Category Archives: Simple guide to SrIvaishNavam

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – సూచికలు

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< దినచర్య – ప్రధానాంశాలు

వివిధ రకములైన ప్రమాణసూచికలు వివిధ భాషలలో ఉన్నవి అవసరమైన విషయం  సులభగ్రాహ్యమునకు ఇక్కడ విషయాసూచికలను ఇవ్వడం  జరిగింది.

సాధారణ అనుసంధానములు 

  • http://koyil.org/index.php/portal/ – శ్రీవైష్ణవ వెబ్ సైట్ ప్రవేశ ద్వారం
  • http://acharyas.koyil.org–గురుపరంపర పోర్టల్ – అనుసంధానం –ఆళ్వారుల,ఆచార్యుల జీవిత చరితం ఆంగ్లభాషతో కలుపుకొని వివిధ భారతీయ భాషలలో(తెలుగు, హింది, కన్నడం, మలయాళం మరియు తమిళం)లభించును
  • http://divyaprabandham.koyil.org-దివ్యప్రబంధం పోర్టల్ – వివిధభాషల్లో భాషాంతరీకరణం
  • http://pillai.koyil.org/– శ్రీవైష్ణవ పరిఙ్ఞానం/బాలకుల పోర్టల్
  • http://githa.koyil.org– భగవద్గీత మరియు సంబంధిత వ్యాసములు
  • http://srivaishNavagranthams.wordpress.com– సంప్రదాయ వ్యాసములు వివిధ భాషల్లో (ఆంగ్లం, తెలుగు,హింది,కన్నడం,మలయాళం మరియు తమిళం)
  • http://ponnadi.blogspot.in, https://srivaishnavagranthamstelugu.wordpress.com/ – సంప్రదాయముపై పలు వ్యాసములు ఆంగ్లభాషయందు

ప్రత్యేక అనుసంధానములు

ప్రత్యే విషయములు

ఆచరణాత్మక మార్గదర్శకత్వం

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |                                                                          శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్య మంగళమ్||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-references.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దినచర్య – ప్రధానాంశాలు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< అపచారముల నిర్మూలన

శ్రీవైష్ణవుల దినచర్యలో ఈ క్రింది అంశములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి మరియు చాలా ప్రయోజనకరమైనవి.

 

  1. వర్ణ-ఆశ్రమ-ఙ్ఞాన భేధం చూడకుండ శ్రీవైష్ణవులను గౌరవించాలి. భగవంతుడు తాను మొదటగా ఆకాంక్షించేది    భాగవతులను(భక్తులను) గౌరవించడం.
  2. అహం మరియు స్వార్థచింతనారహిత జీవితాన్ని గడపాలి. ఆత్మస్వరూపం మరియు భగవానుని వైభవం తెలిసినప్పుడు మనం మన స్వార్థచింతనను మానివేస్తాము.
  3. క్రమం తప్పకుండ ఆచార్యున్ని దర్శించడం శిష్యుని ప్రధానలక్షణం. ఆచార్యుని   భౌతికజీవనం    గడపడానికి అవసరమైన వస్తువులను మరియు ఆర్ధికావసరాలను ఏర్పాటుచేయడం శిష్యుని విధి.
  4. .నిత్యకర్మానుష్ఠానములైన స్నాన-ఊర్ధ్వపుండ్రధారణ-సంధ్యావందనములను వారివారి     వర్ణాశ్రమధర్మాలనుబట్టి       ఆచరించాలి. ఈ ధర్మాలను ఆచరించువారు బాహ్యాంతరశుద్ధులను పొంది ఙ్ఞానసముపార్జనకు సంసిద్ధులవుతారు.
  5. సదా శ్రీచూర్ణతిరుమణ్లను ధరించాలి. ఇది భగవద్దాసులమని తెలుపు ప్రాథమికస్వరూపం. కావున ఈ స్వరూపమును నిత్యము నిర్భయముగా మరియు లజ్జారహితముగా ధరించాలి.
  6. వర్ణ-ఆశ్రమ-లింగధర్మములను అనుకరిస్తు సాంప్రదాయ వస్త్రములను ధరించాలి. మగవారైతే పంచకజ్జమును(గోచి పెట్టిన ధోవతి) ఆడవారయితే మడిసార్(గోచి పెట్టిన చీరకట్టు)ను ధరించాలి. దీనికి సిగ్గుపడనవసరం లేదు. మన సాంప్రదాయ పరంపరావైశిష్ఠ్యమును మనం గ్రహించాలి.
  7. ఆళ్వారులందరు శ్రీమన్నారాయణున్ని సదా సేవించడంలో నిమగ్నులై ఉంటారు. ఆళ్వార్లు మరియు మన పూర్వాచార్యులందరు దేవతాంతర (రుద్ర, ఇంద్ర, వరుణ, అగ్ని మరియు నవగ్రహములు మొదలైనవారు) ఆరాధనను నిరసించారు. మన పూర్వాచార్యులు ఈ విషయానికి అధికప్రాధాన్యతను ఇచ్చారు. భగవానునికి మరియు ఈ జీవాత్మకు మధ్యన ఉండు నవవిధ సంబంధములలో భర్తృభార్యాసంబంధం విశేషమైనది. ప్రాయశముగా అన్ని జీవాత్మలు స్త్రీప్రాయములే. భగవానుడు మాత్రమే పరమపురుషుడు. కావున ఈ సంబంధం భగవానుని యందు  విశ్వాస్యతను మనయందు ఏర్పరుస్తుంది. ఇది మిగితా దేవతాంతరములతో సంబంధం నెరపుటను నిరోధిస్తుంది.
  8. శ్రీవైష్ణవుని నిత్యవిధులలో గృహతిరువారాధన చాలా ప్రధానమైనది. మన గృహములందు తనను ఆరాధించుకోవడానికి భగవానుడు పరమకృపతో అర్చారూపమున దిగివచ్చాడు. దీనిని విస్మరించుట భగవానున్ని అవమానపరచడమే. భగవానుని మరచిపోవడం మన ఆధ్యాత్మికప్రగతిని నష్ఠపరచుకోవడమే. ప్రయాణంలో కూడ మన తిరువారాధన భగవానునిమోసుకపోవచ్చు. ఒకవేళ అది వీలుకాకపోతే ఇతర శ్రీవైష్ణవులు మన గృహమునకు వచ్చి ఆరాధనచేయుటను ఏర్పరచాలి అలాగే దానికి తగిన ఏర్పాటును కూడా చేయాలి లేదా ఇతర శ్రీవైష్ణవగృహములయందు ఉంచి వెళ్ళవచ్చు. ఆరాధన లేకుండ గృహమునకు తాళంవేసిఉంచడం భగవానుని అగౌరవపరచడమే. తిరువారాధన  వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు . http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html.
  9. వారి వారి వర్ణాశ్రమధర్మాలను ఆధారంగా శాస్త్రం ఏర్పరచిన ఆహారనియమములను పాటించాలి. మొదట ఆహారపదార్థాలను భగవానునికి , ఆళ్వారాచార్యులకు నివేదన చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. భగవానుని నివేదనకు నిషిద్ధమైన పదార్థములను సమర్పించరాదు. ఆహారనియమ వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-aahaara-niyamam_28.html and http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-ahara-niyamam-q-a.html.
  10. శ్రీవైష్ణవుల సాంగత్యమును ఆశించాలి. ఈ సాంగత్యం వలన  ఆధ్యాత్మికభావనాప్రవాహం వృద్ధిచెంది ఉజ్జీవనమునకు దారితీయును.
  11. మన జీవితంలో దివ్యదేశములు, ఆళ్వారుల మరియు ఆచార్యుల అవతారస్థలములు మరియు అభిమానస్థలముల దర్శనమునకు ప్రాధాన్యతనివ్వాలి. దివ్యదేశములయందు కైంకర్యమును చేయవలెను. ఒకవేళ ప్రస్తుతం కైంకర్యము చేయవీలుకాకపోతే కనీసం దివ్యదేశయాత్రనైన తరచుగా చేయాలి. భవిష్యత్తులోనైన ఈ కైంకర్యం చేయాలని ప్రయత్నించాలి.
  12. శ్రీవైష్ణవులకు దివ్యప్రబంధము చాలాముఖ్యమైన అంశం. పాశురములను అభ్యసించి, పూర్వాచార్యుల వ్యాఖ్యానముననుసరించి వాటి అర్థములను తెలుసుకొని అనుష్ఠానమున పెట్టవలెను. ఈ మూడు విషయములు శ్రీవైష్ణవత్వమును పెంపొందిస్తాయి. దివ్యప్రబంధఙ్ఞానం ప్రాపంచిక సుఖములయందు అశ్రద్ధను, భగవంతుని మరియు భాగవతులయందు శ్రద్ధను నిలుపుటకు తోడ్పడతాయి.
  13. పూర్వాచార్యుల జీవన అనుష్ఠానం మనకు ఙ్ఞానార్జనకు మరియు  ప్రేరణకు తోడ్పడతాయి. ఈ రోజు మనమందరం విషమ పరిస్థిలను/ సంధిగ్ధావస్థలను దాటి  నిలబడ్డామంటే అది పూర్వాచార్యులు తమ జీవన అనుష్ఠానములో ప్రదర్శించిన కరుణ మరియు  సౌలభ్యమే .
  14. పూర్వాచార్యుల సాహిత్యపఠనం చాలా విశేషం. ప్రతిఒక్కరు ప్రతిదినమునందు కొంత సమయమును ఈ లభిస్తున్న సాహిత్యనిధిని పఠించుటకు కేటాయించాలి. ఈ సాహిత్యం మనకు వేదాంతం,దివ్యప్రబంధం , స్తోత్రగ్రంథములు ,వ్యాఖ్యానములు మరియు చారిత్రాత్మక సంఘటనలు అనే రూపములో లభిస్తున్నాయి.  ఈ విషయపరిఙ్ఞానము ఈ వెబ్ సైట్ నందు లభించును http://koyil.org/index.php/portal/
  15. ఆవశ్యకమైన సూత్రములను విద్వాంసుల నుండి కాలక్షేపముగా శ్రవణం( మూలమును అనుసరించి చెప్పు వ్యాఖ్యాన ప్రవచనం)చేయడం చాలా అవసరం. ప్రస్తుత కాలములో చాలా ప్రవచనములు CD మరియు  websites నందు విరివిగా లభిస్తున్నాయి. ప్రవచనములను ప్రత్యక్షముగా  విననివారు ఈ లభిస్తున్న వాటిని ఉపయోగించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు సమయానుకూలతను  బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు.
  16. కైంకర్యమునందు సదా నిమగ్నమై ఉండాలి. “ కైంకర్యము చేయకుంటే శేషత్వం లోపించును” అనేది శాస్త్రవచనం. కావున శ్రీమన్నారాయణునియందు,ఆళ్వారాచార్యులయందు దాసత్వం ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమును విధిగా చెయ్యాలి. అది భౌతిక, మానసిక , ఙ్ఞానసంబంధిత కైంకర్యము కావచ్చును. ఇలా కైంకర్యమునందు చాలా విధములున్నవి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమునందు నిమగ్నమై ఉండాలి. ఇది భగవంతుని యందు భాగవతులయందు స్థిరమైన కైంకర్యబుద్ధిని ఉండేలా చేస్తుంది.
  17. భగవానుని యందు మరియు ఆళ్వారాచార్యులయందు కైంకర్యఙ్ఞానం ఉన్న భాగవతులకు మరియు ఇతరులకు సహాయం చెయ్యవలెను. ఇలాంటి స్థిరమైన(విచ్చిత్తిలేని కైంకర్యఙ్ఞానం)ఙ్ఞానం కలవారితో సంపర్కం వలన పరస్పరం  ప్రయోజనం ఉంటుంది, అనగా చెప్పేవారు వినేవారు ఇద్దరు గుణానుభవం చేస్తారు. ప్రతిఒక్కరు ఉజ్జీవించాలనే ఏకైక పరమప్రయోజనముగా  ఈ ఙ్ఞానమును మన పూర్వాచార్యులు పరంపరగా అందించారు. కావున  మనమందరం ఈ ఙ్ఞానమును సరైన మార్గదర్శకత్వములో జాగ్రత్తగా చదివి మన కుటుంబసభ్యులకు, బంధువులకు,మిత్రులకు మరియు అభిలాష ఉన్న వారందరికి అందించాలి. ఇదే మన  కర్తవ్యం.
  18. ఆత్మస్వరూపగుణమగు నిత్యానందమును పొందడానికి ప్రయత్నంచేయవలెను. నిజమైన శ్రీవైష్ణవుడు మృత్యువుకు భయపడడు, కారణం శ్రీవైకుంఠమునందు  భగవానుని  నిత్యకైంకర్యము చేయు భాగ్యంలభిస్తుంది దీనివల్లనే. మన ఆళ్వారులు మరియు ఆచార్యులందరు నిత్యవిభూతి యందు ఉన్నప్పుడు భగవద్భాగవత కైంకర్యమును చేసేవారు, ఆ తర్వాత పరమపదమునకు వెళ్ళినను భగవద్భాగవత కైంకర్యమునే ఆశించేవారు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-important-points.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అపచారములు – అపచారముల నిర్మూలన

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఐదు ముఖ్యమైన అంశములు

చాణ్డిలి – గరుడ సంఘటన (చాణ్డిలి అనే మహాభక్తురాలు ఒక పర్వతముపై నివసిస్తు భగవ ధ్యానం చేసుకొనేది. ఒక సమయమున గరుడాళ్వార్ ఆ పర్వతం మీదుగా వెళ్తూ ఈవిడని చూసి ‘ఏమిటి ఈ తపస్విని దివ్య దేశములోకాని పవిత్ర క్షేత్రములోకాని నివసిస్తు ధ్యానం చేసు కోవచ్చుగా అని తలచారు (భాగవతాపచారం) వెంటనే తన రెక్కలకు అగ్ని అంటుకుంటుంది. అనగా భాగవతులు ఏ ప్రదేశములో నివసిస్తే అదే గొప్ప క్షేత్రం – ఈ శ్రీ సూక్తి శ్రీ వచన భూషణం లోనిది )

ఈ వ్యాసము నందు వివిధ రకముల అపచారములు వాటిని శ్రీ వైష్ణవులు తొలగించుకొనే విధానములను తెలుసుకుందాము.

శ్రీవైష్ణవులకు శాస్త్రం పరమ ప్రమాణం – అన్ని విధులను శాస్త్రమునే ఆధారంగా తీసుకొని చేస్తారు. శాస్త్రం అనగా మనం ఏది చేయాలో (విధి) ఏది చేయకూడదో (నిషిద్ధమో) తెలుపుతుంది. సాధారణంగా శాస్త్రం మనకు నిత్య కర్మలను మరియు నైమిత్తిక కర్మలను అనుష్ఠించాలని అలాగే ఆస్తేయం (దొంగతనం), ఇతరుల సంపదను ఆశించడం, హింస మొదలైనవి చేయకూడదని విధిస్తుంది. మన  పూర్వాచార్యులు శాస్త్రసారమును గ్రహించి మనకై అందించారు.

పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రమున సూత్రం 300 నుండి 307 వరకు నాలుగు విషయముల యందు అశక్తులుగా (చేయకుండ) ఉండాలని సూచించారు.

  • అకృత్య కరణం – శాస్త్ర నిషిద్ధమైన వాటిలో అనాసక్తిగా ఉండడం.
  • భగవదపచారం – భగవంతుని ఎడల అపచార పడడం.
  • భాగవతాపచారం – భాగవతుల యందు (భక్తుల యందు) అపచార పడకుండా ఉండడం.
  • అసహ్యాపచారం – ఏ కారణం లేకుండానే భగవత్ / భాగవతులందు అపచార పడడం.

వీటిని విపులంగా తెలుసుకుందాం:

అకృత్య కరణం:- శాస్త్రం మనకు వీటి నుండి దూరంగా ఉండమని నిర్ధేశిస్తుంది.

పరహింస: జీవహింస కూడదు. అనగా  వృక్షమునకు గాని చీమగాని హాని కలిగించ రాదని శాస్త్ర వచనం.

పర స్త్రోత్రం: మనకు భగవానుడు కంఠం అనుగ్రహించినది తనని తన భక్తులని కీర్తించడానికే కాని ఇతరులను కాదు.

పరదార పరిగ్రహణం: పరుల భార్యలను చెరపట్టరాదు / ఏవిధంగా నైనను వారి యందు దుష్ఠ ఆలోచనలు చేయ కూడదు.

పరద్రవ్య అపహరణం: ఒకరు ఇచ్చే వరకు వారి సంపదను గాని ధనమును కాని ద్రవ్యమును కాని ఆశించ రాదు.

అసత్య కథనం: సత్యమునకు వ్యతిరేకముగా పలుకరాదు.

అభక్షభక్షణం: తినే ఆహార పదార్థములు 3 రకముల దోషములను కలిగి ఉంటాయి. జాతి దుష్ఠములు, ఆశ్రయ దుష్ఠములు మరియు నిమిత్త దుష్ఠములు. దీనికై ఆహార నియమాలు (http://ponnadi.blogspot.in/2012/07/SrIvaishNava-AhAra-niyamam_28.html అనే  వ్యాసమును చూడండి.

ఇంకా చాల నియమ నిబంధనములు మనకు మనుస్మృతిలో లభిస్తాయి.

శ్రీవైష్ణవులు ప్రధానంగా సామన్య శాస్త్ర విధులను నిర్వర్తించి నిషేధ విధులను త్యజించాలి.

భగవద పచారం:‌ పిళ్ళై లోకాచార్యులు క్రమంగా నిషేధ విధులను తెలుపుతు భగవదపచారం గురించి విశేషంగా  తెలుపుతున్నారు. దీనికి ఆచార్య సార్వభౌములైన మణవాళ మాముణులు విశేషమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఈ క్రిందివి భగవదపచారములు.

  • దేవాంతరములతో (ఇతర దేవతలతో)  శ్రీమన్నారాయణున్ని సమానముగా తలచ రాదు. శ్రీవైష్ణవులుశ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడని ధృడముగా విశ్వసించాలి. ఎవరైతే సర్వేశ్వరుడైన (బ్రహ్మ, శివ, ఇంద్ర వరుణ అగ్ని మొదలైనవారికి కూడ), అంతర్యామో (లోపల ఉండి అన్నీ నడిపించే వాడో), శ్రీమన్నారాయణుడికి సమానులు లేదా వారిని మించిన వారు ఉండరు. ఈ విషయ పరిఙ్ఞానం చేత దేవాంతరములకు దూరంగా ఉండాలి.
  • అవతారములను అనగా రామ కృష్ణాది అవతారములను సామాన్య మానవులుగా తలచ రాదు. భగవానుడు ఈ సాంసారిక లోకం (భౌతిక జగత్తు)లో పరమపదములో ఉన్నట్లు అన్ని కళ్యాణ గుణములతో ప్రకాశిస్తాడని తెలుసు కోవాలి. స్త్రీ గర్భమున జన్మించడం, దినమున జన్మించడం, వనవాస క్లేశములను అనుభవించడం మొదలైనవి అతని లీలలు మాత్రమే కాని మనలాగా కర్మ బంధములు కావు. ఈ సంసార క్లేశములు అనుభవిస్తున్న జీవాత్మల ఉద్ధరణకై తన ఇచ్ఛతో చేయు నటువంటివి. కావున మనకై ఈ కష్ఠములను అనుభవిస్తున్నాడు, అంత మాత్రమున మనవలె మానవ జన్మ అని తలచరాదు.

వర్ణాశ్రమ ధర్మములు:

ప్రతి ఒక్కరు వర్ణాశ్రమ ధర్మములను విధిగా పాటించాలి. కారణం భగవానుడు ఇలా అన్నాడు “శ్రుతి స్మృతి మమ ఏవ ఆఙ్ఞా.. ఆఙ్ఞా చేధి మమ ద్రోహి, మత్ భక్తోపి న వైష్ణవః” –  శ్రుతి స్మృతి రెండు కూడ నా ఆఙ్ఞలే కావున వీటిని ప్రతి ఒక్కరు విధిగా అనుసరించాలి, వీటిని పాటించని వారు నా భక్తులైనప్పటికి వారు నా ద్రోహులు, వీరు అవైష్ణవులుగా పరిగణింపబడతారు. ఈ ప్రత్యేక సందర్భమును పురస్కరించు కొని మాముణులు  శ్రీవైష్ణవులు తిరువారాధన చేసే సమయమున వినియోగించు వైదిక మంత్రాలను తెలిపారు, సన్యాసులు వక్కపొడిని సేవించుట వంటి శాస్త్ర నిషిద్ధ విషయాలను కూడ తెలిపారు.

అర్చా మూర్తి విలువను తెలుపుతు – అది ఏ లోహముతో తయారైనదని పరిశీలించడం –  భగవానుడు భక్తుల సౌలభ్యార్థం మరియు ప్రీతి కోసం మనం కోరిన రూపాన్ని ధరిస్తాడు – మనం ఈ అర్చా విగ్రహం బంగారముతో తయారైనదని చాలా గొప్పదని – ఇది రాతితో తయారైనదని – ఇది కేవలం చిత్రమేనని భేదములు చూపుట భగవదపచారం. ఇలా మూర్తి యొక్క విలువను గణించడం మన మాతృ మూర్తి పవిత్రతను గణించటం వంటిది అని శాస్త్ర వచనం.

జీవుడు స్వత్రంతుడు అని భావిస్తే – మన స్వాత్రంత్య బుద్దే అన్నీ పాపములకు మూల కారణం. శాస్త్రరీత్యా ఇది క్షమింపరాని దొంగతనం. కాని ఈ జీవుడు భగవంతునికి పరతంత్రుడు కావున భగవానుని ప్రకారమే నడుచు కోవాలి.

భగవానుని ద్రవ్యమును అపహరించుట – అతని భోగము (ఆహారపదార్థం), తిరు ఆభరణములను, వస్త్రములను, అలాగే అతని స్థిరాస్తులైన స్థలం మొదలైన వాటిని అపహరించుట. నేడు ఇవి సర్వ సాధారణమైనవి.

  • వీటిని అపహరించు వానికి సహాయపడడం కూడ అపచారమే. అపహరించిన వాని దగ్గరనుండి గ్రహించినా, అపహరించమని ప్రోత్సహించినా కూడ భగవదపచారమే. “ఆ వస్తువులు మనం అడగడంలేదు, అయినా వాడు ఇస్తున్నాడు, స్వీకరించుటలో దోషమేమి లేదు కదా!” అని అనుకొన్నా భగవదపచారమే. ఇంకా చాలా భగవదపచారములను శాస్త్రం పేర్కొన్నది.

భాగవతాపచారం:

ప్రాథమికంగా ఇతర శ్రీవైష్ణవులను తనతో సమానమని కాని వారికన్న తాను అధికుడనని  భావించడం భాగవతాపచారం. ఇతర శ్రీవైష్ణవులకన్న తాను అల్ఫుడనని భావించాలి. ఈ విషయమున శ్రీ పిళ్ళై లోకాచార్యులు ఇలా అనుగ్రహిస్తున్నారు – మన శ్రీ వైష్ణవత్వ వృద్ధికి భాగవతాపచారం పరమ విరోధి. శ్రీ వచన భూషణం 190 నుండి 207 సూత్రం వరకు ఈ  భాగవతాపచారములను పేర్కొన్నారు, వాటి సారమును పరిశీలిద్దాం‌‌ –

  • బాహ్యముగా శ్రీవైష్ణవవేషం ధరించి (వస్త్ర ధారణ, ఊర్ధ్వ పుండ్ర ధారణ మొదలైనవి) భాగవతాపచారమున చేయుట. ఎలాగేతే చక్కగా మడత పెట్టిన ఒక వస్త్రం అగ్నికి ఆహుతి అయినప్పుడు బాహ్యంగా చూడడానికి అలాగే మడతపెట్టి ఉంటుంది. కాని గాలి వీచినప్పుడు చెల్లా చెదురవుతుంది.
  • వరాహ, నరసింహ, రామ, కృష్ణ మొదలైన భగవతారముల యందు హిరణ్య కశిపుడు, రావణుడు తన భక్తుల యందు చేసిన అపచారములను చూసి భగవానుడు సహింప లేక పొయ్యాడు. ఎందుకనగా ఈ సంసారమందు తన భక్తుల వేదనను సహింపలేని భగవానుడు  వివిధ అవతారములను ఎత్తాడు. భక్తుల రక్షణార్థం తాను ఎత్తిన అవతారముల రహస్యమును భగవద్గీత 4వ అధ్యాయమున ఇలా చెప్పుకున్నాడు – “యధా యధాహి” “పరిత్రాణాయ సాధూనామ్”  “బహూని మే వ్యతీతాని”, “అజోపి సన్” మరియు “జన్మ కర్మచ మే దివ్యాని”. గీతా భాష్యమున భగవద్రామానుజాచార్యులు మరియు తాత్పర్యచంద్రికలో వేదాంతాచార్యులు ఈ శ్లోకములను ఉదాహరిస్తు  తమ భాష్యమును రచించారు.

భాగవతాపచారములు:

  • జన్మ చేత కాని, ఙ్ఞానం చేత కాని, వృత్తి చేత కాని, ఆహార పదార్థముల భక్షణ చేతకాని, బంధువుల సంబంధము చేత కాని, జన్మించిన స్థలం చేత కాని, నివాస స్థలం చేత కాని  మొదలైన విషయముల ఆధారంగా  భక్తులను అవమానించడం / వివక్షత చూపడం భాగవతాపచారం.
  • వీటన్నింటిలో జన్మనాధారంగా చేసుకొని అవమానించడం చాలా అపచారం. ఇది భగవానుని అర్చావిగ్రహం ఏ లోహంతో తయారు చేయబడిందో అని విలువ కట్టడమంత దోషం. (మాతృ మూర్తి పవిత్రతను అవమానించడమంత దోషం)
  • మన పూర్వాచార్యులు శ్రీవైష్ణవులతో  వ్యవహరించేటప్పుడు, ప్రవర్తించు విషయ మందు చాలా కఠినమైన ప్రమాణాలను పాటించేవారు. వారితో చాలా అప్రమత్తంగా / జాగరూకతతో మెలగాలి. ఉదాహరణకు ఆచార్యులు కూడ తమ శిష్యులతో ఇలానే వ్యవహరించాలి. ఇలాంటి గౌరవాన్ని పాటించేవారు మన పూర్వాచార్యులు. కాని ఈ నాటి పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. శిష్యులెవరు తమ స్వాచార్యులకు కనీస మర్యాదను కూడ ఇవ్వడం లేదు కదా , “అతను అంత ఙ్ఞాని కాదు” “కావున అతనికి ఎలా మర్యాదనివ్వడం” అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు తమ ఆచార్యులను విధిగా గౌరవించాలి ఇది భగవానుని గౌరవించడంతో సమానం.

భగవదపచార ఫలితములను ఇక్కడ చెప్పబడ్డాయి:

  • త్రిశంఖు ఇక్కడ ఉదాహరణంగా చెప్పబడుతున్నాడు – ఇతను తన ఆచార్యుడైన వశిష్ఠున్ని మరియు అతని కుమారులను ఈ పాంచ భౌతిక దేహంతో తనను స్వర్గమునకు పంపించాలని పట్టుబట్టాడు. కాని వారు దీనికి నిరాకరించి ఆగ్రహముతో అతనిని చండాలుడి (కుక్క మాంసం తినేవారు) గా మారమని శపించారు. అతనికి ఙ్ఞానమును అందించిన యఙ్ఞోపవీతమే చండాలుడు ధరించే పట్టీగా మారిపోయినది. ఇలా ఉన్నత స్థితిలో ఉండి శ్రీవైష్ణవులు తప్పుచేయుటకు ఉపక్రమిస్తే శాస్త్ర ప్రకారం చాలా తీవ్రమైన దండనను అనుభవించవలసి వస్తుంది. ఎలాగంటే దేశ ప్రధాన మంత్రి అవినీతిలో భాగం పంచుకుంటే అతనిని నీచంగా చూస్తారు, అదే సామాన్య పౌరుడు చేస్తే అంతగా పట్టించుకోరు.
  • తొండరడిపొడి ఆళ్వార్ ఇలా అంటున్నారు, “త్తమర్గళిల్ తలైవరాయ శాది అందణర్గళేలుం” – ఒకడు శ్రేష్ఠమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి బ్రహ్మోపదేశం (గాయత్రి మంత్రోపదేశం) పొంది, వేదా భ్యాసం పూర్తి చేసుకొని పండితుడైనప్పటికీ ఒక వేల శ్రీవైష్ణవునికి (ఇతర ఙ్ఞానాష్ఠానములు లేక కేవలం భగవానుడే రక్ష అని విశ్వసించేవాడు)  అపచారం చేస్తే అతనికి  బ్రాహ్మణత్వం పోయి వెంటనే చండాలుడైపోతాడు. శ్రీవైష్ణవులకు ఎన్ని అపచారములు చేసినా నాకేమి కాలేదు అని భావించ రాదు. బాహ్యంగాగాని శారీరకంగా కాని  మార్పు కనబడక పోవచ్చు.
  • చాణ్డిలి – గరుడ సంఘటన (గరుడాళ్వార్ ఒక ఏకాంత ప్రదేశంలో / పర్వతంపై నివసిస్తున్న చాణ్డిలిని చూచి స్మరించినప్పుడు తన రెక్కలు కాలి పోయాయి – చాణ్డిలి అనే మహా భక్తురాలు ఒక పర్వతముపై నివసిస్తు భగవ ధ్యానం చేసుకొనేది. ఒక సమయమున గరుడాళ్వార్ ఆ పర్వతం మీదుగా వెళ్లుతూ ఈవిడని చూసి ‘ఏమిటి ఈ తపస్విని దివ్య దేశములో కాని పవిత్ర క్షేత్రములో కాని నివసిస్తు ధ్యానం చేసుకోవచ్చుగా అని తలచారు (భాగవతాపచారం) వెంటనే తన రెక్కలకు అగ్ని అంటుకుంటుంది. అనగా భాగవతులు ఏ ప్రదేశములో నివసిస్తే అదే గొప్ప క్షేత్రం – ఈ శ్రీ సూక్తి శ్రీ వచన భూషణం లోనిది)
  • పిళ్ళై పిళ్ళై ఆళ్వాన్ అనే వారు చాలా సార్లు భాగవతాపచారం చేయగా కూరత్తాళ్వాన్ వారికి భాగవత వైభవముని తెలిపి వారిని సరిదిద్ది  మరలా భాగవతాపచారం చేయకుండా నిరోధించారు.

