యప్రబంధ రహస్యార్థములను తమ రహస్యత్రయగ్రంథములో పొందుపరచారు. ఈ రహస్యార్థములు వివిధ ఆచార్యులచే వివిధ గ్రంథములలో వివరింపబడ్డాయి.   పిళ్ళైలోకాచార్యులు ఈ రహస్యార్థాలను తమ అష్ఠాదశ రహస్యగ్రంథములలో పొందుపరిచారు. కాని వారి చరమ దశలో శ్రీరంగం మొఘల్  ఆక్రమణదారులచే బంధింపబడి అన్ని నాశానం చేయబడ్డాయి.  .పిళ్ళైలోకాచార్యులు  ఆక్రమణదారులనుండి తాము  నంపెరుమాళ్ (శ్రీరంగనాథుని ఉత్సవమూర్తి) తో  తప్పించుకున్నారు. కాని ప్రమాదవశాత్తు వారు అటవీ ప్రయాణ క్లిష్ఠములనుండి తప్పించుకోలేక పరమపదమును చేరుకున్నారు. చాలాకాలం ఈ విపత్తును శ్రీరంగప్రజలు అనుభవించారు. కొన్ని దశాబ్ధముల తర్వాత  ఆక్రమణదారులు నిష్క్రమించి ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత నంపెరుమాళ్ శ్రీరంగం తిరిగి చేరుకొన్నారు.

 

srisailesa-thanian-small

ఆ శ్రీరామానుజుల పునరవతారమైన మణవాళ మామునులు  ఆళ్వార్ తిరునగరి లో అవతరించారు. మామునులు ,తిరువాయ్ మొళిపిళ్ళై గారి శిష్యులయి వారి  వద్ద మరియు తమ తండ్రిగారి వద్ద వేద వేదాంతములను మరియు దివ్యప్రబంధములను అధికరించారు. వారి ఆచార్యులైన తిరువాయ్ మొళిపిళ్ళై గారి ఆఙ్ఞ మేరకు శ్రీరంగం చేరి తమ జీవితాన్నంతటిని సత్సాంప్రదాయ అభివృద్ధికి అంకితమిచ్చారు. మామునులు తాము స్వయముగా  లుప్తమైన సాంప్రదాయ సాహిత్యాన్ని వెదకి  దానిని పఠనం చేసి  ముందు తరాలవారికి అందేలా వాటిని తాటాకులపై లిఖింపచేసి భద్రపరిచారు.  సాంప్రదాయ వైభవము కాపాడుటకు మరియు  దానిని విస్తరింపజేయుటకు వీరు చేసిన అవిరళకృషి మరియు అకుంఠితదీక్షను లోకానికి తెలియపరచుటకు,  స్వయంగా శ్రీరంగనాథుడు మామునులను వద్ద తిరువాయ్ మొళి కాలక్షేపాన్ని శ్రవణం చేసి,  కాలక్షేపం చివరి రోజున ఓ చిన్ని బాలుని వలె వచ్చి,   వీరిని ఆచార్యులుగా భావించి అత్యంత  వైభవము గల ‘శ్రీశైలేశ దయాపాత్రం’ అను తనియను శిష్యభావనతో  వారికి  సమర్పించారు. కాలక్రమేణ వివిధ ఆచార్యపురుషవంశముల నుండి పరంపరగా వచ్చిన ఆచార్యులు  దివ్యప్రబంధమును తరువాతి వారికి బోధించసాగారు.

భగవానునుని  ఆవేదనను తీర్చి మరియు జీవాత్మ ఉజ్జీవించడము మాత్రమే అవతారప్రయోజనముగా కల ఆళ్వారుల దివ్యప్రబంధములను మన పూర్వాచార్యులు భద్రపరిచారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. శ్రీవైష్ణవులందరు ఈ నాలాయిరదివ్య ప్రబంధమును అర్థయుక్తంగా నేర్చుకొని దీనితోనే  మన జీవితకాలాన్ని వెళ్ళదీయాలి అని పూర్వాచార్యుల అభిమతం.

ఈ క్రింది వాటిని పరిశీలించిన ఆళ్వారుల మరియు దివ్యప్రబంధము యొక్క వైభవం తెలుసుకొనవచ్చు.

దివ్యప్రబంధము యొక్క అనువాదమును  వివిధ భాషలలో  చదవాలన్నదీనిని దర్శించండి  http://divyaprabandham.koyil.org

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-dhivya-prabandham-dhesam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org