చివరగా ప్రధానమైన విషయమమేమనగా, కేవలం ఆచార్య సంబంధము వలననే మనకు మోక్షం లభిస్తుంది, మన ఙ్ఞానానుష్ఠానముల చేత కాదు. అదే క్రమమున ఙ్ఞానానుష్ఠానమున్నను అపచారం చేయడం  వలన  సంసారమున అథోగతిని పొందుతాము.

అసహ్యాపచారం – సహ్యమనగా ఏ కారణం లేకుండ అని అర్థం. భగవంతునికి, ఆచార్యునికి లేదా శ్రీవైష్ణవులకు ఏ కారణం లేకుండ వారి యందు అపచారమునకు ఉపక్రమించుట.

  • భగవంతుని విషయ మందు- హిరణ్యకశిపు తాను భగవద్ వైభవాన్ని వినదలచు కోలేదు, భగవానుడు కూడ అతని యందు ఏ ద్వేష భావనను ఉంచు కోలేదు.
  • ఆచార్యుని విషయ మందు – అతని సూచనలు అనుకరించకపోవుట. అతడు సంపద, అదృష్ఠముల యందు అసమర్థుడని భావించుట.
  • భాగవతుల విషయ మందు- శ్రీవైష్ణవుల యందు అసూయపడరాదు.

ఈ అపచారములు ఉత్తరోత్తరం బలీయమైనవి. అనగా ముందు చెప్పిన అపచారముల కంటే తర్వాత చెప్పినవి పెద్ద అపచారములు. అకృత్య కరణముకన్న భగవదాపచారం, భగవదాపచారం కన్నా భాగవతాపచారం, భాగవతాపచారం కన్నా అసహ్యాపచారం బలీయమైనవి.

మన పూర్వాచార్యులందరు శాస్త్రముల యందు గౌరవ భావమునుంచే వారు, అలాగే ఎలాంటి అపచారమునకు ఉపక్రమించేవారు కాదు. మన గురుపరపరంలోని ఆచార్యులందరు తమ అవసాన దశలో తమ శిష్యులను ఇతర శ్రీవైష్ణవులను పిలిచి వారకి క్షమా ప్రార్థన చేసేవారు. వారి యందు  అపచారపడక పోయినను మన్నింప మని ప్రార్థన చేసేవారు. ఇదీ వారికి శాస్త్రముపై ఉన్న వినమ్రత, గౌరవం మరియు నమ్మకం.

ఈ అనుష్ఠానమే మనకు మార్గదర్శకం. మన జీవితమున దీనిని పాటించాలి. అనుష్ఠానము వలన ఙ్ఞానాధిక్యమగును. అనుష్ఠానమునకు ఉపకరించేదే ఙ్ఞానం. ఏ ఙ్ఞానమైతే అనుష్ఠానమునకు ఉపకరించలేదో అది అఙ్ఞానమే.

మనం స్పష్ఠముగా తెలుసుకోవలసినది ఏమనగా శ్రీవైష్ణవుల యందు ససేమిరా అపచారపడరాదు.  శ్రీవైష్ణవ అపచారం చేయరాదని శాస్త్రము నందు చెప్పిన విషయములను అనుష్ఠించి గ్రంథస్థం చేశారు మన పూర్వాచార్యులు. పూర్వాచార్యులు  మరియు సమకాలీన ఆచార్యులు మనం ఎలా జీవించాలో అనే విషయముపై చాలా గ్రంథాలు వ్రాశారు. ఈ గ్రంథములను చదివి  ఙ్ఞానము పెంచుకొని అనుష్ఠించాలని వారి అభిమతం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలం : http://ponnadi.blogspot.com/2015/12/simple-guide-to-srivaishnavam-apacharams.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అర్థపంచకం – ఐదు ముఖ్యమైన అంశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< తత్త్వత్రయం – త్రివిధ తత్త్వములు

భగవానుడు 6 రూపములలో (తన ఉనికిని) వేంచేసి ఉంటాడు – పరత్వం (పరమపదమున), వ్యూ హ(క్షీర సముద్రమున), విభవ (రామ కృష్ణాది అవతారములు), అంతర్యామి (యోగుల హృదయములలో నివసించు), అర్చావతారం (దేవాలయాలు, మఠం, గృహములలో ఉన్న విగ్రహరూపం) మరియు ఆచార్యుని రూపమున.

మిక్క ఇఱైనిలైయుం మెయ్యాం ఉయిర్ నిలైయుం
తక్క నెఱియుం తడైయాగిత్తొక్కియలుం
ఊళ్ వినైయుం వాళ్ వినైయుం  ఓదుం
కురుగైయర్ కోన్ యాళిన్ ఇశై వేదత్తియల్ 

– తిరువాయ్మొళికి  పరాశరభట్టర్ అనుగ్రహించిన తనియన్

ఆళ్వార్ తిరునగరి నివాసి మరియు అధికారియైన నమ్మాళ్వార్ అనుగ్రహించిన  తిరువాయ్మొళి అను వీణానాదం అతి ముఖ్యమైన ఐదు అంశములను చాలా శ్రావ్యంగా పలుకుతుందట. ‌అవి – పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని (పర స్వరూపం) – జీవాత్మ స్వభావం (జీవాత్మ స్వరూపం) – ఉపాయ స్వరూపం (జీవాత్మ పొందవలసినది) – విరోధి స్వరూపం (పరమాత్మను పొందుటకు అడ్డంకులు) – ఉపేయ స్వరూపం (పరమాత్మను పొందుటకు పరికరం).

అర్థ పంచకం అనగా “ఐదు అంశములు” (అత్యంతావశ్యకంగా తెలుకోవలసినవి). పిళ్ళై లోకాచార్యులు తమ రహస్య గ్రంథములలో ఈ ఐదు అంశములను “అర్థపంచకం” అను పేరుతో  కృప చేశారు. ఈ గ్రంథమంతా ఈ ఐదు అంశముల సంకలమే.

ఈ గ్రంథములోని ఈ విషయాలను పరిశీలిద్దాం:

  • జీవాత్మ ఇది తిరిగి 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.

1) నిత్యసూరులు: పరమపదమున అనాదిగా నివసిస్తున్నవారు. (శ్రీ వైకుంఠం – నిత్యం భగవదానందానుభవం చేయు స్థలం)

2) ముక్త్మాత్ములు: ఆత్మ విమోచనం పొంది పరమపదమును చేరు కున్నవారు (అంటే ఒకానొక జన్మలో సంసార బంధ వాసన కలిగి ఉన్నవారు).

3) బద్ధాత్ములు: సంసార బంధముననే అతి అభిలాష కలవారు.

4) కైవల్యులు: మోక్షమును పొందిన ఆత్మలు (సంసారం నుండి విముక్తి పొందిన వారు). కాని ఆత్మాను భవమును కోరుకొనేవారు (అనగా భగవత్ కైంకర్యమునకు అతి దూరులు) భగవదనుభవమున ఆశ లేనివారు.

5) ముముక్షువులు: సంసారంలో ఉండి విముక్తినిపొంది భగవానునికి నిత్య కైంకర్యము చేయాలనుకొనేవారు.

1) పరత్వం: పరమపదమున వేంచేసి ఉండు దివ్యమైన రూపం.

2) వ్యూహం: క్షీరాబ్ధిలో ఉండు అనంతశయనుని రూపాలు. ఇవి సంకర్షణ (సృష్ఠి), ప్రద్యుమ్న (స్థితి), అనిరుద్ధ (లయ) రూపాలు.

3) విభవ: శ్రీ రామ, శ్రీ కృష్ణ వంటి అవతారములు.

4) అంతర్యామి: ఆత్మ లోపల నివాసముండువాడు. ఇతను రెండు రూపములచే వేంచేసి ఉంటాడు – ఒకటి ఆత్మలోనుండు రూపం, మరొకటి హృదయంలో శ్రీ మహాలక్ష్మితో కూడుకొని ఉన్న ప్రకాశించు రూపం.

5) అర్చావతారం: ఆరాధనకు వీలుగా కంటికి కనిపించు రూపం. దేవాలయములు, మఠములు, గృహములలో వేంచేసి ఉన్న రూపం.

  • పురుషార్థం: పురుషుని (జీవుని) చేత సాధించ దగినది. ఇది ఐదు విభాగములు

1) ధర్మం:  లోక కళ్యాణార్థం చేయు కార్యములు.

2) అర్థ: శాస్త్రానుసారం సంపదను ఆర్జించుట.

3) కామ: ప్రాపంచిక సుఖములు.

4) ఆత్మానుభవం: స్వీయానుభవం

5) భగవత్ కైంకర్యం (పరమ పురుషార్థం): పరమపదమున భగవానునికి సర్వ విధ సేవలు చేయడం. భౌతిక శరీరమును వదలి పరమపదమునకు చేరి, దివ్య శరీరమును పొంది, నిత్య సూరులకు ముక్త్మాత్మలకు అర్పింప బడుట.

  • ఉపాయం: ఇది ఐదు విభాగములు

1) కర్మ యోగం: శాస్త్ర విహితమైన యఙ్ఞం, దానం, తపం మరియు ధ్యానం మొదలైన వాటిని ఆచరించుటచే ఇంద్రియ నిగ్రహం పొంది దీని ద్వారా అష్ఠాంగ యోగాదులను అనుష్ఠించి ఆత్మ తత్త్వం తెలుసుకొనుట. ఇది ఙ్ఞాన యోగమునకు సహకారిగా ఉండును. ఐహికమైన సంపదలపై నియంత్రణను చేయును.

2) ఙ్ఞాన యోగం: కర్మ యోగము ద్వారా ఆర్జించిన ఙ్ఞానముతో హృదయాంతర్గతుడై మనపైననే తదేక దృష్ఠి సారించిన భగవానుడైన శ్రీమన్నారాయణున్ని ధ్యానం చేయుట. ఇది భక్తి యోగమునకు దోహద పడి కైవల్య మోక్షమును అందించును.

3) భక్తి యోగం: ఙ్ఞాన యోగ సహకారంతో స్థిరమైన ధ్యానము ఏర్పడుతుంది, ఇది పరమానందమునకు దారి తీసి పేరుకుపోయిన పాపాలను మరియు దుర్గుణములను తొలగించి వేసి చేరుకోవలసిన లక్ష్యమువైపు పయణం సాగేలా చేస్తుంది.

4) ప్రపత్తి: భగవానున్ని శరణు జొచ్చుట / ఆధీనమవుట. అత్యంత సులభమైనది మరియు ఆనందాను భవమును కలిగించునది. శీఘ్రముగా ఫలితములనిచ్చునది. ఒకసారి శరణాగతి చేశామా చాలు ఇక ఇతర వ్యాపారములన్నీ దీనికి అనుగుణంగా భగవత్ సేవలో భాగంగా మారి పోతాయి.

ఇది కర్మ, ఙ్ఞాన, భక్తి యోగములు అనుసరించలేని వారికి మరియు ఇవి అనుచితంగా లేని వారికి  అత్యంత సులభమైన మార్గం. (తాను భగవానునికి మాత్రమే చెందిన వాడిని అనే స్వరూప ఙ్ఞానం కలిగినప్పుడు స్వీయ రక్షణ, స్వప్రయత్నములు సరైనవి కావని తెలుసుకొంటాడు) దీనిలో రెండు విభాగములు – ఆర్త ప్రపత్తి – (ఈ భౌతిక జగత్తులో క్షణ కాలం కూడ ఉండడం సహించలేక పరమపదం చేరాలని త్వర ఉన్నవారు) మరియు ద్రుపద ప్రపత్తి (పరమపదమునకు చేరుకొనే వరకు ఈ భౌతిక జగత్తులో ఉంటు సర్వం భగవానునిపై భారము నుంచి  భగవత్భాగవత ఆచార్య కైంకర్యమును చేస్తుండే వారు).

5) ఆచార్య అభిమానం:  పైన చెప్పబడిన మార్గములన్నీ అనుష్ఠించడం క్లిష్ఠతరమైనప్పుడు ఆచార్యుడే (భగవదాఙ్ఞతో) పరమ కృపతో, ప్రేమతో అతనిని స్వీకరించి అతని రక్షణ భారాన్ని తాను స్వీకరించి ఙ్ఞానము నందించి మార్గదర్శం చూపుట. శిష్యుడు తన సర్వస్వం ఆచార్యుడే అని భావించి అతనిని వినమ్రతో సదా అనుకరించాలి.

విశేషసూచన: ఇక్కడ మనం ఉత్తారక ఆచార్యులైన (ఈ సంసారం నుండి ఉజ్జీవింప చేశేవారు) భగవద్రామానుజులను స్మరించాలి. అలాగే మనకు ఈ ఉత్తారకాచార్యులను చూపిన వారిని (స్వాచార్యులను) ఉపకారకాచార్యులుగా భావించాలి. మన పూర్వాచార్యులందరు దీనిని అనుష్ఠానమున ఉంచి భగద్రామానుజుల శ్రీ పాదములనే శరణు వేడారు.

విశేషంగా తెలుసుకోవాలన్న దీనిని పరిశీలించవచ్చుhttp://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html .

మణవాళ మాముణులు తమ ఆర్తి ప్రబంధమున  భగవద్రామానుజులకు పూర్తిగా వశుడై కైంకర్యం చేసిన వడుగ నంబి వలె తాము కూడ ఉండాలని ఆర్తి చెందారు.

  • విరోధి – ఈ అంశం మనను మన లక్ష్యమును చేరుకోకుండ అడ్డగించును. ఇది ఐదు విభాగములు

1) స్వరూప విరోధి: శరీరమునే ఆత్మగా భ్రమింప చేయును. భగవతేతర అంశములపై ప్రీతిని కలిగించి స్వతంత్రునిగా భ్రమింపచేయును.

2) పరత్వ విరోధి: ఇతర దేవతలను పరత్వముగా భావింప చేయును. దేవతాంతరములను భగవంతునితో సమానమనే భ్రమను కలిగించును. అల్ప దేవతలు సర్వ శక్తిమంతులని, భగవానుని అవతారములను సామాన్య మానవునిగా, భగవానుని అర్చా మూర్తిని కేవలం బొమ్మ అని భావింప చేస్తుంది.

3) పురుషార్థ విరోధి: భగవానుని కైంకర్యము కన్న ఇతరములపై వ్యామోహమును కలిగించును. భగవానుని సేవలో వ్యక్తిగత తత్త్వమునకు ప్రాధాన్యతను కలిగించును. (భగవానుని నియమమునకు వ్యతిరిక్తముగా)

4) ఉపాయ విరోధి: ఇతరోపాయములకు అధిక ప్రాధాన్యత నిచ్చుట. ఫలా పేక్షతో ఆశ్రయించడం. పరమపద  కైంకర్యముకన్న వీటిని అధికంగా భావించడం. (సర్వార్థ ఫలమునను అగ్రహించు ఆచార్య /  భగవానుని కంటే వీటిని అధికంగా నమ్ముట). అన్ని సమస్యలకు భీతి చెందుట. (ఆచార్య / భగవానునిపై నమ్మకలేని)

5) ప్రాప్తి విరోధి: పొందవలసిన దానిని పొందనీయకుండచేయును. ప్రస్తుత శరీరముతో దుశ్చర్యలను, భగవతాపచార, భాగవతాపచారములను చేయించును.

స్వామి పిళ్ళై లోకాచార్యులు అర్థ పంచకమును ఇలా వివరించి (సారం) ముగిస్తున్నారు.

ఈ అర్థ పంచక ఙ్ఞానమును పొందిన తర్వాత ముముక్షువు (మోక్షము నందు ఇచ్ఛ కలిగినవాడు) వర్ణాశ్రమ ధర్మాలకను గుణంగా ఆర్జిస్తు, వైష్ణవ నియమాలను పాటిస్తు, ఆర్జించిన దానిని తన శరీర పోషణ సరిపడే మాత్రమే స్వీకరించి మిగిలినది భగవానునికి  / భాగవతులకు సమర్పించి, ఆచార్యుని కృపతో ఙ్ఞానోదయం పొంది అతనికి సేవ చేస్తు జీవించాలి.

 భగవానుని ముందు వినమ్రతతో (భగవానుడే సర్వ శ్రేష్ఠుడని భావిస్తు), ఆచార్యుని ముందు అఙ్ఞానిలా (ఆచార్యుడే ఙ్ఞానాధికుడని భావిస్తు) శ్రీ వైష్ణవుల యందు ఆదరణ భావనతో (వారి వైభవమును తెలుసు కనుక), సంసారుల యందు హేయ భావమును ప్రదర్శిస్తు (భౌతిక సంసారులను దూరపరచుటకు) ఉండవలెను.

లక్ష్య సాధనకై త్వర / తృష్ణ కలిగి ఉండాలి, ఈ విధానముపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండాలి, అడ్డంకులను (విరోధములను) అధిగమించాలి, శరీరంపై వ్యామోహమును వదలాలి, ఆత్మ పరిపూర్ణత కలిగి ఉండాలి, తనకు తాను రక్షకుడనే విషయంలో అశక్తుడవ్వాలి, భగవానుని యందు కృతఙ్ఞతా భావం కలిగి ఉండాలి, ఆచార్యుని యందు కృతఙ్ఞతా మరియు విశ్వాసమును కలిగి ఉండాలి.

ఎవరైతే ఆచార్యుల ద్వార ఙ్ఞానము పొంది ఆ ఙ్ఞానమును అనుష్ఠానమున పెడతారో వారు భగవానునికి తన దేవేరల కన్నా, నిత్యసూరుల కన్నా మరియు ముక్తాత్మల కన్నా అధికంగా  ప్రీతి పాత్రుడవతారు.

ఆళ్వార్ తిరువడిగళే శరణం
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
పిళ్ళైలోచార్యర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం                                                               

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలం:  http://ponnadi.blogspot.in/2015/12/artha-panchakam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు – క్లుప్త సారాంశము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< రహస్య త్రయం

తత్త్వములు  ప్రథానంగా మూడుగా విభజించబడ్డాయి అవి చిత్తు , అచిత్తు మరియు ఈశ్వరుడు.

నిత్య విభూతి (పరమపదం) మరియు లీలా విభూతి (సంసారికలోకం) లో అసంఖ్యాకమైన జీవాత్మల సమూహములే  చిత్తు. సహజముగానే జీవాత్మలు ఙ్ఞానముతో నిర్మితమై ఙ్ఞాన పరిపూర్ణతను కలిగి ఉంటాయి.

ఈ సహజ ఙ్ఞానం నిత్యానందమైనది. ఎప్పుడైతే జీవాత్మ సహజ ఙ్ఞానమును పొందునో అప్పుడు అది నిత్యానందమును పొందును. ఈ జీవాత్మ మూడుగా విభజించబడింది – నిత్యసూరులు (పరమపదమున అనాదిగా ఉండేవారు), ముక్తాత్మ (ఒకానొకప్పుడు సంసార బంధమును ఉండి ముక్తిని పొందినవారు) మరియు బద్ధాత్మలు (ఈ సంసారిక లోకమున సంసార బంధం కలిగినవారు). మరలా ఈ బద్ధాత్మలు రెండుగా విభజించ బడ్డారు – మొదటి వారు భుభుక్షువులు (సంసారానుభవమును కోరుకొనేవారు) రెండవవారు ముముక్షువులు (ఈ సంసార బాధల నుండి ముక్తిని కోరుకొనేవారు). తిరిగి ఈ ముముక్షువులు రెండు రకములు – కైవల్యార్థులు (స్వీయ ఆత్మ సాక్షాత్కారం / స్వీయానందమును కోరుకొనేవారు) మరియు  భగవత్కైంకర్యార్థులు  (పరమపదమున భగవానునికి కైంకర్యము చేయాలని కోరుకొనేవారు ).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-chith-who-am-i5631.html  దర్శించండి.

అచిత్తు అనగా  ఈ స్థూల ఇంద్రియాలకు గోచరించు వైవిధ్యములు కలిగిన జడవస్తువులు. ప్రళయ కాలమున అవ్యక్తముగా (అదృశ్యముగా) ఉండి సృష్ఠి సమయమున వ్యక్తమవుతాయి (దృశ్యముగా). అచిత్తు లీలా మరియు నిత్య విభూతులలో ఉండును. సాధారణముగా ఈ భౌతిక జగత్తులో అచిత్తు స్వరూప ఙ్ఞానమును కప్పి వేస్తుంది అదే అలౌకిక జగత్తులో స్వరూప ఙ్ఞానమును ఉత్తేజపరుస్తుంది. మరలా ఈ అచిత్తు మూడు విధములు ఒకటి శుద్ధసత్వం (పరమ సాత్వికమైనది – కేవలం పరమపదముననే అగుపించును) రెండవది మిశ్రసత్వం (తమోరజోగుణమేళనం – ఈ సంసారమున అగుపించును) మరియు సత్త్వశూన్యం (గుణవిహీనమైనది – అదే కాలం (సమయం)).

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-achith-what-is-matter.html దర్శించండి.

ఈశ్వరుడు: శ్రీమహాలక్ష్మితో కూడి సర్వ శక్తిమంతుడు, పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు. భగవానుడు అనగా ఆరు కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు. అవి ఙ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి మరియు తేజస్సు. ఈ ఆరు కళ్యాణ గుణములు తిరిగి అనేక కళ్యాణ గుణములుగా విస్తరిస్తాయి.  భగవానుడు అన్ని కళ్యాణ గుణములకు ఆశ్రయణీయుడు మరియు హేయ గుణములకు వ్యతిరిక్తుడు. చిత్తు మరియు అచిత్తులు భగవానుని  యందు లీనమై ఉంటాయి మరియు వాటికి అతనే ఆధారం – కావున అన్నింటికి ఆధారం మరియు  భరించేవాడు అతనే. అన్నింటికి సర్వాధికారి. చిత్తు అచిత్తులన్ని అతని దివ్య ఆనందమునకై ఉద్భవిస్తున్నాయి.

లోతైన విశ్లేషణకై http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-iswara-who-is-god.html . దర్శించండి.

తత్త్వముల మధ్య సారూప్యతలు:

  • ఈశ్వరుడు మరియు చిత్తు (జీవాత్మ) ఇద్దరు ఙ్ఞానం కలిగిన వారే.
  • చిదచిత్తులు ఈశ్వరుని సొత్తు.
  • ఈశ్వరుడు మరియు అచిత్తులు తమ లక్షణాలను బట్టి చిత్తును పరివర్తనం చెందించే సామర్థ్యం కలవారు. ఉదాహరణకు జీవాత్మ అతిగా భౌతిక కార్య కలాపాల యందే నిమగ్నమైనప్పుడు అతను పదార్థముగా రూపాంతరం చెందుతాడు. ఒకవేళ జీవాత్మ భగవద్విషయము లందు నిమగ్నుడైతే అతను ఈ సంసారము నుండి విముక్తిని పొంది భగవానుని వలె ఆనందరూపాన్ని పొందుతాడు.

తత్త్వముల మధ్య భేధములు:

  • అన్నింటికన్న ఈశ్వరునికి భేధము / ఏకైక లక్షణం సర్వేశ్వరత్వం. అనగా సర్వఙ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు.
  • ఈశ్వరుని యందు దాసత్వం అనే విశిష్ఠ లక్షణం చిత్తు కలిగి ఉండును.
  • అచిత్తు ఙ్ఞాన శూన్యమైనది. ఇతరులకై మాత్రమే దీని ఉనికి.

పిళ్ళై లోకాచార్యుల తత్త్వత్రయం అను రహస్య గ్రంథమును ఇక్కడ పరిశీలించవచ్చు. http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html .

ఆళ్వార్ తిరువడిగళే శరణం                                                                                                              ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం                                                                                                  పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/thathva-thrayam-in-short.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – రహస్య త్రయం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు

పంచ సంస్కారములలో ఒక్కటైన మంత్రోపదేశం అనే ప్రక్రియ (రహస్య మంత్రముల ఉపదేశము) చాలా ప్రథానమైనది. ఈ సంస్కారములో ఆచార్యునిచే మూడు రహస్య మంత్రములు శిష్యునికి ఉపదేశించ బడతాయి. అవి

*తిరుమంత్రం / అష్ఠాక్షరి మహామంత్రం – బదరికాశ్రమములో నారాయణ ఋషిచే నర ఋషికి ఉపదేశించ బడింది (వీరిద్దరు భగవానుని అవతారం).

   “ ఓం నమో నారాయణాయ ”  

సంక్షిప్తార్థం: భగవానునికే చెందిన ఈ జీవాత్మ భగవానుని ముఖోల్లాసమునకై జీవించాలి. సర్వేశ్వరుడైన నారాయణునికి మాత్రమే కైంకర్యమును చేయాలి.

* ద్వయ మంత్రం – విష్ణు లోకమున శ్రీమహాలక్ష్మికి శ్రీమన్నారాయణునిచే ఉపదేశించబడింది.

“ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే ||   శ్రీమతే నారాయణాయ నమః ”   

సంక్షిప్తార్థం: శ్రియః పతియైన శ్రీమన్నారాయణుని శ్రీ పాదములను ఆశ్రయిస్తున్నాను. శ్రియః పతియై  సర్వసులభుడైన నారాయణుని శ్రీపాదముల నిస్వార్థ సేవ చేయుటకు ఉపాయముగా ఆశ్రయించుచున్నాను.

*చరమ శ్లోకం (భగవద్గీతలో భాగం): కురు క్షేత్రయుద్ధ రంగమున శ్రీ కృష్ణుడిచే అర్జునునకు  ఉపదేశించబడింది.

 

సర్వధర్మాన్  పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వాం
 సర్వపాపేభ్యో  మోక్షయిష్యామి మా శుచః ||

సంక్షిప్తార్థం: ఇతరోపాయములన్నింటిని సవాసనగ విడిచి నన్నే ఇతరోపాయ నిరపేక్షకునిగా నమ్మియుండుమా! సర్వ శక్తిమంతుడనైన నేను నిన్ను అన్ని ప్రతి బంధకముల నుండి విడిపింతును, దుఃఖింపకుమా! అని భగవంతుడు ప్రతిఙ్ఞా పూర్వకముగా ఉపదేశించెను.

 ఈ మూడు రహస్య మంత్రములకు రెండు విధములైన సంబంధ బాంధవ్యములు ఉన్నాయని మాముణులు తమ ముముక్షుపడి వ్యాఖ్యానమున తెలిపారు. (ద్వయ మహా మంత్ర వివరణలో)

  • విధి – అనుష్ఠానం (సిద్ధాంతం – ఆచరణ) తిరుమంత్రం జీవాత్మ మరియు పరమాత్మల మధ్య సంబంధమును తెలుపుతుంది. చరమ శ్లోకం పరమాత్మ జీవాత్మను తనకు ఆధీనం మవ్వమని ఆదేశిస్తుంది. ద్వయం జీవాత్మ పరమాత్మను ఆశ్రయించుటకు సదా ధ్యానమును చేయుమని తెలుపుతుంది.
  • వివరణ – వివరణి (సంక్షిప్త వర్ణన) తిరుమంత్రం “ఓం నమో నారాయణ” లో ప్రణవం (ఓం) గురించి తెలుపుతుంది.  ద్వయం, తిరు మంత్రమును వివరించును. చరమ శ్లోకం దీనినే అతి వివరంగా తెలుపుతుంది.

ఈ మూడు రహస్య మంత్రములలో ద్వయ మంత్రము మన పూర్వాచార్యులచే విశేషంగా ధ్యానించ బడి కీర్తింపబడింది. ఇదే మంత్ర రత్నముగా (అన్ని మంత్రములలో రత్నంవంటిది)  ప్రసిద్ధి చెందినది. ఈ మంత్రం శ్రీమహాలక్ష్మి  పురుషాకార (మధ్య వర్తిత్వం/ సిఫారిస్) పాత్రను తెలుపుతుంది.

శ్రీ మహాలక్ష్మితో కూడుకొని ఉన్న శ్రీమన్నారాయణుడే జీవుల ఉజ్జీవనకు ప్రధాన కారణం. దేవరాజ గురు  (ఎరుంబియప్ప) “వరవరముని దినచర్య” లో మణవాళ మాముణుల పుణీతమైన దినచర్యను గ్రంథస్థ పరిచారు. ఆ విషయమై దీనిలోని 9వ శ్లోకములో –

మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం| తదర్థతత్త్వ నిధ్యాన సన్నద్ధపులకోద్గమం||

శ్రీమణవాళ మాముణు అధరములు (పెదవులు) నిరంతరం మంత్ర రత్నమును అనుసంధించు చుండును. ఈ ద్వయాను సంధానముచే (ద్వయం యొక్క వివరణే తిరువాయ్మొళి) వారి శరీరం పులకించి పోయేది – అని వివరణ. కావున ద్వయ మంత్రం  ఎప్పుడు కూడ స్వతంత్రముగా అనుసంధించరాదని – గురుపరంపర మంత్రం (అస్మద్గురుభ్యో నమః నుండి శ్రీధరాయ నమః వరకు) అనుసంధానం చేసిన పిమ్మట మాత్రమే ద్వాయానుసంధానం చేయాలని ఇది ఙ్ఞప్తికి తెస్తుంది.

మన పూర్వాచార్యులలో పరాశర భట్టర్ మొదలుకొని (అష్ఠశ్లోకి), పెరియ వాచ్చాన్ పిళ్ళై (పరందరహస్యం) , పిళ్ళై లోకాచార్యులు  (శ్రియఃపతి పడి, యాదృచ్ఛికపడి, పరంద పడి, ముముక్షు పడి) అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్  (అరుళిచ్చెయళ్ రహస్యం) మణవాళ మాముణులు (ముముక్షుపడి వ్యాఖ్యానం) మొదలైన వారందరు రహస్య త్రయమున వారి వారి వ్యాఖ్యానములలో విశదముగా తెలియపరచారు. ఈ ప్రబంధముము అన్నింటిలో అతి ప్రధానముగా ముముక్షు పడి నిలుస్తుంది మరియు శ్రీ వైష్ణవుల కాలక్షేపములలో ఈ గ్రంథమే సింహ భాగమును ఆక్రమిస్తుంది.

రహస్య త్రయం ముఖ్యంగా తత్త్వ త్రయం మరియు అర్థ పంచకంపైన దృష్ఠిని సారిస్తుంది. శ్రీ వైష్ణవులు తెలుకోవలసిన ముఖ్యార్థములలో ఇది ప్రధానమైనది.

ఆళ్వార్ తిరువడిగళే శరణం
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/rahasya-thrayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఆచార్య – గురుపరంపర

paramapadhanathanపరమపదమున శ్రీ దేవి (శ్రీ మహాలక్ష్మి) భూదేవి, నీళా దేవి సమేత శ్రీమన్నారాయణుడు తన పరివారమగు నిత్యసూరులతో

కిందటి సంచికలో మనం గురుపరంపర ప్రభావం గురించి తెలుసుకున్నాము. ఈ సంచికలో దివ్య దేశములు మరియు దివ్య ప్రబంధ వైభవమును తెలుసుకుందాము.

శ్రీ మన్నారాయణుడు అపరిమితమైన అనంత  కళ్యాణ గుణములతో కూడు కొని ఉన్న సర్వోన్నత పరతత్త్వం. తన విశేష నిర్హేతుక కృపా కటాక్షములచే కొంత మంది జీవాత్మలపై కృప చూపడం వల్ల ఆ జీవాత్మలు ఆళ్వార్లు  (శ్రీమన్నారాయణుని గురించి ప్రబోధించిన వైభవం కలిగిన యోగులు) అయ్యారు. తాను నిత్యసూరుల (నిత్యాత్మలు) కు, ముక్తుల (ముక్తి చెందిన జీవాత్మలు) కు కూడా సర్వతంత్ర స్వతంత్ర నియామకుడు అయినా, ఎల్ల వేళలా ఒక వేదనలో ఉండేవారు.

ఆ ఆవేదన అంతా లౌకిక సంసారమున బంధింప బడిన జీవాత్మల కొరకై, ఎందు వలెననగా, పరమాత్మ సమస్త జీవులకు తండ్రిలాంటి వాడు, తన సంతానం ఈ సంసారమున  జరా మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటే చూసి భరించనివాడు. సరే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది – సర్వ శక్తిమంతుడైన భగవానునకు వేదన / బాధ ఉంటుందా? అనుకుంటే, మరి భగవానుడు సత్యకాముడు (అన్నీ కోరికలు తీరినవాడు) మరియు సత్య సంకల్పుడు (తన సంకల్ప మాత్రముచే అన్నింటిని నెరవేర్చుకొనువాడు) కదా – దీనికి మన పూర్వాచార్యులు ఇలా తెలిపారు – ఈ జీవాత్మల ఉజ్జీవనము కొరకై ఉండు ఆవేదన కూడ అతని కళ్యాణ గుణమే. ఎలాగనగా  సర్వతంత్ర స్వాతంత్ర్యము కలిగిన తండ్రి తన సమీపాన ఉన్న సంతానంతో సంతోషంగా ఉన్నను తన బాధ అంతా తన నుండి దూరంగా ఉండి కష్ట పడుతున్న సంతానం పైనే ఉండును కదా. భగవానుడు కూడ సర్వతంత్ర స్వాతంత్ర్యము కలిగి నప్పటికి తన బాధ అంతా ఈ సంసారంలో అనాదిగా అఙ్ఞానం మరియు అవిధ్యచే ఆవరించ బడిన జీవాత్మల దురవస్థ గురించియే.

ఈ జీవాత్మలు ఉజ్జీవించడానికి భగవానుడు ఈ జీవాత్మలకు సృష్ఠి సమయాన దేహాన్ని మరియు ఇంద్రియాలను, శాస్త్రములను అనుగ్రహిస్తాడు. శ్రీ రామ శ్రీ కృష్ణుడిగా తానే అవతరిస్తాడు. ఇనన్నీ అనుగ్రహించినప్పటికి ఈ జీవుడు భగవానుని యొక్క పరత్వమును అంగీకరించక అఙ్ఞానముతో ఉంటాడు. ఒక వేటగాడు ఒక జింక పట్టు కొనుటకు ఇంకొక జింకను ఎలాగైతే ఎరవేస్తాడో ఆమాదిరి ఈ జీవాత్మలను ఉద్ధరించుటకు వేరొక జీవాత్మలను ఉద్భవింప చేస్తాడు. వారే ఆళ్వార్లుగా పరిగణిస్తాము. ఆళ్వార్లు  అనగా భగవంతుని విషయ మందు మాత్రమే మునిగిన వారని అర్థం. భారతావనిలో దక్షిణ దేశమున పవిత్ర స్థలముల యందు ఈ ఆళ్వార్లు అవతరిస్తారని శ్రీ వేద వ్యాసులు శ్రీమద్భాగవతమున తెలిపినారు.

Azhwars

ఆళ్వార్లు  శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తు పాశురాలను (పద్యాలను) కృప చేశారు. ఇవన్నీ కలసి సుమారు 4 వేల పాశురాలు, కావున వీటిని  నాలాయిర దివ్య ప్రబంధముగా పేర్కొంటారు. దివ్య మనగా విశేషమైనది అని ప్రబంధమనగా పద్యముల కృతి (కేవలం భగవానున్ని కీర్తించునవి) అని అర్థవివరణ. ఆళ్వార్లు  అర్చారూపమున భగవానుడు వేంచేసి ఉన్నస్థలములను కీర్తించారు వాటినే దివ్య దేశములుగా పిలుస్తారు. మొత్తం 108 దివ్యదేశములున్నవి.106 దివ్య దేశములు భారతావనిలో వివిధ ప్రదేశముల యందు ఉన్నవి (నేపాల్తో కూడుకొని). క్షీరాబ్ధి (పాల సముద్రం) ఈ లీలా విభూతికి దూరంగా ఎవరు చేరుకోలేని ప్రదేశం. మోక్షం పొందిన జీవులు చేరుకొను పరమపవిత్ర స్థలం పరమపదం. ఈ 106 దివ్య దేశముల యందు శ్రీరంగం ప్రథానమైనది, ఆ తరువాత తిరుమల, కాంచీపురం, ఆళ్వార్ తిరునగరితిరువల్లిక్కేణి మొదలైనవి కొన్ని ముఖ్య దివ్య దేశములు. భగవానుడు ఐదు రూపములందు ఉంటాడు. అవి పరత్వముగా పరమపదమున, వ్యూహ రూపమున క్షీరాబ్ధిలో, అంతర్యామిగా జీవుల హృదయములందు, రామ కృష్ణాదిగా విభవ రూపమున, చివరిదైన రూపముగా అర్చావతారం (విగ్రహ రూపం) దివ్య స్థలములందు వేంచేసి ఉంటాడు. ఈ అర్చావతారం సర్వ సులభుడిగా అందరికి సదా చేరువలో ఉండే భగవానుని రూపముగా చెప్పబడుతుంది. మన పూర్వాచార్యులందరు దివ్య దేశమున నిత్య నివాసం చేస్తు భగవానునికి, భాగవతులకు కైంకర్యం చేస్తు తమ జీవనాన్ని గడిపారు.

వేదం / వేదాంతము యొక్క సారం సరళంగా తమిళ దివ్య ప్రబంధములో కూర్చబడింది. ఈ దివ్య ప్రబంధము యొక్క ముఖ్య ఉద్దేశ్యం  ఙ్ఞాన ప్రసారం వలన  జీవాత్మలను ఉజ్జీవింప చేయడం. ఆళ్వారుల ఈ దివ్య ప్రబంధం వేల సంవత్సరముల నుండి ఆచార్యుల ద్వారా నాథమునుల నుండి ప్రారంభించ బడి శ్రీ రామానుజలు మాధ్యముగా కొనసాగుతూ శ్రీ మణవాళ మాముణుల వరకు పరంంపరగా వస్తున్నది. అఙ్ఞానులు ఈ ఆళ్వారుల పాశురములను సాధారణ తమిళ పద్యములుగా భావిస్తున్నారు కాని ఙ్ఞానాధికులైన ఆచార్యులు ఈ పాశురాలు శ్రీమన్నారాయణుని దివ్య తత్త్వమును (భవ బంధ విమోచాకాలు) ప్రబోధిస్తున్నాయని, శ్రీమన్నారాయణునికి మనం చేయ వలసిన కైంకర్యం ఈ దివ్య ప్రబంధం ద్వారా అవగతమగు చున్నదని విశద పరిచారు. మన పూర్వాచార్యులు తమ జీవితాన్నంతటిని ఈ ప్రబంధ అభ్యాసమునకై మరియు ఉపదేశించుటకే వెచ్చించారు.

azhwar-madhurakavi-nathamuni

ఆళ్వారుల అనంతరం దివ్య ప్రబంధమునకు కొంత కాలం గడ్డు పరిస్థితి ఏర్పడింది. క్రమంగా నమ్మాళ్వారుల అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరి యందు నాథమునులు బహు శ్రమకోర్చి నాలాయిర దివ్య ప్రబంధమును అర్థానుసంధానముగా నమ్మాళ్వార్ కృపతో వారి వద్ద నుండి పొందారు. ఈ దివ్య ప్రబంధమును నాథమునులు నాలుగు విభాగాలుగా చేశారు. ఇది అందరికి సుపరిచితమే.  నాథమునులు ఈ ప్రబంధమును తమ శిష్యులకు నేర్పించి ప్రచారం గావించారు. అలాగే నమ్మాళ్వార్ విషయమున మధురకవి ఆళ్వార్ పరమ భక్తితో అనుగ్రహించిన కణ్ణినుణ్ శిరుత్తాంబును  నాథమునులు వారి గౌరవార్థం నాలాయిర దివ్య ప్రబంధమున చేర్చారు.

Ramanuja_Sriperumbudur

ఆదిశేషుల అవతారమైన శ్రీరామానుజులు గురుపరంపర ద్వారా వస్తున్న ఈ విశేషమును యామునాచార్యుల కృపచే వివిధ ఆచార్యుల ద్వారా అభ్యసించారు. ఆళ్వారుల వైభవమును మరియు వారి కృతులను  శ్రీరామానుజులు సమాజంలోని వివిధ స్థాయిలలో ఉన్న ప్రజలందరికి  ప్రచారం గావించి శ్రీవైష్ణవ సంప్రదాయమును ప్రబల పరిచారు.  శ్రీరామానుజుల విశేష కృషి ఫలితంగా ఈ సంప్రదాయమునకు ‘శ్రీరామానుజ దర్శనం’ అని స్వయంగా శ్రీ రంగనాథునిచే స్థాపించ బడింది. అలాగే శ్రీ రామానుజుల విషయంగా శ్రీ తిరువరంగత్త అముదనారు అనుగ్రహించిన రామానుజ నూఱ్ఱందాదిని నాలాయిర దివ్య ప్రబంధమున మన పూర్వాచార్యులచే చేర్చబడింది. ఈ శ్రీరామానుజ నూఱ్ఱందాది ప్రపన్న గాయత్రిగా ప్రసిద్ధి చెందినది – ఎలాగైతే బ్రాహ్మణులు గాయత్రిని ప్రతి రోజు పఠిస్తారో అలాగే ప్రతి  ప్రపన్నులు (పంచ సంస్కారము పొందినవారు ) ప్రతి రోజు విధిగా దీనిని పఠించాలి.

nampillai-goshti1
 నంపిళ్ళై కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళైగారు ఆ కాలమున (శ్రీ రామానుజులుఎంబార్, భట్టర్ మరియు నంజీయర్ పరంపర తరువాత) గొప్ప ఆచార్యులుగా విరాజిల్లుతుండేవారు. వీరు శ్రీ రంగమున నిత్యవాసం చేయుచు ఆకాలమున శ్రీవైష్ణవ సంప్రదాయమునకు అధికారిగా వెలుగొందేవారు. వీరి కాలమున శ్రీ రంగమున  నాలాయిర దివ్య ప్రబంధమునకు అతి ప్రాధాన్యం ఇవ్వబడేది.  పెరియ పెరుమాళ్-శ్రీ రంగనాథుని సన్నిధిన వీరు కాల క్షేపమున సదా నిమగ్నమై ఉండేవారు. పెరియ పెరుమాళ్ నిలబడి గవాక్షం / కిటికి గుండా వీరి ప్రవచనమును శ్రవణం చేసేవారట. అలాగే నంపిళ్ళై శిష్యులు కూడా దివ్య ప్రబంధ అర్థమును ప్రచారం గావించారు. నంపిళ్ళై  ప్రధాన శిష్యులు వ్యాఖ్యాన చక్రవర్తి (వ్యాఖ్యాతలలో శ్రేష్ఠులు) అను బిరుదాంకితులైన పెరియ వాచ్చాన్ పిళ్ళై  నాలాయిర దివ్య ప్రబంధమునకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి పూర్వాచార్యులచే బహు ప్రశంసించ బడ్డారు.  నంపిళ్ళై  మరొక ప్రధాన శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై, నంపిళ్ళై యొక్క నాలాయిర దివ్య ప్రబంధ ప్రవచనములను గ్రంథస్థ పరిచారు. తిరువాయ్మొళికి ఉన్నవీరి  వ్యాఖ్యానము ‘ఈడు’ (ఈడు ముపత్తు ఆరాయిరప్పడి) గా ప్రసిద్ధి చెందినది.

pillailokacharya-goshtiపిళ్ళై లోకాచార్యుల కాలక్షేప గోష్ఠి

నంపిళ్ళై అనంతరం ఈ సత్సాంప్రదాయమున పిళ్ళై లోకాచార్యులు ఉత్తరాధికారిగా ఉండి దివ్య ప్రబంధ రహస్యార్థములను తమ రహస్య త్రయ గ్రంథములో పొందుపరచారు. ఈ రహస్యార్థములు వివిధ ఆచార్యులచే వివిధ గ్రంథములలో వివరింప బడ్డాయి.   పిళ్ళై లోకాచార్యులు ఈ రహస్యార్థాలను తమ అష్ఠాదశ రహస్య గ్రంథములలో పొందు పరిచారు. కాని వారి చరమ దశలో శ్రీరంగం మొఘల్ ఆక్రమణ దారులచే బంధింపబడి అన్ని నాశానం చేయబడ్డాయి.  పిళ్ళై లోకాచార్యులు  ఆక్రమణదారుల నుండి తాము  నంపెరుమాళ్ (శ్రీ రంగనాథుని ఉత్సవ మూర్తి) తో తప్పించుకున్నారు. కాని ప్రమాదవశాత్తు వారు అటవీ ప్రయాణ క్లిష్ఠముల నుండి తప్పించు కోలేక పరమపదమును చేరుకున్నారు. చాలా కాలం ఈ విపత్తును శ్రీరంగ ప్రజలు అనుభవించారు. కొన్ని దశాబ్ధముల తర్వాత ఆక్రమణదారులు నిష్క్రమించి ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత నంపెరుమాళ్ శ్రీ రంగం తిరిగి చేరుకొన్నారు.

srisailesa-thanian-small

ఆ శ్రీరామానుజుల పునరవతారమైన మణవాళ మాముణులు  ఆళ్వార్ తిరునగరిలో అవతరించారు. మాముణులుతిరువాయ్మొళి పిళ్ళై గారి శిష్యులయి వారి వద్ద మరియు తమ తండ్రిగారి వద్ద వేద వేదాంతములను మరియు దివ్య ప్రబంధములను అధికరించారు. వారి ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళై గారి ఆఙ్ఞ మేరకు శ్రీరంగం చేరి తమ జీవితాన్నంతటిని సత్సాంప్రదాయ అభివృద్ధికి అంకితమిచ్చారు.  మాముణులు తాము స్వయముగా లుప్తమైన సాంప్రదాయ సాహిత్యాన్ని వెదకి దానిని పఠనం చేసి ముందు తరాలవారికి అందేలా వాటిని తాటాకులపై లిఖింప చేసి భద్రపరిచారు. సాంప్రదాయ వైభవము కాపాడుటకు మరియు దానిని విస్తరింప జేయుటకు వీరు చేసిన అవిరళ కృషి మరియు అకుంఠిత దీక్షను లోకానికి తెలియ పరచుటకు, స్వయంగా శ్రీరంగనాథుడు మాముణులను వద్ద తిరువాయ్మొళి కాలక్షేపాన్ని శ్రవణం చేసి, కాలక్షేపం చివరి రోజున ఓ చిన్ని బాలుని వలె వచ్చి, వీరిని ఆచార్యులుగా భావించి అత్యంత వైభవము గల ‘శ్రీ శైలేశ దయా పాత్రం’ అను తనియను శిష్య భావనతో వారికి  సమర్పించారు. కాల క్రమేణ వివిధ ఆచార్య పురుష వంశముల నుండి పరంపరగా వచ్చిన ఆచార్యులు దివ్య ప్రబంధమును తరువాతి వారికి బోధించ సాగారు.

భగవానునుని  ఆవేదనను తీర్చి మరియు జీవాత్మ ఉజ్జీవించడము మాత్రమే అవతార ప్రయోజనముగా కల  ఆళ్వారుల దివ్య ప్రబంధములను మన పూర్వాచార్యులు  భద్ర పరిచారని వారి చరిత్ర ద్వారా తెలుస్తున్నది. శ్రీవైష్ణవులందరు ఈ నాలాయిర దివ్య ప్రబంధమును అర్థయుక్తంగా నేర్చుకొని దీనితోనే మన జీవితకాలాన్ని వెళ్ళదీయాలి అని పూర్వాచార్యుల అభిమతం.

ఈ క్రింది వాటిని పరిశీలించిన ఆళ్వారుల మరియు దివ్య ప్రబంధము యొక్క వైభవం తెలుసుకొనవచ్చు.

దివ్య ప్రబంధము యొక్క అనువాదమును వివిధ భాషలలో చదవాలని ఆశించినవారు, ఇక్కడ చూడవచ్చు http://divyaprabandham.koyil.org

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-dhivya-prabandham-dhesam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – గురుపరంపర

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<ఆచార్య – శిష్య సంబంధం

క్రిందటి వ్యాసంలో ఆచార్య శిష్య మధ్యన ఉన్న విశిష్ఠ సంబంధమును తెలుసుకున్నాము.

భగవానునికి మనకు మధ్యన ఆచార్యుని ఆవశ్యకత  ఏమిటి? అని కొందరి వాదన. మరి గజేంద్రున్ని, గుహున్ని, శబరిని, అక్రూరున్ని, త్రివక్రను (కృష్ణావతారమున ఉన్న కుబ్జ) మరియు మాలాకారుడను (పూల వర్తకుడు) మొదలైన వారిని భగవానుడు ప్రత్యక్షముగా అనుగ్రహించాడు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

దీనికి మన పూర్వాచార్యుల సమాధానం, భగవానుడు సర్వస్వతంత్రుడు కావున ఒకసారి తన నిర్హేతుక కృపను జీవుని మీద ప్రసరింపచేస్తాడు, అలాగే జీవుల కర్మానుసారం వారికి ఫలితాలనివ్వడం అనే దానికి కూడా కట్టుబడి ఉంటాడు. ఈ స్థితిలో ఆచార్యుని ఆవశ్యకత ఏర్పడును. ఉజ్జీవించు ఙ్ఞానమును అందించి తనను చేరుటకు మార్గమును చూపు ఒక సదాచార్యున్ని ఆశ్రయించేలా అవిశ్రాంతముగా అవకాశాలను సృష్ఠిస్తాడు భగవానుడు (వారి సుకృతమును గణింపక) ఈ జీవాత్మలకు. ఈ జీవాత్మలు కేవలం శ్రీమన్నారాయున్ని ఆశ్రయించి అతని కృప చేతనే ఉజ్జీవింప బడాలని తలచి ఆచార్యుడు పురుషాకార భూతురాలైన శ్రీ మహాలక్ష్మి వలె తాను కూడా భగవానునికి సిఫార్సు చేస్తాడు. భగవానుడు ఈ జీవాత్మల కర్మానుసారం వారికి మోక్షము గాని సంసారము గాని ప్రసాదించేటప్పుడు ఆచార్యుడు జీవాత్మలకు మొక్షము మాత్రమే వచ్చేలా కృషి చేస్తాడు.

భగవానుని స్వయంగా ఆశ్రయించడం కన్నా ఆచార్య తిరువడిని ఆశ్రయించి దాని ద్వారా ఆ భగవానుని శ్రీ పాదములను ఆశ్రయించడం చాలా శ్రేయస్కరం. భగవానుడు జీవాత్మలను తాను స్వయంగా  స్వీకరించడం చాలా అరుదు, అదే ఆచార్య సంభందం ఉన్నవారిని కటాక్షించుట సహజమైనది అని మన పూర్వాచార్యులు అభిమతం.

ఆచార్య వైభవమును ప్రస్తుతించుచున్న సందర్భమున మన ఆచార్య పరంపరను కూడ తెలుసుకొనుట ఉచితం. దీని వల్ల భగవానుని నుండి ఙ్ఞానం ఎలా పరంపరగా వచ్చినదో అవగతమవుతుంది. సాధారణంగా ఇది లోకవిదితమైనదే అయినను కొంత మంది సాంసారికులకు తెలియని విషయము. ఈ శ్రీవైష్ణవ సంప్రదాయం సనాతనమైనది, అనాదిగా కలది మరియు మహానుభావులచే ప్రచారంగా వించబడినది. ద్వాపరాంతమున ఈ సంప్రదాయం దక్షిణ భారతావనిలో పలు నదీ తీర ప్రాంతముల యందు అవతరించిన ఆళ్వార్ల ద్వారా ప్రారంభించబడినది. కొందరు ఆళ్వార్లు మనకు కలియుగారంభమున కూడ కనిపిస్తారు.

లోకోద్ధారణకై భగవత్ ఙ్ఞానమును కలిగి శ్రీమన్నారాయణుని భక్తులగు మహానుభావులు పలు నదీ తీర ప్రాంతముల యందు అవతరిస్తారని వేద వ్యాసులు శ్రీమధ్భాగవతమున సూచించారు. వారు పది మంది. క్రమంగా పోయిగై ఆళ్వార్,  భూదత్తాళ్వార్పేయాళ్వార్తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్,  తిరుప్పాణాళ్వార్, మరియు  తిరుమంగై ఆళ్వార్.   మధురకవి ఆళ్వార్  మరియు ఆండాళ్ పరమ ఆచార్య నిష్ఠను కలిగినవారై ఆళ్వార్ల గోష్ఠిలో చేరిరి. కావున ఆ సంఖ్య  పన్నెండుకు పెరిగినది. ఆండాళ్, భూదేవి అవతారం. ఆళ్వార్లందరు (ఆండాళ్ తప్ప) ఈ సంసారమున జీవాత్మలుగా ఉండి భగవానునిచే ఉద్ధరింప బడినవారు. భగవానుడు తన స్వసంకల్పముచే ఈ ఆళ్వార్లకు తత్త్వ త్రయమును (చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు) విశద పరచు దివ్య ఙ్ఞానమును అనుగ్రహించి మరల భక్తి / ప్రపత్తి మార్గమును పునరుద్ధరింప చేశాడు. వీరికి స్పష్ఠమైన భూత భవిష్యవర్తమానముల ఙ్ఞానమును కూడా అనుగ్రహించాడు. అలా వారు భగవానుని అనుభవించి నప్పుడు పొంగి పొరలిన అనుభవమును నాలాయిర దివ్య ప్రబంధములుగా (అరుళిచ్చెయళ్ అని కూడ  ప్రసిద్ధి చెందినది) అనుగ్రహించారు. ఈ అరుళి చ్చెయళ్ సారమే నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయ్మొళి.

ఆళ్వారుల అనంతరం ఎంతో మంది ఆచార్యులు ఈ సంప్రదాయమును ప్రచారం చేసి విస్తరింప చేశారు. వారు క్రమంగా శ్రీమన్నాథమునులు, ఉయ్యక్కొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్పెరియ నంబి, తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్తిరుక్కోష్ఠియూర్నంబిపెరియ తిరుమలై నంబితిరుమలై ఆండాన్,  ఎమ్పెరుమానార్, ఎంబార్, కూరత్తాళ్వాన్, ముదలి యాండాన్, అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్, ఎంగళాళ్వాన్అనంతాళ్వాన్,  తిరువరంగత్తు అముదనార్, నడాదూర్ అమ్మాళ్పరాశర భట్టర్, నంజీయర్, నంపిళ్ళైవడక్కు తిరువీధి పిళ్ళైపిళ్ళై లోకాచార్యులుఅళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్,  తిరువాయ్మొళి పిళ్ళై, వేదాంతాచార్యులు మరియు అళగియ మణవాళ మామునిగల్  మొదలైనవారు సంప్రదాయ ప్రవర్తకులుగా ఉన్నారు.

ఈ ఆచార్య పరంపర 74 సింహాసనాధిపతులచే (ఎమ్పెరుమానార్లచే నియమింప బడ్డవారు) మరియు జీయర్ మఠములచే (ఎమ్పెరుమానార్ మరియు అళగియ మణవాళ మాముణులచే నియమింప బడ్డవారు) ప్రస్తుత కాలం వరకు కొనసాగించ బడుతున్నది. ఈ ఆచార్యులు అరుళిచ్చెయ్యల్కు వ్యాఖ్యాన్నాన్ని మరియు ప్రతి పాశురానికి విశేషార్థ వివరణ చేశారు. ఈ వ్యాఖ్యానములు విశేష అర్థభావమును కలిగి భగవదనుభవమున ముంచి వేస్తాయి. ఆళ్వారుల కృపతో ఈ ఆచార్యులు పాశురములకు సరైన అర్ధ వివరణ వివిధ కోణాల్లో అనుగ్రహించారు.

దివ్య ప్రబంధములను మనం అర్థానుసంధానముతో  అనుభవిస్తున్నామంటే మన పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానము వల్లే అని మాముణులు తమ ఉపదేశ రత్నమాలలో అనుగ్రహించారు. ఈ వ్యాఖ్యానములు లేకున్నచో వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్ఠతరం. దివ్య ప్రబంధముల వైభవం తెలిసిన మన పూర్వాచార్యులు గృహములలో మరియు దేవాలయములలో నిత్యాను సంధానమును (ప్రతిరోజు తప్పక పఠించ వలసినవి) ఏర్పాటుచేశారు. దీనిని మనం ఈనాటికి తిరువల్లి క్కేణి వంటి దివ్య దేశముల యందు సేవించ వచ్చును. శుక్ర వారమున జరుగు శిరియ తిరుమడళ్ గోష్ఠిన ఐదారు సంవత్సరముల బాలురు ప్రౌఢ శ్రీవైష్ణవుల కన్నా ఉచ్ఛస్వరమున సేవిస్తారు. అలాగే ఆండాళ్ అనుగ్రహించిన తిరుప్పావైని అతి చిన్న బాలురు కూడ సేవించడం మనం చూస్తున్నాము.

దీని వల్ల మనకు గురు పరంపర ప్రభావం అవగతమవుతుంది. దీనిని రక్షించు కోవడం మన ప్రథాన కర్తవ్యం.

వివిధ భాషల్లో పూర్వాచార్యుల గురించి లోతైన వివరణకై  http://acharyas.koyil.org  దర్శించండి.

ఆళ్వార్గళ్ వాళి  అరుళిచ్చెయళ్ వాళి, తాళ్వాదుమిల్  కురువర్ తామ్ వాళి  (ఆళ్వారులకు మంగళం, దివ్య ప్రబంధములకు మంగళం, దివ్య ప్రబంధములకు వ్యాఖ్యానములను అనుగ్రహించి ప్రబోధించిన ఆచార్యులకు మంగళం) ఉపదేశ రత్న మాల – 3 వ పాశురం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-guru-paramparai.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఆచార్య – శిష్య సంబంధం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  పంచసంస్కారములు

కిందటి సంచికలో మనం పంచ సంస్కారముల ప్రాధాన్యతను తెలుసుకున్నాము. దీనిలో మనం ఆచార్య శిష్య సంబంధ ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. ఈ సంబంధమునకు మన సంప్రదాయంలో చాలా వైశిష్ఠత ఉన్నది. దీని విశేషతను మనం పూర్వాచార్యుల శ్రీ సూక్తులలో పరిశీలిద్దాము.

ఈ శబ్ధమునకు వ్యుత్పత్తి – శాస్త్రములను అభ్యసించి, వాటిని అనుష్ఠానమున ఉంచి, శిష్యులకు ఉపదేశించువాడు, శాస్త్ర వచనానుసారం ‘సన్యాసాశ్రమములో ఉన్నను విష్ణు పరతత్త్వమును  అంగీరించక పోయినచో వాడు చండాలుడే’.

కావున శ్రీమన్నారాయణుని సర్వదా స్మరించు శ్రీవైష్ణవునికి ఆచార్యుడు అత్యావశ్యకం అని తెలుస్తుంది.  పంచ సంస్కార సమయాన తిరు మంత్రమును ఉపదేశించు (ద్వయం మరియు చరమ శ్లోకంతో కలుపుకొని) ఆచార్యుడు ప్రత్యక్ష (ఉపకారకాచార్యుడు) ఆచార్యుడు అని పూర్వాచార్యులు నిర్ధేశించారు. శిష్యుడనగా శిక్షను పొందువాడని అర్థం. అనగా ఆచార్యుని సమక్షమున ఉద్ధరింపబడువాడు శిష్యుడు.

శ్రీరామానుజులు  మరియు కూరత్తాళ్వాన్ (ఆచార్య శిష్య సంబంధమునకు ప్రతీక) – శ్రీకూరం

మన పూర్వాచార్యులు ఈ ఆచార్య శిష్య సంబంధం గురించి చాలా లోతుగా విశదీకరించారు. ఈ ఆచార్య శిష్య సంబంధం తండ్రి తనయునికి ఉన్న సంబంధమువలె విశేషమైనది శాస్త్రపరంగా నిరూపించారు. ఎలాగైతే తనయుడు తండ్రికి దాస్యమును చేస్తాడో ఆమాదిరి శిష్యుడు కూడ ఆచార్యునికి దాస్యము చేయవలెను.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, “తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ్య, ఉపదీక్షన్తితే ఙ్ఞానం ఙ్ఞానినా తత్త్వదర్శినః” – ఇది ఆచార్య శిష్య లక్షణాలను తెలుపుతుంది. మొదటి వాక్యంలో – ‘ఆచార్యున్ని వినయపూర్వకంగా దరిచేరి, సేవలు చేసి మర్యాద పూర్వకంగా ప్రశ్నించాలి’, రెండవ వాక్యములో – ‘ఆచార్యుడు నిజమైన పరతత్త్వమును  (భగవానుడు) ఉపదేశిస్తాడు’.

 ఆచార్యునికి ఉండ వలసిన లక్షణాలు:

  • ఆచార్యుడు సాధారణంగా పిరాట్టి / అమ్మవారు (శ్రీ మహాలక్ష్మి)  తో పోల్చబడతారు – వీరి ప్రధానపాత్ర భగవానునికి  పురుషాకారం (సిఫారిస్) చేయడం.
  • పిరాట్టి మాదిరి, భగవానునికి పూర్తిగా పరతంత్రుడై ఉండును. కేవలం భగవానున్ని మాత్రమే ఉపాయంగా స్వీకరించును. తన సమస్త వ్యాపారములు అతని ఆనందానుభవమునకే.
  • కృపా పరిపూర్ణులు – శిష్యున్ని ప్రేమగా స్వీకరించి, ఆత్మ ఙ్ఞానమును మరియు వైరాగ్యము అందించి భగవత్ భాగవత్కైంకర్యము నందు నిమగ్న పరచును.
  • మాముణుల శ్రీ సూక్తానుసారం, ఆచార్యుడు పూర్తిగా శిష్యుని ఆత్మ రక్షణకై పాటు పడాలి.
  • పిళ్ళై లోకాచార్యులు, ‘ఆచార్యుడు తనయందు, శిష్యుని యందు మరియు ఉపేయం యందు అవగాహన కలిగి ఉండాలి’ అని వివరించారు.
    • తాను తన శిష్యునకు ఆచార్యుడను కాను అని  తన స్వాచార్యులే తన శిష్యునకు ఆచార్యుడని భావించాలి.
    • తన శిష్యుడు కూడ తన శిష్యుడు కాడని ఈ శిష్యుడు తన ఆచార్యునకు శిష్యుడని భావించాలి.
    • తాను తన శిష్యున్ని అన్యదా కాక కేవలం భగవానునికి మంగళాశాసనము చేయువానిగా తయారు చేశానని భావించాలి.
  • వార్తామాలై అను గ్రంథము మరియు శిష్ఠాచారం (పెద్దల ఆచరణ) అను గ్రంథముల అనుసారం – ఆచార్యుడు శిష్యున్ని మర్యాదానుసారంగా ఆదరించాలి – శిష్యుడు శాస్త్ర ఙ్ఞానుసారం ఆచార్యున్ని తన ఆత్మ సంరక్షణార్థం ఆశ్రయించు చున్నాను అని భావించాలి.
  • పూర్వాచార్యుల అభిప్రాయానుసారం – భగవానుడు కూడా ఆచార్యున్ని అపేక్షిస్తాడు. కావుననే మన ఓరాణ్ వళి గురుపరంపరలో ప్రథమాచార్యునిగా ఉన్నాడు భగవానుడు. తనకు కూడా ఒక ఆచార్యుడు ఉండాలని అభిలషించాడు, కావుననే అళిగియ మణవాళ మాముణులను తమ ఆచార్యునిగా స్వీకరించాడు.

శిష్యునికి ఉండ వలసిన లక్షణాలు:

  •  పిళ్ళై లోకాచార్యుల వచనానుసారం:
    • శిష్యుడు భగవానుని నుండి  మరియు ఆచార్యుని నుండి తప్ప మిగితా విషయాల యందు (ఐశ్వర్యం  మరియు ఆత్మానుభవం) వైరాగ్యం కలిగి ఉండాలి.
    •  సర్వకాల సర్వావస్థల యందు శిష్యుడు ఆచార్య కైంకర్యమునకు సిద్ధంగా ఉండాలి.
    •  శిష్యుడు ప్రాపంచిక విషయాల యందు సదా ఏవగింపు కలిగి ఉండాలి.
    • శిష్యుడు భగవద్విషయము నందు మరియు ఆచార్య కైంకర్య మందు ఆసక్తి కలిగి ఉండాలి.
    •  భగవద్భాగవత వైభవం అభ్యసించు నప్పుడు శిష్యుడు అసూయ రహితుడై ఉండాలి.
  •  శిష్యుడు తన సంపదంతా ఆచార్యుని కృపగా భావించాలి. తన దేహ యాత్రకు కావలసినంత మాత్రమే అనుభవించాలి.
  • ఆళవందార్ “మాతా పితా యువతయః” అను శ్లోకములో చెప్పినటుల ఆచార్యుడే తన సర్వస్వమని భావించాలి శిష్యుడు.
  •  ఆచార్యుని పోషణ అంతా శిష్యునిదే.
  • ఉపదేశ రత్నమాలలో మాముణులు, “ఈ లోకములో ఆచార్యుడు వేంచేసి ఉన్నంత వరకు క్షణ కాలమును కూడ అతనిని వీడకుండా ఉండాలి” అని అనుగ్రహించిరి.
  •  ఆచార్యుడు తనకు ఇచ్చిన ఙ్ఞానమునకు ఉపకారముగా శిష్యుడు సదా ఆచార్యుని వైభవమును కీర్తించాలి.

ఆచార్యుని ఆత్మ సంరక్షణ చేయుట శిష్యునికి అనుచితం /తగదు (అనగా శిష్యుడు తన ఆచార్యుని విషయమందు స్వరూప విరుద్ధ కార్యమును చేయరాదు) మరియు ఆచార్యుడు తన శిష్యుని దేహ రక్షణమును చేయరాదు. (అనగా శిష్యుడు తన ఆచార్యుడు తన దేహ పోషణ చేస్తాడని భావించడం దోషం)

పిళ్ళై లోకాచార్యుల  వచనానుసారం: శిష్యుడవడం కూడ చాలా దుర్లభమే (శిష్యునికి ఉండ వలసిన లక్షణాలుండుట అతి దుర్లభం). కావుననే భగవానుడు తానే నరునిగా అవతరించి తన ఆచార్యునిగా నారాయణునిగా తానే అవతరించి తిరు మంత్రమును ఉపదేశం పొంది, ఉత్తమ శిష్యుడు ఎలా ఉండాలో అనుష్ఠించి చూపాడు.

ఈ ఆధారాలను అనుసరించి భిన్న భిన్న ఆచార్యుల వర్గీకరణను తెలుసుకొందాం.

 అనువృత్తి ప్రసన్నాచార్య మరియు కృపా మాత్ర ప్రసన్నాచార్యులు 

అనువృత్తి ప్రసన్నాచార్య

భగవద్రామానుజులకు పూర్వం ఉన్న ఆచార్యులు తాము శిష్యులను ఎన్నుకొనేటప్పుడు వారి సామర్ధ్యమును మరియు అంకిత భావమును పరిశీలించి తీసుకొనేవారు. ఆచార్యుని గృహములో నివసించడం ఒక సాంప్రదాయంగా ఉండేది. ఆచార్యునితో సహవాసం చేస్తు అతనికి సపర్యలు చేస్తు ఒక సంవత్సరం కాలం గడపవలసి వచ్చేది.

కృపా మాత్ర ప్రసన్నాచార్యులు

ఈ కలియుగమున ఆచార్యులు ఇలా పరీక్షించి శిష్యులను తీసు కోవడం అను సంప్రదాయం వలన శిష్యులు ఆచార్యుల షరతులను అంగీరించ లేకపోయేవారు. కృపా సముద్రులగు  భగవద్రామానుజులు  దీనిని గ్రహించి సంప్రదాయ నిబంధనలను కొద్దిగా సడలించి ఎవరికైతే భగవద్విషయమందు ఆర్తి ఉన్నదో వారికి ఙ్ఞానమును అందించాలని నిర్ణయించారు. కావున శిష్యుల అర్హతలను “వీరు అర్హమైన వారు” నుండి “వీరు ఆర్తికలవారు” అనే దానికి  మార్పు చేశారు. అలాగే తమ కరుణా స్వభావం వలన స్వామి  కొన్ని నిబంధనలను ఏర్పరచి తమ శిష్యులకు అనుకరింప చేసి కొన్ని వేల మంది శిష్యులను శ్రీవైష్ణవ సిద్ధాంతమునకు తీసుకువచ్చారు. కావున భగవద్రామానుజులను ఆరంభించి వచ్చిన ఆచార్య పరంపరను కృపా మాత్ర ప్రసన్నాచార్యులని వ్యవహరిస్తాము మన సంప్రదాయంలో.

దీనిని మాముణులు తమ ఉపదేశ రత్నమాలై (పాశురం 37) లో ఇలా కీర్తిస్తారు – ఓరాణ్ వళియాయ్ ఉపదేశిత్తార్ మున్నోర్| ఏరార్ ఎతిరాశర్ ఇన్నరుళాల్ | పారులగిల్ ఆశైయుడై యోర్కెల్లామ్ ఆరియర్గాళ్ కూఱుమెన్ఱు|పేశి వరంబఱుత్తార్ పిన్| 

 ఉత్తారకాచార్య మరియు ఉపకారకాచార్య
నాయనారాచ్చాన్ పిళ్ళై తమ “చరమోపాయ నిర్ణయం” అను గ్రంథములో ఈ ఆచార్యులను ఉదహరిస్తారు. ఈ గ్రంథం భగవద్రామానుజుల వైభవమును అతి వైభవముగా కీర్తిస్తుంది.

ఉత్తారకాచార్య

ఉత్తారకాచార్యులనగా సమాశ్రయనములను పొందిన వారికి పరమపదమును లభించేలా చేయు ఆచార్యులు.  శ్రీమన్నారాయణుడు, నమ్మాళ్వార్ మరియు భగవద్రామానుజులు ఈ ముగ్గురు మాత్రమే ఉత్తారకాచార్యులు (వాస్తమున యతీంద్ర ప్రవణులగు మణవాళ మామునులు కూడ  ఉత్తారకాచార్యులుగా “వరవరముని శతకం” లో ఎరుంబి అప్పాచే నిర్ణయించబడిరి).

  • శ్రీమన్నారాయణుడు ప్రథమాచార్యులు, సర్వఙ్ఞుడు మరియు సర్వ శక్తిమంతుడు కావున మోక్షమును సులభంగా అనుగ్రహించగలడు ఎవరికైనను.
పెరియ పెరుమాళ్ – శ్రీరంగం
  • నమ్మాళ్వార్, శ్రీమన్నారాయణు నిచే ఎన్నుకోబడి సంసారులను సరిదిద్ది వారికి ఙ్ఞానమును ప్రసాదించి మోక్షమును ప్రసాదించు సామర్థ్యమును కలిగినవారు. దీనిని వారిచే కృప చేయబడ్డ తిరువాయ్మొళిలో“పొన్నులగు ఆళీరో, భువని ముళుత్తు ఆళీరో” నుంచి గ్రహించవచ్చు – శ్రీమన్నారాయణునికి దూతగా పక్షులను పంపుతు, ‘ఎప్పుడైతే నా మాటలను స్వామికి అందచేస్తారో మీకు లీలా విభూతిని మరియు నిత్య విభూతిని సంభావనగా అనుగ్రహిస్తాను’.
  • భగవద్రామానుజులు నిత్య విభూతికి మరియు లీలా విభూతికి నాయకుడిగా “ఉడయవర్” అను నామధేయంతో శ్రీరంగనాథునిచే  మరియు తిరువేంగడముడయాన్ (తిరుమల శ్రీనివాసుడు) చే నిర్ణయించ బడ్డారు.కేవలం భగవత్ అనుభవమందే మునగక, లీలా విభూతిలో 120 సంవత్సరములు వేంచేసి ఉండి భగవత్కైంకర్యమును చేశారు. ఆలయాల వ్యవస్థను సరిదిద్ది, వేల మంది శిష్యులను కలిగి, 74 మంది సింహసనాథి పతులను సంప్రదాయ విస్తరణకై ఏర్పాటు చేశారు.

శ్రీమన్నారాయణుడు శాస్త్రానుసారం ప్రవర్తిస్తు జీవుల కర్మానుసారం జీవాత్మలకు మోక్షమును ఇవ్వగలడు లేదా ఈ సంసారమున ఉంచ గలడు. నాయనారాచ్చాన్ పిళ్ళై ఉత్తారకత్వమును భగవద్రామానుజుల యందే ఉన్నదని సిద్ధాంతరీకరిస్తారు.

నమ్మాళ్వార్ ఙ్ఞానమును పొంది పరోప దేశమును చేస్తు పూర్తిగా భగవదనుభవం నందు మునిగి భగవంతుని యందున్న ఆర్తిచే పిన్న వయసులో ఈ సాంసారిక లోకమును వీడుతారు.

పరమ కృపాళువులైన భగవద్రామానుజుల భగవదనుభం ఉన్న వారందరికి తమ ఆశ్వీరచనమును అనుగ్రహించారు.

నాయనారాచ్చాన్ పిళ్ళై మాత్రం భగవద్రామానుజులే  ఉత్తారక సంపూర్ణత్వం కలవారిని ధృడంగా నిర్ణయించారు.

ఉపకారకాచార్య 

వీరు ఉత్తారకాచార్యులను చేర్చు ఆచార్యులు. మన సంప్రదాయములో   భగవద్రామానుజులను అనుసరించుచు  వచ్చు ఆచార్యపరంపరలన్నియు ఉపకారకాచార్యులుగా నిర్ణయించబడ్దారు. మనకు పంచసంస్కారములను అనుగ్రహించు ఆచార్యులు,   తమ గురుపరంపరాధారంగా ఈ జీవాత్మను భగవంతునికి  ఆధీనపరచి ఈ సంసార బాధలనుండి విముక్తిని కలిగించి మోక్షము నిమ్మని భగవద్రామానుజులను ప్రార్థిస్తారు.

ఉత్తారక మరియు ఉపకారక ఆచార్యులు ఇరువురు సమాన ఆదరణీయులే కాని భగవద్రామానుజులకు ఒక ప్రత్యేక స్థానమున్నది మన సంప్రదాయమున. మాముణులు తమ ఉపదేశ రత్నమాలైలో తమ గురుపరంపరను తమ స్వాచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళైతో ఆరంభించి భగవద్రామానుజులతో ముగించి మనకు సరైన పద్ధతిని తెలుపుతారు.

 సమాశ్రయణ ఆచార్య మరియు ఙ్ఞాన ఆచార్య

  •  సమాశ్రయణ ఆచార్య –  మనకు పంచ సంస్కారములను   అనుగ్రహించు ఆచార్యులు.
  •  ఙ్ఞాన ఆచార్య – మన అత్మ ఙ్ఞానమునకు పెంపొందించుటకు గ్రంథ కాలక్షేపములను మొదలైనవి అనుగ్రహించువారు.

సాధారణంగా మనం సమాశ్రయణం అనుగ్రహించిన ఆచార్యునికే కైంకర్యం చేస్తాము, అలాగే ఙ్ఞానాన్ని అనుగ్రహించిన ఆచార్యుడు కూడా వీరితో సమాన ఆదరణీయులే. ఇద్దరు సములే. ప్రతి శ్రీవైష్ణవుడు తమ స్వాచార్యులను విధిగా గౌరవించాలని శ్రీ వచన భూషణం పేర్కొంటుంది.

సంగ్రహముగా చెప్పాలంటే శిష్యుని సర్వస్వం అంతా ఆచార్యుదే. ఆచార్యుని జీవన యాత్ర కొనసాగించుటకు అతని పోషణ అంతా శిష్యునిదే. శిష్యుడు తన జీవితమంతా ఆచార్యునితో ఎల్లప్పుడు సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలి.

 ఆచార్య శిష్యుల మధ్య సంభవించిన విశేషమైన సంఘటలను పరిశీలిద్దాం:

  • మణక్కాల్ నంబి  సర్వ విధ సేవలను వారి ఆచార్యులకు (ఉయ్యక్కొండార్) చేసే వారు.
  • శ్రీవైష్ణవ సంప్రదాయంలోనికి ఆళవందార్ను తీసుకరావడానికి మణక్కాల్ నంబి ఎంతో శ్రమించారు.
  • భగవద్రామానుజులు  తాము కూరత్తాళ్వానుకు ఆచార్యులైనప్పటికి వారికి అత్యంత గౌరవమును ఇచ్చేవారు.
  • భగవద్రామానుజులు, కూరత్తాళ్వాను విషయమున కలత చెందినప్పుడు, ఆళ్వాన్ ,  ‘స్వామి దాసుడు దేవరవారి వస్తువు,  తాము తమకు ఇష్ఠం వచ్చినట్లుగా వినియోగించు కొనవచ్చును’ అని విన్నవించారు.
  • ఎంబార్  వారి ఆచార్యశయ్యపై ముందుగా శయనించేవారు, ఆచార్య తల్పం ఎక్కడం పాపం కదా! అయినప్పటికి ఆచార్యులు సుఖంగా శయనించాలి కదా దానికై  ఎంబార్ తాము ఒక సారి శయనించి ఏదైన కుచ్చుకొనే పదార్థాలు ఉన్నాయా అని పరిక్షించేవారు. తనకు పాపం అంటినాసరే ఆచార్యులు సుఖంగా శయనించాలని వారి సదుద్దేశం.
  • భగవద్రామానుజులు తమను ఆదరించిన మాదిరే పరాశరభట్టర్ను ఆదరించమని అనం తాళ్వాన్ కు చెప్పేవారు.
  • పరాశర భట్టర్ మరియు నంజీయర్ మధ్యన విశేషమైన సంప్రదాయ సంభాషణలు జరిగేవి. పిమ్మట నంజీయర్ సర్వం వదిలి వేసి సన్యాసాశ్రమమును స్వీకరించారు. అయినను తమ ఆచార్యుల సేవకు ఈ ఆశ్రమం అడ్డు వస్తే తమ త్రిదండమును వదిలి వేస్తాననేవారు.
  •  నంపిళ్ళై కొన్ని పాశురాలకు భిన్న అభిప్రాయం చెప్పినప్పటికి  నంజీయర్  వారిని ప్రోత్సహించేవారు.
  • పిన్బళిగియ పెరుమాళ్ జీయర్ తమ ఆచార్యులగు నంపిళ్ళై కావేరినం చేసి తిరిగి వస్తున్నపుడు వారి వీపును దర్శించాలనే  కోరికతో ఈ లీలా విభూతిలో ఉండాలని కోరుకొనేవారు.
  • తిరువాయ్మొళి పిళ్ళైని  శ్రీవైష్ణవ సంప్రదాయమునకు తీసుకరావాలని కూరుకులోత్తమ దాసులు చాలా శ్రమించారు.
  • మణవాళ మాముణులు, తమ ఆచార్యులైన  తిరువాయ్మొళి పిళ్ళై  ఆఙ్ఞను తమ లక్ష్యంగా శిరసావహించారు. తమ ఆచార్యుల నుండి శ్రీ భాష్యమును విన్నప్పటికి తమ జీవిత కాలమంతా అరుళిచ్చెయళ్ (ఆళ్వారులు అనుగ్రహించిన ద్రావిడ ప్రబంధములు) మరియు రహస్య గ్రంథములపైననే దృష్ఠిని కేంద్రీకరించిరి.
  •  శ్రీరంగనాథుడు తమ దేవేరులైన శ్రీదేవి భూదేవితో కలసి ఒక సంవత్సరమంతా తమ ఉత్సవాలన్నింటిని ఆపి వేసుకొని తమ సన్నిధిన శ్రీ మణవాళ మాముణులచే ‘ఈడు’ కాల క్షేపమును శ్రవణం చేసి  మాముణుల యందు ఆచార్య భావనతో ఆచార్య సంభావనగా తమ శేషపర్యంకమును మరియు ప్రతి పారాయణకు ముందు అనుసంధానం చేయు “శ్రీశైలేశ దయాపాత్రం” అనే శ్లోకాన్ని విన్నవించారు.
  • మాముణులు తమ ఆసనాన్ని మరియు పంచ సంస్కారములు చేయు తమ శంఖ చక్రముద్రలను పొన్నడిక్కాళ్ జీయరుకు ఇచ్చి అప్పాచ్చి ఆణ్ణన్కు పంచ సంస్కారములు చేయమని చెప్పారు.

ఇలా చాలా సంఘటనలు మన సంప్రదాయమున ఉన్నవి. కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తుతించ బడ్డాయి. మన సంప్రదాయమంతా ఆచార్య శిష్య సంబంధముతో ముడి పడి ఉన్నది.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-acharya-sishya.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఉపోద్ఘాతం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  పాఠక మార్గనిర్ధేశిక

srivaishna-guruparamparai

శ్రీమన్నారాయణుడు  తన నిర్హేతుక కృపా కటాక్షములచే  ఈ సంసారులను ఉజ్జీవింపచేయడానికి సృష్ఠి సమయాన బ్రహ్మకు శాస్త్రములను (వేదాలు) ఉపదేశిస్తాడు. వైదికులకు వేదం అత్యంత ప్రామాణీకరణమైనది. ప్రమాత (ఆచార్యుడు) ప్రమేయమును (భగవానుడు) ప్రమాణం(శాస్త్రం) చేత మాత్రమే  నిర్ణయిస్తాడు. ఎలాగైతే తన అఖిల హేయ ప్రత్యనికత్వం (అన్నిచెడు గుణాలకు వ్యతిరేఖత్వం) మరియు కళ్యాణైకతానత్వం (సమస్త కాళ్యాణ గుణాలకు నిలయం) వంటి గుణాలను వేదం ఈ కళ్యాణ గుణాలను ఇతరమైన వాటి నుండి భేధపరచి కళ్యాణగుణాలను అనుకరిస్తుంది. (ఇతర ప్రమాణముల నుండి భేదపరుస్తుంది)

  • అపౌరుషేయత్వం – ఎవరి చేత కూడా సృష్ఠించబడింది కాదు. (ప్రతి సృష్ఠి యొక్క ఆరంభములో భగవానుడు వేదాన్ని బ్రహ్మకు ఉపదేశించును, అది క్రమంగా అలాగే ప్రచారం గావించబడును) కావున ఇంద్రియఙ్ఞానికి సంబంధించిన లోపాలకు తావు లేదు.
  • నిత్యం – శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. ఇది కాలాన్ని మరియు భగవానుని సర్వవేదఙ్ఞత్వం గురించి వెల్లడించును.
  • స్వత ప్రామాణ్యత్వం – అన్ని వేదాలు స్వయం ప్రపత్తి కలవి అనగా అన్నియు ఒకే విశ్వాసమును తెలుపును.

అపారమైన వేదసంపత్తును, వేదవ్యాసుడు భవిష్యమానవుల పరిమితమైన ఙ్ఞానాన్ని దృష్ఠిలో పెట్టుకొని ఆ వేదములను ఋక్, యజుర్, సామ మరియు అధర్వ వేదములుగా విభజించాడు.
వేదం యొక్క సారమే వేదాంతం. భగవానుని క్లిష్ఠతరమైన విషయాలను విశదీకరించు ఉపనిషత్తుల సమ్మేళనమే వేదాంతం. వేదం ఆరాధన ప్రక్రియను తెలుపును. వేదాంతం ఆ ఆరాధనకు యోగ్యుడైన వానిని తెలుపును. అలా చాలా ఉపనిషత్తులు ఉన్నప్పటికి కొన్ని మాత్రమే ప్రసిద్ధిగాంచినవి.  అవి

  • ఐతరేయ
  • బృహదారణ్యక
  •  చాంధోగ్య
  • ఈశ
  • కేన
  • కఠ
  • కౌశీతకి
  • మహానారాయణ
  • మాండూక్య
  • ముండక
  • ప్రశ్న
  • సుభాల
  • శ్వేతాశ్వేతర
  • తైత్తరీయ

వేదవ్యాసుడు రచించిన ఉపనిషత్తుల సారమును తెలుపు బ్రహ్మసూత్రములు కూడా వేదాంతముగానే పరిగణింపబడును. వేదం అనంతం. వేదాంతం చాలా సంక్లిష్ఠమైనది, కాని మానవుని ఙ్ఞానం మాత్రము పరమితమైనది (ఇది విపరీతార్థములను మరియు దోషములు చేయుటకు ఆస్కారభూతమైనది), కాని మనం ఈ వేద / వేదాంతములను స్మృతి, ఇతిహాసం (రామాయణ భారతాదులు) మరియు పురాణాల వల్ల  తెలుసుకోవచ్చు.

  • స్మృతి అనగా ధర్మశాస్త్రముల సంకలనం/కూర్పు.  మను, విష్ణు హారిత, యాఙ్ఞవల్క్యాది మహా ఋషుల చేత రచించబడినవి.
  • ఇతిహాసములనగా శ్రీ రామాయణ భారతాదులు. శ్రీ రామాయణం ‘శరణాగతి’ శాస్త్రంగా మరియు మహాభారతం ‘పంచమవేదం’ గా పరిగణింపబడుతున్నాయి (నాలుగు వేదాలు – ఋక్, యజుర్, సామ మరియు అధర్వ వేదములు).
  • 18 పురాణాలున్నవి (బ్రహ్మపురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం మొదలైనవి) మరియు బ్రహ్మచే చెప్పబడిన 18 ఉప పురాణాలు కూడ ఉన్నవి. బ్రహ్మ తనకు  సత్త్వగుణం ఉద్భవించినప్పుడు విష్ణు భగవానున్ని, రజో గుణం ఉద్భవించి నప్పుడు తనను, తమోగుణం ఉద్భవించి నప్పుడు శివుణ్ణి , అగ్నిని కీర్తించాడు.

ఇవన్ని ఉన్నప్పటికి మానవుడు శాస్త్రం ద్వారా ఙ్ఞానాన్వేషణ చేసి లక్ష్య సాధన చేయకుండా ప్రాపంచిక విషయాంతరముల యందు ఆసక్తిని ప్రదర్శిస్తాడు. వీరిని ఉద్ధరించుటకై భగవానుడు తానే స్వయంగా అవతరించాడు. అయినను ఈ మానవులు అతనిని నిందిస్తు చివరకు అతనితోనే యుద్ధంకూడా చేశారు. భగవానుడు  ఒక  జీవాత్మచే ఈ జీవులను ఉద్ధరించుటకై నిర్ణయించుకొని (వేటగాడు ఒక జింకను  ఎరవేసి ఇంకొక జింకను పట్టుకున్నట్లు) దోషరహిత ఙ్ఞానాన్ని అనుగ్రహించిన కొన్ని జీవాత్మలను అవతరింపచేసినాడు. వారే ఆళ్వార్లుగా (భగవద్భక్తిలో సదా నిమగ్నమై ఉండువారు) కీర్తింపబడుతున్నారు. వారిలో ప్రసిద్ధిగా ప్రపన్నజనకూటస్థులుగా నమ్మాళ్వార్ పరిగణింపబడుతున్నారు. మిగితావారు – పొయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిపొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్. అలాగే నమ్మాళ్వార్ శిష్యులగు మధురకవి ఆళ్వార్ మరియు పెరియాళ్వార్ కూతురగు శ్రీ ఆండాళ్ కూడ ఆళ్వారులుగానే పరిగణింపబడతారు. ఈ ఆళ్వార్లు భగవానునిచే కృప చేయబడ్డ దివ్య ఙ్ఞానముచే అనుభవించిన ఆ ఙ్ఞానమును లోపల ఇమడ్చుకోలేక మంగళాశాసన రూపమున కీర్తిస్తారు భగవానున్ని.

ఈ సంసార బంధముల నుండి జీవాత్మలను భగవానుడు ఉజ్జీవింపగోరి, నాథమునుల నుండి మణవాళ మాముణుల వరకు ఆచార్య పరంపరను ఏర్పరిచారు. ఆదిశేషుని అవతారముగా శ్రీభగవద్రామానుజులు ఈ ఆచార్య పరంపరలో మధ్యలో విరాజిల్లుతూ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని మరియు విశిష్ఠాద్వైతాన్ని శ్రీ పరాశర, వ్యాస, ద్రమిడ, టంక మొదలైన వారిననుసరించి ఏర్పరిచారు. అలాగే వారు 74 సింహాసనాథిపతులను  శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని నిరాంటకంగా ప్రచారం గావించాలని ఏర్పరిచారు. సంప్రదాయానికి వీరు చేసిన విశిష్ఠమైన కృషి మరియు సేవలను పురస్కరించుకొని ఈ సంప్రదాయం ‘శ్రీరామానుజ దర్శనం’ అని ప్రసిద్ధికెక్కినది.  మరళా వీరే మణవాళ మాముణులుగా పునరవతారంచెంది దివ్య ప్రబంధములను వ్యాఖ్యానించి ప్రచారం చేశారు. పెరియ కోయిళ్ శ్రీరంగమున పెరియ పెరుమాళ్  స్వయంగా శ్రీ మణవాళ మాముణులను తమ ఆచార్యులుగా  స్వీకరించి, తనతో ఆచార్య రత్నహారం ప్రారంభమగు నట్లుగా చేసిరి. మణవాళ మాముణుల తదుపరి ఈ సిద్ధాంతం వారి శిష్యులలో ప్రథానులగు పొన్నడిక్కాళ్ జీయర్తో ఆరంభమగు అ ష్ఠదిగ్గజములుగా ప్రసిద్ధి చెంది  ఆచార్య పురుషులచే ప్రచారం చేయబడింది. ఇలా ఎందరో ఆచార్య పురుషులు పూర్వాచార్య కృత ఈ రామానుజ దర్శనమును పరంపరగా ప్రచారం చేశారు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

మూలము: http://ponnadi.blogspot.com/2015/12/simple-guide-to-srivaishnavam-introduction.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org